Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Rajasekhar"
Mr Hero (1988)



చిత్రం: మిస్టర్ హీరో (1988)
సంగీతం: శివాజీ రాజా 
సాహిత్యం: ఆత్రేయ  (All)
గానం: యస్.పి. బాలు, పి.సుశీల, కె.యస్.చిత్ర 
నటీనటులు: రాజశేఖర్, అశ్విని, జీవిత 
దర్శకత్వం: సత్యారెడ్డి 
నిర్మాత: యం. లక్ష్మణ స్వామి 
విడుదల తేది: 01.08.1988



Songs List:



నీలి మేఘాలలోన పాట సాహిత్యం

 
చిత్రం: మిస్టర్ హీరో (1988)
సంగీతం: శివాజీ రాజా 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి. బాలు,  కె.యస్.చిత్ర 

నీలి మేఘాలలోన



వయసే వయసును పాట సాహిత్యం

 
చిత్రం: మిస్టర్ హీరో (1988)
సంగీతం: శివాజీ రాజా 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి. బాలు,  కె.యస్.చిత్ర 

వయసే వయసును 



చెప్పనా చెయ్యనా పాట సాహిత్యం

 
చిత్రం: మిస్టర్ హీరో (1988)
సంగీతం: శివాజీ రాజా 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి. బాలు

చెప్పనా చెయ్యనా 





తాళిబొట్టు కట్టుర పాట సాహిత్యం

 
చిత్రం: మిస్టర్ హీరో (1988)
సంగీతం: శివాజీ రాజా 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: పి. సుశీల 

తాళిబొట్టు కట్టుర 



నీకల్లలోన మెరిసే వాకిళ్ళ లోన పాట సాహిత్యం

 
చిత్రం: మిస్టర్ హీరో (1988)
సంగీతం: శివాజీ రాజా 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి. బాలు

నీకల్లలోన మెరిసే వాకిళ్ళ లోన 

Palli Balakrishna Thursday, September 8, 2022
Mamathala Kovela (1986)



చిత్రం: మమతల కోవెల (1986)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, జాలాది, వెన్నెలకంటి. 
గానం: యస్.పి. బాలు, యస్. జానకి , పి. సుశీల, వందేమాతరం శ్రీనివాస్, లలితా సాగరి, రమణ 
నటీనటులు: రాజశేఖర్, సుహాసిని, శుభలేఖ సుధాకర్, సుప్రియ 
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య 
నిర్మాత: శ్రీమతి రాజ్యలక్ష్మి 
విడుదల తేది: 1986

Palli Balakrishna
Neti Gandhi (1999)



చిత్రం: నేటి గాంధీ (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల 
నటీనటులు: రాజశేఖర్, రాశి, జయసుధ
మాటలు: జనార్ధన్ మహర్షి 
కో. డైరెక్టర్: ఇ.సత్తిబాబు
దర్శకత్వం: ఈ.వి.వి.సత్యన్నారాయణ 
నిర్మాత: ఆర్.బి.చౌదరి 
విడుదల తేది: 1999



Songs List:



చల్లరే చల్లరే పాట సాహిత్యం

 
చిత్రం: నేటి గాంధీ (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, స్వర్ణలత 

చల్లరే చల్లరే



ఈ బొమ్మ నాకోసం పాట సాహిత్యం

 
చిత్రం: నేటి గాంధీ (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

ఈ బొమ్మ నాకోసం అని ఆ బ్రహ్మ ఆదేశం
ఈ జన్మ నీకోసం అని నా ప్రేమ సందేశం
కంగారు పడిపోనా
అరెరెరే
కాదంటే ఎపుడైనా
ఆ జోరే తగదన్నా
సరే సరే
చూస్తారు ఎవరైనా
నేనాగ గలనా ఎవరేమి అనుకున్నా...

ఈ బొమ్మ నాకోసం అని ఆ బ్రహ్మ ఆదేశం
ఈ జన్మ నీకోసం అని నా ప్రేమ సందేశం

వేదించినా వెంటవచ్చినా
నచ్చినట్లే ఉందయ్యా ఎందువలన
ఒట్టేయ్యనా గుట్టు చెప్పనా
ఇష్టమేదో వుందమ్మా నాపైన
వగలమారి తొలిప్రేమ మొదలయ్యింది మదిలోనా
నిజము నమ్మవా బామా రుజువులెన్ని ఎదురైనా
నమ్మాను గనకే నీ మీద బ్రమపడినా...

ఈ బొమ్మ నాకోసం అని ఆ బ్రహ్మ ఆదేశం హో...
ఈ జన్మ నీకోసం అని నా ప్రేమ సందేశం

కవ్వించినా కోపగించినా
కమ్మగానే ఉందమ్మ ఏమన్నా
ఔనందునా కాదందునా వింత ఎన్ని చేసేది ప్రేమేనా
ఒకరికొకరు జతపడితే తెలిసిపోదా ఆ వింత
నిమిషమైన విడిచుంటే నిలవలేదు ఈ మంట
నూరేళ్ల వరకు నీ వెంట నేనుంటా...

ఈ బొమ్మ నాకోసం అని ఆ బ్రహ్మ ఆదేశం
ఈ జన్మ నీకోసం అని నా ప్రేమ సందేశం
క కంగారు పడిపోనా
అరెరెరే
కాదంటే ఎపుడైనా
ఆ జోరే తగదన్నా
సరే సరే
చూస్తారు ఎవరైనా
నేనాగ గలనా ఎవరేమి అనుకున్నా...



కయ్యాల రంగడే పాట సాహిత్యం

 
చిత్రం: నేటి గాంధీ (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: మనో, పార్ధసారధి

కయ్యాల రంగడే




శ్రీకారంలా సిగ్గే పాట సాహిత్యం

 
చిత్రం: నేటి గాంధీ (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

శ్రీకారంలా సిగ్గే చుట్టుకుంది చలి సీతాకోక చిలకై వచ్చింది 



బాపూజీ ఏమిచ్చి తీర్చనయ్యో నీ పిచ్చి పాట సాహిత్యం

 
చిత్రం: నేటి గాంధీ (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

బాపూజీ ఏమిచ్చి తీర్చనయ్యో నీ పిచ్చి



జరుపుతోంది జరుపుతోంది పాట సాహిత్యం

 
చిత్రం: నేటి గాంధీ (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, చిత్ర 

జరుపుతోంది జరుపుతోంది




తెల్లదొరల చెరనుంచి పాట సాహిత్యం

 
చిత్రం: నేటి గాంధీ (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: 
గానం: చిత్ర 

తెల్లదొరల చెరనుంచి 

Palli Balakrishna Wednesday, August 10, 2022
Ankusham (1989)



చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల (All)
గానం: యస్.పి. బాలు, జానకి (All)
నటీనటులు: రాజశేఖర్, జీవిత
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాతలు: యమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 13.07.1989



Songs List:



ఇది చెరగని ప్రేమకు శ్రీకారం పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం: యస్.పి. బాలు, జానకి 

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఇది మమతల మేడకు ప్రాకారం
పండిన కలలకు శ్రీరస్తు
పసుపు కుంకుమకు శుభమస్తు
కని విని ఎరుగని  అనురాగానికి
కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఇది మమతల మేడకు ప్రాకారం
పండిన కలలకు శ్రీరస్తు
పసుపు కుంకుమకు శుభమస్తు
కని విని ఎరుగని  అనురాగానికి
కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు

కళ్యాణ గంధాలు కౌగిలికి తెలుసు
రసరమ్య బంధాలు రాతిరికి తెలుసు
పారాణి మిసమిసలు పదములకు తెలుసు
పడకింటి గుసగుసలు పానుపుకి తెలుసు
చిగురుటాశల చిలిపి చేతలు
పసిడి బుగ్గల పలకరింపులు
పడుచు జంటకే తెలుసు

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఇది మమతల మేడకు ప్రాకారం
పండిన కలలకు శ్రీరస్తు
పసుపు కుంకుమకు శుభమస్తు
కని విని ఎరుగని  అనురాగానికి
కలకాలం వైభోగమస్తు
కలకాలం వైభోగమస్తు

ముగ్గులే తొలిపొద్దు ముంగిళ్ళకందం
శ్రీవారి చిరునవ్వే శ్రీమతికి అందం
నింటికి పున్నమి జాబిల్లి అందం
ఇంటికి తొలి చూలు ఇల్లాలు అందం
జన్మ జన్మల పుణ్యఫలముగా
జాలువారు పసిపాప నవ్వులే
ఆలు మగలకు అందం

ఇది చెరగని ప్రేమకు శ్రీకారం
ఇది మమతల మేడకు ప్రాకారం
పండిన కలలకు శ్రీరస్తు
పసుపు కుంకుమకు శుభమస్తు
కని విని ఎరుగని  అనురాగానికి
కలకాలం వైభోగమస్తు
కలకాలం వైభోగమస్తు




గోరంత దీపం పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం:  జానకి 

గోరంత దీపం 




అయ్యలో జగరత పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం:  యస్.పి. బాలు

అయ్యలో జగరత 




చిన్నారి కసిగందు పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం:  యస్.పి. బాలు

చిన్నారి కసిగందు 



నేను తప్పు చేయలేదు పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం:  యస్.పి. బాలు

నేను తప్పు చేయలేదు 



చట్టాలను దిక్కరిస్తూ పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం:  యస్.పి. బాలు

చట్టాలను దిక్కరిస్తూ 



అమ్మ పిలుపుని నోచనివాడు పాట సాహిత్యం

 
చిత్రం: అంకుశం (1989)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: మల్లెమాల 
గానం:  యస్.పి. బాలు

అమ్మ పిలుపుని నోచనివాడు 

Palli Balakrishna Wednesday, February 2, 2022
Shekar (2022)



చిత్రం: శేఖర్ (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్ 
నటీనటులు: రాజశేఖర్ 
దర్శకత్వం: జీవిత 
నిర్మాత: బీరం సుధాకర్ రెడ్డి 
విడుదల తేది: 2022



Songs List:



లవ్ గంటె పాట సాహిత్యం

 
చిత్రం: శేఖర్ (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: అనూప్ రూబెన్స్ , విజయ్ ప్రకాష్, రేవంత్ 

టంగు టకుం టంగు టకుం
టంగు టకుం టం
టంగు టకుం టంగు టకుం
టంగు టకుం టం

ఆ, బొట్టు పెట్టి కాటుకెట్టి
వచ్చిందమ్మా సిన్నది
బుగ్గా మీద సుక్కే పెట్టి
సిగ్గే పడుతు ఉన్నదీ

టంగు టకుం టంగు టకుం
టంగు టకుం టం

అరె, నెత్తి మీద బుట్టే పెట్టి
వచ్చిందమ్మా సిన్నదీ
బుట్టలోన నన్నే పెట్టే
వన్నె సిన్నెలున్నదీ

కోలా కళ్ళతో నను చూస్తున్నది
కొంటె నవ్వుతో నమిలేస్తున్నది
ఆ నవ్వే చూసి నా ప్రాణం
జివ్వు జివ్వు మన్నది

హే, డండ డండ డండ
లవ్ గంటె మోగిందంట
డండ డండ డండ
తొలిప్రేమే పుట్టిందంట
డండ డండ డండ
లవ్ గంటే మోగిందంట

టంగు టకుం టంగు టకుం
టంగు టకుం టం
ఓకే, మరి నీ కదేంట్రా..?

చూడిదారు చుట్టుకోని
వచ్చిందమ్మా సిన్నదీ
చున్నీ లాగా చందమామను
కప్పుకొని ఉన్నదీ

టంగు టకుం టంగు టకుం
టంగు టకుం టం
అరె , చూడిదారు చుట్టుకోని
వచ్చిందమ్మా సిన్నదీ
చున్నీ లాగా చందమామను
కప్పుకొని ఉన్నదీ

మెల్లమెల్లగా అడుగేస్తున్నది
నేల వెన్నెల మడుగౌతున్నది
తన నడకే చూసి నా గుండె
ధడకు ధడకుమన్నది

హే, డండ డండ డండ
లవ్ గంటె మోగిందంట
డండ డండ డండ
తొలిప్రేమే పుట్టిందంట
డండ డండ డండ
లవ్ గంటే మోగిందంట

ఆహ, ఏంట్రా..! నీ కథేంటి?
చింతా పూలా, ఓ ఓ ఓ హో
చింతపూలా చీరె కట్టి
వచ్చిందమ్మ సిన్నది
సంతోషాల నగలే పెట్టి
గంతులేస్తు ఉన్నది

టంగు టకుం టంగు టకుం
టంగు టకుం టం
ఆ, రాణి లాగ రైకే చుట్టి
వచ్చిందమ్మా సిన్నది
రాను రాను అంటూనే
రయ్యున వచ్చేస్తున్నది

తీగ మల్లికి చెల్లెలు అన్నది
తేనె చుక్కకి అక్కను అన్నది
తన మాటే వింటూ నా మనసే
తన మాటే వింటూ నా మనసే
నా మాటే విననన్నది, ఆయ్

డండ డండ డండ
లవ్ గంటె మోగిందంట
డండ డండ డండ
తొలిప్రేమే పుట్టిందంట




కిన్నెరా పాట సాహిత్యం

 
చిత్రం: శేఖర్ (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్ 
సాహిత్యం: అనంత్ శ్రీరాం 
గానం: అర్మాన్ మాలిక్ 

ఓ, సన్నజాజి తీగల అల్లుకోవే నన్నిలా
కిన్నెరా... ఓ కిన్నెరా
సంకురాత్రి పంటలా పంచుకోవే నన్నిలా
కిన్నెరా... ఓ కిన్నెరా

చీకటి నిండా నీ కలలే
వేకువ నిండా నీ వెలుగే
నన్ను చేరెనే ఓ కిన్నెరా
నిన్ను కోరెనే నా కిన్నెరా

అన్నులా మిన్నులా అల్లిబిల్లి వెన్నెలా
నవ్వుతు నువ్వు నా వెంటరా
గల్ గలా గల్ గలా తుళ్లుతున్న మువ్వలా
గుండెలో చిందగా జంటరా, నా జంట రా

ఒక గంటనో రోజో నాకు చాలదే
ఒక జీవితం కూడా తక్కువే కాదే
అందుకే మరి ప్రాణం ఊరకుండదే
జన్మ జన్మని నీకే రాయమన్నదే
రాసి ఇస్తానే మనసారా

కిన్నెరా... ఓ కిన్నెరా
కిన్నెరా... నా కిన్నెరా

సన్నజాజి తీగల అల్లుకోవే నన్నిలా
కిన్నెరా... ఓ కిన్నెరా
సంకురాత్రి పంటలా పంచుకోవే నన్నిలా
కిన్నెరా... ఓ కిన్నెరా

నిన్నే నిన్నే చూడందే రాదే నిద్దుర
కిన్నెరా... ఓ కిన్నెరా
నిన్నే ఉంచమంది నా రెండు కళ్ళ ముందర
కిన్నెరా... ఓ కిన్నెరా

ఏమౌతుందో ఎదరెదరా
నువ్వెదురైతే మతి చెదరా
ఓ కిన్నెరా… నా కిన్నెరా
నిన్నే కోరెరా… నా తోడు రా

గవ్వలా రవ్వలా రివ్వుమన్న గువ్వలా
జంటలో సంబరం చెయ్యరా
గుండెలో గంధమై... వంద ఏళ్ళ బంధమై
ఉండిపోమంది ఈ తెమ్మెరా... నా కిన్నెరా

కళ్ళ నిండుగ నిన్నే నింపుకుందునా
కంటిపాపను కాచే రెప్పనవ్వనా
నువ్వు కోరితే ప్రాణం చేతికివ్వనా
జన్మజన్మని నీకే కానుకివ్వనా
నాకు ఎవ్వరింక లోకాన

కిన్నెరా... ఓ కిన్నెరా
కిన్నెరా... నా కిన్నెరా



చిన్ని చిన్ని ప్రాణం పాట సాహిత్యం

 
చిత్రం: శేఖర్ (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: చిన్మియి శ్రీపాద, హైమత్ 

చిన్ని చిన్ని ప్రాణం
చిందులాడే పాదం
నా కోసం నువ్వు పంచిన
ఇన్ని నాళ్ళ కాలం
అందీరాని గగనం
ఇష్టంగా నెలకొచ్చేనా

నేనే తానై వీచే గాలి
పాడే జో లాలి
ఖాళీ ఖాళీ కన్నుల్లోనా
కలలా దీవాళీ

చిన్ని చిన్ని ప్రాణం
చిందులాడే పాదం
నా కోసం నువ్వు పంచిన
ఇన్ని నాళ్ళ కాలం
అందీరాని గగనం
ఇష్టంగా నెలకొచ్చేనా

పచ్చని గూడు… వెచ్చని తోడు
పొద్దు పొడిచాడు… కొత్త సూరీడు
నిండు నట్టింట… ముద్దు బంగారు
ఎంత బాగుందో… జీవితం నేడు

ఇంతే ఇంతే చాలు… ఇల్లా ఉంటె చాలు
నా చేయి పట్టినాయి చిట్టి వేళ్ళు
నిన్న మొన్న లేనే లేని… ఆహ స్వరాలూ
ఏరి కోరి నన్నే చేరే… ఎన్నో వరాలు

చిన్ని చిన్ని ప్రాణం
చిందులాడే పాదం
నా కోసం నువ్వు పంచిన
ఇన్ని నాళ్ళ కాలం
అందీరాని గగనం
ఇష్టంగా నెలకొచ్చేనా

పసిడి పాదాల… మువ్వనై నేనే
ఘల్లు మంటోంది… నా గుండె సడులే
పరికిణి అంచు… పరవళ్లలోనే
పరవసించేటి నాన్ననయ్యాలే

ఏదో లేదే అన్న చేదు బాధ అన్ని
మరిపించి మురిపిస్తుంది ఈ ప్రపంచం
రంగు రంగు జతగా చేర్చి… గీసా రంగోలి
రోజు పూసే రోజా పువ్వై… సమయం నవ్వాలి

చిన్ని చిన్ని ప్రాణం… చిందులాడే పాదం
నా కోసం నువ్వు పంచిన
ఇన్ని నాళ్ళ కాలం… అందీరాని గగనం
ఇష్టంగా నెలకొచ్చేనా





సత్యం శివం సుందరం పాట సాహిత్యం

 
చిత్రం: శేఖర్ (2022)
సంగీతం: అనూప్ రూబెన్స్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: విజయ్ యేసుదాస్ ఉమా నేహా 

సత్యం శివం సుందరం
జగమే దివ్య మందిరం
ఎటుగా చూసినా నీ వెలుగేనయా
నీ వారేగా అందరం
నీ ప్రేమేగా మా బలం
ఎపుడేం జరిగిన నీ వలనేనయా

హితుడై నువ్వలా… జతగా నిలువ
కలత నలత… ధరి రాగలవా
ప్రతి మలుపు మార్పు… నీ వలనే దేవా

నీ కను చూపే వసంతం
నీ కరునేగా సమస్తం
నింగి నేల దిగంతం
దేవా నీ దయ అనంతం

ఎన్ని జన్మాల… వరమో ఏమో గాని
నాన్నావయ్యావు నాకు
ఎంత దూరాన… కొలువై ఉన్నాగాని
ఊతమిస్తావు ఎదకూ

అంతులేని నీ ప్రేమే… పండు వెన్నెల
అంతరాయమే లేని పండుగై ఇలా
కాలమంతా నువ్వు నన్ను… చూస్తుంటే చాలు

నీ కను చూపే వసంతం
నీ కరునేగా సమస్తం
నింగి నేల దిగంతం
దేవా నీ దయ అనంతం

శిధిలాలన్నీ చేర్చన
శిల్పంలాగ మార్చనా
మరల కొత్తగా మొదలై సాగనా

ఎదలో దిగులు తుంచన
కాలం రంగు మార్చనా
నడిచే దారిలో… నవ్వులు పెంచనా

నిన్న మొన్న… నిశిలో ఉన్న
ఇకపై నీతో అడుగేస్తున్న
బ్రతికే బలమై… నను నడిపించవయా

నీ కను చూపే వసంతం
నీ కరునేగా సమస్తం
నింగి నేల దిగంతం
దేవా నీ దయ అనంతం

Palli Balakrishna Sunday, January 9, 2022
Yugakarthalu (1987)



చిత్రం: యుగకర్తలు (1987)
సంగీతం: సుభాష్ - గోపి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, వడ్డేపల్లి కృష్ణ
నటీనటులు: రాజశేఖర్ , జీవిత, సాయికుమార్, సాగర్, బాబూమోహన్ (తొలిపరిచయం)
దర్శకత్వం: కె.ఆదిత్య
నిర్మాత: కె. రాఘవ
విడుదల తేది: 11.09.1987



Songs List:



తాగినోడి నోటి మాట పాట సాహిత్యం

 
చిత్రం: యుగకర్తలు (1987)
సంగీతం: సుభాష్ - గోపి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, వడ్డేపల్లి కృష్ణ
గానం: యస్.పి.బాలు

తాగినోడి నోటి మాట తందనాల వేదమంట 



కలుసుకుందామా పాట సాహిత్యం

 
చిత్రం: యుగకర్తలు (1987)
సంగీతం: సుభాష్ - గోపి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, వడ్డేపల్లి కృష్ణ
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

కలుసుకుందామా ఘడియ ఘడియలో 



పట్టాలను నమ్ముకుంటే పాట సాహిత్యం

 
చిత్రం: యుగకర్తలు (1987)
సంగీతం: సుభాష్ - గోపి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, వడ్డేపల్లి కృష్ణ
గానం: యస్.పి.బాలు

ఏందిరా బిడ్డా వీళ్ళు ఏమనుకుంటున్నారు
పట్టాలను నమ్ముకుంటే పొట్ట నిండదు

Palli Balakrishna Thursday, August 26, 2021
Repati Pourulu (1986)



చిత్రం: రేపటి పౌరులు (1986)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: విజయశాంతి, రాజశేఖర్
దర్శకత్వం: టి. కృష్ణ
నిర్మాత: పోకూరి వెంకటేశ్వర రావు
విడుదల తేది: 1986

Palli Balakrishna Wednesday, August 25, 2021
Indra Dhanassu (1988)





చిత్రం: ఇంద్ర ధనస్సు (1988)
సంగీతం: రాజ్ - కోటి 
పాటలు: ఆత్రేయ
నటీనటులు: రాజశేఖర్, జీవిత
దర్శకత్వం: కె.రంగారావు
నిర్మాత: వి.శ్రీనివాస రావు 
విడుదల తేది: 1988



Songs List:



ఇంద్ర ధనస్సు ఇల్లాలై పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్ర ధనస్సు (1988)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

ఇంద్ర ధనస్సు ఇల్లాలై




కథ ఏదైనా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్ర ధనస్సు (1988)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: ఆత్రేయ
గానం: జె.కె.ఏసుదాసు 

కథ ఏదైనా 




నవరస భరితం పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్ర ధనస్సు (1988)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: ఆత్రేయ
గానం: సుశీల 

నవరస భరితం 




శిలను శిల్పంగా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంద్ర ధనస్సు (1988)
సంగీతం: రాజ్ - కోటి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు,  సుశీల 

శిలను శిల్పంగా 

Palli Balakrishna Saturday, July 31, 2021
Sruthilayalu (1987)




చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
నటీనటులు: రాజశేఖర్, సుమలత, షణ్ముఖ శ్రీనివాస్, జయలలిత, నరేష్ 
దర్శకత్వం: కె.విశ్వనాధ్ 
నిర్మాతలు: కరుణాకర్, సుధాకర్ 
విడుదల తేది: 1987



Songs List:



ఆలోకయే శ్రీ బాల పాట సాహిత్యం

 
చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: తారంగం
గానం: వాణి జయరాం 

ఆలోకయే శ్రీ  బాల 




ఇన్ని రాశుల యునికి పాట సాహిత్యం

 
చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: అన్నమాచార్యుని కృతి
గానం: యస్.పి.బాలు, వాణి జయరాం 

ఇన్ని రాశుల యునికి 



జానకి కుంహ సమరణం పాట సాహిత్యం

 
చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం: యస్.పి.బాలు

జానకి కుంహ సమరణం




కోరిన చిన్నది పాట సాహిత్యం

 
చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: త్యాగరాయ కృతి
గానం: పూర్ణచందర్

కోరిన చిన్నది 



మేరా జుతా హై జపానీ పాట సాహిత్యం

 
చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం: ఎస్.జానకి  

మేరా జుతా హై జపానీ



శ్రీ గాననాధం పాట సాహిత్యం

 
చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: తారంగం 
గానం: పూర్ణచందర్, వాణి జయరాం

శ్రీ గణనాధం 



శ్రీ శారదాంబ పాట సాహిత్యం

 
చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం: ఎస్.జానకి  

శ్రీ శారదాంబ



తక తిక పాట సాహిత్యం

 
చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: త్యాగరాయ కృతి
గానం: పూర్ణచందర్

తక తిక 



తందనాన పాట సాహిత్యం

 
చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం: యస్.పి.బాలు 

తందనాన



తెలవారదేమో స్వామి పాట సాహిత్యం

 
చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం: యేసుదాస్

తెలవారదేమో స్వామి 



తెలవారదేమో స్వామి పాట సాహిత్యం

 
చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం: సుశీల

తెలవారదేమో స్వామి 



తనదు వారసత్వం పాట సాహిత్యం

 
చిత్రం: శృతిలయలు  (1987)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి 
గానం: సుశీల

తనదు వారసత్వం 

Palli Balakrishna Saturday, June 26, 2021
America Abbayi (1987)



చిత్రం: అమెరికా అబ్బాయి (1987)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, ఆరుద్ర
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: రాజశేఖర్, రాధిక, అశ్వని
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత: దుక్కిపాటి మధుసూదనరావు
విడుదల తేది: 23.01.1987



Songs List:



దేవుని దయ ఉంటే పాట సాహిత్యం

 
చిత్రం: అమెరికా అబ్బాయి (1987)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి. బాలు

దేవుని దయ ఉంటే దొరబాబులం
స్వయంగా పనిచేస్తే యజమానులం
నిన్నటి గరీబులం
రేపటి అమీరులం
మనలో మనం..అంతా సమం
ఒకటే కుటుంబము

స్వదేశమైనా విదేశమైనా సమానమనుకోరా
పాటు పడ్డచో కూటికెన్నడు లోటురాదు కదరా
చదువుసంధ్యలున్నా..ఉద్యోగాలు సున్నా
శ్రమయే సుఖం..చమటే ధనం
స్వశక్తి ప్రధానము

విహారయాత్రలు వినోదయాత్రలు వికాసమిస్తాయి
కొత్తచోటుల కొత్తమనుషుల పరిచయాలు తెస్తాయి
మంచివారికెప్పుడు మంచి జరుగుతుంది
జనతారధం..సమతాపధం
ప్రగతే ప్రయాణము




గిలిగింతల తోటలో పాట సాహిత్యం

 
చిత్రం: అమెరికా అబ్బాయి (1987)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు, పి.సుశీల  

పల్లవి:
గిలిగింతల తోటలో పులకింతలు పూయని
పులకింతల నావలో తొలిప్రేమలు సాగని
గిలిగింతల తోటలో పులకింతలు పూయని
పులకింతల నావలో తొలిప్రేమలు సాగని

చరణం: 1 
ఒక్క క్షణం చూడకుంటే ఊహకెంత తొందర
ఒక్క క్షణం చూడకుంటే ఊహకెంత తొందర
నో ఒడిలో చేరగానే నింగి నిలిచే ముందరా

నిండువలపు బాసలన్నీ నిలిపేదే జీవితం
నిండువలపు బాసలన్నీ నిలిపేదే జీవితం
అందుకే నా మనసు.. నీకే అంకితం

గిలిగింతల తోటలో పులకింతలు పూయని
పులకింతల నావలో తొలిప్రేమలు సాగని

చరణం: 2 
చిగురు మేను తాకగానే పెదవికింత దాహమా
చిగురు మేను తాకగానే పెదవికింత దాహమా
ఈ చెంపను మీటగానే ఆ చెంపకు తాపమా

చిలిపి చూపు గుండెపైన చేసింది సంతకం
చిలిపి చూపు గుండెపైన చేసింది సంతకం
అందుకే అణువణువు నీకే అంకితం

గిలిగింతల తోటలో పులకింతలు పూయని
పులకింతల నావలో తొలిప్రేమలు సాగని

గిలిగింతల తోటలో పులకింతలు పూయని
పులకింతల నావలో తొలిప్రేమలు సాగని



కన్నతల్లి దీవెన పాట సాహిత్యం

 
చిత్రం: అమెరికా అబ్బాయి (1987)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి. సుశీల

కన్నతల్లి దీవెన 




పలుకవా ప్రియా పాట సాహిత్యం

 
చిత్రం: అమెరికా అబ్బాయి (1987)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి. బాలు, పి. సుశీల

నీవు బొమ్మవా - ఉహూ...
ముద్దు గుమ్మవా - ఊహూ హు హు....
మనసు దోచే మరుమల్లె కొమ్మవా
అహా...అహా...ఆ... అహహాహా...

పల్లవి:
పలుకవా ప్రియా ప్రియా తెలుపవా ప్రియా ప్రియా
వలపు వీణలు మీటిన క్షణం
మలుపు తిరుగును జీవిన పధం
నీవో సగం నేనో సగం ఒకటే జీవితం

పలుకవా ప్రియా ప్రియా తెలుపవా ప్రియా ప్రియా
వలపు వీణలు మీటిన క్షణం
మలుపు తిరుగును జీవిన పధం
నీవో సగం నేనో సగం ఒకటే జీవితం
పలుకవా ప్రియా ప్రియా తెలుపవా ప్రియా ప్రియా

చరణం: 1
నీవెవరో ఊర్వశివి మురిపించే ప్రేయసివి
తలపులలో మెరిశావు నా మదిలో వెలిశావు
సన్నిధిలో సరాగాలు పెన్నిధిగా ప్రసాదించు
సన్నిధిలో సరాగాలు పెన్నిధిగా ప్రసాదించు
ఆశా రధం సాగే రిథం నీవే తెలుపవా
పలుకవా ప్రియా ప్రియా తెలుపవా ప్రియా ప్రియా

చరణం: 2
కదలని నీ కన్నులలో కళలెన్నో కన్నాను
ముసిముసి నీ నవ్వులలో గుసగుసలే విన్నాను
పచ్చని కల ఫలించాలి వెచ్చని జత సుఖించాలి
పచ్చని కల ఫలించాలి వెచ్చని జత సుఖించాలి 
మన ఈ కథ.. మమతల సుధా చెలిమే సంపదా

పలుకవా ప్రియా ప్రియా తెలుపవా ప్రియా ప్రియా
వలపు వీణలు మీటిన క్షణం
మలుపు తిరుగును జీవిన పధం
నీవో సగం... నీవో సగం.. ఒకటే జీవితం..
పలుకవా ప్రియా ప్రియా తెలుపవా ప్రియా ప్రియా
పలుకవా ప్రియా ప్రియా తెలుపవా ప్రియా ప్రియా
లలలాలల లలాలలాలాల్లా




పలుకవే రాగ వీణ పాట సాహిత్యం

 
చిత్రం: అమెరికా అబ్బాయి (1987)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి. సుశీల

పల్లవి:
పలుకవే రాగ వీణ తెలుగు హృదయాల లోన
తీనే కెరటాల పైన 
పలుకవే రాగ వీణ తెలుగు హృదయాల లోన
తీనే కెరటాల పైన 

పలుకు పలుకులో లలిత భావనలు
పల్లవించి పులకించగా
పలుకు పలుకులో లలిత భావనలు
పల్లవించి పులకించగా

పదము పదములో మధుర రాగిణులు
పరవశించి తలలూపగ
ఆఆ ఆఆ ఆఆ అఆ ఆఆ ఆఆఆఆ 

పలుకవే రాగ వీణ తెలుగు హృదయాల లోన

చరణం: 1
సిరి సంపదలు పెరిగిన గాని
పరువే మనిషికి ప్రాణమని అ... ఆ...
సిరి సంపదలు పెరిగిన గాని
పరువే మనిషికి ప్రాణమని అ... ఆ...

ఎవరికి వారే పయనిస్తువున్నా
చివరికి మిగిలేది స్నేహమని అ... ఆ...

పలుకవే రాగ వీణ తెలుగు హృదయాల లోన

చరణం: 2
మనసుకు మనసూ శ్రుతిలేకుంటే
కలిసే వున్నా దూరాలే
మనసుకు మనసూ శ్రుతిలేకుంటే
కలిసే వున్నా దూరాలే
మమతలు తామే ముడివడి వుంటే
దూరా లై న చేరువలె అ... ఆ...

పలుకవే రాగ వీణ తెలుగు హృదయాల లోన
తీనే కెరటాల పైన 




ఏ దేశమేగినా పాట సాహిత్యం

 
చిత్రం: అమెరికా అబ్బాయి (1987)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల

పల్లవి:
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ

రాయప్రోలన్నాడు ఆనాడూ
అది మరిచిపోవద్దు ఏనాడూ

చరణం: 1
పుట్టింది నీ మట్టిలో సీత
రూపు కట్టింది దివ్య భగవద్గీత
వేదాల వెలసినా ధరణిరా
వేదాల వెలసినా ధరణిరా
ఓంకార నాదాలు పలికినా అవనిరా
ఎన్నెన్నొ దేశాలు కన్ను తెరవని నాడు
వికసించె మననేల విజ్ఞాన కిరణాలు

ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ

చరణం: 2
వెన్నెలదీ ఏ మతమురా
కోకిలదీ ఏ కులమురా
గాలికి ఏ భాష ఉందిరా
నీటికి ఏ ప్రాంతముందిరా

గాలికీ నీటికీ లేవు భేధాలూ
మనుషుల్లో ఎందుకీ తగాదాలు కులమత విభేదాలూ

ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ

చరణం: 3
గౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూ
గాంధీ చూపిన మార్గం విడవద్దూ
గౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూ
గాంధీ చూపిన మార్గం విడవద్దూ

ద్వేషాల చీకట్లూ తొలగించూ
స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించూ
ఐకమత్యమే జాతికి శ్రీరామ రక్షా
అందుకే నిరంతరం సాగాలి దీక్షా
అందుకే నిరంతరం సాగాలి దీక్షా


Palli Balakrishna Tuesday, February 23, 2021
Vinta Dongalu (1989)


చిత్రం: వింత దొంగలు (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి.బాలు, ఎస్.జానకి, లలితా సాగరి
నటీనటులు: రాజశేఖర్, నదియా
మాటలు: తనికెళ్ళ భరణి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: యస్. అంబరీష్
విడుదల తేది: 01.01.1989


Palli Balakrishna Saturday, July 13, 2019
Kalki (2019)


చిత్రం: కల్కి (2019)
సంగీతం: శ్రావణ్ భరద్వాజ్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: లలిత కావ్య
నటీనటులు: రాజశేఖర్, ఆదా శర్మ, నందిత శ్వేతా
దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాతలు: సి.కళ్యాణ్, శివాని, శివాత్మిక
విడుదల తేది: 28.06.2019

నీలోడు బండి ఆపేయ్ రా
వేడి మీద ఇంజినుంది దించేయ్ రా
ఈ రోడ్ నా అడ్డా రా
సల్ల తాగి సల్లగై పోవేరా
తెచ్చారా తాటి కల్లు
ఎక్కిస్తా కిక్కు ఫుల్
ఓ పట్టు పట్టవేమి రా
వళ్లే నే వంచుతుంటే కళ్ళే నువు తిప్పవేరా
కిర్రెక్కి ఊగిపోకూర

లల్లారే లాయి లప్ప
లాయి లాయి లారీ పోరోడా
లల్లారే లాయి లప్ప
లొల్లి లొల్లి చేయి పొరడా

హార్న్ పోమ్ పోమ్ ఓకే ప్లీజ్ (4)

ఆ నాటు కోడి తేవాలా
నా నోటి ఘాటు కావాలా
ఈ బోటి కూర వండాల
నాతోటి గుండె నిండాల

నీకళ్ల ముందు ఎర్ర కోక సోకులుండగా
ఆ నల్లమందు దండగా
నా బుగ్గ రైక మీద పైట జరుగుతుండగా
ఏ మత్తు ఎక్కుతుందిరా

లల్లారే లాయి లప్ప
లాయి లాయి లారీ పోరోడా
లల్లారే లాయి లప్ప
లొల్లి లొల్లి చేయి పొరడా

హార్న్ పోమ్ పోమ్ ఓకే ప్లీజ్ (4)

ఈ పక్కకొస్తే ఓ లెక్క
ఆ పక్కకొస్తే నా లెక్క
తాగి పన్నావంటే ఒక రేటు
హోస్  లున్నవంటే సెపరేట్

ఈ సీకు ముక్కలాగ సోకు సొత్తులున్నాయ్
నువ్వు జుర్రుకోరా
లేత బుగ్గలన్నీ జోలీ పౌడరద్ది
నీకు దాచినారా

హార్న్ పోమ్ పోమ్ ఓకే ప్లీజ్ (8)


Palli Balakrishna Monday, July 1, 2019
Naa Styley Veru (2009)



చిత్రం: నా స్టైలే వేరు (2009)
సంగీతం: అనూప్ రూబెన్స్
నటీనటులు: రాజశేఖర్, భూమిక
దర్శకత్వం: జి.రాంప్రసాద్
నిర్మాత: మాగంటి గోపీనాథ్
విడుదల తేది: 12.06.2009



Songs List:



ఏలారే ఏలా ఏలా పాట సాహిత్యం

 
చిత్రం: నా స్టైలే వేరు (2009)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: శంకర్ మహదేవన్, గీతామాధురి 

ఏలారే ఏలా ఏలా 



ఓ ఓ జానే జాణ పాట సాహిత్యం

 
చిత్రం: నా స్టైలే వేరు (2009)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చిర్రావూరి విజయ్ కుమార్ 
గానం: గీతామాధురి 

ఓ ఓ జానే జాణ 



ఆటే ఆడనా పాట సాహిత్యం

 
చిత్రం: నా స్టైలే వేరు (2009)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: ప్రణవి 

ఆటే ఆడనా 



గుప్పెడు గుండెల్లో పాట సాహిత్యం

 
చిత్రం: నా స్టైలే వేరు (2009)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: కార్తీక్, గోపికా పూర్ణిమ 

గుప్పెడు గుండెల్లో 



కొట్టూ కొట్టూ పాట సాహిత్యం

 
చిత్రం: నా స్టైలే వేరు (2009)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: టిప్పు, రాజు, జై. శ్రీనివాస్ 

కొట్టూ కొట్టూ 

Palli Balakrishna Saturday, March 23, 2019
Challani Ramayya Chakkani Seethamma (1986)





చిత్రం: చల్లని రామయ్యా చక్కని సీతమ్మ (1986)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: జాలాది (All)
నటీనటులు: మురళీమోహన్, రాజశేఖర్, రాధిక, సీత, పవిత్ర
దర్శకత్వం: కొడి రామక్రిష్ణ
నిర్మాతలు: జి. శ్రీమన్నారాయణ, టి జనార్ధనరావు
విడుదల తేది: 17.10.1986



Songs List:



రామయ్యా రామయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: చల్లని రామయ్యా చక్కని సీతమ్మ (1986)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: జాలాది
గానం: యస్.పి. బాలు, సుశీల

రామయ్యా రామయ్యా




ఈ జీవితం పాట సాహిత్యం

 
చిత్రం: చల్లని రామయ్యా చక్కని సీతమ్మ (1986)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: జాలాది
గానం: యస్.పి. బాలు, సుశీల

ఈ జీవితం కాదు రంగుల కాగితం




చిలకో నా మోటబావి గిలకో పాట సాహిత్యం

 
చిత్రం: చల్లని రామయ్యా చక్కని సీతమ్మ (1986)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: జాలాది
గానం: యస్.పి. బాలు, సుశీల

చిలకో నా మోటబావి గిలకో





ఓ మహారాజశ్రీ మగవారు పాట సాహిత్యం

 
చిత్రం: చల్లని రామయ్యా చక్కని సీతమ్మ (1986)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: జాలాది
గానం: యస్.పి. బాలు, సుశీల

ఓ మహారాజశ్రీ మగవారు



ఏడు రంగులు ముడిబెడితే పాట సాహిత్యం

 
చిత్రం: చల్లని రామయ్యా చక్కని సీతమ్మ (1986)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: జాలాది
గానం: యస్.పి. బాలు, వాణీ జయరాం

ఏడు రంగులు ముడిబెడితే

Palli Balakrishna Monday, March 18, 2019
Gorintaku (2008)


చిత్రం: గోరింటాకు (2008)
సంగీతం: ఎస్.ఎ. రాజకుమార్
నటీనటులు: రాజశేఖర్, ఆర్తి అగర్వాల్, మీరాజాస్మిన్
దర్శకత్వం: వి.ఆర్.ప్రతాప్
నిర్మాత: యన్. వి.ప్రసాద్ , పరాస్ జైన్
విడుదల తేది: 2008

Palli Balakrishna Saturday, March 16, 2019
Akka Mogudu (1992)


చిత్రం: అక్కమొగుడు (1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర, మినీ మినీ, ఎస్.పి.బాలు
నటీనటులు: రాజశేఖర్, సుహాసిని మణిరత్నం
దర్శకత్వం: క్రాంతి కుమార్
నిర్మాత: సి.హెచ్.వి.అప్పారావు
విడుదల తేది: 1992

కోరస్:
పసుపు కుంకుమల పడతి గంగకిది
చిలకపచ్చని సీమంతం
మగని ప్రేమలకు మగువ నోములకు
నేడే పేరంటం

పల్లవి:
సంసారం సంతానం సతి కోరేటి సౌభాగ్యం
మమకారం మందారం పసుపే ఆది మంగల్యం
చల్లరే యదజల్లరే ముత్తైదువులీవేళ

సంసారం సంతానం సతి కోరేటి సౌభాగ్యం
మమకారం మందారం పసుపే ఆది మంగల్యం

చరణం: 1
అందంతో తానే అరవిచ్చిన అరవిందం
అనురాగంలోన మనసిచ్చిన మకరందం
సీతా... గౌరీ... కలిశారే నీలోనే
నెలవంక లేత పొడుపుల్లో
వెలిశారే నీలోనే తొలిశూలు మొగ్గ  ఎరుపుల్లో
ఈయరే శుభ హారతి సుమతీమనులీవేళ

సంసారం సంతానం సతి కోరేటి సౌభాగ్యం
మమకారం మందారం పసుపే ఆది మంగల్యం

చరణం: 2
ఎవరు నీవు ఎదలేని నీవు
మము వేటలాడుటే నీ క్రీడా
బ్రహ్మ రాతలని బొమ్మలాడుకొను వేడుక నీదేగా
పాపం నీరూపం ఈ ప్రళయం నీ దీపం
శిలకే ప్రతిరూపం నీ బ్రతుకే మా శాపం
ప్రేమా... బంధం...
మనసుంటే మీరాల మరణాలులేని మమతల్లో
వికసిస్తూ రాలాల చితిమంటవేగు గుండెల్లో
పాడన మది కీర్తన విదివంచిత రాగంలో

సంసారం సంతానం సతి కోరేటి సౌభాగ్యం
మమకారం మందారం పసుపే ఆది మంగల్యం
చల్లరే యదజల్లరే ముత్తైదువులీవేళ



Palli Balakrishna Wednesday, February 27, 2019
Vandemataram (1985)



చిత్రం: వందేమాతరం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి, దాసం గోపాలకృష్ణ, ఎస్. అదృష్ట దీపక్ 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి, పి.సుశీల, యస్.పి.శైలజ, వందేమాతరం శ్రీనివాస్, మాధవపెద్ది రమేష్ 
నటీనటులు: విజయశాంతి,  రాజశేఖర్ (నూతన పరిచయం), రాజేంద్రప్రసాద్, సాయికుమార్, బేబీ శుభశ్రీ 
దర్శకత్వం: టి.కృష్ణ
నిర్మాత: అనిల్ బాబు
విడుదల తేది: 27.09.1985



Songs List:



వందే మాతరం.. పాట సాహిత్యం

 
చిత్రం: వందేమాతరం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: వందేమాతరం శ్రీనివాస్ (Debut Song)

పల్లవి:
వందే మాతరం.. వందే మాతరం
వందే మాతరం.. వందే మాతరం
వందే మాతర గీతం వరస మారుతున్నది
వందే మాతర గీతం వరస మారుతున్నది
తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది

చరణం: 1
సుజల విమల కీర్తనలో.. సుఫలాశయ వర్తనలో
సుజల విమల కీర్తనలో.. సుఫలాశయ వర్తనలో
జలం లేక బలం లేక జనం ఎండుతున్నది
మలయజ శీతల పదకోమల భావన బాగున్నా..ఆ..
కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది..
మంట రగులుతున్నది..

తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది
వందే మాతరం.. వందే మాతరం

చరణం: 2
సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో..ఓ..
సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో..ఓ..
పైరు నోచుకోని బీళ్ళు నోళ్ళు తెరుస్తున్నవి
సుప్రజ్యోత్స్నా పులకిత సురుచిర యామినులలోనా..ఆ..
రంగు రంగు చీకట్ల గిరాకి పెరుగుతున్నది..
గిరాకి పెరుగుతున్నది..

తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది
వందే మాతరం.. వందే మాతరం

చరణం: 3
పుల్లకు సుమిత ధ్రుమదళ వల్లికామ తల్లి కలకూ..ఊ..
పుల్లకు సుమిత ధ్రుమదళ వల్లికామ తల్లి కలకూ..ఊ..
చిదిమి వేసినా వదలని చీడ అంటుకున్నది

సుహాస్ర సంపదలకేమి సుమధుర భాషణలకేమీ..ఈ..
ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది..
ప్రజా సుఖమే తమ సుఖమని వరదానాలిస్తున్నా..
ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే వున్నది..
ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే వున్నది..
అక్కడనే వున్నది....

తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది

వందే మాతరం.. వందే మాతరం
వందే మాతర గీతం వరస మారుతున్నది
వందే మాతర గీతం వరస మారుతున్నది
తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది




ఆకాశమా నీవెక్కడ.. పాట సాహిత్యం

 
చిత్రం: వందేమాతరం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం:  డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

పల్లవి:
ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా
ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా

ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా...
ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా.. నిలువగలన నీపక్కన

ఆకాశమా నీవెక్కడ.. అవని పైనున్న నేనెక్కడా

చరణం: 1
నీలాల గగనాల ఓ జాబిలి..
నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా?
నీలాల గగనాల ఓ జాబిలి..
నిను నిరుపేద ముంగిట నిలిపేదెలా?
ముళ్ళున్న రాళ్లున్న  నా దారిలో
నీ చల్లని పాదాలు సాగేదెలా?
నీ మనసన్నది నా మది విన్నది..
నిలిచి పోయింది ఒక ప్రశ్నలా
నిలిచి పోయింది ఒక ప్రశ్నలా..

ఆకాశమా... లేదక్కడ ...
ఆకాశమా లేదక్కడ... అది నిలిచి ఉంది నీ పక్కన
వేల తారకలు తనలో వున్నా..
వేల తారకలు తనలో వున్నా
నేలపైనే తన మక్కువ
ఆకాశమా లేదక్కడ... అది నిలిచి ఉంది నీ పక్కన

చరణం: 2
వెలలేని నీ మనసు కోవెలలో
నను తల దాచుకోని చిరు వెలుగునై
వెలలేని నీ మనసు కోవెలలో
నను తల దాచుకోని చిరు వెలుగునై
వెను తిరిగి చూడని నీ నడకలో
నను కడదాక రాని నీ అడుగునై
మన సహజీవనం వెలిగించాలి నీ
సమత కాంతులు ప్రతి దిక్కున
సమత కాంతులు ప్రతి దిక్కున

ఆకాశమా నీవెక్కడ..
అది నిలిచి వుంది నా పక్కన
వేల తారకలు తనలో వున్నా..
వేల తారకలు తనలో వున్నా..
నేలపైనే తన మక్కువ...
ఈ నేలపైనే తన మక్కువ




అల్లాటప్ప ఆడదాన్ని కాదురబ్బాయా పాట సాహిత్యం

 
చిత్రం: వందేమాతరం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ
గానం: యస్.పి.శైలజ, పి.సుశీల 

అల్లాటప్ప ఆడదాన్ని కాదురబ్బాయా




ఏదయ మీ దయ పాట సాహిత్యం

 
చిత్రం: వందేమాతరం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం:  డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

ఏదయ మీ దయ



నా పేరు పల్లెటూరు పాట సాహిత్యం

 
చిత్రం: వందేమాతరం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: అదృష్ట దీపక్ 
గానం: యస్.పి.శైలజ, మాధవపెద్ది రమేష్ 

నా పేరు పల్లెటూరు

Palli Balakrishna Wednesday, February 20, 2019
Aahuthi (1987)



చిత్రం: ఆహుతి (1987)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
నటీనటులు: రాజశేఖర్ , జీవిత
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: శ్యామ్ ప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 03.12.1987



Songs List:



చెపుతా నీకో వింత కథ పాట సాహిత్యం

 
చిత్రం: ఆహుతి (1987)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: యం. యస్. రెడ్డి
గానం: ఎస్.పి.బాలు

చెపుతా నీకో వింత కథ 




సూరీడు తూర్పున పాట సాహిత్యం

 
చిత్రం: ఆహుతి (1987)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: యం. యస్. రెడ్డి
గానం: ఎస్.జానకి 

సూరీడు తూర్పున 



అందమైన నా ఊహల పాట సాహిత్యం

 
చిత్రం: ఆహుతి (1987)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: యం. యస్. రెడ్డి
గానం: ఎస్.పి.బాలు

అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం
అందీ అందని నా ఆశలకు ఆమే ప్రతి రూపం
ఆ తలపే నా ధ్యానం ఆ అభినవ దేవత నా ప్రాణం

మల్లెపూల కన్నా మంచు పూల కన్నా
నా చెలి ముసి ముసి నవ్వులు అందం...
ఆ... నెమలి హొయలకన్నా...
సెలయేటి లయల కన్నా...
నా చెలి జిలిబిలి నడకలు అందం
అపురూపం ఆ నవ లావణ్యం...
అపురూపం ఆ నవ లావణ్యం
అది నా మదిలో చెదరని స్వప్నం...

పైడి బొమ్మ లాంటి ఆమె పక్కనుంటె
పగలే వెన్నెల నే కురిపిస్తా...
ఆ... నీడ లాగ నాతో...
ఏడడుగులు సాగితే...
ఇలలో స్వర్గం నే సృష్టిస్తా...
రస రమ్యం ఆ రాగ విలాసం...ఆ..ఆ..
రస రమ్యం ఆ రాగ విలాసం
వసి వాడదు అది ఆజన్మాంతం....




సూరీడు తూర్పున - 2 పాట సాహిత్యం

 
చిత్రం: ఆహుతి (1987)
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
సాహిత్యం: యం. యస్. రెడ్డి
గానం: ఎస్.జానకి 

సూరీడు తూర్పున 

Palli Balakrishna Saturday, February 2, 2019
Maa Annayya (2000)




చిత్రం: మా అన్నయ్య (2000)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
నటీనటులు: రాజశేఖర్ , మీనా, వినీత్, బ్రహ్మాజీ, మహేశ్వరి, దీప్తి భట్నాగర్
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాతలు: బెల్లంకొండ సురేష్ , యస్.రమేష్ బాబు
విడుదల తేది: 01.12.2000



Songs List:



నీలి నింగిలో పాట సాహిత్యం

 
చిత్రం: మా అన్నయ్య (2000)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: సాయి శ్రీ హర్ష
గానం: హరిహరన్

నీలి నింగిలో నిండు జాబిలి 
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
కలహంస లాగ రావే కలలన్ని తీర్చిపోవే
నా ప్రేమ శృతి నీవే ప్రతి జన్మ జత నీవే

నీలి నింగిలో నిండు జాబిలి 
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి

దేవుడు కనబడి వరమిస్తే వేయిజన్మలు ఇమ్మంటా
ప్రతి ఒక జన్మ నాకంటే నిన్ను మిన్నగా ప్రేమిస్తా
దేవత నీవని గుడి కడతా దేవత నీవని పూజిస్తా

నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
నీలి నింగిలో నిండు జాబిలి 
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి

ప్రేమకు మరుపే తెలియదులే నిన్ను ఎన్నడు మరువదులే
తెరలను తీసి నను చూడు జన్మ జన్మలు నీ తోడు
వాడనిదమ్మ మన వలపు ఆగనిదమ్మా నా పిలుపు

నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
నీలి నింగిలో నిండు జాబిలి 
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి
కలహంస లాగ రావే కలలన్ని తీర్చిపోవే
నా ప్రేమ శృతి నీవే ప్రతి జన్మ జత నీవే

నీలి నింగిలో నిండు జాబిలి 
నువ్వు రావాలి నీ నవ్వు కావాలి



మైనా ఏమైనావే పాట సాహిత్యం

 
చిత్రం: మా అన్నయ్య (2000)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: వేటూరి
గానం: ఉన్ని కృష్ణన్ , చిత్ర

పల్లవి:
మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక
నీకు తోడు నేనిక నీవు లేక లేనిక
సాగు అల్లిక కొనసాగనీ ఇక
పూల మాలిక చెలి పూజకే ఇక

మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం

చరణం1:
విరహాల నిట్టూర్పు విరజాజి ఓదార్పు
చలి గాలి సాయంత్రాల స్వాగతమే
పైపైకొచ్చే తాపాలు పైటమ్మిచ్చే శాపాలు
ఎదతోనే ముందుగా చేసే కాపురమే
ఎవరేమైనా.. ఎదురేమైనా... నేనేమైనా.. నీవేమైనా...
ఈ తోవుల్లో పువ్వై నిను పూజిస్తూ ఉన్నా

మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం

చరణం2:
సందెపొద్దు నేరాలు అందమైన తీరాలు
దాటేస్తే కాదన్నానా ఎప్పుడైనా
కవ్విస్తున్న నీ కళ్ళు కైపెక్కించే పోకళ్ళు
కాటేస్తే కాదంటానా ఇపుడైనా
వయసేమైనా సొగసేమైనా మైమరిపించే మనసేమైనా
నవ్వు నవరాత్రి నీకోసం తీసుకు వస్తున్నా
మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం
తియ్యనైన తీరిక తీర్చమంది కోరిక
నీకు తోడు నేనిక నీవు లేక లేనిక
సాగు అల్లిక కొనసాగనీ ఇక
పూల మాలిక చెలి పూజకే ఇక

మైనా ఏమైనావే మన్మథ మాసం
అయినా ఎంతైనా ఇది మెత్తని మోసం



మా లోగిలిలో పాట సాహిత్యం

 
చిత్రం: మా అన్నయ్య (2000)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: సాయి శ్రీ హర్ష
గానం: ఎస్.పి.బాలు, చిత్ర, సుజాత మోహన్

మాలోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే
మాలోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే
ఈ ఇంటికి మా కంటికి మనిదీపం ఈ రూపం
ప్రేమకు ప్రతిరూపం

మాలోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే

రాముడు అడవికి వెళ్లేనా నువ్వే అన్నై ఉండుంటే
ఏసు సిలువ మోసేనా నీకే తమ్ముడు అయ్యుంటే
అమ్మంటూ లేకున్నా జన్మంతా జరిగేనులే
ఆన్నంటూ లేకుంటే క్షణమైనా యుగమౌనులే
తమకున్నదొక్కన్నమ్మవై కడుపున మము దాచి
కాచిన దైవమా

మాలోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే

ఇంతటి చక్కని బంధాన్ని కాలం ఆగి చూసేను
రాత రాయు ఆ బ్రహ్మ రాయుట ఆపి మురిసేను
తపమేమి చేశామో తమ్ముల్లమ్మయ్యాములే
తన బతుకే మా మెతుకై తనయులమే అయ్యములే
మా దేవుడు మాకుండగా మరి మాకిక లోటేది
కలతకు చోటేది

మాలోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే
ఈ ఇంటికి మా కంటికి మనిదీపం ఈ రూపం
ప్రేమకు ప్రతిరూపం
మాలోగిలిలో పండేదంతా పుణ్యమే
మా జాబిలికి ఏడాదంతా పున్నమే




పిల్ల భలే దీని ఫిగరు భలే పాట సాహిత్యం

 
చిత్రం: మా అన్నయ్య (2000)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఎస్.పి.బాలు, స్వర్ణలత

పిల్ల భలే దీని ఫిగరు భలే
రంగు భలే దీని పొంగు భలే
పిల్ల భలే దీని ఫిగరు భలే
రంగు భలే దీని పొంగు భలే
మిసమిస లాడే సొగసుని మోసే 
లేత నడుము వంపు భలే
ఉయ్యాల లూగే వయసు భలే

గురుడు భలే వీడి పొగరు భలే
మనిషి భలే మగసిరులు భలే

కొత్త కొత్త ప్రేమలోనే మత్తు ఉన్నది
ముత్యమంత ముద్దులోనే మోక్షమున్నది
ముద్దులంటే అంతులేని మోజు ఉన్నది
జోడు కొస్తే పాడుమనసు బిడియమన్నది
వనికిన వయసు తొణికిన సొగసు 
తరగని ప్రేమకు సాక్ష్యము
అమ్మతోడు త్వరపడకు 
అమ్మాయి నీదే కడవరకు

పిల్ల భలే దీని ఫిగరు భలే
రంగు భలే దీని పొంగు భలే

కొంగుచాటు అందమేదో విచ్చుకున్నది
కాక రెచ్చి కన్నె గుండె ఝల్లుమన్నది
కోక దాటు పొంగులోనే కైపు ఉన్నది
ఘాటు కౌగిలింతలోనే స్వర్గమున్నది
తొలి తొలి వలపు తొలకరి చినుకు
ఎంతో మధురం నేస్తమా
మోతగుందే ముడిసరుకు 
ఇక రాదులే కంటికి కునుకు

పిల్ల భలే దీని ఫిగరు భలే
రంగు భలే దీని పొంగు భలే
హొయ్ పిల్ల భలే దీని ఫిగరు భలే
రంగు భలే దీని పొంగు భలే
మిసమిస లాడే సొగసుని మోసే 
లేత నడుము వంపు భలే
ఉయ్యాల లూగే వయసు భలే




కదిలే అందాల నది పాట సాహిత్యం

 
చిత్రం: మా అన్నయ్య (2000)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: సుఖ్విందర్ సింగ్, అనురాధ శ్రీరామ్

కదిలే అందాల నది అరెరే నను ముంచినది
ఇక తేలిపోను నేను ఏ ఒడ్డు చేరుకోను
ఈ హాయి వరదలో నేనుండే ప్రేమనొదులుకోను
ఓ ప్రియా ప్రియా సఖియా 
నీవే సుమా నా గుండె లయ
ఓ ప్రియా ప్రియా సఖియా 
నీవే సుమా నా గుండె లయ

కదిలే అందాల నది అరెరే నను ముంచినది

వాన విల్లు పూల జల్లు రూపు కడితే
నువ్వే కాదా నవ్వే కాదా
కొంటె కళ్ళు చూపు ముళ్ళు గుచ్చి పెడితే
సిగ్గు రాదా చిచ్చు కాదా
నీకు పెట్టిన పేరుది భాగ్యం
జన్మించానే ప్రతి రోజు
నీ పేరు పలికి పలికి నా పెదవి తేనెలాయె
నీ మాట వింటూ వింటూ నా మనసు ఊయలాయె

కదిలే అందాల నది అరెరే నను ముంచినది

చిలక వచ్చి వాలగానే చిట్టి కొమ్మకి
సోకులొచ్చే శోభలొచ్చే
ప్రేమ మెచ్చి తాకగానే చిన్ని గుండెకి
ఊహలొచ్చే ఊసులొచ్చే
నువ్వు ఎపుడూ పక్కన ఉంటే ఎక్కడున్నా అద్భుతమే
నీ గాలి సోకగానే నా దారి మారిపోయె
నిమిషానికున్న విలువే నువ్వు దగ్గరుంటే తెలిసె

కదిలే అందాల నది అరెరే నను ముంచినది
ఇక తేలిపోను నేను ఏ ఒడ్డు చేరుకోను
ఈ హాయి వరదలో నేనుండే ప్రేమనొదులుకోను
ఓ ప్రియా ప్రియా సఖియా 
నీవే సుమా నా గుండె లయ
ఓ ప్రియా ప్రియా సఖుడా
నీవే సుమా నా గుండె లయ




తాజాగా మా ఇంట్లో పాట సాహిత్యం

 
చిత్రం: మా అన్నయ్య (2000)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: సాయి శ్రీ హర్ష
గానం: చిత్ర, మనో, సుజాత మోహన్

తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను
దర్జాగ మా మరిది ఇక రాజాలా తిరిగేను
కొత్త యువరాణి రానుంది ఈ అంతఃపురం ఏలగ
అంతా సంతోషంలో తేలగా 

తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను

పండుగ కాని రోజేదంట 
మనసున నేసిన మమతల పొదరింట
అందరికోసం వంటరి అయినా
అన్నకు పండుగ మా సుఖమేనంటా
ఈ ఇల్లే వెయ్యిల్లు మొదలవును
ఇక ఈ అన్న ఒక మంచి కథ అవును

తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను

జానెడు తాడు కట్టినవాడు 
జన్మలు ఏలే నీ జోడవుతాడు
పున్నమి రెమ్మా పుత్తడి బొమ్మా
మమతల కోవెల మెట్టిన ఇల్లమ్మా
ముత్తైదు మురిపాల జీవించు
అన్న ఆనంద భాష్పాలు దీవించు

తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను
కొత్త యువరాణి రానుంది 
ఈ అంతఃపురం ఏలగ అంతా సంతోషంలో తేలగా 
ఈ అంతఃపురం ఏలగ అంతా సంతోషంలో తేలగా



నీలి నింగిలో (విషాద గీతం) పాట సాహిత్యం

 
చిత్రం: మా అన్నయ్య (2000)
సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: సాయి శ్రీ హర్ష
గానం: హరిహరన్

నీలి నింగిలో నిండు జాబిలి 
నేల దిగిరావే నన్నేల మరిచావే
నీలి నింగిలో నిండు జాబిలి 
నేల దిగిరావే నన్నేల మరిచావే
నువులేని నేను శిలను మెలకువే లేని కలను
నిను వీడి నే లేను నే ఓడి మనలేను

నీలి నింగిలో నిండు జాబిలి 
నేల దిగిరావే నన్నేల మరిచావే

ప్రేమకు మరుపే తెలియదులే 
మనసు ఎన్నడు మరువదులే
తెరలను తీసి నను చూడు 
జన్మ జన్మకు నీతోడు
వాడనిదమ్మ మన వలపు
ఆగనిదమ్మా నా పిలుపు
నేల దిగిరావే నన్నేల మరిచావే

నీలి నింగిలో నిండు జాబిలి 
నేల దిగిరావే నన్నేల మరిచావే

దేవుడు కనబడి వరమిస్తే 
వేయి జన్మలు ఇమ్మంటా
ప్రతియొక జన్మ నాకంటే 
నిన్ను మిన్నగ ప్రేమిస్తా
దేవత నీవని గుడికడతా
జీవితమంతా పూజిస్తా
నేల దిగిరావే నన్నేల మరిచావే

నీలి నింగిలో నిండు జాబిలి 
నేల దిగిరావే నన్నేల మరిచావే
నువులేని నేను శిలను మెలకువే లేని కలను
నిను వీడి నే లేను నే ఓడి మనలేను

నీలి నింగిలో నిండు జాబిలి 
నేల దిగిరావే నన్నేల మరిచావే

Palli Balakrishna Monday, January 8, 2018

Most Recent

Default