Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Pelli Choopulu (1983)

చిత్రం:  పెళ్ళి చూపులు (1983)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:  ఆచార్య ఆత్రేయ
గానం:  యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: చంద్రమోహన్, విజయశాంతి
దర్శకత్వం: పి.సాంబశివరావు
నిర్మాత: శశిభూషన్
విడుదల తేది: 01.01.1983

పల్లవి:
నువ్వు నేను సగం సగం... సగం సగం చేరి మనం
ఒకే దేహం ఒకే ప్రాణం... ఒకే రాగం ఒకే గీతం
ఔదాం ప్రేమలో... లోకం చూపులో

నువ్వు నేను సగం సగం... సగం సగం చేరి మనం
ఒకే దేహం ఒకే ప్రాణం... ఒకే రాగం ఒకే గీతం
ఔదాం ప్రేమలో... లోకం చూపులో

చరణం: 1
ఈ జోరులో.. ఈ హోరులో... ఎదురీది పోద్దాము గోదారిలో
ఏ తీరమో... ఏ లోకమో... మనమందుకుంద్దాము ఈ నావలో
ఈ జోరులో.. ఈ హోరులో... ఎదురీది పోద్దాము గోదారిలో
ఏ తీరమో... ఏ లోకమో... మనమందుకుంద్దాము ఈ నావలో

నీ ఊపిరే నాకు తెరచాపలా... నీ చూపులే నాకు చుక్కానిగా...
నీ ఊపిరే నాకు తెరచాపలా... నీ చూపులే నాకు చుక్కానిగా...

కలసిపోద్దాములే వలపుల కడలిలో...

నువ్వు నేను సగం సగం... సగం సగం చేరి మనం
ఒకే దేహం ఒకే ప్రాణం... ఒకే రాగం ఒకే గీతం
ఔదాం ప్రేమలో... లోకం చూపులో

చరణం: 2
చిరుగాలిలో విరితావిలా... విడదీయగా లేని అనుబంధమై
గగనానికి భువనానికి... తొలిసంధ్య కెంజాయ సంబంధమై

చిరుగాలిలో విరితావిలా... విడదీయగా లేని అనుబంధమై
గగనానికి భువనానికి... తొలిసంధ్య కెంజాయ సంబంధమై

అనురాగ రాగాల చిరుజల్లుగా... అపురూప రూపాల హరివిల్లుగా
అనురాగ రాగాల చిరుజల్లుగా... అపురూప రూపాల హరివిల్లుగా
కలిసి జీవించుద్దాం.. కలిమిలేమిలో...

నువ్వు నేను సగం సగం... సగం సగం చేరి మనం
ఒకే దేహం ఒకే ప్రాణం... ఒకే రాగం ఒకే గీతం
ఔదాం ప్రేమలో... లోకం చూపులో

******  ******  ******

చిత్రం:  పెళ్ళి చూపులు (1983)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:  ఆచార్య ఆత్రేయ
గానం:  యస్.పి.బాలు, సుశీల

పల్లవి:
నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని ..
నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని
ఎన్నోనాళ్ళు ఎన్నో ఏళ్ళు వున్నా నువ్వే వస్తావనీ
వస్తే ప్రాణం వస్తుందనీ... నువ్వొస్తే ప్రాణం వస్తుందనీ

నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని
ఎన్నోనాళ్ళు ఎన్నో ఏళ్ళు వున్నా నువ్వే వస్తావనీ
వస్తే ప్రాణం వస్తుందనీ... నువ్వొస్తే ప్రాణం వస్తుందనీ

చరణం: 1
కిట్టయ్యంటే నువ్వేనని పిల్లనగ్రోవి నేనేనని
పెదవుల పైనే వుండాలని పదములు ఎన్నో పాడాలని
కిట్టయ్యంటే నువ్వేనని... పిల్లనగ్రోవి పైనే వుండాలని
పదములు ఎన్నో పాడాలని

బృందావనం తగదనీ అందరితో తగువనీ...
బృందావనం తగదనీ అందరితో తగువనీ
యమున దాటి వెళ్ళాలని వేచివున్న వెర్రిదాన్ని...

నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని
ఎన్నోనాళ్ళు ఎన్నో ఏళ్ళు వున్నా నువ్వే వస్తావనీ
వస్తే ప్రాణం వస్తుందనీ... నువ్వొస్తే ప్రాణం వస్తుందనీ

చరణం: 2
సీతమ్మంటే నువ్వేనని రాముడు నేనై వుండాలని
రావణుడెవ్వడు రారాదని రామాయణం కారాదని
సీతమ్మంటే నువ్వేనని రాముడు నేనై వుండాలని
రావణుడెవ్వడు రారాదని రామాయణం కారాదని

పగలు పగలు అనుకుని.. రాత్రి రాత్రి కలగని
పగలు పగలు అనుకుని.. రాత్రి రాత్రి కలగని
కలే నిజం అవుతుందని కాచుకున్న పిచ్చివాణ్ణీ ..

నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని
ఎన్నోనాళ్ళు ఎన్నో ఏళ్ళు వున్నా నువ్వే వస్తావనీ
వస్తే ప్రాణం వస్తుందనీ... నువ్వొస్తే ప్రాణం వస్తుందనీ

ఆహాహాహా... హాహాహహా...ఆహాహాహా... హాహాహహా

******  ******  ******

చిత్రం:  పెళ్ళి చూపులు (1983)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:  ఆచార్య ఆత్రేయ
గానం:  యస్.పి.బాలు, సుశీల

పల్లవి:
దాసోహం.. దాసోహం.. దాసోహం ...
దాసోహం.. దాసోహం.. దాసోహం

మల్లెలాంటి మనసుకు.. మనసులోని చలువకు
చలువలోని చెలిమికి .. దాసోహం
మల్లెలాంటి మనసుకు .. మనసులోని చలువకు
చలువలోని చెలిమికి .. దాసోహం

దాసోహం దాసోహం దాసోహం.. దాసోహం దాసోహం దాసోహం

వెల్లువంటి మనిషికి .. మనిషిలోని దుడుకుకు ..
దుడుకులోని ప్రేమకు .. దాసోహం
వెల్లువంటి మనిషికి .. మనిషిలోని దుడుకుకు ..
దుడుకులోని ప్రేమకు .. దాసోహం

దాసోహం దాసోహం దాసోహం ...దాసోహం దాసోహం దాసోహం

చరణం: 1
నేల పరిచింది పూలబాట నీ నడకకు
గాలి పాడింది స్వాగతాలు నీ రాకకు
నేల పరిచింది ఈ పూలబాట నీ నడకకు
గాలి పాడింది స్వాగతాలు నీ రాకకు

ఎదురు వచ్చింది నీ చూపు నా తోడుకు
ఎదురు వచ్చింది నీ చూపు నా తోడుకు
కలిసి నడిపింది.. కబురులాడింది.. కడకు చేర్చింది నీ నీడకు

మల్లెలాంటి మనసుకు.. మనసులోని చలువకు..
చలువలోని చెలిమికి.. దాసోహం
వెల్లువంటి మనిషికి.. మనిషిలోని దుడుకుకు ..
దుడుకులోని ప్రేమకు.. దాసోహం

దాసోహం దాసోహం దాసోహం... దాసోహం దాసోహం దాసోహం

చరణం: 2
నడక నేర్పింది నీ పిలుపే నా కాళ్ళకి
పలుకు నేర్పింది నీ పేరే నా పెదవికి
నడక నేర్పింది నీ పిలుపే నా కాళ్ళకి
పలుకు నేర్పింది నీ పేరే నా పెదవికి

తలుపు తెరిచింది నీ రూపే నా మనసుకి..
తలుపు తెరిచింది నీ రూపే నా మనసుకి..
అడుగు పెట్టింది.. దీపమెట్టింది.. దేవతయ్యింది నా ఇంటికి

వెల్లువంటి మనిషికి.. మనిషిలోని దుడుకుకు ..
దుడుకులోని ప్రేమకు.. దాసోహం
మల్లెలాంటి మనసుకు.. మనసులోని చలువకు ..
చలువలోని చెలిమికి.. దాసోహం

దాసోహం దాసోహం దాసోహం... దాసోహం దాసోహం దాసోహం

Most Recent

Default