Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Dharma Chakram (1996)




చిత్రం: ధర్మచక్రం (1996)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
నటీనటులు: వెంకటేష్, రమ్యకృష్ణ, ప్రేమ
దర్శకత్వం: సురేష్ కృష్ణ
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 13.01.1996



Songs List:



తమ సోమ మామ పాట సాహిత్యం

 
చిత్రం: ధర్మచక్రం (1996)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి. బాలు

తమ సోమ మామ 




ధీర సమీరే పాట సాహిత్యం

 
చిత్రం: ధర్మచక్రం (1996)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, చిత్ర

ధీర సమీరే యమునా తీరే
వసతివనే వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే
చెలి తగునా రసకేళి 
ఆకాశమే నా  హద్దుగా
నీ కోసమొచ్చా ముద్దుగా తెచ్చానురా మెచ్చానురా
గిచ్చేయి నచ్చిన సొగసుల్ని

ధీర సమీరే యమునా తీరే
వసతివనే వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే
చెలి తగునా రసకేళి 

వేసంగి మల్లెల్లో చితాంగి వెన్నెల్లో
వేసారి పోతున్నార రారా...
హేమంత మంచుల్లో ఏకాంత మంచంలో
వేటాడుకుంటున్నానే  నే నిన్నే
మొటిమ రగులు సెగలో తిరగబడి
మడమ తగులు వగలో
చిగురు వణుకు చలిలో మాధనుడికి
పొగరు పెరిగే పొదలో
గోరింట పొద్దుల్లోనా పేరంటాలే ఆడే వేళా

ధీర సమీరే యమునా తీరే
వలచితి నే వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే
ప్రియ తగునా రసకేళి 

లేలేత నీ అందం నా గీత గోవిందం
నా రాధ నీవే లేవే రావే...
నీ గిల్లి కజ్జాలు జాబిల్లి వెచ్చాలు
నా ఉట్టి కొట్టేస్తున్నా రావా...
వయసు తెలిసే ఒడిలో
ఎద కరిగి తపన పెరుగు తడిలో
మనువు కుదిరే మదిలో
ఇంకిపుడు చనువు ముదురు గదిలో
వాలారు సందెల్లోన వయ్యారాలు  తాకే వేళా...

ధీర సమీరే యమునా తీరే
వలచితి నే వనమాలి
ఆ గ్రామ సమీపే ప్రేమ కలాపే
ప్రియ తగునా రసకేళి 
ఆకాశమే నా  హద్దుగా
నీ కోసమొచ్చా ముద్దుగా 
తెచ్చానురా మెచ్చానురా
గిచ్చేయి నచ్చిన సొగసుల్ని

ధీర సమీరే యమునా తీరే
వసతివనే వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే
చెలి తగునా రసకేళి 




చెప్పనా చెప్పనా పాట సాహిత్యం

 
చిత్రం: ధర్మచక్రం (1996)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యమ్.యమ్.శ్రీలేఖ, యస్.పి.బాలు

చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
హా కళ్ళలో మనసులో ఉన్న మాట
కన్నులే మనసుతో
చెప్పకే చెప్పుతున్న మాట
చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట

నువ్వు నేను ఏకమంట 
నాకు నువ్వు లోకమంట
కళ్ళలోన ఇల్లు కట్టనా
ఇలాగే తడబడి రానా
భలేగా ముడిపడిపోనా
వెన్నెలింట వద్దకొచ్చి
కన్నెపైట కానుకిచ్చి
వన్నెలన్ని అప్పగించనా
ఫలించే తపనల వెంట
భరించి త్వరపడమంట
హో సరేలే సరసాలమ్మో 
స్వరాలే పలకాలమ్మో
చలేసే నీరెండల్లో కన్నెగుండెలో

చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట

తేలిపోయే లేతఒళ్ళు
వాలిపోయే చేపకళ్ళు
ఆకతాయి చేయి తాకితే
అదేదో తెలియని హాయి
ఇదంటూ తెలిసిన హాయి
అరెరె ఒద్దికైన చోటు ఉంది
హద్దులేని చాటు ఉంది
ముద్దులిచ్చి పొద్దుపుచ్చనా
కులాసా కులుకులలోన
భరోసా తెలుపగ రానా
హో ఎదల్లో సరదాలయ్యో 
పదాలే ఎదిగేనయ్యో
చలాకీ నీ సందిట్లో ఎన్ని విందులో

చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
హ కళ్ళలో మనసులో ఉన్న మాట
కన్నులే మనసుతో 
చెప్పకే చెప్పుతున్న మాట

చెప్పనా చెప్పనా చిన్న మాట
చెప్పుకో చెప్పుకో ఉన్న మాట





హాల్లో హాల్లో ఐ వాంట్ పాట సాహిత్యం

 
చిత్రం: ధర్మచక్రం (1996)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి. బాలు, చిత్ర

హాల్లో హాల్లో ఐ వాంట్ యాన్ ఇంటర్వ్యూ
లవ్ ఛానల్ లో గివ్ మి యాన్ ఇంటర్వ్యూ
వెల్కమ్ పలికే నా దూరదర్శన్ 
ఉలుకు పలుకు చేసేయ్ ప్రదర్శన్
దొరికే మనకు లవ్లీ లొకేషన్
మళ్ళి మళ్ళి రాదీ అకేషన్
సిక్స్ ఓ క్లాక్ కి సిగ్గుపడ్డ ఈడులో

హాల్లో హాల్లో ఐ వాంట్ యాన్ ఇంటర్వ్యూ
లవ్ ఛానల్ లో గివ్ మి యాన్ ఇంటర్వ్యూ

ఏరి నన్ను కోరుకున్న స్టార్ హీరో గ్లామరున్న 
పిల్లదాని ఇంటిపేరు ఏంటినా
ఆన్సరే చెప్పనా స్పాన్సరే చెయ్యనా
వల్లనంటే ఊరుకోను ఆపైన
సౌత్ లోన నార్త్ లోన ఈస్ట్ లోన వెస్ట్ లోన
అందమంత టెలికాస్ట్  చేస్తాలే
డీపీఎల్ సైన్ లు స్క్రీన్ పై రోమియో
సందేవేళ మరేమగీతి రాస్తాలే
నీ లేత లిప్స్ లిప్స్ శృంగార చిప్స్ చిప్స్
నీ కొంటె లుక్స్ లుక్స్ గుండెల్లో కిక్స్ కిక్స్
చీకట్లో అంతరాయముకు చింత ఎందుకంట
మిగతా బాగం నెక్స్ట్ వీక్ చూద్దమంట

హాల్లో హాల్లో ఐ వాంట్ యాన్ ఇంటర్వ్యూ
లవ్ ఛానల్ లో గివ్ మి యాన్ ఇంటర్వ్యూ
వెల్కమ్ పలికే నా దూరదర్శన్ 
ఉలుకు పలుకు చేసేయ్ ప్రదర్శన్
సిక్స్ ఓ క్లాక్ కి సిగ్గుపడ్డ ఈడులో

విన్నపాల వీడియోలో వన్నె పూల ఆడియోలో
వెన్ను తట్టు చిన్నదాని స్టూడియోలో
ఇంతజార్ చేసుకో చిత్రహార్ చూసుకో
కొత్తమోజు రాజుకున్న మీడియాలో
రంగుటీవి పొంగులన్ని రంగరించి కానుకిస్తే
చంగుమంటు ఈడు చిందులాడేలే
స్విచ్ లే మీటనా ముచ్చటే తీర్చనా
రెచ్చిరేగి సొంపులన్ని నావేలే
బుగ్గల్ని గిల్లు గిల్లు గిల్లు
సిగ్గంత నిల్ నిల్ నిల్
మోగిస్తా బెల్ బెల్ బెల్
చూపిస్తా థ్రిల్  థ్రిల్ థ్రిల్
న గుట్టు రట్టు చేయటకు బెట్టు ఎందుకట లేటనకుండా లేత వన్నె లిచ్చుకుంటా

హాల్లో హాల్లో ఐ వాంట్ యాన్ ఇంటర్వ్యూ
లవ్ ఛానల్ లో గివ్ మి యాన్ ఇంటర్వ్యూ
హా వెల్కమ్ పలికే నా దూరదర్శన్ 
ఉలుకు పలుకు చేసేయ్ ప్రదర్శన్
దొరికే మనకు లవ్లీ లొకేషన్
మళ్ళి మళ్ళి రాదీ అకేషన్
సిక్స్ ఓ క్లాక్ కి సిగ్గుపడ్డ ఈడులో




సొగసు చూడ పాట సాహిత్యం

 
చిత్రం: ధర్మచక్రం (1996)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్. పి. బాలు, చిత్ర

సొగసు చూడ హాయి హాయి లే
తెలిసె నేడు ఇంత హాయి హాయి
చెలియ చూపు నీకు హాయి లే
చెలిమి లోన ఉంది హాయి హాయి
అందాలు చూడ జన్మ చాలునా
అందించగానే ఆశ తీరునా
అహో ఇదెంత వింత మొహమో

సొగసు చూడ హాయి హాయి లే
తెలిసె నేడు ఇంత హాయి హాయి

నువ్వంటే నేనంటు నేనంటే నువ్వుంటు 
నీవెంటే నేనుండనా
నీ నవ్వే ముద్దంటు ఇంకేమి వద్దంటూ ముడిపడినా
నీకోసం పుట్టాను నీ దారే పట్టాను నీ మీదే ఒట్టేయనా
నాచేత చేయ్యెట్టు నన్నిట్ట జోకొట్టు ఒడిలోన 
చెట్టా పట్టా కట్టే దెట్టో ఇట్టే చెప్పేయాలమ్మో
చెట్టు పుట్టా చూసేవేళ తప్పేదెట్టయ్యా
కుమారి చెంప కెన్ని కెంపులో
భరించు కళ్లకెన్ని రంగులో
అహో ఇదెంత వింత మోహమో

సొగసు చూడ హాయి హాయి లే
తెలిసె నేడు ఇంత హాయి హాయి హాయి

నా పాల బుగ్గల్లో దీపాల సిగ్గుల్లో నీ పాలు పంచివ్వనా
నీ వెంట వెన్నెల్లో నీ గుండె చప్పుల్లు వినలేనా
హద్దుల్నే దాటాలి  వద్దన్నా చూడాలి నీ కన్నె కవ్వింపులు
కాదన్నా లేదన్నా కౌగిట్లో పాడాలి పదనిసలు
నిన్నా మొన్నా లేనే లేని వైనం ఎంతో బాగుంది
వన్నె చిన్నే ఊరించాకే ప్రాణము లాగింది సయ్యటలాడు ఎంత తొందరా
వయ్యారి ఈడు కెన్ని చిందులో
సుఖాల తీరమెంత దూరమో

సొగసు చూడ హాయి హాయి లే
తెలిసె నేడు ఇంత హాయి హాయి
చెలియ చూపు నీకు హాయి లే
చెలిమి లోన ఉంది హాయి హాయి
అందాలు చూడ జన్మ చాలునా
అందించగానే ఆశ తీరునా
అహో ఇదెంత వింత మొహమో




ఆగదాయే రణం పాట సాహిత్యం

 
చిత్రం: ధర్మచక్రం (1996)
సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు

ఆగదాయే రణం 

Most Recent

Default