Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: జర్నీ (2011)
సంగీతం: సి.సత్యా
సాహిత్యం: సాహితి
గానం: కార్తీక్
నటీనటులు: శార్వానంద్, జై ,  అనన్య, అంజలి
దర్శకత్వం: యమ్.శరవన్
నిర్మాత: సురేష్ కొండేటి
విడుదల తేది: 16.12.2011

మేఘమా నీలి మేఘమా
ఎదురు చూశానీ పూల జల్లుకి
వర్షమా వలపుల వర్షమా
కాచుకున్నానీ మొదటి ముద్దుకి
కన్ను మూయల చెవి మోగల
ముద్ద మింగల నోట నవ్వల
చెయ్యి ఊపల కాలు కదపల
ఆ విసుగులో ఏమెరుగల

ఓ మేఘమా  మేఘమా ఎదురుచూశానే
మేఘమా నీలి మేఘమా
ఎదురు చూశానీ పూల జల్లుకి

రోడ్ లోన చూడాలా పార్క్ లో చూడాలా
బస్ లో చూడాలా ఆటోలో చూడాలా
థియేటర్ లో చూడాలా స్ట్రీట్ లో చూడాలా
చూశాను అల్లంత దూరంలో...
గాలిలో నిలవాల భూమిలో నిలవాల
అక్కడ నిలవాల ఇక్కడ నిలవాల
నిలవాల నిలవాల ఎక్కడ నిలవాల
నిలిచాను ఆ పిల్ల గుండెలో...
నిలిచిందో పిలిచిందో వీధిలో
నేను గమనించుకోలేదు మొదటిలో
నే ఎదురు చూశాలే పూలకొమ్మకి

మేఘమా నీలి మేఘమా
కాచుకున్నానీ మొదటి ముద్దుకి

నంబర్ అడగాల ఫోన్ చెయ్యాలా
అడ్రస్ అడగాల లవ్ లెటరివ్వాళ
ఫాలో చెయ్యాలా కబురు పంపాల
ఎలా వచ్చింది ఎదురులో...
ప్లీస్ చేయాలా జగడాలాడాల
మిడిమీరి చూడాలా నవ్వుతూ మాట్లాడాలా
వీధిలో అపాల చెయ్యి పట్టాల ఎట్లా పడ్డాది ప్రేమలో
నేను క్యాచ్ చేయి పోయేటి నవ్వుతో
నాకు మ్యాచైపోయింది లైఫ్ లో
నేను ఎదురు చూశాలే నా పూల కొమ్మకి

మేఘమా నీలి మేఘమా
నాకు నీ ప్రేమే కావాలిలే నువ్వే కావాలిలే
కన్ను మూయల చెవి మోగల
ముద్ద మింగల నోట నవ్వల
నాకు నీ ప్రేమే కావాలిలే


*********   **********   **********


చిత్రం: జర్నీ (2011)
సంగీతం: సి.సత్యా
సాహిత్యం: సాహితి
గానం: అనురాధ శ్రీరామ్

సయ్యా...  సయ్యా...

నీ పేరే తెలియదుగా నిను పిలవగ లేను కద
నే నీకో పేరిడిన నీకే తెలియదుగా
ఆ పేరే విననోళ్లు మరి ఎవ్వరు లేరు కదా
ఆ పేరొకపరి వింటే నిద్దుర రాదు సుమా
నే ప్రతి రోజు నిన్ను తలచి పులకించన
నా మిన్నంటు మమతలతో  నిను మించినా
ఓ ఆ పేరు వెచ్చని కిరణం పలికేటి పెదవుల మధురం
సూర్యుడే నీవనుకుంటే సరికాదులే

ఓ ఆ పేరు చిరు చలికాలం వినగానే జిల్లాను హృదయం
నది అని నువ్వనుకుంటే అది కాదులే
కదలని ఆ శిల కాదు బెదిరించే పులికాదు
తన పేరిక ఏదైనా అది మరుపేరే కాదు
నా పేరుతో చేరే పేరే నే చెప్పనా...

మహా పెద్ద పేరే తనది గొంతు మరి కొరపోతుంది
అక్షరాలెన్నని అంటే అంతుతెలియదే
ఓ అతి చిన్న పేరే తనది చిటికెలో అయిపోతుంది
ఆ పేరు తీరుని తెలిపే బాషలేదులే
అధరాల కలయికగా ఆ పేరే పలుకంగా
అది తేటల తెలుగువలె విరితేనెలు తొణికెనులే
నా పేరుతో చేరే పేరే నే చెప్పనా

నీ పేరే తెలియదుగా నిను పిలవగ లేను కద
నే నీకో పేరిడిన నీకే తెలియదుగా
నే ప్రతి రోజు నిన్ను తలచి పులకించన
నా మిన్నంటు మమతలతో  నిను మించినా

Most Recent

Default