Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Malliswari (1951)
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి (All)
నటీనటులు: యన్.టి.రామారావు, భానుమతి రామకృష్ణ
దర్శకత్వం: బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి
నిర్మాత: బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి
విడుదల తేది: 20.12.1951Songs List:కోతి బావకు పెళ్ళంట పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి
గానం: భానుమతి రామకృష్ణ

కోతి బావకు పెళ్ళంట
కోవెల తోట విడిదంట
మల్లి మాలతి వస్తారా
మాలికలల్లి తెస్తారా
బంతీ జాజి చేమంతి
బంతులు కట్టి తెస్తారా 

పెళ్ళికి మీరు వస్తారా
పేరంటానికి వస్తారా
పందిరి వేస్తాము
ముందర ముగ్గులు పెడతాము
పందిరికింద పెళ్ళివారికి
వింఉదలు చేస్తాము
బాకా బాజా డోలు సన్నాయ్ 

మేళాలెడతారు
తప్పెట తాళాలెడతారు
అందాల మా బావగారికి
గంధాలు పూసి
గారాల మా బావ మెడలో హారాలు వేసి
కుళ్ళాయెడతాము
కుచ్చుల తురాయి పెడతాము
హారాలేసి గంధం పూసి
కుళ్ళాయెట్టి తురాయి
పెడతాము
కుచ్చుల తురాయి పెడతాము
ఓ....పల్లకి ఎక్కి
పల్లకి ఎక్కి కోతి బావ
పళ్ళికిలిస్తాడు... మా కోతి బావ
పళ్ళికిలిస్తాడు

పిలచిన బిగువటరా పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: భానుమతి రామకృష్ణ 

పిలచిన బిగువటరా
పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
భళిరా రాజా

ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
పిలిచినా బిగువటరా 

గాలుల తేనెల వాడని మమతల
గాలుల తేనెల వాడని మమతల
నీలపు మబ్బుల నీడను గననను
అందెల రవళుల సందడి మరిమరి
అందగాడా ఇటు తొందర చేయగా 
పిలచిన బిగువటరా 
మనసున మల్లెల మాలలూగెనే పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: భానుమతి రామకృష్ణ 

మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
కొమ్మల గువ్వలు గుస గుస మనినా
రెమ్మల గాలులు ఉసురుసుననినా
అలలు కొలనులో గల గల మనినా
అలలు కొలనులో గల గల మనినా
దవ్వున వేణువు సవ్వడి వినినా
దవ్వున వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయ చూచితిని
ఘడియ యేని ఇక విడిచిపోకుమా
ఘడియ యేని ఇక విడిచిపోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో

నెలరాజా వెన్నెలరాజా పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: భానుమతి రామకృష్ణ

నెలరాజా వెన్నెలరాజా
పరుగులు తియ్యాలి పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం:  ఘంటసాల, భానుమతి రామకృష్ణ 

పరుగులు తియ్యాలి గిత్తలు ఉరకలు వేయాలి 
బిరబిర చరచర పరుగున పరుగున ఊరు చేరాలి మన ఊరు చేరాలి
హోరు గాలి కారు మబ్బులు "హోరు"
ముసిరేలోగా మూగేలోగా ఊరు చేరాలి మన ఊరు చేరాలి
గలగల గలగల కొమ్ముల గజ్జెలు
ఘణఘణ ఘణఘణ మెళ్ళో గంటలు

ఆ ఆ ఆ ఆ "గలగల"
వాగులు దాటి వంకలు దాటి
ఊరు చేరాలి మన ఊరు చేరాలి

అవిగో అవిగో నల్లని మబ్బులు
గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు
అవిగో అవిగో అవిగో అవిగో 

పచ్చనితోటలు విచ్చినపూవులు
ఊగేతీగలు అవిగోఅవిగో
కొమ్మల మోగే కోయిల జంటలు
ఝమ్మని మూగే తుమ్మెద గుంపులు
అవిగో అవిగో

పిలచిన బిగువటరా పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం:  ఘంటసాల, భానుమతి రామకృష్ణ 

పిలచిన బిగువటరాఎందుకే నీ కింత తొందరా పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: భానుమతి రామకృష్ణ

ఎందుకే నీ కింత తొందరా 
ఇన్నాళ్ళ చెరసాల ఈ రేయి తీరునే  
ఓ చిలుక నా చిలుక ఓ రామచిలుకా
ఒయ్యారి చిలుక నా గారాల మొలక 

బాధలన్నీ పాతగాధలైపోవునే
వంతలన్ని వెలుగు పుంతలో మాయునే ఎలాగొ ఒలాగు
ఈ రేయి దాటెనా... ఈ రేయి దాటెనా
ఈ పంజరపు బ్రతుకు ఇక నీకు తీరునే

ఆ తోట ఆ తోపు ఆకు పచ్చని గూడు
ఆ వంక ఆ తోపు ఆకు పచ్చని గూడు
ఆ వంక గొరవంక అన్ని ఉన్నాయిలే

చిరుగాలి తగలా 
చిన్నారి పడవలా
పసరు రెక్కలు పరచి
పరువెత్తి పోదాము

అవునా నిజమేనా పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: ఘంటసాల, భానుమతి రామకృష్ణ 

అవునా నిజమేనా
అవునా నిజమేనా 
మరచునన్నా మరువలేని మమతలన్నీ కళలేనా
రాణివాసమేగేవ , బావ మాట మరచేవా
అవునా నిజమేనా
అవునా
మనసులోన మరులుగొలిపి కడకు మాయమాయేనా
ప్రాణమున్న మల్లి పోయి రాతి బొమ్మ మిగిలేనా 
అవునా నిజమేనా 

అవునా కళలేనా
అవునా కళలేనా
నాటి కధలు వ్యధలేనా, నీటిపై నీ అలలేనా
నాటి కధలు వ్యధలేనా, నీటిపై నీ అలలేనా
బావ నాకు కరువేనా , బ్రతుకు ఇంక బరువేనా 
బావ నాకు కరువేనా , బ్రతుకు ఇంక బరువేనా 

పగలు లేని ఱేయి వోలె పలుకలేని రాయి వోలె 
బరువు బ్రతుకు మిగిలేనా , వలపులన్ని కళలేనా 
అవునా కళలేనా

ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవూ పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: ఘంటసాల, భానుమతి రామకృష్ణ 

ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవూ
దేశదేశాలన్నీ తిరిగి చూసేవూ
ఏడ తానున్నాడొ.. బావా
ఏడ తానున్నాడొ.. బావా
జాడ తెలిసిన.. పోయిరావా
అందాల ఓ మేఘమాలా...
చందాల ఓ మేఘమాలా...

గగనసీమల తేలు.. ఓ మేఘమాలా
మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా
మల్లి మాటేదైనా నాతో
మనసు చల్లగా చెప్పి పోవా
నీలాల.. ఓ మేఘమాల 
రాగాల.. ఓ మేఘమాల

మమతలెరిగిన మేఘమాలా..
మమతలెరిగిన మేఘమాలా..
నా మనసు బావాకు.. చెప్పిరావా
ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు
ఎన్నాళ్ళు నా కళ్ళు.. దిగులుతో రేపవలు
ఎదురు తెన్నులు చూచెనే
బావాకై చెదరి కాయలు కాచెనే...
అందాల ఓ మేఘమాలా...
రాగాల.. ఓ మేఘమాల

మనసు తెలిసిన మేఘమాలా...
మరువలేనని చెప్పలేవా
మల్లితో మరువలేనని చెప్పలేవా
కళ్ళు తెరిచినగాని కళ్ళు మూసినగాని..
కళ్ళు తెరిచినగాని కళ్ళు మూసినగాని..
మల్లి రూపే నిలిచెనే..
నా చెంత.. మల్లి మాటే పిలిచెనే

జాలి గుండెల మేఘమాలా
బావాలేనిది బ్రతుకజాలా
జాలి గుండెల మేఘమాలా
కురియు నా కన్నీరు.. గుండెలో దాచుకుని
వాన జల్లుగ కురిసిపోవా
కన్నీరు.. ఆనవాలుగ ..బావా మ్రోల

ఉయ్యాలా జంపాలా పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: జి. రామకృష్ణ , వి. శకుంతుల

ఉయ్యాలా జంపాలా
భలిరా పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: మాధవపెద్ది సత్యం 

భలిరా
ఓ బావా పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: జి. రామకృష్ణ , వి. శకుంతుల

ఓ బావా
తుమ్మెద పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: టి. జి. కమలాదేవి

తుమ్మెద
ఎవరు ఏమని విందురో పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: భానుమతి రామకృష్ణ 

ఎవరు ఏమని విందురో

ఉషా పరిణయం పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: భానుమతి రామకృష్ణ ,టి. జి. కమలాదేవి

ఉషా పరిణయం

కలవరమాయే మదిలో పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: ఘంటసాల, భానుమతి రామకృష్ణ 

కలవరమాయే మదిలో
నోమి నోమన్నలార పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: భానుమతి రామకృష్ణ 

నోమి నోమన్నలార


Most Recent

Default