Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Allari Premikudu (1994)




చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: జగపతిబాబు, సౌందర్య
దర్శకత్వం: కె.రాఘవేంద్ర రావు
నిర్మాతలు: సురేష్, సత్యానంద్
విడుదల తేది: 05.05.1994



Songs List:



కు కు కు కు కూ.. కూ.. పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, చిత్ర

పల్లవి:
కు  కు కు  కు కూ.. కూ.. 
కొమ్మా రెమ్మా పూచే రోజు
కు కు కు కు కూ.. కూ..  .
ప్రేమ ప్రేమ పుట్టిన రోజు
నిదురించే ఎదవీణ కదిలే వేళలో
మామిడి పూతల మన్మధ కోయిల

కు  కు కు  కు కూ.. కూ.. 
కొమ్మా రెమ్మా పూచే రోజు

చరణం: 1
స్వరాలే వలపు వరాలై, చిలిపి శరాలై, పెదవి కాటేయగా..
చలించే - స్వరాలే
వలచి వరించే - వయసు వరాలే..
ఎదలు హరించే  - చిలిపి శరాలై - కలలు పండించగా
గున్న మావి గుబురులో కన్నె కోయిలమ్మ
తేనె తెలుగు పాటై పల్లవించవమ్మ
మూగబాసలే  - ముసి ముసి ముసి ముసి..
ముద్దబంతులై  - విరియగ
సామగ సనిదని
సామగ సనిదని
సామగ సామగ సామగ సామగ
సా పదసని నీ గసరిద ద సనిదమ మా నిదమగ గ గమగమ దని
సా గేదెపుడు నీ పేదవుల్ల ద..దారి విడిచి మా.. మార్గశిరపు గా..గాలులు మురళిగా.
విన్న వేళ కన్నె రాధ పులకించే

కు  కు కు  కు కూ.. కూ.. 
కొమ్మా రెమ్మా పూచే రోజు
కు కు కు కు కూ.. కూ..  .
ప్రేమ ప్రేమ పుట్టిన రోజు

చరణం: 2
ఆ అ
ఫలించే - రసాలే
తరిచి తరించే  - పడుచు నిషాలో..
కవిత లిఖించే  - యువత పేదాల - సుధలు పొంగించగా
సన్న జాజితొడిమలో చిన్ని వెన్నెలమ్మ
సందే వెలుగులోనే  తానమాడునమ్మ

కన్నె చూపులే - కసి కసి కసి కసి
కారు మబ్బులై  - ముసరగ
సామగ సనిదని
సామగ సనిదని
సామగ సామగ సామగ సామగ
సా పదసని నీ గసరిద ద సనిదమ మా నిదమగ గ గమగమ దని

సాయమడుగు సా నీ నీ పరువము దాగ ద దిపుదు మాఘ మ మేడల గాఢము గ..మ..మతల పూలు కోసి మాలు కోసు పలికించే....

కు  కు కు  కు కూ.. కూ.. 
కొమ్మా రెమ్మా పూచే రోజు
కు కు కు కు కూ.. కూ..  .
ప్రేమ ప్రేమ పుట్టిన రోజు





పుత్తడిబొమ్మకు పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, చిత్ర

పుత్తడిబొమ్మకు సెగలు చుట్టే
ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే
పన్నీటి స్నానాలు చేసే వేళలో
నున్నని చంపకు సిగ్గులు పుట్టే
అన్నుల మిన్నను అల్లరి పెట్టే
కనరాని బాణాలు తాకే వేళలో
చెయ్యత్తుచున్నాము శ్రీరంగ స్వామి
చేయూత సాయంగ అందియ్య వేమి
నా ప్రేమ సామ్రాజ్య దేవీ
పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామి
నీ కన్యా ధనం కాపాడగా నాదేలే హామీ
సరేనంటే రూపం తాపం సమర్పయామి
నీ సందిటిలోని సమస్తము నీదే దయామి

కునుకుండదు కన్నులలోన
కుదురుండదు గుండెలలో
ఆణువణువు కొరుకుతున్నది తియ్యని మైకం
ఎదిగొచ్చిన వన్నెల వాన ఒదిగుండదు ఒంపులలో
చెరనొదిలి ఉరుకుతున్నది వయసు వేగం
మనసు పడే కానుక అందించనా ప్రేమికా
దహించితే కోరిక సహించకే గోపిక
అధిరేటి అధరాల ఆనా
అందం చందం అన్నీ నీకే సమర్పయామి
ఆనందం అంటే చూపిస్తాలే చెలి ఫాలో మీ

పుత్తడిబొమ్మకు సెగలు చుట్టే
ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే
నున్నని చంపకు సిగ్గులు పుట్టే
అన్నుల మిన్నను అల్లరి పెట్టే
పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామి
నీ కన్యా ధనం కాపాడగా నాదేలే హామీ

నులువెచ్చని పొద్దులలోన 
తొలి ముద్దులు పుచ్చుకొని
సరిహద్దులు దాటవే ఒంటరి కిన్నెరసాని
నును మెత్తని సోయగమంతా సరికొత్తగ విచ్చుకొని
ఎదరొచ్చిన కాముని సేవకు అంకితమవని
అవి ఇవి ఇమ్మని అదే పనిగ వేడని
ఇహం పరం నువ్వని పదే పదే పాడని
తెరచాటు వివరాలు అన్నీ
దేహం దేహం తాకేవేళ సంతర్పయామి
దేహం మోహం తీరే వేళ సంతోషయామి

పుత్తడిబొమ్మకు సెగలు చుట్టే
ముద్దుల గుమ్మకు దిగులు పుట్టే
పన్నీటి స్నానాలు చేసే వేళలో
నున్నని చంపకు సిగ్గులు పుట్టే
అన్నుల మిన్నను అల్లరి పెట్టే
కనరాని బాణాలు తాకే వేళలో
చెయ్యత్తుచున్నాము శ్రీరంగ స్వామి
చేయూత సాయంగ అందియ్య వేమి
నా ప్రేమ సామ్రాజ్య దేవీ
పుష్పం పత్రం స్నేహం దేహం సమర్పయామి
నీ కన్యా ధనం కాపాడగా నాదేలే హామీ




నిన్ను చూడగానే పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, చిత్ర

నిన్ను చూడగానే ప్రేమ పిచ్చి పట్టిందోచ్
పిచ్చి పట్టగానే మత్తునాకు పుట్టిందోచ్
నిన్ను తాకగానే ఈడు రెచ్చి పోయిందోచ్
కన్ను కొట్టుకుంటే ఆపలేక చచ్చానోచ్
చిట్టి ముద్దు పెట్టనా - పెట్టుకో
బుగ్గపండు కొట్టనా - కొట్టుకో
లేత పట్టు పట్టనా - పట్టుకో
మోజుకొద్ది ముట్టనా - ముట్టుకో
సోయగాల దోపిడీకి వాయిదాలు ఒప్పుకోని
చోరీ వలపు నీదోచ్

నిన్ను చూడగానే ప్రేమ పిచ్చి పట్టిందోచ్
పిచ్చి పట్టగానే మత్తునాకు పుట్టిందోచ్
నిన్ను తాకగానే ఈడు రెచ్చి పోయిందోచ్
కన్ను కొట్టుకుంటే ఆపలేక చచ్చానోచ్

అమ్మమ్మమ్మా...
అబ్బబ్బబ్బా...

లాఠీ ఫ్లూటుగ మరిపోయెనమ్మా
సరిగమ సరసమా లబ్జుగా ఉందిలేమ్మా
లూటీ చేసిన మనసు నాది సుమ్మా
ప్రియతమ యమ యమ చనువుగా దోచుకోమ్మా
ఖాకి బట్టలున్న ఆడ పోలీసోచ్
జాక్ పాట్ జామపండు నీదేనోచ్
కౌగిలింత లోచ్ ఖైదు చెయ్యవోచ్
పాలపిట్ట నోచ్ పూలు పెట్ట వోచ్
ఒళ్ళు అప్పగించుకుంటే కళ్ళు అప్పగించి నేను 
ఎట్టా నిదర పోనోచ్

నిన్ను తాకగానే ఈడు రెచ్చి పోయిందోచ్
కన్ను కొట్టుకుంటే ఆపలేక చచ్చానోచ్
నిన్ను చూడగానే ప్రేమ పిచ్చి పట్టిందోచ్
పిచ్చి పట్టగానే మత్తునాకు పుట్టిందోచ్

నీలో కసి నను కాటువేసెనమ్మా
మహా మత్తు కసరత్తు ఘాటుగా సాగెనమ్మా
నీలో ఫిగరుకు పీకు తప్పదమ్మా 
కాక పట్టు సోకు పెట్టు ఫేటునే మార్చకమ్మా
ఆడపిల్ల అగ్గిపుల్ల అవుతుందోచ్
ఆడుకుంటే ఒళ్ళు గుళ్ళ అవుతుందోచ్
పాటపాడకోచ్ పప్పు లుడకవోచ్
తాపమెందుకోచ్ తాళమెయ్యవోచ్
అల్లరంత చేసి చేసి చిల్లరంత దోచి కున్న
చిల్లీ గొడవ చాలోచ్

నిన్ను చూడగానే ప్రేమ పిచ్చి పట్టిందోచ్
పిచ్చి పట్టగానే మత్తునాకు పుట్టిందోచ్
నిన్ను తాకగానే ఈడు రెచ్చి పోయిందోచ్
కన్ను కొట్టుకుంటే ఆపలేక చచ్చానోచ్




బంతిలాంటి బత్తాయి వారేవా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యస్.పి. బాలు, చిత్ర

బంతిలాంటి బత్తాయి వారేవా 
బన్నులాంటి అమ్మాయి వారేవా 
దోరగుంది బొప్పాయి వారేవా
దొంగ ముద్దు ఇమ్మంది వారేవా 
చేతపట్టుకున్న చేయిచేసుకున్న 
చెంగు చెంగు మంటుంటే హయ్ హయ్ 
కోసి తీసుకున్న జూస్ తీసుకున్న 
మోజు మీద జూర్రుకుంటే లోలోలాయి 

బంతిలాంటి బత్తాయి వారేవా 
బన్నులాంటి అమ్మాయి వారేవా 
దోరగుంది బొప్పాయి వారేవా
దొంగ ముద్దు ఇమ్మంది వారేవా 

కులికేటి పరువాలు కుశలాలు అడిగాయి
నీ కౌగిలింత ఘాటు కోరి వచ్చానోయి 
అల్లరి ప్రేమికుడు
అదిరేటి అధరాలు కదలేటి తెలిపాయి
తొలి ముద్దుకని సంతకాలు అడిగే వేళ మొదలైయ్యిందీ రగడ
ఎదను గిరి జాతరలో జమకు జమ చూడాలి
మొగలి సిరి పాతరలో మొదటి ముడి వీడాలి
గుమ్మలూరి ఖిల్లా సమ్మలూరి ఖిల్లా
నిమ్మలార బెట్టుకుంటే హాయ్ హాయ్
నిమ్మ చక్క తింటు చెమ్మ చక్కలంటు
తిమ్మిరెక్కుతున్న వేళ లోలో లాయి

బంతిలాంటి బత్తాయి వారేవా 
బన్నులాంటి అమ్మాయి వారేవా 
దోరగుంది బొప్పాయి వారేవా
దొంగ ముద్దు ఇమ్మంది వారేవా 


విజిలేసి నా ఈడు గజలేదొ పాడింది
ఏ తప్పెటైన మద్దెలైన తబలాలైనా
చూడని బీటుంది
గజనిమ్మ పండంటి నజరానా నీదంది
నా గజ్జ ఘల్లు మన్నవేళ ఒళ్ళు ఒళ్ళు 
తడిమే ఆటుంది
సిగదరగ ఏం వయసు సెగల చలి రేపింది
సొగసరగ నీ దురుసు పగటి గిలి చూపింది
తాళమేసుకుంటు తాయిలాలు తింటు
తాపమంత తీర్చుకుంటే హాయ్ హాయ్
హార్ట్ బీట్ వింటు హంగు చేసుకుంటు
హాజరైన మోజులోన లోలో లాయి

బంతిలాంటి బత్తాయి వారేవా 
బన్నులాంటి అమ్మాయి వారేవా 
దోరగుంది బొప్పాయి వారేవా
దొంగ ముద్దు ఇమ్మంది వారేవా 
వారెవా...




చిలిపి చిలకా పాట సాహిత్యం

 

చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, చిత్ర

పల్లవి:
ఆ...ఆ...
ఆ...ఆ....ఆహా....ఆహా

చిలిపి చిలక ఐ లవ్ యూ అన్న వేళలో...
కలికి చిలక కవ్వింతల తోరణాలలో...
చిలకపచ్చ పైటకీ.. కోకిలమ్మ పాటకీ
రేపో మాపో కమ్మని శోభనం..

ఆ.....
చిలిపి చిలక ఐ లవ్ యూ అన్న వేళలో
కలికి చిలక కవ్వింతల తోరణాలలో..
చిలకపచ్చ పైటకీ ..కోకిలమ్మ పాటకీ
రేపో మాపో కమ్మని శోభనం...

చరణం: 1
సంపంగి రేకుల్లో కొంపేసుకున్నాక కలిగే వయ్యారాల ఒంపు
ఆ..... కబురు పంపు..
ఆ.... గుబులు చంపూ...
వల్లంకి రెక్కల్లో ఒళ్ళారబోసాక వయసు గోదాట్లోకి దింపు..
ఆ....మరుల గుంపు..
ఆ....మగువ తెంపు..
అహో ప్రియా మహోదయా లయ దయా లగావో
సుహాసిని సుభాషిణి చెలీ సఖీ చెలావో
ఈ వసంత పూల వరదలా...ఆ..
నన్ను అల్లుకోవె తీగ మరదలా...ఆ..
నూజివీడు మావిడో ..మోజుపడ్డ కాముడో ..ఇచ్చాడమ్మా తీయని జీవితం

ఆ.....
చిలిపి చిలక ఐ లవ్ యూ అన్న వేళలో...
కలికి చిలక కవ్వింతల తోరణా....లలో

చరణం: 2
నీలాలమబ్బుల్లొ నీళ్ళోసుకున్నాక మెరిసింది రేచుక్క రూపు
ఆ.... కలల కాపు...
ఆ.... కనుల కైపూ...
పున్నాల ఎన్నెల్లో పువ్వెట్టి పోయాక తెలిసింది పిల్లాడి ఊపు...
ఆ.... చిలిపి చూపు
ఆ... వలపు రేపు
వరూధిని సరోజిని ఎదే కులూమనాలీ..
ప్రియా ప్రియా హిమాలయా వరించుకోమనాలి..
కోనసీమ కోకమడతలా..
చిగురాకు రైక ఎత్తిపొడుపులా...
కొత్తపల్లి కొబ్బరో ..కొంగుపల్లి జబ్బరో.. నచ్చిందమ్మా అమ్మడి వాలకం

ఆ...చిలిపి చిలక ఐ లవ్ యూ అన్న వేళలో
కలికి చిలక కవ్వింతల తోరణాలలో..
చిలకపచ్చ పైటకీ కోకిలమ్మ పాటకీ
రేపో మాపో కమ్మని శోభనం...




నారిజన ప్రియతమా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: యమ్.యమ్.కీరవాణి
గానం: యస్.పి.బాలు, చిత్ర

నారిజన ప్రియతమా 
ప్రియతమా ప్రియతమా
హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ 
మూడొచ్చిన ముద్దుగుమ్మా 
మురెపమా అనుపమా
హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ 
డిన్నరు ఏం చేద్దాము
బుచుకు బుచుకు బుచుకు
రాత్రికి ఏం ప్రోగ్రాము
బుచుకు బుచుకు బుచుకు
ఊపిరాడకుండ ఊపి ఊపి చంపుతుంది
ఏవిటి ఈ బుచుకు

బుచుకు బుచుకు బుచుకు బుచుకు (2)

నారిజన ప్రియతమా 
ప్రియతమా ప్రియతమా
హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ 
మూడొచ్చిన ముద్దుగుమ్మా 
మురెపమా అనుపమా
హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ 
డిన్నరు ఏం చేద్దాము
బుచుకు బుచుకు బుచుకు
రాత్రికి ఏం ప్రోగ్రాము
బుచుకు బుచుకు బుచుకు
ఊపిరాడకుండ ఊపి ఊపి చంపుతుంది
ఏవిటి ఈ బుచుకు

బుచుకు బుచుకు బుచుకు బుచుకు (2)

నారిజన ప్రియతమా ప్రియతమా ప్రియతమా
హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ 

పువ్వంటి చిన్నదానా కవ్వించు కళ్లదాన
పుట్టించినాడు నాకై ఆ బ్రహ్మ
లవ్వంటు చేసుకుంటే లైఫంటు పంచుకుంటే
నీతోటి కాకా నాకు ఎవరమ్మా
వయ్యారి వన్నెకాడ తయ్యారుగుంది లేరా
ఉయ్యాల జంపాల రసగుళ్ళ
కయ్యలుపెట్టుకున్న వియ్యాలు అందుకున్న
బుగ్గల్ల వేళ దాక ఆగాల
చెక్కిలి ఎపుడిస్తావు
బుచుకు బుచుకు బుచుకు
చంగున ఏం దాచావు
బుచుకు బుచుకు బుచుకు
ఊరుకున్న కుర్రగాడ్ని ఊరించి చంపుతావు
ఎక్కడ నీ బుచుకు

బుచుకు బుచుకు బుచుకు బుచుకు (2)

మూడొచ్చిన ముద్దుగుమ్మా 
మురెపమా అనుపమా
హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ 
నారిజన ప్రియతమా 
ప్రియతమా ప్రియతమా
హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ 

సంపంగి తోట కాడ సన్నాయి ఊదుకోరా
వలపు సయ్యన్న వెర్రివేళ
లగ్గాలు పెట్టకుండ ముగ్గేసి చూసుకోరా
సిగ్గమ్మ చిన్నారి ముంగిళ్ళ
మందార తోటకాడ అందాలు ఆరబోసి
విందారగించమన్న నెరజాన

చంగావి చీర పైన  చామంతి పూల వాన
కోపాన చల్లారి పోయేనా
పండగ కేం తెస్తావు
బుచుకు బుచుకు బుచుకు
పెదవికి ఏమిస్తావు
బుచుకు బుచుకు బుచుకు
పొద్దుగూకగానే తీపి తిక్కరేగుతుంది
అసలేవిటి ఈ బుచుకు

బుచుకు బుచుకు బుచుకు బుచుకు (2)

నారిజన ప్రియతమా 
ప్రియతమా ప్రియతమా
హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ 
మూడొచ్చిన ముద్దుగుమ్మా 
మురెపమా అనుపమా
హ్యాట్సాఫ్ నీకు హ్యాట్సాఫ్ 

Most Recent

Default