Search Box

Manchi Mitrulu (1969)



చిత్రం: మంచి మిత్రులు (1969)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: సినారె
గానం:  యస్.పి.బాలు, ఘంటసాల
నటీనటులు: కృష్ణ , శోభన్ బాబు, విజయనిర్మల
దర్శకత్వం: తాతినేని రామారావు
నిర్మాత: పి.మల్లికార్జున రావు
విడుదల తేది: 1969

పల్లవి:
ఎన్నాళ్ళో వేచిన ఉదయం...  ఈనాడే ఎదురౌతుంటే
ఇన్ని నాళ్ళు దాచిన హృదయం...  ఎగసి ఎగసి పోతుంటే
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి

చరణం: 1
మంచిని పెంచిన మనిషిని... ఏ వంచన ఏమీ చేయదని
నీతికి నిలబడు వానికి... ఏ నాటికి ఓటమి లేదని
నీతికి నిలబడు వానికి... ఏ నాటికి ఓటమి లేదని
నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలనివస్తే
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
 
చరణం: 2
నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని
కత్తులు విసిరేవానిని... ఆ కత్తితోనె గెలవాలని
కత్తులు విసిరేవానిని... ఆ కత్తితోనె గెలవాలని
నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే

ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి

ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే
ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసి పోతుంటే
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి

Most Recent

Default