Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sneha Geetham (2010)



చిత్రం: స్నేహగీతం (2010)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: కార్తిక్
నటీనటులు: సందీప్ కిషన్ , సుహాని కలిత, కృష్ణుడు, చైతన్య , శ్రేయా ధన్వంతరి, రియా
దర్శకత్వం: మధుర శ్రీధర్ రెడ్డి
నిర్మాత: శిరీష శ్రీధర్ లగడపాటి
విడుదల తేది: 16.07.2010

వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరే
వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే
రేపటి గెలుపుకు రూపమే ఓటమిరా
వేకువ జాడను వెతికే మెరుపై రా

వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరే
వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే

చినుకై రాలే మేఘాన్ని ఆపేనా ఎవరైనా
వెనుకడుగెయ్యక శిఖరాన్నే చేరాలో ఏమైనా
నీ కలలను చూపేనా కని పెంచిన అమ్మైనా
నీ కలతను చెరిపేనా శ్రుష్టించిన బ్రహ్మైనా

నీకే సాధ్యం ....ఆ ఆ ఆ

వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరే
వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే

రేపటి గెలుపుకు రూపమే ఓటమిరా
వేకువ జాడను వెతికే మెరుపై రా

పడినా లేచే కెరటాల ప్రతిబింబం బ్రతుకేగా
నడి రాతిరిని దాటందే ఉదయం చిగురించదుగా
ఆ నింగిని తాకేలా సందిస్తే నీ బాణం
తన పరుగును ఆపేనా ఎదురయ్యే అవరోధం

గెలుపే తధ్యం .....ఆ ఆ ఆ

వసంతమేది వరించి రాదు అదేరా విజయం తీరే
వరాన్ని కోరే నీ పయనంలో ముందుంది ఆశల దారే
రేపటి గెలుపుకు రూపమే ఓటమిరా
వేకువ జాడను వెతికే మెరుపై రా


******  ******  *******


చిత్రం: స్నేహగీతం (2010)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: సిరా శ్రీ
గానం: సాయి శివాని

వెలిగే వెన్నెలే విడిచేనా
తెలిసి కన్నులే కరిగేనా .....ఓ ప్రేమా

కలలే అలలై కన్నులు నదులై కలతలుగా నిలిచే
కమ్మని కబురే కాదని కదిలే కలకలమే మిగిలే
తలపే... చెదిరెనా
తపనే ....తరిమెనా

వెలిగే వెన్నెలే విడిచేనా
తెలిసి కన్నులే కరిగేనా .....ఓ ప్రేమా

చిగురులు తొడిగిన తోడే కలయై చిటికెలో నను వీడే
చింతే వచ్చి చెంతన చేరి శిశిరం లా తోచే
నడకే .....తడబడే
నడిపే..... విధి ఇదే

వెలిగే వెన్నెలే విడిచేనా
తెలిసి కన్నులే కరిగేనా .....ఓ ప్రేమా


******  ******  *******


చిత్రం: స్నేహగీతం (2010)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: సిరా శ్రీ
గానం: సాయి శివాని

ఒక స్నేహమే..మము కలిపే
ఒక బంధమే... విరబూసే
సంతోషమే.. మది నిండే
నవలోకమే.. పిలిచిందే
ఏవో ఏవో ఏవేవో.. ఎదలో కదిలే కథలేవో
ఏవో ఏవో ఏవేవో ఎదురై నిలిచే కలలేవో

ధ్యేయం ధ్యానం ఒకటై సాగే..
లక్ష్యం గమ్యం ఒకటై ఆడే..
ఒక చెలిమి కోసం వేచే క్షణం
ఒక చెలియ కోసం జరిపే రణం
ఏవో ఏవో ఏవేవో.. ఎదలో కదిలే కథలేవో

స్నేహం ప్రేమై మారే వైనం..
జతగా కలిసి చేసే పయనం
ఒక నవ్వు కోసం ఓ సంబరం
ఒక మెప్పు కోసం పెను సాహసం

హృదయం లోన మెరిసే స్వప్నం
ప్రణయం వరమై తెలిపే సత్యం
ఎదగదుల పైన ఓ సంతకం
మది నదులు కలిపే ఈ సంగమం
ఏవో ఏవో ఏవేవో.. ఎదలో కదిలే కథలేవో
ఏవో ఏవో ఏవేవో ఎదురై నిలిచే కలలేవో

Most Recent

Default