Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Pidugu Ramudu (1966)




చిత్రం: పిడుగు రాముడు (1966)
సంగీతం: టి.వి.రాజు
నటీనటులు: యన్. టి.రామారావు, రాజశ్రీ
దర్శకత్వం: బి.విఠలాచార్య
నిర్మాతలు: డి. వి.యస్.రాజు, ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు
విడుదల తేది: 10.09.1966



Songs List:



ఈ రేయి నీవు నేను పాట సాహిత్యం

 
చిత్రం: పిడుగు రాముడు (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి :
ఓహోహో... ఓహో... హో (2)
ఈ రేయి నీవు నేను
ఎలాగైన కలవాలి
నింగిలోని తారలు రెండు
నేలపైన నిలవాలి "రేయి"

చరణం: 1
ఏ మబ్బు మాటున్నావో
ఏ పొదల చాటున్నావో (మబ్బు)
ఏ గాలి తరగలపైన
ఊగి ఊగిపోతున్నావో (2)
కలగా వన్నే కవ్వించేవో 

చరణం: 2 
చందమామలో ఉన్నాను
చల్లగాలిలో ఉన్నాను
నీ కంటిపాపలలోన
నేను దాగి వున్నాను (2)
నీలో నేనై... నిలిచున్నాను

చరణం: 3 
ఆనాటి చూపులన్నీ
లోన దాచుకున్నాను (2)
నీవు లేని వెన్నెలలోన
నిలువజాలకున్నాను (2)



పిలిచిన పలుకవు ఓ జవరాలా పాట సాహిత్యం

 
చిత్రం: పిడుగు రాముడు (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
పిలిచిన పలుకవు ఓ జవరాలా  
పిలిచిన పలుకవు ఓ జవరాలా 
చిలిపిగ ననుచేర రావా! రావా! 
పిలిచిన పలుకవు ఓ జవరాలా 
కలువల రాయడు చూసే వేళ (2)
చెలియను కవ్వింతువేలా యేలా 
కలువల రాయుడు చూసే వేళ 
 
చరణం: 1
చల్లగ విరిసే నీ చిరునవ్వులు  (2)
మల్లెలు కురిసెను నాలోన 
తొలిచూపులలో చిలికిన వలపులు  (2)
తొందర చేసెను నీలోన 
పిలిచిన పలుకవు ఓ జవరాలా 
చిలిపిగ ననుచేర రావా! రావా!

చరణం: 2
జగములనేల సొగసే నీదని  (2)
గగనములో దాగే నెలఱేడు 
మనసును దోచే మరుడవు నీవని (2)



చివదానా చినడానా పాట సాహిత్యం

 
చిత్రం: పిడుగు రాముడు (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల, ఘంటసాల

చివదానా చినడానా - ఓ చిలిపి కమల దానా 
రా ముందుకు సిగ్గెందుకు  నీ ముందు నేను లేనా !
దాటలేదు వదహారేళ్లు దాచలేవు బెదిరేకళ్లు
గాలి తాకి తేనే - హోయ్ హోయ్ 
కంది పోవు నీ ఒళ్లు

జడపాయలు వడి వేశావు జారుపైట సరి చేసేవు
లేత నడుము జువు జువనగా లేచి లేచి నడిచేవు

ఉరికి ఉరికి చూడబోకు వుంటి నేను తోడు నీకు
ఎదుట నీవు వుంటే చాలు ఇంక ఎదురు లేదు నాకు





కొమ్మల్లో పాలపిట్టా పాట సాహిత్యం

 
చిత్రం: పిడుగు రాముడు (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: పి.సుశీల 

కొమ్మల్లో  పాలపిట్టా కూత కూసిందోయ్
కమ్మంగా గున్ననూవి కాపు కాసిందోయ్
నా రాజా 
చిలిపిగాలి విసిరెనులే - వలపువాన కురిసెనులే - రాజా
గిలిగింతలు కలిగెనులే - ఘామా ఘామాలే
ఈ గాలిలో - ఈ వేళలో ఏవేవో తలపులు
చిగురించెనులే

పైరు పాట పాడిందీ
మొయిలు నాట్య మాడిందీ రాజా
పూలతావి మత్తుజల్లి - లాలించింది
పదే - సదే - అదేమిటో
నా ఒళ్లు పరవశమయిపోయినదీ

పక్క నెనరొ పిలిచినట్టు
పైటకొంగు లాగినట్టు
ఏమేమో అనిపించును - రాజా
ఔనౌనులే - సిగ్గౌనులే
వయసున చెలరేగిన - భ్రమలివిలే




మిల మిల మిల మెరిసే మనసే పాట సాహిత్యం

 
చిత్రం: పిడుగు రాముడు (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: పి.సుశీల 

మిల మిల మిల మెరిసే మన సే
ఎగిసి దూకిందిలే 
కానరాని ఆకాశదీపం
కనుల ముందే వెలిగిందిలే
మూగవోయిన, రాగమాల
మురిపి, విరిసి, పలికిందిలే

కరిగిపోయే అందాల కలలే
తిరిగి నాలో అగుపించెనే
వాడి పోయే ఆశలన్నీ
నేడే నాలో చిగురించెనే

గుండెలోన కొలువైన స్వామీ
ఇదీ పండు నవ్వులు చిలికించెనే
చేసుకొన్న పూజలన్నీ
పూచి, కాచి ఫలియించెనే



నిండు అమాసా పాట సాహిత్యం

 
చిత్రం: పిడుగు రాముడు (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: ఎల్. ఆర్. ఈశ్వరి , మాధవపెద్ది సత్యం 

నిండు అమాసా - నిశిరేతిరికడ
ఎక్కడి కెళ్తావు మామో - నువ్వేమైపోతావు మామో
ఎటు బోతేనేం – ఏమయితేనేం
వెంట బడకు ఓ భామో - నన్నేడిపించకో భామో

కళ్ళలో కారం గొట్టి పోతివా !
కంతిరి జేసి దాటి పోతివా
కాలికి మెడకు కట్టేస్తానోయ్
నెత్తిన రెండూ మొట్టేస్తానోయ్
చూపులు చూస్తే ఊపుగ వున్నాయి.
మాటలు చూస్తే జోరుగ వున్నాయి.
పోచుకోలుగా తలచేవేమో
మీసమున్న మగ ధీరుడ నేనే

జెట్టా పట్టా జానెడు లేపూ - ఉల్లిపాయవలె ఎగిరిపడేవూ
ఉల్లిపాయలో వున్నది కారం
ఎరుగపు ఏమో నా వ్యవహారం
గడప దాటినుపు కాలు బెడితివా
ఒళ్ళు సాపుగా ఊపేస్తాన్
గ్రహపాటున నే నిక్కడికొస్తే
కదలనీయదూ యీ సైతాన్




రారా కౌగిలి చేర రారా దొరా పాట సాహిత్యం

 
చిత్రం: పిడుగు రాముడు (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల 

నడకలో కొదమ సింగపు - అడుగులున్న మొనగాడ
మేనిలో పసిడి వన్నెల - మెరుపులున్న చినవాడ

రారా కౌగిలి చేర రారా దొరా 
ఈ రంగేళి ప్రాయమ్ము నీ దేనురా !

చలిగాలి వీచేను నీ కోసమే
ఈ చెలి సైగ చేవేను నీ కోసమే
మనసందుకో నా మరులందుకో
ఓ మగరాయడా నీకు బిగు వెందుకో
పొదరిండ్లు నిను నన్ను రమ్మన్నవి
నా మదిలోని రాగాలు జుమ్మన్నవి
మాటాడవా, సయ్యాటాడవా
నీ కొన చూపుతో నన్ను వేటాడవా





రంగులు రంగులు పాట సాహిత్యం

 
చిత్రం: పిడుగు రాముడు (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి 

రంగులు రంగులు రంగులు
హోయ్ రమణుల వయసుల పొంగులు
రాక రాక మావాడలోకి
బల్ సోకుగాడు వచ్చాడే
అహ నాకు బాగ వచ్చాడే

ఏమా అందం ఏమా చందం
ఇక నే తాళలేనే - ఓయమ్మ

మేటి బంటువలె మాటి మాటికీ
మీసం మెలివేశాడే
సంపెంగనూనె రాశాడె

కీచకుడైనా ఈ దొరముందక
కీచు కీచు మంటాడే - హో యమ్మ

చెంగుపట్టుకుని చెంతజేరి
నా చెక్కిలి మీటెను చూడే
అయ్యొ సిగ్గును వదిలేశాడే!

విలాసవీరుని కూలస తీరగ
జలకా లాడింతామే





మనసే వెన్నెలగా పాట సాహిత్యం

 
చిత్రం: పిడుగు రాముడు (1966)
సంగీతం: టి.వి.రాజు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల

మనసే వెన్నెలగా మారెను లోలోన
వీడిన హృదయాలే కూడెను ఈవేళా

మనసే వెన్నెలగా మారెను లోలోన
వీడిన హృదయాలే కూడెను ఈవేళా
మనసే వెన్నెలగా మారెను లోలోన

విరిసే ఊహలలో ...పరువము నీవేలే
విరిసే ఊహలలో ...పరువము నీవేలే
మదనుడి కన్నులలో ...మగసిరి నీదేలే
మదనుడి కన్నులలో ...మగసిరి నీదేలే
సంధ్యలతో కవ్వించే... యవ్వని నీవే

మనసే వెన్నెలగా మారెను లోలోన
వీడిన హృదయాలే కూడెను ఈవేళా
మనసే వెన్నెలగా మారెను లోలోన

తలపుల పందిరిలో...కలలే కందామా
తలపుల పందిరిలో... కలలే కందామా
తరగని కౌగిలిలో కాపురముందామా
తరగని కౌగిలిలో కాపురముందామా
కనరాని తీరాలే... కనుగొందామా

మనసే వెన్నెలగా మారెను లోలోన
వీడిన హృదయాలే కూడెను ఈవేళా
మనసే వెన్నెలగా మారెను లోలోన


Most Recent

Default