చిత్రం: కుటుంబ గౌరవం (1957)
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె.రామమూర్తి
సాహిత్యం: అనిసెట్టి
గానం: పి.బి.శ్రీనివాస్, డి.ఎల్. రాజేశ్వరి, జమునారాణి, పిఠాపురం బృందం
ఆనందాలే నిండాలి అనురాగలే
చల్లని సంసారం పాట సాహిత్యం
చిత్రం: కుటుంబ గౌరవం (1957)
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె.రామమూర్తి
సాహిత్యం: అనిసెట్టి
గానం: పి.లీల
చల్లని సంసారం అనురాగసుధాసారం హాయగు కాపురం
పాడఓయి రైతన్న పాట సాహిత్యం
చిత్రం: కుటుంబ గౌరవం (1957)
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె.రామమూర్తి
సాహిత్యం: అనిసెట్టి
గానం: మాధవపెద్ది, కె.జమునారాణి బృందం
పాడఓయి రైతన్న ఆడవోయి మాయన్న పంట
షోడా బీడి బీడా ఈ మూడు పాట సాహిత్యం
చిత్రం: కుటుంబ గౌరవం (1957)
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె.రామమూర్తి
సాహిత్యం: అనిసెట్టి
గానం: పిఠాపురం
షోడా బీడి బీడా ఈ మూడు వాడి చూడు తేడా
రామయ్య మామయ్య పాట సాహిత్యం
చిత్రం: కుటుంబ గౌరవం (1957)
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె.రామమూర్తి
సాహిత్యం: అనిసెట్టి
గానం: ఎస్.జానకి
రామయ్య మామయ్య ఈ సంతోషం ఈ సంగీతం నీదయ్యా
రాయిడోరింటికాడ పాట సాహిత్యం
చిత్రం: కుటుంబ గౌరవం (1957)
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె.రామమూర్తి
సాహిత్యం: అనిసెట్టి
గానం: పిఠాపురం, కె.జమునారాణి
రాయిడోరింటికాడ నల్లతుమ్మ చెట్టు నీడ రాయుడేమన్నాడే
పోదాము రావోయి బావా పాట సాహిత్యం
చిత్రం: కుటుంబ గౌరవం (1957)
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె.రామమూర్తి
సాహిత్యం: అనిసెట్టి
గానం: డి.ఎల్.రాజేశ్వరి
పోదాము రావోయి బావా ఈ ప్రియురాల కానవే
పదరా పదపద పాట సాహిత్యం
చిత్రం: కుటుంబ గౌరవం (1957)
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె.రామమూర్తి
సాహిత్యం: అనిసెట్టి
గానం: ఘంటసాల, పిఠాపురం, మాధవపెద్ది
పదరా పదపద రాముడు పరుగు తీయరా భీముడు
కాణీకి కొరగారు మాఊరి దొరగారు పాట సాహిత్యం
చిత్రం: కుటుంబ గౌరవం (1957)
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె.రామమూర్తి
సాహిత్యం: అనిసెట్టి
గానం: పి.లీల
కాణీకి కొరగారు మాఊరి దొరగారు మారుపడిపోయారు
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య
గానం: ఘంటసాల, యస్.జానకి
కిలకిల బుల్లెమ్మా ! ఒహెు! ఒహెు
కిలాడి బుల్లెమ్మా
నీ ఒంటిమీద చెయ్ ఎయ్యంగానే వులిక్కి పడతావే
బడాయి మాఁవయ్యో: ఉహు: ఉహు: ఉహు:
ఆడావు డేందయ్యో!
నువు పట్టపగులే నను పట్టుకొందవూ
పరువు పోతదయ్యో
నీ బి త్తర సూపులు సూసీ
నీ నడకల వూపులు సూసీ
నా మనసూ జిల్ జిల్ మంటాదే
సేతులోన సిక్కినావు, బూకరించి పోలేవు
సిగ్గు వొదిలి రావే నాదానా
కన్నెపడుచు కంటబడితే
నమ్మి కాస్త దగ్గరకొస్తే
మొగ వోళ్లూ సైగలు చేస్తారూ
ఒళ్ళుపైన తెలుసు కోరు
యెనక ముందు సూసుకోరు
యెర్రెక్కి పైన బడతారూ
మీ సంగతి తెలుసును లేవే
ముందట్టా చెబుదురులేవే
నేనెరగని వాళ్లా పోవే
ఎగిరి ఎగిరి పడతారు
బిగువు కాస్త సూపుతారు
సల్లంగ దారి కాస్తారూ !
ఎవరూ ?
మీరూ!
అవ్వ !
అవ్వలేదు బువ్వలేదు రా
నవ్వులాట కాదులే పో పో
రా - పో
రా - పో
గత సువిజ్ఞాన పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ
గానం: ఘంటసాల
గత సువిజ్ఞాన ప్రకాశమ్ము మరల
కల్గించితివి తల్లీ కారుణ్యవల్లీ
జయ తిమిరి నిర్దూత దరహాస వల్లరీ
జయప్రణవ నాదాత్త ఝంకార బంభరీ
సకల సంపత్కరీ జ్ఞానేశ్వరీ నమో ...
జో జో లాలి లాలి పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ
గానం: పి.సుశీల
జో జో
లాలి లాలి లాలీ
చిన్నారి పాపాయి లాలీ
ఎన్నెన్ని జన్మాల
పుణ్యాల ఫలమో
ఈ తల్లి ఒడిలోన
వెలిశావు తండ్రీ
నా కంటి పాపా
నిదురింప వోయీ
నా పాల యెదలోని
దీపాని వోయీ
హాయీ హాయీ హాయీ!
అమ్మమ్మమ్మమ్మమ్మమ్మొ తెలిసిందిలే పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల
పల్లవి:
అమ్మమ్మమ్మమ్మమ్మమ్మొ తెలిసిందిలే
గుట్టు తెలిసిందిలే
నీ రూపులోన నీ చూపులోన
ఏ రాచ కళలో మెరిసేననీ
అమ్మమ్మమ్మమ్మమ్మమ్మొ తెలిసిందిలే
గుట్టు తెలిసిందిలే ఆద్యుడేద
ఏ కొంటె ఎరుడో
గంధర్వ వీరుడో
నా కళ లోన నవ్వేననీ
చరణం: 1
కులికే వయసే పులకించిపోగా
కొంగు ఆగుతుందా ఎదలో కదలే
పొంగు ఆగుతుందా
పువ్వల్లే మారిపోయి - ముద్దుల్లో తేలిపోయి
కవ్విస్తే కన్నె మనసు ఆగుతుందా
చరణం: 2
వలచే జాబిలి యిలపైన రాగా
కలువ దాగుతుందా విరిసే మురిసే తలపు దాగుతుందా
తీగల్లే అల్లుకుంటే - ఓ ఓ
గుండెలో ఝలుషంటే ఆమె: ఓ ఓ
దాచినా దోరవలపు దాగుతుందా
రా వెన్నెల దొరా పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల
ఆహా హ అహ హ
అహ హ ఓహో ఓ ఓ
ఆహ హ హా
రా వెన్నెల దొరా కన్నియను చేరా
రా కన్ను చెదర వేచితిని రా రా ఆ ఆ ఆ
రా వెన్నెల దొరా కన్నియను చేరా
రా కన్ను చెదర వేచితిని రా రా ఆ ఆ ఆ
ఈ పాల వెన్నెలలోన నీ నీలి కన్నులలోనా
ఈ పాల వెన్నెలలోన నీ నీలి కన్నులలోనా
ఉన్నానులేవే ప్రియతమా ఆ ఆ
నీ మగసిరి నగవులు చాలునులే
నీ సొగసరి నటనలు చాలునులే
నీ మనసైన తారను నే కానులే
రా వెన్నెల దొరా వింత కనవేరా
రా చిలకవౌరా అలిగినదిలే రా ఆ ఆ ఆ
ఈ మబ్బు తెరచాటేలా ఈ నింగి పయణాలేలా
ఈ మబ్బు తెరచాటేలా ఈ నింగి పయణాలేలా
ఎద నిండిపోరా చందమా ఆ ఆ
నీ పగడపు పెదవుల జిగి నేనే
నీ చెదరని కౌగిలి బిగి నేనే
నా ఎద నిండ నీవే నిలిచేవులే
రా వెన్నెల దొరా కన్నియను చేరా
రా కన్ను చెదర వేచితిని రా రా ఆ ఆ ఆ
రా వెన్నెల దొరా వింత కనవేరా
రా చిలకవౌరా అలిగినదిలే రా ఆ ఆ ఆ
నా వయసు సుమగంధం పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ
గానం: పి.సుశీల, విజయలక్ష్మి
నా వయసు సుమగంధం
నా మనసు మకరందం
కొని పోవోయి వలపుల నా రాజా
అందగాడా జలకాలాడే
సుందరి నీకె వేచిందీ.
సిగు సింగారాల బిగువూ చూచె లేవే
సిగ్గు నిండారంగ నిన్నే కోరి చేరె
అయ్యొ, యింతేన మరియే మొ
అనుకున్నానూ
వేడి రగిలే విరహం సాగె
చెంతకు రాడేమె చెలికాడు
ప్రేమ బాణం నీపై
గురిపెట్టాడే భామ
అయ్యొ యేమౌతావో, చక్కని చెక్కెర బొమ్మ
ఏమె యీ బాధ పడలేనెయీ వేళా
స్వాగతం స్వాగతం పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ
గానం: పి.లీల, యస్.జానకి & కోరస్
స్వాగతం స్వాగతం
శాత్రవ జన జైత్ర స్వాగతం
సుకృతావతార దయ సేయుమురా
రతనాల బాట పయనింపుమురా
రతి రాజ సార
రణరంగధీర
వర శుభ గుణ సువదన భూరి భూరమణ
పూజ తాబ చరణా
పూబాల వికసించె నీ నవ్వులో
భూమాత పులకించె నీ దారిలో
పున్నెము పురివిచ్చె
వన్నెల సిరి హెచ్చె
అందాలె నిను మెచ్చె
ఈవు యేజనని నోముపంట వవురా
శ్రీ దేవి నెలకొన యీ మందిరం
రారాజ వరులైన రాదుర్లభం
రమ్మిటు జయశీల
రంజిత జనపాల
నీ మ్రోల రసలీల
మువ్వలే పలికె
దివ్వెలే కులి కెరా
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ
గానం: యస్.జానకి
శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు
దివ్వె నూదగవద్దు బువ్వ నెట్టద్దు
తోబుట్టువుల మనసు కష్ట పెట్టద్దు
తొలి సంజ మలిసంజ నిదుర పోవద్దు
మాతల్లి వరలక్ష్మి నిను వేడదపుడు
ఇల్లాలు కంట తడి పెట్టనీ యింట
కల్లలాడని యింట గోమాత వెంట
ముంగిళ ముగ్గులో పసుపు గడపల్లో
పూలలో పాలల్లో ధాన్య రాసుల్లో
మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు
అందాల బొమ్మను నేను చెలికాడ పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: విశ్వప్రసాద్
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి
అందాల బొమ్మను నేను చెలికాడ
మందార వల్లిని నేను విలుకాడ
ముద్దు ముద్దుగా హాయి హాయిగా చేరరారా..
చేరిపోరా మోహన రాజా మన్మధ రాజా
నీలో కదిలే కోరిక లేవో
నీలో మెదిలే లాలసలేవో
మారాము చేసెను లేరా
గారాలు ముగించి రారా
తనువంతా తీయని తాపమురా
తనువంతా తీయని తాపమురా
నాలో మెరిసే అందము నీదే
నాలో కురిసే చందము నీదే
జాగేలా వేగిర లేరా-కౌగిట్లో బిగించ రారా
నిను కోరి చేరిన భామనురా
జయ జయ మహాలక్ష్మి పాట సాహిత్యం
చిత్రం: లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం: యస్. పి. కోదండపాణి
సాహిత్యం: చిల్లర భావన్నారాయణ
గానం: యస్.జానకి
జయ జయ మహాలక్ష్మి
జయ మహాలక్ష్మి
ఈ దివ్య కథ చూడ యేతెంచినట్టి
అందరికి అలరారు అఖిల భోగాలు
సకల సౌక్యమ్ములు సర్వ సంపదలు
పిల్లల పాపలు కొలంగ సిరులు
కలుగంగ దీవించి
తరుణించవమ్మా
కరుణించవమ్మా
ఓ మహాలక్ష్మి
శ్రీ మహాలక్ష్మి
జయ మహాలక్ష్మి
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య
నటీనటులు: యన్.టి.రామారావు, రాజసులోచన
దర్శకత్వం: సి.యస్.రావు
నిర్మాత: వడ్డి శ్రీరాములు, పంతం చిన్నారావు
విడుదల తేది: 08.03.1962
Songs List:
శ్రీమన్నభీష్ట వరదాఖిల పాట సాహిత్యం
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య
గానం: ఘంటసాల
శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీ దేవతా గృహ భుజాంతర దివ్య మార్తే
వెంకటా చలపతే తవ సుప్రభాతమ్
పరిత్రాణాయ సాధూనాం !పాట సాహిత్యం
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య
గానం: ఘంటసాల
పరిత్రాణాయ సాధూనాం !
వినాశాయ చ దుష్క్రుతమ్ |
ధర్మ సంస్థాప నారాయ
సంభ వామి యుగే యుగే!
బాలా నువ్వూ ఎవ్వరే పాట సాహిత్యం
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య
గానం: మాధవపెద్ది సత్యం, వైదేహి
బాలా నువ్వూ ఎవ్వరే -
మరుని ములుకోలా నువ్వూ ఎవ్వరే!
ఏల నా జోలి నీకేల?
అందాల బాల నవమోహిని నే-తా మెవ్వరో!
హరుని కొలిచి - ఇంద్రాదుల గెలచిన
వీరుడ భస్మాసురడను
నేనే - తరుణి నీవు నాదానివి - రావే
దరియ వేళ నును సిగ్గులు ఏల నే?
బేలా నన్నూ ఏలుకో-మరునిములు
కోలా-నన్ను ఏలుకో!
ఏలెద వానిని ఎవ్వడునన్ను గెలంచునో
నాట్యాల
ఓహో!! చాలా
ఓ! ఆయితే నన్ను స్పెయిన్ డాన్సులో నెగ్గు!
నువ్వు మొగ్గు
స్పెయిన్ డ్యాన్సులో జయం నీది లే
చెయ్ వోయ్ ఆటవిక డాన్సు'
సైయ్
విదేశీ నాట్యం విజయంనీదే !
స్వదేశీ నాట్యం చేదాం!
చూద్దాం!
దంపతుల పైన పాట సాహిత్యం
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య
గానం: రాఘవులు
దంపతుల పైన దయబూని దైవ మొసగు
వరమె పుత్రుడు వానిని వంగడంబు
జాతి కొనియాడు రీతి గా సాకజాలు
తల్లి దండ్రులె ధన్యులు ధరణిలోన!
చందురుని మీరు చలువలు పాట సాహిత్యం
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య
గానం: ఘంటసాల
చందురుని మీరు చలువలు
చిందగ చెలువాఱు దాన చెలిమి ఖజానా!
సుందరి తారా పరమా
నందమయి- యిదియె నీకు నా నజరానా!!
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య
గానం: యస్.జానకి & కోరస్
నవ భావనలో చివురించిన
మా యువసేవనమే హాయి
ఎట కేగిన మధుర గీతమే యుగళగీతమే
ఎటు చూసినా వయసు జంటలే వలపు పంటలే
సొగసైన ఈ ప్రకృతి
మనసైన ఈ ప్రగతి
మనదే సకల జగతి
నవభావనలో - చివురించిన మా
యువ జీవనమే హాయి !
చిఱుగాలి వీచి కురులు ఆడగా
చెవి చెంత జేరి - ఎవరో పాడగా
బ్రతిమాలి చెలిమి కోరి - వేడగా !
మైన్ పులకరించి - మది పరవశించి
స్వప్నాల తేలిపోతే హాయి !
నవభావనలో చివురించిన మా
యువ జీవన మే హాయి!
జవరాలి లేత మనసే ఊయల
మదిలోని తీయ తలపే ఊయల!
భువినుండి దివికిసాగే ఊయల!
ఉలికించు ఊహలూరించు సుఖమే
ఊగించు మది ఊయల
వరూధిని - ప్రవరాఖ్యుడు (నాటకం) సాహిత్యం
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య
గానం: యస్.జానకి & కోరస్
వరూధిని - ప్రవరాఖ్యుడు (నాటకం)
తరమే బ్రహ్మకునైన - యీనగ మహత్యంబైన నే నియ్యడం
గల చోద్యంబులు రేపు గన్గొనియెదన్ - గాకేమి నేడే గెదన్
ఆహాఁ' పాద లేపనము గరిగి పోయెనే!
ఎక్కడి అరుణాస్పదము '
ఎక్కడి హిమగిరి!
ఇంక నే నింటి కేగుదారి!
హిమనగరీ మధుర ఝరీ
అనురాగ రాగ మంజరీ
భాసిల్లు నే నవరత్నాలతో
నవశోభాలహరి శీతగిరి
యోగీశునైనా-భోగాల వాంఛ
రేగించి రాగాలు పాడించె
ప్రవరుడు పద్యం:
ఎవ్వతెవీవు భీత హరిణేక్షణ ఒంటి చరించె దోటలే
కివ్వనభూమి భూసురుడనే ప్రవరాఖ్యుడ
త్రోవతప్పితిన్
గ్రొవ్వున ఇన్న గాగ్రమునకున్ జనుదెంచి పురంబు
గాంతు తెల్పగదవే తెరువెద్ది శుభంబునీక గున్ !
వరూధిని పద్యం:
ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ఏ
కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించులా
గింతియెగాక నీ వెఱుగ వేమును వచ్చిన త్రోవ చొప్పు, నీ
కింత భయంబు లేకడుగ నెల్లిద మైతిమి మాట లేటికిన్
వచనం : నా పేరు వరూధిని మా ఇంట్లో ఆతిధ్యము తీసుకొని వెళ్లండి!
ప్రవరుడు : ఆ మాటేచాలు నేను మా ఊరు వెళ్లాలి!
వరూధిని పద్యం :
ఎక్కడి యూరు కాల్ నిలువకింటికి బోయెదనంచు,
బల్కెడీ పక్కట!
నిక్కము దాప నేల ధరణీసుకనందన నీ పయిన్
జిక్కె నామనంబు!
పాట :
విరిపొదరిళ్ల బిగికౌగిళ్ల తేలి ఏలుతావో!
వియోగాల ముంచి పోదువో!
వ్రతులై మెలిగే వారిని నీవిట కోర న్యాయమౌనా!
దురాచారా భీతి లేదొకో!
యాగము యోగము మాకౌగిలిలో - భోగము కోరే కాదా!
భామరొ కామికి స్వర్గమ్మదియే - బ్రహ్మ జ్ఞానికి కాదుగా!
ప్రాచదువులలో పాఠమేగా
ఆనందో బ్రహ్మ ఎఱుగవకో !
మేనులు మరిచే తుచ్ఛ సుఖాలు
పరమానందము కాదుగా!
వీరి పొదరిళ్లు బిగికౌగిళ్ల తేలి ఏలుతావో
వియోగాల ముంచి పోదువో!
ఉలకక పలకక ఉన్న తెలియక పాట సాహిత్యం
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య
గానం: ఘంటసాల, యస్.జానకి
ఉలకక పలకక ఉన్న తెలియక
మనసు దోచిన వారే- పగటి దొంగలు కారా!
ఉరుకుతూ కులుకుతూ- చేతికంది దొరకక
పారిపోయేవారే- పగటి దొంగలు కారా!
దారిగాచి వీలు జూచి- కొంగు లాగేవారో!
ఆశజూపి మనసు రేపి- మాయచేసే వారో!
తెరచాటు అలవాటు పరిపాటిగా
కనులు పిలిచి కబురులాడి కలత రేపే వారి
తోడులేని ఆడవారి ఉడికిలించేవారో!
నవ్వించి కవ్వించి ఊరించుచు
హాయి హాయి హాయి! పాట సాహిత్యం
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య
గానం: ఘంటసాల, జమునారాణి
హాయి హాయి హాయి!
తీయని వెన్నె రేయి !
ఆడే వేళే ఇదోయ్
పాడేరోజే ఇదోయ్
తికమక యెందుకోయ్
చక చక నాట్యం చెయ్
ఒళ్ళు తెలియకే ఆడితే
ఆడిందంతా డ్యాన్సే నోయ్ | హాయి
ఆశ్శరభ శరభ ఆరెళ్ల భీర
ఆశ్శరభ శరభ - ఆరెళ్ల భీర
ఆడెయ్ రాక్ ఎన్ రోల్
లేదోయ్ - దీనికి రూల్ !
అన్ని మరచుటే దీనిగోల్!
ఆనుభవమైతే వండరఫుల్
రంగు రంగుల కీలుబొమ్మా.రావే
రంగ మెల్లి పోదామే నారాయణమ్మా
ఓ నారాయణమ్మా --ఓ నారాయణమ్మా
ఎన్ని దినాలకు వింటినిరా పాట సాహిత్యం
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య
గానం: పి. లీలా
ఎన్ని దినాలకు వింటినిరా
కన్నా కమ్మని నీపాటా!
కన్నీటి గాలివాన వెలసెనురా
కలత మబ్బులన్నీ తొలగెనురా
మనసగు నీమురళీ గీతి
మదివికసించే రీతి
మగ నాలినోము పండే సమయమి
ఆనందాల తేలే తరుణమిదే!
ఈ మహిలో లేనేలేరె
మము ఎడబాపేవారే
చందమామ లోకంలో పాట సాహిత్యం
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య
గానం: ఘంటసాల, జమునారాణి
కామిడీ డ్యూయెట్ : చంద్రలోక యాత్ర పాట
చందమామ లోకంలో - సరదా చేదామే
అందాల జూలీ -మనదే జాలీ
ఇలలేని భోగాల -మనకేలా ఈ గోలా
నినువీడి మనజాల నీ వెంట రాజాల |
లెక్క లేని వింతలూ - చక్కిలి గింతలూ ॥
అక్కడే ఉన్నాయంటా - ఎక్కో ఎక్కో రాకెట్టూ
గాలో గాలి - ఈదరగాలి.
పోతోంది. నా ప్రాణి తేలి
ఈనాటితో నేను ఖాళీ
జూలీ జూలీ కొంచెం తాళాలి
మన మెంతో దూరం సాగాలి
చోద్యాలు యెన్నో చూడాలి
పాస్పోర్టు మీపాస్పోర్టు యేదేది-?
యేదేది?
లేదే?
పాస్పోర్టు మీ పాసుపోర్టు యేదేది?
ఎందుకూ-?
ప్రేమ జీవులం - పాసుపోర్టులూ - మాకెందుకూ-మీ కెందుకూ !
గేసో - గేసో ! - క్లోజు -క్లోజు
ఆశా దురాశా వినాశానికే పాట సాహిత్యం
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య
గానం: ఘంటసాల
ఆశా దురాశా వినాశానికే
ఏల ప్రయాస వృధా యాతనే!
నిరంతరం ధనమ్మని జపింతురే జనం !
విరాఘమే ఎఱుంగక- గడింతురే ధనం !
సమాధియా దినాన- ఈసిరి ప్రయోజనం?
తృణమ్మయిన- నీ వెంట రాదోయి
ఆశా దురాశా వినాశానికే
ఏల ప్రయాస వృధా యాతనే!
చీకటిలో జనుల కనులు మూయగలవుగానీ
నేటికెటో దాగుకొని బయటపడిన గానీ
సర్వసాక్షి సన్నిధి నీ సమాధాన మేమి ?
గర్వపడకు నేరానికి- శిక్ష తప్పదోయి !
ఆశా దురాశా వినాశానికే
ఏల ప్రయాస వృధా యాతనే!
తల్లీ బిడ్డల వేరుచేసే కిరాతకుడా
నువ్వు సాధించే ఘన కార్య మేముందిరా
గుణంలేని తండ్రికీ నీడైనా
మననీయదురా సుతుని సుఖానా
మార్చుకో నీమతం మార్చుకోరా !
మమత మానవత్వం నేర్చుకోరా !
నీ బిడ్డకు నీ బాధ్యత నెరవేర్చుకోరా!
నీతిగా నీబ్రతుకు కడతేర్చు కోరా!
ఆశా దురాశా వినాశానికే
ఏల ప్రయాస వృధా యాతనే!
కాజేసి పరుల సొమ్ము కనలేవు హాయి
కలదోయి ధర్మమందె– నిజమైన హాయి !
చేయుమా ధర్మము- దానమే పెన్నిధానము
నీ దానమే పెన్నిధానము
వేధించి పరులను కనలేని ! సౌఖ్యము
సాధించు మానవ సేవలో
విలపించువారి కన్నీరు తుడిచిన
వెలిగేను శాంతి నీలో !
పశ్చాత్తాపం- కన్నీరే నీపాపానికి పరిహారము
ఇది నీ జీవిత పరమావధికి
సూటిగ బోయే మార్గము
సాగుమా మును సాగుమా
ఫలమ్మేమి నేడిలా తలబాదుకొని విలపించి
పిల్లల జీవన లత దిద్దే తోటమాలి తల్లే!
చిన్న నాడు చెడుత్రోవల పెంచిన జీవితమింతేలే
కన్నకడుపు చెనువై - ఇల్లాలికి దూరమై !
లోకానికి భారమై చెరలో నశించుటకేలే
వలదురా యీ ఘోర దండవ ఏతల్లికైనా !
ఆశా దురాశా వినాశానికే
ఏల ప్రయాస వృధా యాతనే!
పాహి దయానిధే పాట సాహిత్యం
చిత్రం: టైగర్ రాముడు (1962)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రామానుజా చార్య
గానం:
పాహి దయానిధే - పరమ కృపానిధే
పాపిని దయచూడరా దేవా
ప్రజలందుకు ప్రభల శత్రువై
ఆలు పిల్లలకు ఆరని వగయై
అన్నియు నీవని తిరిగే వానికి
ఎన్నటికీ శాంతి లేదా
పుణ్యతీర్ధములు స్నానములాడి
పుణ్యము లెన్నో చేసిన గానీ
పావనమగు నీ సన్నిధినైనా - జీవికి శాంతియె లేదా
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొసరాజు రాఘవయ్యచౌదరి, ఎరమాకుల ఆదిశేషా రెడ్డి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
నటీనటులు: యన్. టి. రామారావు, జమున
దర్శకత్వం: బి.యన్.రెడ్డి
నిర్మాణ సంస్థ: పొన్నలూరి బ్రదర్స్
విడుదల తేది: 20.02 1957
Songs List:
మనసా తెలుసా పాట సాహిత్యం
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
మనసా తెలుసా
నీ విరాగమంతా వృథాయని తెలుసా
అనుబంధాలను తెంచేనని
నీ వనుకొని మురిసేవా
నీ మనసున భమ సేవా
మమకారమనే పాళము మరిమరి
పెనవేసెను తెలుసా
దీపములేని కోవెలలో పల
దేవుడు వెలిసేనా
శ్రీ ధాముడు వెలిసేనా
అనురాగ మొలుకు మనసే ఆహరి
ఆలయమని తెలుసా
అందాల రాజెవడు రా పాట సాహిత్యం
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్యచౌదరి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
అందాల రాజెవడు రా
నా వన్నెకాడు ఎందు దాగియున్నాడురా
ముచ్చటైన నా సొగసు
ముద్దుగారు నా వయసు
మురిపించి కరిగించి
మోజుదీర్చు మొనగాడు
సుంద రాంగి నామీద దయలేదటే
చేయిచేయి కలిపి నన్ను సేరరాదటె
సక్కదనము గల్ల వోణ్ణి
సరదా సెల్లించువోణ్ణి
కొండనైన పిండిజేసి కోర్కెదీర్చు కోడెగాణ్ణి
ఎన్నాళ్ళకు నిక్కావురా సోగ్గాడా
ఏ మూల నక్కావురా నా సోగ్గాడ
ఏమూల నక్కావురా.....
పోకిళ్ళ పుట్టవు - పూర్నాల బుట్టవు
బంగారు మొలకవు - పంచదార చిలకవు.
ఉప్పులేక ముప్పుందుం - చప్పరించు గొప్పవాడ
హేయ్!..
నావంక జూడవేమే వయ్యారిభామ
నా వలపు దీర్చవేమే
మూడూ లోకాలనన్ను బోలినోడు కానరాడు
వీరాధి వీరుణ్ణి శూరాధి శూరుణ్ణి
వాడెంత వీడెంత వంజగాళ్ల బతుకెంత
ధీరుల్ని చూచానురా
మీ కండ బిగువు తేల్చుకుంటే వలచేనురా
కోతలన్ని కట్టిపెట్టి - కూతలన్ని చుట్టబెట్టి
మూతిమీద మీసముంటె
ముందు దూకి బరిమీద
పందెంలో గెల్చి - నా అంద మనుభవించేటి
అరె నీవెవడపురా
నిన్ను అంతు తేల్చేదనురా
రారా ! అంతు దేల్చెదనురా
అరరె కండలు దీస్తారా నిన్ను
కరకర కోస్తారా నిన్ను
పరపర కోస్తారా...
తిరుమల మందిర సుందరా పాట సాహిత్యం
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
తిరుమల మందిర సుందరా
హరి గోవిందా గోఫందు
కొండ కొమ్ముపై కూర్చుంటే
దండ భక్తులే కొలువుంటే
నామాట నీ చెవుల పడుతుందా నీ
మనసులోని దయ పుడుతుందా
కోటి మెట్లబడి రాలేను ఏ
పాటి కానుకలు తేలేను
లోతులు నీకై చేతుల జాపీ
నా తండ్రియన నెనరుందా
కన్నె ఎంతో సుందరి పాట సాహిత్యం
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
కన్నె ఎంతో సుందరి
సన్న జాజి పందిరి
చిన్నెజూసి వన్నె జూసి పోరా
మథు వొల్కేటి మందారము
మన సిచ్చేటిలే బ్రాయము
తన తళుకులతో - నును బెళుకులతో
సఖి నీకోస మీవాకిట
వేచేను సఖరారా....
తన వాల్జూపు లుయ్యాలలై
అనురాగాలు పూమాలలై
తన మురిపెముతో
తన సరసముతో
సఖి నీకోస మీవాకిట
వేచేను సఖరారా....
నిను ఏనాడు దర్శింతునే
మన సేనాడు అర్పింతునో
అని దరియుటకై
కని మురియుటకై
సఖి నీకోస మీవాకిట
వేచేను సఖరారా
నీవుండేదా కొండపై నాస్వామి పాట సాహిత్యం
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
నీవుండేదా కొండపై నాస్వామి నేనుండే దీనేలపై
ఏలీల సేవింతునో ఏపూల పూజింతునో
శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె
ఈ పేదరాలి మనస్సెంతో వేచె
నీ పాద సేవా మహాభాగ్య మీవా
నా పైని దయజూపవా నాస్వామి
దూరాన నైనా కనే భాగ్యమీవా
నీరూపు నాలో సదానిల్పనీవా
ఏడుకొండలపైన వీడైనస్వామి
నా పైని దయజూపవా నాస్వామి
నీ సిగే సింగారమే ఓ చెలియ పాట సాహిత్యం
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
నీ సిగే సింగారమే ఓ చెలియ నీ సొగసే బంగారమే
కనులార గని మెచ్చేనే ఓ వనలక్ష్మి మనసిచ్చి దిగివచ్చేనే
నీ నవ్వుపూలు అవేమాకు చాలు
నీ ఒయ్యారాలు అవే వేనవేలు
ఓ పేదరాలా మరేపూజ లేలా
మా పై ని దయజూపవా ఓ నా చెలి
మా తోట పూచే వసంతమ్ము
మా బాట చూపే ప్రభాతమ్ము
మాలోన కొలువైన మహలక్ష్మి నీవే
మాపై ని దయ చూపవా - ఒ నా చెలీ
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
ఓ నా మొరవినరాదా
ఇక ఈ చెర విడిపోదా
అబలననీ అనాదననీ
జాలిలేని కూరుని
పాలబడిన దానిని
నీ చెంత జేర్పవా
వంతదీర్చవా - నే
నిక సై పను ఈ బాధ
ఏడ నున్నవాడవో
జాడ తెలియదాయె నే
కాపాడరా సఖా
జాగు సేయక నీవు
వినా గతి వేరెవరు
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
కన్నీటి కడలిలోన చుక్కాని లేని నావ
దిక్కైన లేని నావ
ఏ తీరమైన చేరునో - ఏరాల పాలబడునో
ఏగాలి వాత బడునో
నాపాలి భాగ్యదీపము - నన్నేలు దివ్యతార
పోయేన జీవనతార
కన్నీటి కడలిలోన - కనరాక దాటిపోయె
నన వీడి మాయమాయె
నా ఆసలే అడియాసలై - మాసేన జీవనగాధ
ఈ నా విషాద గాధ
కన్నీటి కడలీలోన - నడిచారి రాత్రి మూసె
నవచంద్ర కాంతి మాసె
ఏనాటికీ వసంతము - ఈ తోట కింకరాదా
నా వీట వెలుగిక లేదా.
కన్నీటి కడలీలోన - కనరాక దాటిపోయె
ననువీడి మాయమాయె
లోకం గమ్మత్తురా పాట సాహిత్యం
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: ఎరమాకుల ఆదిశేషా రెడ్డి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
లోకం గమ్మత్తురా
ఈ లోకం గమ్మత్తుగా
చెయ్యాలి యేదో మరమ్మత్తురా
రేసుల కాసుల వేలుగబోసె
వస్తారిండ్లకు వట్టిచేతుల
కనికరించి ఈ బీదా బిక్కికి
కానీ యివ్వరు అదేమొగాని
వ్యాధుల మిషతో తాగుడుకోసం
బాధ లెన్ని యో పడుదురుగాని
వ్యాధికి మందే ఎరుగని పేదల
ఆదరించరు అవేమొగాని
వడ్డికి వడ్డి నెత్తిన రుద్ది
అసలుకు మోసం దెచ్చుకుందురు
కాలే కడుపుకు జాలే జూపరు
కలలో నైనను అదేమొగాని
నేడో రేపో పొలాలూడితే
నిలువు రెప్పల నింగిజూ తురు
ఇన్నో అన్నో నూకలువేసి
పున్నెం గట్టరు అదేమొగాని
వచ్చిన లాభం చచ్చిన జూపక
రచ్చకెక్కుదురు బోర్డులదిప్పి
మచ్చుకై నా బిచ్చం పెట్టరు
చచ్చే జీవుల కదేమొగాని
అన్ మేరే అన్ మేరే పాట సాహిత్యం
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్యచౌదరి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
అన్ మేరే అన్ మేరే
దేఖో మందు మజా
ఏక్ బుడ్డి ఆరణా దో బుడ్డి బారనా
పత్తెమేమి లేదండీ బాబా గురు వాజ్ఞండి
రొట్టె తినండి - ఉడుకునీళ్ళు తినండి
అరె పాలు తినండి - పంచదార తినండి
బట్టతలకు తగిలిస్తే జుట్టు పుట్టుకొస్తాది
కంటి జబ్బులకు రాస్తే నంటకి సుఖమిస్తాది
మంచిమాట చేస్తాము మనసులోది చెప్తాము
పాముకుట్టితే తేలు కొరికి తే
అరె ఎలుక కుమ్మితే ఎద్దు కర్చితే
ఒక్కసారి పట్టిస్తే ఉన్న జబ్బు ఒదుల్తుంది
అనుమానం లేవండి గుణమిచ్చే మందండి
ఏలూరులో దీన్ని వాడి ఇనుములాగ బలిశారు
సాలూర్లో డాక్టర్లే సర్టిఫికేట్లిచ్చారు
బారెడు గడ్డాల వాళ్ళు మూరెడు మీసాల వాళ్ళు
అనుపానం లేకుండా ఆవుపాల మర్దించిరి
కారు చీకటి దారిగనలేని నాకు పాట సాహిత్యం
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: రాజా, పి.సుశీల, జిక్కి, మాధవపెద్ది సత్యం, వైదేహి, సత్యవతి, మల్లిక్, మోహన రాజు
కారు చీకటి దారిగనలేని నాకు
వెలలేని బంగారు వెలుగు చూపించి
అంతలో దయమాలి - అర్పి వేయుదువా
దీప మార్పివేయుదువా
తల్లిని తండ్రిని ఎరుగ గదా
నా తండ్రి) ఏ సుఖమెరుగ గదా
ఉన్నది ఈ నిధి ఒక టెగదా
కాపాడుము వరదా
ఓ దేవా - దేవా
దిగి రావ దయా జలధీ
దిగి రావయ ప్రేమనిధీ
ఓ తిరుమల వేంకటరమణా !
సరిహరి మురహరి మొరవిన రాదా
చరణ కమలముల నమ్మితిగా దా
జీవన జీవన జగధీశా !
దీనజనావన తిరుమల వాసా
ఆపద మొక్కుల దేవా రావా
నీ పదదాసిని బోవగ రావా
శరణు శరణు పరమేశా
శరణు శరణు జగదీశా
ఓ తిరుమల వేంకటరమణా !
చిత్రం: లాయర్ విశ్వనాథ్ (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర, డా॥ సి.నారాయణరెడ్డి, వేటూరి
గానం: పి.సుశీల , యస్.జానకి , యస్.పి.బాలు, మాధవపెద్ది రమేష్
నటీనటులు: యన్.టి.రామారావు, రంగనాథ్, శరత్ బాబు, జయసుధ, కవిత, సుజాత
మాటలు: గొల్లపూడి
దర్శకత్వం: యస్.డి.లాల్
నిర్మాత: వై వి రావు
విడుదల తేది:17.11.1978
Songs List:
పిలిచె పిలిచె అనురాగం పాట సాహిత్యం
చిత్రం: లాయర్ విశ్వనాథ్ (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల
పల్లవి:
పిలిచె పిలిచె అనురాగం
పలికే పలికె నవగీతం
అతడు నను చేరగానే
బ్రతుకు పులకించె తానే
చరణం: 1
ఈపడుచు గాలీ నా పైన వాలీ
ఏమమ్మో యింత సిగ్గు ఎందు కన్నది
ఏ బదులు రాక నిలువ లేక
జవ్వాడే నామనసేమో నవ్వుకున్నది
చరణం: 2
రవ్వంత బిడియం పువ్వంత ప్రణయం
నారాజు చూపుల్లోనే దాచుకున్నాడు
నే దాచలేక ప్రేమ లేఖ
అందాల మబ్బుల ద్వారా అందచేస్తాను
షరాబీ! పాట సాహిత్యం
చిత్రం: లాయర్ విశ్వనాథ్ (1978)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.జానకి
సాకి: షరాబీ!
పల్లవి:
వచ్చిందిరా ఈ గులాబీ
రేకు విచ్చిందిరా ! సోకు మెచ్చిందిరా!
లేత పరువాలు తెచ్చిందిరా
చరణం: 1
వలచింది ఒకరు నిలచింది ఒకరు నాకోసం
నా దోర వయసు ఈ లేత మనసు నీకోసం
ఈ తళుకు ఈ కులుకు నా బతుకు నీకొరకు
కలలోని వలపు వెలలేని ముడుపు నీదే
చరణం: 2
ఆడింది ఆట పాడింది పాట ఒకనాడు
నావాడి కొరకు నేనాడు తాను ఈనాడు
కన్నీరు దాచాను పన్నీరు జిల్లాను
ఏనాటికైనా నాదారిలోకి రావా
చిత్రం: కథానాయికుడు (1969)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి
పల్లవి:
పళ్లండి పళ్లండి పళ్లు
జామ పళ్లు
జామ పళ్లు
పలకమారిన పళ్లు - చిలక గొట్టని పళ్లు
కలకత్తా జామ పళ్లు కంటికి యింపైన పళ్లు
చరణం: 1
గట్టితనం తెలుసుకొని
ఖరీదెట్టి కొనండి
మెత్తగ వున్నాయంటె
బొత్తిగ నిలవుండవండి
చరణం: 2
రాజమండ్రి నుండి ఇవి రోజు రోజు వస్తాయండి
రేపుమాపని చూస్తే రేటు పెరుగుతుందండి
బత్తాయిలు వీటిముందు బలాదూరయ్యా
రంగు జూస్తే ఎనక్కెవడు పోలేడయ్యా
డాగులేమి పడనివయ్యా - టక్కులేమి చెప్పనయ్యా
పట్టి పట్టి చూడకుండా పరుగెత్తే వేమయ్యా
మంచివాడు మా బాబాయి పాట సాహిత్యం
చిత్రం: కథానాయికుడు (1969)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: దాశరథి
గానం: పి.సుశీల, బెంగుళూర్ లత
పల్లవి:
మంచివాడు మా బాబాయి
మా మాటే వింటాడోయి
కోపం మాని తాపం మాని
మాతో వుంటాడోయి
చరణం: 1
రామ లక్ష్మణులు మీరయ్యా
మీలో కలతలు ఏలయ్యా
నీతికి నిలిచే నీ తమ్మునిపై
నిందలేందుకయ్యా
చరణం: 2
అమ్మా నాన్నా వలె చూసె
అన్నా వదినా వున్నారు
అన్నయ్యేదో అనగానే
అలుక ఎందుకయ్యా
అలుక ఎందుకయ్యా
చరణం: 3
మంచి మనసుతో బాబాయి
మనకు కానుకలు తెచ్చాడు
మూగ నోములు విడవాలి
ముగ్గురు కలసి నవ్వాలి
రావేలా దయలేదా ? పాట సాహిత్యం
చిత్రం: కథానాయికుడు (1969)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: కొసరాజు
గానం: పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యం
పల్లవి:
రావేలా దయలేదా ?
రావేలా దయలేదా ?
బాలా ఇంటికి రారాదా రారాదా
రారాదా రారాదా
చరణం: 1
వెన్నెల అంతా చల్లగ కరిగి పోతున్నది
పూవుల ఘుమ ఘుమ వాసన తరిగి పోతున్నది
నీవు లేక పోతే ఇల్లు బావురుమంది
నీవు రాక పోతే మనసు ఆవురుమంది
చరణం: 2
పగలంతా ఇంటిలోన చాకిరి నాకు
వేళాపాళనకుండా చదువులు నీకు
నీవు లేనిదే ఈ గది బావురుమంది
నీవు రానిదే నా మది ఆవురుమంది
ఏ రిక్షా ఆగుతున్నా నీవే దిగుతున్నావని
ఏ చెప్పులు చప్పుడైనా నీవే వస్తున్నావని
గాజులు గలగలమన్నా
తలుపులు దబ దబమన్నా
నీవేనని లేచి చూచి బేజారై పోతున్నా
వినవయ్యా రామయ్యా పాట సాహిత్యం
చిత్రం: కథానాయికుడు (1969)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల, పి.సుశీల
పల్లవి:
వినవయ్యా రామయ్యా
ఏమయ్యా భీమయ్యా
మనమంచే గెలిచిందయ్యా
మనమాటే నిలిచిందయ్యా
చరణం: 1
అబద్దాలు చెప్పే వాళ్లు
అన్యాయం చేసేవాళ్లు
చిత్తు చిత్తుగా ఓడారయ్యా
నెత్తికి చేతులు వచ్చినవయ్యా
చరణం: 2
మహా నాయకులు త్యాగంజేసి
మనకిచ్చిన స్వాతంత్ర్యం
కొందరి చేతుల పడనీకుండా
అందరి సొమ్మని చెప్పాలి
చరణం: 3
నిరుపేదల ప్రేమించే వాళ్లను
నిజాయితీగా నడిచే వాళ్ళను
పదవి వచ్చి వలచిందయ్యా
జయలక్ష్మి వరించిందయ్యా
చరణం: 4
దగాకోరులా దోపిడి దొంగలు
తలకిందులౌ తారయ్యా
నీతికి నిలబడు కథానాయకులు
జాతికి ప్రాణం పోసేరయ్యా
ముత్యాల జల్లు కురిసె పాట సాహిత్యం
చిత్రం: కథానాయికుడు (1969)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: దాశరథి
గానం: పి.సుశీల
పల్లవి:
ముత్యాల జల్లు కురిసె
రతనాల మెఱుపు మెరసె
వయసూ, మనసూ పరుగులు తీసే అమ్మమ్మా
చరణం: 1
ఎనక జన్మల నా నోములన్నీ
ఇపుడు పండినవమ్మా
తనకు తానె నా రాజు నాతో
మనసు కలిపేనమ్మా
చరణం: 2
ముద్దు మోమును
అద్దాన సూపి
మురిసి పోయాడమ్మా
మల్లే పూల పల్లకిలోన
వళ్లు మరిచేనమ్మా
ఇంతేనయా పాట సాహిత్యం
చిత్రం: కథానాయికుడు (1969)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల
ఇంతేనయా
తెలుసు కోవయా
ఈ లోకం ఇంతేనయా !
నీతీ లేదు, నిజాయితి లేదు
ధనమే జగమయ్యా !
చరణం: 1
డాబులుకొట్టి మోసంచేసి
జేబులు నింపేరు
పాపం, పుణ్యం పరమార్థాలు
పంచకు రానీరు
ఎవరికివారే యమునా తీరే
ఇదే ప్రపంచమయా !
చరణం: 2
పైసాతోటి సీసా చేరి
జల్సా చేసింది
మనసేలేని సొగసేవుంది
మైమరపించింది
పైన పటారం లోన లొటారం
ఇదే ప్రపంచమయా
చరణం: 3
మంచిని చేస్తే మనిషిని నేడు
వంచన చేసేరు
గొంతులు కోసేవాడికి నేడు
గొడుగులు పట్టేరు
దొంగలు దొరలె ఊళ్లే దోచిరి
ఇదే ప్రపంచమయా
వయసు మళ్లిన బుల్లోడా పాట సాహిత్యం
చిత్రం: కథానాయికుడు (1969)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: కొసరాజు
గానం: పి.సుశీల
వయసు మళ్లిన బుల్లోడా
కొంటెచూపుల కుర్రోడా
నవ్వావంటే నవ్వుతా
నాటక మాడితె - కొడతా
మంచిగవుంటె చెంతకు చేరి
వలపులు విసిరేస్తా
ఆడదాన్నని అలుసుగ చూస్తే
నిప్పులు చెరిగేస్తా
మనసిచ్చిన మగవాడికి నా
ప్ర్రాణం ఇచ్చేస్తా
నమ్మినవాడు మోసం చేస్తే
ప్రాణం తీసేస్తా
నీతో షికారు వస్తాను
గమ్మత్తుగ హుషారు చేస్తాను
చేతిలోన చెయ్ వేస్తాను
చెప్పినంత పని చేస్తాను
ఎప్పటికైనా తప్పకుండ
నా తడాఖా చూపిస్తాను నీకు
తాడాఖా చూపిస్తాను
చిత్రం: కేడి నెం 1 (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి, ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల , యస్.జానకి , యస్.పి.బాలు, జి.ఆనంద్
నటీనటులు: యన్. టి. రామారావు, జయసుధ
అసిస్టెంట్ డైరెక్టర్: బి. గోపాల్
దర్శకత్వం: కె.రాఘవేంద్ర రావు
నిర్మాత: కె. దేవి వరప్రసాద్
విడుదల తేది: 15.12.1978
Songs List:
యస్ నేనే నెంబర్ వన్ పాట సాహిత్యం
చిత్రం: కేడి నెం 1 (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు
యస్ నేనే నెంబర్ వన్
కేడీలను కనిపెట్టే రౌడీ నెంబర్ వన్
రౌడీలను పనిపట్టే కేడీ నెంబర్ వన్
నెంబర్ వన్... నెంబర్ వన్... నెంబర్ వన్ ॥యస్ నేనే ॥
ఇది జనతా బస్సు - జాగ్రత జాగ్రత మనిపర్సూ
ఎవ్వరు ఎక్కడ దిగుతారో
ఏం తలకెత్తుకుపోతారో .... ఎవడికి తెలుసు ?
గోవిందా గోవిందా
ముద్రలువేసే నోట్లకట్టలు
ముడుపుగ వేసే పెద్దమనుషులు
ముసుగులు తీస్తే రాస్కెల్సు
మూట విప్పితే బాటిల్సు కేడీ నెంబర్ వన్ ....
కేడ్ నెంబర్ వన్.... ॥యస్ నేనే ॥
ఈ లోకం గాంబ్లింగ్ హౌస్
ఆడేవాళ్ళు బ్లడీ ఫూల్స్
ముక్కలు మార్చేవాడెవడో
లెక్కెగగొట్టేవాడెడో ....ఎవడికి తెలుసు ?
రాజు రాణి జోకర్ లు కలిసొస్తేనే లాఖియర్ లు,
రంగురంగుల టోపీలు రకరకాలుగా దోపిళ్ళు ॥యస్ నేనే ॥
ఇది భారతదేశం ఈ పసిపాపలదీ దేశం
ఎవ్వడు గాంధీ అవుతాడో ఎవ్వడు గాడ్సే అవుతాడో ఎవరూ ఎరగం
ఇస్తే చాలదు సందేశం
ఇవ్వాలయ్యా సౌకర్యం
ప్రతి ఒకరప్పుడు నెంబర్ వన్
చెబుతున్నాడీ నెంబర్ వన్ ॥యస్ నేనే ॥
సరిగమ పదనిస... పాట సాహిత్యం
చిత్రం: కేడి నెం 1 (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు
సరిగమ పదనిస... ఛ ఛ...
పదనిషా
అందిస్తా అమృతం కొట్లు గురూ
కొట్టకుంటే చచ్చినంత ఒట్లు గురూ, గురూ గురూ
పాలల్లో ఏముందిరో చల్లారే పొంగుతప్ప
నీళ్ళల్లో ఏముందిరో పల్లానికి పరుగుతప్ప
పాపలు తాగే పాలూ చేపలు ఈదే నీళ్లూ
నీ కెందుకురా ఈ విందుకు రారా
తందనానా తాగు తందనానా ఊగు
తందనాలాడు తాగి తందనాలాడు
గంగ తాగి నట్టుందిరో కాస్తంత చేదుతప్ప
శివమెత్తి పోతోందిరా శివుడు ఎవరు నేను తప్ప
బ్రాందీ తాగిన నీకూ విస్కీ తాగిన నాకు
సిగ్గెందుకులే - పెగ్గందుకురా
తందనానా తాగు తందనానా ఊగు
తందనాలాడు తాగి తందనాలాడు
ఫారిన్ బ్రాందీ వుంది
అది గడ గడ తాగేస్తా
కారబ్బూందీ వుంది
ఇది కరకర నమిలేస్తా
అది గడగడ తాగేస్తా!
ఇది కరకర నమిలేస్తా
కాదంటే హరహరహర శంభో అనిపిస్తా
మిడి మిడి మేళం తడిపొడి తాళం
చిందరవందర గందర గోళం
ఆకలుండదు దప్పికుండదు పాట సాహిత్యం
చిత్రం: కేడి నెం 1 (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
ఆకలుండదు దప్పికుండదు
పక్కకుదరదు నిదరపట్టదు
ఏమిస్తావో ఇవ్వు మందో మాకో నాకు
ఆకలుండదా దప్పికుండదా
పక్కకుదరదా నిదరపట్టదా
ఏమిస్తానో చూడు కాయో పండో నీకు
పెదవులు వెతికే పెదవులనడుగు
పెర పెర ఎందుకని
పై పై కెగిరే పైటను అడుగు- రెపరెప లెందుకని
గుచ్చిగుచ్చి అడుగుతువుంటే గుట్టు దాచుకోకు
పిచ్చికాస్త ముదురుతువుంటే బెట్టు చేయబోకు
అక్కడ నెప్పి ఇక్కడ దప్పి
ఎట్టా ఎట్టా చెప్పను విప్పి ||ఆకలుండదు||
దిగులుకాని దిగులొకటుంది గుబులు, గుబులుగా
పగలూ రేయీ పగపడుతుంది వగలు రగులగా
వయసు రోగమై మనసు తాపమై వేధిస్తే అంతే
ఏ వయసు కాముచ్చటన్నది లోపిస్తే గల్లంతే
ఇప్పుడు చెప్పు ఎక్కడ నెప్పి
అక్కడా ఇక్కడా ఎక్కడ ఎక్కడ
కొత్త బరువులు మెత్తమెత్తగా ఆరడి పెడుతుంటే
కోడెచూపులు వెచ్చవెచ్చగా - రాపిడి పెడుతుంటే
దాయలేని వయసుకన్నా మోయలేని బరువేముంది
దాచుకున్న మనసుకన్నా పెంచుకున్న జ్వరమేముంది
వాయని వాపు తీయని తీపు-తీరే దారీతెన్నూ చూపు
మళ్ళీ మళ్ళీ పాట సాహిత్యం
చిత్రం: కేడి నెం 1 (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు
మళ్ళీ మళ్ళీ మళ్ళీ అందీ కోడె వయసు
పెళ్ళి పెళ్ళి పెళ్ళి అందీ కన్నె మనసు
ముద్దు - వద్దు
ముద్దు - వద్దు
ముద్దు ముద్దుకి చిలిపి వయసు వలపు పద్దు రాస్తుంటే
తొలి వలపు పద్దు రాస్తుంటే
పద్దు పద్దు కీ ముద్దు ముదిరి వయసు ముద్దరేస్తుంటే
వేసిన ఆకలి వెచ్చని కౌగిలి - తీర్చలేక పోతుంటే
ఏదో గిలి ఇంకేదో చలి - చుక్క వేళ చక్కలిగిలి పెడితే
ముద్దు వద్దు ముద్దు ॥మళ్ళీ॥
ప్రేమ - పెళ్ళి
ప్రేను - పెళ్ళి
ప్రేమ తొందరే పెళ్ళి పందిరై రాతిరి రానేవస్తే
తొలి రాతిరి రానేవస్తే
మూడు ముళ్ళతో ఇద్దరొక్కటై నిద్దరకే సెలవిస్తే
తీరని కోరిక తీరిన కోద్దీ - మరోసారి అంటుంటే
రేగాలని చెలరేగాలని - రేయి పగలు పక్కలు జతపడితే
ప్రేమ - పెళ్ళి
అహా - ఊహూఁ
హత్తెరి దొరసాని నరసమ్మా పాట సాహిత్యం
చిత్రం: కేడి నెం 1 (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు
హత్తెరి దొరసాని నరసమ్మా ఆపమ్మా ఆప్ ఆప్
దొరబాబుల తోల్బొమ్మా తోడాదర్శన్ దేవమ్మా దేవ్ దేవ్
మెరికీది మల్లిని మద్రాసు లల్లిని
బెంగుళూరు బేబిని, బొంబాయి దేవిని
అదోని దొరసాని నరసమ్మని
ఆలిండియాకు ఛాలెంజిని
ఆలిండియాకు ఛాలెంజిని
పెద్దాపురంలో నా పైట గాలికి
పిచ్చెక్కి పోయారు జమిందారులు
ఇనషానల్లా
హాయ్, గులాములై నారు నవాబులు
మెచ్చి నోళ్ళు పిచ్చివాళ్ళు - పులుపు కాస్త చచ్చినోళ్ళు
గట్టివాళ్ళు తగలలేదు నీకు యిన్నాళ్ళు
భాయి భాయి యిద్దరున్నాం
నీ బడాయి మేము విన్నాం
వెంకటస్వామి
విన్నదెంతో ఉన్నదెంతో చూడబోతాము
ఆ పొద్దు చాలా ఉందిలే
యిద్దరము ఆసాములే
ముదుగానే తెల్చుకుందాం
అటో యిటో యిటో అటో
నా కాలిగజ్జలు ఘల్ అంటేచాలు
మెలికలే తిరిగారు మహారసికులు
యిన్నాళ్ళ కొచ్చారా మొనగాళ్ళు - నాతోటి చేస్తారా సవాళ్ళు
యిల్లు వెతికి వచ్చినాము నోరుతెరిచీ అడిగినాము
యింతమందికి సొంతమైంది మాకు కారాదా
నువ్వు పట్టేదేమిమందో యింతమైకం ఎక్కడుందో
ఒక్క రాత్రి యిక్కడుండి తెలిసికోరాదా
ఆ మేము నీకై వచ్చినా
నీకు మేమే నచ్చినా
ఖాయమేదో చేసుకుందాం
ఆటో యిటో యిటో అటో
పూనిందిరోయ్ పోలేరమ్మా పాట సాహిత్యం
చిత్రం: కేడి నెం 1 (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.జానకి
హేయ్ పూనిందిరోయ్ పోలేరమ్మా - ఆడిందిరోయ్ అంకాలమ్మా !
దమ్ముంటే చూడు నా జాతర దుమ్ము రేగి పోతుందిరా ll హేయ్ పూనిందిll
మేక పులిగా మారింది తాడు పామై లేచింది
తెల్ల మబ్బు ఉరిమింది మల్లెపువ్వు ఎరువైంది
ఎందుకొచ్చిందో ఈ ప్రళయం ఎవడికో మరి పోయేకాలం llపూనిందిరోయ్ll
సీత గీతే దాటింది లంక భస్మం అయింది
చీర లొలిచారు ద్రౌపదికి చేటు వచ్చింది నూరుగురికి
ఆడదంటేనే అగ్గినిప్పురా.….ఆడుకున్నోళ్లు బూడిద కుప్పరా ll పూనిందిరోయ్ll
చిత్రం: శృంగార రాముడు (1979)
సంగీతం: కె.వి.మహాదేవన్
సాహిత్యం: ఆత్రేయ (All)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, వాణిజయరాం
నటీనటులు: యన్.టి.రామారావు, శరత్ బాబు, లత, జయమాలిని
దర్శకత్వం: కె.శంకర్
నిర్మాత: రామమూర్తి
విడుదల తేది: 22.11.1979
Songs List:
ఈ రోజు ఈ రోజే పాట సాహిత్యం
చిత్రం: శృంగార రాముడు (1979)
సంగీతం: కె.వి.మహాదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు
ఈ రోజు ఈ రోజే - ఇది నిన్నా కాదు - రేపూ కాదు... అదే దీని మోజు
ప్రతి మనిషి తనకే తెలియక పుడతాడొకరోజు
తానొకడే పుట్టినట్టు - చేస్తాడు పుట్టినరోజు
రోజులు తెలియని పుట్టుకలున్నాయ్ పుట్టుకలేని రోజే లేదోయ్
పుట్టటమే ఒక గొప్పకాదు - పుట్టి గొప్పకావాలి-
ఈరోజే నా రోజని అనుకుంటే - ప్రతిరోజు ఒక పండగే
రేపూ రేపని వూరుకుంటే - ఈ రోజూ ఒక దండగే
ఇరవైనాలుగు గంటలు కాదోయి - ఈ క్షణమొకటే నీకొక రోజోయి
అనుభవించు వున్న క్షణాన్ని అందినంత ఆనందాన్ని
హౌ ఆర్ యు పాట సాహిత్యం
చిత్రం: శృంగార రాముడు (1979)
సంగీతం: కె.వి.మహాదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు
హౌ ఆర్ యు ... హవ్ డూయూడు అని అడగాలి
ఫ్లవరంటే అమ్మాయి షవరల్లే నవ్వాలి - రివరల్లే వురకాలి
హాపీ టు మీట్.. యు సర్ - వెరీ వెరీ హాపీ - టు సర్వ్ యు సర్
ఎప్పుడేమి కావాలో ఎలా ఎలా చెయ్యాలో
మీ రుచులు ఏమిటో అభిరుచులు ఏమిటో చెబితే చేసేందుకున్నాను
ఒకసారి చేశాక చెప్పకనే చేసేస్తానని చెప్పాలి.
కష్టపడి వచ్చారు కాసేపు పడుకోండి
నీరసంగ వున్నారు ఈ పళ్ళరసం తాగండి
వేడి తగ్గిపోతుంది స్నానం చెయ్యండి
పడుకోబోయే ముందు పాలు తాగండి
వూరుగాని వూరొచ్చిన మీకు వుపచారాలు చెయ్యాలి
అ తారింటో అలుడిలా అడిగిందంతా యివ్వాలి - మీరడిగిందంతా యివ్వాలి
ఐ లైక్ యు, డూ యు లైక్ మి - ఇఫ్ ఐ లవ్ యు విల్ యు లవ్ మి
అందాక వచ్చాక అడగకనే నేనడిగేలా చెయ్యాలి.
నందమూరి అందగాడా పాట సాహిత్యం
చిత్రం: శృంగార రాముడు (1979)
సంగీతం: కె.వి.మహాదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, వాణిజయరాం
నందమూరి అందగాడా నేనందుకున్న చందురూడా
కాశ్మీరు కన్నెపిల్లా నే కట్టుకున్న ప్రేమఖుల్లా
ఇద్దరం కలిశాము యీ వేళా.…ఎండలో కాస్తుంది పండువెన్నెలా....
మంచితనం చక్కదనం ఒక్కటైన చోటా
పూస్తుంది దానిమ్మ తోట పూతోట
పడుచుతనం గడుసుదనం పాడేది పాట
పలుకుతుంది ప్రతి పిట్ట నోట
మంచుమీది ఆట మనకు ముచ్చట
మనమంటే మంచుకే ఎంతో ముద్దు
మంచుకొండమీద శివుడు నాట్యమాడినాడు
పార్వతికి తనలోని సగమిచ్చినాడు.
అదే మంచుమీద కలిసి ఆడాము నేడు
ఆది దంపతులం మనం ఏనాడూ
పుటినిలు మెట్టినిలు యీ పడవలోనే
మొదటి రాత్రి పడకటిల్లు కొలనులోనే
ఆకాశం కడుతుంది తారల జలతారు
గులాబీలు చల్లుతాయి పన్నీరు
నీకు నాకు సాటిలేరు ఎవ్వరు
నువ్వూ నేనే ప్రేమకు మారు పేరు ....
చీటికి ప్రాణం చేవ్రాలు పాట సాహిత్యం
చిత్రం: శృంగార రాముడు (1979)
సంగీతం: కె.వి.మహాదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: వాణిజయరాం
చీటికి ప్రాణం చేవ్రాలు -ఆ చీటీలన్నవి రెండు రకాలు
చిరిగి ముక్కలై పోయేవి చెరగక మక్కువ దోచేవి
నా వయసొక చీటీ నా సొగసోక చీటీ
వాటికి ప్రాణం పోయి నీ చేవ్రాలతోటి
నీ భాషొకటి నా భాషొకటి- ఇద్దరి కళ్ళకు లిపి వొకటి
అది చేసే భాసలు శతకోటి
ఈ పెదవులు చూడు - ఆ మధువులు చూడు
రెంటికి యిచ్చేయ్ ఓ ముదులు చీటీ
నీ కలశొకటి ఇద్దరమాడే ఆటొకటి
ఇది నీకూ నాకూ తొలి పోటీ....
చిత్రం: శృంగార రాముడు (1979)
సంగీతం: కె.వి.మహాదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, వాణిజయరాం
వస్తానన్నావు - వస్తే చూస్తానన్నాను
పిచ్చిదాన్ని వచ్చుంటావని నేనే ముందుగ వచ్చాను
వస్తానన్నాను - వ స్తే చూస్తానన్నావు
పిచ్చిదాని కంగారంతా - ముందే వచ్చి చూశాను
మగాడు ముందే రావాలి - ఆడది వచ్చి చేరాలి.
అప్పుడే ఈడూ జోడూ కలవాలి
జన్మలుంటాయి - మన జంట కలిసేందుకు
కాలముంటుంది - మన వెంట నడిచేందుకు
దేవుడుంటాడు రాసిందే రాసేందుకు
ఎవరిచేతవును మన రాత మార్చేందుకు
పవిత్ర ప్రేమకు యిన్నేళ్ళు చరిత్ర రాసిన కన్నీళ్ళు
నిజాలు కావు మనకు - ఆ విషాద గీతాలు
గంగా పొల్లాతో కలవాలి - మన ప్రేమతో
తూర్పు పడమరలు చేరాలి ఒక రంగులో
ముంతాజ్ పుట్టింది - షాజహాను వలచేందుకు
షాజహాను బ్రతికాడు – తాజ్ మహల్ కట్టేందుకు
నీ మనసే నాకు మహలై వుంటే - మరణ మెక్కడిది...
మరణం లేని మమతలకెందుకు మహల్లు కట్టేది
యుగాలు ముందు వున్నాము ముందు యుగాలు వుంటాము
ప్రేమకు వేరే వేరే పేర్లు పెడతామా....
ప్రేమ ఏలాలి దేశాల రాజ్యాంగము
పేద మహారాజు ఎక్కాలి ఒక పీఠము
ప్రపంచమంతా ప్రతిరోజూ వసంత రుతువై పూస్తుంది
అనంతమైన ఆనందం నిరంతరంగా వుంటుంది.