Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Damarukam (2012)




చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: నాగార్జున, అనుష్క, ప్రియమణి
దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
నిర్మాత: అక్కినేని వెంకట్
విడుదల తేది: 23.11.2012



Songs List:



ఓంకారం పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: జొన్నవిత్తుల 
గానం: వెంకట్ సాయి 

ఓం ఓం...
ఓంకారం సృష్టి సారం విధివిధి లిఖితం
మోక్షధక్షం సుభిక్షం
గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం
సాన్నపూర్ణా సమక్షం
వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం
శాంతికాంతం సుఖాంతం
విశ్వేశం చిత్ ప్రకాశం శ్రీతజన వరదం
కాశినాధం నమామి...




అరుణ దవల (పంచ గ్రహ కుటమి) పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: జొన్నవిత్తుల 
గానం: కార్తీక్ 

తొం తొం తన తొం తన  తొం తొం తన  తొం తన 

అరుణ ధవళ స్వర్ణోదయా దీప్తిం  - అఖిల భువన చైతన్య ప్రసాదం
కాలజ్ఞాన సత్కారణ ధీరం  - తం నమమి గ్రహనాయక సూర్యమ్             

అమృతా కిరణ రస రమ్య ప్రవాహం  - లలిత లలితా లవణ్య లలామమ్
మధిత మహిత మాదుర్యం మనోభ్యమ్ - తం నమామి నమామి సాంద్రోదయా చంద్రం    

రాగ భోగ సందన నిధనమ్  - రాజ యోగ సంపూర్ణ ప్రభావం
నవ్య దివ్య సౌందర్య సుధీరం  - తం నమామి సమ్మోహాక శుక్రమ్     

అతుల చతుర పటులోకిక మూర్తిం  - సకల కార్య హీత కౌసల కీర్తమ్
తీవ్ర వేగ సంచరణ తత్వం - తం నమామి సౌమ్యం బుధ దేవం  

తొం తొం తాన తొం తాన తొం తొం తాన తొం తన

పరమ ధర్మ సౌసీల్య మహత్త్వం - చరమ రమ్య భోదామృత తత్త్వమ్
వేద శాశ్త్ర దైవాంకిత భుద్దిం  - తం నమమి ధీరాం గురుదేవం    

తొం తొం తన తొం తన  తొం తొం తన  తొం తన 



నేస్తమా నేస్తమా పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: శ్రీకృష్ణ , హరిణి

నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం
ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం
నేననే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా
ఓహొ ప్రేమకే రూపమే ఇచ్చి దానికే ప్రాణమే పోస్తే ఉండదా నిండుగా మనలాగా

నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం
ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం

చరణం: 1
నువ్వంటే ఎంతిష్టం సరిపోదే ఆకాశం
నాకన్నా నువ్విష్టం చూశావా ఈ చిత్రం
కనుపాపలోన నీదే కల యద ఏటిలోన నువ్వే అలా క్షణకాలమైన చాల్లే ఇలా అది నాకు వెయ్యేళ్ళే
ఇక ఈ క్షణం కాలమే ఆగి పోవాలే...

నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం
ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం

చరణం: 2
అలుపోస్తే తలనిమిరే చెలిమౌతా నీకోసం
నిదరోస్తే తలవాల్చే ఒడినౌతా నీకోసం
పెదవంచు పైన నువ్వే కదా పైటంచు మీద నువ్వే కదా నడువోంపు లోన నువ్వే కదా ప్రతి చోట నువ్వేలే
అరచేతిలో రేఖలా మారిపోయావే

నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం
ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం





రెప్పలపై రెప్పలపై పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హరిహరన్ , చిత్ర

రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై 
చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా.. 
చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై 
మరు ముద్దిమ్మంటూ ముందుకు వస్తున్నా.. 
నెమ్మది నెమ్మదిగ ఝుం ఝుం ఝుమ్మని తుమ్మెదగా 
ముచటగా మూడొ ముద్దుకు చోటిమ్మంటున్నా.. 
తొందర తొందరగా ఇచ్చేదివ్వక తప్పదుగా 
తియ్యని పెదవుల చిరునామా నీ చెవిలో చెబుతున్నా.. 

రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై 
చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా.. 
చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై 
మరు ముద్దిమ్మంటూ ముందుకు వస్తున్నా.. 

జరిగి జరిగీ దరికి జరిగీ కలికి విరహాలు కరగనీ.. 
కరిగి కరిగీ కలలు మరిగీ తగిన మర్యాద జరగనీ.. 
సొంపుల రంపంతో నాపై చక్కిలిబొతవె 
చుక్కల రెక్కల సీతకోకై నోరూరించావే.. 
పువ్వుల ప్రాయంలో గుప్పున నిప్పులు పోసావే 
నన్నక్కడ ఇక్కడ చక్కిలి గింతల అల్లరి పెట్టావే.. 

రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై 
చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా.. 
చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై 
మరు ముద్దిమ్మంటూ ముందుకు వస్తున్నా.. 

చిలిపి కన్నే నెమలి కన్నై చిగురు తనువంత తడిమిపో.. 
పులకరింతే మరొక వింతై అనువు అనువంత రగిలిపో.. 
గోపురమే నువ్వు నీపై పావురమై నేను 
గుప్పెడు గుండెల ప్రాంగనమంతా నాదని అంటాలే.. 
గొపికవే నువ్వు నాలో కోరికవే నువ్వూ 
నీ పున్నమి వెన్నెలనేలె పురుషుడు నేనెలే.. 

రెప్పలపై రెప్పలపై కాటుక రెప్పలపై 
చిరు చప్పుడు చెయ్యని ముద్దొకటిస్తున్నా.. 
చెంపలపై చెంపలపై కెంపుల చెంపలపై 
మరు ముద్దిమ్మంటూ ముందుకు వస్తున్నా.. 




ధీంతన నన పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: కరుణాకర్, జొన్నవిత్తుల (మంత్రాలు)
గానం: శంకర్ మహదేవన్  

ఓం, దేవ్యై నమః
ఓం, శ్రుత్యై నమః
ఓం, అత్యై నమః
ఓం ఓం ఓం ఓం

ఓం, యక్యై నమః
ఓం, శక్త్యై నమః
ఓం, రక్త్యై నమః
ఓం ఓం ఓం

ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి  నట భంగిమవో
ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో
ఈశ్వరుడే అను నిత్యం తనలో తలుచుకునే ఓంకారమువో
శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో

నీ మదిలో మహదేవుడినే కొలువుంచగ ఓ కైలశము వో
అతని పాదము చెంతన వెలిగే హారతివో
పామరుడికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో

ధీంతనతోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో
ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో
ఈశ్వరుడే అను నిత్యం తనలో తలుచుకునే ఓంకారమువో
శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో

ఓం, దేవ్యై నమః
ఓం, శ్రుత్యై నమః
ఓం, అత్యై నమః
ఓం ఓం ఓం ఓం





సక్కు భాయ్ ఘరం చాయ్ పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సుచిత్ సురేషణ్, మమతా శర్మ 

హే సక్కుభాయి జర  దేఖోనా గరం గరం చాయ్
హే సక్కుభాయి నువ్వు చాయ్ ఇస్తే అదోరకం హాయ్
చాయ్ చాయ్ చాయ్ చాయ్ చాయ్
హే ఏస్కో నా ఘుమ ఘుమ చాయ్
యమ ఫేమస్ ఇది ఢిల్లీ టు దుబాయ్
హే తీస్కో నా సల్ల సల్ల చాయ్
భలే మోగిస్తది నరాల్లో సన్నాయి
గుండె గయ్యంటే అల్లం చాయ్ సుయ్యంటే బెల్లం చాయ్
కెవ్వంటే కర్రకాయి చాయ్
ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్ సలవైతే కార చాయ్
ముసుగెడితే ముల్లకాడు చాయ్
నా బంగారు చేతుల్తో పింగాను సాసర్ లో
నీకోసం తెస్తానబ్బాయ్

వెల్కమ్ టు సక్కుభాయి
గరం  చాయ్, తాగేసేయ్, మజా చేయ్
వెల్కమ్ టు  సక్కుభాయి
గరం చాయ్, తాగేసేయ్, మజా చేయ్

హే సక్కుభాయి జర  దేఖోనా గరం గరం చాయ్
హే సక్కుభాయి నువ్వు చాయ్ ఇస్తే అదోరకం హాయ్

సో సో సొగసాకు తీసి, కాచా డికాషన్
పరువాళ్ల మిల్క్ పెదవుల్లో షుగరు పక్కాగా కలిపేసి పెంచా ఎమోషన్ 
నీకేసి చూసి, హ్యాపీ హ్యాపీ టెన్షన్  
తేయాకు లాంటి నాజుకుతోన ఇరగ తీసావే ప్రిపరేషన్
ఆంధ్ర నైజం సీడెడ్ అన్న సిల్లార పిల్లల ఫాలోయింగే
సక్కుభాయి చాయ్ అంటే పడి సచ్చిపోతారు
క్వాటర్ చాయ్ కి లీటర్ బిల్డుప్ ఇచ్చి
మేటర్ పెంచేసావే నీలో ఉందే తాజా హుషారు

వెల్కమ్ టు సక్కుభాయి
గరం  చాయ్, తాగేసేయ్, మజా చేయ్
వెల్కమ్ టు  సక్కుభాయి
గరం చాయ్, తాగేసేయ్, మజా  చే చే చేయ్

ఫుల్ బాటిల్ వాసు, మరో దేవదాసు
శాంపిల్ చూసాడు సక్కు చాయ్ డోసు 
కిక్ ఎక్కి చేసాడు రికార్డు డాన్స్ 
చాల్లే  ఎక్ష్త్రస్  వాడో తేడాకేసు 
నీ జారే వోణిసు చూసాడు బాసు
అంచేత చేసాడు గాల్లో జుంపింగ్స్
లారీ తోలే దార సింఘు సక్కు చాయ్ కి ఫ్యాన్ అయిపోయి
ఇక్కడికిక్కడే నా దాబాలో సెటిల్ అయిపోయాడు
ఆ తింగరి స్టీరింగ్  ఓడి లెక్కే వేరే తిక్కల పిల్ల
నీ ధాబాలో నులక మంచం మెత్తగ ఉందని హత్తుకుపోయాడు

వెల్కమ్ టు సక్కుభాయి
గరం  చాయ్, తాగేసేయ్, మజా చేయ్
వెల్కమ్ టు  సక్కుభాయి
గరం చాయ్, తాగేసేయ్, మజా  చేయ్





లాలి లాలి జోలాలి పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: గోపిక పూర్ణిమ

లాలి లాలి జోలాలి అంటు లాలించాలి ఈ గాలి
లాలి లాలి జోలాలి వింటు లోకాలన్నీ ఊగాలి
నీతో ఆడాలంటూ నేల జారెనంట జాబిల్లి
నీలా నవ్వలేనంటు తెల్లవారె చుసెనంట సిరిమల్లి

లాలి లాలి జోలాలి అంటు లాలించాలి ఈ గాలి
లాలి లాలి జోలాలి వింటు లోకాలన్నీ ఊగాలి

బోసిపలుకె నువు చిందిస్తూ ఉంటే బొమ్మరిల్లాయే వాకిలి
లేత అడుగె నువు కదిలిస్తూ ఉంటే లేడి పిల్లాయే లోగిలి
నీ చిన్ని పెదవంటితే 
పాలనదులెన్నొ యెదలోన పొంగే పొరలి
నిను కన్నా భాగ్యానికే తల్లి పదవొచ్చి మురిసింది ఇయ్యాలె

లాలి లాలి జోలాలి అంటు లాలించాలి ఈ గాలి
లాలి లాలి జోలాలి వింటు లోకాలన్నీ ఊగాలి

లాల నీకే నె పోసేటివేల అభిషేకంలా అనిపించెర
ఉగ్గు నీకే నె కలిపేటి వేళా నైవేద్యంలా అది ఉందిరా
సిరిమువ్వ కట్టేవేళా 
మాకు శివ పూజె గురుతొచ్చె మరలా మరలా
కేరింత కొట్టే వేలా ఇల్లె కైలాసంలా మారె నీవల్ల

లాలి లాలి జోలాలి అంటు లాలించాలి ఈ గాలి
లాలి లాలి జోలాలి వింటు లోకాలన్నీ ఊగాలి




భూనభోంతాలకే పులకింత రా పాట సాహిత్యం

 
జయజయ శంకర శివశివ శంకర
జయజయ శంకరశివ శివ శంకర
జయ జయ శంకర శివశివ శంకర
జయ జయ శంకర శివ శివ శంకర

భూనభోంతాలకే పులకింత రా
దశదిశాంతలకే ఒకవింతరా
కదిలాడు ధరణికే కాంతిమయుడు
కరుణాంతరంగుడై ప్రణవధారుడు
జయజయ శంకర శివశివశంకర
జయజయశంకరశివశివశంకర
జ్ఞాన ప్రభారాశి దివ్యత్రినేత్రం
వేద వేదాంతార్థ జోతిస్వరూపం
కైలాస శిఖరాలు నిజభుజస్కంధాలు
కరుణా సముద్రాలూ స్వామి కనులు

జయజయ శంకరశివశివ శంకర
జయజయ శంకరశివ శివ శంకర
శిరసుపై చలువ ఆ చలువ గంగ
నుదుటికి తళుకు ఆచంద్రవంక
నెమలిపించమువోలునీలకంఠం
చలి మబ్బులువిబూది భస్మం
జయ జయ శంకర శివ శివ శంకర


అభయ ప్రళయశక్తి ఆ త్రిశూలం
అక్షర వ్యాకృతుల ఆకృతే డమరుకం
మణిభూషణం ఆయే సర్పరాజ్యం
సంధ్య కాంతులనెగసె వ్యాఘ్ర చర్మం
జయజయ శంకరశివశివశంకర
సప్తతాండవనటుల నటరాజుపాదం
బ్రహ్మాది దేవతలు మొక్కేటి పాదం
దివినుండి దిగి రాదా ఇలకే ప్రబోధం
దివినుండి దిగి రాదా ఇలకే ప్రబోధం
జయ జయ శంకరశివశివశంకర
పాహిపాహి అనే పరమ భక్తుడే
ద్రోహి అంటూ నిందించగా
భూషణలు భూషణముగా చేసి కొనిచేరె
నాగభూషణుడైన నటరాజు తానే
దైవం మానుష రూపేణా




కన్యాకుమారి ఓ కన్యాకుమారి పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: సాహితి
గానం: జస్ ప్రీత్ జాజ్, సునీత

కన్యాకుమారి ఓ కన్యాకుమారి
నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపమ్మా దారి
మీనాకుమారి ఓ  మీనా కుమారి
నీ కళ్ళలోనే ఉండాలంటే ఏంచేయాలే నారి
వేసవికన్నా వెచ్చగ నాతో ముచ్చటలాడాలి
వెన్నెల కన్నా చల్లగ నాకే కౌగిలి ఇవ్వాలి
చక్కర కన్నా తియ్యగ నన్నే ప్రేమించాలి

హే రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాలా
హే రారో నీ ముద్దు మాటకి నా సోకులిస్తా గోపాలా

చరణం: 1
ఓ నీ మీసం చూసి మెలి తిరిగెను వయ్యారం 
అది తాకితే చాలు నిదరే రాదే రేయిక జాగారం
నడుమే నయగారం ఆ నడకే శృంగారం 
నీ నడుమున నలిగే మడతకు చేస్తా ముద్దుల అభిషేకం
చల్లగా నన్నే గారడీ చేయకు మన్మథుని మరిదివలే
కళ్ళే మూసి చల్లగ జారకు పూబంతల్లే

రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా
హే రారో నీ ముద్దు మాటకి నా సోకులిస్తా గోపాలా

కన్యాకుమారి ఓ కన్యాకుమారి
నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపమ్మా దారి
మీనాకుమారి ఓ  మీనా కుమారి
నీ కళ్ళలోనే ఉండాలంటే ఏంచేయాలే నారి

చరణం: 2 
సూటిగ నీ చూపే నా గుండెని తాకింది
పేరే తెలియని జ్వరమే ఏదో ఒంటికి సోకింది
నీలో నిప్పుంది అది నాలో రగిలింది
ఎదలొకటై తెలవారే వరకు  ఆరను లెమ్మంది
ఉక్కిరిబిక్కిరి చేసే కోరిక ఎరగను ఇదివరకు
ఒంటరి తుంటరి తుమ్మెదలాగ అంటుకు పోకు

రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాలా
ఓ రారో నీ ముద్దు మాటకి నా సోకులిస్తా గోపాలా

కన్యాకుమారి ఓ కన్యాకుమారి
నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపమ్మా దారి
రాజకుమార ఓ రాజకుమార 
నా గుండెల్లోనే ఉన్నవయ్యో ఎందుకు ఇంకా దారి




శివ శివ శంకర హర హర శంకర పాట సాహిత్యం

 
చిత్రం: డమరుకం (2012)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: జొన్నవిత్తుల
గానం: శంకర్ మహదేవన్

భం భం భో - భం భం భో (4)

సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా

శివ శివ శంకర హర హర శంకర 
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర 
ప్రళయ భయంకర దిగిరారా

శివ శివ శంకర హర హర శంకర 
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర 
ప్రళయ భయంకర దిగిరారా

ఓం పరమేశ్వరా పరా
ఓం నిఖిలేశ్వరా హరా
ఓం జీవేశ్వరేశ్వరా కనరారా
ఓం మంత్రేశ్వరా స్వరా
ఓం యాంత్రేేశ్వరా స్థిరా
ఓం తంత్రేశ్వరావరా రావేరా

శివ శివ శంకర హర హర శంకర 
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర 
ప్రళయ భయంకర దిగిరారా

సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా

ఆకాశలింగమై ఆవహించరా
డమ డమమని డమరుఖ ధ్వని సలిపి 
జడతని వదిలించరా
శ్రీ వాయులింగమై సంచరించరా
అణువణువున తన తనువున నిలచి 
చలనమే కలిగించరా

భస్మం చేసేయ్ అసురునే అగ్నిలింగమై ప్రవికారా
వరదై ముంచేయ్ జలలింగమై ఘోరా
వరమై వశమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా
జగమే నడిపే పంచభూత లింగేశ్వరా కరునించరా

శివ శివ శంకర హర హర శంకర 
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర 
ప్రళయ భయంకర దిగిరారా

సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా

విశ్వేశ లింగమై కనికరించరా
విధి లిఖితమునిక బర బర బర చెరిపి 
అమృతమె కురిపించరా
రామేశ లింగమై మహిమ చూపరా
పలు శుభములు గని అభయములిడి హితము 
సతతము అందించరా

గ్రహణం నిధనం బాపరా కాళహస్తి లింగేశ్వరా
ప్రాణం నీవై ఆలింగనంమీరా
ఎదలో కొలువై హర హర ఆత్మా లింగమై నిలబడరా
ద్యుతివై గతివై సర్వ జీవలోకేశ్వరా రక్షించరా

శివ శివ శంకర హర హర శంకర 
జయ జయ శంకర దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర 
ప్రళయ భయంకర దిగిరారా

శివ శివ హర హర జయ జయ దిగిరారా
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర 
ప్రళయ భయంకర దిగిరారా

సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా - భం భం భో
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా-భం భం భో
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా -భం భం భో
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా


Most Recent

Default