చిత్రం: ఊరుకి మొనగాడు (1981) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి , ఆరుద్ర నటీనటులు: కృష్ణ, జయప్రద దర్శకత్వం: కె.రాఘవేంద్ర రావు నిర్మాత: ఎ.గోపాలకృష్ణ విడుదల తేది: 11.01.1981
Songs List:
కదలిరండి మనుషులైతే పాట సాహిత్యం
చిత్రం: ఊరుకి మొనగాడు (1981) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: ఆరుద్ర గానం: యస్.పి.బాలు కదలిరండి మనుషులైతే కలిసిరండి మమత వుంటే ఉప్పెనలా.. ఉమ్మడిగా... ఉప్పెనలా.. ఉమ్మడిగా... దివి తుఫాను బలి కోరిన దీనుల కోసం బతకలేని చావలేని ప్రాణుల కోసం చెలియలి కట్టను తెంచి చెలిమిని మరచి కడలి అనే కాలనాగు కాటేసింది తాడి ఎత్తు తరగలు తన పడగలుగా మమతల మాగాణమే మసి అయిపోగా తెలుగు తల్లి విలపించెను భోరు భోరునా తెలుగు తల్లి విలపించెను భోరు భోరునా పొంగే కన్నీరే క్రిష్ణా గోదావరిలా అమ్మా అని అలమటించు బిడ్డకేమి తెలుసు అమ్మ ఇంక రాదని అమ్మనేది లేదని బిడ్డ కొరకు తల్లడిల్లు తల్లి కేమి తెలుసు ఆ తల్లి కెవరు చూపిస్తారు తన పక్కనే ఉన్న బిడ్డ శవాన్ని కౌగిట్లో కనుమూసిన ఆలుమగలు వీళ్లు కళ్ళే కనిపించకా... తన వాళ్ల పిలుపు వినిపించకా... చావు కొరకు ఒంటరిగా బతుకుతున్న ముసలి వాళ్ళు తెలుగుతల్లి సిరిమువ్వల కంఠాహారమే హతశిశువుల మృత పశువుల అగ్రహారమై పోయెను హతశిశువుల మృత పశువుల అగ్రహారమై పోయెను
అందాల జవ్వని.. పాట సాహిత్యం
చిత్రం: ఊరుకి మొనగాడు (1981) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: అందాల జవ్వని.. మందార పువ్వని... అందాల జవ్వని.. మందార పువ్వని... నేనంటె నువ్వని.. నువ్వంటే నవ్వని కలిసిందిలే కన్ను కలిసిందిలే.. తెలిసిందిలే మనసు తెలిసిందిలే అందాల గువ్వని... రాగాల రవ్వని.. నేనంటే నువ్వని.. నువ్వంటే నవ్వని కలిసిందిలే కన్ను కలిసిందిలే.. తెలిసిందిలే మనసు తెలిసిందిలే చరణం: 1 గోదారి నవ్వింది.. పూదారి నవ్వింది ఆ నవ్వు ఈ నవ్వు అందాలు రువ్వింది చిలకమ్మ నవ్వింది.. గొరవంక నవ్వింది ఆ నవ్వు ఈ నవ్వు నెలవంకలయ్యింది వెలుగుల్లో నీ రూపు వెన్నెళ్లు కాచే వేళ జిలుగైన సొగసంతా సిరిపైటలేసే వేళ చినుకంటి నీ కన్ను చిటికేసి పోయే వేళ తెలుగుల్లో నా వలపు తొలి పాట పాడింది అందాల గువ్వని... రాగాల రవ్వని.. చరణం: 2 వయసొచ్చి నవ్వింది.. మనసిచ్చి నవ్వింది వలపల్లే వాలాడు పొద్దుల్లో నవ్వింది పూరెమ్మ నవ్వింది.. పులకింతా నవ్వింది నూగారు బుగ్గల్లో ముగ్గల్లే నవ్వింది నీరాటి రేవుల్లో నీడల్లు ఆడే వేళ నాలాటి ఊహల్లే మాటొచ్చి పాడె వేళ బంగారు మలి సంధ్య రాగాలు తీసే వేళ మబ్బుల్లో ఓ మెరుపు నను చూసి నవ్వింది ఆ.. అహ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
మొగ్గ పిందే పాట సాహిత్యం
చిత్రం: ఊరుకి మొనగాడు (1981) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి గానం: యస్.పి.బాలు, పి.సుశీల మొగ్గ పిందేల నాడే బుగ్గ పిండేసి నాడే
ఇదిగో తెల్ల చీర పాట సాహిత్యం
చిత్రం: ఊరుకి మొనగాడు (1981) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: ఇదిగో తెల్ల చీరా ఇదిగో మల్లె పూలు ఇదిగో తెల్ల చీర ఇదిగో మల్లె పూలు తెల్ల చీర కట్టుకో మల్లె పూలు పెట్టుకో తెల్లార్లు నా పేరు వల్లించుకో - ఎందుకు ఇదే అసలు రాత్రి ఇదే అసలు రాత్రి ఇదిగో తెల్ల చీరా ఇదిగో మల్లె పూలు ఇదిగో తెల్ల చీర ఇదిగో మల్లె పూలు తెల్ల చీర కట్టినా మల్లె పూలు పెట్టినా తెల్లార్లు నీ పేరు వల్లించుతా - ఎందుకు ఇదే అసలు రాత్రి ఇదే అసలు రాత్రి చరణం: 1 కాకి చేత పంపిస్తే కబురందిందా కళ్ళారా చూడగానే కథ తెలిసిందా (2) ఊరుకున్నా ఊసు పోనీ ఊవిళ్ళు ఓపలేని పిల్లకయ్యొ వేవిళ్ళూ ఆలు లేదు.. చూలు లేదు కొడుకు పేరు సోమలింగం ఆదిలోనే బారసాల చేసుకోవా సీమంతం.. ఓలొ..లో..లో..హాయ్...ఓలొ..లో..లో..హాయ్... ఇదిగో తెల్ల చీర... ఇదిగో మల్లె పూలు... ఇదిగో తెల్ల చీర... ఇదిగో మల్లె పూలు తెల్ల చీర కట్టుకో మల్లె పూలు పెట్టుకో తెల్లార్లు నా పేరు వల్లించుకో - ఎందుకు ఇదే అసలు రాత్రి ఇదే అసలు రాత్రి చరణం: 2 సూది కోసం సోదికెళితే సుడి తిరిగిందా.. మొగమాటం అనుకుంటే ముంచుకొచ్చిందా.. సూది కోసం సోదికెలితే సుడి తిరిగిందా ... మొగమాటం అనుకుంటే ముంచుకొచ్చిందా .. కట్టవయ్యా నట్టింటా ఉయ్యాలా పొద్దైనా అయ్యో నువ్వే ఊపాలా.. నేనే జోల పాడుతుంటే నువ్వు నిద్దర పోతావా అయ్యా మీరు పక్కనుంటే అసలే నిద్దర పడుతుందా.. ఉలులు..లుల..హాయ్... ఆఁ...ఉలులు..లుల..హాయ్...ఆఁ... ఇదిగో తెల్ల చీర ఇదిగో మల్లె పూలు అహా ఇదిగో తెల్ల చీర ఇదిగో మల్లె పూలు తెల్ల చీర కట్టినా మల్లె పూలు పెట్టినా తెల్లార్లు నీ పేరు వల్లించుతా - ఎందుకు ఇదే అసలు రాత్రి ఇదే అసలు రాత్రి
బూజం బంతి బూజంబంతి పాట సాహిత్యం
చిత్రం: ఊరుకి మొనగాడు (1981) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి గానం: యస్.పి.బాలు, పి.సుశీల బూజం బంతి బూజంబంతి
ఎర్ర తోలు పాట సాహిత్యం
చిత్రం: ఊరుకి మొనగాడు (1981) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి గానం: యస్.పి.బాలు, పి.సుశీల ఎర్ర తోలు బుర్ర ముక్కు అమ్మాయి
