చిత్రం: వీరసింహారెడ్డి (2023)
సంగీతం: థమన్. యస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కరిముల్లా
రాజసం నీ ఇంటిపేరు
పౌరుషం నీ ఒంటి తీరు
నిన్ను తలచుకున్నవారు
లేచి నించొని మొక్కుతారు
అచ్చ తెలుగు పౌరుషాల… రూపం నువ్వయ్యా
అలనాటి మేటి రాయలోరి… తేజం నువ్వయ్యా
మా తెల్లవారే పొద్దు… నువ్వై పుట్టినావయ్యా
మా మంచిచెడ్డల్లోనా జతకట్టినావయ్యా
జన్మబంధువంటు నీకు జైకొట్టినామయ్యా
జై బాలయ్య… జై బాలయ్యా
జై జై బాలయ్య… జై బాలయ్యా
జై బాలయ్య… జై బాలయ్యా
మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా
(జై బాలయ్య… జై బాలయ్యా
జై జై బాలయ్య… జై బాలయ్యా
జై బాలయ్య… జై బాలయ్యా
మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా)
రాజసం నీ ఇంటిపేరు
పౌరుషం నీ ఒంటి తీరు
నిన్ను తలచుకున్నవారు
లేచి నించొని మొక్కుతారు
ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
సల్లంగుంది నీ వల్లే
మా నల్లపూస నాతాడు
మా మరుగు బతుకులలోనే
పచ్చబొట్టు సూరీడు
గుడిలో దేవుడి దూత నువ్వే
మెరిసే మా తలరాత నువ్వే
కురిసే వెన్నెల పూత నువ్వే
మా అందరి గుండెల మోత నువ్వే
ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఏ, తిప్పుసామి కోరమీసం
తిప్పు సామి ఊరికోసం
నమ్ముకున్న వారి కోసం
అగ్గిమంటే నీ ఆవేశం
నిన్ను తాకే దమ్మున్నోడు
లేనే లేడయ్యా
ఆ మొల్తాడు కట్టిన
మొగ్గోడింకా పుట్నే లేదయ్యా
పల్లె నిన్ను చూసుకుంటా
నిమ్మలంగా ఉందయ్యా
నీదే పేరు రాసి రక్షా రేకు కట్టుకుందయ్యా
మూడు పొద్దుల్లోన
నిన్ను తలిచి మొక్కుతాందయ్యా
జై బాలయ్య… జై బాలయ్యా
జై జై బాలయ్య… జై బాలయ్యా
జై బాలయ్య… జై బాలయ్యా
మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా
సుగుణ సుందరి పాట సాహిత్యం
చిత్రం: వీరసింహారెడ్డి (2023)
సంగీతం: థమన్. యస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రామ్ మిరియాల, స్న్గిగ్డ శర్మ
సీమ కుట్టిందేయ్
సిట్టి సీమ కుట్టిందేయ్
దిల్లు కందిపొయ్యేలాగా
దిట్టంగా కుట్టిందేయ్
ప్రేమ పుట్టిందే..
పిచ్చి ప్రేమ పుట్టిందే..
నిన్ను చూసి చూడంగానే
కుడి కన్ను కొట్టిందే
నువ్వు హాట్’యు హాట్’యు
ఘాటు నాటు సీమ పటాస్ యే
నా స్వీట్'యు స్వీట్'యు
లిపు యు నీకు జ్యూసు యూ గలసే
నీ సోకు టాప్ క్లాసే
నిన్నొద్దులుకుంటే లాసే
మన క్లాస్’యు మాసూ
కలయిక అబ్భో అదుర్స్ యే
సుగుణ సుందరి
సుగుణ సుందరి
సుర సుర సూపులా
రాకుమారి
(ఏయ్ మల్లా)
సుగుణ సుందరి
సుగుణ సుందరి
పెళ్లి గంట కొట్టినాధే
అత్తింటికి రా మరి
సీమ కుట్టిందేయ్
సిట్టి సీమ కుట్టిందేయ్
దిల్లు కందిపొయ్యేలాగా
దిట్టంగా కుట్టిందేయ్
ప్రేమ పుట్టిందే
పిచ్చి ప్రేమ పుట్టిందే
నిన్ను చూసి చూడంగానే
కుడి కన్ను కొట్టిందే
ఊరకుండదు తీరికుండదు
ఊసుపోని చీమ
మనసులోకి ధూరీ ధూరీ
మంట పెడదమ్మా
ఊపు తగ్గని, ఉడుకు తగ్గని
ఊర మాస్’యూ చీమా
తీపి చెరుకు జంట చూసి
గంటా కొడతాదమ్మా
హే సిట్టి సిట్టి సిట్టి సిట్టి
సిట్టి సిట్టి సీమ
హే కుట్టి కుట్టి కుట్టి కుట్టి
సంపుతాందీ మామ
హే సిట్టి సిట్టి సిట్టి సిట్టి
సిట్టి సిట్టి సీమ
హే కుట్టి కుట్టి కుట్టి కుట్టి
సంపుతాందీ మామ
సన్నజాజి తీగనడుం ఒంపుల్లో
సన్న ధరం ఉయ్యాలేసి ఊగలే
సీమకారం కోర మీసం మెలికల్లో
సిట్టి పెదవి తేనే సీసా పొంగాలే
బాగా నచ్చవే బాలమణి
భలేగా పెంచావే బంగారాన్ని
అలాగ ఐతే ఈ అందాలను
నిన్ను చుట్టు ముట్టి చుట్టుకునేయ్
చుట్టలైపోనీ..
సుగుణ సుందరి
సుగుణ సుందరి
సుర సుర సూపులా
రాకుమారి
(ఏయ్ మల్లా)
సుగుణ సుందరి
సుగుణ సుందరి
పెళ్లి గంట కొట్టినాదే
అత్తింటికి రా మరి
సీమ కుట్టిందేయ్
సిట్టి సీమ కుట్టిందేయ్
దిల్లు కందిపొయ్యేలాగా
దిట్టంగా కుట్టిందేయ్
ప్రేమ పుట్టిందే
పిచ్చి ప్రేమ పుట్టిందే
నిన్ను చూసి చూడంగానే
కుడి కన్ను కొట్టిందే..
మా బావ మనోభావాలు పాట సాహిత్యం
చిత్రం: వీరసింహారెడ్డి (2023)
సంగీతం: థమన్. యస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సాహితి చాగంటి, యామిని, రేను కుమార్
బావ బావ బావ
బావ బావ బావ
చుడీదారు ఇస్తామంటా ఆడికి
వొద్దొద్దు అన్నా ఎండలకాలం వేడికి
ఎంచక్కా తెల్ల చీర కట్టి
జళ్ళో మల్లె పూలే చుట్టి
వెళ్లేలోపే ముఖం ముడుసుకున్నడే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
బావ బావ బావ
అత్తరు ఘాటు నచ్చదంట ఆడికి
అదే రాసుకెల్లా నేను ఒంటికి
ఇక చుస్కో నానా గత్తర చేసి
ఇల్లు పీకి పందిరెసి
కంచాలొదిలి మంచం కరుసుకున్నడే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
బావ బావ బావ
బావ బావ బావ
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
ఖతార్ నుండి కన్నబాబని
ఇస్కూలు ఫ్రెండు ఇంటికొస్తేను
ఈడేందుకు వచ్చిండని
ఇంతెత్తుని ఎగిరి రేగాడిండే
ఓటర్ లిస్ట్ ఓబుల్ రావు
వయసెంతని నన్నడిగితేనూ
గదిలో దూరి గొల్లలేసి
గోడలు బీరువాలు గుద్దేసిండే
యేటి సేద్ధమే తింగరి బుచ్చి
ఆదికేమో నువ్వంటే పిచ్చి
ఏదో బతిమాలి బుజ్జగించి
చేసేసుకో లాలూచి
హే మెత్తగుండి మొండిగుంటడు
ఎడ్డం అంటే తెడ్డం అంటడు
సిటీకి మాటికీ సిన్నబుచ్చుకుంటాడే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
బావ బావ బావ
మాసు మొగుడొచ్చాడే పాట సాహిత్యం
చిత్రం: వీరసింహారెడ్డి (2023)
సంగీతం: థమన్. యస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: మనో, రమ్యా బెహ్రా
ఏంది రెడ్డి ఏంది రెడ్డి
ఏడ చూడు నీదే జోరు
తొడలు కోట్టి హడలగోట్టి
మొగతాంది నీదే పేరు
ఏడ నుంచి తన్నుకొస్తదో
తాటదీసే నీలో ఊపు
ఎంత పొడుగు పోటుగాడు
రానేలేడు నీ దరిదాపు
పుటకతోనే మనలో ఉన్నాయ్
నాన్న గారి జీన్స్లో జీన్సు
సేమ్ టు సేమ్ ఆ కటౌటే
మనకు రెఫెరెన్సు
నీ దున్నుడు దూకుడు
ముట్టడి చేస్తాందే
నీ లాగుడు ఊగుడు
నను అట్టుడుకిస్తాందే
మాసు మొగుడొచ్చాడే
మ మాస్ మొగుడొచ్చాడే
ఏ కొక రైక గ్యాప్ చూసి
గిల గిల గిచ్చాడే
మాసు మొగుడొచ్చాడే
మ మాస్ మొగుడొచ్చాడే
అరె మూతి ముద్దుల్
కానూకిచ్చి మీసం గుచ్చాడే
ఏంది రెడ్డి ఏంది రెడ్డి
ఏడ చూడు నీదే జోరు
తొడలు కోట్టి హడలగోట్టి
మొగతాంది నీదే పేరు
జింగిలాలో జింగిలాలో
అరె జింగిలాలో జింగిలాలో
హే జింగి జింగి లాలలో
జింగిలాలో జింగిలాలో
అరె జింగిలాలో జింగిలాలో
జింగి జింగి జింగి జింగిలాలో
ఏ రంగు రంగు రెక్కలా గుర్రంలా
చెంగు చంగునోస్తివే ఓ పిల్లా
నీ మల్లెపూల కళ్ళేమిచ్చి నాకిలా
మంచి చెడ్డ చూసుకో మరదలా
హే సీమ కత్తి చూపుతో
సిగ్గులేని కొస్తివె సిలుకు లుంగీ చుట్టుకున్న సింగంలా
నా కట్టుబొట్టుతో సహా
పుట్టుమచ్చతో భలే
పులకరింతలొచ్చెనే నీ దయ వల్ల
కులుకు చుస్తే కులుమనాలి
పట్టపగలే పొగలో సెగలు
పూల రెక్కలు పులకించందే
తీరదే గుబులు
నీ మాటకి ధాటికి బుగ్గలు కితకితలే
నా ఆటకి పోటెత్తవ రాతిరి రాసి కథలే
మాసు మొగుడొచ్చాడే
మ మాస్ మొగుడొచ్చాడే
ఏ కొక రైక గ్యాప్ చూసి
గిల గిల గిచ్చాడే
మాసు మొగుడొచ్చాడే
మ మాస్ మొగుడొచ్చాడే
అరె మూతి ముద్దుల్
కానూకిచ్చి మీసం గుచ్చాడే
చిత్రం: అఖండ (2021)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: కళ్యాణ చక్రవర్తి
గానం: యస్.పి.బి.చరణ్ , యమ్.యల్.శ్రుతి
అడిగా… అడిగా… పంచ ప్రాణాలు నీ రాణి గా
జతగా… జతగా… పంచు నీ ప్రేమ పారాణిగా
చిన్న నవ్వే రువ్వి మార్చేసావే… నా తీరు నీ పేరుగా
చూపు నాకే చుట్టే కట్టేసావే… నన్నేమో సన్నాయిగా
కదిలే కలలే కాళ్లవాకిళ్ళలో కొత్తగా
కౌగిలి ఓ సగం పొలమారిందిలే వింతగా
అడిగా… అడిగా… పంచ ప్రాణాలు నీ రాణి గా
జతగా… జతగా… పంచు నీ ప్రేమ పారాణిగా
సరిలేని సమారాలు సరిపోని సమయాలు తొలిసారి చూసాను నీతో
విడిపోని విరహాలు వీడలేని కలహాలు తెలిపాయి నీ ప్రేమ నాతో
ఎల్ల లెవీ లేని ప్రేమ నీకే ఇచ్చానులే నేస్తమా
వేళ్ళ లేనే నేనే నిన్నే ధాటి నూరేళ్ళ నా సొంతమా
కననీ విననీ సుప్రభాతాల సావాసమా
సెలవే కోరని సిగ్గులోగిళ్ల శ్రీమంతమా
అడిగా… అడిగా… పంచ ప్రాణాలు నీ వాని గా
జతగా… జతగా… పంచు నీ ప్రేమ పారాణిగా
సింధూర వర్ణాల చిరునవ్వు హారాలు కలబోసి కదిలాయి నాతో
మనిషేమో సెలయేరు మనసేమో బంగారు సరిపోవు నూరేళ్లు నీతో
ఇన్ని నాళ్లూ లేనే లేదే నాలో నాకింత సంతోషమే
మల్లె జన్మే ఉంటె కావా లంట నీచెంత ఏకాంతమే
కదిలే కలలే కాళ్లవాకిళ్ళలో కొత్తగా
కౌగిలి ఓ సగం పొలమారిందిలే వింతగా
అడిగా… అడిగా… పంచ ప్రాణాలు నీ రాణి గా
జతగా… జతగా… పంచు నీ ప్రేమ పారాణిగా
చిత్రం: రూలర్ (2019)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సాయిచరణ్ భాస్కరుని
అడుగడుగో యాక్షన్ హీరో
అరె దేకొయారో అడుగడుగు తనదేమ్ పేరో
మరి తనదేమ్ ఊరో
అడుగులలో అది ఏమ్ ఫైరో
ఛలో సెల్యూట్ చేయ్ రో
జై కొడుతూ సీటీ మారో సెల్ఫీ లే యారో
కింగ్ ఆఫ్ ది జంగిల్ లా యాంగ్రీ అవెంజర్ లా
రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ లా వచ్చాడు రా
చూపుల్లోనే వీడు క్లాసు
మనసే బిసి సెంటర్ మాసు
పక్కా వైట్ కాలర్ కార్పొరేటు లీడరు రా
మండే సూర్యుడు వీడు మండే సూర్యుడు
గ్రహణాలే ఎదురైనా చేధిస్తాడు
మళ్లీ వస్తాడు మళ్లీ మళ్లీ ఒస్తాడు
సరికొత్త చరితలనే శృష్టిస్తాడు
లోకాలే తిరిగినా ఏ ఎత్తుల్లోకి ఎదిగినా
తను పుట్టిన మట్టిని వదలడు ఈ నేలబాలుడు
ఏ రాజ్యలేలినా ఏ శిఖరాలే శాసించినా
జన్మిచ్చిన తల్లికి ఎప్పుడు ఓ చంటి పాపడు
ఒకమాటలో గుణవంతుడు
తన బాటలో తలవంచడు
ప్రతి ఆటలో ప్రతి వేటలో
అప్పర్ హ్యాండ్ వీడిదే
సక్సెస్ సౌండ్ వీడిదే...
మండే సూర్యుడు వీడు మండే సూర్యుడు
గ్రహణాలే ఎదురైనా చేధిస్తాడు
మళ్లీ వస్తాడు మళ్లీ మళ్లీ ఒస్తాడు
సరికొత్త చరితలనే శృష్టిస్తాడు
అరెరే ఆ గ్లామరు అది హ్యాండ్సమ్నెస్ కె గ్రామరు
జర చూపించాడో టీజరు ఇక చూపు తిప్పరు
అమ్మాయి లెవ్వరు వీడు కంపెని ఇస్తే వదలరు
మరి తప్పదు కద ఈ డేంజరు మార్చాలి నంబరు
సరదాలకే సరదా వీడు
సరదా అంటే అసలాగడు
సరసాలలో శృతి మించడు
ఫన్ టైము క్రిష్ణుడు ఫుల్ టైము రాముడు
మండే సూర్యుడు వీడు మండే సూర్యుడు
గ్రహణాలే ఎదురైనా చేధిస్తాడు
మళ్లీ వస్తాడు మళ్లీ మళ్లీ ఒస్తాడు
సరికొత్త చరితలనే శృష్టిస్తాడు
మండే సూర్యుడు వీడు మండే సూర్యుడు
గ్రహణాలే ఎదురైనా చేధిస్తాడు
మళ్లీ వస్తాడుమళ్లీ మళ్లీ ఒస్తాడు
సరికొత్త చరితలనే శృష్టిస్తాడు
పుడతాడు తాడుతాడు పాట సాహిత్యం
చిత్రం: రూలర్ (2019)
సంగీతం: చిరంతన్ భట్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: సింహా, చాందిని విజయ్ కుమార్ షా
ఎర ఎర్ర ఎర ఎర్ర నా పెదవుల్ని ముద్దాడుకోరా
హ హ హా...
గిర గిర్ర గిర గిర్రా తిరిగేస్తుంటే నను చూడవేరా
హ హ హా...
హే సర సర సర్రా తెగ నచ్చేసావు కుర్ర
హే జర్ర జర్ర జర్రా నా నడుమే జీలకర్ర
కర్చీఫె యేస్కో జల్ది జల్దీగా
పుడతాడు తాడుతాడు ఎవడైనా
మగవాడు వాడు వాడు ఎవడైనా
పుడతాడు తాడుతాడు ఎవడైనా
మగవాడువాడు వాడు ఎవడైనా
అల్లావుద్దీన్ కే నేను అందని దీపాన్ని
నీ కోసం వచ్చేసా లుక్కేసుకో
ఐజాక్ న్యూటన్కే దొరకని ఆపిల్ని
దర్జాగ దొరకేశ పట్టేసుకో
నువ్వు కెలికితే కెలికితే ఇట్టా
నా ఉడుకుని దుడుకుని చూపిస్తా
సరసపు సరకుల బుట్ట
నీ బరువుని సులువుగ మోసేస్తా
మిసమిస మెరుపుల పిట్ట
నీ తహ తహ తలుపులు మూసేస్తా
సొగసరి గడసరి చుట్ట
నీ సెగలను పొగలను ఊదేస్తా
సోదా చేస్కో గల్లా ముల్లీగా
పుడతాడు తాడుతాడు ఎవడైనా
మగవాడు వాడు వాడు ఎవడైనా
పుడతాడు తాడుతాడు ఎవడైనా
మగవాడువాడు వాడు ఎవడైనా
ఛాంపెను బాటిల్లో సొంపుల్ని అందిస్తే
దిక్కుల్ని చూస్తావే ఎత్తేసుకో
డైరక్టు అందాన్ని వాటెయడం కన్నా
అర్జెంటు పనులేంటి ఆపేసుకో
నీ ఇక ఇక పక పక వల్ల
నే రక రకములు చూపిస్తా
ఎగరకు ఎగరకు పిల్లా
నా ఎదిగిన వయసును పంపిస్తా
నిగ నిగ నవరస గుల్లా
నిను కొరకను కొరకను మింగేస్తా
కిట కిట కిటుకులు అన్ని
నే టక టక లాగేస్తా
రాస్కో పూస్కో ఉండకు ఖాళీగా...
ఎర ఎర్ర ఎర ఎర్ర నా పెదవుల్ని ముద్దాడుకోరా
గిర గిర్ర గిర గిర్రా తిరిగేస్తుంటే నను చూడవేరా
హే సర్ర సర సర్రా తెగ నచ్చేసావు కుర్ర
హే జర్ర జర్ర జర్రా నా నడుమే జీలకర్ర
కర్చీఫె యేస్కో రాస్కో పూస్కో
సోదాలన్నీ చేస్కో గల్లా ముల్లీగా
పుడతాడు తాడుతాడు ఎవడైనా
మగవాడు వాడు వాడు ఎవడైనా
పుడతాడు తాడుతాడు ఎవడైనా
మగవాడువాడు వాడు ఎవడైనా
చిత్రం: NTR (కథానాయకుడు) (2019)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: కె.శివశక్తి దత్త, డా. కె. రామకృష్ణ, యం. యం. కీరవాణి
గానం: శరత్ సంతోష్ , యం. యం. కీరవాణి, కాల భైరవ, శ్రీనిధి తిరుమల, మోహన భోగరాజు
నమాతా పితా నైవ
బంధుర్నమిత్రా
నమే ద్వేషరాగౌ
నమే లోభమోహౌ…
న పుణ్యం న పాపం
న సౌఖ్యం న దు:ఖం
చిదానందరూప:
శివోహం శివోహం..
తల్లి ఏది? తండ్రి ఏడి?
అడ్డు తగిలే బంధమేదీ?
మమతలేవీ? మాయలేవీ?
మనసుపొరల మసకలేవీ?
నీ ఇల్లు నీ వాళ్ళు
నీదంటూ ఈ చింత
సుంతైన లేని ఈ నేల పై నడయాడు ఋషివో
కృషితో నాస్తి దుర్భిక్షమని లోకాన్ని శాసించు
మనిషివో.. ఋషివో.. రాజర్షివో..
ఎవరివో.. నీవెవరివో.. నీవెవరివో.. ఎవరివో
న మంత్రో న తీర్ధం
న యజ్ఞా: న వేదం
న ధర్మో నచార్ధో
న మోక్ష : న కామం
న మృత్యుర్నశంకా
న మే జాతి భేదం
చిదానందరూప:
శివోహం శివోహం..
జాగృతములో జాగు ఏదీ? రాత్రి ఏదీ? పగలు ఏదీ?
కార్యదీక్షా బద్ధుడవుగా.. అలుపు ఏదీ? దిగులు ఏదీ?
ఉఛ్వాస నిశ్వాసముల ప్రాణయాగాన్ని
ఉర్వీజనోద్ధరణకై చేయు రాజయోగిీ..
కదనరంగాన కర్మయోగీ
అహం నిర్వికల్పో
నిరాకర రూపో
విభుర్వ్యాప్య సర్వత్ర
సర్వేంద్రియాణాం
న తేజో నవాయుర్ణ
భూమి ర్న వ్యోమం
చిదానందరూప:
శివోహం శివోహం..
నిర్వసన, వాసాన్న సంక్షేమ
స్వాప్నికుడు ఇతడు..
నిష్క్రియా ప్రచ్ఛన్న సంగ్రామ
శ్రామికుడు ఇతడు..
నిరత సంఘశ్రేయ సంధాన
భావుకుడు ఇతడు..
మహానాయకుడు ఇతడు..
మహానాయకుడు ఇతడు..
నమాతా పితా నైవ
బంధుర్నమిత్రా
నమే ద్వేషరాగౌ
నమే లోభమోహౌ…
న పుణ్యం న పాపం
న సౌఖ్యం న దు:ఖం
చిదానందరూప:
శివోహం శివోహం..
న మంత్రో న తీర్ధం
న యజ్ఞా: న వేదం
న ధర్మో నచార్ధో
న మోక్ష : న కామం
న మృత్యుర్నశంకా
న మే జాతి భేదం
చిదానందరూప:
శివోహం శివోహం..
అహం నిర్వికల్పో
నిరాకర రూపో
విభుర్వ్యాప్య సర్వత్ర
సర్వేంద్రియాణాం
న తేజో నవాయుర్ణ
భూమి ర్న వ్యోమం
చిదానందరూప:
శివోహం శివోహం..
చిత్రం: NTR (కథానాయకుడు) (2019)
సంగీతం: యం. యం. కీరవాణి
సాహిత్యం: కె.శివశక్తి దత్త, డా. కె. రామకృష్ణ, యం. యం. కీరవాణి
గానం: శరత్ సంతోష్ , యం. యం. కీరవాణి, కాల భైరవ, శ్రీనిధి తిరుమల, మోహన భోగరాజు
నమాతా పితా నైవ
బంధుర్నమిత్రా
నమే ద్వేషరాగౌ
నమే లోభమోహౌ…
న పుణ్యం న పాపం
న సౌఖ్యం న దు:ఖం
చిదానందరూప:
శివోహం శివోహం..
తల్లి ఏది? తండ్రి ఏడి?
అడ్డు తగిలే బంధమేదీ?
మమతలేవీ? మాయలేవీ?
మనసుపొరల మసకలేవీ?
నీ ఇల్లు నీ వాళ్ళు
నీదంటూ ఈ చింత
సుంతైన లేని ఈ నేల పై నడయాడు ఋషివో
కృషితో నాస్తి దుర్భిక్షమని లోకాన్ని శాసించు
మనిషివో.. ఋషివో.. రాజర్షివో..
ఎవరివో.. నీవెవరివో.. నీవెవరివో.. ఎవరివో
న మంత్రో న తీర్ధం
న యజ్ఞా: న వేదం
న ధర్మో నచార్ధో
న మోక్ష : న కామం
న మృత్యుర్నశంకా
న మే జాతి భేదం
చిదానందరూప:
శివోహం శివోహం..
జాగృతములో జాగు ఏదీ? రాత్రి ఏదీ? పగలు ఏదీ?
కార్యదీక్షా బద్ధుడవుగా.. అలుపు ఏదీ? దిగులు ఏదీ?
ఉఛ్వాస నిశ్వాసముల ప్రాణయాగాన్ని
ఉర్వీజనోద్ధరణకై చేయు రాజయోగిీ..
కదనరంగాన కర్మయోగీ
అహం నిర్వికల్పో
నిరాకర రూపో
విభుర్వ్యాప్య సర్వత్ర
సర్వేంద్రియాణాం
న తేజో నవాయుర్ణ
భూమి ర్న వ్యోమం
చిదానందరూప:
శివోహం శివోహం..
నిర్వసన, వాసాన్న సంక్షేమ
స్వాప్నికుడు ఇతడు..
నిష్క్రియా ప్రచ్ఛన్న సంగ్రామ
శ్రామికుడు ఇతడు..
నిరత సంఘశ్రేయ సంధాన
భావుకుడు ఇతడు..
మహానాయకుడు ఇతడు..
మహానాయకుడు ఇతడు..
నమాతా పితా నైవ
బంధుర్నమిత్రా
నమే ద్వేషరాగౌ
నమే లోభమోహౌ…
న పుణ్యం న పాపం
న సౌఖ్యం న దు:ఖం
చిదానందరూప:
శివోహం శివోహం..
న మంత్రో న తీర్ధం
న యజ్ఞా: న వేదం
న ధర్మో నచార్ధో
న మోక్ష : న కామం
న మృత్యుర్నశంకా
న మే జాతి భేదం
చిదానందరూప:
శివోహం శివోహం..
అహం నిర్వికల్పో
నిరాకర రూపో
విభుర్వ్యాప్య సర్వత్ర
సర్వేంద్రియాణాం
న తేజో నవాయుర్ణ
భూమి ర్న వ్యోమం
చిదానందరూప:
శివోహం శివోహం..
చిత్రం: రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్.పి. బాలు, పి. సుశీల
ఆసలే చిన్నదాన్ని కసిగా వున్నదాన్ని
అర్ధరాత్రి మేళమైతే సంకురాత్రి
తెల్లవారి తాళమేస్తే శివరాత్రి
జంగ్లా జం జం... జంగ్లా జం జం...జంగ్లా జం జం... జా
అసలే గడుసువాణ్ణి అందులో గట్టివాణ్ణి
ఆరిరాత్రి మేళమైతే - సంకురాత్రి
తెల్లవారి తాళమేస్తే శివరాత్రి
జంగ్లా జం జం... జంగ్లా జం జం...జంగ్లా జం జం... జా
ఇప్పుడు పిల్లా నా కిల్లానా సూశావంటే అంతే
తానా అంటే తందానా అనకుంటే గల్లంతే
అసలే వేటగాణ్ణి - అందులో నీటుగాణ్ణి
ఉరిమే మబ్బై రాకు రాకు రాకు ఉలిక్కి పడతాను
తరిమే పిడుగై రాకు రాకు రాకు గతుక్కు మంటాను.
ఆతుక్కుపోతాను...
వయసొక వాగై పొంగుతువుంటే వాలెయ్యడమే మందు
చీటికి మాటికి చిందెయ్యలేనంచే తల్లకిందు
అందులో దీటుగాణ్ణి...
ఒకటే కసిగా ఆడిపాడమాకు ఒణుక్కు పోతాను
వయసే బుసగా పైకి పైకి రాకు రాకు ఒణుక్కు మంటాను
చిలక్కి చెబుతాను...
అపూర్వ సహోదరులం పాట సాహిత్యం
చిత్రం: రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్.పి. బాలు, మాధవపెద్ది రమేష్
అపూర్వ సహోదరులం అనురాగ సుధాఝరులం
ఇద్దరు ఇద్దరు కలసిన ఈ ఉదయం సూర్య చంద్రోదయం
అమ్మ అనే రెండక్షరాలు అన్నదమ్ముల రూపాలు
గంగా యమునా సంగమించిన కౌగిలి గుడిలో దీపాలు
అనురాగంలో దేవుడు రాసిన అట్టితెలుగు కీర్తన
అన్నా అన్నా అన్నా
అనుబంధానికి దేవుడు చేసిన అపురూప కల్పన
తమ్ముడు మా తమ్ముడు
ఇద్దరు కలిసిన ఈ ఉదయం మమతకు మహోదయం
ఇన్నాళ్ళకు ఆ దేవుడు నాకో తీయని వరమిచ్చాడు.
నా అన్న వాడు లేడనుకుంటే, అన్నీ తానైవచ్చాడు ..
అన్నీ తానైపున్నాడు..
ఇన్నాళ్ళకు ఈ రాముడుకి ఒక తమ్ముడు తోడైవచ్చాడు
నా అయోధ్యలో అడవి దారిలో తోడూ నీడై వచ్చాడు.
తొలకరి ఆశలు తెచ్చాడు.
ఇద్దరు కలిసిన యీ ఉదయం ప్రేమకు హిమాలయం...
రామాయణం పాట సాహిత్యం
చిత్రం: రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్.పి. బాలు, మాధవపెద్ది రమేష్
కోరస్
రామాయణం దివ్య ప్రేమాయణం
సర్వదీనావనం విత్య పారాయణం
రామబ్రహ్మను రాముడెందుకే రావే సీతాభామినీ
రాముడికేవే పదితలకాయలు వాడికి తెలుసా రాక్షసమాయలు
తలలెన్నుంటేనేం.. రావణా... నీ తలసన్నే వాడుండగా
కూలిన ఆ తాటక మారీచులు - నీ కులపోళ్ళని మరిచేవా
ముక్కు చెవులూ తెగిన శూర్పణఖ ముద్దుల చెల్లెలు
అది మరిచేవా
ఆయ్ వదరికే సీతా వదరకే ఆట్టె వదరకే
గడువిస్తుంటిని రేపటి వరకు వస్తా రేపొస్తా నీ పని చూస్తా
అమ్మా సీతా నీకివియే నా సాష్టాంగ దండ ప్రణామాలు
శ్రీరామబంటునే తల్లీ అనవాలుగా అందుకోవే
ఆ శ్రీరామ చంద్రుని ముద్రిక
నింపకే కన్నీళ్లు తల్లీ ఈ లంక చెర ఎన్నాళ్లు
చెరబాప స్వామి రాకా తప్పదు. రావణుడు నేలకూలక తప్పదు.
ఎవడురా మర్కట నీవు మతిలేక మా లంకజొచ్చినావు
శ్రీరామబంటును నేను మాతల్లి సీతమ్మ జాడ తెలియగపిచ్చినాను
ఏమరా ఆ రామకార్యం ఏమురా నీ కోతి దౌత్యం
ధర్మమార్గము ననుసరించి స్వామికి సీతమ్మని అప్పగించి
శరణు కోరితే నీకు మంచి లేదా మరణ మొకటే నీకు శాస్తి
దహనం దహనం లంకాదహసం
లంకాపై భవ నాశనం రావణ దర్ప వినాశనం
కోరస్: దహనం దహనం లంకాదహసం లంకావైభవ నాశనం
రావణ దర్ప వినాశనం
రామజయం శ్రీరామ జయం - రామజయం శ్రీరామ్ జయం
రామజయం శ్రీరామ జయం రామజయం శ్రీరామ జయం
సీతాకాలం వచ్చింది పాట సాహిత్యం
చిత్రం: రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్.పి. బాలు, పి. సుశీల
సీతాకాలం వచ్చింది రామా రామా
చిమ చిమ లాడింది ప్రేమ ప్రేమ
జివ్వు జివ్వు మన్నాది సిగ్గూ నిగ్గూ
వద్దు వద్దు అన్నాది హద్దు హద్దు
వణక్కు వణక్కు వణక్కు వణక్కు నేనున్నా తోడు
సణక్కు గొణక్కు వణక్కు మిణక్కు నేనే నీ గూడు
వెచ్చ వెచ్చనీ ముద్దిస్తా ముచ్చటేమిటో ఆడేస్తా
అందమైనదీ అందు కోవిది అచ్చ తెలుగులో అడిగేస్తా
పులిమీద పుట్రమ్మ వీడు
చలిమీద ఉన్నాడు చూడు
చలిగాలి వీస్తుంది ఆ చూపులో
ఇటు గాలి ఆటు సోకెనా పిలుపులో
చినుక్కు చినుక్కు చినుక్కు చినుకులు పడుతుంటే
చిరుక్కు చిరుక్కు చూపులు చిటికెలు వేస్తుంటే
వయసు వయసునై వాటేస్తా మనసు చాటున చాటేస్తా
మంచు కొండలో లేత ఎండలో మంచమేసి చలిమంటేస్తా
చెలి చూపు చలి కన్నా వేడి
నడిరేయి కూసింది కోడి
తెల్లారి పోవాల ఈ చుక్కతో
పరువాల ముచ్చట్లు దుప్పట్లలో...
చిత్రం: పట్టాభిషేకం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, యస్. జానకి
పల్లవి:
ఓ ప్రియతమా....
నీవు లేని రాతిరి నిలిచిపోయే ఊపిరి
నీవు లేని రాతిరి నిలిచిపోయే ఊపిరి
కన్నీట తడిచే కౌగిలి...
నా ప్రాణమా....
నీవు రాని రాతిరి నిలిచిపోయే జాబిలి
నీవు రాని రాతిరి నిలిచిపోయే జాబిలి
సుడిగాలి గుడిలో హారతి...
నీవు లేని రాతిరి నిలిచిపోయే ఊపిరి
చరణం: 1
తెల్లవారి వెన్నెలల్లే తెళ్ళబోవు కన్నులతో
ఈ ఎడారిదారిలో ఎదురుచూపు నౌతున్నా
కోటలోని రాతిగా మీటలేని వీణలలో
రాలిపోవు రాగమేదో నేను పాడుకుంటున్నా
నీవు నన్ను చేరిన నాడే బ్రతుకుతుంది అనురాగం
నీవు నన్ను చేరిన నాడే బ్రతుకుతుంది అనురాగం
ఈ విషాద వీధుల్లో....
అతిధి లాగ ఒక్కసారి వచ్చివెల్లి పోరాదా
నీవు రాని రాతిరి నిలిచిపోయే జాబిలి
నీవు లేని రాతిరి నిలిచిపోయే ఊపిరి
చరణం: 2
పంజరాన రామచిలుక రెక్కలంటి ఊహలతో
నిన్ను చేరలేకనేను నివురులాగ అవుతున్నా
వేణువైన ఊదలేను వానకారు కోయిలల్లే
వేధనతో వేగలేక వెదురులాగ అవుతున్నా
నీవు వచ్చి కలిసిన నాడే తారలకి సంగమం
నీవు వచ్చి కలిసిన నాడే తారలకి సంగమం
ఈ నిశీధి వీధుల్లో....
మమతలాగ ఒక్కసారి కుశలమడిగి పోరాద
నీవు లేని రాతిరి నిలిచిపోయే ఊపిరి
నీవు రాని రాతిరి నిలిచిపోయే జాబిలి
కన్నీట తడిసే కౌగిలి....
నీవు రాని రాతిరి
ఉలికిపోయే ఊపిరి
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నటీనటులు: యన్. టి.రామారావు, జయప్రద, జయసుధ
దర్శకత్వం: యన్. టి.రామారావు
నిర్మాత: యన్. టి.రామారావు
విడుదల తేది: 28.09.1979
Songs List:
ఇది నా హృదయం.. పాట సాహిత్యం
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
పల్లవి:
ఇది నా హృదయం.. ఇది నీ నిలయం..
ఇది సురముని యోగీశ్వరుల చూపులకు.. అందని ఆనందాలయం
ఇది నా హృదయం .. ఇది నీ నిలయం
ఇది సురమునియోగీశ్వరుల చూపులకు.. అందని ఆనందాలయం
ఇది నా హృదయం ..
చరణం: 1
ఇది నా "శ్రీ" నివాసం... ఇది నీ రాణి వాసం
ఇది నా "శ్రీ" నివాసం... ఇది నీ రాణి వాసం
నాపై నీకింత అనురాగమా?... నా పై మీకింత ఆదరమా..
ఇది నీ ప్రణయ డోళ.. ఇది నా ప్రభువుని లీలా .. ఆ .. ఆ..
ఇది నా హృదయం .. ఇది నీ నిలయం
ఇది సురమునియోగీశ్వరుల చూపులకు అందని ఆనందాలయం
ఇది నా హృదయం ..
చరణం: 2
ఎల్లలోకముల ఏలేవారికి ఈడా... జోడా ఈ సిరి?
వికుంఠపురిలో విభువక్షస్థలి విడిది చేయు నా దేవేరి ..
ఇది నా భాగ్యం... ఇది మన భోగం..
ఇది నా హృదయం .. ఇది నీ నిలయం...
ఇది సురముని యోగీశ్వరుల చూపులకు.. అందని ఆనందాలయం
ఇది నా హృదయం ..
ఎంత మధురం పాట సాహిత్యం
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు
ఎంత మధురం
ఈ పల్లె వ్రేపల్లె పాట సాహిత్యం
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: పి. సుశీల
ఈ పల్లె వ్రేపల్లె
దేవుడు ఒక్కడే పాట సాహిత్యం
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: మహమ్మద్ రఫీ
దేవుడు ఒక్కడే
నారాయణ శ్రీమన్నారాయణ పాట సాహిత్యం
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: మాధవపెద్ది రమేష్
నారాయణ శ్రీమన్నారాయణ
పోయి రావే పాట సాహిత్యం
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి. సుశీల
పోయి రావే
ప్రభూ రానైనా రావు పాట సాహిత్యం
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: పి. సుశీల
ప్రభూ రానైనా రావు
వేసింది గున్నమామి పాట సాహిత్యం
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు
గానం: పి. సుశీల, విజయలక్ష్మి శర్మ
వేసింది గున్నమామి
సుప్రభాతం పాట సాహిత్యం
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు, వి. రామకృష్ణ , పి. బి. శ్రీనివాస్
సుప్రభాతం
ఏనాడు పొందిన వరమో పాట సాహిత్యం
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.పి. బాలు, పి. సుశీల
ఏనాడు పొందిన వరమో
ఆ తొలిచూపే పాట సాహిత్యం
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.పి. బాలు, పి. సుశీల
ఆ తొలిచూపే
అయిపోయిందైపోయింది పాట సాహిత్యం
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు
గానం: యస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి
అయిపోయిందైపోయింది