Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Karthika Deepam (1979)




చిత్రం: కార్తీక దీపం (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: శోభన్ బాబు, శ్రీదేవి, శారద, గీత
దర్శకత్వం: లక్ష్మీ దీపక్
నిర్మాతలు: జి.రాధాదేవి గుప్తా, ఎ. కృష్ణయ్య
విడుదల తేది: 04.05.1979



Songs List:



ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం పాట సాహిత్యం

 
చిత్రం: కార్తీక దీపం (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.జానకి, పి.సుశీల

ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం..
చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం
ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం..
చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం
ఇదేసుమా నా కుంకుమ తిలకం 
ఇదే సుమా నా మంగళ సూత్రం

ఇంటిలోన నా పాప రూపునా గోరంత దీపం..
కంటి కెదురుగా కనబడు వేళల కొండంత దీపం
నా మనస్సున వెలిగే దీపం నా మనుగడ నడిపే దీపం..

ఆకాశానా ఆమణిదీపాలేముత్తైదువులుంచారో
ఈ కోనేట ఈ చిరుదివ్వెల చూసి చుక్కలనుకుంటారు..
ఏమైనా ఏదైనా కోవెలలో కొలువై ఉండే దేవికి పట్టిన హారతులే..

ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం..
చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం
చేరనీ నీ పాద పీఠం నా ప్రాణ దీపం

నోచిన నోములు పండెననీ ఈ ఆనంద దీపం 
నా దాచిన కోర్కెలు నిండుననీ ఈ ఆశా దీపం
నా నోచిన నోములు పండెననీ ఈ ఆనంద దీపం 
నా దాచిన కోర్కెలు నిండుననీ ఈ ఆశా దీపం
ఎటనైనా ఎపుడైనా నే కొలచే కళ్యాణ దీపం నేవలచే నా ప్రాణ దీపం..

ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం..
చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం
చేరనీ నీ పాద పీఠం నా ప్రాణ దీపం



చిలకమ్మ పలికిందీ పాట సాహిత్యం

 
చిత్రం: కార్తీక దీపం (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు , జానకి

చిలకమ్మ పలికిందీ..చిగురాకు కులికిందీ (2)
చిరునవ్వు చిలికించవే నీ లేత సింగారమొలికించవే..
నీ లేత సింగార మొలికించవే..
గోరొంక కూసింది..గోరింట పూసిందీ..
ముత్యాల మనసీయ రా నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా... 
నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా...

పాల బుగ్గ కందితే తెలిసిందీ పూల సిగ్గు పూచిందనీ...
ఆ ఆహాహహాఆహ
పైట కొంగు జారితే తెలిసిందీ పిల్ల గాలి వీచిందనీ..
ఈ సిగ్గు బరువు నేనోపలేను (2)
నీ కంటి పాపలో దాచుకో నన్నూ.. దాచుకో నన్నూ..

కోయిలమ్మ పాడితే తెలిసిందీ కొత్త ఋతువు వచ్చిందనీ...
ఆ ఆహాహహాఆహ
కొండ వాగుదూకితే తెలిసిందీ.. కోడె వయసు పోగిందనీ.. 
ఈ వయసు హోరు నేనాపలేను (2)
నీ కౌగిలింతలో దోచుకో నన్నూ...దోచుకో నన్నూ..




చూడ చక్కని దానా పాట సాహిత్యం

 
చిత్రం: కార్తీక దీపం (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

చూడ చక్కని దానా
చూపు బిత్తరిదానా
నీ మిస మిసలు
ఈ రుస రుసలు
చూస్తేనే మనసౌతోంది

చూడ చక్కనివాడా
చూపు క తెరవాడా
నీ రెప రెపలు
ఈ తహ తహలు
చూస్తుంటే మతిపోతోంది

నీ సొగసులకు నా
చూపులను నే కావలి పెడతానే
నీ పెదవులపై నా పెదవులకు
పెత్తన మిస్తానే
చిలిపి వయసు కలికి మనసు
పంచుకుంటానే
నీవు కావాలన్నా అందీ అందక ఆరడిచేస్తాను
నను కాదంటున్నా కలలో కలసి అల్లరి పెడతాను
నిమిషమైన వదలలేని గారడి చేస్తాను




మువ్వలేమో నేడేమో పాట సాహిత్యం

 
చిత్రం: కార్తీక దీపం (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

మువ్వలేమో నేడేమో నా లోలోన
మ్రోగించేను మోహనగీతం ॥మువ్వ|

కదలే కన్నులలో
చదవని కధలెన్నో ...
పలికే అడుగులలో
కలవని శ్రుతులెన్నో....
తెలిసిన వారికే.... ఆఁ ఆఁ...
నా వయసే నజరానా

ముసుగును తీయకనే
మోమును గమనించి
విసురుగ చూడకనే
రసికత చూపించి
వలచిన వానికే
నా వలపే నజరానా



నీ కౌగిలి లో తల దాచి పాట సాహిత్యం

 
చిత్రం: కార్తీక దీపం (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు, సుశీల

నీ కౌగిలి లో తల దాచి..నీ చేతులలో కనుమూసి
జన్మ జన్మ కూ జత గా మసలే వరమే నన్నూ పొందనీ..

చల్లగ కాసే పాలవెన్నెల నా మనసేదో వివరించూ..
అల్లరి చేసే ఓ చిరుగాలి నా కోరికలే వినిపించూ..
నా కోవెలలో స్వామివి నీవై వలపే దివ్వెగ వెలిగించు. 

నింగి సాక్షీ..నేల సాక్షీ.. నిను వలచిన నా మనసే సాక్షీ...
మనసులోనా మనుగడ లోనా నాలో నీవే సగ పాలూ..
వేడుకలోనూ వేదన లోనూ పాలూ తేనెగ ఉందామూ..



ఓ మాట.. అహ తెలుసూ.. పాట సాహిత్యం

 
చిత్రం: కార్తీక దీపం (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు , పి.సుశీల

ఓ మాట.. అహ తెలుసూ.. అదికాదు.. ఇంకేమిటీ..
చెబితే చాలదూ..కోరిక తీరదూ...ఇది విన్నదే.. రోజూ ఉన్నదే..(2)

పగలంత నా మాట వింటావటా పడకిల్లు చేరంగ దయ రాదటా
మావిళ్ల లో నీకు ఇల్లాలి నీ.. ఈ ఝాము నీపైన అధికారినీ...

అలకుంటె ఒక సారి నను దోచుకో కౌగిట బంధించి ముద్దాడుకో..
ఎన్నైన చెబుతావు ఈ ఘడియలో చాలన్నదే లేదు నీ భాషలో..

Most Recent

Default