Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Saradha Bullodu (1996)




చిత్రం: సరదాబుల్లోడు (1996)
సంగీతం: కోటి
నటీనటులు: వెంకటేష్, నగ్మా, సంఘవి
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: టి. త్రివిక్రమరావు
విడుదల తేది: 09.08.1996



Songs List:



రంగా రంగా సింగారంగా పాట సాహిత్యం

 
చిత్రం: సరదాబుల్లోడు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర

రంగా రంగా సింగారంగా రారా సారంగా
శృంగారంగా చిందేయంగా రావే సరసంగా
భారంగా వంగే సొంపులు కోరంగా వచ్చేయ్ సాయంగా
తీయంగా అల్లి తీర్చన నీ బెంగ

రంగా రంగా సింగారంగా రారా సారంగా
శృంగారంగా చిందేయంగా రావే సరసంగా

విరిసే వయసా నీ చిక్కని సొంపుల
చక్కదనానికి చిక్కనివాడొక మనిషా
పిలిచే వరసా నులి వెచ్చని ముచ్చట
తెరిచిన కౌగిట నలగని నాదొక సొగసా
నవనవమను నీ పరువం
కువ కువ మను కూసిన తరుణం
పిట పిట మను పడుచుదనం
పద పదమను ఈ నిముషం
అదిరే అందాల పెదవే కందాలి
ముదిరే ముద్దాటలో

రంగా రంగా సింగారంగా రారా సారంగా
శృంగారంగా చిందేయంగా రావే సరసంగా

కసిగా కసిరే చెలి కమ్మని తిమ్మిరి
గమ్మున తీర్చగ కమ్ముకు రావే పురుష
సుఖమే అడిగే సఖి ముచ్చట తీరగ
వెచ్చని వేడుక పంచుటకే కద కలిశా
తహతహ మను దాహంతో
తపనలు పడు సంపదలివిగో
అలుపెరుగని మొహంతో
కలపడు మగతనమిదిగో
నడుమే నవ్వేల తడిమే నీ చేతి
చలువే చూపించుకో

రంగా రంగా సింగారంగా రారా సారంగా
శృంగారంగా చిందేయంగా రావే సరసంగా
భారంగా వంగే సొంపులు కోరంగా వచ్చే సాయంగా
తీయంగా అల్లి తీర్చన నీ బెంగ





దాని వయ్యారం పాట సాహిత్యం

 
చిత్రం: సరదాబుల్లోడు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్. పి. బాలు, చిత్ర

దాని వయ్యారం



చిత్తా కార్తిలో చినుకులు చిటపట పాట సాహిత్యం

 
చిత్రం: సరదాబుల్లోడు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర

చిత్తా కార్తిలో చినుకులు చిటపట
యవ్వా ఏంది ఈ చిమ్ చిమ్ చిమ్
రెచ్చే వానలో రవికల రిమ రిమ
అచ్చా గుంటదే చమ్ చమ్ చమ్
కన్నె పువ్వే ఓ ఓ కెవ్వు మంటే
కుర్ర ఈడే ఓ ఓ కస్సు మంటే
కౌగిట్లో చేరాల కవ్వింతే సాగాల
కానీరో యవారం యమాగ ఓ యారో

పగలంతా ఒకటే పిచ్చి
పిచ్చి పిచ్చి పిచ్చి
పుట్టిందే ఎదలో కచ్చి
కచ్చి కచ్చి కచ్చి
మెరుపల్లె గురుడా వచ్చి
వచ్చి వచ్చి వచ్చి
మదనాల మధువే తెచ్చి
తెచ్చి తెచ్చి తెచ్చి
మెచ్చాను రావే మందార మాల
మొదలైంది ఒళ్ళో హాల్లా గుల్లా
కంగారు పడకోయ్ టైముంది చాలా
అందిస్తా అన్నీ ఎల్లాగోలా
అందించ మంట అందాల పంట
నాజూకు నట్టింటా ఓ ఓ

చిత్తా కార్తిలో చినుకులు చిటపట
యవ్వా ఏంది ఈ చిమ్ చిమ్ చిమ్
రెచ్చే వానలో రవికల రిమ రిమ
అచ్చా గుంటదే చమ్ చమ్ చమ్

చిరుజల్లు కొడుతూ ఉంటె
ఉంటె ఉంటె ఉంటె
చలి మంట పెట్టే మంటే
అంటే అంటే అంటే
పరువాలు రగిలే టచ్చి
టచ్చి టచ్చి టచ్చి
ఇచ్చెయినా సరదాగొచ్చి
ఇచ్చి ఇచ్చి ఇచ్చి
అల్లాడిపోయే కిల్లాడి సోకు
ఇచ్చేయి షాకు అన్నాడురో
తయ్యారుగుంటే తెల్లారే దాకా
సన్నాయి మోత మోగేనమ్మో
కాదంటే తంటా మోగించ మంట 
కౌగిట్లో కసి గంటా హో ఓ

చిత్తా కార్తిలో చినుకులు చిటపట
యవ్వా ఏంది ఈ చిమ్ చిమ్ చిమ్
రెచ్చే వానలో రవికల రిమ రిమ
అచ్చా గుంటదే చమ్ చమ్ చమ్
కన్నె పువ్వే ఓ ఓ కెవ్వు మంటే
కుర్ర ఈడే ఓ ఓ కస్సు మంటే
కౌగిట్లో చేరాల కవ్వింతే సాగాల
కానిద్దాం యవారం యమాగ ఓ యారో





మోగిందోయమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: సరదాబుల్లోడు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర

మోగిందోయమ్మో శ్రుతి చెయ్యని సిగ్గుల వీణ
రేగిందోయమ్మో మతిపోయిన ఈ పసి కూన
ఏం తాళం వేశాడే ధీంతన
ఏం రాగం తీసిందే అంగన

మోగిందోయమ్మో శ్రుతి చెయ్యని సిగ్గుల వీణ
రేగిందోయమ్మో మతిపోయిన ఈ పసి కూన

మోజు కొద్దీ ఒక్కో ముద్దు ముంచుకొచ్చే వేళ
రాజుకోదా నువ్వే చెప్పు రాసలీలల జ్వాల

ధీంతన ధీంతన ధీంతన ధీంతన ధీంతన

నడుము చుట్టూ ఒక్కో పట్టు కొంప ముంచే వేళ
మరచిపోదాం ఒక్కో తప్పు కంచె తెంచే గోల
అదిరే పెదవే అదిమి అణిచేదా తాపం
కందే అందం చిదిమి వెలిగించు దీపం
పొద్దేమిటో హద్దేమిటో లోకం మరిపించే మత్తులో

ధీంతన ధీంతన ధీంతన ధీంతన ధీంతన

మోగిందోయమ్మో శ్రుతి చెయ్యని సిగ్గుల వీణ
రేగిందోయమ్మో మతిపోయిన ఈ పసి కూన

ఆడ ఈడ తేడాలేక వాడి చూపేశాడే
ఆడ ఈడే తోడై రాగ వీరుడైపోయాడే

ధీంతన ధీంతన ధీంతన ధీంతన ధీంతన

దాగలేక సోకుల సైగ వేడి పెంచేసిందే
ఆగలేక రేగేదాక ఏడిపించేసిందే
వామ్మో వాయ్యో అన్నా వినలేదే వేగం
ఆహా ఊహూ అంటూ గులిసిందే తాపం
అల్లేసినా గిల్లేసినా బాగానే ఉంది కొత్తగా

ధీంతన ధీంతన ధీంతన ధీంతన ధీంతన

మోగిందోయమ్మో శ్రుతి చెయ్యని సిగ్గుల వీణ
రేగిందోయమ్మో మతిపోయిన ఈ పసి కూన
ఏం తాళం వేశాడే ధీంతన
ఏం రాగం తీసిందే అంగన



నాటుకోడి పెట్టోయమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: సరదాబుల్లోడు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్. పి. బాలు, చిత్ర

అరె పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో
నాటుకోడి పెట్టోయమ్మ 
అమ్మమ్మమ్మమ్మ ఎంతో కసి
ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి
అరె నైసు గుంది కొట్టెయ్ చుమ్మా
అమ్మమ్మమ్మమ్మ ఎంతో రుచి
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి
హొయ్ అబ్బదాని సోకు బాదం పిస్తా కేకు
అమ్మమ్మా దాని వీపు మైసూర్ శాండిల్ సోపు
కౌగిట్లోనే చిక్కిందమ్మా కస్సు బస్సు పాపాయమ్మో

నాటుకోడి పెట్టోయమ్మ 
అమ్మమ్మమ్మమ్మ ఎంతో కసి
ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి

అరె భోల్ భోల్ భోల్ భోల్ భోల్ రాధ భోల్
సందిట్లో ఎంచక్కా సంగం హోగానయి
రాకెన్రోల్ రోల్ రోల్ రోల్ రోల్ రాణి రోల్
నాతోటి పెట్కుంటే మోగిపోతాదే డోల్
అరె పట్టేశానే పక్క కొలిపిస్తా జానా బెత్త
ఇక చూస్కోయే నా సత్తా నీ అమ్మని చేస్తా అత్త
మేళం తాళం పెట్టిస్తా ఊరు వాడా తిప్పిస్తా
లవ్వో గివ్వో లాగించేస్తా
అస్కో బుస్కో పాపాయమ్మా

నాటుకోడి పెట్టోయమ్మ 
అమ్మమ్మమ్మమ్మ ఎంతో కసి
ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి
అరెరెర్రె నైసు గుంది కొట్టెయ్ చుమ్మా
అమ్మమ్మ మ్మమ్మమ్మ ఎంతో రుచి
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి

అరె కాయ్ కాయ్ కాయ్ పందెం కాయ్ రాజా కాయ్
ఫికర్నేదో చూపించి దుమ్ము దులిపేస్తానోయ్
వామ్మో...
అరెరెర్రె హాయిరె హాయ్ హాయ్ హాయ్
ఐ యామ్ వెరీ బాడ్ బాయ్
చాలంజి చేశావో తింటావే గుత్తోంకాయ్
అరె జారే జారే బచ్చా ఆడిస్తా కచ్చా బచ్చా
పెడతానే ముద్దు మేత మీ నాన్నను చేస్తా తాత
పందిరి మంచం ఎక్కిస్తా పళ్ళు పాలు మెక్కిస్తా
పెళ్ళవకుండా తళ్ళైపోతావ్
అల్లో మల్లో పాపాయమ్మా

నాటుకోడి పెట్టోయమ్మ 
అమ్మమ్మమ్మ ఎంతో కసి
ఎంతో కసి ఎంతో కసి ఎంతో కసి
ఆ నైసు గుంది కొట్టెయ్ చుమ్మా
అమ్మమ్మ మ్మమ్మమ్మ ఎంతో రుచి
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచి
అబ్బదాని సోకు బాదం పిస్తా కేకు
అమ్మమ్మా దాని వీపు మైసూర్ శాండిల్ సోపు
కౌగిట్లోనే చిక్కిందమ్మా కస్సు బస్సు పాపాయమ్మో




జిలేలే జిలేలే జిలేలే పాట సాహిత్యం

 

చిత్రం: సరదాబుల్లోడు (1996)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు, చిత్ర

జిలేలే  జిలేలే  జిలేలే


Most Recent

Default