చిత్రం: పెళ్లి సందడి (1959)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: పి. లీల
నటీనటులు: నాగేశ్వరరావు, అంజలీ దేవి
దర్శకత్వం: డి. యోగానంద్
నిర్మాత: సీతారామ్
విడుదల తేది: 1959
అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా
అది తెలిసీ మసులుకో బస్తీ చిన్నోడా "అప్పటికీ"
బాల వయసు పెళ్ళిళ్ళ బాధలు పోయాయోయ్
ప్రేమించి పెళ్ళాడే రోజులోయి వోయి "అప్పటికీ"
చెప్పినట్లు పడి ఉండే కాలం పోయిందోయ్
చెప్పినట్లు పడి ఉండే కాలం పోయిందోయ్
తిప్పలు పెట్టారా తప్పవోయి విడాకులు "అప్పటికీ"
ఒకరి మీద ఇంకొకరు అదుపులు మానేసి
ఒకరి మీద ఇంకొకరు అదుపులు మానేసి
కలసి మెలసి సాగించే సంసారం స్వర్గమోయ్ "కలసి"
అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా
అది తెలిసీ మసలుకో బస్తీ చిన్నోడా
అది తెలిసీ మసలుకో బస్తీ చిన్నోడా
******** ******** ********
చిత్రం: పెళ్లి సందడి (1959)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: ఘంటసాల, పి. లీల
ఆమె : ఝమకు ఝమకు తారా
ఝణకు ఝణక్ సితారా
ఈ తారను విడిచి పోతారా?
అతడు : ఛమకు ఛమకు తారా
ఝణక్ ఝణక్ సితారా
నా తారను విడిచి పోతానా?
ఆమె : కలల మైకములో
కనుమూసి నేనుంటే "కలల"
సెలవు గైకొనకుండా
తరలిపోతారా "ఝమకు"
అతడు : కాలికి బందలై
నీ అందచందాలు "కాలికి"
కలకాలం నన్ను నీ ఖైదీ చేసెనే "ఝమకు"
ఆమె : రాగాల సరాగాలు ఏనాటికి
ఇలా సాగిపోయేన ముమ్మాటికి
అతడు : ఏ చోటనున్న ఏ నాటికైనా
నా చెలివి నీవే అను ఔనౌనను "ఝమకు"
******** ******** ********
చిత్రం: పెళ్లి సందడి (1959)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: ఘంటసాల, రావు బాలసరస్వతి దేవి
అతడు : రావే ప్రేమలతా
నీవేనా కవితా
కిన్నెర మీటుల కిలకిలనే
పలువన్నెల మెరపుల మిలమిలవే
ఆమె : ఓహో కవిరాజా
నేడే నెలరాజా
ఎందులకోయీ పరవశము
నీ కెందునకో ఈ కలవరము
అతడు : పూవులలో నును తీవెలలో
ఏ తావున నీవే వనరాణీ
పూవులలో నును తీవెలలో
ఏ తావున నీవే వనరాణీ
ఆమె : అందవతి కనుపించినచో
కవులందరి చందమిదేలే "రావే"
అతడు : పరువులిడే సెలయేరువలె
నిను చేరగ కోరును నా మనసు
పరువులిడే సెలయేరువలె
నిను చేరగకోరును నా మను
ఆమె : ఊహలతో ఉలికించుకుమా
నవమోహన ఈ చెలి మదినే "రావే"
ఆమె : ముచ్చటగా మనముండినచో
మన మచ్చికకు జగమేమన్నో
అతడు : లోకముతో మనకేమి పని
మనసేకమ్యి మనముంటే
ఆమె : నేనే నీ కవితా
అతడు : రావే ప్రేమలతా
******** ******** ********
చిత్రం: పెళ్లి సందడి (1959)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల జూనియర్
గానం: జిక్కీ (పి.జి.కృష్ణవేణి)
ఆమె : బైఠో బైఠో పెళ్ళికొడకా
అతడు : ఆల్ రైఠో రైఠో నా పెళ్ళికూతురా "బైఠో"
అతడు : అడ్రస్ తెలియక అల్లాడిపోతి అందాల పూబంది "అడ్రస్"
నిను చూచి నా దినం మొదలు నే మజ్నూనైపోతినే
హాయ్... మజ్నూనైపోతినే
హాయ్... మజ్నూనైపోతినే బైఠో
ఆమె : అయ్యో పాపమీ అవస్థ చూస్తే గుండె నీరుకాదా "అయ్యో"
వెళ్ళి వెదకు నీ చెలీ లైలను ఎడారీ దారులా "వెళ్ళి"
అతడు : హాయ్ ఎడారీ దారులా "బైఠో"
అతడు : వలచి నన్ను దయ తలచకున్న
నా తలను కోసుకుంటా
ఆమె : తలాతీసుకొను పనే లేదురా
నిన్నే చేసుకుంటా తలా
అతడు : హాయ్ అదే కావాలంటా "బైఠో"