Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

100% Love (2011)



చిత్రం: 100% లవ్ (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: టిప్పు
నటీనటులు: నాగ చైతన్య
దర్శకత్వం: సుకుమార్
నిర్మాత: బన్నీ వాసు
విడుదల తేది: 06.05.2011

దూరం దూరం దూరం ఓ ఓ తీరం లేని దూరం
ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే
ఒకే పడవలో కలిసినా ఒకే ప్రయాణం చేసినా చెరో ప్రపంచం చేరినారే
ఒకే గతాన్ని ఓ ఓ ఒకే నిజాన్ని ఉరేసినారే ఓ ఓ ఓ ఓ ఓ
చెరో సగాన్ని ఓ ఓ మరో జగాన్ని వరించినారే ఓ ఓ ఓ ఓ ఓ
ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే
దూరం దూరం దూరం ఓ ఓ తీరం లేని దూరం
ఓ ఇంత దగ్గరా అంతులేని దూరం
ఇంత కాలమూ దారిలేని దూరం
జంట మధ్య చేరి వేరు చేసే దారే నాదే అన్నాదే
హో స్నేహమంటు లేక ఒంటరైన దూరం
చుట్టమంటు లేని మంటతోనే దూరం
బంధనాలు తెంచుతూ ఇలా భలేగ మురిసే
ఎడబాటులోని చేదు తింటు దూరం ఎదుగుతున్నదే
విరహాన చిమ్మ చీకటింట దూరం వెలుగుతున్నదే ఓ ఓ ఓ ఓ
ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే
దూరం దూరం దూరం ఓ ఓ తీరం లేని దూరం
ఒక్క అడుగూ వెయ్యలేని దూరం
ఒక్క అంగుళం వెళ్ళలేని దూరం
ఏడు అడుగుల చిన్ని దూరాన్ని చాలా దూరం చేసిందే
మైలు రాయికొక్క మాట మార్చు దూరం
మలుపు మలుపుకొక్క దిక్కు మార్చు దూరం
మూడు ముళ్ళ ముచ్చటే ముళ్ళ బాటగ మార్చే
తుది లేని ఙ్ఞాపకాన్ని తుడిచి వేసే దూరమన్నదీ
మొదలైన చోటు మరిచిపోతె కాదే పయనమన్నదీ ఓ ఓ ఓ ఓ
ఒకే పరీక్షే రాసినా ఒకే జవాబై సాగినా చెరో ప్రశ్నల్లే మిగిలినారే
దూరం దూరం దూరం ఓ ఓ తీరం లేని దూరం



********    ********   *********


చిత్రం: 100% లవ్ (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ప్రియ హిమేష్, మురళి

ఆ ముద్దుల మువ్వారావు గారి పెద్దమ్మాయి పద్దెనిమిదో ఏట పైటేసుకుందంట
కోరస్: డియాలో డియాల
చిన్నవీధి చెక్కర చిట్టెమ్మగారి చిన్నకోడలు నలబైయ్యో ఏట నీళ్ళోసుకుందంట
కోరస్: డియాలో డియాల
రంగుల రాజారావు గారి మూడో అమ్మాయి పక్కింటి పుల్లారావు గారి నాల్గో అబ్బాయితో జంపు జిలానీ అంటా
కోరస్: డియాలో డియాల
ఇంక మన మెరకింటి మంగతాయారు గాజుల చిట్టెమ్మ దుబాయ్ సత్యవతి ఆల్లాల్ల మొగుల్ని వదిలేసారంటా
కోరస్: డియాలో డియాల
ఆళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను గానీ అల నోటితో ఆళ్ళే చెప్పుకుంటారంటా
కోరస్: డియాలో డియాల
మొదలెట్టవే మంగతాయారు
అద్దురూపాయి ఇచ్చాడో అద్దం కొనుక్కోమన్నాడో
కోరస్: డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాలో
ఒక్కరుపాయి ఇచ్చాడో స్టిక్కర్ కొనుక్కోమన్నాడో
కోరస్: డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాలో
రెండు రుపాయిలిచ్చాడో రిబ్బను కొనుక్కోమన్నాడో
కోరస్: డియాలో డియాల
మూడు రుపాయలిచ్చాడో ముక్కెర కొనుక్కోమన్నాడో
కోరస్: డియాలో డియాల
పది రుపాయలిచ్చీ పాండ్స్ పౌడరు కొనుక్కోమన్నాడో
నలభై రుపాయలిచ్చీ నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడో
అన్నీ కొనిచ్చీ అలంకరించీ ఐదు లక్షలకు బేరంపెట్టీ
అసలేని పసలేని ముసలోడికి నన్నమ్మేసాడు
పిల్లా నీ బావనిస్తవా తొలికెల్లి తెల్లారి తీసుకొస్తను
కోరస్: యాలో డియ్యాలో
పిల్లా నీ బావనిస్తవా ఏడి కాస్తా చల్లారబెట్టుకొస్తను
కోరస్: యాలో డియ్యాలో
అమ్మో నా బావనిస్తనా జూనియర్ షారుక్ ని జారనిస్తనా
అమ్మో నా బావనిస్తనా ఇంకో కాజోల్ ని చావనిస్తనా

మెరకింటి మంగతాయారు మీముందు మిలమిల మెరిసిపోయింది
గాజుల చిట్టెమ్మ మీముందుకు గలగల వచ్చేత్తందోయ్
గజ్జెల చప్పుడు విన్నడా ఎక్కడికెల్లావు అంటాడు
కోరస్: డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాలో
గాజుల ఊపుడు విన్నాడా ఎవడికి సైగలు అంటాడు
కోరస్: డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాలో
పక్కింటోడికి పొలమారిందా నువ్వే తలిసావంటాడు
కోరస్: డియాలో డియాల
పొరిగింటోడికి జ్వరమొచ్చిందా నీపై దిగులని అంటాడు
కోరస్: డియాలో డియాల
దోమకుట్టిందన్నానా...!! ఆడా మగా అంటాడు...
పోని చీమ కుట్టిందన్నానా... చిన్నా పెద్దా అంటాడు
వాడికి వీడికి లింకులు పెట్టీ ఉన్నవి లేనివి రంకులు కట్టీ శీలానికి సంకెళ్ళేసి చిలకే కొట్టని జాంపండయ్యానూ
అయ్యో పాపం
పిల్లా నీ బావనిస్తవా ఒక్కసారి సాటుకెల్లి లేటుకొస్తను
కోరస్: యాలో డియ్యాలో
పిల్లా నీ బావనిస్తవా నా మొగుడుకున్న డౌటులన్నీ రైటు చేస్తను
కోరస్: యాలో డియ్యాలో
అమ్మో నా బావనిస్తనా అంతగొప్ప లక్కు నీకు దక్కనిస్తనా
అమ్మో నా బావనిస్తనా వాడికున్న తిక్కనీకు ఎక్కనిస్తనా

అరే జరగండి జరగండి జరగండి జర దూసుకుంటూ వచ్చేస్తుంది దుబాయ్ సత్యవతే
దుడ్డు కావాలన్నాడు దుబాయ్ నన్ను పంపాడు
కోరస్: డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాలో
ఫ్రిజ్ టీవీ కొంటానే పైసల్ పంపియ్ మన్నాడు
కోరస్: డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాలో
సోఫాసెట్టు కొంటానే సొమ్ములు పంపియ్ మన్నాడు
కోరస్: డియాలో డియాల
డబుల్కాట్ కొంటానే డబ్బులు పంపియ్ మన్నాడు
కోరస్: డియాలో డియాల
ఇయన్ని పెట్టాలంటే ఇల్లు కావాలన్నాడు
ఈస్ట్ ఫేసులో కొంటానే ఇంకా పంపియ్ మన్నాడు
సోలిడ్ గా సెటిల్ అయ్యామంటూ బోలెడు ఆశల్తో ఫ్లైటే దిగితే ఈస్ట్ ఫేసు ఇంటిలోన డబుల్కాట్ బెడ్డు పైన సెకండ్ సెటప్ చూసి నేను అప్సెట్ అయ్యాను
తుస్...
పిల్లా నీ బావనిస్తవా హప్ షర్టు సెట్ సేసి తీసుకొస్తను
కోరస్: యాలో డియ్యాలో
పిల్లా నీ బావనిస్తవా దుబాయ్ సెంట్ బుడ్డిలోన ముంచుకొస్తనూ...
కోరస్: యాలో డియ్యాలో
అరె అమ్మో నా బావనిస్తనా ఆయిల్ బావిలోన దూకనిస్తనా
అమ్మో నా బావనిస్తనా వీడి జిడ్డు నీకు అంటనిస్తనా

ఓరి ఓరి ఓరి ఓరి ఓరి ఈ ముగ్గురి కదలైతే నాకు తెలుసుకానీ ఇదెవరో కొత్త దంటర్రా బాబు రయ్యామంటు గుద్దుకుంటొచ్చేస్తంది
ఇలియనాకే ఈర్ష్య పుట్టే నడుమే నాదని అన్నాడు
కోరస్: డియాలో డియాల
ముమైత్ ఖాన్ కి ధమాక్ తిరిగే ఉడుకే నాదని అన్నాడు
కోరస్: డియాలో డియాల
శ్రేయకే చెమట్లు పుట్టే సోకే నాదని అన్నాడు
కోరస్: డియాలో డియాల
అనుష్కా నే యెనక్కి నెట్టే సరుకే నాదని అన్నాడు
కోరస్: డియాలో డియాల
ఫ్రంట్ బ్యాక్ చూసాడు మెంటలెక్కి పోయాడు
అప్ డౌన్ చూసాడు అప్పడం అయి పోయాడు
పేస్ చూసీ... ఆ... పేస్ చూసి
హే పేస్ చూసి ఫ్రీజై పోయి పార్టులు మొత్తం లూజైపోయి పాపకి నేను సరిపోనంటు పారిపోయాడు
అబ్బో అంత గొప్ప ఫేసా జర మాక్కూడా చూపించరాదే
పిల్లా నీ బావనిస్తవా కంటి చూపుతోనే చప్పరిస్తను
కోరస్: యాలో డియ్యాలో
పిల్లా నీ బావనిస్తవా నోటి మాటతోనే నంజుకుంటనూ
కోరస్: యాలో డియ్యాలో
ఓకే నా బావనిస్తనూ జూనియర్ షారుక్ ని జంట చేస్తనూ
నీకే నా బావనిస్తనూ ఇంత అందగత్తెగాడు లేదంటాను
పిల్లా నీ బావ నివ్వకు నమ్ముకున్న తొడునెపుడు వీడనివ్వకు
కోరస్: యాలో డియ్యాలో
పిల్లా నీ బావ నివ్వకు జీవితాన్ని మోడులాగా మారనివ్వకు
కోరస్: యాలో డియ్యాలో


******   ******   *******


చిత్రం: 100% లవ్ (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: రంజిత్, శ్రీచరణ్

ఓ గాడ్ చేతికేమో పుస్తకమిచ్చావ్, టూ బ్యాడ్ వంటికేమో బద్దకమిచ్చావ్
ఓ గాడ్ మిలియన్ టన్ల సిలబస్ ఇచ్చావ్... టూ బ్యాడ్ మిల్లీగ్రామ్ బ్రెయినే ఇచ్చావ్
ఓ గాడ్ వన్డే మ్యాచే ఇచ్చావ్ టూ బ్యాడ్ సేమ్ డే ఎక్జామ్ ఇచ్చావ్
ఓ గాడ్ క్వెశన్ పేపర్ ఫుల్లుగ ఇచ్చావ్, టూ బ్యాడ్ ఆన్సర్ పేపర్ తెల్లగ ఇచ్చావ్
తల తిప్పలేనన్ని అందాలిచ్చావ్ తల ఎత్తుకోలేని రిజల్ట్స్ ఇచ్చావ్
డబుల్ గేమ్సేటి మాతో నీకే, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ మా ఫెల్యూరికే
ఊహ్... ఎల! ఎల! ఎల! ఊహ్... ఎల! ఎల! ఎల!
ఊహ్... ఎల! ఎల! ఎల! ఊహ్... ఎల! ఎల! ఎల!
మెమొరికార్డ్ సైజేమో చోటి మెమరి స్టేటస్ కోటి
మిల్లిగ్రామ్ బ్రెయినైతె ఏంటి మిరకిల్స్ చెయ్ దాన్తోటి
బాత్రూంలో పాటలకి బదులు ఫార్ములానే పాడు
ప్రేమిస్తే సిలబస్సు మొత్తం స్వాతి బుక్కే చూడు
అబ్బబ్బ ఏం చెప్పాడ్రా
అహో బాలు... ఒహో బాలు...
అంకెలు మొత్తం వందలు వేలు వీడి ర్యాంక్ తోటే మొదలు
అహో బాలు... ఒహో బాలు...
A to Z అని చదివే బదులు ... We to U అంటే చాలు
బల్బుని కనిపెడదాం అనుకున్నామూ, ఎడిసెన్ దాన్ని చెడగొట్టేశాడు
టెలిఫోన్ కనిపెడదాం అనుకున్నాము, ఆ గ్రహంబెల్ ఫస్ట్ కాల్ కొట్టేశాడు
ఆస్కార్ పని పడదాం అనుకున్నాము, కాని రెహమాన్ దాన్ని ఒడిసి పట్టేశాడు
అట్లీస్ట్ ఫస్ట్ ర్యాంక్ కొడదాం అనుకున్నాము, కాని బాలుగాడు దాని కోసం పుట్టేశాడు
ఊహ్... ఎల! ఎల! ఎల! ఊహ్... ఎల! ఎల! ఎల!
ఊహ్... ఎల! ఎల! ఎల! ఊహ్... ఎల! ఎల! ఎల!
బల్బుని కనిపెట్టిన ఎడిసెన్ మరి జలుబుకి కనిపెట్టాడ మెడిసిన్
టెలిఫోన్తో స్టాప్ అనుకొనుంటే స్టార్ట్ అయ్ ఉండేదా సెల్ ఫోన్
ఇంతే చాలు అనుకుంటు పోతే ఎవ్వరు అవ్వరు హీరో
నిన్నటితో సరిపెట్టుకుంటే నేటికి లేదు టుమారో
అబ్బబ్బ ఏం చెప్పాడ్రా
అహో బాలు... ఒహో బాలు...
బాలుకందని లాజిక్లన్నీ కావా నవ్వుల పాలు
అహో బాలు... ఒహో బాలు...
అనుకోడెపుడు వింటే చాలు వీడు మైండ్ రేసులో గుర్రం కాలు
లక్కున్నోళ్ళకి ర్యాంకులు ఇచ్చావ్ నోట్లున్నోళ్ళకి సీట్లు ఇచ్చావ్
అట్లీస్ట్ అమ్మాయిలకి అందానిచ్చావ్, మమ్మల్నేమో నిండా ముంచావ్
బ్రిలియంట్ స్టూడెంట్స్ కి  A గ్రేడంటా, యావ్రేజ్ స్టూడెంట్స్ కి B గ్రేడంటా మమ్మల్నేమో Degread చేస్తావ్
క్యాస్ట్లు మతాలు వద్దంటూనే గ్రేడులతో విడదీస్తుంటావ్
ఊహ్... ఎల! ఎల! ఎల! ఊహ్... ఎల! ఎల! ఎల!
ఊహ్... ఎల! ఎల! ఎల! ఊహ్... ఎల! ఎల! ఎల!
ఏయ్ చెట్టుకి పూత కాయ పండని మూడురకాలుగ చూస్తాం
పూతైపూసి కాయైకాసి పండైతేనే విలువిస్తాం
గ్రేడంటే A B C బళ్ళో బ్రెయినుని కొలిచే స్టిక్కు
కాంపిటీషన్ లేదంటె రేసులో గెలుపుకి ఉందా కిక్కు
అబ్బబ్బ ఏం చెప్పాడ్రా
అహో బాలు... ఒహో బాలు...
నంబర్ ఒన్ కి రొటీను బాలు చదువుకి ప్రొటీను బాలు
అహో బాలు... ఒహో బాలు...
శాటిలైట్ అయిన సెంటర్ బాలు క్వశనేదైన ఆన్సర్ బాలు
బాలు చదివిన బుక్కంటా... వెంటనే కొని చదివేద్దాం
బాలు రాసిన నోట్సంటా... వెంటనే జిరాక్స్ తీద్దాం
బాలు వాడిన పెన్నంటా... ఆయుధ పూజలు చేద్దాం
బాలు నడిచిన బాటంటా... అందరు ఫాలో ఐపోదాం




********    ********   ********



చిత్రం: 100% లవ్ (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: అద్నాన్ సామి

కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైనస్
ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాట్యువేషన్

హే కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైనస్
ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాట్యువేషన్

ఎడమ భుజము కుడి భుజము కలిసి ఇక కుదిరే కొత్త త్రిభుజం
పడుచు చదువులకు గణితసూత్రమిది ఎంతో సహజం
సరళ రేఖలిక మెలిక తిరిగి పెనవేసుకున్న చిత్రం
చర్య జరిగి ప్రతి చర్య పెరిగి పుడుతుందో ఉష్ణం...

కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైనస్
ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాట్యువేషన్
ఇన్ఫాట్యువేషన్ ఇన్ఫాట్యువేషన్

దూరాలకి మీటర్లంటా భారాలకీ కేజి లంటా కోరికలకు కొలమానం ఈ జంట
సెంటి గ్రేడ్ సరిపోదంట ఫారెన్ హీట్ పని చేయదంట వయసు వేడి కొలవాలంటే తంట
లేత లేత ప్రాయాలలోన అంతే లేని ఆకర్షణ అర్దం కాదు ఏ సైన్స్ కైనా... ఓ... హో
పైకి విసిరినది కింద పడును అని తెలిపే గ్రావిటేషన్
పైన కింద తలకిందులవుతది ఇన్ఫాట్యువేషన్

కళ్ళు కళ్ళు ప్లస్సు వాళ్ళు వీళ్ళు మైనస్
ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాట్యువేషన్

ఊఁ సౌత్ పోల్ అబ్బాయంటా నార్త్ పోల్ అమ్మాయంటా రెండు జంట కట్టే తీరాలంటా
ధనావేశం అబ్బాయంటా రుణావేశం అమ్మాయంటా కలిస్తే కరెంటే పుట్టేనంటా
ప్రతీ స్పర్శ ప్రశ్నేనంటా మరో ప్రశ్న జవాబంట ప్రయానికే పరీక్షలంటా

పుస్తకాల పురుగులు రెండంట ఈడు కొచ్చేనంటా
అవి అక్షరాల చక్కెర తింటు మైమరిచేనంటా

కళ్ళు కళ్ళు ప్లస్సు... ఆఁ వాళ్ళు వీళ్ళు మైనస్
ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్
ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాట్యువేషన్


*******   ********   *********


చిత్రం: 100% లవ్ (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: దేవి శ్రీ ప్రసాద్

ఎ స్క్వేర్ బి స్క్వేర్ ఎ ప్లస్ బి హోల్ స్క్వేర్
టామ్ అండ్ జెర్రీ వార్ కి ఎ టైమైనా డోంట్ కేర్...

చీటింగ్  చీటింగ్ పిల్లి ఎలుక పిల్లని
చీటింగ్  చీటింగ్ నక్క పిల్ల కోతిని
చీటింగ్  చీటింగ్ మీసం జారకుచ్చుని
చీటింగ్  చీటింగ్

ఎ స్క్వేర్ బి స్క్వేర్ ఎ ప్లస్ బి హోల్ స్క్వేర్
టామ్ అండ్ జెర్రీ వార్ కి ఎ టైమైనా డోంట్ కేర్...

హే రింగా రింగా రోజెస్ పోకెట్ పుల్ల పోసెస్
దొంగ దొంగ చేదివేచేయ్ ఇంపార్టెంట్ బుక్స్
సబ్జెక్టు  సబ్జెక్టు కలిపేసి సిలబస్ చూసి ఏసీ
చూపుల్స్ తోనే మేసి చెప్పులు జ్యూరీ మార్క్స్

చీటింగ్  చీటింగ్ చీమ పంచదారని
చీటింగ్  చీటింగ్ తేనెటీగ పువ్వుని
చీటింగ్  చీటింగ్ ఉడత జాంపండుని
చీటింగ్  చీటింగ్

ఎ స్క్వేర్ బి స్క్వేర్ ఎ ప్లస్ బి హోల్ స్క్వేర్
టామ్ అండ్ జెర్రీ వార్ కి ఎ టైమైనా డోంట్ కేర్...



********    ********   *********



చిత్రం: 100% లవ్ (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: స్వాతి

హే లెట్స్ గో
ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టాం అండ్ జెర్రి వారుకి ఎ టైమైనా డోంట్ కేర్

అటాక్ అటాక్ ఎలుక పిల్లిమీదకే
అటాక్ అటాక్ పువ్వు ముళ్లుమీదకే
అటాక్ అటాక ఉప్పు నిప్పుమీదకే
అటాక్ అటాక్

ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టాం అండ్ జెర్రి వారుకి ఎ టైమైనా డోంట్ కేర్

ఏ స్క్వేర్ బి స్క్వేర్


రింగ రింగ రోజెస్ వంకర టింకర పోజెస్
తింగర తింగర థీరంస్ కి పట్టె సొల్యూషన్స్
ఏ పోటా పోటి చీటింగ్
చీటికి మాటికి ఫైటింగ్
మీది మీది రాంకులకోసం కాంపిటీషన్

అటాక్ అటాక్ చేప కొంగమీదకే
అటాక్ అటాక్ జింక పులిమీదకే
అటాక్ అటాక్ ఓణి జీన్స్ మీదకే
అటాక్ అటాక్

ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్
టాం అండ్ జెర్రి వారుకి ఎ టైమైనా డోంట్ కేర్
హే లెట్స్ గో...



*******   *********   **********



చిత్రం: 100% లవ్ (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: రిచర్డ్

దట్ ఈజ్ మహాలక్ష్మి (4)

సిల్క్ చీర చుట్టుకున్న సాఫ్ట్వేర్ రో
పోని టైల్ కట్టుకున్న ఫస్ట్ ర్యాంకు రో
హై హీల్స్ వేసుకున్న సరస్వతిరో
మన బాలు గాడి కల్లలోన చిల్లీ పౌడర్ రో

దట్ ఈజ్ మహాలక్ష్మి (4)

లాస్ట్ నుండి ఫస్ట్ కి లాంగ్ జంప్ రో
బాటమ్ నుంచి టాప్ కి ఫ్లయింగ్ కిస్స్ రో
మైండుకి వాలుజడ ఎక్స్ టెంషన్ రో
మన బాలు గుండెలోన హై టెంషన్ రో

దట్ ఈజ్ మహాలక్ష్మి (4)

ముందున్నోళ్ళు స్వాగతాలు చెప్పేవాళ్ళు రో
వెనకున్నోళ్ళు మహాలక్ష్మి ఫాల్లోవర్స్ రో
పక్కనున్న బేలన్సేమో బాడీ గాడ్స్ రో
వీళ్ళందరూ ఇంతకుముందు బాలు ఫాన్స్ రో

దట్ ఈజ్ మహాలక్ష్మి (4)

బాంగ్ బాంగ్ బాంగ్ హియర్ షి కమ్స్ లైక్ ఎ బుల్లెట్ దో యువర్ బ్రేన్
బెట్టర్ క్లోస్ యువర్ ఐస్ షి విల్ మేక్ యు బ్లైండ్ షి ఈజ్ ఎ రెడ్ స్లేన్
మేక్ అ విష్ టు డే క్వీన్ ఈజ్ ఎట్ ద బే యు వాన్న నో ద డేమ్
మహాలక్ష్మి ఈజ్ ద నేమ్...

జాంపండు మనసు పడ్డ చిలక ముక్కు లా
కన్నె పిల్ల మోజు పడ్డ రోజా మొగ్గలా
సాయంకాలం టాటా చెప్పే సన్ సెట్ లా
మన బాలు గాడి ఫేస్ మారే రెడ్ రెడ్ గా...

దట్ ఈజ్ మహాలక్ష్మి (3)
దట్ ఈజ్, దట్ ఈజ్, దట్ ఈజ్ మహాలక్ష్మి...



**********    **********   *********


చిత్రం: 100% లవ్ (2011)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: హరిణి

తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు గణనాద ది ది ది తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాద ది ది ది తై
నీ వెలుగు పంచు మా తెలివి లోన కొలువై...
తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు గణనాద ది ది ది తై

ససని సగస సగమ
మమగ మపమ మపని
పప మపనిస సని సగస నిసని పనిస మపమ గమగస
ససని సగస సగమ
మమగ మపమ మపని
పప మపనిస సని ఆ ఆ ఆ

చెవులారా వింటూనే ఎంత పాటమైనా
ఈజీగ తలకెక్కే ఐక్యూ నివ్వు
కనులారా చదివింది ఒకసారే అయినా
కళ్ళోను మరిచిపోని మెమరీనివ్వు
చదివిన ప్రశ్నలనే పరీక్షలో రానివ్వు
చదవనిదేదైనా చాయిస్ లో పోనివ్వు
ఒక్కొక్క దండానికి ఒక్కొ మార్కు పడనివ్వు
ఏ టెంషన్ దరికి రాని ఏకాగ్రత నాకివ్వు
ఆన్సర్ షీట్ పైన ఆగిపోని పెన్నివ్వు
తిరు తిరు గణనాద ది ది ది తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు గణనాద ది ది ది తై

తల స్నానం చెయ్యకుండ పూజించానంటూ
నా వైపు కోపంగా చూస్తే ఒట్టు
షాంపుతో పాటే చదివింది తుర్రు మంటూ
వాష్ అయిపోతుందని నా సెంటిమెంటు
తలలే మార్చిన తండ్రి గారి కొడుకు మీరు
మీరు తలుచుకుంటే మా తలరాతలు తారు మారు
భారతం రాసిన చేతితో బతుకును దిద్దేయి బంగారు
పేపర్లో ఫోటోలు ర్యాంకులెవ్వరడిగారు
పాసు మార్కులిచ్చి నిలబెట్టుకో నీ పేరు

తిరు తిరు గణనాద ది ది ది తై
ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై
తిరు తిరు గణనాద ది ది ది తై
తిరు తిరు తిరు తిరు తిరు తిరు గణనాద ది ది ది తై...

Most Recent

Default