Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Nari Nari Naduma Murari (1990)




చిత్రం: నారీ నారీ నడుమ మురారి (1990)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: బాలక్రిష్ణ, నిరోషా, శోభన
దర్శకత్వం: ఏ.కోదండ రామిరెడ్డి
నిర్మాత: కె.మురారి
విడుదల తేది: 25.04.1990



Songs List:



ఇరువురు భామల పాట సాహిత్యం

 
చిత్రం: నారీ నారీ నడుమ మురారి (1990)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ద్వాపరమంతా సవతుల సంతా
జ్ఞాపకముందా గోపాలా
కలియుగమందూ ఇద్దరి ముందూ
శిలవయ్యావే స్త్రీలోల
కాపురాన ఆపదలని ఈదిన శౌరీ
ఏదీ నాకూ చూపవా ఒక దారీ
నారీ నారీ నడుమ మురారీ
నారీ నారీ నడుమ మురారీ

ఇరువురు భామల కౌగిళిలో స్వామి
ఇరుకున పడి నీవు నలిగితివా
ఇరువురు భామల కౌగిళిలో స్వామి
ఇరుకున పడి నీవు నలిగితివా
వలపుల వానల జల్లులలో స్వామీ
తలమునకలుగా తడిసితివా
చిరుబురులాడేటి శ్రీదేవి 
నీ శిరసును వంచిన కథ కన్నా
రుసరుసలాడేటి భూదేవి నీ
పరువును తీసినా కథ విన్నా

గోవిందా... గోవిందా... గోవిందా...
సాగిందా జోడు మధ్యల సంగీతం
బాగుందా భామలిద్దరి భాగోతం

ఇంటిలోన పోరంటే ఇంతింత కాదయా
అన్నాడు ఆ యోగి వేమనా
నా తరమా భవసాగర మీదనూ
అన్నాడు కంచెర్ల గోపన్న
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్
ఆ మాటను విని ముంచకు స్వామీ గంగన్
ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే
సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే
ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే
సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే

ఇరువురు భామల కౌగిళిలో స్వామి
ఇరుకున పడి నీవు నలిగితివా

భామ కాలు తాకిందా కృష్ణుడే గోవిందా
అన్నాడు ఆ నందితిమ్మనా
ఒక మాట ఒక బాణము ఒక సీత నాదని
అన్నాడు సాకేత రామన్న
ఎధునాథా భామ విడుము రుక్మిణి చాలున్
రఘునాథా సీతను గొని విడు శూర్పనఖన్
రాసలీలలాడాలని నాకు లేదులే
భయభక్తులు ఉన్న భామ ఒకతే చాలులే
రాసలీలలాడాలని నాకు లేదులే
భయభక్తులు ఉన్న భామ ఒకతే చాలులే

ఇరువురు భామల కౌగిళిలో స్వామి
ఇరుకున పడి నీవు నలిగితివా
వలపుల వానల జల్లులలో స్వామీ
తలమునకలుగా తడిసితివా
గోవిందా... గోవిందా... గోవిందా...





ఏం వానో తడుముతున్నదీ పాట సాహిత్యం

 
చిత్రం: నారీ నారీ నడుమ మురారి (1990)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
ఏం వానో తడుముతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
చాటు మాటు దాటి అవీ ఇవీ చూసేస్తోందే

ఏం వానో ఉరుకుతున్నదీ
ఇది ఏం గోలో ఉరుముతున్నదీ
ఆట పాట చూపీ అటూ ఇటూ లాగేస్తోందే

ఏం వానో తడుముతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
ఆ...

చరణం: 1
చినుకు పడు క్షణమేదో చిలిపి సడి చేసిందీ
ఉలికిపడి తలపేదో కలల గడి తీసిందీ
వానమ్మా వాటేస్తుంటే మేనంతా మీటేస్తుంటే
ఇన్నాళ్ళూ ఆ..ఆ..
ఓరగ దాగెను వయ్యారం ఓగున పాడెను శృంగారం
ఏ గాలి కొట్టిందొ నీ దారి పట్టింది

ఏం వానో ఉరుకుతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
ఆ...

చరణం: 2
మనకు గల వరసేదో తెలిసి ఎద వలచిందో
మునుపు గల ముడి ఏదో బిగిసి జత కలిపిందో
ఏమైందో ఏమోనమ్మా
ఏనాడో రాసుందమ్మా
ఇన్నాళ్ళూ ఆ.. ఆ..
ఉడుకున ఉడికిన బిడియాలు ఒడుపుగ ఒలికెను చెలికాడు
నా చూపు నచ్చిందొ నాజూకు ఇచ్చింది

ఏం వానో తడుముతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
చాటు మాటు దాటి అవీ ఇవీ చూసేస్తోందే

ఏం వానో తడుముతున్నదీ
ఇది ఏం గాలో తరుముతున్నదీ
హ్మ్...




మనసులోని మర్మమును తెలుసుకో పాట సాహిత్యం

 
చిత్రం: నారీ నారీ నడుమ మురారి (1990)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: త్యాగరాజ స్వామి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

మనసులోని మర్మమును తెలుసుకో
నా మనసులోని మర్మమును తెలుసుకో...
మాన రక్షకా మరకతాంగ
మాన రక్షకా మరకతాంగ

నా మనసులోని మర్మమును తెలుసుకో
నా మనసులోని మర్మమును తెలుసుకో...
మదనకీలగ మరిగిపోక
మదనకీలగ మరిగిపోక
నా మనసులోని మర్మమును తెలుసుకో

ఇనకులాబ్ద నీవే గాని వేరెవరూ లేరు 
దిక్కెవరూ లేరు ఆనంద హృదయా
మనసులోని మర్మమును తెలుసుకో
అనువుగాని ఏకాంతాన ఏ కాంతకైనా
ఆకాంక్ష తగున రాకేందు వదనా
మనసులోని మర్మమును తెలుసుకో

మునుపు ప్రేమ గల దొరవై 
సదా తనువు నేలినది గొప్ప కాదయా...
మదని ప్రేమకథ మొదలై 
ఇలా అదుపు దాటినది ఆదుకోవయా...

కనికరమ్ముతో ఈవేళ - ఊ ఊ ఊ
కనికరమ్ముతో ఈవేళ నా కరముబట్టు - హా
త్యాగరాజ వినుతా

మనసులోని మర్మమును తెలుసుకో
నా మనసులోని మర్మమును తెలుసుకో

మరుల వెల్లువల వడినై
ఇలా దరులు  దాటితిని నిన్ను చేరగా...
మసక వెన్నెలలు ఎదురై
ఇలా తెగువ కూడదని మందలించవా

కలత ఎందుకిక ఈ వేళ.. ఆ ఆ ఆ
కలవరమ్ముతో ఈవేళ నా కరము వణికే - ఆ ఆ
ఆగడాల వనితా...

మనసులోని మర్మమును తెలుసుకో
మదనకీలగ మరిగిపోక
మాన రక్షకా మరకతాంగ
నా మనసులోని మర్మమును తెలుసుకో





వయసు సొగసు పాట సాహిత్యం

 
చిత్రం: నారీ నారీ నడుమ మురారి (1990)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

వయసు సొగసు 



పెళ్ళంటూనే వేడెక్కిందే గాలీ పాట సాహిత్యం

 
చిత్రం: నారీ నారీ నడుమ మురారి (1990)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పెళ్ళంటూనే వేడెక్కిందే గా...లీ
మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ
పెళ్ళంటూనే వేడెక్కిందే గా...లీ
మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ

ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా..
కంచె దాటింది ఆత్రాల గోలా...

పెళ్ళంటూనే వేడెక్కిందే గాలీ
మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ
ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
మ్మ్... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి

చరణం: 1
తరిమే తరుణంతో పరువం తడబడుతోంది
కులికే చెలితాపం కుదురుగ నిలబడనంది
తరిమే తరుణంతో పరువం తడబడుతోంది
కులికే చెలితాపం కుదురుగ నిలబడనంది

మనసే నీకోసం... ఏటికి ఎదురీదింది
మురిపెం తీరందే... నిదురను వెలివేస్తుంది
చెలరేగే చెలి వేగం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది
ఆ... ముడులేసే మనువైతే మక్కువ మత్తుగ దిగుతుంది

ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి

ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా..
కంచె దాటింది ఆత్రాల గోలా...

పెళ్ళంటూనే వేడెక్కిందే గాలీ
మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ
ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి

చరణం: 2
సాయం రమ్మంటూ ప్రాయం కబురంపింది
బిగిసే బంధంలో బందీ కమ్మంటోంది
సాయం రమ్మంటూ ప్రాయం కబురంపింది
బిగిసే బంధంలో బందీ కమ్మంటోంది

వీచే ప్రతిగాలీ... వయసును వేధిస్తోంది
జతగా నువ్వుంటే... పైటకు పరువుంటుంది
మితిమీరె మొగమాటం అల్లరి అల్లిక అడిగింది
ఆ... మదిలోని మమకారం మల్లెల పల్లకి తెమ్మంది

ఆ.....

ముంచుకొస్తోంది ముహూర్తాల వేళా..
కంచె దాటింది ఆత్రాల గోలా...
పెళ్ళంటూనే వేడెక్కిందే గా...లీ
మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ
ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి
ఆ... ఏదీ ఆ మాటే చెప్పు ఇంకోసారి




దుత్తలాగున్నావే పాట సాహిత్యం

 
చిత్రం: నారీ నారీ నడుమ మురారి (1990)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

దుత్తలాగున్నావే


Most Recent

Default