Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Stree Janma (1967)
చిత్రం: స్త్రీ జన్మ (1967)
సంగీతం: ఘంటసాల
నటీనటులు: యన్.టి.రామారావు, ఘట్టమనేని కృష్ణ, అంజలి, కృష్ణ కుమారి, ఎల్. విజయలక్ష్మి, గీతాంజలి, రాజశ్రీ,  వాణిశ్రీ(అతిథి పాత్ర), డి.రామానాయుడు(అతిథి పాత్ర)
దర్శకత్వం: కె.ఎస్.ప్రకాశరావు
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 31.08. 1967Songs List:ఎదో ఎదో ఔతున్నది పాట సాహిత్యం

 
చిత్రం: స్త్రీ జన్మ (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: డా॥ సి. నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల

పల్లవి:
ఎదో ఎదో ఎదో ఎదో ఔతున్నది
ఇదే ఇదే ఇదే ఇదే బాగున్నది
దోర వయసు పొంగి పొంగి దూకుతున్నది

చరణం: 1
కరగే వెన్నెల కవ్విస్తున్నది
కదిలే గాలిలో కైపేదో వున్నది
తీయని కౌగిలి పూవుల పందిరి
సై యంటే సై యన్నవి

చరణం: 2
పందెం వేసే అందాలున్నవి
ముందుకు లాగే బంధాలున్నవి
గుబ గుబలాడే కోరిక లేవో
కో అంటే కో అన్నవి
ఎన్ని పూవులిలా నలిగిపోయినవో పాట సాహిత్యం

 
చిత్రం: స్త్రీ జన్మ (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల

ఎన్ని పూవులిలా నలిగిపోయినవో
ఎన్ని బ్రతుకులిలా చెదరి రాలినవో
మగజాతికి నువు బలిపశువమ్మా
నీ సొగసూ వయసే నీకు పగమ్మా
స్త్రీ ప్రకృతే నీ పాలిట శాపం
ఈ స్త్రీ జన్మే నువు చేసిన నేరం
అందం నీవే అంటారు
ఆనందానికి నెలవంటారు
ఆ రెంటిని పొందీ నిన్నాఖరుకు
అపవిత్రవని వెలివేస్తారు

అరిటాకమ్మా ఆడజన్మము
ముళ్ళకంచె యీ మూఢ సంఘము
ముళ్ళకెన్నడూ దండన లేదూ
చిరిగిన ఆకు విస్తరికాదు
వెడలే సింహబలుడు పాట సాహిత్యం

 
చిత్రం: స్త్రీ జన్మ (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: కొనరాజు
గానం: మాధవపెద్ది అండ్ స్వర్ణలత

వెడలే సింహబలుడు
అరివీర భయంకరుడు
మచ్చ కంఠులెల్ల పొగిడి 
మెచ్చెడు నవ మన్మధుడు

సైరంధ్రి : రమణి సైరంధ్రి వచ్చేను
మధిరమ్ము తేవగ
రాజా వీధికి వచ్చెను
కాళియందియలు ఘల్లని మ్రోయ
కన్నుల మిలమిల కాంతులు మెరయ
చూపులే మరుని తూపులౌచు
తన రూపు జూచి జనులౌరా
భళా యనుచు

కీచక : వగలాడి నీ మోము సొగసు చూడని
కన్నులుండిన ఫలమేమిటే
ఓ చెలియా ఉండిన ఫలమేమిదే

సైరంధ్రి : అయ్యయ్యయ్యొయ్యో 
అహా యింపుగ నిను కౌగలింపని
కరములు చేసెడి పని ఏమిటే
సైరంద్రి: త్రిజగమ్ములెత్తి వచ్చిన
భుజ బలమున ఉక్కడించు పోటరులగు

గ్విజయ ధనులు పతులేవురు
అజేయులు నిన్ను బట్టి హతము జేసెదరూ
ఆ గంధర్వులు ప్రతిన తీర్చెదరూ
రాచవీధిన బోవు రమణుల
వేచుటకు తరి వేచియుందువు
నీచుడా నీ శిరము నిపుడే
చెక్కలుగా ముక్కలుగా చేసి
రూపు మా పెద రూ ....

కీచక : పతులేవురు గలరని ఓ అతివా గొప్పగ వచింతువు
ఆపుము యిక నీ వాక్చాతుర్యము
ఉద్దతిమై గంధర్వ పతులా రెక్క లూడ్చెదనూ
ఈ సింహబలునీ దిటవు చూపెదనూ
ఒక్క సతికీ లోకమందును
ఒక్కడే పతి యనగ విందుము
ఇదెక్కడి విచిత్రమ్ము చెప్పు కొనంగ
సిగ్గెటు లేకపోయె చాలు పో పో వె
నీవానిగ నన్నేలుకోవే
సైరంధ్రా : చాలు పో పో రా
కిచక : నన్నేలుకోవే

హల్లో అన్నదీ మనసూ పాట సాహిత్యం

 
చిత్రం: స్త్రీ జన్మ (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, పి.సుశీల

హల్లో అన్నదీ మనసూ
చలో అన్నదీ సొగసు
సరే నన్నదీ

సై అన్నది
హుషారెన వయసు
ఉక్కిరి బిక్కిరి చేస్తానంది
ఒంపులు తిరిగే పొంకం
కం....కం
చెక్కిలిగింతలు పెడతానంది
పెంకితనాల బింకం

ఓయ్..... ఓర్వని లోకం పగ్గాలేస్తే
తెంచమన్నదీ ఆవేశం!
కజీవితమంతా సెలవు
లవ్ లవ్
ప్రేమించడమే చదువు
హాయ్ : చిలిపి చూసలో భావం
చదవక వచ్చే పాఠం
హూయ్ జిలిబిలి కోరిక
పరీక్ష పెడితే
జై హిందన్నది ఆ సందం
హాయ్, హాయ్, హాయ్
బాసందీ నదీ తీరాన పాట సాహిత్యం

 
చిత్రం: స్త్రీ జన్మ (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల (జూనియర్)
గానం: పిఠాపురం, ఎల్. ఆర్. ఈశ్వరి

బాసందీ నదీ తీరాన
రసగుల్లా కిల్లాలోన
మెసూర్ పాక్ పందిరిలో
నీకు నిఖా చేస్తానే

రాణీ ! డెమన్ రాణి
నువ్వు నా చిక్కెన్ బిరియానీ
రాజా ! ఇస్పేట్ రాజా
నువు నా ఇత్తడి మర కూజా
చక్కెర కేళీ అనార్కలీ
మా బాబున్నాడే పెద్దపులి
మారో గోలీ అన్నాడా
మన మొహబ్బల్ ఖాళీ ఎలా గైతీ
భయపడతావేం డేమ్ సిల్లీ
మీ బాబైతేనేం పెద్దపులి
చేసాం దానిని చెవుల పిల్లి
మనం సాగిద్దామోద్ ఫ్యామిలీ

హోయ్ హోయ్ హోయ్

లవ్ పరీక్షలో సున్నా రానీ
సలీం డోంట్ బి సారీ
సినీ జగత్తుకే లభిస్తుంది.
చక్కని స్టోరీ స్టోరీ స్టోరీ
నిన్ను ప్లాస్టిక్ గాజు చేసి వేసుకోనా
ఫేస్ పౌడరుగా జేసి పూసుకోనా
కూలింగ్ గ్లాసల్లే కళ్ళకీ పెట్టుకోనా
నైలాన్ చీరల్లే ఉతికేసి కట్టుకోనా

ఓ ! అనార్కలి ! మనల్ని బ్రతక నీయది సొసైటీ
జానేదో..మనం చచ్చాక ఇస్తుందిలే
పబ్లిసిటీ....పబ్లిసిటీ.... పబ్లిసిటీ
ఆ పాపు---గుండెదడ వస్తోంది కట్టి పెట్టు
చార్మినార్ సిగరెట్టు

రానీ ఒక పాకెట్టు
లేదంటే మన లవ్వ కట్టు
ఎందుకిటు మార్చావు నీ రూటు
నా ప్రేమ ఇనప్పెట్టె
నీ చేతిలోన పెట్టా
ఏమౌనో ఇక మీద ఫేటు
చేయని నోమె పాట సాహిత్యం

 
చిత్రం: స్త్రీ జన్మ (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి. సుశీల

చేయని నోమె అడగని వరమై
చిక్కిన తండ్రి లాలి
చక్కని తండ్రి లాలి
చల్లని నగవుల జాబిలి మొగమున
నల్లని నీడలు పరచినవాడు
అన్నెం పున్నెం ఎరగని నిన్నే 
అన్యాయానికి గురిచేశాడు
కడుపున పుట్టిన కసుకందులపై
మృగములకైనా మమతలు తప్పవు
పాలు విడువని పాపని విడిచిన
కన్నతల్లిది కడుపా చెరువా !
ఈనాటి కుర్రకారు పాట సాహిత్యం

 
చిత్రం: స్త్రీ జన్మ (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల (జూనియర్)
గానం: పి. సుశీల

ఈనాటి కుర్రకారు చూసే ఒకే చిరాకె
తోకొకటి లేదుగాని అసలైన కోతిమూ 

యహూ యహాఁ
ఈనాటి ఆడవారు మాకూ ఒకే చిరాకె
ఇవికూడ కోతిమూకే కాని తలమీద ఉంది తోక
అ బ్బ బ్బ బ్బ అబ్బాయిలూ
అమ్మమ్మమ్మ అమ్మాయిలూ
శాస్తారు రాకపోక వసారు ఇంటిదాక
వెనుదిరిగి చూసినాక ఆయ్యవారు ఒట్టిమేక

వాలుచూపు చూస్తారు, ఒళ్ళు విరుచుకుంటారు
చూపు కలవగానే కస్సు బుస్సుమంటారు
పళ్ళుకొరికి కళ్ళురిమి చూడు హై
పక్కగొందికే పరారు

వెనకాల వాగుతారు వింటుంటే ఎంత జోరు
మన మెళ్ళి పలకరిస్తే ఖంగారు బంద్ నోరు
వింత డ్రస్సు లేస్తారు కన్ను చెదర గొడతారు
చెంగు పట్టుకుంటే బేరు, బేరు మంటారు
రోజు రోజుకొక వింత పోజు మీ
మగ గుంపుకే రివాజు
కమీరు ఓర చూపు చూస్తే ఒప్పా ?
ఒప్పే :
కమేం పళ్ళికిలిస్తే తప్పా ?
తప్పే
పైట జారవేస్తే |
మా యిష్టం.
మేం పక్కకు వస్తే
మీకే నష్టం
నష్టమంటు కష్టమంటు
తప్పులంటు ఒప్పులంటు
ఎంచుకుంటు కూరుచుంటే ముప్పు గాన
మీరు మేము రాజీ పడదామా

ఎడారిలో పూలు పాట సాహిత్యం

 
చిత్రం: స్త్రీ జన్మ (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: దాశరధి
గానం: ఘంటసాల, పి. సుశీల

ఎడారిలో పూలు పూచె ఎందుకనీ
మనసులోన తలపు మెరిసె అందుకనీ
మూగవీణ పాట పాడె ఎందుకనీ.... హోయ్
చెలిమదిలో వలపు మొలిచె అందుకనీ....
కురులలోని పూలమాల కోరేను నన్నే
పెదవిలోని మధువులన్ని చేరేను నన్నే
కోటి కోటి దీపాలు ఆటాడు వేళ
కోరికొకటి నన్నిపుడు వేటాడు వేల
ఎందుకనో
అందుకనే
సిగ్గుతెరలు దాగియున్న ఆ కోరికేదో
బుగ్గమీద రాసి చూపి ఊరించరాదా !
దాచుకున్న సిగ్గులన్ని నీవాయె నేడే
తెరలు తొలగి మనసు కలసి ఆడేను నేడే
ఎందుకనో
అందుకనే

ఇది తర తరాల కథ చెల్లీ పాట సాహిత్యం

 
చిత్రం: స్త్రీ జన్మ (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల

సాకీ:
ఇది తర తరాల కథ చెల్లీ
ఇలాగే జరుగుతున్నది మళ్ళీ మళ్ళీ

పల్లవి:
మగజాతికి నువు బలిపశువమ్మా
నీ మనుగడ ఆరని కన్నీరమ్మా
మాతృత్వం నీపాలిట శాపం
శ్రీ జన్నే నువు చేసిన నేరం
లోకుల నిందలు ఓర్చిన తల్లీ
నీ నెత్తురు నిందించినది
సహనంకూడా సహించరానిదీ
నీ మరణమె దీన్ని మాపేది

No comments

Most Recent

Default