Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ramu (1968)

చిత్రం: రాము (1968)
సంగీతం:  ఆర్. గోవర్ధన్
సాహిత్యం:  దాశరథి
గానం:  ఘంటసాల
నటీనటులు: యన్.టి.రామారావు, జమున, యస్.వి.రంగారావు
దర్శకత్వం: ఎ. సి.త్రిలోక్ చందర్
నిర్మాత: ఎ. వి.మియప్పన్
విడుదల తేది: 04.05.1968

పల్లవి:
దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడూ
దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు
ఆకలికి అన్నమూ వేదనకు ఔషధం
పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా

రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా
రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా
రా రా కృష్ణయ్యా రా రా.....

చరణం: 1
మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా
మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా
పేదలమొరలాలించే విభుడవు నీవే కోరిన వరములనొసగే వరదుడ వీవే
పేదలమొరలాలించే విభుడవు నీవే కోరిన వరములనొసగే వరదుడ వీవే
అజ్ఞానపు చీకటికీ దీపము నీవే అన్యాయమునెదిరించే ధర్మము నీవే
నీవే కృష్ణా... నీవే కృష్ణా... నీవే కృష్ణా

రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా
రా రా కృష్ణయ్యా..... రా రా కృష్ణయ్యా

చరణం: 2
కుంటివాని నడిపించే బృందావనం గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం
కుంటివాని నడిపించే బృందావనం గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం
మూఢునికీ జ్ఞానమొసగు బృందావనం మూగవాని పలికించే బృందావనం
మూఢునికీ జ్ఞానమొసగు బృందావనం మూగవాని పలికించే బృందావనం
అందరినీ ఆదరించు సన్నిధానం అభయమిచ్చి దీవించే సన్నిధానం
సన్నిధానం... దేవుని.. సన్నిధానం.. సన్నిధానం

రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా
రా రా కృష్ణయ్యా.....
కృష్ణా కృష్ణా రా రా కృష్ణా

చరణం: 3
కరుణించే చూపులతో కాంచవయ్యా శరణొసగే కరములతో కావవయ్యా
కరుణించే చూపులతో కాంచవయ్యా శరణొసగే కరములతో కావవయ్యా
మూగవాని పలికించి బ్రోవవయ్యా కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా
మూగవాని పలికించి బ్రోవవయ్యా కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా
నిన్ను చూసి బాధలన్ని మరిచేనయ్యా ఆధారము నీవేరా రా రా కృష్ణా
నిన్ను చూసి బాధలన్ని మరిచేనయ్యా ఆధారము నీవేరా రా రా కృష్ణా

కృష్ణా కృష్ణా రా రా కృష్ణా
రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా
దీనులను కాపాడా రా రా కృష్ణయ్యా
రా రా కృష్ణయ్యా రా రా కృష్ణయ్యా

******  ******   ********

చిత్రం: రాము (1968)
సంగీతం:  ఆర్. గోవర్ధన్
సాహిత్యం:  దాశరథి
గానం:  సుశీల

పల్లవి:
మామిడికొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే
మాటలు రాని కోయిలమ్మ పాడునులే
ఆనందంతో... అనురాగంతో... నా మది ఆడునులే

మామిడికొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే.. ఏ ఏ...
మాటలు రాని కోయిలమ్మ పాడునులే.. ఏ ఏ..
ఆనందంతో... అనురాగంతో... నా మది ఆడునులే

చరణం: 1
నన్నే నీవు అమ్మ అన్న  నాడు
మీ నాన్న మనసు గంతులు వేసి ఆడు
నన్నే నీవు అమ్మ అన్న నాడు
మీ నాన్న మనసు గంతులు వేసి ఆడు

మంచికాలం.. మరలా రాదా... ముళ్లబాటే.. పూలతోట
ఆనందంతో... అనురాగంతో... నా మది ఆడునులే..

మామిడికొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే....
మాటలు రాని కోయిలమ్మ పాడునులే....
ఆనందంతో... అనురాగంతో... నా మది ఆడునులే 

చరణం: 2
గూటిలోని పావురాలు.. మూడు
అవి గొంతు కలిపి తీయని పాట.. పాడు
గూటిలోని పావురాలు.. మూడు
అవి గొంతు కలిపి తీయని పాట.. పాడు
మంచు తెరలు.. తొలగిపోయి ...పండువెన్నెల.. కాయునులే
ఆనందంతో... అనురాగంతో... నా మది ఆడునులే

మామిడికొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే....

మాటలు రాని కోయిలమ్మ పాడునులే....
ఆనందంతో... అనురాగంతో... నా మది ఆడునులే 

******  ******   ********

చిత్రం: రాము (1968)
సంగీతం:  ఆర్. గోవర్ధన్
సాహిత్యం:  దాశరథి
గానం: ఘంటసాల

పల్లవి:
మంటలు రేపే నెలరాజా.. ఈ తుంటరి తనము నీకేలా
మంటలు రేపే నెలరాజా.. ఈ తుంటరి తనము నీకేలా
వలపులు రేపే విరులారా.. ఈ శిలపై రాలిన ఫలమేమీ
మంటలు రేపే నెలరాజా.. ఈ తుంటరి తనము నీకేలా

చరణం: 1
ఆకాశానికి అంతుందీ.. నా ఆవేదనకు అంతేదీ
ఆకాశానికి అంతుందీ.. నా ఆవేదనకు అంతేదీ
మేఘములోనా మెరుపుంది.. నా జీవితమందునా వెలుగేది
మంటలు రేపే నెలరాజా.. ఈ తుంటరి తనము నీకేలా

చరణం: 2
తీగలు తెగిన వీణియపై... ఇక తీయని రాగం పలికేనా
తీగలు తెగిన వీణియపై... ఇక తీయని రాగం పలికేనా
ఇసుక ఎడారిని ఎపుడైనా... ఒక చిన్న గులాబి విరిసేనా
మంటలు రేపే నెలరాజా... ఈ తుంటరి తనము నీకేలా

చరణం: 3
మదిలో శాంతిలేనపుడు... ఈ మనిషిని దేవుడు చేసాడు
సుఖము శాంతి ఆనందం... నా నొసటను వ్రాయుట మరిచాడు

మంటలు రేపే నెలరాజా... ఈ తుంటరి తనము నీకేలా
వలపులు రేపే విరులారా... ఈ శిలపై రాలిన ఫలమేమీ
మంటలు రేపే నెలరాజా... ఈ తుంటరి తనము నీకేలా

Most Recent

Default