Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: W/o వి. వరప్రసాద్ (1998)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల (All Songs)
గానం: యస్.పి.బాలు, రేణు కణ్ణన్, సుజాత, శ్రీలేఖ పార్థసారథి
నటీనటులు: వినీత్ , జె. డి.చక్రవర్తి , అవని, ఇషా
దర్శకత్వం: వంశీ
నిర్మాత: రాంగోపాల్ వర్మ
విడుదల తేది: 1998

ఆ.... నా జత నీవే ప్రియా...

ఎక్కడకి నీ పరుగు ఎందుకనీ ఈ ఉరుకు
నీ కోసం నేనుండగా మరి ముందుకు పోతావేం అలా
అలసట అంత తీరగా నా ఒడిలో లాలిస్తా పద
ఆగనిదీ నా అడుగు ఎందుకనో నా ఎదనడుగు
ఏమో ఎక్కడ ఉన్నదో నా కలలో కదిలే చిన్నదీ
నీలో మాత్రం లేదులే నేనన్వేషించే ఆ చెలీ

ఆ.... నా జత నీవే ప్రియా...

ఎక్కడకి నీ పరుగు ఎందుకనీ ఈ ఉరుకు
నీ కోసం నేనుండగా మరి ముందుకు పోతావేం అలా
అలసట అంత తీరగా నా ఒడిలో లాలిస్తా పద
ఆగనిదీ నా అడుగు ఎందుకనో నా ఎదనడుగు
ఏమో ఎక్కడ ఉన్నదో నా కలలో కదిలే చిన్నదీ
నీలో మాత్రం లేదులే నేనన్వేషించే ఆ చెలీ


ఆ....నా జత నీవే ప్రియా...

నే వెతికే కలల చెలీ ఇక్కడనే నా మజిలీ
జాడను చూపినదే మరీ నువు పాడిన తీయని జావళి
వెలిగించావే కోమలీ నా చూపులలో దీపావళీ
గుండెల్లో నీ మురళీ వెళ్ళదులే నన్నొదిలి
తెరిచే ఉంచా వాకిలీ దయచేయాలని నా జాబిలీ
ముగ్గులు వేసిన ముంగిలీ అందిస్తున్నది ప్రేమాంజలీ
ఈ.. రామచిలక సాక్ష్యం నీ.. ప్రేమ నాకే సొంతం
చిలిపి చెలిమి రాజ్యం మనమింక ఏలుకుందాం
కాలం చేరని ఈ వనం విరహాలకు వాడదు ఏక్షణం
కల నిజమై నిలిచినదీ మన జతనే పిలిచినదీ
ఆమని కోకిల తీయగా మన ప్రేమకి దీవెనలీయగా


********  *********  *********


చిత్రం: W/o వి. వరప్రసాద్ (1998)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర, యస్.పి.బాలు

అందం ఏమిటంటే అర్థం చెప్పమంటే
సందేహం ఎందుకింకా నువ్వేనంటా
నాట్యం ఏమిటంటే సాక్ష్యం చూపమంటె
నీ ప్రాయం ఆడుతుంటే చూడాలంటా
ఔనా చెప్పమంటే నువ్వేమో నవ్వుతుంటె
వెన్నెల్లో ఈదినట్టూ వుంటుందంట
అందం ఏమిటంటే అర్థం చెప్పమంటే
సందేహం ఎందుకింకా నువ్వేనంటా

స్వర్గమంటూ ఉంటుందని
చెప్పుకుంటూ ఉంటే వినీ
ఒట్టిదనుకున్నా ఇపుడొప్పుకుంటున్నా
నిను చూస్తుంటే నిజమేననీ
వయ్యారాలే వర్ణించుంటే ఇష్టంగా ఉండగా
కావాలంటే ఏమిమ్మన్నా ఇచ్చేసే తీరుగా
పాపం పైకి మాత్రం జాలేస్తు ఊరుకుండు
అంటూనే ఆశ చెప్పీ వింటూ ఉంది
అందం ఏమిటంటే అర్థం చెప్పమంటే
సందేహం ఎందుకింకా నువ్వేనంటా

చిన్నబోతావేమోనని
చెంతకొచ్చా పోన్లే అనీ
కన్నె సిగ్గంతా తెగ కందిపోతున్నా
సరదా తీర్చి పోదామనీ
ఐనా ఇంకా ఆసక్తుంటే కష్టంగా ఉండదా
అంతో ఇంతో ఔనంటున్నా అంతంటూ ఉండదా
పాపం గాలి కుట్టీ ఊ కొట్టీ ఊరిస్తుంటే
ఉప్పెనలా ఊపిరొచ్చి ఊపేసింది

అందం ఏమిటంటే అర్థం చెప్పమంటే
సందేహం ఎందుకింకా నువ్వేనంటా
నాట్యం ఏమిటంటే సాక్ష్యం చూపమంటె
నీ ప్రాయం ఆడుతుంటే చూడాలంటా
ఔనా చెప్పమంటే నువ్వేమో నవ్వుతుంటె
వెన్నెల్లో ఈదినట్టూ వుంటుందంట


Most Recent

Default