Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ammayi Bagundi (2004)చిత్రం: అమ్మాయి బాగుంది (2004)
సంగీతం: ఎమ్. ఎమ్. శ్రీలేఖ
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కార్తీక్, సబితా రెడ్డి, శివాజి
నటీనటులు: శివాజి, మీరాజాస్మిన్
దర్శకత్వం: బాలశేఖరన్
నిర్మాత: డి. దేవకుమార్ రెడ్డి
విడుదల తేది: 16.07.2004

ఏయ్ సత్యా...
ఏయ్ సత్యా నువ్వు చాలా బాగున్నావు
నిజం చెప్పనా ? నీ టేస్ట్ నా టేస్ట్ ఒకటే సత్యా
హే శివా కోయ్ కోయ్ కోయ్ కోయ్
ప్రామిస్

నిజమే చెబుతున్నా నువ్వంటే ఇష్టమని
నువ్వే నా ప్రాణమని ఐ లవ్ యు ఓ సత్యా
నిను చూస్తుంటే నో ఈటింగ్ నీతో వుంటే నో డ్రింకింగ్
కొత్తగ ఉన్నది ఈ థింకింగ్ చలియా నీకై నే వెయిటింగ్
ఊరించుతావే ప్రియతమా
ఐ జస్ట్ లవ్ యు లవ్ యు లవ్ యు  ఓ బేబీ
టెల్ మీ టెల్ మీ టెల్ మీ యు లవ్ మీ
యామ్ సో క్రేజీ క్రేజీ ఫర్ యూర్ లవ్

నిజమే చెబుతున్నా నువ్వంటే ఇష్టమని
నువ్వే నా ప్రాణమని ఐ లవ్ యు ఓ సత్యా

ఏంట్రా నీ గోల చెప్పరా!

ఇద్దరిది ఒకటే టేస్ట్ ముందేదో అనుకున్నట్టు
అందంలో అందరికన్నా ఆమె ఎవరెస్ట్
తను ఏదో అంటున్నట్టు నేనేదో వింటున్నట్టు
ఏమేమో అనిపిస్తుంది ఏంటే కనికట్టు
ఈ రోజు హాయి బాగుంది లే ఆకాశం నా చేతులకే అందేస్తున్నట్టు
ఓ చెలియా నిన్ను చూడాలంటుంది నీతో మాట్లాడాలనుంది
ఇపుడే మనసు చేజారిపోతుంది

నిజమే చెబుతున్నా నువ్వంటే ఇష్టమని
నువ్వే నా ప్రాణమని ఐ లవ్ యు ఓ సత్యా

రోజూలా వేకువ రాదు రాత్రైనా వెన్నెల రాదు చలియా నువు కనబడకుంటే ఆనందం రాదు
నా కంటికి నిదురే రాదు ఇంకేమి గుర్తుకు రాదు
నీ నవ్వులు సడి వింటుంటే అలుపైనారాదు
తొలిసారి నాలోని తుళ్ళినట్లే నా కోసం
నువు పరుగున రావే అల్లరి చినుకల్లే
ఓ చలియా నిన్ను చూడలనుంది నీతో మాట్లాడాలని ఉంది
ఇపుడే మనసు చేజారిపోతుంది

*********    **********   **********చిత్రం: అమ్మాయి బాగుంది (2004)
సంగీతం: ఎమ్. ఎమ్. శ్రీలేఖ
సాహిత్యం: కులశేఖర్
గానం: యస్. పి. బి. చరణ్

అమ్మాయి బాగుంది అందంగా ఉంటుంది
ఏవేవో చేసింది వారెవ్వా
మందారంలా ఉంది  మువ్వల్లే నవ్వింది
రాగాలే తీసింది వారెవ్వా
గుండెలోపలా ఎండమావిలా ఎందుకిలా ఈ మాయ
కంటిపాపాలో స్వప్నమే ఇలా ఎదురుగా రాదే
ఇలా ఓ ఓ

అమ్మాయి బాగుంది అందంగా ఉంటుంది
ఏవేవో చేసింది వారెవ్వా

ఎవ్వరిది ఈ యవ్వన వీణ మైనా
గుండెలోన మాటలకి అందని జాణ అందంతో అప్సరసేనా అవునా
అందుకోన ఓ ఆమె నవ్వే పాడుకో మౌన సంగీతం
కాలి మువ్వై మొగుతుంది ప్రేమ సంకేతం
ఎటు చూసినా అటు వైపునే ఎదురయే ఆమె రూపం

అమ్మాయి బాగుంది అందంగా ఉంటుంది
ఏవేవో చేసింది వారెవ్వా
మందారంలా ఉంది  మువ్వల్లే నవ్వింది
రాగాలే తీసింది వారెవ్వా

చెప్పకనే చెప్పెను ప్రాయం ఎప్పటికి తీరని దాహం మొహం ఆహా
వింత మొహం ఆహా
గుప్పెటలో దాగని కాలం గుపౌమని ఆశల తీరం దూరం
ఎంత దూరం ఓ ఓ
ఆమె తోనే చేయమంది జన్మలో స్నేహం
ఆమె తోనే చేయమంది తోడుగా ప్రాణం
సందెవేళలో చల్లగాలిగా తను చేసే సంతోషం

అమ్మాయి బాగుంది అందంగా ఉంటుంది
ఏవేవో చేసింది వారెవ్వా
మందారంలా ఉంది  మువ్వల్లే నవ్వింది
రాగాలే తీసింది వారెవ్వా
గుండెలోపలా ఎండమావిలా ఎందుకిలా ఈ మాయ
కంటిపాపాలో స్వప్నమే ఇలా ఎదురుగా రాదే
ఇలా ఓ ఓ********    **********   *********


చిత్రం: అమ్మాయి బాగుంది (2004)
సంగీతం: ఎమ్. ఎమ్. శ్రీలేఖ
సాహిత్యం: కులశేఖర్
గానం: చిత్ర, శివాజి

సామజ వరగమన సామజ వరగమున
సాధుహృద్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత
సామజ వరగమన

పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన
నిరంతరం వసంతమే సంగీతం
పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన
నిరంతరం వసంతమే సంగీతం
గుప్పెడు గుండెలు లోన గుడి గంటలు సందడిలోన
ప్రతి క్షణం స్వరార్చనే సంగీతం
అల లాంటి జీవితాన నిజమైన హాయి రాగం
ఎన్నెల్లోన గోదారల్లే పొంగే సంగీతం

పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన
నిరంతరం వసంతమే సంగీతం

సెల్ ఫోన్
ఎంత దూరమైన చిరుగాలి పాటలోన
అనుబంధం పలికించే రాగం
సిగరెట్
గాలి అలల పైన ఆ నింగి తాకుతున్న
పొగమబ్బును కరిగించును రాగం
కళ్లు
కంటి పాప బాష సంగీతం
గాలి గుండె పాట సంగీతం పూల చెట్టు నీడ సంగీతం
అక్షరాల కందమైన రూపం
హృదయ లయల శృతులు కలుపు పెదవి సంతకం

పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన
నిరంతరం వసంతమే సంగీతం

మరి ప్రేమ
వాన విల్లులోన ఏ రంగు లేదు అయినా
ఎద రంగుల తొలి రంగే ప్రేమ
ఓ మరి బెస్ట్ ఫ్రెండ్
కంటి ఊసులోన ఈ ఒంటరీడు లోన
జత చేరిన ప్రియ నేస్తమే ప్రేమ
సిగ్గు
పాల బుగ్గ సిగ్గు ఈ ప్రేమ వాలు కళ్ళు ముగ్గు ఈ ప్రేమ
తేనె కన్నా మత్తు ఈ ప్రేమ పూల కన్నా మెత్తనీ ప్రేమ
తీపి జ్ఞాపకాల పేరే ప్రేమ
ఓ ఫన్టాస్టిక్
మనసు తలుపు తెరిచి పిలుపు చిలిపి సరిగమ

పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన
నిరంతరం వసంతమే సంగీతం
గుప్పెడు గుండెలు లోన గుడి గంటలు సందడిలోన
ప్రతి క్షణం స్వరార్చనే సంగీతం
అల లాంటి జీవితాన నిజమైన హాయి రాగం
ఎన్నెల్లోన గోదారల్లే పొంగే సంగీతం

పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన
నిరంతరం వసంతమే సంగీతం

సామజ వరగమున సామజ వరగమున
సాధుహృద్ సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత
సామజ వరగమన

Most Recent

Default