Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Rajanna (2011)



చిత్రం: రాజన్న (2011)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
సాహిత్యం: మెట్టపల్లి సుందర్
గానం: మెట్టపల్లి సుందర్  ,చైత్ర
నటీనటులు: నాగార్జున, స్నేహా, బేబీ అన్ని , శ్వేతా మీనన్
దర్శకత్వం: వి. విజయేంద్ర ప్రసాద్
నిర్మాత: నాగార్జున అక్కినేని
విడుదల తేది: 22.12.2011

కాలి గజ్జె ఘల్లుమంటె పల్లె తల్లి
మెలుకుంతదో మా అమ్మలార అక్కలారా
డోలు డప్పు ఘొల్లుమంటె
వూరు వాడ లేచివస్తదో మా అన్నలర తమ్ములరా
కాలి గజ్జె ఘల్లుమంటె పల్లె తల్లి
మెలుకుంతదో మా అమ్మలార అక్కలారా
డోలు డప్పు ఘొల్లుమంటె
వూరు వాడ లేచివస్తదో మా అన్నలర తమ్ములరా

గొంతెత్తి పాడుతుంటె లెలెస్సొ హైలెస్స
తేనలూరి పాడతాయి లెలెస్సొ హైలెస్స
గొంతెత్తి పాడుతుంటె లెలెస్సొ హైలెస్స
తేనలూరి పాడతాయి లెలెస్సొ హైలెస్స
అడవిలోన జీవరాసులన్ని
గూడు వదిలి వచ్చి ఆటలాడి అలసిపొతాయో

కాలి గజ్జె ఘల్లుమంటె పల్లె తల్లి
మెలుకుంతదో మా అమ్మలార అక్కలారా
డోలు డప్పు ఘొల్లుమంటె
వూరు వాడ లేచివస్తదో మా అన్నలర తమ్ములరా
కాలి గజ్జె ఘల్లుమంటె పల్లె తల్లి
మెలుకుంతదో మా అమ్మలార అక్కలారా
డోలు డప్పు ఘొల్లుమంటె
వూరు వాడ లేచివస్తదో మా అన్నలర తమ్ములరా


******  ******  ******


చిత్రం: రాజన్న (2011)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం: యమ్.యమ్. కీరవాణి , కైలాష్ కెహర్

కరకురాతి గుండెల్లొ రగులుకున్న మంటల్లో
కాలి మసైపోయెనమ్మ నీ గూడు
కడుపున కనకున్నా కంటికి రెప్పల్లే
కాచుకున్న వాడిప్పుడు లేడు
రాబందుల రాజ్యం లో
రాకాసుల మూకల్లో
ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా
ఎగిరిపోవె ఏడికైన కోయిలమ్మా
ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా
ఎగిరిపోవె ఏడికైన కోయిలమ్మా


గుండెల పెనవేసుకున్న అనుబంధాలూ
ఆకలినే మరిపించే ఆటపాటలూ
మరచిపోయి తీరాలమ్మా
నువ్వు మరచిపోయి తీరాలమ్మా
చెయ్యాలని మనసున్న చెతకాని వల్లమూ
పెట్టాలని ఉన్నా నిరుపేద వల్లం
ఈ మట్టి లోన ఏకమైన మీ అమ్మా నాన్నలా
చల్లని దీవెనలే నీకు శ్రీ రామ రక్షగా
ఎగిరిపోవె ఏడికైన కోయిలమ్మా...
మన వాడకి మరి రాకమ్మ మల్లమా...


******  ******  ******


చిత్రం: రాజన్న (2011)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం: సంజీవ్ చిమ్మల్గి , కాలభైరవ

గిజిగాడు తన గూడు వదిలీ రాకున్నాడు సూరీడు రాలేదనీ
కొలనీలో కమలాలు తలదించుకున్నాయి పొద్దు పొడవలేదనీ

గిజిగాడు తన గూడు వదిలీ రాకున్నాడు సూరీడు రాలేదనీ
కొలనీలో కమలాలు తలదించుకున్నాయి పొద్దు పొడవలేదనీ

గారాల మల్లమ్మ కల్లే తెరవకుంది తెలవారలేదే అనీ
నువ్వైనా చెప్పన్నా సూరీడుకి రాజన్నా ఎండెక్కె లేలెమ్మనీ
కొండెక్కె తన ఏడు గుర్రాల బడెక్కి పిండక్కి రారమ్మనీ
బతుకమ్మ పిండక్కి రారమ్మనీ
పిండక్కి రారమ్మనీ బతుకమ్మ పిండక్కి రారమ్మనీ

నడిమింట సూరీడు నిప్పులు చెరిగేడు పసికిందు పడుకుందనీ
నడిమింట సూరీడు నిప్పులు చెరిగేడు పసికిందు పడుకుందనీ
నువ్వైనా చెప్పన్నా సూరీడుకి రాజన్నా మబ్బు చటుకు పొమ్మనీ
నా బిడ్డకి రవ్వంత నీడిమ్మనీ
కంటికి రెప్పల్లే కాచుకున్నా గాని నీ వైపే నా తల్లి చూపూ
నువ్వైనా చెప్పన్నా మల్లమ్మకి రాజన్నా
ఇలు దాటి పోవొద్దనీ దయచేసి నీ దరికి రావద్దనీ
ఇలు దాటి పోవొద్దనీ దయచేసి నీ దరికి రావద్దనీ


******  ******  ******


చిత్రం: రాజన్న (2011)
సంగీతం: యమ్.యమ్. కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం: మాళవిక

అమా...ఆ..ఆ...అవనీ..
అమ్మా అవనీ నేలతల్లీ అనీ
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకనీ
అమ్మా అవనీ నేలతల్లీ అనీ
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకనీ
అమ్మా అవనీ నేలతల్లీ అనీ
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకనీ
కనిపెంచిన వొడిలోనే కన్ను మూయానీ
మల్లీ ఈ గుడిలోనే కల్లు తెరవనీ
అమ్మా అవనీ నేలతల్లీ అనీ
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకనీ

తల్లి నిను తాకితేనె తనువు పులకరిస్తుందీ
నీ యదపై వాలితేనె మేను పరవసిస్తుందీ
తేట తెలుగు జానా కోటి రతనాల వీణా
నీ పదములన నువి నాకు స్వర్గం కన్న మిన్న
అమ్మా అవనీ నేలతల్లీ అనీ
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకనీ
అమ్మా అవనీ...

నీ బిడ్డల సౌర్య ధైర్య సాహస గాదలు వింటే
నరనరాలలో రక్తం పొంగి పొరలుతుందీ

రిగగ రిగగ రిగ రిగగ రిగగ రిగ
రిగగ రిగగ రిగ రిగ రిస దప దస
రిగగా రిపపప గదదద పదదద
సద సద పగ పగ సద సద సద సద
పద సద పద సద పద సద పద సద
సస సస సస సస రిరి
సస సస సస సస గగ
రిగ రిస రిగ రిస .. రిగ రిస రిగ రిస
సరి సరి గ రిస గ రిస గ రిస
రిగ రిగ ప .. గరి సద ప
గప పద దస సరి గరి సద
పద దస సరి రిగ మగ రిస
రి గ మా రిస దప దస రిగ ప
సరి గప దస రిగ పా...
దప గరి సరి సద.. వీర మాతవమ్మ
రణ ధీర చరితవమ్మ
పుణ్య భూమివమ్మ .. నువు దన్య చరితవమ్మ
తల్లి కొరకు చేసె ఆ త్యాగమెంతదైన
దేహమైన ప్రాణమైన కొంచమే కదమ్మ
అది మించిన నాదన్నది నీకీ గలదేదమ్మ

అమ్మా అవనీ నేలతల్లీ అనీ
ఎన్ని సార్లు పిలిచినా తనివితీరదెందుకనీ
అమ్మా అవనీ.......

Most Recent

Default