Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: 7th సెన్స్ (2011)
సంగీతం: హరీష్ జైరాజ్
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శ్వేతమోహన్
నటీనటులు: సూర్యా శివకుమార్, శృతిహాసన్
దర్శకత్వం: ఏ. ఆర్.మురగదాస్
నిర్మాత: బి.సుబ్రహ్మణ్యం
విడుదల తేది: 26.10.2011

అమ్మా అమ్మా కన్నే పువ్వమ్మా
నను నువ్వే విడిచిపోయావేళమ్మా
గుండెల్లోని గాయం చూడమ్మా
నా మానం ప్రాణం నీవేనోయమ్మా
అరె ఆడోళ్ల ప్రేమ ఓ నీటి మూట
మగవాడి ప్రేమ ఓ రాతి కోట
కలలోనైన నిన్నే తలచేనే
ఆ కలలే రాక మూగై పోయానే
పిల్లనగ్రోవి చేతికి ఇచ్చావే
నా శ్వాసలనన్ని పట్టుకు పోయావే

చరణం: 1
మగువును నమ్మీ చెడిపోయినోళ్ళు లక్షా
ఆ వరసల నిలిపీ నాకు వేసినావే శిక్షా
పాముకాటు వేస్తే మన ఊపిరాగుతుందే
కన్నె ప్రేమకుట్టేనంటే ప్రతి రోజు చంపుతుందే
అరె చేయి విడిచి నువ్వు పోయాక
గుండె మూగదై పోయింది
నిన్ను నమ్మి నీ వెనకొస్తే మనసంతా ఓ పుండైనాది
వలపంటే ఓ ముళ్ళబాటరా
అటు నడిచావంటే అశే తీరదురా
వలపంటే ఓ మత్తు మందురా
అది వేశావంటే ప్రాణం దక్కదురా

అమ్మా అమ్మా కన్నే పువ్వమ్మా
నను నువ్వే విడిచిపోయావేళమ్మా
గుండెల్లోని గాయం చూడమ్మా
నా మానం ప్రాణం నీవేనోయమ్మా

చరణం: 2
చిల్లులున్న మురళీ అరె పాట పాడగలదూ
గుండె గాయమెంతదైనా ప్రేమ బాష మరచిపోదూ
ప్రేమ ఉన్నవారు మది వీడి వెళ్ళలేరూ
నమ్మి మోసపోతి నేడూ ఇది చెప్పలేని గోడూ
నను నీటముంచి నీవెళ్ళొద్దే
ఎదుట నిలిచి నను చంపొద్దే
కంటి చూపులే కరువైతే మరుక్షణమేలే మనదేలే
వన్నెలు చిలికే రామ చిలకమ్మా
యద గూటిని దాటి పోయావేళమ్మా
ప్రేమలేని ఊయే యాడున్నా
నా కళ్ళెమూసి తీసుకుపోవమ్మా

అమ్మా అమ్మా కన్నే పువ్వమ్మా
నను నువ్వే విడిచిపోయావేళమ్మ
గుండెల్లోని గాయం చూడమ్మా
నా మానం ప్రాణం నీవేనోయమ్మా
అరె ఆడోళ్ల ప్రేమ ఓ నీటి మూట
మగవాడి ప్రేమ ఓ రాతి కోట
కలలోనైన నిన్నే తలచేనే
ఆ కలలే రాక మూగై పోయానే
పిల్లనగ్రోవి చేతికి ఇచ్చావే
నా శ్వాసలనన్ని పట్టుకు పోయావే

Most Recent

Default