Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Padaharella Vayasu (1978)
చిత్రం: పదహారేళ్ళ వయసు (1978)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చంద్రమోహన్, శ్రీదేవి, మోహన్ బాబు
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: అంగర సత్యం
విడుదల తేది: 31.08.1978Songs List:సిరిమల్లె పువ్వా... పాట సాహిత్యం

 
చిత్రం: పదహారేళ్ళ వయసు (1978)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: జానకి

సిరిమల్లె పువ్వా...
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే
సిరిమల్లె పువ్వా...

తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే
కళ్ళారా చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే
ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే
ఈ సందెకాడా నా సందమామ రాడే
చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో

సిరిమల్లె పువ్వా...
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే
సిరిమల్లె పువ్వా...

కొండల్లో కోనల్లో కూయన్న ఓ కొయిలా
ఈ పూల వానల్లో ఝుమ్మన్న ఓ తుమ్మెదా
వయసంతా వలపై మనసే మైమరుపై ఊగేనే
పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే
చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో

సిరిమల్లె పువ్వా...
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే
సిరిమల్లె పువ్వా...
సిరిమల్లె పువ్వా...(Sad Version) పాట సాహిత్యం

 
చిత్రం: పదహారేళ్ళ వయసు (1978)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: జానకి

సిరిమల్లె పువ్వా... పువ్వులాంటి మల్లి పుష్పించేనమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: పదహారేళ్ళ వయసు (1978)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: కోరస్ 

పువ్వులాంటి మల్లి పుష్పించేనమ్మా

అహ వయసంతా ముడుపు గట్టి పాట సాహిత్యం

 
చిత్రం: పదహారేళ్ళ వయసు (1978)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: జానకి

అహ వయసంతా ముడుపు గట్టి
వసంతాలే ఆడుకుందాం 
అహ వయసంతా ముడుపు గట్టి
వసంతాలే ఆడుకుందాం 
మావల్నీ మాటేసి.. బావల్నీ వాటేసి.. 
మావల్నీ మాటేసి బావల్నీ వాటేసి 
ఆడిద్దాం ఒక ఆటా...ఆడిద్దాం ఒక ఆటా...
యహ మావా మావా మల్లె తోటా... బావా బావా మంచి మాటా.. 
అహ బావా బావా మంచి మాటా..

రారా నా రాజా చెట్టుకింద రాజా 
రారా నా రాజా చెట్టుకింద రాజా 
నీ ముచ్చట్లు తీరుస్తామూ 
ముద్దు మురిపాల్లో ముంచేస్తాము...

మావా మావా మల్లె తోటా... 
బావా బావా మంచి మాటా.. 
అహ బావా బావా మంచి మాటా..

నడిచొచ్చే నల్ల గొండా.. నీ కడుపు చల్లగుండా
నడిచొచ్చే నల్ల గొండా.. నీ కడుపు చల్లగుండా
ఎన్నో నెలే నీకు మామయ్యా...
ఎన్నో నెలే నీకు మామయ్యా...
దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేస్తాం
పచ్చగడ్డి పలహారం నీకు పెట్టేస్తాం...ఆఆ
దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేస్తాం
పచ్చగడ్డి పలహారం నీకు పెట్టేస్తాం...ఆఆ

మావా మావా మల్లె తోటా... 
బావా బావా మంచి మాటా.. 
అహ బావా బావా మంచి మాటా..

వచ్చాడమ్మా వసంతుడు నవ మన్మధుడూ...
మచ్చలేని చంద్రుడు మనుషుల్లో ఇంద్రుడూ..
వచ్చాడమ్మా వసంతుడు..
ఒకటిన్నర కాలువాడు.. ఒయ్యారి నడక వాడు...
ఒకటిన్నర కాలువాడు.. ఒయ్యారి నడక వాడు...
వచ్చె వచ్చె వచ్చె కుంటి కులాసం..
ఆ వన్నెలు చిన్నెలు ఎవ్వరికోసం
పైట కొంగు చాటుబెట్టి పడుచు అందం పసుపు రాసి 
వలపు తీరా నలుగు పెట్టి
ఆశలన్నీ ఆరతిస్తా రావయ్యో.. 
తలపులన్నీ తలకు పోస్తా బావయ్యో..
ఆశలన్నీ ఆరతిస్తా రావయ్యో.. 
తలపులన్నీ తలకు పోస్తా బావయ్యో..

మావా మావా మల్లె తోటా... 
బావా బావా మంచి మాటా.. 
అహ బావా బావా మంచి మాటా..కట్టుకతలు చెప్పి నేను కవ్విస్తే... నవ్విస్తే  పాట సాహిత్యం

 
చిత్రం: పదహారేళ్ళ వయసు (1978)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి

ఆ ఆ ఆఅ ....ఆ..ఆఅ...ఆఆఆఅ.. 
కట్టుకతలు చెప్పి నేను కవ్విస్తే... నవ్విస్తే 
బంగారు పాలపిచ్చుకా మా మల్లె నవ్వాల పక పకా..
మల్లీ మల్లీ నవ్వాల పకా పకా

అనగనగ ఓ అల్లరి పిల్లోడు.. ఓ నాడా పిల్లాడ్ని సీమగుట్టిందీ... 
సీమగుట్టి సిన్నోడు ఏడుస్తుంటే... సీమా సీమా ఎందుకు నువు కుట్టావంటే...
పుట్టలో ఏలెడితే కుట్టనా.. నా పుట్టలో ఏలెడితే కుట్టనా.. 
నేను కుట్టనా.. అంటా కుట్టనా అన్నదీ... 
అది విన్న సిన్నోడు ఎక్కి ఎక్కి ఏడ్చాడు ||2||
కుయ్యో మొర్రో...కుయ్యో మొర్రో...కుయ్యో మొర్రో 


పల్నాటి పడుచుపిల్ల కోటిపల్లి రేవు దాటి బంగారి మావ కోసం... గోంగూర చేనుకొస్తే...
ఆఆఆఆ...ఆఆఆఆఅ...ఆఆఆ.......
ఎన్నెలంటి నా ఓడు చందురూడా.. ఎండ దెబ్బ తీసాడు చందురూడా... 
బుగ్గ మీద నా ఓడు చందురూడా.. ముద్దరేసి పోయాడు చందురూడా.. 
పోయినోడు పోకుండా రాత్రే నా కల్లోకొచ్చాడు... సిన్న నాటి ముచ్చటే సిలక పచ్చన...
ఒకనాటి మాటైన నూరేళ్ళ ముచ్చట నూరేళ్ళ ముచ్చటా... హ హ హ 

నీలాటి రేవులో నీడల రాగం.. చాకిరేవులో ఉతుకుడు తాళం...
తదరినతా... 
తదరినతా...ఆఅ...ఆఅ.ఆఅ...
తదరిన ... తదరిన ...తదరిన ...
తదరిన ... తదరిన ...తదరిన ...
పంట చేలో పాల కంకి నవ్విందీ పాట సాహిత్యం

 
చిత్రం: పదహారేళ్ళ వయసు (1978)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి.బాలు, జానకి

పంట చేలో పాల కంకి నవ్విందీ
పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ..
పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా
లేత పచ్చ కోన సీమా ఎండల్లా
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే
పంట చేలో పాల కంకి నవ్విందీ

పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ
శివగంగ తిరణాలలో.. నెలవంక తానాలు చేయాలా

చిలకమ్మ పిడికిళ్ళతో.. గొరవంక గుడిగంట కొట్టాలా
నువ్వు కంటి సైగ చెయ్యాలా... నే కొండ పిండి కొట్టాలా
మల్లి నవ్వే మల్లె పువ్వు కావాలా

మల్లి నవ్వే మల్లె పువ్వు కావాలా
ఆ నవ్వుకే ఈ నాప చేను పండాలా
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే

అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే
పంట చేలో పాల కంకి నవ్విందీ
పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ

గోదారి పరవళ్ళలో.. మా పైరు బంగారు పండాలా
ఈ కుప్ప నూర్పిళ్ళతో.. మా ఇళ్ళు వాకిళ్ళు నిండాలా
నీ మాట బాట కావాలా.. నా పాట ఊరు దాటాలా
మల్లి చూపే పొద్దు పొడుపై పోవాలా
మల్లి చూపే పొద్దు పొడుపై పోవాలా

ఆ పొద్దులో మా పల్లె నిద్దర లేవాలా
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే

పంట చేలో పాల కంకి నవ్విందీ... అహహ అహహ
పల్లకీలో పిల్ల ఎంకీ నవ్విందీ... అహహ అహహ
పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా... అహహ అహహ
లేత పచ్చ కోన సీమా ఎండల్లా... అహహహ అహహహ

అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వు లాగ అమ్మాడి నవ్వవే


Most Recent

Default