Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Manjula Vijayakumar"
Picchi Maaraju (1976)



చిత్రం: పిచ్చిమారాజు (1976)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల, యస్.పి.బాలు
నటినటులు: శోభన్‌బాబు,మంజుల
దర్శకత్వం: వి.బి. రాజేంద్రప్రసాద్
నిర్మాత: వి.బి. రాజేంద్రప్రసాద్
విడుదల తేది:09.01.1976



Songs List:



సింగినాదం జీలకర్రరో పాట సాహిత్యం

 
చిత్రం: పిచ్చిమారాజు (1976)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

సింగినాదం జీలకర్రరో
అసలు సంగతేమొ గుండుసున్నరో
సింగినాధం జీలకర్రలే
మన సంగతంత నిండుకుండలే

ఆకు తోటకాడ నన్ను ఆకలిగా చూశావు 
చీకటడే దాక చూస్తూ చెట్టులా నిలిచావు 
ఎట్టారా.... ఏగేది నీతోటి
ఏం చేయమంటావురో చూపుతోటి

ఆకు తోటలో ఎట్లా బంతిపువ్వు పూచెననీ 
అమావాస చీకట్లో జాబిలేట్టా వచ్చెననీ 
చూసుండిపోయానే.... నీ వైపు
నీ చూపుల్లో వున్నదే ఆ కైపు

జొన్న చేను బాగుండి రమ్మంటే వచ్చాను 
మంచె దించమంటే నీ మొలపట్టి దించాను 
నా వైపు చూశావు జాణల్లె 
నవ్వేసి వెళ్లావు మెరుపల్లె
కంకి చూచెన నీకు కాక పుటువనుకున్నా 
నడుం పట్టినపుడైనా నలిగి పోతాననుకున్నా 
నరాలో పులుపులేని చిన్నోడా 
నవ్వకేం చేసేది పిచ్చోడా




నిక్కి నిక్కీ చూశావో పాట సాహిత్యం

 
చిత్రం: పిచ్చిమారాజు (1976)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

చర్ - బొప్పాయ్ గుండూ 
నిక్కి నిక్కీ చూశావో 
నీ డొక్క చించుతారో డోలు కడతారో 

ఈగను మింగే కప్పుందీ 
కప్పను మింగే పాముందీ 
పామును తన్నుకు పోయేటందుకు 
గద్ద ఎప్పుడూ ఎగురుతు ఉంది 
ఈ పరమ రహస్యం తెలియకపోతే 
కుక్క కాటుకు చెప్పుదెబ్బరోయ్
చరు గుడు చడు గుడు

నీ అబ్బ చచ్చినాడు వాడబ్బి చచ్చినాడూ 
ఎవడూ ఏదీ పోతూ పోతూ కట్టుకు పోలేడూ 
బ్రతికేవాడికి చావుందీ - చచ్చేవాడికి బ్రతుకుందీ 
చచ్చినవాడు బ్రతికినవాడు చేరేచోటు ఒకటుందీ 
ఈ పరమ రహస్యం తెలియకపోతే
కుక్క కాటుకు చెప్పుదెబ్బరోయ్
చడు గుడు చడు గుడు

చేనును మేసే కంచుందీ - కంచెను నరికే కత్తుంది 
కత్తులు నూరే కసాయివాణి చిత్తుగ దంచే చెయ్యుందీ 
ఈ పరమ రహస్యం తెలియకపోతే
కుక్క కాటుకు చెప్పుదెబ్బరోయ్
చడు గుడు చదు గుడు




ఓ కుర్రవాడా - వెర్రివాడా పాట సాహిత్యం

 
చిత్రం: పిచ్చిమారాజు (1976)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ఓ కుర్రవాడా - వెర్రివాడా 
ఎందుకిలా నువ్వెందుకిలా 
నన్నొదిలి యిలా పారిపోతావు
ఓ కుర్రదానా - వెర్రిదానా 
ఎందుకిలా - నువ్వెందుకిలా 
నన్నొదలకిలా తరుముకొస్తావూ 

నేలకు నింగికి కలవదమ్మా 
నీకు నాకు పొ త్తెపుడు కుదరదమ్మా
నింగిలోని వెన్నెలంత నేలకే సొంతము 
నీకూ నాకూ ఉన్నది అదే బంధము
చల్లగాలి ఊరుకోదూ - పిల్ల మనసు ఓర్చుకోదుగా

ఓర్చుకోనీ పిల్ల దాన్ని ఓపలేను ఆపలేను 
ఏం చేయమంటావు నన్ను
నన్నెలా వదలమంటావు నిన్ను

అందాలతో నాక బంధాలు వేయకు 
పిచ్చివాణ్ణి మరీ మరీ రెచ్చగొట్టకు
రెచ్చితే పిచ్చి ఎంతో ముచ్చటగ ఉంటుంది 
ముచ్ఛటైన కౌగిట్లో పిచ్చి కుదిరిపోతుంది





ఎలుక తోలు తెచ్చి పాట సాహిత్యం

 
చిత్రం: పిచ్చిమారాజు (1976)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా 
అయ్యో కుక్కతోక పట్టి గోదావరి ఈదినా 
ఏమిఫలము రామరామా విశ్వదాభి రామరామా
అయ్యో రామరామా రామరామా

పాలతో కడిగినా బొగు తెల గరాదు
పూలతో కలిసినా నార పువ్వయిపోదు 
బొగ్గు మారీ మారి రత్నమవుతుందీ 
పూవు వాసన కాస్త వారకొస్తుందీ 

మతిలేని వాడికీ పసిపిల్ల వాడికీ 
మట్టి బొమ్మిచ్చినా మనసిచ్చినా ఒకటే 
మనుషికి బొమ్మకూ మనసొకటె తేడా 
అది తెలియనప్పుడు బ్రతుకే బొమ్మల ఆటా 

కళ్ళలోని ఎరుపు కోపాని కర్దమూ 
కన్నె మనసున ఉన్న తాపాని కద్దమా ఎ
రుపు జీరల కళ్లు వలపుటద్దాలు 
కలిపి చూస్తేకాని తెలియవర్ధాలు




కొత్త పిచ్చోడూ పొద్దెరగడు పాట సాహిత్యం

 
చిత్రం: పిచ్చిమారాజు (1976)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

కొత్త పిచ్చోడూ పొద్దెరగడు 
కొంగులాగి - లొంగదీసి 
కొంప ముంచేట్టు ఉన్నాడు
కొత్త పిచ్చోడూ పొద్దెరగడు 
కొంగులాగీ - లొంగదీసి
కొంప ముంచేట్టు ఉన్నాడు

హద్దు, హద్దంటే - అది 
వద్దువదంటూ వస్తాడు
వద్దు వద్దంటే ఒక 
ముద్దు ముద్దంటూ ఇస్తాడు
హద్దు చూశావో - నీ 
ముద్దు మనసిచ్చినప్పుడు
ఒద్దిక య్యాక - ఇది
పొద్దు కాదంటే ఊరుకోడు

పిచ్చి కుదిరింది - ఇక
పెళ్ళి కావాలి అన్నాడు 
పెళ్ళి కుదిరింది
సరికొత్త పిచ్చాడు అయ్యాడు
చూడు చూడండె
కళ్ళు మూసుకున్నాడు అప్పుడు 
చూడ వద్దంటే
కన్నుగీటి పిలిచాడు ఇప్పుడు

పట్టపగలంటె జడుపేల దరిచేరమంటాడు 
బట్టబయలంటే నాపైట తెరమరుగు చేస్తాడు
నీ నగలు చూస్తుంటే - యీ పగలే రేయల్లె తోస్తుంది. 
మాట ఏదైనా అది మనసు గుట్టంతా చెపుతుందీ




ఆ గుట్టు ఈగుట్టు పాట సాహిత్యం

 
చిత్రం: పిచ్చిమారాజు (1976)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

ఆ గుట్టు ఈగుట్టు
పై గుట్టు లో గుటు 
పెరుమాళ్ల కెరుకరో
నాపట్టు నాగుట్టు 
నాతోటి జతకట్టు 
మొనగాళ్ల కెరుకరో 
కుర్రదాని గుండెలో దూరలేవు
దూరినా గుట్టంతా దోచలేవు

ఆడదాని వయసు చూసీ
అయ్యయ్యో ఆశ పడకు
దాని మనసేంటో తెలుసుకోకా 
అమ్మమ్మా ఆడుకోకు
తాగు తాగించు; నిషా ఎక్కించు
మజా చూపించు; ఖుషీ చేయించు 
ఏం చేశినా ఆడుకున్న కాసేపే గమ్మత్తురో
ఆపైన నీ ఆట గల్లంతురో

ఎంతెంత మగధీరులో
మీసాలు దువ్వినారు
దీని అంతు తేల్చుకుందామనీ
వేషాలు మార్చినారు
మధువు పోశాను పెదవి కలిపాను
వగలు పోయాను శెగలు లేపాను ఏం చేసినా

వంగతోటకాడ మాత్రం బావ కాదురోయ్ 
పందెమేసి ఎవ్వడూ నిలువ లేదురోయ్

Palli Balakrishna Thursday, October 26, 2023
Manushulu Matti Bommalu (1974)



చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974)
సంగీతం: బి. శంకర రావు (ఘజల్ శంకర్ ) 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
నటీనటులు: కృష్ణ , జమున, సావిత్రి 
దర్శకత్వం: బి. భాస్కర్ 
నిర్మాత: టి. కృష్ణ 
విడుదల తేది: 31.05.1974



Songs List:



అమ్మా అని నోరారా పిలవరా పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974)
సంగీతం: బి. శంకర రావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

అమ్మా అని నోరారా పిలవరా 



ఓరోరి మల్లన్న సోంబేరి మల్లన్న పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974)
సంగీతం: బి. శంకర రావు
సాహిత్యం: కొసరాజు 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

ఓరోరి మల్లన్న సోంబేరి మల్లన్న 



నిన్ను కోరేది వేరేమి లేదురా పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974)
సంగీతం: బి. శంకర రావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

నిన్ను కోరేది వేరేమి లేదురా 




నీలో విరిసిన అందాలన్నీ పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974)
సంగీతం: బి. శంకర రావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం:  యస్.పి. బాలు, పి. సుశీల 

నీలో విరిసిన అందాలన్నీ నాలో వీడని బంధాలాయె
ఓ ఓ ఓ... నీలో పలికిన రాగాలన్నీ నాలో శ్రావణ మేఘాలాయె
ఊఁ ఊఁ.. నీ..లో విరిసిన అందాలన్నీ నాలో వీడని బంధాలాయె
అల్లరి గాలి నిమిరే దాకా మల్లె మొగ్గకు తెలియదు ఏమనీ
తానొక తుమ్మెదకై తపియించేననీ తానొక తుమ్మెదకై తపియించేననీ
మూగ కోరికా ముసిరే దాకా మూగ కోరికా ముసిరే దాకా
మూసిన పెదవికి తెలియదు  ఏమనీ
తానొక ముద్దుకై తహతహలాడేనని తానొక ముద్దుకై
తహతహలాడేనని
ఆ కోరికలే ఇద్దరిలోనా ఆ కోరికలే ఇద్దరిలోనా కార్తీక పూర్ణిమలై
వెలగాలి
నీలో విరిసిన అందాలన్నీ నాలో వీడని బంధాలాయె
ఓ ఓ ఓ...

మధుమాసం వచ్చే దాకా మామిడిగున్నకు తెలియదు ఏమనీ
తానొక వధువుగా ముస్తాబైనాననీ తానొక వధువుగా ముస్తాబైనాననీ
ఏడడుగులు నడిచేదాకా ఏడడుగులు నడిచేదాకా
వధూవరులకే తెలియదు ఏమనీ
ఆ ఏడడుగులు ఏడేడు జన్మల బంధాలనీ ఆ ఏడడుగులు ఏడేడు
జన్మల బంధాలనీ

ఆ బంధాలే ఇద్దరిలోనా ఆ బంధాలే ఇద్దరిలోనా కార్తీక పూర్ణిమలై
వెలగాలి
దేహమే దేవాలయం
నీలో విరిసిన అందాలన్నీ నాలో వీడని బంధాలాయె
ఓ ఓ ఓ... నీలో పలికిన రాగాలన్నీ నాలో శ్రావణ మేఘాలాయె



పాగలపైన బూసోడమ్మా ఆ పోకిరోడు పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974)
సంగీతం: బి. శంకర రావు
సాహిత్యం: కొసరాజు 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

పాగలపైన బూసోడమ్మా ఆ పోకిరోడు 



భాషకు అక్షరాలెంతో పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974)
సంగీతం: బి. శంకర రావు
సాహిత్యం: మోదుకూరి జన్షన్
గానం: యస్.పి. బాలు

భాషకు అక్షరాలెంతో




మట్టినే మనిషిగా మలచేవు పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974)
సంగీతం: బి. శంకర రావు
సాహిత్యం: మోదుకూరి జన్షన్
గానం: యస్.పి. బాలు

మట్టినే మనిషిగా మలచేవు 




నవ్య మానవ జాతి దివ్వివై వెలిగావు పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974)
సంగీతం: బి. శంకర రావు
సాహిత్యం: మోదుకూరి జన్షన్
గానం: యస్.పి. బాలు

నవ్య మానవ జాతి దివ్వివై వెలిగావు 

Palli Balakrishna Saturday, June 10, 2023
Galipatalu (1974)



చిత్రం: గాలి పటాలు (1974)
సంగీతం: టి.చలపతిరావు 
సాహిత్యం: శ్రీ శ్రీ, ఆరుద్ర, దాశరథి, కొసరాజు రాఘవయ్య, ఆచార్య ఆత్రేయ
నటీనటులు: కృష్ణ, విజయ నిర్మల, మంజుల విజయ్ కుమార్ 
మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ 
నిర్మాత, దర్శకత్వం: టి.ప్రకాశ రావు 
విడుదల తేది: 01.03.1974



Songs List:



ఈ జీవితాలు పాట సాహిత్యం

 
చిత్రం: గాలి పటాలు (1974)
సంగీతం: టి. చలపతిరావు 
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: మాధవపెద్ది సత్యం 

సాకి:
ఈ జీవితాలు ఎగ చేసిన గాలిపటాలు
కనిపించని చెయ్యేదో విసిరేసిన జాతకాలు

పల్లవి:
ఈ జీవితాలు ఎగరేసిన గాలిపటాలు
కనిపించని చెయ్యేదో విసిరేసిన జాతకాలు
ఈ జీవితాలు ఎగరేసిన గాలిపటాలు
కనిపించని చెయ్యేదో విసిరేసిన జాతకాలు

చరణం: 1
కన్నులులేని యీ చట్టానికి
చెవులున్న విధానరురా పామరుడా...
చేసిన నీ ప్రతిపాపానికి ఒక - శిక్ష కలదురా

చరణం: 2
దారితప్పి దిగజారిన బ్రతుకులు-
దారంతెగిన గాలిపటాలు
వేసెఅడుగు తీసేపరుగు-
చూసేవాడొకడున్నాడు -దేవుడున్నాడు

చరణం: 3
తెలుపు నలుపు చదరంగంలో 
మానవులంగా పావులురా
తెలిసి చేసినా తెలియకచేసిన
తప్పు ఒప్పుగా మారదురా - పామరుడా...




బావా బావా పన్నీరు పాట సాహిత్యం

 
చిత్రం: గాలి పటాలు (1974)
సంగీతం: టి. చలపతిరావు 
సాహిత్యం: దాశరథి 
గానం: పి.సుశీల 

బావా బావా పన్నీరు
బావను పట్టీ తన్నేరు
చేసులోకి లాగేరు.
చెంపముద్ర వేసేరు

కొంకుచూపు చూడలేవు
కొంగుపటి లాగ లేవు-
గుబురు చాటుగా నాతో
ఊసులైన చెప్పకుంటే 
గుసగుసలే ఆడకుంటే 
పసుపురాసి కాటుక దిద్ది 
చీరెలు పెడతా లేవోయ్

ఉత్తరాలు రాయలేవు.
ఒక్కపాట పొడలేవు
చెరువుగటు పై వాతో
సుద్దులైన చెప్పకుంటె 
ముద్దులైన తీర్చకుంటె 
కొండమీద గుళ్లో నీకు
పెళ్ళిచేస్తా లేవోయ్

ఒంటరిగా వేగలేవు
తోడులేక సాగలేవు
జంట జంటగా నాతో 
సవ్వనైన నవ్వకుంటె 
కళ్ళతో కవ్వించకుంటే 
మెడలువంచి మూడుముళ్లు
నేనే వేస్తాలేవోయ్




తందానా నందాన పాట సాహిత్యం

 
చిత్రం: గాలి పటాలు (1974)
సంగీతం: టి. చలపతిరావు 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: యస్.పి.బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి & బృందం 

తందానా నందాన అందాలా కథవేస్తే
దమ్ముంటే విప్పాలోయ్ 
అకాశముందన్నారు అవునో కాదో చెప్పాలోయ్

తందానా నందాన అందాలా కథవేస్తే
సైయ్యంటూ విప్పేస్తా దమ్మేంటో చూపిస్తా

ఒక్కరు తిరుగుతు వుంటారు 
ఒక్కరు తోడుగ వుంటారు
వచ్చినపని సాధించి 
ఇద్దరు ఒక్కచోటికే వెళతారు

ప్రతియింటిలోనే వారుంటారు
ఇద్దరు ఒద్దికగావుంటారు 
అవసరమైతే కదిలొస్తారు 
అందరికి పనికివస్తారు

ఎవరోకారండీ వారు తిరగలిగారండి

తిరుగుతు పప్పులు చెప్తారండి

కళ్లులేని ఒక కబోది 
కాల్లులేని ఒక కుంటోడు
ముక్కుమాత్రమే వుందండి 
మూడులోకములు తిరిగేనండి 
ఎవరండి వారేంపని చేస్తారు ?

తోడులేనిదే నడవరు తాడులేనిదే కధలరు
పిల్లల చేతిలో కీలుబొమ్మ 
వల్ల విస్తాడే ముద్దులగుమ్మ 
ఎవరోకాదండి రింగులు తిరిగే బొంగరమండి

ముగ్గురు కన్నెలు వున్నారు ముచ్చటగా ఒకటయ్యారు
ముగ్గురుకలసి ఒక్క మగనితో తలవాకిట రమియిస్తారు.
ఎవరండీ వారు వారేంపని చేసారు ?

నల్ల తెల్లని కన్నెలిద్దరు పచ్చపచ్చని పడతి ఒక్కరు
ముగ్గురు ఒకటే మన పెదవుల పై ముద్రలు వేసిపోతారు
ఎవరండి వారు.....?
తాంబూలంగారూ వారు తమాష చేస్తుంటారు

రంపపుకోరలువున్నవిగాని 
రాక్షసజాతికి చెందరు వారు
ఎవరు ?
పులి... నంది... సింహం
ఆ కాదు... కాదు ... కాదు

చీరెలు చూస్తే ఎంతో ప్రేమ 
చిక్కితె మాత్రం దుమా దుమా 
ఎవరు ?
చీమ్మలు ... బొద్దింక
కాదు.... కాదు

పాతాళంలోకాపురమున్నా
భూతలమ్ము పై విహరిస్తారు
పాము... నక్క
కాదు ... కాదు... హేయ్
ఎవరో కారండీ వారు
ఎలుక బావగారు....





అరెరే... ఓ చిలకమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: గాలి పటాలు (1974)
సంగీతం: టి. చలపతిరావు 
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య 
గానం: యస్.పి.బాలు

అరెరే... ఓ చిలకమ్మా
పొంచివుంది గండుపిల్లి కాచుకో చూచుకో
అరెరే .. ఓ చిలకమ్మా- అందాలా చిలకమ్మా

పొంచివుంది గండుపిల్లి కాచుకో చూచుకో
దెబ్బ కాచుకో- చూచుకో

మంచినీళ్ళ బావికాడ–నీళ్లుతోడే చిన్నదాన
కోరలున్న కోడెనాగు బుసలు కొట్టుతూ వున్నాది 
బుసలు కొట్టుతూ వున్నాది . విషము చెక్కుతున్నాది 
పడగలిప్పి అడుతోని కాచుకో
కాచుకొ—చూచుకో

సంగనాచి నక్కతోడు దొంగలాగా నొక్కినాడే
సందుజూచీ కళ్ళుమూసీ పందికేసి నొక్కుతాడే
ఒంటిదాన్ని నిన్నుజూచి - వెంట వెంట బడతాడు.
ఎంత కైన చాలినోడు కాచుకో
చూచుకో కాచుకో
దెబ్బకాచుకో- చూచుకో




నీ కన్నులునను కవ్విస్తే పాట సాహిత్యం

 
చిత్రం: గాలి పటాలు (1974)
సంగీతం: టి. చలపతిరావు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల & బృందం 

హేయ్ .. హేదు. ... హేయ... హేయ్ ... య... హేయ్ ...
లలల్ల లలల్ల లలల్ల  లలల్ల ఇలా ఇలా 
నీ కన్నులునను కవ్విస్తే నీ పెదవులు నాశందిస్తే 
నీ చేతులు నను పెనవేస్తే
హెయ్...అబ్బో అబ్బో అబ్బో  ఆగలేనురా 
అమ్మె అమ్మొ అమ్మొ తాళలేనురా 
చేరుకొమ్మండ
నా చిలిపివయసు చెలరేగి నిన్ను జత చేరుకోమందిరా 
నా జిలుగు పైట అందాలు చిలుకుతు కులుకుతుందిరా 
కరిగే రేయి పెరిగే హాయి కైపేదో రేపిందిరా 

బుగ్గమీద చిటికేసిచూడు పులకించి పోయేవురా 
నా నడుముమీద చేయి వేసి చూడు సుడితిరిగిపోయేవురా 
జతగా కలిసి జగమే మరచి సరసాల తేలాలిరా




భోజనకాలే హరినామస్మరణా పాట సాహిత్యం

 
చిత్రం: గాలి పటాలు (1974)
సంగీతం: టి. చలపతిరావు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: మాధవపెద్ది పత్యం, వినోద్ కుమార్, బృందం

భోజనకాలే హరినామస్మరణా గోవిందా గోవిందా
గోవింద అనరా గోపాల అనరా
అనుకుంటే అంతా మాయరా నరుడా,
అంతా మాయరా
విన కుంటె నీదే ఖర్మరా నరుడా నీదే ఖర్మరా 
దొరలంతా గజ దొంగల్లా దోచుకుతింటే
దొంగలేమొ దొరబాబుల్లా తిరుగుతువుంటే 
దొరలు ఎవరో దొంగలు ఎవరో
తెలుసుకుంకె వారే వీరు ఏరే వారు 
అంతా ఒకటేరా
పులి వేటకు వచ్చిన బంటుపిల్లిని కొట్టి
ఆ బంకు కొండను తవ్వి ఎలుకను పట్టి 
దిక్కులుచూచి ఏమిటిలాబం... ?
తెలుసుకుంటె పిల్లి చెబ్బులి ఎలుకా ఏనుగు
అంతా ఒకటేరా

గుడికట్టి పూజలు చేసే దానుడు ఒకడు
గుడిని లింగాన్నీ మింగే త్రాస్టుడు ఒకడు

ఇదికళికాలం మాయాజాలం
తెలుసుకుంటె తెలుపూ నలుపూ
తీపి చేదూ అంతా ఒకటేరా





మనిషికి మాత్రం వసంతమన్నది పాట సాహిత్యం

 
చిత్రం: గాలి పటాలు (1974)
సంగీతం: టి. చలపతిరావు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: రామకృష్ణ దాసు 

సాకీ :
మానుమరల చిగురిస్తుంది 
చేను మళ్ళీ మొలకేస్తుంది 
మనిషికి మాత్రం వసంతమన్నది 
లేదని తొలిరాసిందెవరు ?

అది లేదని వెలి వేసిందెవరు చెలి ఓ చెలీ 
వయసు సొగసూ వంతులేసుకుని
మనసును కసిగా తరిమినవి
తోడులేని నీ దోరవయసులో
వేడివూడ్పులే ఎగసినవి

కన్నీళ్ళకు అరేనా నీలో తాపం 
ఎన్నాళ్ళమ్మ ఎన్నేళ్ళమ్మా నీకి శాపం? 
అద్దంలో నీ నీడే నిన్ను హేళన చేసింది 
అందం నేనెందుకు నీకని నిలదీసడిగింది
పురుషుడు కటినకాశి
అతనితో తీసెయ్యాలి
అతనికిముందే పెట్టిన పూలు
ఎందుకు మానాలి ఎందుకు మానాలి ? ? 




ఎన్నాళ్ళు వేచేనురా నీకై పాట సాహిత్యం

 
చిత్రం: గాలి పటాలు (1974)
సంగీతం: టి. చలపతిరావు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్. జానకి 

ఎన్నాళ్ళు వేచేనురా నీకై 
ఎన్నాళ్ళు వేచేనురా
నీవు రావాలని నిన్ను చూడాలని 
ఎన్ని దేవతల కొలిచారా 
నీకై ఎన్నాళ్ళు వేచేనురా... 

ఏ చిరుగాలి సాగినా
ఏ చిగురాకు వూగినా
ఏ రామచిలుకా పలికినా 
ఏ కలకోకిల పాడినా
నీ పలుకులని నీ పిలువులని
ఉలికి ఉలికి తలవాకిట నిలచి 

ఏ పనిలో దాగున్నావో 
ఏ వలలో చిక్కుకున్నావో 
ఏ తోడు లేదనుకున్నానో 
ఎంతగా కుములుతున్నానో 
నీ సాఖ్యమే నా సర్వమని
తలచి తలచి నీ దారికాచి 


Palli Balakrishna Thursday, December 8, 2022
Mayadari Malligadu (1973)



చిత్రం: మాయదారి మల్లిగాడు (1973)
సంగీతం: కె.వి.మహదేవన్ 
నటీనటులు: కృష్ణ, మంజుల 
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు 
నిర్మాతలు: ఆదుర్తి భాస్కర్, ఎం. ఎస్. ప్రసాద్ 
విడుదల తేది: 05.10.1973

Palli Balakrishna Wednesday, December 7, 2022
Monagadu (1976)



చిత్రం: మొనగాడు (1976)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల, వాణీ జయరాం 
నటీనటులు: శోభన్ బాబు, మంజుల, జయసుధ, రోజా రమణి, బేబి శ్రీదేవి
దర్శకత్వం: టి. కృష్ణ 
నిర్మాత: టి. త్రివిక్రమ రావు 
విడుదల తేది: 1976



Songs List:

Palli Balakrishna Saturday, August 20, 2022
Papikondalu (1986)



చిత్రం: పాపికొండలు (1986)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆరుద్ర, రాజశ్రీ, కొపెల్ల శివరాం
గానం: ఎస్.జానకి, యస్.పి.శైలజా, జయచంద్రన్ 
నటీనటులు: మోహన్ బాబు, వనిత శ్రీ, మంజుల విజయకుమార్, జయమాలిని, సిల్క్ స్మిత, అనురాధ 
దర్శకత్వం: గవిని కృష్ణ 
నిర్మాతలు: బోర శ్రీరాములు , బోర లక్ష్మణ రావు 
విడుదల తేది: 1986



Palli Balakrishna Thursday, April 14, 2022
Manchi Manushulu (1974)



చిత్రం:  మంచి మనుషులు (1974)
సంగీతం:  కె.వి. మహదేవన్
నటీనటులు: శోభన్ బాబు, మంజుల 
నిర్మాత, దర్శకత్వం: వి.బి.రాజేంద్రప్రసాద్ 
విడుదల తేది: 01.10.1974



Songs List:



నీవు లేని నేను లేను పాట సాహిత్యం

 
చిత్రం:  మంచి మనుషులు (1974)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:  ఆచార్య ఆత్రేయ
గానం:  బాలసుబ్రహ్మణ్యం, సుశీల 

ఆ హా ఆఆ ఆఆ ఆ ఆ
ఆ హా ఆఆ ఆఆ ఆ ఆ
ఆ ఆ ఆఆ ఆఆ… ఆహా హా ఆహా హా ఆహా హా

నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వూ నేను లేనిచో
ఈ జగమే లేదు
నీవు లేని నేను లేను  నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వూ నేను లేనిచో
ఈ జగమే లేదు

తీగల్లో నువ్వూ నేనే  అల్లుకునేదీ
పువ్వుల్లో నువ్వు నేనే మురిసి విరిసేదీ (2)
తెమ్మెరలో మనమిద్దరమే పరిమళించేదీ
తెమ్మెరలో మనమిద్దరమే పరిమళించేదీ
తేనెకు మన ముద్దేలే తీపిని ఇచ్చేదీ, తీపిని ఇచ్చేదీ

నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వూ నేను లేనిచో ఈ జగమే లేదు

నువ్వు లేక వసంతానికి యవ్వనమెక్కడిదీ
నువ్వులేక వానమబ్బుకు మెరుపే ఎక్కడిదీ
సృష్టిలోని అణువు అణువులో ఉన్నామిద్దరమూ
జీవితాన నువ్వూనేనై కలిశామీదినమూ

నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వూ నేను లేనిచో  
ఈ జగమే లేదు

కొండల్లే నువ్వున్నావు నాకు అండగా
మంచల్లే నువ్వున్నావూ నాకు నిండుగా, ..(2)
ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగా
ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగా
నిన్నా నేడు రేపే లేని  ప్రేమ జంటగా, ఆ ఆ
ప్రేమ జంటగా…ఆ ఆ

నీవు లేని నేను లేను,  నేను లేక నీవు లేవు
నీవు లేని నేను లేను,  నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వూ నేను లేనిచో  ఈ జగమే లేదు
ఆహా హా ఆహా హా ఆహా హా




నిన్ను మరచి పోవాలని పాట సాహిత్యం

 
చిత్రం : మంచి మనుషులు
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం : బాలసుబ్రహ్మణ్యం

నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్ళాలనీ
ఎన్నిసార్లో అనుకున్నా మనసు రాక మానుకున్నా
మనసు రాక మానుకున్నా (2)

నువ్వు విడిచి వెళ్ళినా నీ రూపు చెరిగిపోలేదూ
నువ్వు మరలి రాకున్నా నీ చోటెవ్వరికి ఇవ్వలేదూ (2)
తలుపు తెరిచి ఉంచుకొనీ తలవాకిట నిలిచున్నా
వలపు నెమరేసుకుంటూ నీ తలపులలో బ్రతికున్నా

నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్ళాలనీ
ఎన్నిసార్లో అనుకున్నా మనసు రాక మానుకున్నా
మనసు రాక మానుకున్నా (2)

ఎందుకిలా చేశావో నీకైనా తెలుసా
నేనెందుకింకా ఉన్నానో నాకేమో తెలియదూ (2)
నేను చచ్చిపోయినా నా ఆశ చచ్చిపోదులే
నిన్ను చేరు వరకు నా కళ్ళు మూతపడవులే

నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్ళాలనీ
ఎన్నిసార్లో అనుకున్నా మనసు రాక మానుకున్నా
మనసు రాక మానుకున్నా (2)

గుండెలోన చేశావూ ఆరిపోని గాయాన్నీ
మందుగా ఇచ్చావు మన వలపు పంట పసివాణ్ణీ (2)
ఆ లేత మనసు తల్లికోసం తల్లడిల్లుతున్నదీ
నీ తల్లి మనసు తెలియకనే దగ్గరవుతూవున్నదీ

నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్ళాలనీ
ఎన్నిసార్లో అనుకున్నా మనసు రాక మానుకున్నా
మనసు రాక మానుకున్నా (2)




పడకు పడకు వెంట పడకు పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మనుషులు
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: బాలసుబ్రహ్మణ్యం,  సుశీల

పల్లవి:
పడకు పడకు వెంట పడకు..పడచు పిల్లకు ఆశపడకు
పోపోరా... చినవాడా...
పడకు పడకు వెంట పడకు..పడచు పిల్లకు ఆశపడకు
పోపోరా... చినవాడా...

పడకు పడకు..అడ్డుపడకు పడుచు వాణ్ణి చేయి విడకు
పోలేనే... చినదానా....
పడకు పడకు..అడ్డుపడకు పడుచు వాణ్ణి చేయి విడకు
పోలేనే... చినదానా....

చరణం: 1
లైలా...
మజ్ఞూ....మంజూ....
మేలిముసుగులో పైడిబొమ్మలా మిసమిసలాడే లైలా
నీ సొగసుకు సలాము చేస్తున్న నీ సొగసుకు సలాము చేస్తున్నా
సొగసును మించిన మగసిరితో నా మనసును దోచిన మజ్ఞూ
నీ మమతకు గులామునవుతున్న నీ మమతకు గులామునవుతున్న

పెళ్ళికూతురై.....వెళ్ళుతున్నావా...
మన ప్రేమను ఎడారి చేశావా, మన ప్రేమను ఎడారి చేశావా
పెళ్ళి తనవుకే....చేశారూ....
మన ప్రేమ మనసుకే వదిలారూ, మన ప్రేమ మనసుకే వదిలారూ
లైలా....

పడకు పడకు వెంట పడకు పడచు పిల్లకు ఆశపడకు
పోపోరా... చినవాడా...
ఏహే.....పడకు పడకు అడ్డుపడకు పడుచు వాణ్ణి చేయి విడకు
పోలేనే... చినదానా....

చరణం: 2
అనార్....
సలీం..
గులాబి పూలతోటలో....
ఖవ్వాలి తీపిపాటలో గులాబి పూలతోటలో ఖవ్వాలి తీపిపాటలు
సలీము లేత గుండెకు షరాబు మత్తు చూపినా....
అనార్కలీవి నువ్వు  అనార్కలీవి నువ్వు

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
మొఘల్ సింహాసనానికి.. ఆ....
కసాయి శాసనానికి మొఘల్ సింహాసనానికి..
కసాయి శాసనానికి సవాల్‌గా జవాబుగా  గరీభ్నేవరించినా...
జహాపనావు నువ్వు జహాపనావు నువ్వు

సలీం....సలీం....సలీం....
అనార్........
పవిత్ర ప్రేమకు సమాధి లేదులే...
చరిత్ర మొత్తమే విషాధగాథలే...
విషాధగాథలే...

పడకు పడకు వెంట పడకు పడచు పిల్లకు ఆశపడకు
పోపోరా... చినవాడా...
ఏహే....పడకు పడకు అడ్డుపడకు పడుచు వాణ్ణి చేయి విడకు
పోలేనే... చినదానా...
పోపోరా... చినవాడా...
ఏహే.... పోలేనే... చినదానా....
పోపోరా... చినవాడా...




పెళ్ళయింది ప్రేమవిందుకు పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మనుషులు (1974)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: బాలు, సుశీల 

పల్లవి:
పెళ్ళయింది  ప్రేమవిందుకు వేళయింది
పెళ్ళయింది ప్రేమవిందుకు వేళయింది
వయసు ఉరికింది సొగసు బెదిరింది
పెదవి అదిరింది పంటానొక్కింది

పెళ్ళయింది  ప్రేమవిందుకు వేళయింది
వయసు ఉరికింది  సొగసు బెదిరింది
పెదవి అదిరింది పంటానొక్కింది
పెళ్ళయింది ప్రేమవిందుకు వేళయింది

చరణం: 1 
కమ్మని కల వచ్చింది  ఆ కలకొక రూపొచ్చింది
కమ్మని కల వచ్చింది  ఆ కలకొక రూపొచ్చింది
జరిగినది గురుతొచ్చింది  ఇక జరిగేది ఎదురొచ్చింది
జరిగినది గురుతొచ్చింది  ఇక జరిగేది ఎదురొచ్చింది
కళ్ళకు జత కుదిరింది కతలెన్నో చెబుతుంది
పెదవి మీద రాసుంది  చదివి చెప్పమన్నది

పెళ్ళయింది  ప్రేమవిందుకు వేళయింది

చరణం: 2 
కుర్రతనం కొత్త రుచులు కోరింది
రుచి తెలిసిన కొంటెతనం గారంగా కొసరింది
కుర్రతనం కొత్త రుచులు కోరింది
రుచి తెలిసిన కొంటెతనం గారంగా కొసరింది
గడుసుతనం కొసరిస్తా.. అసలు ఇవ్వనన్నది
ప్రతి రోజు కొసరిస్తే  అసలు మించిపోతుంది

పెళ్ళయింది  ప్రేమవిందుకు వేళయింది

చరణం: 3 
ఎప్పుడో నన్నిచ్చాను  ఇంకిప్పుడేమి ఇస్తాను
ఇన్నాళ్ళు ఇవ్వనివి  మిగిలి ఎన్నెన్నో ఉన్నవి
ఎప్పుడో నన్నిచ్చాను  ఇంకిప్పుడేమి ఇస్తాను
ఇన్నాళ్ళు ఇవ్వనివి  మిగిలి ఎన్నెన్నో ఉన్నవి

ఇపుడే తెలిసింది  ఎప్పుడేప్పుడని ఉంది
మూడుముళ్ళు వేసినది  ఏడడుగులు నడిచినది
అందుకే... ఆ విందుకే... అహహా... అహహా... అహహా... ఆ... ఆ...

పెళ్ళయింది  ప్రేమవిందుకు వేళయింది
వయసు ఉరికింది  సొగసు బెదిరింది
పెదవి అదిరింది  పంటానొక్కింది
పెళ్ళయింది  ప్రేమవిందుకు వేళయింది
ప్రేమవిందుకు వేళయింది  ప్రేమవిందుకు వేళయింది



విను నా మాట విన్నవంటే పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మనుషులు (1974)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర 
గానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల

పల్లవి:
విను నా మాట.. విన్నావంటే...
జీవితమంతా....ఆ పూవ్వుల బాట...
విను నా మాట విన్నావంటే 
జీవితమంతా పూవ్వుల బాట

చరణం: 1
ఎన్నడు నీవు ఏడవకూ కన్నుల నీరు రానీకు
ఎన్నడు నీవు ఏడవకూ కన్నుల నీరు రానీకు
కష్టాలందూ నవ్వాలి కలకల ముందుకు సాగాలీ
కంటికి వెలుగూ ఇంటికి వెలుగూ ఆరని జ్యోతి నువ్వే నువ్వే

విను నా మాట విన్నావంటే 
జీవితమంతా పూవ్వుల బాట

చరణం: 2
బిడ్డలు ముద్దుగా పెరగాలీ పెద్దల ముచ్చట తీర్చాలీ
బిడ్డలు ముద్దుగా పెరగాలీ పెద్దల ముచ్చట తీర్చాలీ
ఆటలు హాయిగ ఆడాలి చదువులు పెద్దవి చదవాలీ
ఇంటికి పేరూ, ఊరికి పేరూ, తెచ్చేవాడివి నువ్వే నువ్వే

విను నా మాట విన్నావంటే 
జీవితమంతా పూవ్వుల బాట

చరణం: 3
తల్లీతండ్రి ఒకరైనా దైవసమానం తల్లి సుమా
తల్లీతండ్రి ఒకరైనా దైవసమానం తల్లి సుమా
దీవిస్తుంది నీ అమ్మ దేవునిలాగే కనపడక
చల్లని మనసూ, తీయని మమత, చక్కని బ్రతుకూ నీదే నీదే

ఇది నీమాట... విన్నానంటే... జీవితమంతా... పూవ్వుల బాటా
ఇది నీమాట విన్నానంటే జీవితమంతా పూవ్వుల బాటా



నీవు లేని నేను లేను (Sad Version) పాట సాహిత్యం

 
చిత్రం:  మంచి మనుషులు (1974)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:  ఆచార్య ఆత్రేయ
గానం:  బాలసుబ్రహ్మణ్యం, సుశీల 

నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వూ నేను లేనిచో
ఈ జగమే లేదు (2)

అందరిలా నాకు ఒక అమ్మ ఉందనుకున్నాను
ఏది నాన్న అమ్మ ఏదని ఎన్నోసార్లడిగాను (2)

నిన్ను సరే చూడలేదు  రూపైనా చూడలేదు 
నువ్వుంటే రాకుంటావా నన్ను చూడకుంటావా
నన్ను చూడకుంటావా...

నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వూ నేను లేనిచో ఈ జగమే లేదు

కొమ్మలేక ఎక్కడైనా పిందె పెరుగుతుందా
కాడలీక ఏనాడైనా పువ్వు నిలిచి ఉంటుందా
సృష్టి లోన జరగని వింత మనిషి చేతనౌతుందా
బిడ్డలెరుగని తల్లికైనా పేగు కదలకుంటుందా
ప్రేమ య్తేలియకుంటుందా

నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వూ నేను లేనిచో ఈ జగమే లేదు

కొండల్లే నేనున్నాను గుండె పగలక 
మంచల్లె నువ్వెల్లావు వలపు తెలియక (2)
ఎన్ని జన్మలో అనుకున్నాము ఈ కలయిక
నిన్న నేడే మాచిపొతే రేపులేదిక రేపులేదిక 

నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వూ నేను లేనిచో ఈ జగమే లేదు




హరిలో రంగ హరి పాట సాహిత్యం

 
చిత్రం:  మంచి మనుషులు (1974)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:  ఆచార్య ఆత్రేయ
గానం:  బాలసుబ్రహ్మణ్యం, సుశీల 

పల్లవి:
శ్రీమద్రమారమణ గోవిందో...హరి
హరిలో రంగ హరీ... అమ్మాయి గారి  పని హరి
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి
హరిలో రంగ హరీ... అమ్మాయి గారి పని హరి 

శ్రీమద్రమారమణ గోవిందో...హరి
హరిలో రంగ హరీ... అబ్బాయి గారి పని హరి
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి
హరిలో రంగ హరీ... అబ్బాయి గారి పని హరి 

చరణం: 1
చల్లగాలి తగిలిందంటే పిల్లదానికి రెపరెపలు (2)
పిల్ల గాలి సోకిందంటే కుర్రవాడికి గుబగుబలు (2)
గుబులు రేగిన కుర్రవాడు కూడ కూడ వస్తానంటే
గూబ మీద చెయ్యి ఒకటి గుయ్యీమంటూ మోగిందంటే
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి

హరిలో రంగ హరీ... అమ్మాయిగారి పని హరి

చరణం: 2
వెంటపడిన కొంటే వాణ్ణి ఇంటిదాక రానిచ్చి
తోడు వచ్చిన దొరబిడ్డా పోయి రమ్మని తలుపే మూస్తే
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి

తలుపు మూసిన తలుపుల్లోన తరుముకొస్తూ వాడేవుంటే (2)
తెల్లవార్లూ కలలోకొచ్చి అల్లరల్లరి చేశాడంటే
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి

హరిలో రంగ హరీ... అబ్బాయి గారి పని హరి

చరణం: 3
దోర వయసు జోరులోన కన్నుమిన్ను కానరాక
జారిజారి కాలు జారి గడుసువాడి వడిలో పడితే
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి

మనసు జారి పోతేగాని కాలు జారదు కన్నెపిల్ల (2)
గడసువాడది తెలుసుకోక వడిని పట్టి లొట్టలేస్తే
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి

హరిలో రంగ హరీ... అమ్మాయి గారి పని హరి
హరిలో రంగ హరీ... అబ్బాయి గారి పని హరి

హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి
హరిలొ రంగ హరి, హరిలొ రంగ హరి (3)

హరి హరి హరి హరి హరి హరి హరి హరి





విను నా మాట (Sad Version) పాట సాహిత్యం

 
చిత్రం: మంచి మనుషులు
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర 
గానం: బాలసుబ్రహ్మణ్యం 

పల్లవి:
విను నా మాట.. విను నా మాట
విన్నావంటే... విన్నావంటే
జీవితమంతా.... జీవితమంతా
పూవ్వుల బాట...పూవ్వుల బాట

ఎన్నడు నీవు ఏడవకూ కన్నుల నీరు రానీకు
కష్టాలందూ నవ్వాలి కలకల ముందుకు సాగాలీ
కంటికి వెలుగూ.. కంటికి వెలుగూ
ఇంటికి వెలుగూ.. ఇంటికి వెలుగూ
ఆరని జ్యోతి నువ్వే నువ్వే... నువ్వే నువ్వే..

Palli Balakrishna Thursday, January 6, 2022
Prema Nakshatram (1982)



చిత్రం: ప్రేమనక్షత్రం (1982)
సంగీతం: ఎమ్. ఎస్. విశ్వనాథన్
నటీనటులు: కృష్ణ , శ్రీదేవి, మంజుల విజయ్ కుమార్
దర్శకత్వం: పర్వతనేని సాంబశివరావు
నిర్మాతలు: కె. బుజ్జి రెడ్డి, ఎమ్. జనార్ధన్ రెడ్డి, పి. సురేంద్ర రెడ్డి, ఎన్. రాధారెడ్డి
విడుదల తేది: 06.08.1982

Palli Balakrishna Friday, August 27, 2021
Marapurani Manishi (1973)





చిత్రం: మరపురాని మనిషి  (1973)
సంగీతం: కె.వి.మహదేవన్ 
నటీనటులు: నాగేశ్వర రావు, మంజుల, చంద్రమోహన్, జయంతి, బేబీ శ్రీదేవి 
దర్శకత్వం: తాతినేని రామారావు 
నిర్మాత: యన్.యన్.భట్
విడుదల తేది: 23.11.1973



శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా నాగేశ్వరరావు గారితో కలిసి నటించిన సినిమాలు
1. భార్యా బిడ్డలు  (1972)
2. భక్త తుకారాం (1973)
3. మరపురాని మనిషి  (1973) 



Songs List:



వచ్చింది వచ్చింది పాట సాహిత్యం

 
చిత్రం: మరపురాని మనిషి  (1973)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల 

వచ్చింది వచ్చింది




ఓ రామయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: మరపురాని మనిషి  (1973)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి. సుశీల 

ఓ రామయ్యా 



ఎక్కడో లేడులే దేవుడు పాట సాహిత్యం

 
చిత్రం: మరపురాని మనిషి  (1973)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల

ఎక్కడో లేడులే దేవుడు 




ఎవడే ఈ పిలగాడు పాట సాహిత్యం

 
చిత్రం: మరపురాని మనిషి  (1973)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

ఎవడే ఈ పిలగాడు 



ఏం చెప్పను పాట సాహిత్యం

 
చిత్రం: మరపురాని మనిషి  (1973)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

ఏం చెప్పను 

Palli Balakrishna Friday, July 30, 2021
Jebu Donga (1975)




చిత్రం: జేబుదొంగ (1975)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: శోభన్ బాబు, మంజుల, మురళీమోహన్
దర్శకత్వం: వి.మధుసూధనా రావు 
నిర్మాత: వి.ఆర్.యేచేంద్ర, కె. చటర్జీ
విడుదల తేది: 14.08.1975



Songs List:



నీలాల నింగిలో పాట సాహిత్యం

 
చిత్రం: జేబుదొంగ (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
నీలాల నింగిలో మేఘాల తేరులో
ఆ పాలపుంతలో నీ కౌగిలింతలో
నిలువెల్లా కరిగిపోనా
నీలోనా కలిసిపోనా

నీలాల నింగిలో మేఘాల తేరులో
ఆ పాలపుంతలో నీ కౌగిలింతలో
నిలువెల్లా కరిగిపోనా
నీలోనా కలిసిపోనా

నీలాల నింగిలో
మేఘాల తేరులో

చరణం: 1
ఆ నింగికి నీలం నీవై
ఈ నేలకు పచ్చను నేనై
రెండూ కలిసిన అంచులలో
రేపూ మాపుల సంధ్యలలో
ఎర్రని పెదవుల ముద్దులుగా
నల్లని కన్నుల సుద్దులుగా
ఎర్రని పెదవుల ముద్దులుగా
నల్లని కన్నుల సుద్దులుగా
మెల్లగా చల్లగా 
మెత్తగ ముద్దుగ హత్తుకుపోయి

నిలువెల్లా కరిగిపోనా
నీలోనా కలిసిపోనా

నీలాల నింగిలో మేఘాల తేరులో

చరణం: 2
ఆ హిమగిరి శిఖరం నీనై
నీ మమతల మంచును నేనై
ఆశలు కాసే వేసవిలో
తీరని కోర్కెల తాపంలో
శివపార్వతుల సంబరమై
గంగా యమునల సంగమమై
శివపార్వతుల సంబరమై
గంగా యమునల సంగమమై
ఉరకలా పరుగులా 
పరువంలోనా ప్రణయంలోనా

నిలువెల్లా కరిగిపోనా
నీలోనా కలిసిపోనా

నీలాల నింగిలో మేఘాల తేరులో
ఆ పాలపుంతలో నీ కౌగిలింతలో
నిలువెల్లా కరిగిపోనా
నీలోనా కలిసిపోనా

నీలాల నింగిలో మేఘాల తేరులో




రాధ అందించు పాట సాహిత్యం

 
చిత్రం: జేబుదొంగ (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

రాధ అందించు 



గోవింద గోవింద పాట సాహిత్యం

 
చిత్రం: జేబుదొంగ (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

గోవింద గోవింద 




రేగాడు రేగాడు పాట సాహిత్యం

 
చిత్రం: జేబుదొంగ (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

రేగాడు రేగాడు 



చల్లంగా వుండాలి పాట సాహిత్యం

 
చిత్రం: జేబుదొంగ (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, కె.చక్రవర్తి, ఎస్.జానకి 


చల్లంగా వుండాలి 



రామలింగం సోమలింగం పాట సాహిత్యం

 
చిత్రం: జేబుదొంగ (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

రామలింగం సోమలింగం 

Palli Balakrishna Wednesday, June 9, 2021
Dorababu (1974)




చిత్రం: దొరబాబు (1974)
సంగీతం: జె.వి.రాఘవులు 
నటీనటులు: నాగేశ్వర రావు , మంజుల, చంద్రకళ 
దర్శకత్వం: తాతినేని రామారావు 
నిర్మాత: జె. సుబ్బారావు, జి. రాజేంద్రప్రసాద్ 
విడుదల తేది: 31.10.1974



Songs List:



దేవుడెలా వుంటాడని పాట సాహిత్యం

 
చిత్రం: దొరబాబు (1974)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల, పి.సుశీల 

పల్లవి:
దేవుడెలా వుంటాడని ఎవరైనా అడిగితే
మా అన్నలా వుంటాడని అంటాను నేను
అనురాగమెలా వుంటుందని ఎవరైనా అడిగితే
మా చెల్లిలా వుంటుందని చెబుతాను నేను

చరణం: 1
చెల్లెలున్న యీ యిల్లే సిరిమల్లె తోట
మా....ఆమ్మలు చిరునవ్వే ముత్యాల మూట
అన్నయ్య హృదయమే అందాల మేడ
చెల్లాయికి కలకాలం అది చల్లని నీడ
కన్నతల్లి తీపికలల రూపాలం మనము
కోవెలలో వెలిగించిన దీపాలం మనము

చరణం: 2
అల్లారు ముదుగా నను పెంచినావు
అమ్మనూ నాన్ననూ మరిపించినావు
ఇల్లాలివై నీవు విలసిల్ల వమ్మా
పాపలతోటి చల్లగా వుండవమ్మా 
పుట్టినింటవున్నా, మెట్టినింటవున్నా
అన్నయ్య దీవనే శ్రీరామరక్ష 



చంద్రగిరి చంద్రమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: దొరబాబు (1974)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి.సుశీల, కోరస్

పల్లవి:
చంద్రగిరి చంద్రమ్మా - సందేళ కొస్తానమ్మా
అందాక నలగిపోక - అలసిపోక వుండమ్మా 
చంద్రగిరి చంద్రయ్యా - సందేళ కొస్తానయ్యా
అందాక పనిచేసి - ఆకలేసి వుండయ్యా 

చరణం:
వలమాలిన వయసేమో వెలువంటిది
దాని కాశయాల కానకట్ట వేసుకోవాలి
కోరస్: ఆనకట్టనే వేసుకోవాలి
ఆడది మగవాడు ఆడుతూ పాడుతూ
దాన్ని మళ్ళించి మంచితనం పండించాలి

చరణం:
మట్టినీళ్ళల్లా మనమేకం కావాలి
చెట్టాపట్టగ చేయిపట్టి నడవాలి
కోరస్ : పట్టి నడవాలి
పుట్టినందు కేదైన గట్టి పనిచేయాలి
పుట్టబోయేవాళ్ళు మన పేరు చెప్పుకోవాలి

చరణం:
కావేరి గోదారి గంగా కృషమ్మలను
కలిపేసి నిలవేసి కక్షలను మాపాలి
కోరస్: కక్షలను మాపాలి
ప్రతిపల్లె పెళ్ళికాని పడుచుపిల్ల కావాలి
పంటలక్ష్మి యింటింటా భరతనాట్యమాడాలి



అమ్మమ్మొ.... యీ గుంటడు పాట సాహిత్యం

 
చిత్రం: దొరబాబు (1974)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: రామకృష్ణ, పి.సుశీల

పల్లవి:
అమ్మమ్మొ.... యీ గుంటడు ఎంతకిలాడి
గుచ్చిగుచ్చి చంపుతడు కళ్ళతోటి-దొంగకళ్ళతోటి
అన్నన్న.... యీ కుర్రది టక్కులాడి
బులిపించి చంపుతది మాటలాడి మాయమాటలాడి

చరణం: 1
నీ చెవిలో ఏదో మంత్రమున్నది
తాకగానే నా గుండె కొట్టుకుంటది
చంద్రం తాకితేనే నీ గుండె కొట్టుకుంటది
తాకకుంటె నా గుండె ఆగిపోతది

చరణం: 2
నీ కంట్లో నా నీడ వెచ్చగుంటది
నాకేమో ఆ వేడి ధక్క నంటది
నీడైతే నా కంట్లో కుదురుగుంటది
నువ్వైతే నా ఒళ్లు అలసిపోతది

చరణం: 3
నీ సొగసే నా చూపుకి తిండి పెడతది
పిసినిగొట్టు నీ మనసే కసిరికొడతది
చూపుతో నీ వయసుకు కరువు తీరదు
తీరిస్తే నా సిగ్గుకు పరువు మిగలదు





నీకూ నాకూ పెళ్ళంటే పాట సాహిత్యం

 
చిత్రం: దొరబాబు (1974)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: చెరువు ఆంజనేయ శాస్త్రి
గానం: రామకృష్ణ, పి.సుశీల

పల్లవి: 
నీకూ నాకూ పెళ్ళంటే
నింగి నేలా మురిశాయి
వయసూ సొగసూ కలిబోసి రంగవెల్లి వేశాయి

చరణం: 1
కొత్త కొత్త కోరికలేవో నాలో చెలరేగాయి
కౌగిలిలో బంధిస్తేనే కలత నిదురపోతాయి
తెలిసింది నీ ఎత్తు 
ఆ ఎత్తే గమ్మత్తు
సందెలో విందులా
విందులో — పొందులా

చరణం: 2
ఏడడుగులు నడిచావటే
ఎండమొహం చూడనీయను
వలపు జల్లు తడిసిన ఒళ్లు ఎక్కడ ఆరేసుకోను
నాలోనే వేడుంది
నీ ధోరణి బావుంది
ఎండలో - వానలా
వానలో - హాయిలా

చరణం: 3
మూడు ముళూ వేయకముందే
నన్నల్లరి చెయ్యొద్దు
ఇల్లాలినవి కావాలంటే యివ్వాలి తొలిముద్దు 
ఏమిటి యీ చిలిపితనం
అంతేలే కుర్రతనం
పూవులో - తేటిలా
తేటిలో - పాటలా




వద్దు వద్దు వద్దు పాట సాహిత్యం

 
చిత్రం: దొరబాబు (1974)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: ఆత్రేయ
గానం: రామకృష్ణ, పి.సుశీల

వద్దు వద్దు వద్దు ముద్దు యివ్వొద్దు 
అది తేనెకన్న తియ్యనని చెప్పొద్దు 
నాకు చెప్పొద్దు
వద్దు వద్దు వద్దు ముద్దు వద్దనవద్దు
దాని తీపిఎంతో తెలిసికోక చెప్పద్దు వద్దుచెప్పద్దు 

చరణం: 1
నా పెదవిపై పేరువుంది చదువుకో
నా హృదయమందు రూపముంది చూసుకో
దొరబాబు ఆ పేరు నాదని, రూపు నాదని
నీ చెంప ఎరుపు చెప్పకే చెప్పింది 
ఒప్పుకోమంది 

చరణం: 2
గుప్పెడంత గుండెలోన గుట్టుంది
విప్పలేని చిక్కుముడై వేసింది
చిక్కుముడిని పంటనొక్కి విప్పుకోవచ్చు
గుట్టులన్ని కళ్ళతోటి చెప్పుకోవచ్చు

చరణం: 3
పాట వింటు పరవశించి పోవద్దు 
ఆట కట్టి పోవునని అనుకోవద్దు 
పాట పాడినా పరవశించినా
పగబట్టిన నాగుబాము పడగ దించునా
కాటు మానునా ?



ఒంటరిగా వున్నాను పాట సాహిత్యం

 
చిత్రం: దొరబాబు (1974)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: రామకృష్ణ, పి.సుశీల

పల్లవి: 
ఒంటరిగా వున్నాను
ఇస్సిరిస్సు రంటున్నాను

ఇంతకన్న ఏం చెప్పుకోనురో బావయ్యో
యిడమరిచి చెప్పుకుంటే సిగ్గయ్యో 
పక్కన నేనున్నాను
ఆవురావురంటున్నాను
దారిలేక ఆగానమ్మో చిట్టమ్మో
కంటికేమో కునుకు రాదు ఒట్టమ్మో

నా మనసుకు బుద్దిలేదు పదారేళ్లుగా
బుద్దొచ్చి మరుగుతోంది నాలుగేళ్లుగా
నా మోజుకు రంజులేదు నువ్వు చేరకా
రంజులోన లబ్జులేదు కోర్కెతీరకా

పొద్దు పొడుపు యెందుకనో చురుక్కుమంటది
పొద్దు గుంకితే నాలో కలుక్కుమంటది
పొద్దుకైన వొకరైతే చులకనే మరి
ఇద్దరమూ వొకటైతే వోడిపోతది…





రారా పడకింటికి పాట సాహిత్యం

 
చిత్రం: దొరబాబు (1974)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల

రారా పడకింటికి
నిదుర రాదూ నా కంటికి
తగిన మందివ్వరా - రగిలే నా ఒంటికి

ఎందుకు పడకింటికి పోదాములే పొదరింటికి
తగిన మందుందిలే
రగిలే నీ ఒంటికి ....

చరణం: 
వెచ్చగా చలివేసింది.
మత్తుగా మసకేసింది
కొత్తమోజు రేగింది అది పిచ్చిగా నినుకోరింది
మోజే ప్రేమయితే - ప్రేమే పిచ్చయితే 
ఆ పిచ్చి ముదిరితే - నీ మనసు బెదిరితే
ఆఁ... అందుకే

చరణం: 
ఆడదాని వలపులు ఏటిలోని తరగలు
ఏ గాలికి అవి చెదురునో
ఏ గట్టు తాకీ విరుగునో
నీలాంటి దొరబాబే
నా జంటగా వుంటే
నా మనసు చెదిరిపోదు
యీ వలపు విరిగిపోదు
ఆహాఁ ... అయితే
ఎందుకు పొదరింటికి - పోదాములే పడకింటికీ
తగిన మందుందిలే రగిలే నీ వొంటికీ

Palli Balakrishna Wednesday, March 20, 2019
Manushulu Chesina Dongalu (1977)



చిత్రం: మనుషులు చేసిన దొంగలు (1977)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: కృష్ణ , కృష్ణంరాజు, మంజుల విజయ్ కుమార్, సంగీత, మాస్టర్ రమేష్ బాబు
మాటలు: త్రిపురనేని మహారధి
దర్శకత్వం: ఎం.మల్లికార్జున రావు
నిర్మాత: యు.సూర్యనారాయణ బాబు
విడుదల తేది: 19.10.1977



Songs List:



ఆనందం అబ్బాయిదైతే.. పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు చేసిన దొంగలు (1977)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
ఆనందం అబ్బాయిదైతే.. అనురాగం అమ్మాయిదైతే
ఎడబాటు ఉండదు ఏనాటికి.. ఇది నిజము ముమ్మాటికి

ఆనందం అబ్బాయిదైతే.. అనురాగం అమ్మాయిదైతే
ఎడబాటు ఉండదు ఏనాటికి.. ఇది నిజము ముమ్మాటికి
ఆహా..ఆహా..హా... లా..లా....లలలా

చరణం: 1
నేనే దొంగనైతే... నువ్వు నన్నే దోచినావు..హా
దోచీ దాచుకున్నా.. నేను నీకై వేచి ఉన్నా

నీ కోసమే నేను జీవించుతా
నీ కోసమే నేను జీవించుతా 
నీ గుండెలోనే నిదురించుతా 

ఆనందం అబ్బాయిదైతే.. అనురాగం అమ్మాయిదైతే
ఎడబాటు ఉండదు ఏనాటికి.. ఇది నిజము ముమ్మాటికి

చరణం: 2
నీవే రాధవైతే... ఇక నాదే రాసలీల
నేనే వేణువైతే... ఇక నీవే రాగమాల
అందాల సీమా బృందావనం
అందాల సీమా బృందావనం
ఆ సీమలోనే మన జీవితం 

ఆనందం అబ్బాయిదైతే.. అనురాగం అమ్మాయిదైతే
ఎడబాటు ఉండదు ఏనాటికి.. ఇది నిజము ముమ్మాటికి
ఇది నిజము ముమ్మాటికి... ఇది నిజము ముమ్మాటికి  




మనసెందుకో... మమతెందుకో.. పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు చేసిన దొంగలు (1977)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి. సుశీల

పల్లవి:
మనసెందుకో... మమతెందుకో.. ఓ మోసగాడా.. ఒహో మోసగాడా
మనసే లేని.. మమతే లేని.. నీలాంటి మనిషెందుకో..ఓ...
ఓ మోసగాడా.. ఒహో మోసగాడా

చరణం: 1
మనసార నమ్మానురా... నన్నమ్మి పోయావురా
నీ తోడు కోరానురా.. నీ నీడ నిలిచానురా
తోడు నీడ జాడ కూడా లేకుండ చేశావురా 

మనసెందుకో... మమతెందుకో.. ఓ మోసగాడా.. ఒహో మోసగాడా 

చరణం: 2
ఓ... తొలివలపు విలువేమిటో.. నీ మనసు ఏమురుగురా
కన్నీటి కథ ఏమిటో... చినదానికే తెలుసురా
కన్నె మనసు గాయ పరచి జ్వాల రేపావురా
కన్నె మనసు గాయ పరచి జ్వాల రేపావురా

మనసెందుకో... మమతెందుకో.. ఓ మోసగాడా.. ఒహో మోసగాడా
మనసే లేని మమతే లేని నీలాంటి మనిషెందుకో..ఓ...
ఓ మోసగాడా.. ఒహో మోసగాడా... ఒహో మోసగాడా



చెయ్యెత్తి జైకొట్టరా పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు చేసిన దొంగలు (1977)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: శ్రీశ్రీ
గానం: యస్.పి.బాలు

చెయ్యెత్తి జైకొట్టరా ఓ డింగరి నీ చేతి వాటం చూపెట్టారా




తెలుసా... నా మదిలో ఉన్నావని పాట సాహిత్యం

 
చిత్రం:  మనుషులు చేసిన దొంగలు (1977)
సంగీతం:  చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:  ఆరుద్ర
గానం:  ఎస్.పి. బాలు, పి. సుశీల 

పల్లవి:
తెలుసా... నా మదిలో ఉన్నావని
తెలుసు... నీ మనసే నాదేనని
నీ చెలిమి.. నీ కలిమి.. దోపిడి చేస్తానని...

తెలుసా... నా మదిలో ఉన్నావని
తెలుసు... నీ మనసే నాదేనని  

చరణం: 1
తీయని తేనెల గనులు.. నీ కనులు.. ఆ.. ఆ
తీరని వలపుల సిరులు ... నీ కురులు.. ఆహా
తీయని తేనెల గనులు.. నీ కనులు.. ఆ.. ఆ
తీరని వలపుల సిరులు ... నీ కురులు.. ఆహా

నీలోని అందాలు అన్నీ నావేనని...ఆ..
ఎలాగుంది మన బ్లేడు.. యమ స్పీడు

తెలుసా... నా మదిలో ఉన్నావని
తెలుసు... నీ మనసే నాదేనని 

చరణం: 2
తొలకరి ఊహలు సాగే.. చెలరేగే..
గడసరి వయసే ఉరికే.. నీ కొరకై
తొలకరి ఊహలు సాగే.. చెలరేగే..
గడసరి వయసే ఉరికే.. నీ కొరకై

వెచ్చని నీ ఒడిలోనా వేడుక తీరాలనీ... అహా
ఎలాగుంది మన బ్లేడు.. అసలు తెగందే...

తెలుసు... నా మదిలో ఉన్నావని
తెలుసా... నీ మనసే నాదేనని

చరణం: 3
కమ్మని కలలా నీవూ... వచ్చాను
చెరగని కథలా నాలో... నిలిచాను
కమ్మని కలలా నీవూ... వచ్చావు
చెరగని కథలా నాలో... నిలిచావు

ఏహే..నిలిచాను..వలచాను... నిన్నే గెలిచాను..
ఎలాగుంది మన బ్లేడు.. యమ స్పీడు

తెలుసా... నా మదిలో ఉన్నావని
తెలుసు... నీ మనసే నాదేనని 



నీవే.. నీవే.. ఓ ప్రియా పాట సాహిత్యం

 
చిత్రం:  మనుషులు చేసిన దొంగలు (1977)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:  ఆరుద్ర
గానం:  వి.రామకృష్ణ, పి.సుశీల 

పల్లవి:
నీవే.. నీవే.. ఓ ప్రియా
నా మది పలికిన మోహనగీతివి నీవే సుమా
నేనేలే ప్రియా... నీవేలే సుమా...  నేనేలే ప్రియా... 

చరణం: 1
అలలై ఊగే ఈ పూలలో... కలలై మూగే ఈ వేళలో
నను పిలిచే కోరిక నీవే...  నను పిలిచే కోరిక నీవే

పగలు  రేయి నా ధ్యానమై... ఏనాడైనా నాదానవై
నను తలచే రాధిక నీవే... నను తలచే రాధిక నీవే
ఆ.. ఆ... ఆ...ఆ...

నీవే.. నీవే.. ఓ ప్రియా
నా మది పలికిన మోహనగీతివి నీవే సుమా
నేనేలే ప్రియా... నీవేలే సుమా...  నేనేలే ప్రియా... 

చరణం: 2
పావన జీవన తీరాలలో...ఊహల కోయిల రాగలలో
నను కొలిచే దేవివి నీవే... నను కొలిచే దేవివి నీవే

అనురానికి వేదానివై... నా హృదయానికి నాదానివై
నను వలచే దైవము నీవే... నను వలచే దైవము నీవే
ఆ... ఆ.. ఆ ... ఆ... 

నీవే.. నీవే.. ఓ ప్రియా
నా మది పలికిన మోహనగీతివి నీవే సుమా
నేనేలే ప్రియా... నీవేలే సుమా...  నేనేలే ప్రియా...



లోకావనాయ శివ రాఘవ కృష్ణ ( పద్యం ) పాట సాహిత్యం

 

చిత్రం: మనుషులు చేసిన దొంగలు (1977)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: 
గానం: యస్.పి.బాలు

లోకావనాయ శివ రాఘవ కృష్ణ


Palli Balakrishna Sunday, March 17, 2019
Mahakavi Kshetrayya (1976)



చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం: పి. ఆదినారాయణ రావు
నటీనటులు: అక్కినెని నాగేశ్వర రావు,  అంజలి దేవి, మంజుల 
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు 
నిర్మాత: పి. ఆదినారాయణ రావు 
విడుదల తేది: 31.03.1976



Songs List:



ఆ.. రేపల్లె లోని గోపాలుడంట.. పాట సాహిత్యం

 
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం: పి. ఆదినారాయణ రావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: వి.రామకృష్ణ

పల్లవి:
ఆ.. రేపల్లె లోని గోపాలుడంట.. ఏ పిల్లనైనా చూస్తే తంట
తలచుకుంటె ఆ జగడం కన్నుల పంట.. ఓ మజా మజా కన్నుల పంట 

ఆ రేపల్లె లోని గోపాలుడంట.. ఏ పిల్లనైనా చూస్తే తంట
తలచుకుంటె ఆ జగడం కన్నుల పంట.. ఓ మజా మజా కన్నుల పంట

చరణం: 1
సుందరి జాణ బిందెలతోటి నీలాల రేవు కొచ్చిందట 
సుందరి జాణ బిందెలతోటి నీలాల రేవు కొచ్చిందట

కళ్ళు కోలాటమాడ మెచ్చిందంట
క్రిష్ణయ్య రాగా అహ కేరింతలాడ.. క్రిష్ణయ్య రాగా కేరింతలాడ

పైట జారె బిందె జారె తెల్లబోయి పిల్లా జారె
పైట జారె బిందె జారె తెల్లబోయి పిల్లా జారె       

తలచుకుంటె ఆ వైనం నవ్వులపంట
ఆ రేపల్లె లోని గోపాలుడంట ఏ పిల్లనైనా చూస్తే తంట
తలచుకుంటె ఆ జగడం కన్నుల పంట

చరణం: 2
చక్కని చుక్క సందేళ గుళ్ళో.. మొక్కులు మొక్కంగ వచ్చిందంట
చక్కని చుక్క సందేళ గుళ్ళో.. మొక్కులు మొక్కంగ వచ్చిందంట

అహ.. నిక్కుతు నీల్గుతు వచ్చిందంటా
నల్లనివాడు అల్లవరగా.. నల్లనివాడు అల్లవరగా
కళ్ళు కలిపే ఒళ్ళు మరిచే.. దూరాన మొగుడు కారాలు నూరె కళ్ళు
కళ్ళు కలిపే ఒళ్ళు మరిచే.. దూరాన మొగుడు కారాలు నూరె కళ్ళు

తలచుకుంటె ఆ రగడ రవ్వలమంట
ఆ రేపల్లె లోని గోపాలుడంట ఏ పిల్లనైనా చూస్తే తంట
తలచుకుంటె ఆ జగడం కన్నుల పంట

చరణం: 3
అందాలభామ చిందులు వేయ అందలమెక్కి సాగిందంట
అందాలభామ చిందులు వేయ అందలమెక్కి సాగిందంట..
తన అందాలు కాస్త దాచిందంట

పిల్లనగ్రోవి మొల్లనవింటే.. హాయ్‌ పిల్లనగ్రోవి మొల్లనవింటే
మేనుపొంగి మేనా ఆపి.. తానేమొ క్రిష్ణయ్య సన్నిధి చేరె
మేనుపొంగి మేనా ఆపి.. తానేమొ క్రిష్ణయ్య సన్నిధి చేరె

తలచుకుంటె ఆ జోడి గువ్వలజంట
ఆ రేపల్లె లోని గోపాలుడంట ఏ పిల్లనైనా చూస్తే తంట
తలచుకుంటె ఆ జగడం కన్నుల పంట.. ఓ కన్నుల పంట




జాబిల్లి చూసెను నిన్ను నన్ను పాట సాహిత్యం

 
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం: పి . ఆదినారాయణ రావు
సాహిత్యం: దాశరథి 
గానం: పి. సుశీల,  వి.రామకృష్ణ 

జాబిల్లి చూసెను నిన్ను నన్ను ..
ఒయమ్మో..
నా కెంత సిగ్గాయె బావా బావా.. నను వీడలేవా??
పొదరిల్లు పిలిచేను నిన్ను నన్ను..
ఓయబ్బో..
నీకింత సిగ్గెల బాల బాల.. నను చేరరావా??

ఆ ఆ ఆ

ఆ ఆకాశ మార్గాన అందాల మేఘాలు పెనవేసుకున్నాయి చూడు..
చిగురాకు సరదాలు చిరుగాలి సరసాలు గిలిగింతలాయేను నేడు..
అందచందాలతో..ప్రేమబందాలతో..
జీవితం హాయిగా సాగనీ!!

బాలా..రావా..నను చేరరావా??

ఆ ఆ ఆ
ఆ కొమ్మపై ఉన్న అందాల చిలకలు అనురాగ గీతాలు పాడేను..
సిరిమల్లె ఒడిలోన చిన్నారి తుమ్మెద మైమరచి కలలందు కరిగేను
ముద్దుమురిపాలతో..భావ రాగాలతో..
యవ్వనం పువ్వులా నవ్వనీ!!

బావా బావా.. నను వీడలేవా??

ఆ ఆ ఆ బంగారు చెక్కిళ్ళూ పొంగారు పరువాలు కొనగోట మీటులే కోరేను..
నీ లేత అధరాలు, ఎంతెంత మధురాలు,ఈనాడు నా సొంతమాయేను..
దేవి దీవించేను..స్వామి  వరమిచ్చెను..
ఇద్దరం ఏకమౌదాములే!!

బాలా..రావా..నను చేరరావా??

జాబిల్లి చూసెను నిన్ను నన్ను ..
ఒయమ్మో..
నా కెంత సిగ్గాయె బావా బావా.. నను వీడలేవా??
పొదరిల్లు పిలిచేను నిన్ను నన్ను..
ఓయబ్బో..
నీకింత సిగ్గెల బాల బాల.. నను చేరరావా??

ఆ ఆహహ ఆహహ.. ఆ ఆ ఆ ఆ ఆహ ఆహ హహ..
ఆ ఆహహ ఆహహ.. ఆ ఆ ఆ ఆ ఆహ ఆహ హహ..




ఎందు ఎందని నిన్ను పాట సాహిత్యం

 
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం: పి. ఆదినారాయణ రావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి. సుశీల 

పల్లవి:
ఎందు ఎందని నిన్ను గోవిందా వెతికేది
ముందుగా రమ్మని మోసగించేవా నా స్వామి :

చరణం: 
అంగాడా నిన్ను పొందని నా మనసు | అందః
వనమందు గాచిన మధుర వెన్నెలగదరా
ఎందు ఎందని నిన్ను గోవిందా వెతికేది
ముందుగా రమ్మని మోసగించేవా
నా స్వామీ !





శ్రీపతి పాట సాహిత్యం

 
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం: పి. ఆదినారాయణ రావు
సాహిత్యం: క్షేత్రయ్య
గానం: వి.రామకృష్ణ

పల్లవి:
శ్రీపతి సుతు బారికి నేనోపలేక నిను వేడితే
కోపాలా మా మువ్వగోపాలా

చరణం: 
ఏ పొదూ దానింటిలోనే కాపెయుండి
నీ సరస సల్లాపాలా మా మువ్వగోపాలా
నీ పొందెల్ల దాని ప్రాపై

ఏ పొందు లేక వుసురుమనుటే
నా పాలా మా మువ్వగోపాలా
శ్రీపతి సుతు బారికి నేనోపలేక నిను వేడితి
కోపాలా మా మువ్వగోపాలా




ఇన్నాళ్ళవలె గాదమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం: పి. ఆదినారాయణ రావు
సాహిత్యం: క్షేత్రయ్య
గానం: వి.రామకృష్ణ

పల్లవి:
ఇన్నాళ్ళవలె గాదమ్మా - మువ్వగోపాలుడూ
ఎన్నెన్నో నేర్చినాడమ్మా

చరణం: 
నన్ను కన్నులు మూసి నా చెంతనుండిన
నన్ను కన్నులు మూసి నా చెంతనుండిన
సన్ను తాంగి మోవి చాలా చప్పరించేనే
ఇన్నాళ్ళవలే గాదమ్మా మువ్వగోపాలుడు
ఎన్నెన్నో నేర్చినాడమ్మా




అదరీనె మోవి తనకుతానే పాట సాహిత్యం

 
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం: పి. ఆదినారాయణ రావు
సాహిత్యం: క్షేత్రయ్య
గానం: వి.రామకృష్ణ

పల్లవి: 
అదరీనె మోవి తనకుతానే
వదలీనె నీవి

చరణం: 
మదిలోన వాడేమొ మంత్రించె గాబోలు
మదిలోన వాడేమొ మంత్రించె గాబోలు
సుదతీ మువ్వ గోపాలుని జూచినది మొదలు
అదరీనె మోవి తనకుతానే
వదలీనే నీవి





ఇద్దరి సందున పవ్వళించియున్న పాట సాహిత్యం

 
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం: పి. ఆదినారాయణ రావు
సాహిత్యం: క్షేత్రయ్య
గానం: వి.రామకృష్ణ

ఇద్దరి సందున పవ్వళించియున్న -
ఆ యింతి పేరేమిరా.... ఆ.... ఆ....
ఇద్దరి సందున సవ్వళించియున్న-
ఆయింతి పేరేమిరా....
గద్దరి వగల మా మువ్వ గోపాలుడ
గద్దరి వగల మా మువ్వ గోపాలుడ
గాజుల చప్పుడు
గాజుల చప్పుడు నే వింటి గదరా....



నజరానా ! ఈ నాజుకె న హసీనా పాట సాహిత్యం

 
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం: పి. ఆదినారాయణ రావు
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి 
గానం: పి. సుశీల 

పల్లవి: 
నజరానా ! ఈ నాజుకె న హసీనా
మధుడోలా వూగే వేళ
నజరానా ! ఈ నాజూకె న హసీనా

సాకి 1 
పదవాలలో ఎన్ని మురిపాల సెలయేరులో
నయనాలలో ఎన్ని వయారాల తుఫానులో
అధరాలలో ఎన్ని చురుకైన విరితేనెలో
సరిచూసే నవరసికులకే తెలుసు,
రేరాజులకే తెలుసు
హాయ్ ! నాటుకునే కౌసచూపులకే తెలుసు,
సరితీవుకే తెలుసు
అవి తెలిసే సరదారులకే నా మనసు
నజరానా ! ఈ నాజూకె న హసీనా 

సాకి 2 
చెలిపిలుపులో ఎన్ని సరాగాల సరిగమలో
తొలివలపులో ఎన్ని గులాబీల ఘుమఘుమలో
మలితలపులో ఎన్ని మరందాల మధురిమలో
పులకించే ఎల నవ్వులకే తెలుసు,
ఆ రవ్వలకే తెలుసు
హాయ్  చివురించే నునుచెంపలకే తెలుసు,
ఆ కెంపులకే తెలుసు
ఆ వెలతెలిసే బేహారులకే నా సొగసు
నజరానా ! ఈ నాజూకై న హసీనా
అల్లాకు నమాజే నజరానా
ములాకు రివాజే నజరానా
మెహఫిల్కు షాయిరే నజరానా
దోస్తుకు మొహబ్బత్ నజరానా
మనసిచ్చే ప్రియునికి - మొహబ్బత్ నజరానా
నజరానా ! ఈ నాజూకె న హసీనా
మధుడోలా వూగే వేళ
నజరానా ఈ నాజూకై న హసీనా 



ఎటువంటి మోహమో గాని పాట సాహిత్యం

 
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం: పి. ఆదినారాయణ రావు
సాహిత్యం: క్షేత్రయ్య
గానం: వి.రామకృష్ణ

ఎటువంటి మోహమో గాని
ఓ యలనాగ యింతింత యనగరాదే 

ఎటువంటి మోహమో గాని
ఓ యలనాగ యింతింత యనగరాదే

మటు మాయ దైవమీ 
మనసు తెలియగ లేక 
మనలనెడబాసనయ్యో 
మటు మాయ దైవమీ 
మనసు తెలియగ లేక 
మనలనెడబాసనయ్యో 
ఓ.. మగువ.. 

ఎటువంటి మోహమో గాని
ఓ యలనాగ యింతింత యనగరాదే

కలికి నిన్నెడబాసినది 
మొదలు నీరూపు
కనులకే కట్టి నటులుండునే 
చెలియ నేనొకటి తలచెదనన్న 
నీ చేయు చెలిమి తలపై యుండునే 
ఓ మగువా

సొలసి నేనేయైన వ్రాయ నీయాకార 
శోభనమే కనుపించునే
సొలసి నేనేయైన వ్రాయ నీయాకార 
శోభనమే కనుపించునే

ఎటువంటి మోహమో గాని
ఓ యలనాగ యింతింత యనగరాదే




శ్రీ మన్మహాదేవ దేవాదిదేవా పాట సాహిత్యం

 
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం: పి. ఆదినారాయణ రావు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పిఠాపురం, పి.సుశీల, ఆనంద్ 

భృంగి : శ్రీ మన్మహాదేవ దేవాదిదేవా
త్రిలోకాధినేతా : నమో ఆదిదేవా
నమోభ క్తపాలా ! నమ స్తే, నమస్తేః నమః :

శివుడు : ఔరా భృంగీ : నన్ను ప్రార్ధించిన
కారణంబేమిరా ?

భృంగి : హే స్వామిన్ : నేను మొన్న ములోకముల
కేగినపుడు, అచట దేవతలందరూ నన్ను చూచి,
మీ స్వామివారు సగము పురుషుడుగాను, సగము
స్త్రీగాను సంచరించుచున్నారట, నిజమా? అని
నన్నడగిరి ఇంతకూ, తాము స్త్రీయో పురుషుడో
నాకు కొంచెము సెలవిచ్చెదరా !

శివుడు : ఓహో ! అదియా నీ సందేహము, మీయమ్మ
గారిని ప్రార్ధించిన, నీ సంశయము తీర్చేనురా
డింగరీ :

భృంగి : హే జననీ జగన్మాతా !
ఆమ్మా రావమ్మా, రాజేశ్వరీ రావమ్మా
పరమేశ్వరి, కామేశ్వరి, భాగేశ్వరి
రాజేశ్వరి, కాదంబరి, హేమాంబరీ, నీలాంబరి,
కూచిపూడి భాగవత వినోదకరి ఓఅమ్మా రావమ్మా
రాజేశ్వరీ రావమ్మా

పార్వతి : భృంగి : నను తలచిన కారణంబేమిరా ?

భృంగి : అమ్మా : మీరు శివుని వామభాగమును, ఆక్ర
మించుటకు గల కారణమేమిటో విన కుతూహల
ముగా నున్నయది.

పార్వతి : అయితే వినుము. ఒకానొక సంధ్యా సమయ
మున, స్వామివారినిచేరి స్వామీ వివాహ కాల
మందు మీ శరీరములో సగభాగమి త్తునని ప్రమా
ణము చేసితిరి గదా, అమాట యిప్పుడు నిలుపు
కొమ్మని వేడితిని. స్వామివారు నా కోర్కెను
మన్నించి అర శరీరము నిచ్చుటచే వారి ఎడమ
భాగము నాక్రమించితిని.

భృంగి: అమ్మోయి సరే దీనికేమిగాని -
కం॥ ఓ యమ్మ నీ మగండొక
తో యజ ముఖి గంగ యనగ
రేయింబవలా సవతని
కాయజు సమరాన సతము
తోడ్కోని దెచ్చెన్
కలియుచు నుండెన్
సవతిని సతము కలియుచు ను డెన్

పార్వతి : ఏమేమీ : అదేమో వివరముగా చెప్పరా ?

బృంగి: వింటివా  పార్వతి వింటివా !
బంగరు బొమ్మవలె తల్లీ పార్వతీ నీ వుండగా
గంగ మాంబను తెచ్చి శివుడు
పొంగి శిరమున బెటుకున్నా డెరుగవా
అయ్యో ఎరుగవా?

పార్వతి : గంగమాంబను తెచ్చినావని
బృంగినాతో బల్కినాడూ
మగనాలి పొందు తగదటంచును
ఇంగితము యింతైన ఎరుగవ దేమయా
శివుడు : నిండు వేసవికాలమున!
స్వామి, ఏమయా !
జలముండునో లేకుండునోయని
దండిగా నదిని దెచ్చి
జడలో దాచియుంచినాను. ఎరుగనే అన్యమెరుగ నే

పార్వతి : నదిని తెచ్చిన మాట యది నిజమనుచు
నేను నమ్మజాల
ఆందమైన కాంతమో మది కానుపించిన కారణంబే
తెలుపవా, స్వామి తెలుపవా ? :

శివుడు: కొంతయో మది కాదు చెలియా
కలువయే వికసించె నచట
చందమామ చెంతనిలచి -
అందముల నొలకించుచుండె
నమ్మవే, ముద్దుగుమ్మవే -

వ॥
ఔరా డింగరీ ! శంకర సతికి శంక వద లెనురా
సదా శివుడు సదా సాంబ శివుడేనురా !

భృంగి:  సత్యం స్వామీ సత్యం
ఒక వంక మీసమ్ము - ఒక వంక హాసమ్ము
ఒక వంక నాగమ్ము - ఒక వంక పతకమ్ము
ఒక చేత శూలమ్ము - ఒక చేత పుష్పమ్ము
ప్రకటారనారికి మంగళం నిత్యమంగళం:
మంగళం: నిత్య మంగళం :





విడజారు గొజ్జంగి పాట సాహిత్యం

 
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం: పి. ఆదినారాయణ రావు
సాహిత్యం: క్షేత్రయ్య
గానం: వి.రామకృష్ణ

చరణం: 1 
విడజారు గొజ్జంగి విరిదండ జడతోను
విడజారు గొజంగి విరిదండ జడతోను
కడుచిక్కుపడి పెనగు కంఠసరములతోను
నిడుద కన్నులతేరు నిదుర మబ్బులతోను
తొడరి పదయుగమున తడబడెడు నడతోను

పల్లవి: 
మగువ తన కేళికా మందిరము వెడలె
వగకాడ మా కంచి వరదా తెల వారెననుచు

చరణం: 2 
సరితీపు సేయు సమసురతి బడలికతోను
జరుత పావడ చెరగు జార్పైటతోను
ఇరుగడలకె దండలిచ్చూ తరుణులతోను
పరమాత్మ మువ్వగోపాలా తెల్లవారెననుచు




చల్లగా నెలకొనవయ్యా పాట సాహిత్యం

 
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం: పి. ఆదినారాయణ రావు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: వి.రామకృష్ణ

పల్లవి: 
చల్లగా నెలకొనవయ్యా, మా
తిల గోవిందరాజ, చలగా నెలకొనవయ్యా
మాట చెల్లించ రావయ్య చిదంబరం నటరాజా

చరణం: 
గంగను తలదాల్చిన ఘనధీరుడవోలింగా
గంగకు జన్మ స్థలినీపాదమె శ్రీరంగా
లింగడై న న నేమి శ్రీరంగడైన నేమి
కొంగు బంగారు మువ్వ గోపాలుడైన నేమి
అంగరంగ వైభవాల హరిహరులొకటే సుమీ
హరిహరు లొకటే సుమీ 
ఓం నమశ్శివాయ - ఓం నమోకేశవాయ
ఓం నమశ్శివాయ ఓం నమోకేశవాయ




చేకొని మన్నారు దాసుడు పాట సాహిత్యం

 
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం: పి. ఆదినారాయణ రావు
సాహిత్యం: రంగాజమ్మ పద్యం 
గానం: పి.సుశీల 

చేకొని మన్నారు దాసుడు
కాక్కాలు గుణించు పిన్న కాలమునాడే
లాకేత్వ మియ్య నేరడు
దాకును కొమ్మియ్య డిటి ధన్యులు గలరే....



శ్రీ మానినీ మాన సాంభోజమిత్రా పాట సాహిత్యం

 
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం: పి. ఆదినారాయణ రావు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: వి. రామక్రిష్ణ 

దండకం : శ్రీ మానినీ మాన సాంభోజమిత్రా,
దశత్పద్మ నేత్రా
సుకరిదర్ప కోట్యం చితాగణ్య తారుణ్య లావణ్య
శ్రీరంగశాయీ : చిదానందదాయీ 
భవద్దర్శ నా పేక్షతో దీక్షతో మించి ఏ తెంచీ
నీ ద్వార వాకిళ్ళ పొంగారునా ఆశ భంగమ్ము
నేముందుగా పొందగా
నిన్ను వీక్షించలేనటి నాయక్షియుగ్మాన కన్నీరు
మున్నీరుకాగా
విలాపమ్ము నాలించి లాలింపవా
నన్ను పాలింపవా దేవ శ్రీరంగ నాథా
దయాసాగరుండన్న నీదౌ బిరందమ్ము దండైన
నీశక్తి నిండైన నా భక్తి మెండైన స్వామీ
విపన్నున్ ప్రసన్నుండవై భిన్నతంబాపి
మన్నింపవే

సన్న గాధీశ తల్పా :
కృపాతల్ప వందారు కల్పా !
నమ స్తే - నమ స్తే
నమః



శ్రీ విజయాయు రున్నతులచే పాట సాహిత్యం

 
రంగాజమ్మ పద్యం
పాడినది: పి. సుశీల

శ్రీ విజయాయు రున్నతులచే నలరించెద
గొల్చువారలన్
దీవి భవంబు మీరనని దెల్పుచు హేమవనిన్
చెలంగు రా
జీవ దళాయతాక్షుడగు మన్ననారు గోత్రా
విభుదేంద్రునిన్ విజయరా
ఘవ చంద్రుని బ్రోచు గావుతన్




భూ తలమున శిబికరుడు పాట సాహిత్యం

 
భూ తలమున శిబికరుడు
దాతలనే శుద్ధి సుద్ధ దబ్బర్ నిన్నెం
చే తరి వదాన్యు డెవ్వడురా 
తంజావూరు విజయరాఘవ నృపతీ :



చిన్నప్పుడె రతికేళిక పాట సాహిత్యం

 
రంగాజమ్మ పద్యం
పాడినది : పి. సుశీల

చిన్నప్పుడె రతికేళిక
నున్నప్పుడు కవితలోన యుద్దములోనన్
వన్నె సుమీ రాకొట్టుట 
మన్నారు పదాజ్ఞ దాసా మంజుల హాసా



వదరాకపో పాట సాహిత్యం

 
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం: పి. ఆదినారాయణ రావు
సాహిత్యం: క్షేత్రయ్య
గానం: వి.రామకృష్ణ

వదరక పో పో వె వాడు ఏలావచ్చీ నీ
వద్దు రావద్దన వే కూడియున్నది చాలునే
అదియొక్క యుగము వేరేజన్మము యిపుడు
అత డెవ్వరో నే నెవ్వరో ఓ.... చెలియా

వలపుకాడిదే వచ్చుననుచు తెరువులు చూసి
నెలలెంచి అలసితి, నిలువరాని ప్రేమ
కలకంఠ శుక నాదములు వినుచు
నెమ్మది నడచుకొంటె
వట్టి ముచ్చట లిక నేలనే
భామరో శకునములు అడగితే మువ్వ
వేసారితి
మధుమాసములు గడిపితీ ॥వదరక ॥
మొదటి పొందే చాలునే
కామించి నాధుల కలయు చెలుల జూచి
గోపాలుడు వచ్చుననుచు
కరగి చింత నొందితి
రామ రామ ఈమేనితో యింక వానిమోము
చూడవలెనా
॥వదరక ॥




ఆ పొద్దు ఈ పొద్దు పాట సాహిత్యం

 
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి  
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి: 
ఆ పొద్దు ఈ పొద్దు ఏ పొద్దురా ముద్దు
మామాసింగా హయ్ రా మామాసింగా
అన్ని పొద్దులూ నాకు ముద్దులూ
చక్కెని నాసింగి పక్కన వుంటేనే హయ్

కోరస్: హుయ్య, హుయ్య, హుయ్య, హుయ్య

చరణం: 
జాము రేతిరి వస్తనంటివి 
మామిడితోపున వుండమంటివి 
ఏమే సింగీ రాలేదేమే సింగీ

పక్కలో అత్తమ్మ పడుకొనివుంటే 
పంచలో మావయ్య పొంచిచూస్తుంటే 
తొలిజాము దాటే నడిజాము దాటె 
తీరాచూస్తే తెల్లారిపోయె

కోరస్: హుయ్య, హుయ్య, హుయ్య, హుయ్య

చరణం: 
మీది మీది కొస్తున్నావు - మీసం మెలివేస్తున్నావు
ఏందిర సింగా కథ ఏందిర సింగా
గుండెల్లో వేడెక్కె
కోరస్: తందానా !
కండల్లో పదునెక్కె
కోరస్: తందాన
నెత్తురు ఉడుకెత్తె
కోరస్: తానె తందాన!
శక్తులు పడగెత్తె
దేవనందనా !

మన్నారు దాసుడు ఉన్నాడు మనతోడు
పడగలేం జేసెను పిడుగు లేంజేసేను
కోరస్: హుయ్య, హుయ్య, హుయ్య, హుయ్య




మేలుకో కవిరాజా పాట సాహిత్యం

 
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం: పి. ఆదినారాయణ రావు
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి  
గానం: యస్.పి. బాలు

మేలుకో కవిరాజా - మేలుకోవయ్యా !!
మేలుకో కవిరాజ మేలుకోవయ్యా !
మేలుకొని పదకవిత లేలు కోవయ్యా!
పలుకు పలుకున జీవకళలు తులకించగా
పదము పదమున భావపదములు రహించగా
శృంగార రస ఝరీ రంగ తరంగ రంగములపై
నీ నుడుల గజ్జెలు ధ్వనించగా -

అష విధనాయికల అనురాగచంద్రికల
మైసిరులు నీ వాణిలో సురభిళించగా
గంధమ్ము నందుకోవయ్యా |
రాగరస గంగలను పొంగిలించవయ్యా !




అష్ట విద నాయకా లక్షణములు పాట సాహిత్యం

 
అష్ట విద నాయకా లక్షణములు

చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం: పి.ఆదినారాయణ రావు
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

1. వాసక సజ్జిక 

పల్లవి: 
ఎంత ముచ్చటైనా వాడే
నా ప్రియుడు ఈ క్షణమే రానున్నాడే 

చరణం: 
ఇదుగో పైట చెంగు తొందరపడెనే
అదుగదుగో పూలపాన్సు గుసగుసలిడెనే
అతని మెత్తని అడుగులసడి
లేతగాలిలో వినబడి
అరెరే నా ఒడలంతా అలజడి_అలజడి_అలజడి

క్షేత్రయ్య: 
పడకిల్లు సరిచేసి పతికొరకు వేచేటి పడతి
వాసక సజిక వాసకసజ్జిక



2. విరహోత్కంఠిత

పాడినవారు: పి. సుశీల, బాలసుబ్రహ్మణ్యం

ఎంత టక్కరి వాడు నా వాడే
ఎంతకు చెంతకు రానేరాదే

వెన్నెల సెగలాయె, విరులే పొగలాయె
అలదిన గంధము అవిరియె పోయె
అదను దొరికెనని మదను డందుకొని
పదును టమ్ములను ఎదను గ్రుమ్మెనే ॥ఎంత ॥

క్షేత్రయ్య : స్మరశిలీ ముఖశిఖా జర్జరిత గాత్ర
ఆ తరుణి విరహోత్కంఠిత :
విరహోత్కంఠిత



3. విప్రలబ్ద 

పాడనది: బాలసుబ్రహ్మణ్యం

క్షేత్రయ్య :
గున్నమావి గుబురింట కలుసుకొమ్మన్న
చెలుడు తనజంట లేడనీ
కొసరి కొసరి కని కసిరి విసిగికొనీ
కుసుమ మాలికలు విసిరి వేసి చని
శోక దిగ్ధయై – కోప దగ్ధయై
విలవిలలాడే విముగ
విభువంచిత విప్రలబ్ద



4. ప్రోషిత భర్తృక
పాడినది : పి. సుశీల, బాలసుబ్రహ్మణ్యం

ఎంత చల్లనివాడె నారేడు
అతడింతలేని గడియలే యుగములేడు ॥ఎంత॥

ఓ.... మెరుపులారా మిడిసి పడేరా
ఓ....మబ్బులారా ఉరిమి పడేరా
నా రాజు సందిట నేనున్న మీదట
మీరు చెదిరిపోతారే - నీరునీరౌతారే

క్షేత్రయ్య: ప్రవాసమున ప్రియుడుండగ
స్వవాసమున రేదివళ్ళు
పొగిలిపోవు నాయిక
ప్రోషిత భర్తృక 


5. అభిసారిక
పాడినది: బాలసుబ్రహ్మణ్యం

క్షేత్రయ్య :
అడుగులోన తన అడుగిడి తడబడి
అలతి అలికిడికి ఉలికి ఉలికిపడి
దెసలు తిలకించి ముసుగు సవరించి

మునురు ముంగురుల కొసలు తొలగించి
విరి వెన్నెలలో సిరి వెన్నెలపై
పెనుచీకటిలో నునుచీకటియె
ఆత్మ విధునికై అన్వేషించే
ఆ నాయిక అభిసారిక :
అభిసారిక : !




జయ జయ గోపాల బాల పాట సాహిత్యం

 
చిత్రం: మహాకవి క్షేత్రయ్య (1976)
సంగీతం: పి. ఆదినారాయణరావు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: రామకృష్ణ, బృందం 

జయ జయ గోపాల బాల 
జయ గోవింద ఆశ్రితపాల
జయ గోవింద ఆశ్రితపాల
జయ జయ గోపాల బాల 
జయ గోవింద ఆశ్రితపాల
జయ గోవింద ఆశ్రితపాల

కృష్ణా...ఆఅ.. గోపాల బాలా... ఆఆఅ..
కమనీయ క్షేత్రయ్య రసగానలోల 
కమనీయ క్షేత్రయ్య రసగానలోల 
కరుణాల వాల కాంచన హేల 
కరుణాల వాల కాంచన హేల

జయ మా మువ్వగోపాల బాల 
జయ మహనీయ కల్పిత లీల  

జయ జయ గోపాల బాల 
జయ గోవింద ఆశ్రితపాల
జయ గోవింద ఆశ్రితపాల

క్షేత్రమ్ముల తిరుగాడే వీనిని 
ప్రీతిగ రమ్మని పిలిచిన దేవా 
క్షేత్రమ్ముల తిరుగాడే వీనిని 
ప్రీతిగ రమ్మని పిలిచిన దేవా
పదసన్నిధికి బక్తుడు చేరా
పదసన్నిధికి బక్తుడు చేరా
పరమార్ధమును తెలుపగ లేవా

జయ జయ గోపాల బాల 
జయ గోవింద ఆశ్రితపాల
జయ గోవింద ఆశ్రితపాల

జయ జయ గోపాల బాల 
జయ గోవింద ఆశ్రితపాల
జయ గోవింద ఆశ్రితపాల

క్షేత్రజ్ఞమ్ చ అపి మామ్ విద్ధి సర్వ-క్షేత్రేషు భారత‌ః ।
క్షేత్ర-క్షేత్రజ్ఞయోః జ్ఞానమ్ యత్ తత్ జ్ఞానమ్ మతమ్ మమ ॥

శరీరమే క్షేత్రము అందు నివశించు జీవాత్మయే క్షేత్రజ్ఞుడు 
ఈ పరమార్ధమును తెలుసుకున్నవాడే మహా జ్ఞాని 
అట్టి వానికే నేను మోక్షమునిచ్చుచున్నాను 

ధన్యుడనైతిని నీ బోధనచే 
ధన్యుడనైతిని నీ బోధనచే 
సరగున మోక్షమునీవా
హే పరమాత్మా నా జీవాత్మను 
హే పరమాత్మా నా జీవాత్మను 
లీనము చేసుకోవా 

జయ జయ గోపాల జయ జయ గోవింద
జయ జయ గోపాల జయ జయ గోవింద
జయ జయ గోపాల జయ జయ గోవింద
జయ జయ గోపాల జయ జయ గోవింద
జయ జయ గోపాల జయ జయ గోవింద

Palli Balakrishna Tuesday, February 19, 2019

Most Recent

Default