-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Tatineni Rama Rao"



చిత్రం: పండంటి జీవితం (1981)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.జానకి 
నటీనటులు: శోభన్ బాబు, సుజాత, విజయశాంతి 
దర్శకత్వం: తాతినేని రామారావు
నిర్మాత: మిద్దే రామారావు
విడుదల తేది: 01.01.1981



Songs List:



అంతులేని అనురాగం పాట సాహిత్యం

 
చిత్రం: పండంటి జీవితం (1981)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

పల్లవి: 
అంతులేని అనురాగం అన్నగా
చెల్లిపోని మమకారం చెల్లిగా
జీవించు వెయ్యేళ్ళు చల్లగా
దీవించనీ నిన్ను అమ్మగా నాన్నగా వెరసి నీ అన్నగా 

చరణం : 1
ఒకే కొమ్మ పువ్వులం ఒకే అమ్మ దివ్వెలం
తొడిమిలేని తోటలో - ప్రమిదలేని గూటిలో
కలసి మెలసి నవ్విన కమ్మని చిరు నవ్వులం
అన్న అనే నేను రేపు నిన్నలో కలిసినా
చెల్లి అనే నువ్వు బ్రతుకు నూరేళ్ళు పచ్చగా

చరణం : 2
పుట్టినింట ప్రేమతో మెట్టినింట పేరుతో
కాలు పెడితే కలిమిగా కంటిచూపు చెలిమిగా
మహలక్ష్మికి మారుగా మమతల బంగారుగా
కలకాలం వర్ధిల్లు కలికి చిలుకగా
అన్న ఆశీస్సులే నీకు చిరాయుష్యుగా
నీకు చిరాయుష్యుగా




ఎదుటే ఒక అందం పాట సాహిత్యం

 
చిత్రం: పండంటి జీవితం (1981)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

పల్లవి: 
ఎదుటే ఒక అందం - ఎదిగే అనుబంధం
ఏలా ఈ పంతం- బాలా నా సొంతం వలపు వసంతం
విరిసే ఈ వేళలో పిలిచే రాగాలలో

చరణం: 1
అలకలు రేపిన పులకలు చూడు
వలపుల తీయని పిలుపులు చూడు
దాగని నవ్వులు దాచకులే నీబెట్టు లెందుకు చెల్లవులే
చిరు నవ్వో అరనవ్వో నవ్వాలిలే ॥ఎదుటే||

చరణం: 2
నడకలు నేర్పిన దానా నెమలికి నటనలు తెలిపిన దానా
వొంటరి తనమిక సాగదులే తుంటరిచూపులు సోకునులే
నీపైట రెప రెప మన్నదిలే... ఆపైన ఏమైనా అడగకులే ॥ ఎదుటే||




పండంటి జీవితం పాట సాహిత్యం

 
చిత్రం: పండంటి జీవితం (1981)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పండంటి జీవితం - రెండింటి కంకితం
ఒకటి నీ మనసు
ఒకటి నీ మమత
మమతవున్నా మనసుకన్నా ఏది శాశ్వతము

చిలక పచ్చని చీరకట్టి మొలక నవ్వుల సారెపెడితే
పులకరింతల పూలు తెస్తున్నా
చిలిపి కన్నుల పలకరించి వలపు వెన్నెల చిలకరిస్తే
కౌగిలింతకు నేను వస్తున్నా

ఈ పొద్దు ఏ హద్దు నేనెరుగను
ఆ మాట నువ్వంటే నే దొరకను
ఇంత హొయలూ ఇన్ని లయలూ నాకు శాశ్వతము ॥పండంటి॥

సందెగాలికి జలదరించే అందమంతా విందు చేస్తే
వలపు పానుపు పరుచుకొంటున్నా
హాయి తీపిని మోయలేక సాయమడి సరసకొస్తే
మల్లె చెండే దిండు చేస్తున్నా మల్లె చెండే దిండు చేస్తున్నా.
ఎదలోన ఎదవుంది పొదరిల్లుగా 
నా యిల్లు నాకుంటే అది చాలుగా
మనసు వున్న మనువుకన్న ఏది శాశ్వతము





తగ్గు బుల్లెమ్మ తగ్గు పాట సాహిత్యం

 
చిత్రం: పండంటి జీవితం (1981)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

తగ్గు బుల్లెమ్మా తగ్గు సిగ్గు ఓలమ్మో సిగ్గు సిగ్గు
అడాళ్లల్లో అందం చందం - అలకల్లోనే చూడాలంట
తళుకు బెళుకూ చూస్తూ వుంటా నీతో వస్తూంటా

తగ్గు బుల్లోడా తగ్గు సిగ్గు ఓరయ్యో సిగ్గు సిగ్గు
మగాళ్ల లో మాయా మర్మం - మాటలోనే చూడాలంట
చిటికో మెటికో వింటూ వుంటా నిన్నేచూస్తూంటా

కొబ్బరినీళ్లు చల్లనా తిమ్మిరి ఒళ్లు గిల్లనా 
అవ్వాయి చువ్వాయి … అమ్మాయిగారి అలకే తీర్చేయ్యనా
చూపుల గాలం వేయనా - నోటికి తాళం పెట్టనా
ఆడేటి, పాడేటి అబ్బాయిగారి నడకే మార్చెయ్యనా
రేపో మాపో చూద్దామంటే నేడే రేపట
కాస్తో కూస్తో యిస్తానంటే అంతే చాలంట కాస్తంతే చాలంట

పక్కన వుంటే వెచ్చన చుక్కల కేసే నిచ్చెన
మబ్బుల్లో పక్కేసి వెన్నెల విందు ఈ వేళ చేసెయ్యనా

చీకటి చీరలు కట్టనా - మాపటి మల్లెలు పెట్టనా
బుగ్గల్లో మొగ్గేసే చినదాని సిగ్గు కొనగోట మీచేయ్యనా
ప్రేమా గీమా అన్నావంటే పెళ్లే ప్రేమంట
హద్దూ పద్దూ వుండాలంటే ముద్దే చాలంట
ఈ ముద్దే చాలంట




పిలిచారు మావారు పాట సాహిత్యం

 
చిత్రం: పండంటి జీవితం (1981)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.జానకి 

పల్లవి : 
పిలిచారు మావారు యిన్నాళ్లకి, పలికారు వీడ్కోలు కన్నీళ్ల
పల్లవి : 
తూరుపు పడమర లేక సూర్యుడే లేడని
భార్యను భర్తను కలపనిదేవుడే వుండడని

చరణం: 1
ఇలకు జారని చినుకు కడలి చేరని వాగు
భర్త ఒడిని గుడి కట్టని భార్య బ్రతుకు లేదని
తెలిసిందీ నా జీవన సంధ్యా సమయంలో
అందుక నే.…అందుకనే వస్తున్నా ఉదయించిన హృదయంతో 

చరణం: 2
పసుపు కుంకుమాచిందే పడతి జన్మ ధన్యము
పతి మమతే ఏనాటికి సతికి నిత్య సౌభాగ్యం
తెలిసింది అరుంధతీ మెరిసిన ఈ సమయంలో
అందుకనే ......
అందుకనే వస్తున్నా పండిన నా ప్రణయంతో




కొబ్బరి చెట్టుకు పాట సాహిత్యం

 
చిత్రం: పండంటి జీవితం (1981)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

కొబ్బరి చెట్టుకు వెయ్యారే ఉయ్యాల
ఉయ్యాలేసి వూపారే జంపాలా ఓయమ్మలాల ఓయబ్బలాల
వుంగ వుంగ వుంగ వుంగ వుంగ... వుంగా ...
పుంగ వుంగ వుంగ వుంగ వుంగ... వుంగా....

కొబ్బరి చెట్టుకు వెయ్యారే ఉయ్యాల
ఉయ్యోలేసి వూపారే జంపాలా - ఓయమ్మలాల ఓయబ్బలాల

వుంగ వుంగ వుంగ వుంగ వుంగ... వుంగా .....
వుంగ వుంగ వుంగ వుంగ వుంగ... వుంగా....

పాతికేళ్ళ వాడమ్మ బుజ్జి పాపాయి
పారాడలేడమ్మ బుల్లి బుజ్జాయి
ఈ గోల మానేందు కేమిచ్చుకోను
ఏ జోల పాటల్లూ నే నేర్చుకోను
గిల్లి పాడేందుకు తల్లి జోలెందుకు
గిల్లి కజ్జాలతో అల్లరింకెందుకు
తోడు నువ్వుంటే నా యీడు పూల ఉయ్యాల

వుంగ వుంగ వుంగ వుంగ వుంగ.... వుంగా
వుంగ వుంగ వుంగ వుంగ వుంగ... వుంగా

తూనీగ నడుమేమొ తూగుటుయ్యాల
రాయంచ నడకేమొ రాగ మియాల
ఆ ముద్దు మురిపాలకేమిచ్చుకోను
ఏ పాట నేనల్లి నిను మెచ్చుకోను
ఝల్లు మంటున్నది వెల్లు వౌతున్నది
వళ్లు మైమరచి నిన్న కుంటున్నది
ఊగిపోవాలిలే నేడు జోడు ఉయ్యాల

వుంగ వుంగ వుంగ వుంగ వుంగ.... వుంగా
వుంగ వుంగ వుంగ వుంగ వుంగ... వుంగా

Palli Balakrishna Wednesday, November 1, 2023



చిత్రం: భార్యా బిడ్డలు  (1972)
సంగీతం: కె.వి.మహదేవన్  
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు,  జయలలిత,  బేబీ శ్రీదేవి
దర్శకత్వం: తాతినేని రామారావు
నిర్మాత: ఏ.వి.సుబ్బారావు 
విడుదల తేది: 15.01.1972



శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా నాగేశ్వరరావు గారితో కలిసి నటించిన సినిమాలు
1. భార్యా బిడ్డలు  (1972)
2. భక్త తుకారాం (1973)
3. మరపురాని మనిషి  (1973) 



Songs List:



ఆకులు పొకలు పాట సాహిత్యం

 
చిత్రం: భార్యా బిడ్డలు  (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి 

ఆకులు పొకలు 



భలే భలే నచ్చారు పాట సాహిత్యం

 
చిత్రం: భార్యా బిడ్డలు  (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి. సుశీల 

భలే భలే నచ్చారు 




చల్ మోహనరంగా పాట సాహిత్యం

 
చిత్రం: భార్యా బిడ్డలు  (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల 

చల్ మోహనరంగా 




అందమైన తీగకు పాట సాహిత్యం

 
చిత్రం: భార్యా బిడ్డలు  (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల

అందమైన తీగకు
పందిరుంటె చాలును
పైకి పైకి పాకుతుంది చినదానా
పరవశించి సాగుతుంది చినదానా
అందమైన తీగకు పందిరుంటె చాలును పైకి పైకి పాకుతుంది చినదానా
పరవశించి సాగుతుంది చినదానా

గువ్వకెగిరే కోరికుంటే రెక్కలొస్తాయి
తప్పటడుగులె ముందు ముందు నడకలౌతాయి
ఆశ ఉంటే మోడుకూడా చిగురు వేస్తుంది
అందమున కానందమపుడే తోడువస్తుంది
అందమైన తీగకు పందిరుంటె చాలును పైకి పైకి పాకుతుంది చినదానా
పరవశించి సాగుతుంది చినదానా

పాదులోని తీగవంటిది పడుచు చిన్నది
పరువమొస్తే చిగురు వేసి వగలుబోతుంది
మొగ్గ తొడిగీ మురిసిపోతూ సిగ్గు పడుతుందీ
తగ్గ జతకై కళ్లతోటే వెతుకుతుంటుంది
అందమైన తీగకు పందిరుంటె చాలును పైకి పైకి పాకుతుంది చినదానా
పరవశించి సాగుతుంది చినదానా

కళ్లు కళ్లు కలిసినపుడు కలలు వస్తాయి
కన్నెపిల్ల కలలకెపుడో కాళ్లు వస్తాయి
అడుగులోన అడుగు వేస్తూ అందమొస్తుంది
నడవలేని నడకలే ఒక నాట్యమౌతుంది
అందమైన తీగకు పందిరుంటె చాలును పైకి పైకి పాకుతుంది చినదానా
పరవశించి సాగుతుంది చినదానా




చక్కనయ్యా చందమామా పాట సాహిత్యం

 
చిత్రం: భార్యా బిడ్డలు  (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల 

చక్కనయ్యా చందమామా



బ్రతుకు పూలబాట కాదు పాట సాహిత్యం

 
చిత్రం: భార్యా బిడ్డలు  (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల

లేని బాట వెతుకుతున్న పేద వానికి
రాని పాట పాడుకున్న పిచ్చివానికి

బ్రతుకు పూలబాట కాదు అది పరవశించి పాడుకునే పాట కాదు
బ్రతుకు పూలబాట కాదు అది పరవశించి పాడుకునే పాట కాదు
బ్రతుకు పూలబాట కాదు

దోబూచులాడుతుంది విధి మనతో దొంగాటలాడుతుంది మనసులతో
దోబూచులాడుతుంది విధి మనతో దొంగాటలాడుతుంది మనసులతో
కనిపించే నవ్వులన్ని నవ్వులు కావు
అవి బ్రతుకు తెరువు కోసం పెదవులాడు కల్లలు
బ్రతుకు పూలబాట కాదు అది పరవశించి పాడుకునే పాట కాదు
బ్రతుకు పూలబాట కాదు

మాటలలో చిక్కుబడి మనసు నలిగిపోతుంది
మనసులేని మాటలనే మనం నమ్ముతున్నది
పలుకలేని ప్రతి గుండె బాధతో నిండినది ఆ ఆ ఆ
ఒలికే ప్రతి కన్నీటి చుక్క వెచ్చగా ఉంటుంది
బ్రతుకు పూలబాట కాదు అది పరవశించి పాడుకునే పాట కాదు
బ్రతుకు పూలబాట కాదు

చీకటిలో వెలుగును చూడ నేర్చుకో చమటలో స్వర్గాన్ని సృష్టి చేసుకో
చీకటిలో వెలుగును చూడ నేర్చుకో చమటలో స్వర్గాన్ని సృష్టి చేసుకో
విధి వ్రాసిన వ్రాతలకు విరుగుడొక్కటే
పదిమందితోటి పంచుకునే రోజు వచ్చుటే
ఆ రోజు వచ్చులే
బ్రతుకు పూలబాట కాదు అది పరవశించి పాడుకునే పాట కాదు
బ్రతుకు పూలబాట కాదు





చక్కనయ్యా చందమామా పాట సాహిత్యం

 
చిత్రం: భార్యా బిడ్డలు  (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల

చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ
నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ
చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ

మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి
మొన్న పున్నమి రాతిరి నీవొడిని నిద్దురపోతిమి
తెల్లవారి లేచి చూచి తెల్లబోయ్యామూ గొల్లుమన్నాము
చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ

మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున
మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున
బిక్కు బిక్కున దిక్కులన్నీ తిరుగుతున్నామూ వెతుకుతున్నామూ
చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ

దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో
దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో
ఏ రాణి వాసములోన చేరి రాజువై నావో
రాలేకవున్నావో
చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ





వలచీనానమ్మ హమ్మా హమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: భార్యా బిడ్డలు  (1972)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, పి.సుశీల

వలచీనానమ్మ హమ్మా హమ్మా హమ్మా హమ్మా
వలచీనానమ్మ వలచినానని తెలిసికూడా నే పలకరించినా పలకడమ్మా
వలచీనానమ్మ వలచీనానమ్మ
హేయ్ వలచీనావమ్మా హమ్మా హమ్మా హమ్మా హమ్మా
వలచీనావమ్మా
వలచినావని తెలిసినంతనే పలుకరాక నే నిలిచానమ్మా
వలచీనావమ్మా వలచీనావమ్మా

కళ్ళున్నందుకు ఒకసారైనా కలపాలోయి
కమ్మని కబురులు సరదాకైనా చెప్పాలోయి
కళ్ళున్నందుకు ఒకసారైనా కలపాలోయి కమ్మని కబురులు సరదాకైనా చెప్పాలోయి
కబురులు కమ్మగ ఉండవమ్మ జరగకపోతేనూ
కబురులు కమ్మగ ఉండవమ్మ జరగకపోతేనూ
కళ్ళు కలిపితే ఊరకపోదు కలతేరేగేను
వలచీనానమ్మ హమ్మా హమ్మా హమ్మా హమ్మా
వలచీనానమ్మ
వలచినావని తెలిసినంతనే పలుకరాక నే నిలిచానమ్మా
వలచీనావమ్మా వలచీనావమ్మా

వయసంటేనే నీ ఒంటికి పడదా ఊరకుంటావు
సొగసంటే నీ కంటికి చేదా చూడనంటావు
వయసంటేనే నీ ఒంటికి పడదా ఊరకుంటావు
సొగసంటే నీ కంటికి చేదా చూడనంటావు
సొగసులోనా సొగసే లేదు సొంతం కాకుంటే
సొగసులోనా సొగసే లేదు సొంతం కాకుంటే
వయసే ఒంటికి చెరుపౌతుంది వదలి ఊరుకుంటే
వలచీనానమ్మ హమ్మా హమ్మా హమ్మా
వలచీనానమ్మ
వలచినావని తెలిసినంతనే పలుకరాక నే నిలిచానమ్మా
వలచీనావమ్మా వలచీనావమ్మా
ఓఓఓ హోఓఓ ఓఓఓ హోఓఓ


Palli Balakrishna Friday, July 8, 2022



చిత్రం:  ఇల్లాలు (1981)
సంగీతం: కె చక్రవర్తి
నటీనటులు: శోభన్ బాబు, జయసుధ, శ్రీదేవి 
దర్శకత్వం: టి. రామారావు 
నిర్మాత: జి. బాబు 
విడుదల తేది: 09.04.1981



Songs List:



గుండెల్లో సవ్వడి ఏమిటో అలజడి పాట సాహిత్యం

 
చిత్రం:  ఇల్లాలు (1981)
సంగీతం: కె చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

గుండెల్లో సవ్వడి ఏమిటో అలజడి 




ఓ బాటసారి...పాట సాహిత్యం

 
చిత్రం:  ఇల్లాలు (1981)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: కె.జె.యేసుదాసు, యస్.పి.శైలజ

ఓ బాటసారి...ఇది జీవిత రహదారి
ఓ బాటసారి...ఇది జీవిత రహదారి 

ఎంత దూరమో... ఏది అంతమో
ఎవరు ఎరుగని దారి ఇది
ఒకరికె సొంతం కాదు ఇది 

ఓ బాటసారి... ఇది జీవిత రహదారి..

ఎవరు ఎవరికి తోడౌతారో.... ఎప్పుడెందుకు విడిపోతారో
మమతను కాదని వెళతారో... మనసే చాలని ఉంటారు
ఎవ్వరి పయనం ఎందాకో...
అడగదు ఎవ్వరిని... బదులే దొరకదని
అడగదు ఎవ్వరిని... బదులే దొరకదని

కడుపుతీపికి రుజువేముందీ... అంతకు మించిన నిజమేముందీ...
కాయే చెట్టుకు బరువైతే.... చెట్టును భూమి మోస్తుందా..
ఇప్పుడు తప్పులు తెలుసుకొనీ... జరిగేదేమిటనీ..క్షమించదెవ్వరినీ

తెంచుకుంటివి అనుబంధాన్ని... పెంచుకున్నదొక హృదయం దాన్ని..
అమ్మలిద్దరు వుంటారని అనుకోలేని పసివాడ్ని
బలవంతాన తెచ్చుకొని... తల్లివి కాగలవా? ... తనయుడు కాగలడా?

అడ్డ దారిలో వచ్చావమ్మా... అనుకోకుండా కలిసావమ్మ
నెత్తురు పంచి ఇచ్చావూ... నిప్పును నీవే మింగావూ
ఆడదాని ఐశ్వర్యమేమిటో...ఇప్పుడు తెలిసింది..కథ ముగిసేపొయింది
ఇప్పుడు తెలిసింది..కథ ముగిసేపొయింది 

ఓ..బాటసారీ..ఇది జీవిత రహదారీ




నీరెండ దీపాలు నీ కళ్ళలో పాట సాహిత్యం

 
చిత్రం:  ఇల్లాలు (1981)
సంగీతం: కె చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్. పి. బాలు, పి. సుశీల

నీరెండ దీపాలు నీ కళ్ళలో 




మురిపాల మా బాబు పాట సాహిత్యం

 
చిత్రం:  ఇల్లాలు (1981)
సంగీతం: కె చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం:  పి. సుశీల

మురిపాల మా బాబు 




అల్లరి కృష్ణుడు అందరి కృష్ణుడు పాట సాహిత్యం

 
చిత్రం:  ఇల్లాలు (1981)
సంగీతం: కె చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం:  పి. సుశీల, యస్. పి. శైలజ

అల్లరి కృష్ణుడు అందరి కృష్ణుడు 




శబరి గిరీశ అయ్యప్ప పాట సాహిత్యం

 
చిత్రం:  ఇల్లాలు (1981)
సంగీతం: కె చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం:  యస్. పి. బాలు

శబరి గిరీశ అయ్యప్ప 

Palli Balakrishna Wednesday, June 15, 2022



చిత్రం: భలే రంగడు (1969)
సంగీతం: కె.వి.మహదేవన్ 
నటీనటులు: అక్కినేని నాగేశ్వర రావు , వాణిశ్రీ 
దర్శకత్వం: తాతినేని రామారావు 
నిర్మాత: యన్.యన్, భట్ 
విడుదల తేది: 14.08.1969



Songs List:



నిన్న నాదే... పాట సాహిత్యం

 
చిత్రం: భలే రంగడు (1969)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల

పల్లవి:
నిన్న నాదే... నేడు నాదే... రేపు నాదేలే
ఎవరేమన్నా...  ఎన్నటికైనా...
ఎవరేమన్నా ఎన్నటికైనా... గెలుపు నాదేలే

నిన్న నాదే... నేడు నాదే... రేపు నాదేలే
ఎవరేమన్నా ఎన్నటికైనా... గెలుపు నాదేలే

ఏహే... Don't Care Master

చరణం: 1
కల్లాకపటం ఎరుగనివాణ్ణి.... గాలిపటంలా తిరిగేవాణ్ణి
కల్లాకపటం ఎరుగనివాణ్ణి.... గాలిపటంలా తిరిగేవాణ్ణి

పెంకిఘంటంలా నిలిచేవాణ్ణి... నిండుగుండెతో బతికేవాణ్ణి.
నిండుగుండెతో..బతికేవాణ్ణి..

నిన్న నాదే... నేడు నాదే... రేపు నాదేలే

ఏహే... Don't Care Master

చరణం: 2
పైసా అంటే నాకూ ఇష్టం... పైసా లేనిదే మనుగడ కష్టం
పైసా అంటే నాకూ ఇష్టం... పైసా లేనిదే మనుగడ కష్టం 

పైసా కోసం... మోసం చేస్తే..ఏయ్
పైసా కోసం మోసం చేస్తే ... పరువు తీసి పారేస్తాను..
పరువు తీసి పారేస్తాను

నిన్న నాదే... నేడు నాదే... రేపు నాదేలే

ఏహే... Don't Care Master

చరణం: 3
మంచివాళ్ళతో నేస్తం కడతా... బడా చోరుల భరతం పడతా
మంచివాళ్ళతో నేస్తం కడతా... బడా చోరుల భరతం పడతా 

చింతా చీకు లేకుండా... సంతోషంగా జీవిస్తా..
సంతోషంగా జీవిస్తా..

నిన్న నాదే... నేడు నాదే... రేపు నాదేలే

ఎవరేమన్నా ఎన్నటికైనా... గెలుపు నాదేలే

నిన్న నాదే... నేడు నాదే... రేపు నాదేలే
ఎవరేమన్నా ఎన్నటికైనా... గెలుపు నాదేలే




పగటి కలలు పాట సాహిత్యం

 
చిత్రం: భలే రంగడు (1969)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: కొసరాజు 
గానం: ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి 

పల్లవి:
పగటి కలలు కంటున్న మావయ్యా
గాలి మేడలెన్ని నీవు కట్టావయ్యా
మావయ్యా..  ఓ మావయ్యా
మావయ్యా.. మావయ్యా

గలా గలా నవ్వేటి గంగమ్మా
బంగారు మేడలెన్నో కట్టానమ్మా
గంగమ్మా.. ఓ గంగమ్మా
గంగమ్మా.. ఓ గంగమ్మా 

చరణం: 1
అందని కొమ్మకు నిచ్చెన ఏస్తున్నాడూ
అబ్బాయి యాడాడో చూస్తున్నాడూ
అందని కొమ్మకు నిచ్చెన ఏస్తున్నాడూ
అబ్బాయి యాడాడో చూస్తున్నాడూ

లక్షలు వచ్చేదాక కాచుకొన్నాడూ
అందాక మోజులన్ని దాచుకొన్నాడూ
అందాక మోజులన్ని దాచుకొన్నాడూ 

మావయ్యా.. ఓ మావయ్యా హోయ్ హోయ్ ....
మావయ్యా.. ఓ మావయ్యా

పైసలేంది దేవుడైన పలకరించడే అసలు  పలకరించడే
పైసలేంది దేవుడైన పలకరించడే అసలు  పలకరించడే
చూసి చూడనట్లు మొగం తిప్పుకొంటాడే
చూసి చూడనట్లు మొగం తిప్పుకొంటాడే
ముప్పై లక్షలు వచ్చే రోజు వున్నదే
నీకు నాకు జతలేదని రాసివున్నదే

గంగమ్మా.. ఓ గంగమ్మా
గంగమ్మా.. ఓ గంగమ్మా 

చరణం: 2
డాబు సరిగ కూసొంటే డబ్బులొస్తాయా
మాటలు దులిపేసుంటే మూటలొస్తాయా
డాబు సరిగ కూసొంటే డబ్బులొస్తాయా
మాటలు దులిపేసుంటే మూటలొస్తాయా

మావయ్యా నీ సంగతి తెలుసు లేవయ్యా
పిచ్చి పిచ్చి వేషాలు మానుకోవయ్యా
హాయ్.. పిచ్చి పిచ్చి వేషాలు మానుకోవయ్యా
మావయ్యా.. ఓ మావయ్యా హోయ్ హోయ్ ....
మావయ్యా.. ఓ మావయ్యా

రంగడంటే అల్లాటప్ప రంగడు కాదే.. భలే రంగడు వీడే
నలుగురిలో దర్జాగ వెలిగిపోతాడే
నలుగురిలో దర్జాగ వెలిగిపోతాడే
అత్తకొడుకు ఎంతవాడో అపుడు చూస్తావు
అబ్బో అబ్బో అని జేజేలు కొడతావు 

గంగమ్మా.. ఓ గంగమ్మా
గంగమ్మా.. ఓ గంగమ్మా

పగటి కలలు కంటున్న మావయ్యా
గాలి మేడలెన్ని నీవు కట్టావయ్యా
మావయ్యా ఓ మావయ్యా
మావయ్యా ఓ మావయ్యా




పైసా పైసా పైసా పాట సాహిత్యం

 
చిత్రం: భలే రంగడు (1969)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఘంటసాల

పల్లవి:
పరువు నిచ్చేది... దొరను చేసేది
పట్టపగ్గంలేని పదవి తెచ్చేదీ... పైసా

హో... పైసా..పైసా..
పైసా పైసా పైసా హైలెస్సా... హొలెస్సా
పైసా పైసా పైసా హైలెస్సా... హొలెస్సా 

చరణం: 1
కాసుంటే కలకటేరు... కలిగుంటే గవరనేరు
కాసుంటే కలకటేరు... కలిగుంటే గవరనేరు
డబ్బు బాగవుంటే వాడి దెబ్బ కెవరు సాటిరారు

పైసా..పైసా..
పైసా పైసా పైసా హైలెస్సా... హొలెస్సా 

చరణం: 2
ఉంటే నవాబు సాహెబు... సలాం సలాం... ఆదాబ్ బరజ్
లేకుంటే గరీబు..సాహెబు... గులాం గులాం... హాయ్..అల్లా
ఉంటే నవాబు సాహెబు... సలాం సలాం.. 
లేకుంటే గరీబు సాహెబు... గులాం గులాం.. 

డబ్బులేక సుఖంలేదు..సుఖం లేక బ్రతుకు లేదు
డబ్బులేక సుఖంలేదు..సుఖం లేక బ్రతుకు లేదు
అదీ ఇదీ కలిసుంటే..మనిషికేమి లోటులేదు

పైసా..పైసా..
పైసా పైసా పైసా హైలెస్సా... హొలెస్సా 

చరణం: 3 
ప్రతిరోజు చందురుణ్ణి... పలకరించి రావచ్చు
కొండమీద చుక్కపూలు... కోసుకొని తేవచ్చు
ప్రతిరోజు చందురుణ్ణి... పలకరించి రావచ్చు
కొండమీద చుక్కపూలు... కోసుకొని తేవచ్చు 

రవ మువ్వల తెప్ప.. .రవగాలికి తెరచాప
రవ మువ్వల తెప్ప..రవగాలికి తెరచాప
వదిలేసి వలవేసీ... వదిలేసి వలవేసీ
కడలికడుపులో..ముత్యాల్ గంపెడేసి తేవచ్చు

హో... పైసా..పైసా..
పైసా పైసా పైసా హైలెస్సా... హొలెస్సా
పైసా పైసా పైసా హైలెస్సా... హొలెస్సా 





అబ్బబ్బబ్బో చలి... పాట సాహిత్యం

 
చిత్రం: భలే రంగడు (1969)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: కొసరాజు 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు , ఎల్.ఆర్.ఈశ్వరి 

పల్లవి:
అబ్బబ్బబ్బో చలి... అహ ఉహు అహ ఉహు గిలి
నీ ప్రేమకు నే బలీ.. బలి...  బలి  బలి బలి బలి

అబ్బబ్బబ్బో చలి... అహ ఉహు అహ ఉహు గిలి
ఈ దెబ్బతో నువ్... ఖాళి... ఖాళి.. ఖాళి ఖాళి ఖాళి ఖాళి
అబ్బబ్బబ్బో చలి... అహ ఉహు అహ ఉహు గిలి 

చరణం: 1
నిండు ప్రేమలో పడ్డాను... నిట్ట నిలువునా తడిశాను
నిండు ప్రేమలో పడ్డాను... నిట్ట నిలువునా తడిశాను
తడిసీ తడిసీ దారి గానకా... నీ కౌగిటిలో తేలాను

నీతో నేను తడిశాను... నీపై జాలి తలిచాను
నీతో నేను తడిశాను... నీపై జాలి తలిచాను
ఈ భాగ్యానికే వణుకుతు ఉంటే... చేయీ చేయీ కలిపాను

అబ్బబ్బబ్బో చలి... అహ ఉహు అహ ఉహు గిలి
ఈ దెబ్బతో నువ్... ఖాళి.. ఖాళి.. ఖాళి ఖాళి ఖాళి ఖాళి
అబ్బబ్బబ్బో చలి... అహ ఉహు అహ ఉహు గిలి  

చరణం: 2 
గంగీ నీపై నాకుంది... అందుకె ఊపిరి నిలిచింది
గంగీ నీపై నాకుంది... అందుకె ఊపిరి నిలిచింది
కొంగు బట్టుకొని నీతో ఉంటే... వెచ్చ వెచ్చగా ఉంటుందీ

ఒళ్ళు చల్లబడి పోయిందా..ఆ
వేడి వేడి అని అంటుందా..ఊ
ఒళ్ళు చల్లబడి పోయిందా...  వేడి వేడి అని అంటుందా
ఒంటిగ కూర్చొని మంట వేసుకొని... ఇంట్లో ఉంటే సరిపోదా

అబ్బబ్బబ్బో చలి
అహ ఉహు అహ ఉహు గిలి
ఈ దెబ్బతో నువ్.. ఖాళి... ఖాళి...  ఖాళి ఖాళి ఖాళి ఖాళి

అబ్బబ్బబ్బో చలి
అహ ఉహు అహ ఉహు గిలి

చరణం: 3 
దివానుకే మస్క వేశాను... బంగారపు నగ కొట్టేశాను.. ఎట్టా..ఆ
దివానుకే మస్క వేశాను... బంగారపు నగ కొట్టేశాను
రంగుగ నీ మెడలో తగిలించి... రంజు రంజుగా చూస్తాను

బంగారపు నగలొద్దయ్యో.. ఆహా!
సింగారం పని లేదయ్యో.. ఏం
బంగారపు నగలొద్దయ్యో...   సింగారం పని లేదయ్యో
బొంగారమ్ములావున్న నీవే... నా హంగుకు సరిపోతావయ్యో 


అబ్బబ్బబ్బో చలి... అహ అహ అహ అహా గిలి
నీ ప్రేమకు నే బలీ బలి బలి బలి బలీ
అబ్బబ్బబ్బో చలి... అహ ఉహు అహ ఉహు..గిలి
అహ..అహ..అహ..అహా..
అహ..అహ..అహ..అహా.. 




Hip Hip Hurray పాట సాహిత్యం

 
చిత్రం: భలే రంగడు (1969)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఘంటసాల, పి. సుశీల 

పల్లవి:
Hip Hip Hurray... ఓహో భలే
Hip Hip Hurray... ఒహో భలే

చేయి చేయి కలగలపు... నీది నాది తొలి గెలుపు
చేయి చేయి కలగలపు... నీది నాది తొలి గెలుపు

గెలుపే మెరుపై తెలిపెను... తెలిసెను బతుకు బాటలో మలుపు
గెలుపే మెరుపై తెలిపెను... తెలిసెను బతుకు బాటలో మలుపు
Hip Hip Hurray... ఒహో భలే  

చరణం: 1
స్నేహం ఎంతో తీయనా... అది తెలిసిన మనసె చల్లనా
ఓ...ఓ... మ్మ్....మ్మ్...
ఓ...ఓ.....ఓ.....ఓ...ఓ.....ఓ
స్నేహం ఎంతో తీయనా... అది తెలిసిన మనసె చల్లనా

తీయని చల్లని లేత మనసు నీ స్నేహం వలన కమ్మనా...
నా తీయని చల్లని లేతమనసు నీ స్నేహం వలన కమ్మన

Hip Hip Hurray... ఒహో భలే

చరణం: 2 
నీ కన్నులు చెప్పే కథలు... నా మదిలో చిలికెను సుధలు
నీ కన్నులు చెప్పే కథలు... నా మదిలో చిలికెను సుధలు

నీ పెదవుల నవ్వులు వాడని పువ్వులు... ప్రతినవ్వు కురిసెను తేనెలు
నీ పెదవుల నవ్వులు వాడని పువ్వులు... ప్రతినవ్వు కురిసెను తేనెలు
ప్రతినవ్వు కురిసెను తేనెలు

Hip Hip Hurray... ఒహో భలే

చరణం: 3 
పక్కన నీవే ఉంటే... నే కంటా ఎన్నో కలలూ
ఓ...ఓ...మ్మ్...మ్మ్...
ఓ....ఓ......ఓ....ఓ......
పక్కన నీవే ఉంటే... నే కంటా ఎన్నో కలలూ

పండిన కలలో పొంగే అలపై తేలిపోవాలి మనము
పండిన కలలో పొంగే అలపై తేలిపోవాలి మనము

Hip Hip Hurray... ఒహో బలే
చేయి చేయి కలగలపు... నీది నాది తొలి గెలుపు
Hip Hip Hurray... ఒహో భలే
Hip Hip Hurray... ఒహో భలే
Hip Hip Hurray... ఒహో భలే 



పలుకలేని మౌనగీతి... పాట సాహిత్యం

 
చిత్రం: భలే రంగడు (1969)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

పల్లవి:
ఏమిటో... ఇది ఏమిటో ...
పలుకలేని మౌనగీతి... తెలియరాని అనుభూతి...
ఏమిటో....  ఇది ఏమిటో... 

ఏమిటో....  ఇది ఏమిటో
పలుకలేని మౌనగీతి... తెలియరాని అనుభూతి...
ఏమిటో... ఇది ఏమిటో ...

చరణం: 1
అద్దంలో నా నీడ ముద్దుముద్దుగా తోచింది ...
ఆ నీడా నను చూసి అదోలా నవ్వేసిందీ ...
చెప్పకనే చిలిపి పయ్యెదా చప్పున జారిపోయింది ...

ఒంటరిగా...  పడుకుంటే...
ఒంటరిగా పడుకుంటే... కొంటె నిదుర రానంటుందీ ...
ఆహ్ ...

పలుకలేని మౌనగీతి... తెలియరాని అనుభూతి
ఏమిటో...  ఇది ఏమిటో... 

చరణం: 2
చీకటిలో నిదుర రానిచో... చిరుదివ్వెను వెలిగించనా
ఆ చిరువెలుగే పనికిరానిచో... నా కనులే వెలిగించనా
తలపులు దాటిన నా మనసే... తలగడగా అందించనా

కమ్మని కలలే....  పండేదాకా...
కమ్మని కలలే పండేదాకా...
కథలేవో వినిపించనా ... ఆ అ అ అ ఆ ...

ఆహ్ ...

పలుకలేని మౌనగీతి... తెలియరాని అనుభూతి
ఏమిటో...  ఇది ఏమిటో... 

చరణం: 3
గుండెలోనా వలపు మళ్ళీ కొత్తరేకులు విరిసిందీ...
కిటికీలోన జాబిల్లీ కటిక నిప్పులు చెరిగిందీ

విరిసిన వలపే ఘుమఘుమలాడే తరుణం రానే వస్తుంది ...
కోరిన ప్రియుడే సందిట ఉంటే... గుండె చల్లబడి పోతుంది ...
ఆహా... ఊ ...

ఏమిటో... ఇది ఏమిటో ...
పలుకలేని మౌనగీతి... తెలియరాని అనుభూతి ...
ఏమిటో ... ఇది ఏమిటో ...





మెరిసిపోయే ఎన్నెలాయె... పాట సాహిత్యం

 
చిత్రం: భలే రంగడు (1969)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. సుశీల 

పల్లవి:
మెరిసిపోయే ఎన్నెలాయె...
పరుపులాంటి తిన్నెలాయే
నన్ను యిడిసి యాడబోతివిరా...
బంగారు సామి... రేతిరంతా ఏమి సేతునురా

మెరిసిపోయే... ఎన్నెలాయె..
పరుపులాంటి... తిన్నెలాయే
నన్ను యిడిసి... యాడబోతివిరా
బంగారు సామి... రేతిరంతా ఏమి సేతునురా

చరణం: 1
గాలి వీచి ఈలయేసే
పూలసెండు గేలిసేసె
హోయ్..గాలి వీచి ఈలయేసే 
పూలసెండు గేలిసేసె
ఎన్నెలేవో కన్ను గలిపే
సుక్కలన్నీ ఎక్కిరించె
ఎన్నెలేవో... కన్ను గలిపే
సుక్కలన్నీ... ఎక్కిరించె 

నవ్వులా పాలైతి నే కదరా...  బంగారుసామీ..
నువ్వు రానిదీ బతక జాలనురా

మెరిసిపోయే... ఎన్నెలాయె..
పరుపులాంటి... తిన్నెలాయే
నన్ను యిడిసి... యాడబోతివిరా
బంగారు సామి... రేతిరంతా ఏమి సేతునురా

చరణం: 2
కైపు కనులా సిన్నదాన్ని..
సొంపులెన్నో ఉన్నదాన్ని..
కైపు కనులా సిన్నదాన్ని
సొంపులెన్నో ఉన్నదాన్ని   
పడుసు మనసు నిలువదాయె..
గడుసు వయసు గంతులేసె
పడుసు మనసు నిలువదాయె
గడుసు వయసు గంతులేసె 

జంట కోసం కాసుకొన్నారా..రా... రా... బంగారుసామి..
ఒంటిదాన్ని జేసిపొయ్యేవా

మెరిసిపోయే... ఎన్నెలాయె..
పరుపులాంటి... తిన్నెలాయే
నన్ను యిడిసి... యాడబోతివిరా
బంగారు సామి... రేతిరంతా ఏమి సేతునురా


Palli Balakrishna Saturday, December 18, 2021



చిత్రం: శ్రీరామ రక్ష (1978)
సంగీతం: టి. చలపతి రావు
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, జయసుధ
దర్శకత్వం: తాతినేని రామారావు
నిర్మాత: మన సత్యం 
విడుదల తేది: 24.08.1978



Songs List:



శివ శివ శంకర పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ రక్ష (1978)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

శివ శివ శంకర 



భామ సత్యభామ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ రక్ష (1978)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

భామ సత్యభామ 



ప్రేమ పుట్టిందా పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ రక్ష (1978)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

ప్రేమ పుట్టిందా 




ఎంత సుఖం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ రక్ష (1978)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

ఎంత సుఖం 



సిగ్గెందుకింక పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ రక్ష (1978)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

సిగ్గెందుకింక 



వయసు కోడె వయసు పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీరామ రక్ష (1978)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

వయసు కోడె వయసు 

Palli Balakrishna Thursday, August 26, 2021





చిత్రం: మరపురాని మనిషి  (1973)
సంగీతం: కె.వి.మహదేవన్ 
నటీనటులు: నాగేశ్వర రావు, మంజుల, చంద్రమోహన్, జయంతి, బేబీ శ్రీదేవి 
దర్శకత్వం: తాతినేని రామారావు 
నిర్మాత: యన్.యన్.భట్
విడుదల తేది: 23.11.1973



శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా నాగేశ్వరరావు గారితో కలిసి నటించిన సినిమాలు
1. భార్యా బిడ్డలు  (1972)
2. భక్త తుకారాం (1973)
3. మరపురాని మనిషి  (1973) 



Songs List:



వచ్చింది వచ్చింది పాట సాహిత్యం

 
చిత్రం: మరపురాని మనిషి  (1973)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల 

వచ్చింది వచ్చింది




ఓ రామయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: మరపురాని మనిషి  (1973)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి. సుశీల 

ఓ రామయ్యా 



ఎక్కడో లేడులే దేవుడు పాట సాహిత్యం

 
చిత్రం: మరపురాని మనిషి  (1973)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల

ఎక్కడో లేడులే దేవుడు 




ఎవడే ఈ పిలగాడు పాట సాహిత్యం

 
చిత్రం: మరపురాని మనిషి  (1973)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

ఎవడే ఈ పిలగాడు 



ఏం చెప్పను పాట సాహిత్యం

 
చిత్రం: మరపురాని మనిషి  (1973)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

ఏం చెప్పను 

Palli Balakrishna Friday, July 30, 2021



చిత్రం: ఆలుమగలు (1977)
సంగీతం: టి.చలపతిరావు
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ
దర్శకత్వం: తాతినేని రామారావు
నిర్మాత: ఎ. వి. సుబ్బారావు
విడుదల తేది: 11.03.1977



Songs List:



ఎరక్కపోయి వచ్చానూ పాట సాహిత్యం

 
చిత్రం: ఆలుమగలు (1977)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

ఎరక్కపోయి వచ్చానూ



చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసే పాట సాహిత్యం

 
చిత్రం: ఆలుమగలు (1977)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసే
చెయ్యెనా వెయ్యావేమి ఓ బాబూ దొర
చెయ్యెనా వెయ్యావేమి ఓ... బాబూ దొర
ఉయ్యాలలూపావేమీ.....

చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసే
ఇవ్వాలని లేదా ఏమీ....
ఆ సాగసంతా ఇవ్వాలని లేదా ఏమీ
ఓ సిరిపాపా ఎన్నాళ్లు దాస్తావేమీ...

చరణం:1
ముట్టుకుంటే ఉలికిపడతావ్
పట్టుకుంటే జారిపోతావ్ 
ముట్టుకుంటే ఉలికిపడతావ్
పట్టుకుంటే జారిపోతావ్ 
నీ చూపుల్లో ఉందీ సూదంటూరాయీ
అది లాగుతుంటే ఒళ్లంతా హాయి

చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసే
చెయ్యెనా వెయ్యావేమి ఓ బాబూ దొర
చెయ్యెనా వెయ్యావేమి ఓ...బాబూ దొర
ఉయ్యాలలూపావేమీ.....

చరణం:2
చేరుకుంటే ఊరుకుంటావ్
వల్లకుంటే గిల్లుతుంటావ్
చేరుకుంటే ఊరుకుంటావ్
వల్లకుంటే గిల్లుతుంటావ్
నీ చేతల్లో ఉంది చెకుముకి రాయి
అది రాసుకుంటే చురుకైన హాయి

చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసే
ఇవ్వాలని లేదా ఏమీ....
ఆ సాగసంతా ఇవ్వాలని లేదా ఏమీ
ఓ సిరిపాపా ఎన్నాళ్లు దాస్తావేమీ...

చరణం: 3
నిన్ను కట్టుకోవాలని మనసాతది.
చేయి పట్టుకోవాలంటే గుబులౌతది
నిన్ను కట్టుకోవాలని మనసాతది.
చేయి పట్టుకోవాలంటే గుబులౌతది

గుబులెందుకింకా గారాల చిలకా
ఎగిరెగిరిపోదాము సెలవంక దాకా

చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసే
చెయ్యెనా వెయ్యావేమి ఓ బాబూ దొర
చెయ్యెనా వెయ్యావేమి ఓ... బాబూ దొర
ఉయ్యాలలూపావేమీ.....




ఒక్కరిద్దరుగ మారేది పాట సాహిత్యం

 
చిత్రం: ఆలుమగలు (1977)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: వి. రామక్రిష్ణ, పి.సుశీల

ఒక్కరిద్దరుగ మారేది




పరుగెత్తి పాలుతాగేకంటె పాట సాహిత్యం

 
చిత్రం: ఆలుమగలు (1977)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి.సుశీల, మాధవపెద్ది రమేష్, విజయలక్ష్మి శర్మ 

పరుగెత్తి పాలుతాగేకంటె




ర ర ర ర రంకెవేసిందమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: ఆలుమగలు (1977)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

ర ర ర ర రంకెవేసిందమ్మో



తెలుసుకో ఈ జీవితసత్యం పాట సాహిత్యం

 
చిత్రం: ఆలుమగలు (1977)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: యస్.పి. బాలు

తెలుసుకో ఈ జీవితసత్యం

Palli Balakrishna Wednesday, May 12, 2021




చిత్రం: దొరబాబు (1974)
సంగీతం: జె.వి.రాఘవులు 
నటీనటులు: నాగేశ్వర రావు , మంజుల, చంద్రకళ 
దర్శకత్వం: తాతినేని రామారావు 
నిర్మాత: జె. సుబ్బారావు, జి. రాజేంద్రప్రసాద్ 
విడుదల తేది: 31.10.1974



Songs List:



దేవుడెలా వుంటాడని పాట సాహిత్యం

 
చిత్రం: దొరబాబు (1974)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

పల్లవి:
దేవుడెలా వుంటాడని ఎవరైనా అడిగితే
మా అన్నలా వుంటాడని అంటాను నేను
అనురాగమెలా వుంటుందని ఎవరైనా అడిగితే
మా చెల్లిలా వుంటుందని చెబుతాను నేను

చరణం: 1
చెల్లెలున్న యీ యిల్లే సిరిమల్లె తోట
మా....ఆమ్మలు చిరునవ్వే ముత్యాల మూట
అన్నయ్య హృదయమే అందాల మేడ
చెల్లాయికి కలకాలం అది చల్లని నీడ
కన్నతల్లి తీపికలల రూపాలం మనము
కోవెలలో వెలిగించిన దీపాలం మనము

చరణం: 2
అల్లారు ముదుగా నను పెంచినావు
అమ్మనూ నాన్ననూ మరిపించినావు
ఇల్లాలివై నీవు విలసిల్ల వమ్మా
పాపలతోటి చల్లగా వుండవమ్మా 
పుట్టినింటవున్నా, మెట్టినింటవున్నా
అన్నయ్య దీవనే శ్రీరామరక్ష 



చంద్రగిరి చంద్రమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: దొరబాబు (1974)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి.సుశీల, కోరస్

పల్లవి:
చంద్రగిరి చంద్రమ్మా - సందేళ కొస్తానమ్మా
అందాక నలగిపోక - అలసిపోక వుండమ్మా 
చంద్రగిరి చంద్రయ్యా - సందేళ కొస్తానయ్యా
అందాక పనిచేసి - ఆకలేసి వుండయ్యా 

చరణం:
వలమాలిన వయసేమో వెలువంటిది
దాని కాశయాల కానకట్ట వేసుకోవాలి
కోరస్: ఆనకట్టనే వేసుకోవాలి
ఆడది మగవాడు ఆడుతూ పాడుతూ
దాన్ని మళ్ళించి మంచితనం పండించాలి

చరణం:
మట్టినీళ్ళల్లా మనమేకం కావాలి
చెట్టాపట్టగ చేయిపట్టి నడవాలి
కోరస్ : పట్టి నడవాలి
పుట్టినందు కేదైన గట్టి పనిచేయాలి
పుట్టబోయేవాళ్ళు మన పేరు చెప్పుకోవాలి

చరణం:
కావేరి గోదారి గంగా కృషమ్మలను
కలిపేసి నిలవేసి కక్షలను మాపాలి
కోరస్: కక్షలను మాపాలి
ప్రతిపల్లె పెళ్ళికాని పడుచుపిల్ల కావాలి
పంటలక్ష్మి యింటింటా భరతనాట్యమాడాలి



అమ్మమ్మొ.... యీ గుంటడు పాట సాహిత్యం

 
చిత్రం: దొరబాబు (1974)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: రామకృష్ణ, పి.సుశీల

పల్లవి:
అమ్మమ్మొ.... యీ గుంటడు ఎంతకిలాడి
గుచ్చిగుచ్చి చంపుతడు కళ్ళతోటి-దొంగకళ్ళతోటి
అన్నన్న.... యీ కుర్రది టక్కులాడి
బులిపించి చంపుతది మాటలాడి మాయమాటలాడి

చరణం: 1
నీ చెవిలో ఏదో మంత్రమున్నది
తాకగానే నా గుండె కొట్టుకుంటది
చంద్రం తాకితేనే నీ గుండె కొట్టుకుంటది
తాకకుంటె నా గుండె ఆగిపోతది

చరణం: 2
నీ కంట్లో నా నీడ వెచ్చగుంటది
నాకేమో ఆ వేడి ధక్క నంటది
నీడైతే నా కంట్లో కుదురుగుంటది
నువ్వైతే నా ఒళ్లు అలసిపోతది

చరణం: 3
నీ సొగసే నా చూపుకి తిండి పెడతది
పిసినిగొట్టు నీ మనసే కసిరికొడతది
చూపుతో నీ వయసుకు కరువు తీరదు
తీరిస్తే నా సిగ్గుకు పరువు మిగలదు





నీకూ నాకూ పెళ్ళంటే పాట సాహిత్యం

 
చిత్రం: దొరబాబు (1974)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: చెరువు ఆంజనేయ శాస్త్రి
గానం: రామకృష్ణ, పి.సుశీల

పల్లవి: 
నీకూ నాకూ పెళ్ళంటే
నింగి నేలా మురిశాయి
వయసూ సొగసూ కలిబోసి రంగవెల్లి వేశాయి

చరణం: 1
కొత్త కొత్త కోరికలేవో నాలో చెలరేగాయి
కౌగిలిలో బంధిస్తేనే కలత నిదురపోతాయి
తెలిసింది నీ ఎత్తు 
ఆ ఎత్తే గమ్మత్తు
సందెలో విందులా
విందులో — పొందులా

చరణం: 2
ఏడడుగులు నడిచావటే
ఎండమొహం చూడనీయను
వలపు జల్లు తడిసిన ఒళ్లు ఎక్కడ ఆరేసుకోను
నాలోనే వేడుంది
నీ ధోరణి బావుంది
ఎండలో - వానలా
వానలో - హాయిలా

చరణం: 3
మూడు ముళూ వేయకముందే
నన్నల్లరి చెయ్యొద్దు
ఇల్లాలినవి కావాలంటే యివ్వాలి తొలిముద్దు 
ఏమిటి యీ చిలిపితనం
అంతేలే కుర్రతనం
పూవులో - తేటిలా
తేటిలో - పాటలా




వద్దు వద్దు వద్దు పాట సాహిత్యం

 
చిత్రం: దొరబాబు (1974)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: ఆత్రేయ
గానం: రామకృష్ణ, పి.సుశీల

వద్దు వద్దు వద్దు ముద్దు యివ్వొద్దు 
అది తేనెకన్న తియ్యనని చెప్పొద్దు 
నాకు చెప్పొద్దు
వద్దు వద్దు వద్దు ముద్దు వద్దనవద్దు
దాని తీపిఎంతో తెలిసికోక చెప్పద్దు వద్దుచెప్పద్దు 

చరణం: 1
నా పెదవిపై పేరువుంది చదువుకో
నా హృదయమందు రూపముంది చూసుకో
దొరబాబు ఆ పేరు నాదని, రూపు నాదని
నీ చెంప ఎరుపు చెప్పకే చెప్పింది 
ఒప్పుకోమంది 

చరణం: 2
గుప్పెడంత గుండెలోన గుట్టుంది
విప్పలేని చిక్కుముడై వేసింది
చిక్కుముడిని పంటనొక్కి విప్పుకోవచ్చు
గుట్టులన్ని కళ్ళతోటి చెప్పుకోవచ్చు

చరణం: 3
పాట వింటు పరవశించి పోవద్దు 
ఆట కట్టి పోవునని అనుకోవద్దు 
పాట పాడినా పరవశించినా
పగబట్టిన నాగుబాము పడగ దించునా
కాటు మానునా ?



ఒంటరిగా వున్నాను పాట సాహిత్యం

 
చిత్రం: దొరబాబు (1974)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: రామకృష్ణ, పి.సుశీల

పల్లవి: 
ఒంటరిగా వున్నాను
ఇస్సిరిస్సు రంటున్నాను

ఇంతకన్న ఏం చెప్పుకోనురో బావయ్యో
యిడమరిచి చెప్పుకుంటే సిగ్గయ్యో 
పక్కన నేనున్నాను
ఆవురావురంటున్నాను
దారిలేక ఆగానమ్మో చిట్టమ్మో
కంటికేమో కునుకు రాదు ఒట్టమ్మో

నా మనసుకు బుద్దిలేదు పదారేళ్లుగా
బుద్దొచ్చి మరుగుతోంది నాలుగేళ్లుగా
నా మోజుకు రంజులేదు నువ్వు చేరకా
రంజులోన లబ్జులేదు కోర్కెతీరకా

పొద్దు పొడుపు యెందుకనో చురుక్కుమంటది
పొద్దు గుంకితే నాలో కలుక్కుమంటది
పొద్దుకైన వొకరైతే చులకనే మరి
ఇద్దరమూ వొకటైతే వోడిపోతది…





రారా పడకింటికి పాట సాహిత్యం

 
చిత్రం: దొరబాబు (1974)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల

రారా పడకింటికి
నిదుర రాదూ నా కంటికి
తగిన మందివ్వరా - రగిలే నా ఒంటికి

ఎందుకు పడకింటికి పోదాములే పొదరింటికి
తగిన మందుందిలే
రగిలే నీ ఒంటికి ....

చరణం: 
వెచ్చగా చలివేసింది.
మత్తుగా మసకేసింది
కొత్తమోజు రేగింది అది పిచ్చిగా నినుకోరింది
మోజే ప్రేమయితే - ప్రేమే పిచ్చయితే 
ఆ పిచ్చి ముదిరితే - నీ మనసు బెదిరితే
ఆఁ... అందుకే

చరణం: 
ఆడదాని వలపులు ఏటిలోని తరగలు
ఏ గాలికి అవి చెదురునో
ఏ గట్టు తాకీ విరుగునో
నీలాంటి దొరబాబే
నా జంటగా వుంటే
నా మనసు చెదిరిపోదు
యీ వలపు విరిగిపోదు
ఆహాఁ ... అయితే
ఎందుకు పొదరింటికి - పోదాములే పడకింటికీ
తగిన మందుందిలే రగిలే నీ వొంటికీ

Palli Balakrishna Wednesday, March 20, 2019



చిత్రం: సుపుత్రుడు (1971)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: నాగేశ్వరరావు, లక్ష్మీ
దర్శకత్వం: తాతినేని రామారావు
నిర్మాతలు: జాగర్లమూడి సుబ్బారావు, గోరంట్ల రాజేంద్రప్రసాద్
విడుదల తేది: 29.04.1971



Songs List:



అయ్యిందయ్యో, పాట సాహిత్యం

 
చిత్రం: సుపుత్రుడు (1971)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల-సుశీల & బృందం

కోరన్ : 
లేవిడి, లేవిడి, లేవిడి, లేవిడి, లేవిడి, లేవిడి 

అయ్యిందయ్యో, అయ్యిందయ్యో
అమ్మాయిగారి పని అయ్యిందయ్యో ...
బుగ్గమీద ఎరుపుకాస్త తగ్గిపోయింది
ముద్దులుగారే ముఖము వాలిపోయింది

పాపం
వోడిన వాళ్ళకు వేద్దాం వాడిపోయినదండలు
పక్కన అరిచినవాళ్ళకు నెత్తిన సున్నపు కుండలు

కొరస్ : గోవిందా... గోవిందా....

ఓడిన వాళ్ళకు వొచ్చే లో టేముంది
చీకటి వెంబడి వెన్నెల కాచుకు వుంది
కోరస్ : ఆ హ హ...

అల్లరి చెయ్యంగా నే ఏమయ్యింది?
ఒళ్ళు విరుచుకోంగానే ఏమవుతుంది?

అయ్యో, అయ్యో, అయ్యో, అయ్యో
అయ్యిందయ్యో అయ్యిందయ్యో

అమ్మాయిగారి పని అయ్యిందయ్యో
ఎందుకొచ్చిన ఎన్నికా
ఓ అందాల బాలికా
గెలవడమంటే తేలికా
యింటికి పదండి చాలిక

షేమ్, షేమ్. షేమ్....భం....భం...
ఇల్లలకంగానే పండుగ యౌనా?
గెలవంగానే సంబడమౌనా?
దెబ్బకు దెబ్బ తీయకుందుమా?
అబ్బాయిగారి అంతు తేల్చమా?

అయ్యో, అయ్యో, అయ్యో, అయ్యో
అయ్యిందయ్యో అయ్యిందయ్యో -
అమ్మాయిగారి పని అయ్యిందయ్యో

కో కోకొలాలు బలే
యిచ్చారయ్యో 
పచ్చనోట్లు కూడ దెచ్చి
పంచారయ్యో

గావుకేక లేసుకుంటూ
తిరిగారయ్యో
గాడిదతన్నులు బాగా
తిన్నా రయ్యో
బాకాలు ఉదారు కారాలు పట్టారు

కా కా కాకా

లుకలుకలై బెక బెకలై  పొయ్యరయ్యో
అయ్యింది మ్యాం - అయ్యుందయ్య 
అమ్మాయిగారి పని అయ్యిందయ్యో 
అయ్యిందయ్యో - అయ్యిందయ్యో 
అమ్మాయిగారిపని అయ్యిందయో 
అమ్మాయి గారి పని అయ్యిందయ్యో 





ఓహో హో... వయ్యారి పాట సాహిత్యం

 
చిత్రం: సుపుత్రుడు (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సినారె
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
ఓహో హో... వయ్యారి వగలమారి కుమారీ
వై అర్ యు సారీ... వై కాంట్ యు మారి
యు..నో..నో..నో..

ఓహో హో..వయ్యారి వగలమారి కుమారీ
వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ..
యు..నో..నో..నో.. 

చరణం: 1
నడవకు నడవకు అంతజోరుగా... నడుస్తాను నీకేం?
నాకేం..హహహా..
నీ అందాలు చందాలు అలసిపోయేను
నడుము నలిగిపోయేనూ

నడవకు నడవకు అంతజోరుగా..
నీ అందాలు చందాలు అలసిపోయేను
నడుము నలిగిపోయేనూ

చూడకు చూడకు అంత కోరగా
నీ చూపులోని ఎరుపు నాకు కైపులాగ తోస్తుంది
నన్నేదో చేస్తుంది..అహా

ఓహో హో..వయ్యారి వగలమారి కుమారీ
వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ..
యు..సిల్లి.. 

చరణం: 2
పడుచుదనం మిడిచిపాటు ఎంతకాలము
గడుసువాడు తగిలితే... కాళ్ళబేరమూ
పడుచుదనం మిడిచిపాటు ఎంతకాలము
గడుసువాడు తగిలితే... కాళ్ళబేరమూ

ఈ రుసరుసలూ... గుసగుసలూ... ఎందుకమ్మాయి
ఈ రుసరుసలూ... గుసగుసలూ... ఎందుకమ్మాయి
ఇంక పస ఉంటే వేసుకొందం.., రోజూ లడాయి
ప్రతి రోజూ లడాయి

వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ..
అబబబభా..

చరణం: 3
బిగదీయకు బిగదీయకు పైటకొంగును
ఎంత బిగదీస్తే బిగువులంట బైట పడేను
కౌగిట దాచమనేనూ..

బిగదీయకు బిగదీయకు పైటకొంగును
ఎంత బిగదీస్తే బిగువులంట బైట పడేను
కౌగిట దాచమనేనూ..

ఎగదోయకు ఎగదోయకు కోడె గుండెనూ..
ఎగదోయకు ఎగదోయకు కోడె గుండెనూ..
నీవు ఎగతాళికి చేస్తే అది వెంటబడేను
నీ అంతేదో... చూసేను..ఏయ్..

ఓహో హో..వయ్యారి వగలమారి కుమారీ
వై అర్ యు సారీ..వై కాట్ యు మారీ..
యు..నో.. 



చిలకమ్మా పిలిచింది పాట సాహిత్యం

 
చిత్రం: సుపుత్రుడు (1971)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
చిలకమ్మా పిలిచింది... గోరొంకా పలికింది
చిలకమ్మ పిలిచింది... చిగురాకు గొంతుతో
గోరొంక వాలింది... కొండంత ఆశతో

చిలకమ్మ పిలిచింది... చిగురాకు గొంతుతో
గోరొంక వాలింది... కొండంత ఆశతో

చిలకమ్మా.... పిలిచింది
గోరొంకా..... పలికింది

చరణం: 1
ఉరిమేటి మబ్బులే... చిరుజల్లు కురిసేది
చెఱలాడు మనసులే... చెలిమితో కలిసేది
ఉరిమేటి మబ్బులే... చిరుజల్లు కురిసేది
చెఱలాడు మనసులే... చెలిమితో కలిసేది

చినదాని బుగ్గలకు... సిగ్గెపుడు వచ్చేది
చినదాని బుగ్గలకు... సిగ్గెపుడు వచ్చేది
అనుకోని వలపులూ... అప్పుడే తెలిసేది  

చిలకమ్మా.... పిలిచింది
గోరొంకా..... పలికింది

చరణం: 2
ఎఱ్ఱ ఎఱ్ఱగా పూచింది... దానిమ్మ పువ్వు
కుఱ్ఱతనమంతా ఒలికావు... కులుకుల్లోనువ్వు
చలిగాలి వీచింది... ప్రాణాలు జివ్వని
అది గిలిగింత పెట్టితే..అనుకొంటి నువ్వని   

చిలకమ్మా.... పిలిచింది
గోరొంకా..... పలికింది

చరణం: 3
ఆ కొండ ఈ కోన... కలిశాయి మంచులో
నీరెండ తోచింది... నీవున్న తావులో
ఆ కొండ ఈ కోన... కలిశాయి మంచులో
నీరెండ తోచింది... నీవున్న తావులో
ఊగింది మనపడవ... వయ్యారి కొలనులో
ఊగింది మనపడవ... వయ్యారి కొలనులో
సాగాలి మనబ్రతుకు... ఈ తీపి ఊపులో 

చిలకమ్మా పిలిచింది... గోరొంకా పలికింది
చిలకమ్మ పిలిచింది... చిగురాకు గొంతుతో
గోరొంక వాలింది... కొండంత ఆశతో

చిలకమ్మ పిలిచింది... చిగురాకు గొంతుతో
గోరొంక వాలింది... కొండంత ఆశతో

చిలకమ్మా.... పిలిచింది
గోరొంకా..... పలికింది





భలే మంచి చౌక బేరమూ పాట సాహిత్యం

 
చిత్రం: సుపుత్రుడు (1971)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: కొసరాజు 
గానం: ఘంటసాల,

భలే మంచి చౌక బేరమూ
రండి రండి కొనండి 
మాయా బజారున్నది
మంచి బజారున్నదీ 
మాయేదో - మంచేదో
నిజము మీరె తెలుసుకోండి
మాటలమ్ము బూటకాల
బ్లాకు మార్కెటుండి అది

అచ్చమైన కల్పతరువు
కామధేనువండి యిది
వచ్చినవాళ్ళందరికి
నిలువు దోపిడి అక్కడ
కారుచౌకగా దొరికే
అంగడి వున్నది యిక్కడ

చేను పెన అప్పుల్చి
పైరును భోంచెయ్యము
ఆప్పు పెట్టి వడ్డిలకు
ఆస్తి సఫా చెయ్యము
రంగునీళ్ళు పోసి మ దు
లంటూ మసిబుయ్యమూ
బియ్యంలో రాళ్ళు గలిపి
ముట్లైనా వెయ్యము

వేషాలు మోసాలూ
కో కొలలు అక్కడ
న్యాయం ధర్మం నడిచే
పద్ధతులున్నవి యిక్కడ

గుత్త పెట్టుబడిదారుల
గురుడున్నా దక్కడ
నలుగురినీ కూడగట్టు
నాయకుడున్నా డిక్కడ




ఏమివ్వను నీకేమివ్వను.. పాట సాహిత్యం

 
చిత్రం: సుపుత్రుడు (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల 

పల్లవి:
ఏమివ్వను నీకేమివ్వను.. 
నా మనసే నీదైతే ఏమివ్వను
ఏమివ్వను నీకేమివ్వను.. 
నా మనసే నీదైతే ఏమివ్వను

నన్నే వలచి నా మేలు తలచి
నన్నే వలచి నా మేలు తలచి
లేని కళంకం మోసిన ఓ చెలీ మచ్చలేని జాబిలి

ఏమివ్వను నీకేమివ్వను
నా మనసే నీదైతే ఏమివ్వను

చరణం: 1
తారకలే కోరికలై మెరియగా కనులు విరియగా
వెన్నెలలే వేణువులై పలుకగా మధువు లొలుకగా
యుగయుగాలు నిన్నే వరియించనా
నా సగము మేన నిన్నే ధరియించనా..

ఏమివ్వను నీకేమివ్వను..
నా మనసే నీదైతే ఏమివ్వను
ఏమడుగను ఇంకేమడుగను..
నీ మనసే నాదైతే ఏమడుగను

చరణం: 2
నీ కన్నుల వెలుగులే తారకలై... నయన తారకలై
నీ నవ్వుల జిలుగులే చంద్రికలై... కార్తీక చంద్రికలై
జగమంతా నీవే అగుపించగా...
నీ సగము మేన నేనే నివసించగా

ఏమడుగను ఇంకేమడుగను..
నీ మనసే నాదైతే ఏమడుగను

నిన్నే వలచి నీ మేలు తలచి...
నిన్నే వలచి నీ మేలు తలచి
బ్రతుకే నీవై పరవశించు చెలినీ... నీ జాబిలినీ

ఏమడుగను ఇంకేమడుగను..
నీ మనసే నాదైతే ఏమడుగను
ఆహాహా... ఆహాహా... ఆహాహహా...

Palli Balakrishna Monday, March 4, 2019



చిత్రం: ప్రెసిడెంట్ గారి అబ్బాయి (1987)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: బాలకృష్ణ , సుహాసిని
కథ, మాటలు: పరుచూరి బ్రదర్స్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తాతినేని రామారావు
నిర్మాత: ఎ. వి.సుబ్బారావు
విడుదల తేది: 12.05.1987



Songs List:



ముద్దు పెట్టకుంటే పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ గారి అబ్బాయి (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

పల్లవి:
ముద్దు పెట్టకుంటే ముక్కు పచ్చడంట
వద్దు వెళ్లమంటే వళ్ళు హూనమంట
చాలులే ఆపవే నీ టెక్కులు
ఆపవే తిక్కలు తైతక్కలు
హో బుల్లి కారు పిల్లదాన బుంగమూతి చిన్నదాన
పెట్టూ ముద్దు పెట్టు హ హ హా
పెట్టూ ముద్దు పెట్టు  పెట్టు పెట్టు

చరణం: 1
కొండముచ్చు కోమలాంగి కొంగుబడితే
పొంగుతున్న ఈడు గట్టు తెంచుకుంటే 
టిప్పు టాపు గౌను ఇట్టా దెబ్బతింటే
తుప్పురాలి తప్పులన్ని వప్పుకుంటే
పట్టు తప్పి వళ్ళు కాస్త పంచరైతే
పక్కనున్న చుక్కలన్ని భగ్గుమంటే
చంపలేసుకో నువ్వు చంచలాక్షి
చెంత చేరుకో నువ్వు చెంచు లక్ష్మీ
పందెమేసి పారిపోయే పంకజాక్షి

పెట్టూ ముద్దు పెట్టు హ హ హా
పెట్టూ ముద్దు పెట్టు  పెట్టు పెట్టు

ము ము ముద్దు పెట్టకుంటే ముక్కు పచ్చడంట
అరె వద్దు వెళ్లమంటే వళ్ళు హూనమంట
చాలులే ఆపవే నీ టెక్కులు
ఆపవే తిక్కలు తైతక్కలు
హో బుల్లి కారు పిల్లదాన బుంగమూతి చిన్నదాన
పెట్టూ ముద్దు పెట్టు తకిట దిమి
పెట్టూ ముద్దు పెట్టు  పెట్టు పెట్టు

చరణం: 2
బొంగరాల బీడుకాడ బోర్ల పడితే
ఆ బూరెలాగ బుగ్గ కాస్త వాచిపోతే
అరె గింగిరాల గిత్తదూడ వెంటబడితే
అ కిందపడ్డ చందమామ కందిపోతే
గాజులన్ని చిట్లిపోయి ఘల్లుమంటే
గుచ్చుకున్న కన్నెపిల్ల ఘొల్లుమంటే
చేతులట్టు కున్నాక చెమ్మచెక్క
కాళ్ళు పట్టుకున్నాక పూల పక్క
ఓ నిక్కులాడి టక్కులాడి నిబ్బరాల నీరజాక్షి

పెట్టూ ముద్దు పెట్టు అరెరరె
పెట్టూ ముద్దు పెట్టు  హ హ హా




చెక్కం చెక్కం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ గారి అబ్బాయి (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి. సుశీల 

చెక్కం చెక్కం 



ఎగిరింది ఎగిరింది పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ గారి అబ్బాయి (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి. సుశీల 

ఎగిరింది ఎగిరింది 




చిత్రాంగి పిలిచింది పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ గారి అబ్బాయి (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్. జానకి 

చిత్రాంగి పిలిచింది 



ఏడ నుండి వస్తే పాట సాహిత్యం

 
చిత్రం: ప్రెసిడెంట్ గారి అబ్బాయి (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల 

ఏడ నుండి వస్తే 

Palli Balakrishna Sunday, March 25, 2018



చిత్రం: తల్లిదండ్రులు (1991)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: బాలక్రిష్ణ , విజయశాంతి
దర్శకత్వం: తాతినేని రామారావు
నిర్మాత: ఎ. వి.సుబ్బారావు
విడుదల తేది: 11.02.1991



Songs List:



కృష్ణా నవనందా పాట సాహిత్యం

 
చిత్రం: తల్లిదండ్రులు (1991)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, చిత్ర

కృష్ణా నవనందా 



వినవమ్మా వినవమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: తల్లిదండ్రులు (1991)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి. శైలజ, సుజాత 

వినవమ్మా వినవమ్మా 



చామంతి పువ్వంటి పాట సాహిత్యం

 
చిత్రం: తల్లిదండ్రులు (1991)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి. బాలు, చిత్ర 

చామంతి పువ్వంటి 





చిటికేసే చింతామణి పాట సాహిత్యం

 
చిత్రం: తల్లిదండ్రులు (1991)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి. బాలు, చిత్ర 

చిటికేసే చింతామణి 




పందిరి మంచం పాట సాహిత్యం

 
చిత్రం: తల్లిదండ్రులు (1991)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, చిత్ర 

పందిరి మంచం 

Palli Balakrishna



చిత్రం: పచ్చని కాపురం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: కృష్ణ , శ్రీదేవి
దర్శకత్వం: తాతినేని రామారావు
నిర్మాత: మిద్దె రామారావు
విడుదల తేది: 07.09.1985



Songs List:



కొత్తగా మత్తుగా పాట సాహిత్యం

 
చిత్రం: పచ్చని కాపురం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: కె.జె.జేసుదాస్, యస్.జానకి

కొత్తగా మత్తుగా 




ముక్కు మీద కోపం పాట సాహిత్యం

 
చిత్రం: పచ్చని కాపురం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల 

ముక్కు మీద కోపం 



వెన్నెలైనా చీకటైనా పాట సాహిత్యం

 
చిత్రం: పచ్చని కాపురం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: కె.జె.జేసుదాస్

వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా




వెన్నెలైనా చీకటైనా పాట సాహిత్యం

 
చిత్రం: పచ్చని కాపురం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.జానకి

వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా



వెన్నెలైనా చీకటైనా పాట సాహిత్యం

 
చిత్రం: పచ్చని కాపురం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: కె.జె.జేసుదాస్, యస్.జానకి

(ఈ పాటను  ప్రేమకథా చిత్రమ్ (2013)  సినిమాలో  రీమిక్స్ చేయబడింది.  సుదీర్ బాబు, నందిత  నటించిన ఆ చిత్రానికి  J.B గారు సంగీతాన్ని స్వరపరచగా,  మలవిక, రేవంత్  ఆలపించారు )

పల్లవి:
వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా
నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధము (2)
నింగి నేల సాక్ష్యాలు (2)
ప్రేమకు మనమే తీరాలు॥

చరణం: 1
జ్ఞాపకమేదో నీడల్లో తారాడే
స్వప్నాలేవో నీ కళ్లు దోగాడే
కౌగిలింతలోన గాలి ఆడకూడదు
చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు
నీ సర్వము నాదైనది...
నేను దేహమల్లే నీవు ప్రాణమల్లే 
ఏకమైన రాసలీలలోనా॥

చరణం: 2
అంతంలేని ఈ రాగబంధంలో
అంచున నిలిచి నీవైపే చూస్తున్నా
పున్నమింట కట్టుకున్న పూలడోలలు
ఎన్నడింక చెప్పవమ్మ బారసాలలు
ఆ ముద్దులే మూడైనవి...
బాలచంద్రుడొస్తే నూలు పోగులిస్తా 
ఇంటిదీపమాయె జంట ప్రేమ




నా ప్రేమ రాగం పాట సాహిత్యం

 
చిత్రం: పచ్చని కాపురం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: కె.జె.జేసుదాస్, యస్.జానకి

నా ప్రేమ రాగం  తుదిలేని గీతం 
ఏ జన్మకైనా జరిగిపోని రాగ బంధం 
ఏనాడు మరచి నన్ను వడలిపోకు నేస్తం 

Palli Balakrishna Sunday, December 10, 2017





చిత్రం: మంచి మిత్రులు (1969)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర, డా॥ సి. నారాయణరెడ్డి, దాశరధి 
పాటలు: ఘంటసాల, పి.సుశీల. యస్.పి.బాలు 
నటీనటులు: కృష్ణ , శోభన్ బాబు, విజయనిర్మల, గీతాంజలి 
మాటలు: బమిడిపాటి రాధాకృష్ణ 
దర్శకత్వం: తాతినేని రామారావు
నిర్మాత: పి.మల్లికార్జున రావు
విడుదల తేది: 12.01.1969



Songs List:



అరె నిషా నిషా పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మిత్రులు (1969)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం:
గానం:  

అరె నిషా నిషా 




ఎన్నాళ్ళో వేచిన ఉదయం...పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మిత్రులు (1969)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం:  యస్.పి.బాలు, ఘంటసాల

పల్లవి:
ఎన్నాళ్ళో వేచిన ఉదయం...  ఈనాడే ఎదురౌతుంటే
ఇన్ని నాళ్ళు దాచిన హృదయం...  ఎగసి ఎగసి పోతుంటే
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి 
 
చరణం: 1
మంచిని పెంచిన మనిషిని... ఏ వంచన ఏమీ చేయదని
నీతికి నిలబడు వానికి... ఏ నాటికి ఓటమి లేదని
నీతికి నిలబడు వానికి... ఏ నాటికి ఓటమి లేదని
నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలనివస్తే
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి 
  
చరణం: 2
నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని
కత్తులు విసిరేవానిని... ఆ కత్తితోనె గెలవాలని
కత్తులు విసిరేవానిని... ఆ కత్తితోనె గెలవాలని
నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే

ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి 

ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే
ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసి పోతుంటే
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి 



ఎంతో ఉన్నది పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మిత్రులు (1969)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: 
గానం:  


ఎంతో ఉన్నది 




నాలుగువైపులా పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మిత్రులు (1969)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: 
గానం:  

నాలుగువైపులా 



ఓర చూపులు పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మిత్రులు (1969)
సంగీతం: యస్.పి.కోదండపాణి
సాహిత్యం: 
గానం:  

ఓర చూపులు 

Palli Balakrishna

Most Recent

Default