Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Andamaina Anubhavam (1979)
చిత్రం: అందమైన అనుభవం (1979)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
నటీనటులు: కమల్ హాసన్ , రజినీకాంత్, జయప్రద, జయసుధ
దర్శకత్వం: కె.బాలచందర్
నిర్మాత: ఆర్.వెంకట్రామన్
విడుదల తేది: 19.04.1979Songs List:ఆనంద తండవమో పాట సాహిత్యం

 
చిత్రం: అందమైన అనుభవం (1979)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

ఆనంద తాండవమే
ఆడెనుగా ఆ శివుడు అనాదిగా
అదే నేను చేస్తున్నా ఏడవకండి
అనుభవము కావాలంటే మీరు వెయ్యండి
దివిలోని దేవతలు తాగేది సుధాపానము
భువిలోని మానవులు తాగేదే సురాపాకము
సుధకు సురకు ఒకటే మొదలు - హే రాథా రమణ గోవిందా

హరె హరె రామ హరే హరె కృష్ణా
హరె హరె హరె రామ హరె హారె కృష్ణా

సూర్యుడ్ని చంద్రుడ్ని రమ్మంటాం రమ్మిస్తాం
చుక్కలకు దిక్కులకు విస్కీతో విందిస్తాం
పొసెయ్ బ్రాందీ పోనీయ్ భ్రాంతి - హేరాధా రమణ గోవిందా

హరె హరె రామ హరే హరె కృష్ణా
హరె హరె హరె రామ హరె హారె కృష్ణా 

జాతిమతం జబ్బులకు - మందొకటే మందంటాం
నీ దేశం నా దేశం - ఎల్లలనే చెరిపేస్తాం.
పెరిగే మనకు జగమే ఇరుకు - హే రాధారమణ గోవిందా
హరె హరె రామ ..... హరే హరే కృష్ణా
హరె హరె హరె.... హరెహరేరామ హరే హరె కృష్ణా అందమైన లోకముంది పాట సాహిత్యం

 
చిత్రం: అందమైన అనుభవం (1979)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, ఎల్.ఆర్.ఈశ్వరి

అందమైన లోకముంది అనుభవించు ప్రాయముంది
లవ్లీ బార్డ్స్... ఇక చింతలేల చీకులే.....
చేయి చేయి కలపరేల - జల్లీ బర్డ్స్ 
ఈ వయసుండదు ఎల్లకాలము ఈ వింతబతుకు అంతుచూతము
పాడుతూ ఆడండి - ఆడుతూ పాడండి
హాయిగ నవ్వండి …. అందరూ రారండి

కోరస్:
జుజ్జూ జుజుజూ - జుజ్జూ జుజూజూ  జుజ్జూ జుజూజూ 

నవ్వై నవ్వాలి పువ్వై పూయాలి గాలై పంచాలి - తావి
స్వరమై పలకాలి, పదమై పాడాలి లయవై ఆడాలి, కేలిళి
రసడోల ఊగాలి... కసితోటిబతకాలి ఇక ప్రతిరోజు కావాలి హాలి
పెరిగే పాపల్లే, మెరిసే మెరుపల్లె ఉరికే ఎరల్లే పరుపం సాగాలి

కోరస్:
జుజ్జూ జుజుజూ - జుజ్జూ జుజూజూ  జుజ్జూ జుజూజూ 

అందమైన లోకముంది – అనుభవించు ప్రాయముంది. లవ్లీ బార్డ్స్
ఇక చింతలేల - చీకులేల - చేయి చేయి కలపరేల జాలీ బార్డ్స్..
జుజ్జూ జుజుజూ - జుజ్జూ జుజూజూ  జుజ్జూ జుజూజూ 

లాల్లా లలా ల్లాల్లా లల్లా లల్లాల్లా లాల్లా లల్లాల్లా

వలపే వసంతం  తలపే అనంతం  మనసేమనకున్న అందం
మనమే సంగీతం, మనదే సంతోషం - మనకేలే పూలవర్షం 
ఇది సత్యం. ఇది నిత్యం - ఇది స్వర్గం, ఇది స్వంతం
ఇది ఆనందమేలే స్వరాజ్యం వయసే నీ గర్వం
సొగసే నీ సర్వం - సుఖమే నీ వేదం - శుభమే నీ నాదం

జుజ్జూ జుజుజూ - జుజ్జూ జుజూజూ  జుజ్జూ జుజూజూ

అందమైన లోకముంది – అనుభవించు ప్రాయముంది. లవ్లీ బార్డ్స్
ఇక చింతలేల - చీకులేల - చేయి చేయి కలపరేల జాలీ బార్డ్స్..

కాలే మతాబు కళ్ళకు ముస్తాబు కలలకు కావు గరీబు
లెక్కల కితాబు, రాసే షరాబుకు నువ్వే తగ్గ జవాబు
నువ్వు నిప్పు, నువ్వు నీరు - నువ్వు రాత్రి, నువ్వు పగలు
నువ్వు కాలాల్ని నిలవేయగలవు
నిప్పే నా గానం, నీరే నా నాట్యం
కాలం నా తాళం, కనుమూస్తే శూన్యం

జుజ్జూ జుజుజూ - జుజ్జూ జుజూజూ  జుజ్జూ జుజూజూ

అందమైన లోకముంది- అనుభవించు ప్రాయముంది అవ్లీ బార్డ్స్
ఇంక చింతలేల చీకులేల.....? ? జాలీ బార్డ్స్
ఈ వయసుండదు ఎల్ల కాలము
ఈ వింతబతుకు అంతుచూతముహల్లో నేస్తం బాగున్నావా.. పాట సాహిత్యం

 
చిత్రం: అందమైన అనుభవం (1979)
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, సుశీల

పల్లవి:
హల్లో నేస్తం బాగున్నావా..
హల్లో నేస్తం గుర్తున్నానా..
హల్లో నేస్తం బాగున్నావా..
హల్లో నేస్తం గుర్తున్నానా..

నేనే నువ్వొయ్.. నువ్వే నేనోయ్..
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్..
నేనే నువ్వొయ్... నువ్వే నేనోయ్
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
అరౌండ్ ది వరల్డ్ ఫ్రండ్ షిప్ వెల్కంస్ యు
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
అరౌండ్ ది వరల్డ్ ఫ్రండ్ షిప్ వెల్కంస్ యౌ

హల్లో నేస్తం బాగున్నావా
హల్లో నేస్తం గుర్తున్నానా

చరణం: 1
ఊగే అలపై సాగే పడవ ఒడ్డు పొడ్డు చేర్చింది
ముచ్చటలన్ని మోసే గాలి దిక్కుదిక్కులను కలిపింది
కలకల పోయే చిలుకల గుంపు వరసా వావి నేర్పింది
నేల పీటగా నింగి పందిరిగా జగతికి పెళ్ళి జరిగింది..

సాయా అన్నా సింగపూరా..
సాయారుక మలేషియా..
సాయారేమో ఇండియా..
సాయావాడ చైనా..
హల్లో నేస్తం బాగున్నావా..హల్లో నేస్తం గుర్తున్నానా...

చరణం: 2
ఏ కళ్ళైనా కలిసాయంటే కలిగేదొకటే అనురాగం..
ఏ మనసైనా తెరిసాయంటే తెలిపేదొకటే ఆనందం..
సరిగమలైనా డొరనిపలైనా స్వరములు ఏడే గానంలో..
పడమటనైనా తూరుపునైనా స్పందన ఓకటే హృదయంలో..

సాయా అన్నా సింగపూరా..
సాయారుక మలేషియా..
సాయారేమో ఇండియా..
సాయావాడ చైనా..
హల్లో నేస్తం బాగున్నావా...హల్లో నేస్తం గుర్తున్నానా..

చరణం: 3
చైనా ఆట ..మలయా మాట.. హిందూ పాట.. ఒకటేను..
నీ నా అన్నది మానాలన్నది నేటి నినాదం కావాలోయ్...

సాయా అన్నా సింగపూరా..
సాయారుక మలేషియా...
సాయారేమో ఇండియా...
సాయావాడ చైనా...

హల్లో నేస్తం బాగున్నావా...హల్లో నేస్తం గుర్తున్నానా..
నేనే నువ్వొయ్... నువ్వే నేనోయ్
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్...
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా..
అరౌండ్ ది వరల్డ్ ఫ్రండ్ షిప్ వెల్కంస్ యు
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా..
అరౌండ్ ది వరల్డ్ ఫ్రండ్ షిప్ వెల్కంస్ యు
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు పాట సాహిత్యం

 
చిత్రం: అందమైన అనుభవం (1979)
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

పల్లవి:
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు

చరణం: 1
గతమున పూడ్చేది వీళ్ళు చరితను మార్చేది వీళ్ళు
కథలై నిలిచేది వీళ్ళు కళలకు పందిళ్ళు వీళ్లు
వీళ్ళేనోయ్ నేటి మొనగాళ్ళు చెలిమికెపుడూ జతగాళ్ళు
చెడుపుకెపుడు పగవాళ్ళు వీళ్ళ వయసు నూరేళ్ళు నూరేళ్ళకు కుర్రాళ్లు
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు

చరణం: 2
తళతళ మెరిసేటి కళ్ళు నిగనిగలాడేటి వొళ్ళు
విసిరే చిరునవ్వు జల్లు ఎదలో నాటెను ముల్లు
తీయాలోయ్ దాన్ని చెలివేళ్ళు
నిదురరాని పొదరిల్లు బ్రహ్మచారి పడకిల్లు
మూసివున్న వాకిళ్ళు తెరచినపుడే తిరునాళ్ళు
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..

చరణం: 3
నీతులుచెప్పే ముసలాళ్ళు నిన్న మొన్నటి కుర్రాళ్లు
దులిపెయ్ ఆనాటి బూజులు మనవే ముందున్న రోజులు
తెంచేసెయ్ పాతసంకెళ్ళు మనషులె మన నేస్తాలు
Come on clap.. మనసులె మన కోవెళ్ళు ఎవెర్య్బొద్య్
మనషులె మన నేస్తాలు మనసులె మన కోవెళ్ళు
మనకు మనమె దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
Come on everybody join together
నువ్వే నువ్వమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: అందమైన అనుభవం (1979)
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, వాణీజయరాం

పల్లవి:
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ నీ సరి ఎవరమ్మ
దినమొక రకము గడసరితనము
దినమొక రకము గడసరితనము
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ

నువ్వే నువ్వయ్య నవ్వులరవ్వయ్య నీసరి ఎవరయ్య
దినమొక రకము గడసరితనము
దినమొక రకము గడసరితనము
నీకై కలవయ్య నా కళ నీవయ్య
నీకై కలవయ్య నా కళ నీవయ్య

చరణం: 1
ఒకే రోజు దినదినమూ ఒక గమకం ఒక మధురం
ఒకే రోజు దినదినమూ ఒక గమకం ఒక మధురం
ఒక మేఘం క్షణ క్షణమూ ఒక రూపం ఒక శిల్పం
ఆ సరిగమలు ఆ మధురిమలు
నీకై కలవయ్య నా కళ నీవయ్య
నీకై కలవయ్య నా కళ నీవయ్య

చరణం: 2
ఒకే వెన్నెల జత జతకూ ఒక సౌరు ఒక పోరు
ఒకే వెన్నెల జత జతకూ ఒక సౌరు ఒక పోరు
ఒక కౌగిలి ప్రతి రేయి ఒక స్వర్గం ఒక దుర్గం
ఆ జివజివలు ఆ మెలుకువలు
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ

నువ్వే నువ్వయ్య నవ్వులరవ్వయ్య నీసరి ఎవరయ్య
దినమొక రకము గడసరితనము
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ

చరణం: 3
ప్రతి ఋతువు ఈ ప్రకృతికి ఒక వింత పులకింత
ప్రతి ఋతువు ఈ ప్రకృతికి ఒక వింత పులకింత
మనసుంటే మనకోసం ప్రతి మాసం మధుమాసం
ఋతువుల సొగసు చిగురుల వయసు
నీకై కలవయ్య నా కళ నీవయ్య
నీకై కలవయ్య నా కళ నీవయ్య

నీ కళ్ళు నా కళ్ళు కలిసుంటే విరిజల్లు
నీ కళ్ళు నా కళ్ళు కలిసుంటే విరిజల్లు
మమతలతో మనసల్లిన హరివిల్లే మన ఇల్లు
వలపుల జల్లులు పలుపలు వన్నెలు
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ

నువ్వే నువ్వయ్య నవ్వులరవ్వయ్య నీసరి ఎవరయ్య
దినమొక రకము గడసరితనము
దినమొక రకము గడసరితనము....

శంభో శివ శంభో.. పాట సాహిత్యం

 
చిత్రం: అందమైన అనుభవం (1979)
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

పల్లవి:
శంభో శివ శంభో.. శివ శంభో శివ శంభో
వినరా ఓరన్నా ..అనెరా వేమన్న...
జగమే మాయన్నా... శివ శంభో...
నిన్న రాదన్న.. రేపూ లేదన్న.. నేడే నీదన్న.. శివ శంభో..

వినరా ఓరన్నా.. అనెరా వేమన్న..
జగమే మాయన్నా.. శివ శంభో..ఓ..
నిన్న రాదన్న.. రేపూ లేదన్న ..నేడే నీదన్న ...శివ శంభో..ఓ..

చరణం: 1
అందాన్ని కాదన్న.. ఆనందం లేదన్న..
బంధాలు వలదన్న... బ్రతుకంతా చేదన్న..
సిరులున్నా.. లేకున్నా.. చెలితోడు నీకున్నా..
అడవిలో నువ్వున్నా.. అది నీకు నగరంరా...ఆ..ఆ..ఆ

వినరా ఓరన్నా.. అనెరా వేమన్న..
జగమే మాయన్నా.. శివ శంభో..ఓ..ఓ..
నిన్న రాదన్న.. రేపూ లేదన్న.. నేడే నీదన్న.. శివ శంభో..ఓ..ఓ..

చరణం: 2
ఈ తేటిదీ పువ్వు అని అన్నదెవరన్న..
ఏ తేనె తాగిన తీపొకటేకదరన్న..
నీదన్న నాదన్న.. వాదాలు వలదన్న..
ఏదైనా మనదన్న.. వేదాన్నే చదువన్న..ఓ..ఓ...
ఊరోళ్ళ సొమ్ముతో గుడికట్టి గోపన్న..ఆ..
శ్రీరామ భక్తుడై పేరొందెరోరన్న..
భక్తైనా రక్తైనా భగవంతుడేనన్న..
ఈనాడు సుఖమన్న.. ఎవడబ్బ సొమ్మన్న..

వినరా ఓరన్నా.. అనెరా వేమన్న..
జగమే మాయన్నా.. శివ శంభో..ఓ..ఓ..
నిన్న రాదన్న.. రేపూ లేదన్న.. నేడే నీదన్న.. శివ శంభో..ఓ..ఓ..
సింగపూరు సింగారి పాట సాహిత్యం

 
చిత్రం: అందమైన అనుభవం (1979)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

పల్లవి:
సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుందీ..
అహ సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుందీ..
రాజమండ్రి కోడలుగ రానుంది అహహహ

మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మా..
ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మా..

సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుందీ
రాజమండ్రి కోడలుగ రానుందీ ఎహేహేహే హహహ

చరణం: 1
దొరికింది గుర్రపు నాడం దొరుకుతుందనుకుంటి గుర్రం
ఊరంత గాలించినాను గాడిదై పోయాను నేను
నే నలసిపోయి సొలసిపోయి మరచిపోయి నిలిచిపోతే మెరుపల్లే వచ్చావు శంభో..
నా నిదురపోయి అదిరిపోయి మూగపోయి ఆగిపోతే గిలిగింత పెట్టావు శంభో..

ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మా..
ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మా..

సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుందీ
రాజమండ్రి కోడలుగ రానుందీ... పపపప..

చరణం: 2
నీ కళ్ళు నా కళ్ళు కలిసి.. నీ కోర్కె నా కోర్కె తెలిసి
నీ సొగసు పువ్వల్లే విరిసి.. నా వయసు గువ్వల్లే ఎగసి
నేనదును చూసి తెగువ చేసి చెయ్యి వేసి చుట్టుకుంటె మంచల్లే కరిగావే శంభో
నీ సిగ్గు చూసి ఆకలేసి చెమట పోసి దాహమేసి అల్లాడిపోతున్న శంభో

ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మా..
ఇది మన్మధలీలమ్మ ఈ జన్మకు చాలమ్మా..

సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి
రాజమండ్రి కోడలుగ రానుందీ
రాజమండ్రి కోడలుగ రానుందీ.. పపపప...

What a waiting పాట సాహిత్యం

 
చిత్రం: అందమైన అనుభవం (1979)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

పల్లవి:
What a waiting
What a waiting
Lovely birds tell my darling
You were watching you were watching
Love is but a game of waiting

చరణం: 1
కాచుకొంటి కాచుకొంటి కళ్ళు కాయునంతదాక
చెప్పవమ్మ చెప్పవమ్మ చుప్పనాతి రామచిలక
మొక్కనాటి కాచుకున్న మొగ్గ తొడిగి పూచేనమ్మా
ఆమె రాదు ఆమె రాదు ప్రేమ లేదో అడగవమ్మ

What a waiting
What a waiting
Lovely birds tell my darling
You were watching you were watching
Love is but a game of waiting

చరణం: 2
కాచుకొంటి కాచుకొంటి కళ్ళు కాయునంతదాక
చెప్పవమ్మ చెప్పవమ్మ చుప్పనాతి రామచిలక
మొక్కనాటి కాచుకున్న మొగ్గ తొడిగి పూచేనమ్మా
ఆమె రాదు ఆమె రాదు ప్రేమ లేదో అడగవమ్మ
Title humming పాట సాహిత్యం

 

చిత్రం: అందమైన అనుభవం (1979)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

లా ల ల లల్లా లలలల్లా అందమైన అనుభవం  ...

Most Recent

Default