Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: జై శ్రీరామ్ (2013)
సంగీతం: ధాకె
సాహిత్యం: నక్కల వరప్రసాద్
గానం: కౌశిక్ కళ్యాణ్ , శృతి, శ్రావణి
నటీనటులు: ఉదయ్ కిరణ్, రేష్మ రాతోర్, సోనమ్ సింగ్, ఆదిత్య మీనన్
దర్శకత్వం: బాలాజీ. యన్. సాయి
నిర్మాతలు: తెల్లా రమేష్ , N.C.H. రాజేష్
విడుదల తేది: 11.04.2013

ఎదలోని గురుతులే వరదలై పరుగులై
స్నేహమై కలిసెలే ఈ రోజంతా
ఇదే ఒక స్వర్గమై ఇదే మన లోకమై
ఈ స్నేహగీతమే పాడాలంటా
స్వరాగాలన్ని శృతితప్పి పూని
మన అడుగులన్నీ లయతప్పి పూని

సయ్యామహాసం ఇక్కడేలే
సయ్యామహాసం మనదేలే
సయ్యామహాసం ఇదియేలే
ఇదే ఇదేలే

సయ్యామహాసం ఇప్పుడేలే
సయ్యామహాసం ఇక్కడేలే
సయ్యామహాసం ఇదియేలే
ఇదే ఇదేలే

కోరుకున్న కోర్కెలన్ని దండకట్టి
చెప్పుకున్న ఊసులన్ని గుండెతట్టి
వీలుచిక్కి నప్పుడల్ల ఫ్రీక్ ఔట్ గా
డాన్స్ లేసి గెంతులేసి స్టెప్ లేసి పో...
టీనేజీ రోజులంటే ప్రేమకయ్యాలు సహజం
మొహాల మోజులన్ని క్షణికమై మాయమై పోవులే
టీనేజీ రోజులంటే ప్రేమకయ్యాలు సహజం
మొహాల మోజులన్ని క్షణికమై మాయమై పోవులే

సయ్యామహాసం ఇక్కడేలే
సయ్యామహాసం మనదేలే
సయ్యామహాసం ఇదియేలే
ఇదే ఇదేలే

ఆశలన్ని పల్లకీలై మోసుకుంటూ
ఆశయాల నింగి పూలు కోసుకుంటూ
ఇష్టమైన స్నేహాలు ఇగిరిపోని బంధాలు
కనులలో సుడులుగా తిరిగేనే
ఏమైంది జీవితాంతం ఉండాలి శాశ్వతంగా
ఆనంద తాండవాలు ఆడుతూ పాడుతూ ఓ...
ఏమైంది జీవితాంతం ఉండాలి శాశ్వతంగా
ఆనంద తాండవాలు ఆడుతూ పాడుతూ ఓ...

సయ్యామహాసం ఇప్పుడేలే
సయ్యామహాసం ఇక్కడేలే
సయ్యామహాసం ఇదియేలే
ఇదే ఇదేలే


Most Recent

Default