Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Aaha..! (1998)



చిత్రం: ఆహా..! (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
నటీనటులు: జగపతి బాబు, సంఘవి, జయసుధ,
మాటలు ( డైలాగ్స్ ): పోసాని కృష్ణ మురళి
కథ,  స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సురేష్ కృష్ణ
నిర్మాత: నాగార్జున అక్కినేని
సినిమాటోగ్రఫీ: యస్.శరవనన్
ఎడిటర్: శంకర్
బ్యానర్: గ్రేట్ ఇండియా ఎంటర్ టైన్మెంట్
విడుదల తేది: 1998


చిత్రం: ఆహా..! (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రమణ మహర్షి, హరిణి


ఆహ్వానమంది అందం - ఆహా ఆహా
ఊహాల్ని అందుకుందాం
పహరాలే దాటి వచ్చే ధాటి మెచ్చా ఆహా
మహాబాగా దూసుకొచ్చి ఊసు నచ్చిందా
ఇహ చూస్కో చెలరేగే తరహా - ఆహా ఆహా

ఆహ్వానమంది అందం - ఆహా ఆహా

లవ్ జర్ని థార్ ఎడారి దాటేసింది
పూల దారి పట్టేసింది
ఆశలూరు అదిగో అంటుంది - ఆహా
ఇద్దర్ని ప్యార్ ఫైర్ చుట్టేసింది
పెళ్లి పోరు పట్టేసింది
ఆగలేను బాబోయ్ అంటుంది - ఆహా
కథ మారే వేళయింది క్లైమాక్స్ కి చేరింది
కలహాలే చాలు అంది కళ్యాణం కోరింది
జంటైతే అంతా ముందే ఉంది
శృంగారం సిద్ధంగా ఉంది -  ఆహా ఆహా

ఆహ్వానమంది అందం - ఆహా ఆహా

లవ్ టానిక్ డోసు కాస్త తక్కువయింది
పైసు పీసు సిగ్గే లేనిది
ప్రేమ బాధ బరువేముంటుంది - ఆహా
టైటానిక్ నౌక లోకి పోవద్దంది
ఆక్సిడెంట్ అయిపోతుంది
ఏకమైతే చాల్లే పొమ్మంది - ఆహా
స్వతహాగా ఉండే టెన్షన్ సరదాగా ఉంటుంది
సహజంగా వెడ్డింగ్ ఫంక్షన్
చాలా బాగుంటుంది
ప్రియురాలే పొందే పురుషుల పూజా
పెళ్ళానికి ఉందా చెప్పండి - ఆహా ఆహా

ఆహ్వానమంది అందం - ఆహా ఆహా
ఊహాల్ని అందుకుందాం
పహరాలే దాటి వచ్చే ధాటి మెచ్చా ఆహా
మహాబాగా దూసుకొచ్చి ఊసు నచ్చిందా
ఇహ చూస్కో చెలరేగే తరహా - ఆహా ఆహా
ఆహ్వానమంది అందం - ఆహా ఆహా




**********   **********   **********



చిత్రం: ఆహా..! (1998)
సంగీతం: వందేమాతరం  శ్రీనివాస్
రచన: సిరివెన్నెల
గానం: వందేమాతరం  శ్రీనివాస్

ప్రియురాలి అడ్రస్సేమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
జవరాలీ చిరునామేమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
ఆమె సిగను విరిసే మల్లీ ఆమె నుంచి వీచే గాలీ
ఆమె నిదుర పోయే వేళా జోల పాడు ఓ జాబిల్లీ
ఆమె సిగను విరిసే మల్లీ ఆమె నుంచి వీచే గాలీ
ఆమె నిదుర పోయే వేళా జోల పాడు ఓ జాబిల్లీ
చెప్పమ్మా కాస్త చెప్పమ్మా చెప్పమ్మా కాస్త చెప్పమ్మా

ప్రియురాలి అడ్రస్సేమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
జవరాలీ చిరునామేమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా

నిదుర నదిలో ఆమె కోసం
నడిరేయి చాటునా మాటు వేసా
కలల వలలో ఆమె రూపం
పడగానె వెంటనే లేచి చూశా
ఎదను కొరికే చిలిపి చేపా కులుకు వెనకే కరిగిపోగా
తెల్లారిందే ఇట్టే నేనేమో తెలబోతూ ఉంటే
మళ్ళీ మళ్ళీ ఇంతే ప్రతి రాత్రీ జరిగే తంతే
మసక తెరలు తెరిచేదెవరమ్మా

ప్రియురాలి అడ్రస్సేమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా

కనులు వెతికే కన్నె ఎవరో
వివరాలు తేలనీ మనసు నాదీ
తనను ఎవరో పలకరిస్తే
నువు కాదు పొమ్మనీ అంటున్నదీ
జంటలెన్నో కంటబడితే
వయసు నన్నూ కసురుతోందే
భూమ్మీదింకా తానూ పుట్టిందో లేదో భామా
ఏమో తెలియదు గానీ మది ప్రేమించేసిందమ్మా
దీని గొడవ ఆపేదెవరమ్మా

ప్రియురాలి అడ్రస్సేమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
జవరాలీ చిరునామేమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
ఆమె సిగను విరిసే మల్లీ ఆమె నుంచి వీచే గాలీ
ఆమె నిదుర పోయే వేళా జోల పాడు ఓ జాబిల్లీ
ఆమె సిగను విరిసే మల్లీ ఆమె నుంచి వీచే గాలీ
ఆమె నిదుర పోయే వేళా జోల పాడు ఓ జాబిల్లీ
చెప్పమ్మా కాస్త చెప్పమ్మా చెప్పమ్మా కాస్త చెప్పమ్మా

Most Recent

Default