Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Nenu Local (2017)




చిత్రం: నేను లోకల్ (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: నాని, కీర్తి సురేష్
దర్శకత్వం: త్రినాధ రావు
నిర్మాత: దిల్ రాజు
విడుదల తేది: 02.02.2017



Songs List:



నెక్స్ట్ ఏంటి ? పాట సాహిత్యం

 
చిత్రం: నేను లోకల్ (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: సాగర్, రనైనా రెడ్డి

ఏ BA పాసైనా అరె MA పాసైనా
B.Tech పాసైనా మరి M.Tech పాసైనా
కంగ్రాట్స్ అయ్యో సూపర్ భయ్యా అనడం మానేసి
మనకే తెలియని ఫ్యూచర్ గురించి ఫులిష్ ప్రశ్నేంటి...?
నెక్స్ట్ ఏంటి ?  అంటూ గోలేంటి ?

ఇంట్లో నాన్నైనా  వంటింట్లో అమ్మైనా
పేపర్ బాయ్ అయినా ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయినా
పరీక్షలన్నీ చించేశావని ప్రైజింగ్ మానేసి
అరె వచ్చిన మార్కులు మరిచేలా
ఈ క్వశ్చన్ మార్కేంటి ? నెక్స్ట్ ఏంటి ?  
ఈ గోలేంటి ?

కోదాడ తరువాత బెజవాడ వస్తుందంటాం
ఈ కోర్సే పూర్తయ్యాక నెక్స్ట్ ఏంటో ఏం చెబుతాం
ఇంటర్వెల్ తరువాత క్లైమాక్సే ఊహించేస్తాం
ఇంజినీరింగ్ ఐపోయాక నెక్స్ట్ ఏంటి ఎట్టా ఊహిస్తాం

బుల్బ్ ని చేసే టైంలో ఎడిషన్ గారిని కలిసేసి
నెక్స్ట్ ఏంటంటే పారిపోడా బుల్బ్ ని వదిలేసి
అరె అంతటోళ్లకే ఆన్సర్ తెలియని ప్రశ్నను తెచ్చేసి
ఇట్టా మా మీద రుద్దేస్తే మా ఈ బ్రతుకుల గతి ఏంటి

నెక్స్ట్ ఏంటి ?  
ఈ గోలేంటి ?

ప్యార్ లో పడిపోయాక బ్రేకప్పో పెల్లో ఖాయం
ఈ పట్టా చేపట్టాక నెక్స్ట్ ఏంటో ఏమంటాం
సిల్వర్ మెడలొచ్చాక గోల్డ్ మెడలే ఆశిస్తుంటాం
ఈ డిగ్రీ దొరికేశాక నెక్స్ట్ ఏంటి చెప్పడం ఎవడి తరం


బ్రాండెడ్ బట్టలకోసం డబ్బులు ఇవ్వాళా ఏంటి
బీరు బిర్యానికి చిల్లర కావాలా ఏంటి
ఇట్టా పనికొచ్చేటి ప్రశ్నలు అసలు అడగరు మీరెంటి
పైగా నెక్స్ట్  ఏంటి ? అంటూ
చెయ్యని తప్పుకు మాకి శిక్షేంటి

నెక్స్ట్ ఏంటి ? అంట
ఈ గోలేంటి ? మంట

 నెక్స్ట్ ఏంటి ? హేయ్
నెక్స్ట్ ఏంటి ? అబ్భా





అరె ఎక్కడ ఎక్కడ పాట సాహిత్యం

 
చిత్రం: నేను లోకల్ (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: నరేష్ అయ్యర్, మనిషా ఎరబతిని

అరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
అరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు 
నీతో నా ప్రయాణం
ఈ ప్రశ్నకు బదులుగా ఈ నిమిషం మాటలనే 
మరిచే సంతోషం
పాటల్లే మారింది ప్రతిక్షణం

అరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
అరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు 
నీతో నా ప్రయాణం
ఈ ప్రశ్నకు బదులుగా ఈ నిమిషం మాటలనే 
మరిచే సంతోషం
పాటల్లే మారింది ప్రతిక్షణం

నింగిలో ఆ చుక్కలన్ని
ఒకటిగా కలిపితే మన బొమ్మ కదా
దారిలో ఈ పువ్వులన్ని జంటగా వేసిన మన అడుగులేగా
మబ్బుల్లో ఓ చినుకులు మనమంతా మనమే చేరితే ఏ చోటైనా
ఐపోదా పూదోట


అరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
అరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు 
నీతో నా ప్రయాణం
ఈ ప్రశ్నకు బదులుగా ఈ నిమిషం మాటలనే మరిచే సంతోషం

కళ్ళతో ఓ చిలిపి ముద్దే
ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా
పెదవితో పెడవులకో ముద్దే అడగటం 
తెలియని అలవాటు మార్చవా
కాటుకనే దిద్దే వేలౌతా
ఆ వేలే పట్టి ఏ వేళా నీ వెంట అడుగేస్తా 

అరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం
అరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు 
నీతో నా ప్రయాణం




డిస్టర్బ్ డిస్టర్బ్ పాట సాహిత్యం

 
చిత్రం: నేను లోకల్ (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: పృద్వి చంద్ర

డిస్టర్బ్  డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను
ఓసి ఓసి ఓసి ఓసి మల్లే పువ్వా
తోసి తోసి నన్ను పక్కనేస్తావా
తామరాకుమీద నీటి బొట్టు నువ్వా
పట్టుకుంటే ఫట్టుమంటు జారిపోతావా

ఓసి ఓసి ఓసి ఓసి పాలకోవా
చూసి చూసి ఫేసు తిప్పుకెళతావా
ఫేక్ బుక్ లాగా నన్ను చూస్తావా
అంటుకుంట సర్రుమంటు పారిపోతావా
హే పిల్లా నీ కళ్ళకు డిస్టర్బ్ చేసే రంగుల కలలన్ని
హే పిల్లా ఈ లోకం నుంచి చోరీ చేసేయనా
హే పిల్లా నీ మనసుని డిస్టర్బ్ చేసే తీయని మాటల్ని
హే పిల్లా ఏ భాషలో ఉన్నా దాచేచెయ్నా

డిస్టర్బ్  డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను
హే డిస్టర్బ్  డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను

మార్నింగే వస్తే న్యూస్ పేపర్లా వస్తా
ఓ షాకింగ్ న్యూసవుతా నిను డిస్టర్బ్ చేసేలా
నువు ఛానల్సే పెడితే నే స్క్రోలింగ్లో వస్తా
లవ్ మెసేజైపోతా నిను డిస్టర్బ్ చేసేలా
హే పిల్లా నీ కళ్ళకు కట్టిన గంతలు మొత్తం విప్పేస్తా
హే పిల్లా లవ్ లోన వింతలు నీకే చూపిస్తా
హే పిల్లా నీ పెదవులు కుట్టిన సూదో ఏదో పట్టేస్తా
హే పిల్లా నీ లోపలి మాటలు కౌంట్ డౌన్ వింటా


డిస్టర్బ్  డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను
హే డిస్టర్బ్  డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను

హే రాముడ్నే సీతే ఏ డిస్టర్బ్ చేయకపోతే 
అరె పదిమంది మెచ్చే రామాయణ ముంటుందా
కృష్ణుడ్నే రాధే ఏ డిస్టర్బ్ చేయకపోతే 
ఈ లవ్ స్టొరీ బాధే మన లైఫ్ ని చుట్టేదా
హే పిల్లా నీ ట్రాకేదైనా నా రూట్లోకే  వచ్చేలా
హే పిల్లా లవ్ ఫ్లైట్  కి నువ్వే టేకాఫ్ ఇచ్చేలా
హే పిల్లా నా కన్నా గ్రేట్ లవర్ లేడనిపించేలా
హే పిల్లా నాకోసం నువ్వే పడి చచ్చేలా

డిస్టర్బ్  డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను
హే డిస్టర్బ్  డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను





చంపేశావే నన్ను పాట సాహిత్యం

 
చిత్రం: నేను లోకల్ (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: కపిల్ , సమీరా భరద్వాజ్

A B C D లెటర్స్ అన్నీ రాసి 
L O V E మాత్రం రౌండప్ చేసి
చంపేశావే నన్ను చంపేశావే నన్ను
1 2 3 4 నంబర్స్ అన్నీ గీసి 
1 4 3 నే రంగుల్లో ముంచేసి
చంపేశావే నన్ను చంపేశావే నన్ను
రెండే రెండు పెదవుల్లోని మౌనం చెరిపేసి
మూడే ముక్కలు చెప్పేశాగా నువ్వే నచ్చేసి
నా మనసుని మొత్తం ఊరించేసి రేపటిదాకా నన్నే ఆపేసి
చంపేశావే నన్ను నింపేశావే నాలో నిన్ను
చంపేశావే నన్ను నింపేశావే నాలో నిన్ను

నిమిషానికోసారి కిటికీలు తెరిచేస్తూ
సన్ లైట్ కోసం నైటు తోటి ఫైట్ చేస్తున్నా
తెగ గోళ్లు కొరికేస్తు తలగడ్లు నలిపేస్తూ
తెల్లారవేంటని చందమామని తిట్టి పోస్తున్నా
చిన్న ముల్లుని ఏకంగా వేలితో తిప్పేసేలా
అర్ధరాతిరి నిద్దర చెరిపేలా...

చంపేశావే నన్ను నింపేశావే నాలో నిన్ను
చంపేశావే నన్ను నింపేశావే నాలో నిన్ను


లే వన్నే నీతోటి ఏ పార్క్ కెల్లాలో 
ఏ పిక్చరే చూడాలి అంటు స్కెచ్ లేస్తున్నా
డే ఎండ్ నీకెట్టా సెండాఫ్ ఇవ్వాలో
నీ ముద్దుతో గుడ్ నైటు చెప్పాలో ఊహిస్తున్నా
చేతిలోన చెయ్యేసి దూరమంతా చెరిపేసే
రోజు కోసం ప్రాణం ఇచ్చేలా

చంపేశావే నన్ను నింపేశావే నాలో నిన్ను
చంపేశావే నన్ను నింపేశావే నాలో నిన్ను




సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ పాట సాహిత్యం

 
చిత్రం: నేను లోకల్ (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: జవేద్ ఆలీ

సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ , లోకల్ బాయ్స్ హియర్
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్, యు డోంట్ కం నియర్...

కుర్రోళ్లంటే లవ్ చెయ్యాలి పెద్దోళ్లంటే సైడివ్వాలి
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్, హే సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
లవర్ లవ్వే ఓకే చేస్తే క్యూ ఎంతున్నా క్లియరవ్వాలి
హే సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్, సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్
హే జనక జనక జనక జనక జనక జనక జజ్జనక
ఆడబోయే ఆటకింక సైడివ్వాలే
హే జనక జనక జనక జనక జనక జనక జజ్జనక
గెలవబోయే మ్యాచ్ కింక సైడివ్వాలే

సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ ఉయ్ ఆర్ ద లోకల్  (3)
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ లోకల్ బాయ్స్ హియర్...

హే పెళ్లే చేశాడు పిల్లకి ఇష్టం లేకుండా
వెళ్లి చూశాడు పాపకి స్మైలే లేదన్నా
నచ్చిన వాడుంటే అన్నీ ఇచ్చేవాడన్నా
అమ్మాయి కళ్ళల్లో ఖుషి నింపేవాడన్నా
పాతికేళ్ల పెంచుకున్న ఆడపిల్ల ప్రేమిస్తే
పంతమొదిలి సొంతవాళ్ళు సైడివ్వాలి
అమ్మ ఒడి నాన్న ఒడి గొడవపడి వదిలేస్తే
జంటలకు కంటతడే సైడివ్వాలే

సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ ఉయ్ ఆర్ ద లోకల్  (3)
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ లోకల్ బాయ్స్ హియర్...

హే ప్రేమపెళ్లంటే కాణికట్నం అక్కర్లే
వెండి పళ్ళెంలో కాళ్ళే కడగనక్కర్లే
ఎక్కువ తక్కువలే అని ఈగోలక్కర్లే
ఏడు తరాల ఎంక్వయిరీలే అక్కర్లే
వెయ్యినోటు పింకు నోటు వస్తుంటాయ్ పోతుంటాయ్
వందనోటు పెర్మినెంట్  సైడివ్వాలే
లవ్ లోన ఉన్నవాడు లైఫ్ లెక్క చెయ్ డంటా
చచ్చినట్టు ఎవ్వడైన సైడివ్వాలే

సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ ఉయ్ ఆర్ ద లోకల్  (3)
సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్ లోకల్ బాయ్స్ హియర్...

Most Recent

Default