Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Aranyakanda (1986)



చిత్రం: అరణ్య కాండ (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: పి.సుశీల , శ్రీనివాస చక్రవర్తి
నటీనటులు: నాగార్జున, రాజేంద్రప్రసాద్, అశ్వని, రాధిక, తులసి
దర్శకత్వం: క్రాంతికుమార్
నిర్మాత: సి.పెంచల్ రెడ్డి
విడుదల తేది: 29.12.1986

బాగున్నావా....ఎంత ప్రేమా
రమ్మంటావా...ఎంత ఆశ
ఒక్కసారి...వద్దుల్లేమ్మా
ఎవ్వరూ లేరుగా...అందుకే రాను గా
నీలో అందమంతా అక్షరాలైన ఈ లేఖలో

మల్లె వీణ మీటు తున్నా
మంచుగాలి మేఘాల దుప్పట్లలో
జాజి పూలే జల్లు మన్న
సంధ్య గాలి రగాల చప్పట్లలో
మనసులా కలిసిపో వయసునే కలుపుకో
కంటి పాపల నన్ను కాచుకో
ఈడు ఈలతో నువ్వు మేలుకో
ఈల రాసలీల ఆడుతూ నన్ను లాలించుకో

బాగున్నావా....ఎంత ప్రేమా

వాన విల్లు వల్లు వంచి
వన్నెలారబోసింది నీ అందమే
పిల్ల సోకు కన్ను సోకి
పించమారబోసింది నీకోసమే
తనువునే దాటి రా
తారలో తలుకులా
ఎంత దాచితే అంత దాచుకో
యెంత అందితే అంత అల్లుకో
చేసి ఇంత చేసి రాయబారాలు ఇంకేల రా

బాగున్నావా....ఎంత ప్రేమా
రమ్మంటావా...ఎంత ఆశ
ఒక్కసారి...వద్దుల్లేమ్మా
ఎవ్వరూ లేరుగా...అందుకే రాను గా
నీలో అందమంతా అక్షరాలైన ఈ లేఖలో


*******   ********   *******


చిత్రం: అరణ్య కాండ (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల

జాబిల్లిగా మది చల్లగా రా రా రా రా
ఒకసారి కనిపించరా నీ నవ్వు కురిపించరా
ఈ బువ్వ తినివెల్లరా బాబు...నాని
జాబిల్లిగా మది చల్లగా రా రా రా రా

కడలి పొనిగింది నా కన్నులా
అడవి కాచింది నీ వెన్నెలా
కడలి పొనిగింది నా కన్నులా
అడవి కాచింది నీ వెన్నెలా
పేగులొ నిండు కన్నీరు కన్న
ఏమి పాపలు నే చేసుకున్నా
మరవద్దురా అమ్మనీ
మీ అమ్మలో ప్రేమనీ
నా ప్రాణమే నీవని బాబు..నాని
ఒకసారి కనిపించరా నీ నవ్వు కురిపించరా
ఈ బువ్వ తినివెల్లరా

పిలవరా నన్ను అమ్మా అని
నిలపరా కన్న ప్రాణాలనీ
పిలవరా నన్ను అమ్మా అని
నిలపరా కన్న ప్రాణాలనీ
ఒక్కసారైన ఒడిలోకి రా రా
మొక్కనా వెయ్యి దేవుల్లకైనా
చిరుముద్దులే ఇవ్వరా
నీ జోల పాడెనురా
నా జాలి కన్వేల రా బాబు...నాని
ఒకసారి కనిపించరా నీ నవ్వు కురిపించరా
ఈ బువ్వ తినివెల్లరా బాబు...నాని



*******   ********   *******


చిత్రం: అరణ్య కాండ (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల , శ్రీనివాస చక్రవర్తి

పువ్వుమీద తుమ్మెదాడె
అబ్బ తీపి గాటు ఓపేదెట్ట ఓలమ్మ
పువ్వుమీద తుమ్మెదాడె
అబ్బ తీపి గాటుఓపేదెట్ట ఓలమ్మ
తేనెబొట్టు కాస్త జారే వేలా
తేనెబొట్టు కాస్త జారే వేలా
వొల్లర బోస్తే కల్లర చూసా ఇయ్యాలా
వొల్లర బోస్తే కల్లర చూసా ఇయ్యాలా

పువ్వుమీద తుమ్మెదాడె
అబ్బ తీపి గాటు ఓపేదెట్ట ఓలమ్మ

చంద్రవంక వాగులమా
కెరటాల గాజులేసె
కాలవంక తుంటాలోన
పాలా పిట్టా గంతులేసె
రెప్పపాటు నిన్నంటాలా
రెల్లుపూల జున్నంటాలా
రెచ్చిపోయి నిన్నంటాల
రేతిరొచ్చె పేరంటాల
రెచ్చిపోయి నిన్నంటాల
రేతిరొచ్చె పేరంటాల
రేతిరొచ్చె పేరంటాల

పువ్వుమీద తుమ్మెదాడె
అబ్బ తీపి గాటు ఓపేదెట్ట ఓలమ్మ

జారిపడ్డ కొంగులమ్మ
జానపొంగు చూసి నవ్వే
కొమ్మ చటు కోయిలమ్మ
కొత్త పాట అల్లుకొచ్చే
చెప్పరానిదడిగెయ్యలా
అడగరనిదిచ్చెయ్యలా
ఆశలన్ని అచ్చెయ్యాలా
పాడుపొద్దు గిచ్చెయ్యలా
పాడుపొద్దు గిచ్చెయ్యలా

పువ్వుమీద తుమ్మెదాడె
అబ్బ తీపి గాటు ఓపేదెట్ట ఓలమ్మ
తేనెబొట్టు కాస్త జారే వేలా
తేనెబొట్టు కాస్త జారే వేలా
వొల్లర బోస్తే కల్లర చూసా ఇయ్యాలా
వొల్లర బోస్తే కల్లర చూసా ఇయ్యాలా




*******   ********   *******


చిత్రం: అరణ్య కాండ (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

సూర్యుడూ జాబిలీ ప్రేమించుకున్నరులే
పెనవేసుకున్నరులే పెళ్ళాడుకుంటారులే

కొండ ముద్దులాడే గోనమ్మతో
ఎండ పెళ్లి ఆడే వానమ్మతో
జంటగా గుండెనే అంటుకో
చెంగుముల్లు వేసె చెంగమ్మతో
సిగ్గు మొగ్గలేసె బుగ్గమ్మలో
ప్రేమగా లీలలే ఆడుకో

ప్రేమించు నీ ప్రేమ నీ దిక్కుగా
ఆ ప్రేమ నీ జన్మ నీ హక్కుగా
ఏరుకు నీరై వెన్నెల నీడై
ఈడుకు తోదై ఇద్దరు కలిసే
ఈ ప్రేమ పెళ్లిల్లు జరగాలిలే
ఈ లేత కౌగిల్లు ముదరాలిలే
వత్తిల్లు వందేల్లు లే

సూర్యుడూ జాబిలీ ప్రేమించుకున్నరులే
పెనవేసుకున్నరులే పెళ్ళాడుకుంటారులే

కన్నుకొట్టి చుసే కవ్వింతలో
దాచుకోన ముద్దు వున్నంతలో
వెచ్చగా హత్తుకో హాయిగా
మల్లెలెట్టి నేసే మంచాలతో
దీపమెట్టి కాసే అందాలతో
పక్కనే దిద్దుకో ముద్దుగా

పారాని పండించు పాదాలలో
ప్రాణాలు పండించు నీ నీడలో
పెళ్ళికి దోవ పల్లకి సేవ
గొవ్వకి గువ్వ గుట్టుగ కలిసే
ఈ ప్రేమ సందల్లు సాగాలిలె
ఈ ముద్దు మద్దెల్లు మోగాలిలే
సరదాలు చల్లన్నులే

సుర్యుడూ జాబిలీ ప్రేమించుకున్నరులే
పెనవేసుకున్నరులే పెళ్లడుకుంటారులే



Most Recent

Default