Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Andaru Dongale (1974)




చిత్రం: అందరూ దొంగలే (1974)
సంగీతం: కె. వి. మహదేవన్
నటీనటులు: శోభన్ బాబు, లక్ష్మీ
దర్శకత్వం: వి బి.రాజేంద్రప్రసాద్
నిర్మాత: అక్కినేని ఆనందరావు
విడుదల తేది: 10.05.1974



Songs List:



నాయుడోళ్ళింటికాడ పాట సాహిత్యం

 
చిత్రం: అందరూ దొంగలే (1974)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: కొసరాజు
గానం: పి.సుశీల, వి.రామకృష్ణ 

పల్లవి:
నాయుడోళ్ళింటికాడ నల్లతుమ్మ చెట్టుకింద
నాయుడేమన్నాడె పిల్లా 
అబ్బ గుండె ఝల్లుమన్నాదే బుల్లా
నాయుడోళ్ళింటికాడ నల్లతుమ్మ చెట్టుకింద
నాయుడేమన్నాడె పిల్లా
అబ్బ గుండె ఝల్లుమన్నాదే బుల్లా

హా నాయుడోళ్ళింటికాడ నల్లతుమ్మ చెట్టుకింద
గుట్టు బైట పెట్టడే అప్పుడూ 
అబ్బ గుండె ఝల్లుమన్నాదె ఇప్పుడూ
హా నాయుడోళ్ళింటికాడ నల్లతుమ్మ చెట్టుకింద
గుట్టు బైట పెట్టడే అప్పుడూ
అబ్బ గుండె ఝల్లుమన్నాదె ఇప్పుడూ 

చరణం: 1
ఎలా ఎలా అన్నాడు ఏమి చెయమన్నాడూ?
మల్లెమొగ్గలాంటి పిల్ల ఒళ్ళోన వాలుతుంటె
జారుకోమన్నాడా జుర్రుకోమన్నాడా?
జారుకోమన్నాడా జుర్రుకోమన్నాడా?
నాయుడేమన్నాడె పిల్లా అబ్బ గుండె ఝల్లుమన్నాదే బుల్లా

వాలుకన్నుల చిన్నదాన్ని వదలకూడదు అన్నాడూ
ఇంత కన్నా మంచిరోజు ఎప్పుడూ రాదన్నాడూ
చెయ్యి వెయ్యమన్నాడూ అయ్యయ్యో చెప్పగూడదన్నాడూ
చెయ్యి వెయ్యమన్నాడూ చెప్పగూడదన్నాడూ

నాయుడోళ్ళింటికాడ నల్లతుమ్మ చెట్టుకింద
గుట్టు బైట పెట్టడే అప్పుడూ
అబ్బ  గుండె ఝల్లుమన్నాదె ఇప్పుడూ

చరణం: 2
కల్లబొల్లి సాకులన్ని కట్టిపెట్టమన్నాడా?
కంటి సైగ తెలుసుకొని కలుసుకోమన్నాడా?
పిట్ట పడతదన్నాడా వీపు చెడతదన్నాడా?
పిట్ట పడతదన్నాడా వీపు చెడతదన్నాడా? 
నాయుడేమన్నాడె పిల్లా 
అబ్బ గుండె ఝల్లుమన్నాదే బుల్లా

సందెపొద్దుదాక నీతో సరసమాడి
సందడేమీ చెయ్యకుండ ఉండమన్నాడూ
మనసులోని మోజుదీర మాటలాడి తొందరేమి చెయ్యకుండ ఆగమన్నాడూ
దారి చూడమన్నాడు అమ్మమ్మా దౌడు తీయమన్నాడూ
అరెరే దారి చూడమన్నాడు దౌడు తీయమన్నాడూ

నాయుడోళ్ళింటికాడ నల్లతుమ్మ చెట్టుకింద
నాయుడేమన్నాడె పిల్లా
అబ్బ గుండె ఝల్లుమన్నాదే బుల్లా

నాయుడోళ్ళింటికాడ నల్లతుమ్మ చెట్టుకింద
గుట్టు బైట పెట్టడే అప్పుడూ
అబ్బ గుండె ఝల్లుమన్నాదె ఇప్పుడూ




గుడుగుడు గుంచం గుళ్ళో రాగం పాట సాహిత్యం

 
చిత్రం: అందరూ దొంగలే (1974)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి. సుశీల, వి.రామకృష్ణ 

పల్లవి:
గుడుగుడు గుంచం గుళ్ళో రాగం
పాముల పట్నం పటికి బెల్లం
నన్నే పెళ్ళి చేసుకో  మా అందరిలో
నన్నే చేసుకో, నన్నే చేసుకో, నన్నే చేసుకో
నన్నే చేసుకో  నన్నే పెళ్ళి చేసుకో

గుడుగుడు గుంచం  గుళ్ళో రాగం
పాముల పట్నం పటికి బెల్లం
నేనే పెళ్ళి చేస్తా  మీ అందరికీ
నేనే చేస్తా నేనే చేస్తా
నేనే చేస్తా నేనే పెళ్ళి చేస్తా

చరణం: 1
నీకు తగ్గదాన్నోయ్ నీటైనదాన్నోయ్
ఆ వాటమున్న దాన్నొయ్  వగలున్న దాన్నోయ్
నీకు తగ్గదాన్నోయ్  నీటైనదాన్నోయ్
వాటమున్న దాన్నొయ్ వగలున్న దాన్నోయ్

పగలు సైగచేస్తే  పరుగు పరుగునా వచ్చి
రేయంతా నీ కలలో కరిగిపోతానోయ్ కరిగిపోతానోయ్ 

గుడుగుడు గుంచం  గుళ్ళో రాగం
పాముల పట్నం పటికి బెల్లం
నన్నే పెళ్ళి చేసుకో  మా అందరిలో
నన్నే చేసుకో నన్నే చేసుకో నన్నే చేసుకో 
నన్నే చేసుకో నన్నే పెళ్ళి చేసుకో

గుడుగుడు గుంచం గుళ్ళో రాగం
పాముల పట్నం పటికి బెల్లం
నేనే పెళ్ళి చేస్తా మీ అందరికీ
నేనే చేస్తా నేనే చేస్తా
నేనే చేస్తా నేనే పెళ్ళి చేస్తా

చరణం: 2
గుత్తమైన గుండెల్లో కోర్కె ఇమడనంటె
నీ గుప్పెట్లో నా నడుము గిరగిర తిరగాలి
గుత్తమైన గుండెల్లో కోర్కె ఇమడనంటె
నీ గుప్పెట్లో నా నడుము గిరగిర తిరగాలి

కోరమీసం నీది  కొంటె చూపు నాది
కోరమీసం నీది కొంటె చూపు నాది
కోరి కోరి ఆ రెండు కోలాటం ఆడాలి ఆడాలి

గుడుగుడు గుంచం గుళ్ళో రాగం
పాముల పట్నం పటికి బెల్లం
నన్నే పెళ్ళి చేసుకో మా అందరిలో
నన్నే చేసుకో నన్నే చేసుకో
నన్నే చేసుకో నన్నే చేసుకో
నన్నే పెళ్ళి చేసుకో

చరణం: 3
పొంగుతున్న ఒంపుల్లో పొగరు నాకు తెలుసు రంగేళి వయసులో సింగారం తెలుసు
పొంగుతున్న ఒంపుల్లో పొగరు నాకు తెలుసు రంగేళి వయసులో సింగారం తెలుసు
లొంగని మీ పరువాలు లొంగ దీసుకుంటా లొంగని మీ పరువాలు లొంగ దీసుకుంటా
అందాలకు బందమేసి అదుపులోన పెడతా..  అదుపులోన పెడతా

గుడుగుడు గుంచం గుళ్ళో రాగం
పాముల పట్నం పటికి బెల్లం  
నేనే పెళ్ళి చేస్తా మీ అందరికీ
నేనే చేస్తా నేనే చేస్తా  నేనే చేస్తా  
నేనే పెళ్ళి చేస్తా




చంటిబాబు ఓ బుజ్జిబాబూ పాట సాహిత్యం

 
చిత్రం: అందరూ దొంగలే (1974)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: మాధవపెద్ది సత్యం, యస్.పి.బాలు

పల్లవి:
చంటిబాబు ఓ బుజ్జిబాబూ
చంటిబాబు ఓ బుజ్జిబాబూ
నీ పంట పండితే నవాబూ           
ఉంది తాళం ఏది బీగం లేనే లేదా జవాబూ?
ఉంది తాళం ఏది బీగం లేనే లేదా జవాబూ?
మంచి ఖజానా మనకు ఠికానా
నిధి దొరికేనా నీకు బజానా
దారిన బోయే చక్కని దానా 
బాగున్నానా నీ పక్కకు రానా   

చంటిబాబు ఓ బుజ్జిబాబూ
నీ పంట పండితే నవాబూ

చరణం: 1
దారిలోన మాకు చిక్కిందీ లక్కీ నాడా చిన్నదాన నువు చెప్పాలి గుర్రపు జాడా
దారిలోన మాకు చిక్కిందీ లక్కీ నాడా చిన్నదాన నువు చెప్పాలి గుర్రపు జాడా
వెదకాలీ దీనికి జోడి వెదకాలీ దీనికి జోడి 
అది చూపవె ఓ వగలాడీ
ఒప్పులకుప్ప చెపితే తప్పా
కంటికి రెప్ప ముత్యపు చిప్ప
ఎక్కడ ఉందా తాళ కప్ప
చోటు చెప్పు చిక్కు ముడి విప్పు

చంటిబాబు ఓ బుజ్జిబాబూ 
నీ పంట పండితే నవాబూ

చరణం: 2
పద నాన్నా మన రాత బండి సున్నా
అచ్చుబోసి సాగనంపింది అత్తారిల్లు అంతలోనే ఇది దొరికింది ఫలితం నిల్లు
అచ్చుబోసి సాగనంపింది అత్తారిల్లు అంతలోనే ఇది దొరికింది ఫలితం నిల్లు
గతిఏదని నిన్నడిగేము గతిఏదని నిన్నడిగేము అది చెపితే నీకు సలాము
నీ గులాము మేమవుతాము నువ్వడిగింది చేసేస్తాము
రోజు రోజూ సేవిస్తాము చెప్పు గుట్టూ నారి చూపెట్టు

పద నాన్నా మన రాత బండి సున్నా
ఏడుకొండలవాడా వెంకటరమణా
ఆపద మొక్కులవాడా నువ్వే శరణు
ఓ స్వామీ మాకు ఇచ్చావు నువ్వో తాళం
అంతర్యామీ కాని చేశావు మాయాజాలం
ఓ స్వామీ మాకు ఇచ్చావు నువ్వో తాళం
అంతర్యామీ కాని చేశావు మాయాజాలం

చూపిస్తే సొమ్ముల మూట చూపిస్తే సొమ్ముల మూట మేమిస్తాం నీకో వాటా
మా ఈ నోట రాదులె జూటా ఆడిన మాట అగ్గిబరాటా ఒద్దు గలాటా
చూపుము బాటా ఆశలేదా నీకు డబ్బు చేదా

చంటిబాబు ఓ బుజ్జిబాబూ 
నీ పంట పండితే నవాబు
చంటిబాబు ఓ బుజ్జిబాబూ 
చంటిబాబు ఓ బుజ్జిబాబూ
చంటిబాబు ఓ బుజ్జిబాబూ





చూశానురా ఈ వేళ పాట సాహిత్యం

 
చిత్రం: అందరూ దొంగలే (1974)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం:
గానం: పి. సుశీల, వి.రామకృష్ణ 

చూశానురా ఈ వేళ



గురుదేవా మహాదేవా పాట సాహిత్యం

 
చిత్రం: అందరూ దొంగలే (1974)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం:
గానం:

గురుదేవా మహాదేవా




రమ్మంటే రారా పాట సాహిత్యం

 
చిత్రం: అందరూ దొంగలే (1974)
సంగీతం: కె. వి. మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ 
గానం: పి.సుశీల 

రమ్మంటే రారా 


Most Recent

Default