Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Anjali Devi"
Ram Robert Rahim (1980)



చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980)
సంగీతం: కె.చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, డా॥ సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, సాహితి 
గానం: యస్.పి.బాలు, ఆనంద్, పి.సుశీల , యస్. పి. శైలజ, కె. చక్రవర్తి 
నటీనటులు: రజినీకాంత్, కృష్ణ, చంద్రమోహన్, శ్రీదేవి, సునీత, ఫటా ఫట్ జయలక్ష్మి, అంజలీ దేవి, హలం 
దర్శకత్వం: విజయనిర్మల 
నిర్మాత: ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు 
విడుదల తేది: 31.05.1980



Songs List:



అమ్మంటే అమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: కె. చక్రవర్తి 

అమ్మంటే అమ్మ ఈ
అనంత సృష్టికామె అసలు బ్రహ్మ
రక్తాన్ని అర్పించి ప్రాణాన్ని పూరించి
చేస్తుంది నీ బొమ్మ

మరణాన్ని ఎదిరించి
మరోసారి

జన్మించి
ఇస్తుంది - నీకు జన్మ
ధనం పోసి కొనలేము
రుణం తీర్చుకోలేము అందుకే అమ్మా
విధి ఆడే ఆటలో
విడిపోయే బ్రతుకుల్లో
మిగిలేదే మమకారం
మిగులుండే మమతల్ని
తెగిపోనీ బంధాన్ని
కలిపేదే తల్లి రక్తం
తనకు కన్ను నీవై తే
నీకు రెప్ప తానౌతుంది అందుకే అమ్మా




చిలకుందీ చిలక పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు 

సాకి
మన సైన సొగసుపైన మధువే కురిపించనా
మధువే కురిపించనా - వలచే నెలవంక వంక
గులాబీ విసిరేయనా

పల్లవి : 
చిలకుందీ చిలక
ముసుగున్న చిలక ఆ చిలకమ్మ ముసుగును
తొలిగించకుంటే నేను రహీమును కానేకాను

చరణం : 1
ఏ వైపు చూసినా నేను
ఎన్నో చూపులు నా వైపు
మాట వినని నా చూపు
దూకుతోంది మరోవైపు
అఁ కలల్లో కదిలే యువరాణి
కళలు విరజిమ్మే విరిబోణి
నిన్ను తొలిసారి చూశాను

ప్రేమ గీతాలు రాశాను
ఇంక నిన్ను ఇంక నిన్ను
మేలి ముసుగు మేలి ముసుగు వుంచలేను
లోకానికి బయపడకే బాల
లోగుట్టు తెలుసుకోవే బేల
అరె ఒక్క సారైన నీ మోము చూపించు
నీ సొగసు గుప్పించు - లేకుంటే నీ పేరు

పదిమందిలో చెప్పి మన గాథ ముడి విప్పి
వలపంటే ఏమో ఎరిగించకుంటే
ఆఁ.... చిలకమ్మ ముసుగును తొలగించుకుంటే
హె.హె., హె.. నీవు రాహీమువు కానేకావు
కోరస్

చరణం : 
అల్లా దయవల్ల ఆ మోము కనిపించే సుబానల్లా
ఈ వాలు కళ్ళలోన ఇంకా తొలిసిగ్గులేనా
ఇటేమో గుండె గుబులాయె
ఆటేమో సిగ్గు తెరలాయె
విషాదం కమ్మిందొక కంట
వినోదం చిమ్మిందొక కంట
ఆ.... బాపురే ఏమి ప్రియురాళ్ళు
జాలి కనరాని గుండ్రాళ్ళు
మొదట వగలొలక పోస్తారు
పిదప సెగలార పోస్తారు
చెలీ వున్న మాటంటే నువ్వులికి పడతావు
చురుకెత్తి నీ మోము తెరలోన దాసావు
నీ వయసు నిప్పైతె నా వలపు జల్లై
అలకల మంటలు చల్లార్చకుంటే
నీవు రహీమువు కానేకావు




ఒక్కసారి ముద్దు పెట్టు పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

ఒక్కసారి ముద్దు పెట్టు 
వుండలేను చేయి పట్టుకో
మెత్తగా మెల్లిగా - మేనిలో జిల్ జిల్లుగా
ఒక్కసారి ముద్దు పెట్టుకో - వుండలేను
చేయి పట్టుకో
కొత్త, కొంటెగా, గుండెలో ఝల్ ఝల్లుగా

చరణం : 1
ఎంతలో ఎంతగా ఎదిగినావే అమ్మడూ, మొగ్గవో
పుష్వవో చెప్పుమరి ఇప్పుడు చెప్పు వేమరిప్పుడు
నువు చూస్తే సిగ్గువేస్తే, పువ్వునై నా మొగ్గనే
నీ ముందుంటే ముద్దంటే మొగ్గనైనా పువ్వునే.... ||ఒక్కసారి||

చరణం : 2
అంతగా చూడకు- వింతగా వున్నది 
మెరుపులా కొంక వురకలేస్తూ వున్నది
వురక వేస్తే పరవశిస్తే ఒదిగిపోనా సందిట 
గాలికై నా చోటులేదు కరిగే మన కౌగిట ॥ఒక్కసారి॥




మైనేమ్ ఈజ్ రాబర్ట్ పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: మాధవపెద్ది రమేష్.

పల్లవి : 
మైనేమ్ ఈజ్ రాబర్ట్ గంజాల్విజ్
ఐ కమ్ ఫ్రమ్ లౌల్లీ పేరడైజ్
ఎవరైనా అమ్మాయి మా ఇంటికి రావాలంటే
వలపుల పేట షోకుల వీధి
డోరు నెం. 420 చార్ సౌబీన్
దట్స్ మై ఎడ్రస్

చరణం: 1 
ముదొచ్చే అందాలు మురిపించే మోహాలు
ఇద్దరిలో వున్నాయి ఈనాడే కలిశాయి
నన్నే నన్నే చూడు కుదిరే ఈడూ నాతో కలిసి ఆడు 
నా గుండెల్లో బాజాలు మోగించు

వన్నెలులు చూసి చూసి తిన్నగ వచ్చెయ్
డోర్ నెంబరు 420 చార్ సౌబీన్
ఎక్స్ క్యూజ్మీ ప్లీజ్

చరణం: 2 
ప్రేమిస్తే వస్తాయి ఎన్నెన్నో కష్టాలు
నిజమయిన ప్రేమయితే పండేను స్వప్నాలు
వుందా వుందా వలపు మనసూ మనసూ కలుపూ
మనదే మనదే గెలుపు

నా కళ్ళలో కాపురమే వుంటావా
నీది నాది ఒకటే ఇల్లు
డోర్ నెంబరు 420 చార్ సౌబీస్
ఎక్స్ క్యూజ్ మీ ప్లీజ్



ఒక అమ్మాయి ఒక అబ్బాయి పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పలవి :
ఒక అమ్మాయి ఒక అబ్బాయి
కలిసి మెలిసి కౌగిట బిగిసే బంధాలలో
కురిసిందీ పదే పదే పడుచంధంలో
తొలకరి చినుకుల చిటపటలాడే జడివాన! 

చరణం: 1 
కనులు దాటే కబురు వింటే
మనసు దాటే మనసు వింటే
తలుచుకుంటే పులకరింతే
కలుసుకుంటే కౌగిలింతే
నీలో కొత్త మెరుపే మెరిసి 
నాలో ఉరుమై ఒకటై కలిసి పొమ్మంటే
ఎదా ఏదా ఉండి ఉండి ఝుమ్మంటుంటే
ఆ చలి చలి పిడుగుల సరిగమలేవో వింటుంటే

చరణం: 2
వలపు వీణ పిలవసాగే
వయసు వయసు కలవసాగే
నిదర రాక రేయి పగలై
నీవు రాక తీపి సెగలై

ఏదో కొత్త బంధం కలిసి నువ్వూ నేనూ మనమై ఏక మవుతుంటే
హాఁ అదే అదే అందమైన గొడవౌవుతుంటే
ఈ మురిసిన పెదవుల ముసి ముసి నవ్వులు చూస్తుంటే

చరణం: 3
నవ్వు చాలు నాకు రశీదు
మనసు చాలు మక్కా మసీదు
చాలు చాలు నీ నమాజు
సరసమాడే సందె మోజు
ఇలవంక దిగి వచ్చే నెలవంక
నీవింక రావాలి నా వంక
కని విని ఎరుగని కమ్మని కథ వింటుంటే
నీ అల్లరి వలపుల ఆవిరి సెగలకు సెలవింక




సాయిబాబా ఓ సాయిబాబా పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు

పల్లవి : 
సాయిబాబా  ఓ సాయిబాబా షిర్డీ సాయిబాబా 
ఈ ఇలలో మరో పేర వెలసిన దేవా 

అను పల్లవి: 
కన్నీళ్ళు దాచీ కడకొంగు సాచీ
వచ్చాము దేవాః కరుణించ రావా || సాయిబాబా ||

చరణం: 1
మొక్కెదమో సాయి దేవా
ముక్తికి నీవే త్రోవ
పిన్నలనూ లాలించేవు
పెద్దలను పాలించావు
అందరి మొర విని ఆండగ నిలిచీ

అభయము నొసగీ నడిపించేవు
భక్తుల రిక్తుల దీనుల హీనులు
బాధలు తొలగించేవు 
"బాబా" అని నోరారగ పిలిచిన
బాబూ అని పలికేవు
సాయిదేవాః కావ రావా 
ఏ మతమైనా ఏ కులమైనా
కాపాడు బాబా మా పాలిదేవా

చరణం: 2 
ప్రతి బాటా షిర్డీ వైపే
ప్రతిచోటా నీ రూపే
ఊరూరా నీ మందిరమే
ఇంటింటా నీ వందనమే
ఆర్తుల చేసే ప్రార్థనలన్నీ
అన్ని వేళలా ఆలించేవు
చెదరిన బ్రతుకులు చివరికి కలిపే

చిన్మయమూర్తివి నీవే
ఆరిన దివ్వెల చీకటి గుండెల
ఆశాజ్యోతివి నీవే !
సాయిదేవా ! కావరావా !
ఓ దేవా శరణం  నీ దివ్య చరణం
ఎంతెంత మధురం నీ నామ స్మరణం

కోరస్ : 
సాయిబాబా - ఓ సాయిబాబా
షిర్డీ సాయిబాబా - సాయిబాబా




లక లక లక లక చెంచుక పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: సాహితి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి:
లక లక లక లక చెంచుక
తక తక తక తక దంచుక
ఊరు చేరింది ఊర పిచ్చుక
మహాజోరు చేసింది కన్నెపిచ్చుక
లక లక లక లక చెంచుక
తక తక తక తక దంచుక
పంట చూసింది కొంటె గోరింక
నా జంటకొచ్చింది పె డి గోరింక

చరణం : 1
ఎగిరి .... ఏటికెగిరి
మునిగి .... నీట మునిగి
ఒళ్ళంత కసూరె....వయసంత ముస్తాబే
పెందలాడే సందెకాడే
అంబరాల ఎగిరొచ్చావా
ఈ సంబరానికే దిగి వచ్చావా

చూసి.... దారి కాచి
వేసి .... కన్ను వేసి
నూనూగు మీసంతో....
నీటైన వేషంతో
సరదాగ దొరలాగ
పండగపూట చూసుకున్నావా
నీ పట్టపు రాణిని చేరుకున్నావా

చరణం : 2
ఎగిరి .... తోటకెగిరి
వెదికి.... చోటు వెదికి
బూరుగ చెట్టె... నేరుగ వచ్చేసి
రాజుగారి రాక కోసం
బొంతలెన్నో నేసుంచాను
పాల పుంతలన్నీ పక్కేశాను

చూసి.... నిన్ను చూసి
చేరి .... చెంతచేరి
పరువాల మరువాలు .... అందాల దవనాలు
గూటిలోన గుట్టుగాను
దాచినావని తెలుసుకున్నాను.
అని దక్కించుకోవాలని కలుసుకున్నాను





ముగ్గురు కలిసి ఒకటై నిలిచీ పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ రాబర్ట్ రహీమ్ (980)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, ఆనంద్, రమేష్ 

పల్లవి : 
ముగ్గురు కలిసి ఒకటై నిలిచీ
ముందుకు దూకారంటే ఆ
శక్తులు మూడూ ఎవరని అంటే
రాం రాబర్ట్ రహీంలు

చరణం: 1 
మా రూపం వేరైనా మా రక్తం ఒక పేరా
పెళ్ళి గడియ ముంచుకొచ్చింది ఇక
పిల్లను రప్పించాలిరా : తుళ్ళిపడకురా పెళ్ళికొడకా
తాళం మేళం బాగా కుదిరింది.. ఇక
తూతూ మంత్రం చదివించాలిరా
పెట్టిన లగ్నం - పట్టిన భరతం
గుర్తుగ మిగలాలంటే - ఈ
శక్తులు మూడు కలిశాయంటే
రాం - రాబర్ట్ - రహీం

చరణం : 2
నేనంటే నేనేలే మేమంటే మేమేలే
ఇంత మంచి తరుణంలో దిగు
లెందుకె పైడిబొమ్మా - గుర్తించవె ననుగున్మమ్మా
ఒలికిన నీ నవ్వులే - ఏ
వెలలేని రతనాలమ్మా
తీరని కలలూ ఈ రోజే తియ
తీయగ పండాలంటే ఈ
శక్తులు మూడూ కలిశాయంటే
రాం రాబర్ట్ - రహీం


Palli Balakrishna Saturday, November 4, 2023
Dr. Anand (1966)



చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, కొసరాజు, డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల, బి. వసంత, పి.బి.శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు
నటీనటులు: రామారావు, అంజలీ దేవి, కాంచన 
దర్శకత్వం: వి. మధుసూదనరావు 
నిర్మాత: డి.వెంకటపతిరెడ్డి
విడుదల తేది: 14.10.1966



Songs List:



చక్కని చల్లని యిల్లు పాట సాహిత్యం

 
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి. సుశీల 

చక్కని చల్లని యిల్లు
చక్కెర బొమ్మలు పాపలు 
మల్లెల మనసులు విరజల్లు
మమతల కలలకు పందిళ్ళు 

చక్కని చల్లని యిల్లు, 
చక్కెర బొమ్మలు పాపలు 
మల్లెల మనసులు విరజల్లు
మమతల కలలకు పందిళ్ళు 
చక్కని చల్లని యిల్లు
చక్కెర బొమ్మలు పాపలు 

చరణం:1
అమ్మా, నాన్నా కట్టినవి
అమ్మా, నాన్నా కట్టినవి
అల్లరి పిల్లలు పుట్టినవీ.. అహహహ 
అల్లరి పిల్లలు పుట్టినవి 
ముద్దుల ముద్దలు పెట్టినవి
ముల్లోకాలకు స్వర్గమిదీ..ఈ..

అహహహా.. అహహహా...అహహహా

చక్కని చల్లని యిల్లు
చక్కెర బొమ్మలు పాపలు 

చరణం: 2
మనసు పెరిగితే ఒకటౌతాము
వయసు పెరిగితే వేరౌతాము 
మనసు పెరిగితే ఒకటౌతాము
వయసు పెరిగితే వేరౌతాము 
పెరిగే మీరు తరిగే మేము 
ప్రేమనిక్కడే చవి చూద్దాము 

అహహహా.. అహహహా...అహహహా

చక్కని చల్లని యిల్లు
చక్కెర బొమ్మలు పాపలు 
మల్లెల మనసులు విరజల్లు
మమతల కలలకు పందిళ్ళు 
చక్కని చల్లని యిల్లు
చక్కెర బొమ్మలు పాపలు 

అహహహా.. అహహహా...అహహహా



నీలమోహనా.. రారా పాట సాహిత్యం

 
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: దేవులపల్లి 
గానం: పి. సుశీల 

పల్లవి: 
నీలమోహనా.. రారా 
నిన్ను పిలిచె నెమలి నెరజాణ 
నీలమోహనా.. రారా
నిన్ను పిలిచె నెమలి నెరజాణ 
నీలమోహనా.. రారా

జారువలపు జడివాన కురిసెరా.. 
జాజిలత మేను తడిసెరా 
జారువలపు జడివాన కురిసెరా.. 
జాజిలత మేను తడిసెరా
లతలాగే నా మనసు తడిసెరా.. 
నీలమోహనా.. రారా
రారా..రారా.. 

చరణం: 1
ఏలాగె మతిమాలి? ఏడే నీ వనమాలి? 
ఏలాగె మతిమాలి? ఏడే నీ వనమాలి? 

అతడేనేమో అనుకున్నానే.. 
అంత దవుల శ్రావణ మేఘములగనీ 
అతడేనేమో అనుకున్నానే.. 
అంత దవుల శ్రావణ మేఘములగనీ 

ప్రతిమబ్బు ప్రభువైతే... 
ప్రతికొమ్మ మురళైతే ఏలాగె 
ఆ... ఏలాగె మతిమాలి.... 
ఏడే నీ వనమాలి? 
హ హా హా.. 
హా హా.. 

నీలమోహనా.. రారా..  
నిన్ను పిలిచె నెమలి నెరజాణ 
నీలమోహనా.. రారా.. రా రా రా... 

చరణం: 2
ఆ... సారెకు దాగెదవేమి? 
నీ రూపము దాచి దాచి 
ఊరించుటకా స్వామీ? 
సారెకు దాగెదవేమి..? 
నీ కన్నుల తోడు నీ కలికి నవ్వుల తోడు 
నీకోసం ఎంత వేగిపోయానో కృష్ణా 
కృషా కృష్ణా కృష్ణా... 
సారెకు దాగెదవేమి..? 

చరణం: 3
అటు... అటు... ఇటు... ఇటు... 
ఆ పొగడకొమ్మవైపు 
ఈ మొగలి గుబురువైపు 

కార్తీక రాతిరిలో కఱి మబ్బుంటుందా...
నీలిమేఘమాకాశము విడిచి... 
నేల నడుస్తుందా ? 
కార్తీక రాతిరిలో కఱి మబ్బుంటుందా...
నీలిమేఘమాకాశము విడిచి... 
నేల నడుస్తుందా ? 

నడిచే మబ్బులకు నవ్వే పెదవుందా? 
నవ్వే పెదవులకూ మువ్వల మురళుందా? 
పెదవి నందితే పేద వెదుళ్ళు 
కదిలి పాడుతాయా? 

నడిచే మబ్బులకు నవ్వే పెదవులు 
నవ్వే పెదవులకు మువ్వల వేణువులు 

మువ్వల వేణువులు... 
మువ్వల వేణువులు




పెరుగుతుంది హృదయం పాట సాహిత్యం

 
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.సుశీల 

పెరుగుతుంది హృదయం 




మదిలోని నా స్వామి పాట సాహిత్యం

 
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

మదిలోని నా స్వామి ఎదురాయె నేడు
శిలయైన నా మేను పలికించినాడు
మదిలోని నా స్వామి ఎదురాయె నేడు
శిలయైన నా మేను పలికించినాడు

అతనిని కనినంత అందెలు పలికే
అతనిని కనినంత అందెలు పలికే
అందెలు రవళించ డెందము పలికే
నాలో శతకోటి భావాలు పలికే

మదిలోని నా స్వామి ఎదురాయె నేడు
శిలయైన నా మేను పలికించినాడు

మనసెరిగిన వాడు మమతల నెలరేడు
వలపుల దీపాలని నిలిపిన చెలికాడు
మనసెరిగిన వాడు మమతల నెలరేడు
వలపుల దీపాలు నిలిపిన చెలికాడు
ఇన్నాళ్లకు తానే నన్నేలినాడు

మదిలోని నా స్వామి ఎదురాయె నేడు
శిలయైన నా మేను పలికించినాడు

అతడే నాపాలి అభినవ వనమాలి
ఆతని నయనాలు అందిన నయనాలు
అతడే నాపాలి అభినవ వనమాలి
ఆతని నయనాలు అందిన గగనాలు
ఆతని పాదాలు నా పారిజాతాలు

మదిలోని నా స్వామి ఎదురాయె నేడు
శిలయైన నా మేను పలికించినాడు.




నీలాల కన్నులతో పాట సాహిత్యం

 
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

నీలాల కన్నులతో ఏలాగో చూసేవు ఎందుకని చూసేవెందుకని



ముసుగు తీయవోయి పాట సాహిత్యం

 
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి.బి.శ్రీనివాస్ 

ముసుగు తీయవోయి 




తళుకు బెళుకు చీరదాన పాట సాహిత్యం

 
చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: కొసరాజు 
గానం: పిఠాపురం, స్వర్ణలత 

తళుకు బెళుకు చీరదాన




చక్కని చల్లని యిల్లు (Female Version) పాట సాహిత్యం

 

చిత్రం: డాక్టర్ ఆనంద్ (1966) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి. సుశీల 

చక్కని చల్లని యిల్లు
చక్కెర బొమ్మలు పాపలు 

Palli Balakrishna Monday, October 16, 2023
Intinti Katha (1974)



చిత్రం: ఇంటింటి కథ (1974)
సంగీతం: రమేష్ నాయుడు 
నటీనటులు: కృష్ణ, చంద్రకళ, అంజలీదేవి
మాటలు: రంగనాయకమ్మ 
దర్శకత్వం: కె. సత్యం 
నిర్మాత: కాకర్ల కృష్ణ 
విడుదల తేది: 20.09.1974



Songs List:



కావాలని వచ్చావా పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటింటి కథ (1974)
సంగీతం: రమేష్ నాయుడు 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

కావాలని వచ్చావా చెయ్యాలని చేశావా
ఈ అల్లరి పనులు ఈ చిల్లర పనులు



ఇంటింటి కథ ఒక బొమ్మలాట పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటింటి కథ (1974)
సంగీతం: రమేష్ నాయుడు 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి. బాలు

ఇంటింటి కథ ఒక బొమ్మలాట



ఉరిమిరిమి చూస్తూ పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటింటి కథ (1974)
సంగీతం: రమేష్ నాయుడు 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి. బాలు, ఎస్ జానకి

ఉరిమిరిమి చూస్తూ 




ఏమిటో అనుకుంటి గోంగూరకి పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటింటి కథ (1974)
సంగీతం: రమేష్ నాయుడు 
సాహిత్యం: కొసరాజు 
గానం: ఎల్.ఆర్. ఈశ్వరి

ఏమిటో అనుకుంటి గోంగూరకి



రమణి ముద్దుల పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటింటి కథ (1974)
సంగీతం: రమేష్ నాయుడు 
సాహిత్యం: కొసరాజు 
గానం: పి బి శ్రీనివాస్,ఎల్.ఆర్. అంజలి

రమణి ముద్దుల 



ఎంత వెర్రి తల్లివో పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటింటి కథ (1974)
సంగీతం: రమేష్ నాయుడు 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: పి. సుశీల

ఎంత వెర్రి తల్లివో


Palli Balakrishna Saturday, June 10, 2023
Nindu Kutumbam (1973)



చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
నటీనటులు: జగ్గయ్య, కృష్ణ , జమున, విజయ లలిత, అంజలీ దేవి 
దర్శకత్వం: పి. సాంబశివ రావు 
నిర్మాత: అమరారామ సుబ్బారావు 
విడుదల తేది: 22.06.1973



Songs List:



పిల్లా పాపల చల్లని గూడు పాట సాహిత్యం

 
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: దాశరధి
గానం: ఘంటసాల

పిల్లా పాపల చల్లనిగూడు 
చెల్లా చెదురై పోయెను నేడు
ఒకరిది నేరం - ఒకరికిభారం 
జీవిత నావకు లేదా తీరం
ఏమైపోవునొ ఈ సంసారం

చరణం: 1
మంచిని మెచ్చే మనిషే లేడు 
మచ్చను చూపును ప్రతివాడు
ఇన్ని తరాల యింటి గౌరవం 
ఒక్క నిందతో మంటగలిసెరా

చరణం: 2
కన్నీళ్ళైనా కషాలెనా 
అన్నిభరించే అమ్మవు నీవు
పిల్లలకోసం జీవించాలి
నిండుకుటుంబం నిలపాలి

చరణం: 3
పసిహృదయానికి తగిలెను గాయం
యెవ్వరులేరు నీకుసహాయం 
వయసుకుమించిన పంతంతో 
పయనించే ఓ పసివాడా
విజయం నీదే నీదేరా !




నవ నవ లాడే నవతరం పాట సాహిత్యం

 
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: దాశరధి
గానం: పి. సుశీల, రమోల, వి.రామకృష్ణ 

యువతరం
నవతరం
నవనవలా దే - నవతరం
ఉరకలువేసే - యువతరం
మనలా అవడం - యెవరితరం
యువతరం
నవతరం

చరణం: 1
ముందు ముందుకు సాగిపోయే
యువకులం మేము
స్వేచ్ఛకోసం పోరుసలిపే
యువతులం మేము
యెవ రేమం టె నేమి - యేపేరు పెడితేనేమి
మనమూ మనమూ యేకమైతే మార్పుసాధిస్తాం

చరణం: 2
ఆటలందూ దోరవయసు
తొంగిచూడాలి
పాటలందూ కొంటె మనసు
పొంగిపోవాలి
చేయీ చేయీ కలిపి
సరదాల తేలి తేలి
పాతకాలం రోతలన్నీ - మరిపించెయ్యాలి

చరణం: 3
యవ్వనమే అందరికీ వఠములాంటిది
నవ్వులతో గడపడమే మనకు మంచిది 
వడివడిగా నీటిలోనే బోటు షికారు
లోతు లోతు కెళుతుంటే భలే హుషారు 
ఛల్ ఛల్ ఛల్ ఛల్ బోటు షికారు 
జిల్ జిల్ జిల్ జిల్ భలే హుషారు 
జంటలుగా వలపుమజా రుచిచూడాలి




తళతళ తళతళ మెరుపే మెరిసింది పాట సాహిత్యం

 
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి. సుశీల, యస్.పి.బాలు 

తళ తళ తళ తళ మెరుపే మెరిసిందీ 
జల జల జల జల జ లేకురిసింది
ఏంచేయాలీ - అబ్బా! ఏంచేయాలీ

మిల మిల మిల కళే మెరిసినవీ
గుబ గుబ గుబ గుబ గుబులేరేగినది
ఏంచేయాలి - అబ్బా ! ఏంచేయాలి 

చరణం: 1
ఏదో చెయ్మని వయసంటే
ఏల తొందరని మనసంటుంది 
మనసుకు వయసుకు మధ్యనచిక్కి 
సొగసే ఉసూరు మంటుంది

చరణం: 2
వెచ్చని జతగా నువ్వున్నావని 
చలి నన్నెంతో మెలివేస్తుంది 
దుడుకుగ దూకే తోడున్నావని 
వలపే వరదై వంచేస్తుంది 

చరణం: 3
ఎత్తూ పల్లా లేకంచేసే
చీకటి ఎంతో బాగుంటుంది
చేయీ చేయిగ యిద్దరముంటే
చీకిటి వెచ్చని వెలుగౌతుంది




అవలీలగా శ్రీరాముడు శివధనువును (పద్యం) పాట సాహిత్యం

 
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: దాశరధి
గానం: పి. సుశీల

అవలీలగ శ్రీరాముడు 
శివధనువును విరిచినంత
చిత్తము పొంగన్
నవ సుమ మాలను చేకొని
అవనీ సుత వచ్చి నిలిచె అతని ఎదుటన్ 
అందమునకె అందమైన సీతమ్మను
ప్రేమమీద చూచె రామమూర్తి
వీరవరుల కెల్ల వీరుడా రాముని
సంతసమున కాంచే జనక జాత
కొంత పులకరింత కొంత చక్కలిగింత 
అతని చూచినంత అదొక వింత 
పూలమాలతోడ - బాలనిండు మనమ్ము 
స్వామి కంఠసీమ వ్రాలిపోయె 




ఎవరు కారణము పాట సాహిత్యం

 
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి. సుశీల, కె.హరిరావు 

ఎవరు కారణము
ఈ లోకమిలా - అల్లకల్లోల మగుటకు
ఎవరు కారణము
ప్రతి మనిషీ బాధలు పడుతున్నాడు 
ప్రతి దానికి దేవుని తిడుతున్నాడు 
దేవుడు పాపం అలోచించాడు 
మనిషికి పాఠం నేర్పాలనుకున్నాడు

సృష్టించాడొక స్త్రీ మూ ర్తిని
చేశాడు రెండుగా దానిని
తెల్లనిదే  మంచిన్నాడు- నల్లనిదే చెడుగన్నాడు


అల్లదిగో మానవలోకం-అక్కడికే పొమ్మన్నాడు
మంచిని నేను
మీ మంచికోరి వచ్చాను...మంచిని నేను 
మీ హృదయాల్లో చోటిస్తే వుంటాను 
ఉండి-మిమ్మల్ని మనుషులుగా చేస్తాను 
రావమ్మా | రావమ్మా ! మా మంచి 
ఏమి తెచ్చావు మాకు దీనినించి 
చీకటి పోగొడతాను
మీలో చీలికలన్నీ మాన్పుతాను 
అందరి నొకటిగ చేస్తాను. 
ఆనందం-అందం-అందిస్తాను 
సమతా-మమతా పండిస్తాను 
శాంతి- సౌఖ్యం-పంచేస్తాను
ఆకలి శోకం లేనిరాజ్యం రామరాజ్యం 
మీలోకంలో స్థాపిస్తాను.

నేను నేనే
నేను నేననే అహం నేనే
నాది నాదనే స్వార్ధం నేనే
బలే బలే నువ్వేకావాలి
పక్కవాడిని తొ క్కెయ్యాలి
గొంతు పిసికి పారెయ్యాలి!
గొయ్యి తవ్వి పూడ్చెయ్యాలి!

అన్నీ చేసాను-మీ ఆశలు తీరుస్తాను 
ధర్మాన్ని ఉరి కెక్కిసాను 
అధర్మాని కే పట్టం కడతాను
రాజకీయ రాక్షసి నా రూపం 
రాపిడి దోపిడి నా రాజ్యం 
ఫిరంగి నాకు మృదంగము 
ప్రేతభూమి నా నాట్యరంగము

మీరే, మీరే |
ఎవరికివారే కారణము
ఈ మంచి వున్నది మీలో నే
ఈ చెడ వున్నదీ మీలోనే 
మంచిని మీలో పెంచుకోవాలి
చెడునుదాంతో గెలుచుకోవాలి
ఈ జగతి స్వర్గం చేసుకోవాలి




ఈవేళ పాడేటి పాట సాహిత్యం

 
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
సాహిత్యం: గోపి
గానం: పి.సుశీల

ఈవేళ పాడేటి పాటా
నేడూ రేపూ వినిపించు నీ వున్నచోటా 
ఏ నాటికీ
ముమ్మూలకీ

చరణం: 1
మనసుంది. మన లేవు నీవూ
తనువుంది కనరాను నేనూ
చిరుగాలి నేనూ- తెరచాప నీవూ
యేనాడు చేరేము రేవూ

చరణం: 2
మన కేసిపోయేను హృదయం
చేజారిపోనీకు సమయం
మనవింత స్నేహం వెలిగించుదీపం 
తొలగించు నీపైన  శాపం

Palli Balakrishna Tuesday, December 6, 2022
Maa Inti Velugu (1972)



చిత్రం: మా ఇంటి వెలుగు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: శ్రీ శ్రీ , దాశరథి, కొసరాజు, వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి 
గానం: పి. సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, యస్. జానకి , యస్.పి. బాలు 
నటీనటులు: కృష్ణ , చంద్రకళ, వెన్నిరాడై నిర్మల, అంజలీ దేవి, హేమలత, సెక్సీ క్వీన్ హలం, కుమారి రోజా రమణి (అతిధి నటి)
మాటలు: పినిశెట్టి 
దర్శకత్వం: విజయ్ 
నిర్మాత: పైడిమర్రి 
విడుదల తేది: 01.11.1972



Songs List:



అబ్బబ్బబ నా చెంప చెళ్ళుమన్నా పాట సాహిత్యం

 
చిత్రం: మా ఇంటి వెలుగు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాశరథి
గానం: యస్.పి. బాలు 

అబ్బబ్బబ నా చెంప చెళ్ళుమన్నా వొళ్ళు ఝల్లుమన్నా



అరె బడాయికోరు అబ్బాయిగారు పాట సాహిత్యం

 
చిత్రం: మా ఇంటి వెలుగు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: కొసరాజు
గానం: పి. సుశీల

అరె బడాయికోరు అబ్బాయిగారు బయలుదేరినాడే 



ఏరా సిన్నోడా సిగ్గెందుకు పాట సాహిత్యం

 
చిత్రం: మా ఇంటి వెలుగు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వీటూరి వెంకటసత్య సూర్యనారాయణమూర్తి 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

ఏరా సిన్నోడా సిగ్గెందుకు రారా సోగ్గాడా నా ముందుకు




ఓ బులి బులి బుగ్గలపిల్ల పాట సాహిత్యం

 
చిత్రం: మా ఇంటి వెలుగు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం:దాశరథి
గానం: యస్. జానకి , యస్.పి. బాలు 

ఓ బులి బులి బుగ్గలపిల్ల నీ జిలిబిలి నడకలు 



కన్నీరే చేదోడా కష్టాలే నా నీడ పాట సాహిత్యం

 
చిత్రం: మా ఇంటి వెలుగు (1972)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: శ్రీ శ్రీ 
గానం: పి. సుశీల

కన్నీరే చేదోడా కష్టాలే నా నీడ చెలరేగే చీకటిలో చిరుదీపం 

Palli Balakrishna
Chadarangam (1984)



చిత్రం: చదరంగం (1984)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, పాలవెల్లి 
గానం: జేసుదాసు, యస్.పి. బాలు, పి.సుశీల 
నటీనటులు: శారద, నరేష్, భానుప్రియ, రాజేష్ , భువన , చంద్ర కిరణ్ (నూతన పరిచయం)
కథ: డా॥ ఎమ్. ప్రభాకర్ రెడ్డి 
దర్శకత్వం: బి. భాస్కర రావు 
నిర్మాత: పి. వి. రమణ మూర్తి 
విడుదల తేది: 05.10.1984



Songs List:



ఓ ముద్దుల గుమ్మా మనసీవమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: చదరంగం (1984)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: పాలవెల్లి 
గానం: యస్.పి. బాలు 

ఓ ముద్దుల గుమ్మా మనసీవమ్మ 



ఒకే ముద్దు చాలు పాట సాహిత్యం

 
చిత్రం: చదరంగం (1984)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: జేసుదాస్, పి. సుశీల 

ఒకే ముద్దు చాలు మరువలేవు నన్ను నీవు 



మత్తు ముసురుకొస్తోంది అమ్మమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: చదరంగం (1984)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: పాలవెల్లి 
గానం: జేసుదాస్, పి. సుశీల 

మత్తు ముసురుకొస్తోంది అమ్మమ్మా 




పలికే దైవం మా అమ్మా మన అమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: చదరంగం (1984)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, ప్రకాశ్ 

పలికే దైవం మా అమ్మా మన అమ్మా 




నీ నీడలోనే ఉన్నాను పాట సాహిత్యం

 
చిత్రం: చదరంగం (1984)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

నీ నీడలోనే ఉన్నాను

Palli Balakrishna Tuesday, July 26, 2022
Badi Panthulu (1972)



చిత్రం: బడిపంతులు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్,
సాహిత్యం: ఆత్రేయ, డా॥ సి. నారాయణరెడ్డి, ఆరుద్ర, దాశరథి కృష్ణమాచార్య
గానం: ఘంటసాల, పి.సుశీల, యస్.పి. బాలు 
నటీనటులు: యన్.టి.రామారావు, అంజలీదేవి, విజయ లలిత, కృష్ణం రాజు, రామకృష్ణ, టి.పద్మిని, జయంతి, బేబీశ్రీదేవి
దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
నిర్మాత: పి. పేర్రాజు
విడుదల తేది: 22.11.1972

(శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా యన్.టి.రామారావు గారితో  ఈ సినిమాలో  నటించింది)



Songs List:



భారతమాతకు జేజేలు పాట సాహిత్యం

 
చిత్రం: బడిపంతులు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్,
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఘంటసాల, బృందం

పల్లవి:
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతుహిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
ఆసేతుహిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు

చరణం: 1
త్రివేణి సంగమ పవిత్రభూమి...  నాల్గు వేదములు పుట్టిన భూమి
నాల్గు వేదములు పుట్టిన భూమి
త్రివేణి సంగమ పవిత్రభూమి...  నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి...  పంచశీల బోధించిన భూమి
పంచశీల బోధించిన భూమి

భారత మాతకు జేజేలు...  బంగరు భూమికి జేజేలు

చరణం: 2 
శాంతిదూతగా వెలసిన బాపూ... జాతి రత్నమై వెలిగిన నెహ్రూ
శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన నెహ్రూ
విప్లవ వీరులు.. వీర మాతలు …విప్లవ వీరులు... వీర మాతలు …
ముద్దుబిడ్డలై మురిసే భూమి ..

భారత మాతకు జేజేలు...  బంగరు భూమికి జేజేలు

చరణం: 3
సహజీవనము సమభావనము...  సమతా వాదము వేదముగా
సమతా వాదము వేదముగా
సహజీవనము సమభావనము...  సమతా వాదము వేదముగా
ప్రజా క్షేమము ప్రగతి మార్గము...  లక్ష్యములైన విలక్షణ భూమి
లక్ష్యములైన విలక్షణ భూమి

భారత మాతకు జేజేలు...  బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు




పిల్లలము బడి పిల్లలము పాట సాహిత్యం

 
చిత్రం: బడిపంతులు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్,
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల, బృందం
	
పల్లవి:
పిల్లలము బడి పిల్లలము...
పిల్లలము బడి పిల్లలము...
నడుములు కట్టి కలిశాము...పిడికిలి బిగించి కదిలాము
పిల్లలము బడి పిల్లలము

చరణం: 1
పలక బలపం పట్టిన చేతులు పలుగు పార ఎత్తినవి.. పలుగు పార ఎత్తినవి
పలక బలపం పట్టిన చేతులు పలుగు పార ఎత్తినవి
ఓనమాలను దిద్దిన వేళ్ళు...ఒకటై మట్టిని కలిపినవి
ఒకటై మట్టిని కలిపినవి..

పిల్లలము బడి పిల్లలము

చరణం: 2
ప్రతి అణువు... మా భక్తికి గుర్తు
ప్రతి రాయి.. మా శక్తికి గుర్తు
ప్రతి అణువు... మా భక్తికి గుర్తు
ప్రతి రాయి.. మా శక్తికి గుర్తు

చేతులు కలిపి చెమటతో తడిపి..
చేతులు కలిపి చెమటతో తడిపి...
కోవెల కడదాం గురుదేవునికి
పిల్లలము..పిల్లలము... బడి పిల్లలము.. బడి పిల్లలము

చరణం: 3
తెలియని వాళ్ళకు తెలివిగల వాళ్ళకు
తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు..తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు
తెలియని వాళ్ళకు తెలివిగల వాళ్ళకు
తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు..తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు

వెలుగును ఇచ్చే ఈ కిటికీలు ...పంతులు గారి చల్లని కళ్ళు...
వెలుగును ఇచ్చే ఈ కిటికీలు ...పంతులు గారి చల్లని కళ్ళు...

పిల్లలము..పిల్లలము... బడి పిల్లలము.. బడి పిల్లలము
నడుములు కట్టి కలిశాము...పిడికిలి బిగించి కదిలాము
పిల్లలము బడి పిల్లలము..ల.లాలా..లా..లా.లా



నిన్న మొన్న పాట సాహిత్యం

 
చిత్రం: బడిపంతులు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్,
సాహిత్యం: ఆత్రేయ
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా
నీకు ఇంతలోనె నన్ను చూస్తే అంత సిగ్గా

నిన్న మొన్న రెక్కలొచిన గండు తుమ్మెద
నీకు అంతలోనె నన్ను చూస్తే ఇంత తొందరా 
    
చరణం: 1
పరికిణీలు కట్టినపుడు లేని సొగసులు
నీ పైట కొంగు చాటున దోబూచులాడెను 

పసితనాన ఆడుకొన్న తొక్కుడు బిళ్ళలు
నీ పరువానికి నేర్పినవి దుడుకు కోర్కెలు 
    
చరణం: 2
పాల బుగ్గలు పూచె లేత కెంపులు
వాలు చూపులందుతోటె వయసు జోరులు

చిరుత నవ్వులు ఒలికె చిలిపితనాలు
చిన్ననాటి చెలిమి తీసె వలపు దారులు 
    
నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా
నీకు ఇంతలోనె నన్ను చూస్తే అంత సిగ్గా

నిన్న మొన్న రెక్కలొచిన గండు తుమ్మెద
నీకు అంతలోనె నన్ను చూస్తే ఇంత తొందరా 

చరణం: 3
ఇన్నాళ్ళు కళ్ళు కళ్ళు కలిపి చూస్తివి
ఇపుడేల రెప్పలలా రెపరెపన్నవి 
ఇన్నాళ్ళు కళ్ళు కళ్ళు కలిపి చూస్తివి
ఇపుడేల రెప్పలలా రెపరెపన్నవి 

ఇన్నాళ్ళు నీ కళ్ళు ఊరుకున్నవి
ఇపుడేవేవో...
ఇపుడేవేవో మూగబాస లాడుతున్నవి 
ఇన్నాళ్ళు నీ కళ్ళు ఊరుకున్నవి
ఇపుడేవేవో...
ఇపుడేవేవో మూగబాస లాడుతున్నవి 

నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా
నీకు ఇంతలోనె నన్ను చూస్తే అంత సిగ్గా

నిన్న మొన్న రెక్కలొచిన గండు తుమ్మెద
నీకు అంతలోనె నన్ను చూస్తే ఇంత తొందరా 





ఓ లమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: బడిపంతులు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్,
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల బృందం

ఏవని ఏవని చెప్పను ఏవని ఏవని చెప్పను ఓ లమ్మో వాడు ఎన్నెన్ని



మీ నగుమోము నా కనులారా పాట సాహిత్యం

 
చిత్రం: బడిపంతులు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్,
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల

పల్లవి:
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
ఈ సూత్రముతో ఈ కుంకుమతో నను కడతేరి పోనిండు
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు

చరణం: 1
ఉపచారాలే చేసితినో.. ఎరగక అపచరాలే చేసితినో
ఉపచారాలే చేసితినో.. ఎరగక అపచరాలే చేసితినో
ఒడుదుడుకులలో తోడై ఉంటిని .. మీ అడుగున అడుగై నడిచితిని
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు

చరణం: 2
రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు...రెక్కలు అలిసి మీరున్నారు
రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు...రెక్కలు అలిసి మీరున్నారు
పండుటాకులము మిగిలితిమి..
పండుటాకులము మిగిలితిమి..ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు

చరణం: 3
ఏ నోములు నే నోచితినో .. ఈ దేవుని పతిగా పొందితిని
ఏ నోములు నే నోచితినో .. ఈ దేవుని పతిగా పొందితిని
ప్రతి జన్మ మీ సన్నిధిలోనా... ప్రమిదగ వెలిగే వరమడిగితిని

మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
ఈ సూత్రముతో ఈ కుంకుమతో నను కడతేరి పోనిండు
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు





ఓరోరి పిల్లగాడా పాట సాహిత్యం

 
చిత్రం: బడిపంతులు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్,
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

ఓరోరి పిల్లగాడా వగలమారి పిల్లగాడా నీ ఉరకలు ఊపులు	





ఎడబాటెరుగని పాట సాహిత్యం

 
చిత్రం: బడిపంతులు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్,
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల

పల్లవి:
ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు
ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు
తోడు నీడగా వుండే వయసున గూడు విడిచి వేరైనారు .. గూడు విడిచి వేరైనారు...
ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు

చరణం: 1
జంటను వీడిన ఒంటరి బ్రతుకై జాలిగ కుమిలేరు
జంటను వీడిన ఒంటరి బ్రతుకై జాలిగ కుమిలేరు
ఎదలోదాగిన మూగ వేదన ఎవరికి చెప్పేరు.. ఎలా భరించేరు...

ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు

చరణం: 2
ఒకే తనువుగ ఒకే మనువుగా ఆ దంపతులు జీవించారు
ఒకే తనువుగ ఒకే మనువుగ ఆ దంపతులు జీవించారు
ఆస్తిపాస్తివలె అన్నదమ్ములు ఆ తలిదండ్రుల పంచారు .. ఆ తలిదండ్రుల పంచారు
ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు




రాక రాక వచ్చావు పాట సాహిత్యం

 
చిత్రం: బడిపంతులు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్,
సాహిత్యం: ఆరుద్ర	
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

రాక రాక వచ్చావు రంభలాగ ఉన్నావు




బూచాడమ్మా బూచాడు పాట సాహిత్యం

 
చిత్రం: బడిపంతులు (1972)
సంగీతం: కె.వి.మహదేవన్,
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల, బృందం

పల్లవి:
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు...
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు
కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు

బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు...
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు
కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు...

చరణం: 1
గుర్ గుర్ మంటూ గోలెడతాడు.. హెల్లో అని మొదలెడతాడూ...
గుర్ గుర్ మంటూ గోలెడతాడు.. హెల్లో అని మొదలెడతాడూ...
ఎక్కడ వున్న ఎవ్వరినైనా.. ఎక్కడ వున్న ఎవ్వరినైనా..
పలుకరించి కలుపుతాడు...

బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు...
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు
కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు...

చరణం: 2
తెలుగు తమిళ హిందీ కన్నడ భాషా భేధాలెరుగని వాడూ
తెలుగు తమిళ హిందీ కన్నడ భాషా భేధాలెరుగని వాడూ
కులము మతము జాతేదైనా... కులము మతము జాతేదైనా ..
గుండెలు గొంతులు ఒకటంటాడు

బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు...

చరణం: 3
డిల్లీ మద్రాస్ హైద్రాబాద్ రష్యా అమెరికా లండన్ జపాన్
ఎక్కడికైనా వెళుతుంటాడు ఎల్లలు మనసుకు లేవంటాడు..
ఎక్కడికైనా వెళుతుంటాడు ఎల్లలు మనసుకు లేవంటాడు..
ఒకే తీగ పై నడిపిస్తాడు... ఒకే ప్రపంచం అనిపిస్తాడు...

బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు...
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు
కళ్ళకెపుడు కనపడడు కబురులెన్నో చెపుతాడు
బూచాడమ్మా...బూచాడు...బుల్లి పెట్టె లో వున్నాడు...



Palli Balakrishna Tuesday, July 12, 2022
Kanna Koduku (1973)



చిత్రం: కన్నకొడుకు (1973)
సంగీతం: టి.చలపతి రావు
సాహిత్యం: దాశరథి, ఆరుద్ర, డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి.సుశీల, జయదేవ్, షరావతి , రమేష్ 
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, అంజలి దేవి, లక్ష్మీ, కృష్ణంరాజు 
దర్శకత్వం: వి.మధుసూధనరావు 
నిర్మాతలు: జి.రాధాకృష్ణ మూర్తి, ఎ.రామచంద్ర రావు 
విడుదల తేది: 11.05.1973



Songs List:



తింటే గారెలే తినాలి పాట సాహిత్యం

 
చిత్రం: కన్నకొడుకు (1973)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల, పి. సుశీల

తింటే గారెలే తినాలి ...
వింటే భారతం వినాలి
ఉంటే నీ జంటగా వుండాలి.
సైఁ యంటే స్వరాలే దిగిరావాలి

మొలక మబ్బులు ముసిరితే.... 
ఓహో....
చిలిపి గాలులు విసిరితే...
ఓహో....
పచ్చపచ్చని పచ్చిక బయలే పాన్పుగా
అమరితే అమరితే అమరితే.....
వీడని కౌగిట వేడి వేడిగా
చూడని రుచులే చూడాలి......

నీ నల్లని కురులను నే దువ్వీ
యీ సిరిమల్లెలు నీ జడలో నే తరిమీ
పట్టుచీరే కట్టించి

పైట నేనే సవరించి, సవరించి, సవరించి
నిగనిగలాడే నీ సొగసంతా
నే నొక్కడినే చూడాలి....
తీయగా నువు కవ్విస్తే - ఓహో
తీగలా నను పెనవేస్తే - ఓహో
పూలతోట పులకరించీ
యీల పాటలు పాడితే, పాడితే, పాడితే
పొంగే అంచుల పల్లకి పైన
నింగి అంచులను దాటాలి....



లోకం శోకం మనకొద్దు పాట సాహిత్యం

 
చిత్రం: కన్నకొడుకు (1973)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఘంటసాల, పి. సుశీల, జయదేవ్, షరావతి , రమేష్ 

పలవి : 
లోకం శోకం మనకొద్దు
మైకం తదేకం_వదలొద్దు 
అను అను అను హరేరామ్ అను
అను అను అను హరేకృష్ణ అను
హరేరాం.... హరేరాం....
రామ్ రామ్ హరేరామ్ ..
కృష్ణ కృష్ణ ఘనశ్యాం

చరణం: 
నీతి నియమంబూడిద
పాత సమాజం గాడిద
ఇల్లూ వాకిలీ..తల్లీ తండ్రీ
ఎవరూ లేరు—ఎవరూ రారు
నీతో నీవే నీలో నీవే
బతకాలి బతకాలి బతకాలి ....

పల్లవి: 
అయ్యో రామా -అయ్యో కృష్ణా
చూశారా నరుడెంత మారాడో మీ
భజన చేస్తూ ఎంతకు దిగజారాడో.

చరణం: 
ఆడాళ్ళకు మగవాళ్ళకు తేడా తెలియదు
అయ్య పంపే డబ్బులకే అర్థం తెలియదు
కలసి మెలసి విందు - కైపులోన చిందు
ఈ పోకడ దగా దగా బతుకంతా వృధా వృధా ...

చరణం: 
సౌఖ్యాలకు దొడ్డిదారి వెతికేవాళ్ళు
బ్లాకులోన డబ్బులెన్నో నూకేవాళ్లు
ఏ పాటు పడనివాళ్ళు సాపాటు రాయుళ్ళు
అందరికీ మీ పేరే అతి తేరగ దొరికిందా.... 

చరణం: 
కష్టాల్లో పేదాళ్ళకు మీరు అవసరం
కలవాళ్ళ దోపిడీకి మీరు ఆయుధం
ఆపదలో ముడుపు ఆ పైన పరగడుపు
అనాదిగా ఇదే ఇదే రివాజుగ సాగాలా ?



అందమైన పిలగాడు పాట సాహిత్యం

 
చిత్రం: కన్నకొడుకు (1973)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: కొసరాజు 
గానం: పి. సుశీల, షరావతి 

పల్లవి: 
అందమైన పిల్లగాడూ
అందకుండా పోతున్నాడూ
నెత్తిమీద గోరువంక
నిలిచిందే చూడడూ - అయ్యో రామా
పిలిచిందే చూడడూ

చరణం: 1
బూరెల బుగ్గల బుడగడే
ఏమన్నా యిటు తిరగడే
కొట్టిన రాయిలాగా
బిర్రబిగుసుకొని వున్నాడే - అయ్యో రామా
బుర్ర గోక్కుంటున్నాడే....

చరణం: 2
ప్రేమ జబ్బులో పడ్డాడమ్మా
బిత్తరి చూపులు చూస్తాడమ్మా
ఏ యమ్మగన్న పిల్లోడోగాని
ఎంత జెప్పినా వినడమ్మా అయ్యో రామా
ఏమైపోతాడో యమ్మా -

చరణం: 3
కలిగిన పిల్లను కాదంటాడే
పేదపిల్లపై మోజంటాడే 
డబ్బున్న వాళ్ళకు ప్రేమ వుండదా
లేనివాళ్ళకే వుంటుందా 
అయ్యో రామా
పిచ్చి యింతగా ముదిరిందా...




ఎన్నడైనా అనుకున్నానా పాట సాహిత్యం

 
చిత్రం: కన్నకొడుకు (1973)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: దాశరథి 
గానం: పి. సుశీల

పల్లవి: 
ఎన్నడైనా అనుకున్నానా ?
ఎప్పుడైనా కలగన్నానా ?
ఇంత చల్లని మనసు నీ కుందనీ .... ఆ
మనసులో నా కెంతో చోటుందనీ.....

చరణం: 1
నీ చిరునవ్వుల నీడలలోన మేడకడతాననీ
అల్లరిచేసే నీచూపులతో ఆడుకుంటాననీ
ఎవరికి అందని నీ కౌగిలిలో వాలిపోతాననీ
నీ రూపమునే నా కన్నులలో దాచుకుంటాననీ

చరణం: 2
వలపులు చిందే నా గుండెలలో నిండివుంటావనీ
పెదవుల దాగిన గుసగుసలన్నీ తెలుసుకుంటావనీ
నా గుడిలోపల దైవము నీవై వెలుగుతుంటావనీ
విరిసే సొగసులు విరజాజులతో పూచేసెననీ





దేవుడిచ్చిన వరముగా పాట సాహిత్యం

 
చిత్రం: కన్నకొడుకు (1973)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: దాశరథి 
గానం: పి. సుశీల

పల్లవి : 
దేవుడిచ్చిన వరముగా
కోటి నోముల ఫలముగా
ఇంటిలోని దివ్వెగా - కంటిలోని వెలుగుగా
చిన్ని నాన్నా ! నవ్వరా !
చిన్ని కృష్ణా ! నవ్వరా ?

చరణం : 1
నన్ను దోచిన దేవుడే ఈ నాటితో కరుణించెలే
కన్న కలలే నిజములై - నీ రూపమున కనిపించెలే
బోసినవ్వులు ఒలకబోసి లోకమే మరపించరా

చరణం : 2
మామ ఆస్తిని మాకు చేర్చే
మంచి పాపా నవ్వవే 
ఆదిలక్ష్మివి నీవేలే  మా ఆశలన్నీ తీర్చవే
గోపి బావను చేసుకొని – కోటికే పడగెత్తవే



ఉన్నది నాకొక ఇల్లు పాట సాహిత్యం

 
చిత్రం: కన్నకొడుకు (1973)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల 

పల్లవి: 
ఉన్నది నాకొక ఇల్లు
ఉన్నది నాకొక తలి
ఇల్లే బంగరు కోవెల
తల్లే చల్లని దేవతా.....

చరణం: 1
చిన్నబాబుగారున్నారు
వెన్నపూసతో పెరిగారు
సరదాబాబుల సహవాసంలో
దారితప్పి పోతున్నారు
చేయిజారి పోతున్నారు....

చరణం: 2
పెదయ్యగారి పేరు చెప్పితే
పెద్దపులే భయపడుతుంది
ఛెళ్లున కొరడా ఝళిపిస్తేనే
ఇలు దదరిలి పోతుంది
మా ఒళ్ళు హూనమైపోతుంది

చరణం: 3
పాపమ్మలాంటి అత్తమ్మగారు
ప్రతి ఇంటిలోన వుంటారు 
ఆయమ్మగారు మహమ్మారి తీరు
అన్నీ స్వాహా చేస్తారు -
గుటకాయస్వాహా చేస్తారు ...

చరణం: 4
అమ్మ అనే రెండక్షరాలలో
కోటి దేవతల వెలుగుంది -
అమృత మనేది వుందంటే
అది అమ్మ మనసులోనే వుంది
మా అమ్మమనసులోనేవుంది
ఆ తలి చల్లని దీవెన చాలు ....
ఎందుకు వేయి వరాలు
ఇంకెందుకు వేయి వరాలు ....




నేను నేనేనా నువ్వు నువ్వేనా పాట సాహిత్యం

 
చిత్రం: కన్నకొడుకు (1973)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. సుశీల 

నేను - నేనేనా
నువ్వు నువ్వేనా
ఎక్కడికో - ఎక్కడికో

రెక్కవిప్పుకొని ఎగిరిపోతోంది
హృదయం
చిక్కని చక్కని సుఖంలో
మునిగిపోతోంది దేహం హాయ్...

చరణం: 1
ఇదా మనిషి కోరుకోను మైకం
ఇదా మనసు తీరగల లోకం
జిగేలు మంది జీవితం
పకాలుమంది యవ్వనం

చరణం: 2
ఓహో ఈ మత్తు చాల గమ్మత్తు
ఊహూఁ ఇంకేది మనకు వద్దు
నిషాలు గుండె నిండనీ
ఇలాగె రేయి సాగనీ ....




కళ్ళతో కాటేసి పాట సాహిత్యం

 
చిత్రం: కన్నకొడుకు (1973)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: దాశరథి 
గానం: ఘంటసాల, పి. సుశీల 

పల్లవి:
కళ్ళలో కాటేసి-వొళ్ళు ఝల్లుమనిపించి
రమ్మంటే రానంటా వెట్టాగే - పిల్ల
యెట్టాగే-పిల్ల యెట్టాగే....

బుగ్గమీద సిటికేసి సిగ్గులోన ముంచేసి
నన్నెట్టా రమ్మంటవ్ పిలగాడ
భలే పిల గాడ - కొంటె పిల గాడ

చరణం:
తోటలోనా మాటు వేసీ
వెంటబడితే బాగుందా 
పంటసేనూ గట్టుమీద
పైనబడితే బాగుందా?
సెంగావి సీరెలో - బంగారు రైకలో
పొంగులన్ని చూపిస్తే బాగుందా ॥కళ్ళతో॥

చరణం: 
మొదటిసారి చూడగానే.. మత్తుమందూ చల్లావే
మాయజేసీ—మనసు దోచీ తప్పునాదే అంటావే
బెదురెందుకు నీకనీ_ ఎదురుగ నుంచోమనీ, పెదవిమీద నా పెదవిమీద ....
అమ్మమ్మో బాగుందా ॥బుగ్గమీద॥

చరణం: 
సైగ చేసి సైకిలెక్కి సరసమాడితే బాగుందా
 పైట సెంగూ నీడలోన నన్నుదాస్తే బాగుందా
కందిరీగ నడుముతో, కన్నెలేడి నడకతో
కైపులోన ముంచేస్తే బాగుందా.... ॥కళ్ళతో॥

చరణం: 
పెంచుకున్న ఆశలన్నీ
పంచుకుంటానన్నావే
ఊసులాడీ–బాసలాడీ—వొళ్లుమరచీ పోయావే
జాబిల్లి వెలుగులో - తారల్ల తళుకులో
ఏవేవో కోరికలు కోరావే




ఉన్నది నాకొక ఇల్లు (Sad Version) పాట సాహిత్యం

 
చిత్రం: కన్నకొడుకు (1973)
సంగీతం: టి. చలపతి రావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: ఘంటసాల

ఉన్నది నాకొక ఇల్లు 

Palli Balakrishna Friday, July 8, 2022
Ilavelpu (1956)



చిత్రం: ఇలవేల్పు (1956)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి 
నటీనటులు: నాగేశ్వరరావు, అంజలి దేవి 
దర్శకత్వం: డి.యోగానంద్ 
నిర్మాత: ఎల్. వి.ప్రసాద్
విడుదల తేది: 21.06.1956



Songs List:



నీవే భారత స్త్రీలపాలిటి పాట సాహిత్యం

 
చిత్రం: ఇలవేల్పు (1956)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి 
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం:  పి. లీల

నీవే భారత స్త్రీల పాలిట వెలుగుచూపె దీపమై నావే 
నాకీ తిలకమా ! పసుపు కుంకుమ శోభతో
విలసిల్లి మా ఇలవేల్పువైనానే
విలసిల్లి మా ఇలవేల్పువై నావే

విశ్వమానవ ప్రేమనీలో నిండెనే సెలయేరుగా
నిండెనే సెలయేరుగా
శాశ్వతముగా నీదు త్యాగము నిల్చునే ధృవతారగా
నిల్చునే ధృవ తారగా
ఈ జగానా నీకు నీవే సాటి తల్లీ ! కల్పవల్లి నీవె
నారీ తిలకమా ! పసుపు కుంకుమ శోభతో విలసిలి
మా ఇలవేల్పువై నావే
మా స్త్రీల పాలిట వెలుగుచూపే దీపమైనానే

మధురమైన నీదు కధలే మానసములో మెలగునమ్మా
మానసములో మెలగునమ్మా
విమల మౌనీ శీలమునకే వెయ్యి జ్యోతులనందు కొమ్మా
వెయ్యి జ్యోతుల నందుకొమ్మా
ఈ జగానా నీకు నీవే సాటి తల్లీ ! కల్పవల్లివినీ వె




నిఖిల భువనపాలం పాట సాహిత్యం

 
చిత్రం: ఇలవేల్పు (1956)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి 
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం:  పి. లీల

నిఖిల భువనపాలం నిత్య తేజో విశాలం
సకల సుగుణ శీలం సచ్చిదానంద రామం
జనగణ మంగళదాయక రామం - రఘుపతి రాఘవ రాజారామం
రోగవినాశకరం శ్రీరామం - భవ బంధములను బాపెడు రామం
భక్తలోక పరిపాలక రామం - శరణు! శరణు! శ్రీ సీతారామం 

ఏకో దేవః కేశవోవా - ఏకో రూపం నిత్య సత్య ప్రదీపం
వాతీతం రామ నామ స్వరూపం 
జనగణ మంగళదాయక రామం - రఘుపతి రాఘవ రాజారామం

సర్వధర్మముల సారమె రామం
సకల మతములకు సమతే రామం
శాంతిలోని విశ్రాంతియె రామం 
శరణు! శరణు! శ్రీ సీతారామం 

పంచ భూతైక రూపం పావనం రామనామం 
ఔషధాతీత తేజం అమృతం రామనామం 




నీమము విడి అజ్ఞానముచే పాట సాహిత్యం

 
చిత్రం: ఇలవేల్పు (1956)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి 
సాహిత్యం: వడ్డాది 
గానం:  పి. లీల

నీమము విడి అజ్ఞానముచే పలుబాధలు పడనేల?
సోదరా! ప్రకృతి మాత లేదా?
భానుకిరణముల ప్రభావమే ఈ ప్రపంచమోయన్నా
వాటిలో ప్రాణ శక్తిమిన్న రోగముల ప్రారద్రోలునన్నా
దేహమున కెంతో మేలన్నా 

మన్నూ, నీరూ,గాలియుండగా భయమింకేలనన్నా
జగతికే ఆదిశక్తులన్నా _ అవే మన ప్రాణతుల్యమన్నా
వ్యాధులిక రావని నమ్మన్నా
దేహములకెంతో మేలన్నా 

మధురమైన ఫలజాతులనెపుడు మానక తినుమన్నా
మనకదే చాల ముఖ్యమన్నా వీటిలో ఓ జీవము కలదన్నా
రోగములు చేరవు నిజమన్నా దేహమున కెంతో మేలన్నా
ఆవిరిలోనె పంచభూతములు ఆమరియున్నవన్నా
ఆవిరికి శక్తి అమితమన్నా అదే మన చలనశక్తి యనా
వ్యాధులిక రానే రావన్నా
దేహమునకెంతో మేలన్నా 




ఏనాడు కనలేదు పాట సాహిత్యం

 
చిత్రం: ఇలవేల్పు (1956)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి 
సాహిత్యం: అనిశెట్టి 
గానం: రఘురాం పాణిగ్రహి, పి. సుశీల 

ఏనాడు కవలేదు - ఈ వింత సుందరిని
నాలో ఆశలు రేపే - అందాల రాచిలుక
ననుచూచి తనలోన నవ్వుకొనునిదే మొ?
పిలచిన మాటాడక వెడలి పోవునదేమొ
ధర్మాలలో వలపు దాచి పలుకునదే మొ?
కసరి, విసుగుటలోనే కరుణచూపునదే వెంకి
చిలిపి చేష్టలు మాని నిశ్చలతకల్గి

సాకి: మనసు శాసించు కొనువాడె మానవుండు

చిలిపి చేష్టలు చూచి నిగ్గుపడునదే మొ?
నను పిలచి మనసార మాటలాడదరేమొ
అదే కోపమా? లేక ఆనంద పరవళమా?
కలికి | ప్రేమను చూపి కనికరించదేమొ ?

నేను ప్రేమైక మూర్తిని నిశ్చలుడను

అర్జునా ! నిన్ను తెలియరు అజ్ఞులెపుడు




చల్లనిరాజా ఓ చందమామ పాట సాహిత్యం

 
చిత్రం: ఇలవేల్పు (1956)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి 
సాహిత్యం: వడ్డాది 
గానం:  పి. లీల,  పి. సుశీల, రఘునాధ పాణిగ్రాహి  

పల్లవి: 
చల్లనిరాజా ఓ చందమామ 
నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ.. 
నా చందమామ 

చరణం: 1
పరమేశుని జడలోన చామంతివి 
నీలిమేఘాల నానేటి పూబంతివి 
నిను సేవించగా నను దయచూడవా 
ఓ వెన్నెల వన్నెల నా చందమామ  

చరణం: 2:
నిను చూచిన మనసెంతో వికసించుగా 
తొలి కోరికలెన్నో చిగురించుగా 
ఆశలూరించునే చెలి కనిపించునే 
చిరునవ్వుల వెన్నెల కురిపించులే 

చరణం: 3
నను చూడవు పిలచిన మాట్లాడవు 
చిన్నదానను వదలను ప్రియురాలను  
నిన్నే కోరానురా నన్నే కరుణించరా 
ఈ వెన్నెల కన్నెతో విహరించరా 




స్వర్గమన్న వేరే కలదా పాట సాహిత్యం

 
చిత్రం: ఇలవేల్పు (1956)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి 
సాహిత్యం: అనిశెట్టి 
గానం: పి. లీల 

స్వర్గమన్న వేరే కలదా శాంతి వెలయు గృహమే కావా
సేవకన్న ధర్మము కలదా - ధర్మమన్న ఆదియే కాదా! 

జగతిలోని జీవుల కెల్ల - సుగతి జూపె ప్రకృతి మాట
బలమునిచ్చి నిలుపును నిన్నే- బ్రతుకుబాట నడుపునుతా నే

వీడిపోదు వెలుగును నీడ మీరలేదు చావును జీవి
లోకరీతి తెలిసినవారే - శోకమందు కుములుట మేలా 

జీవితమే గురువౌనయ్యా ! - జగతి మనకు బడియేనయ్యా !
దీక్షబూని చదవాలమ్మా ! - యింటి పేరు నిలపాలమ్మా

దేవ దేవ నీ పదములనే - నిలిపినాము మామదిలో నే
దయామయా వేడెదమయ్యా - కరుణజూపి కావగదయ్యా! 



ఓ సింగాలరి పాట సాహిత్యం

 
చిత్రం: ఇలవేల్పు (1956)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి 
సాహిత్యం: వడ్డాది 
గానం:  జిక్కి (పి.జి. కృష్ణవేణి)

ఓ... చింగ్లారీ - చింగ్లారీయా
చింగ్లారీ యీ ఓ చింగ్లారీ - చింగ్లారీ యీ ఓ చింగ్లారీ
ఆహహహ

కోరస్: - ఆ హు - ఆహు - ఆహు - ఆహు
అంతా: చింగ్లారి యీ ఓ చింగ్లారి 
రాణి: ఝనక ఝనకచం కోరస్: భంచక బంచా
రాణి: ఝనక ఝనకచం కోరస్: - భంచక బంచా
కోరస్: ఓ...ఇంచు బోడియా - పోసెయ్య - పోసెయ్య
ఆ.. ఔసుంకాడియ్యా-ఔసుంకాడియ్యా- ఔసుంకాడియ్యా
ఠాణి: ఝనక, ఝనకచం కోరస్: భంచక బంచా
రాణి: ఝనక, ఝనకచం కోరస్: - భంచక బంచా
అంతా: చింగ్లారి యీ ఓ చింగ్లారి - చింగ్లారి యీ ఓ చింగ్లారీ
కోరస్: ఎల్లా ఎల్లా ఏహో ఎల్లా ఎల్లా ఏహో - ఆహహహ
కోరస్: హ హు హ
హు
హుహ - హ
-
కోరస్:
చింగారి యీ ఓ చింగారీ
కోరస్: ఎలా ఎలా ఏవ - ఎలా ఎలా ఏహో
ఎల్లా ఎల్లా ఏవ - ఎల్లా ఎల్లా ఏహో
హమ్
ఝల్లా - ఝల్ ఝల్లా - హమ్ ఝల్ల - ఝల్ ఝలా
వయ్యాని టింబాగొ-పోఏకిసా ఆనుటవుంగాగా పోఏకిపాకాయ్.

కోరస్: వయ్యాని టింబాగొ పో ఏకిఫా - అనుట వుంగాగా ఏకిపా
సో ఏకినా - ఏకిపా - ఏకిపా

కోరస్:
హమ్ ఝల్ల - ఝల్ ఝల్లా - హమ్ ఝల్ల - ఝల్ ఝ

ఎల్లా ఎల్లా ఏహో - ఎల్లా ఎల్లా ఏహో
ఎల్లా ఎల్లా ఏహో - ఎల్లా ఎల్లా ఏహో



అన్నా అన్నా విన్నావా పాట సాహిత్యం

 
చిత్రం: ఇలవేల్పు (1956)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి 
సాహిత్యం: వడ్డాది 
గానం:  జిక్కి (పి.జి. కృష్ణవేణి)

అన్నా అన్నా విన్నావా
చిన్ని కృష్ణుడు వచ్చాడు
చిన్నీ కృష్ణుడు వచ్చాడు
నా వన్నెల చెలికాడొచ్చాడు   

కాళియ మడుగున దూకినవాడు 
ఆపద తొలిగి వచ్చాడు
చల్లని చూపుల చూస్తాడు 
కన్నుల పండుగ చేస్తాడు 

గోకుల మందున గోవిందునితో 
గోపికనై విహరిస్తాను
ముద్దుల మూర్తిని కంటాను 
మోహన మురళిని వింటాను 

బృందావనిలో నందకిశోరుని 
చెంతను నాట్యం చేస్తాను
యమునా తీర విహారములో 
హాయిగ పరవశమవుతాను





చల్లని పున్నమి వెన్నెలలో నే పాట సాహిత్యం

 
చిత్రం: ఇలవేల్పు (1956)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి 
సాహిత్యం: వడ్డాది 
గానం:  సుసర్ల దక్షిణా మూర్తి, పి. సుశీల 

చల్లని పున్నమి వెన్నెలలోనే దహించే వేడి యెందుకో
తెలియదుగా తెలియదుగా - కీలక మేదో - తెలియదుగా 

అల్లరి చిల్లరి, చేతలతోనే - అందరి కళ్లూ మూయలేవని
తెలిసినదా తెలిసినదా . చేసిన తప్పు తెలిసినదా
నాటకమంతా బూటకమైతే - జాతక మే మన కెదురు తిరిగితే
నాదేనా తప్పు - అసలీ వాదెందుకు చెప్పు?
ఎవరిది తప్పని వాద మెందుకు - జరిగిన దానికి జగడ మెందుకు?
సరైన దారిని పోవాలి నలుగురి మెప్పు పొందాలి.
ఉన్నది ఇద్దరి కొకటే మార్గం
అదే ప్రేమ మార్గం మన కదే రాజమార్గం
ఉన్నది ఇద్దరి కొకటే మార్గం
అదే ప్రేమ మార్గం, మన - కదే రాజమార్గం
మన తీయని కలలన్నీ నిజమై
సాగును మన ప్రేమ - హాయిగా
మన తీయని కలలన్నీ నిజమై
సాగును మన ప్రేమ హాయిగా
సాగును మన పేమ
సాగును మన ప్రేమ
చల్లని పున్నమి వెన్నెలలోనే - కలసినలు మనసు వీడిపోశనీ
తెలిసెనుగా, తెలిసెనుగా కీలక మంతా తెలిసెను గా




పలికిన బంగారు మాయవటే పాట సాహిత్యం

 
చిత్రం: ఇలవేల్పు (1956)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి 
సాహిత్యం: వడ్డాది 
గానం: పి. సుశీల 

పలికిన బంగార మాయనటే?
పలుకుచు నామది పరవళ మొందగ
తొలి పలుకునకే వలపుజనించగ-మని పలుకునకే మమతలు రేగగ 
తీయని స్వరముల హాయి గొలుపుచును
మదిలో మెరిసే మధుర భావము
రాగములో అనురాగము చూపుచు
పాడిన సేనను ? పలవి నీనోట

కనులార నిను చూచి మనసు వీపయినుంచి
అలరుచు మరి మరి ఆనందముతో
పిలవి, పిలచి నే అలసి పోయితిని
అలంకను విడవేల ? చెలియను కరుణించి


తే. గీ.

తండ్రికన్న మిన్న లీ ధరణి లేరు
గాన, పితృ వాక్య పాలన బూని నేను
వనములకు పోవుటే ధర్మమనుచు పలికె
జనని కౌసల్యతో రామచంద్రుడంత





గంప గయ్యాళి పాట సాహిత్యం

 
చిత్రం: ఇలవేల్పు (1956)
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి 
సాహిత్యం: కొసరాజు 
గానం: మాధవపెద్ది సత్యం 

గంప గయ్యాళి అదె గంప గయ్యాళి
సిగ్గమాలి హద్దుమీరి తిరిగే దెవతో
అదియే గంప గయ్యాళి - ఆదే గంప గయ్యాళీ

పొద్దెక్కిన...పొద్దెక్కిన ఎద్దువలె నిద్రలేశకా
డజని వేసి కాఫీ తాగి ఆయితిగాకా
చెంబూ కంచం కడగబోతే చేతులురాకా
తెగ రంకె వేసి అదర గొట్టు లంకిణి ఎవతో
అదే గంప గయ్యాళి - అదే గంప గయ్యాళి
మగడి గొంతు పట్టుకుని డబ్బుగుంజుతూ
నదురు బెదురు లేక జేబు కాళీ జేయుచూ
కూతురు కాపురము నార్పి కులుకుతు వుంటూ
మంచీ మట్టూ మరియాద రూపుమాపే దెవతో
అదియే గంప గయ్యాళి - ఆదే గంప గయ్యాళి
నోరు కొలది మాటాడే దురహంకారీ
అది లోకానికే రోసేసిని మాయలమా రీ
జగడానికి కాలుదువ్వు సాహసకారీ
మన తెలుగు తల్లి పేరు చెరుప పుట్టిన దేవతో
ఆదియే గంప గయ్యాళి - అదే గంప గయ్యాలి.

గణపతి: 
బ్రహ్మ వాణిని నాలుక పై ధరించె
హరియురమ్మున లక్ష్మీని అరువు కొనియె
శివుడు గంగను తలమీద జేర్చుకొనియె
ఓ దివ్య సుందరీ ! ఓ దేవకన్యా ! ఓ మేనకా ! రంఖా ! 
ముడుపు కట్టి వెంకన్నకు మొక్కనా
తాయెత్తులో పొదిగి కట్టనా - వన్నెలాడి చిగురుబోడి
వగలమారి వయ్యారి - సాంబ్రాణి ధూపమేసి పట్టనా
తాయెత్తులో పొదిగి కట్టనా

శేషమ్మ:
కన్ను మిన్ను గనక కారు కూతలు కూసి
ఓసి ఎంత చౌక చేసినావె ? ఆ! య్ !
గుంటలోన పెట్టి గంట వాయించెద నోరుకట్టి పెట్టి ఊరుకోను
శేషమ్మ: అలంకారీ - ఏం అమ్మా
శేషమ్మ:— రాయిట్లా - వస్తున్నా
శేషమ్మ: గుంటలోన పెట్టి గంట వాయించెద నోరుకట్టి పెట్టి ఊరుకొను
గణపతి: చెంప కొట్టిన పాల్గారు చిన్నదాని
ఆకటా ! ఈ రీతి దండింప నౌనటమ్మ

బడుగు పిచ్చుక పైరామ బాణమేల ?
కరుణ జూపింపవమ్మ ఓ కన్నతల్లీ ! ఓ కన్నతల్లీ
ఎందుకె కోపం నీకెందుకె కోపం ?
నన్ను కొట్టవే దాన్ని వదిలి పెట్టవే
అమ్మా నన్ను కొట్టవే దాన్ని వదలి పెట్టవే

సన్యాసి:
సత్యంబు తెలిసిందిగా నాలో నాకు సత్యంబు తెలిసిందిగా
బ్రహ్మరాక్షసి వంటి పెళ్లాన్ని గట్టుక
పదిమందిలో నేను పల్చనైపోయాక

శేషమ్మ: కన్యను యిచ్చీ కట్నం యిచ్చిందిందు కా
సుందరమ్మ : బుద్ధి గిద్ధి ఏమైనా నీకుందా ?
నీతి జాతి ఏమయినా కుందా ?
నాలు గేళ్లుగా మూలనున్న దీయింటిలో
నాలు గేళ్లు గా మూల నున్న దీయింటిలో - నీ యింటిలో
అహ దీనికి నేనే దిక్కు కానిచో
మొగుడెవ డొస్తాడే - దీనికి - మొగుడెవడో తెలిసింది.

కూతురు: అయ్యో ! అమ్మ
కాంత: విన్నావా ! యీ గొడవ - పైన బోయెనే ప్ర్రాణం
పడవెక్కిందే పరువు
ఆత్తకొడుకు అడిగేనే - నీ అన్న కొడుకు అడిగేనే
రంగారావు అడిగేనే - రామారావు అడిగేనే
నాగేశ్వర్రావడిగే నే - ఎం ఏ అడిగా బి. ఏ. అడిగె
యాక్టరడిగె - డాక్టర్లడిగే ఇచ్చావా - సచ్చావా
ఎంతచేశావే- తల్లీ

చింత కొమ్మను నమ్మి కట్టుకున్నానే
మునగ కొమ్మై విరిగి మోస పోయానే
చిల్లి బోటని తెలియ కెక్కా నే
శివ శివా నట్టేట మునిగా నే
నన్ను గన్నతల్లి నారాత యిటురాసెనే - నాకర్మయిటు కాలెనే

గణపతి :
భయముమాని కట్టుకో కొరడా - బావా
భయము మాని పట్టుకో కొరడా
తండ్రీ! యిక జాలము సేయక
మీ సంగల పురుషుడుగా
రోసంతో నడవాలీ

బుద్ధిలేని ఆడవాళ్ల - హద్దులో వుంచాలి.
భయము మాని పట్టుకో కొరడా కొరడా

Palli Balakrishna Saturday, July 2, 2022
Manchi Rojulu Vachayi (1972)



చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి, కృష్ణం రాజు, కాంచన, అంజలీదేవి , గీతాంజలి 
అసోసియేట్ డైరెక్టర్: ఎ.కోదండ రామిరెడ్డి
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: యస్.యస్.బాలన్
విడుదల తేది: 1972



Songs List:



పదరా ! పదరా! పాట సాహిత్యం

 
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
పదరా ! పదరా!
నడుంకట్టి పిడికిలెత్తి పదరా
నవ విప్లవ శంఖమూది పదరా
పడగెత్తే స్వార్థపరుల
అడుగడున తరిమికొట్టి పదరా
మంచిరోజు లొచ్చాయి పదరా

చరణం: 1
కలిగినోళ్ళ జులుములింక సాగవురా ! 
వాళ్ళ దోపిడీలు, దురంతాలు చెల్లవురా
కార్మికులు - కర్షకులు, పీడితులు, తాడితులు
సంకెళ్ళను తెంచుకు సాగాలిరా
మంచిరోజు లొచ్చాయి పదరా

చరణం: 2
ఒళ్ళువంచి పని చేయని వాళ్లు ! 
పరుల నోళ్ళు కొట్టి బతికే గొప్పోళ్ళు
పెట్టెలో దాచుకున్న పుట్టెడు ధన రాసులను
పదుగురికి పంచుదాము పదరా
సమభావం పెంచుదాము పదరా
మంచిరోజు లొచ్చాయి పదరా





సిరిపల్లె చిన్నది పాట సాహిత్యం

 
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి: 
సిరిపల్లె చిన్నది
చిందులు వేస్తున్నది
చిన్నగాలి తాకిడికే
చిర్రుబుర్రుమన్నది
ఓయమ్మో - భయమేస్తున్నది

చరణం: 1
మొన్న మొన్న ఈ పల్లెటూరిలో
పుటిన బుజ్జాయి
నిన్నటిదాకా పరికిణి కట్టి
తిరిగిన పాపాయి
బస్తీ మకాము పెట్టి -- బడాయి నేర్చుక వచ్చి
బుట్టబొమ్మలా గౌను వేసుకొని
పోజులుకొడుతూ ఉన్నది

చరణం: 2
ఇప్పుడిప్పుడే లండను నుండి
దిగింది దొరసాని
వచ్చీరానీ ఇంగిలీసులో
దంచుతోంది రాని
రేగిందంటే ఒళ్ళు పంబ రేగేనంట
అబ్బ తా చుపాములా పడగ విప్పుకొని
తై తై మన్నది

చరణం: 3
సిగ్గే తెలియని చిలిపి కళ్ళకు
నల్లని అద్దాలెందుకు
తేనెలు చిలికే తెలుగు ఉండగా
ఇంగిలీసు మోజెందుకు
నోరు ముచిదైనప్పుడు  ఊరు మంచిదే ఎప్పుడు 
తెలుసుకోలేని బుల్లెమ్మలకు - తప్పవులే తిప్పలు



ఎగిరే గువ్వ ఏమంది ? పాట సాహిత్యం

 
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల

పలవి:
ఎగిరే గువ్వ ఏమంది ?
విసిరే గాలి ఏమంది ?
ప్రకృతిలోన స్వేచ్ఛకన్న
మిన్న లేనే లేదంది

చరణం: 1
పూల కెందుకు కలిగెనే ఈ ఘుమ ఘుమలు
ఈ మధురిమలు
తీగ లెన్నడు నేర్చెనే ఈ అల్లికలు
ఈ అమరికలు
స్వేచ్ఛకోరే మనసువుంటే
పొందలేనిది యేముంది

చరణం: 2
కోకిలెన్నడు నేర్చెనే ఈ సరిగమలు
సరాగములు
నెమలి కెవ్వరు నేర్పిరే ఈ లయగతులు
ఈ స్వరజతులు
స్వేచ్ఛకోరే మనసువుంటే
నేర్వలేనిది యేముంది

చరణం: 3
శిరసు వంచక నిలువనా గుడి గోపురమై
గిరి శిఖరమునై
అవధులన్నీ దాటనా ప్రభంజనమై
జలపాతమునై
స్వేచ్ఛకోరే మనసునాది
ఇంక నా కెదురేముంది





ఈ నాటి సంక్రాంతి అసలైన పండగ పాట సాహిత్యం

 
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల అండ్ కోరస్

సాకి !
ఏటేటా వస్తుంది సంక్రాంతి పండగ
బీదసాదల కెల్ల ప్రియమైన పండగ

పల్లవి: 
ఈ నాటి సంక్రాంతి అసలైన పండగ
సిసలైన పండగ
కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండుగ!

ఎవ్వరేమి అనుకున్నా
ఎంత మంది కాదన్నా
ఉన్న వాళ్ళ పెత్తనం ఊడుతుందిలే
సోషలిజం వచ్చే రోజు - దగ్గరుందిలే

చరణం: 1
గుడిసె కాపురాలు మాకు ఉండబోవులే 
ఈ మేడలు కొద్ది మందికే స్థిరము కావులే
ఓడలు బండ్లై  బండ్లు ఓడలై
తారుమారు ఎపుడైనా తప్పదులే తప్పదులే

చరణం: 2
ఎగిరిపడే పులిబిడ్డలు పాపం ఏమైపోతారు
పిల్లులాగా తోక ముడుచుకొని మ్యావ్ మ్యావ్ మంటారు
కిక్కురుమనక - కుక్కిన పేనై
చాటుగా నక్కుతారు - చల్లగా జారుకుంటారు



నేలతో నీడ అన్నది పాట సాహిత్యం

 
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: ఘంటసాల

పల్లవి :
నేలతో నీడ అన్నది నను తాకరాదని
పగటితో రేయి అన్నది నను తాకరాదని
నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది
నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది

చరణం: 1
వేలి కొసలు తాకనిదే వీణ పాట పాడేనా
చల్లగాలి తాకనిదే నల్ల మబ్బు కురిసేనా ?
తల్లి తండ్రి ఒకరి నొకరు తాకనిదే
నీవు లేవు, నేను లేను, లోకమే లేదులే

చరణం: 2
రవి కిరణం తాకనిదే నవ కమలం విరిసేనా
మధుపం తను తాకనిదే మందారం మురిసేనా
మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే
మమత లేదు, మనిషి లేడు, మనుగడయే లేదులే

చరణం: 3
అంటరాని తనము- ఒంటరి తనము
అనాదిగా మీ జాతికి అదే మూలధనము
ఇక సమభావం, సమధర్మం, సహజీవన మనివార్యం
తెలుసుకొనుట మీ ధర్మం - తెలియకుండా మీ ఖర్మం 



మంచిరోజు లొచ్చాయి పదరా పాట సాహిత్యం

 
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల, సుశీల అండ్ కోరస్

పల్లవి: 
పదరా - పదరా
నడుంకట్టి పిడికిలెత్తి పదరా
నవ విప్లవ శంఖమూది పదరా
పడగెత్తే స్వార్ధపరుల
అడుగడుగున తరిమి కొట్టి - పదరా
మంచిరోజు లొచ్చాయి పదరా

చరణం: 
చెమటోడ్చి పనిచేయని సోమరులకు చోటు లేదురా
పదుగురితో కలిసి రాని బాబులకిక బతుకు లేదురా
గునపమెత్తి - సుత్తిపట్టి
కొండలనే పిండికొట్టి
నదులను మళ్ళించుదాము పదరా  రతనాలను పండించుదాము పదగా
మంచిరోజు కొచ్చాయి పదరా





ఎందుకే పిరికితనం పాట సాహిత్యం

 
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి. సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి

పల్లవి :
ఎందుకే పిరికితనం
చాలునే కలికితనం
రా - తెంచుకొని రా - తెలుసుకొని రా !
బంధనా లెందుకు - ఎందుకు - ఎందుకు

చరణం: 1
పెళ్ళంటే ఒక ఒప్పందం - అది
కోరేదే అనుబంధం
ఆ అనుబంధం లేనినాడు
మనువూ, మనసూ కలవని నాడు
మంగళ సూత్రమె ఉరితాడు - ఉరితాడు - ఉరితాడు
రా - తెంచుకొని రా తెలుసుకొని రా!
పంజరా లెందుకు- ఎందుకు - ఎందుకు!

చరణం: 2
మాంగల్యమే సతీమణి ప్రాణమందురే
పసుపు, కుంకుమ పడతి సౌభాగ్యమందురే
సౌశీల్యమే మగువ సహజ గుణమందురే
సహనమే స్త్రీ జాతి మూలధనమందురే

చరణం : 3
నువు చెప్పేది పాతపురాణం
నువు మెచ్చేది కొత్త సమాజం
స్వార్థపరులూ సౌఖ్యం కోసం
చల్లని సూక్తులు వల్లించి 
జాతికి వేసిరి సంకెళ్ళు - సంకెళ్ళు - సుకెళ్ళు
తెంచుకొని రా - తెలుసుకొని రా
ఉక్కు తెరలెందుకు - ఎందుకు - ఎందుకు

చరణం : 4
ఈ తాళి ఏ రీతి విడనాడనే ?
ఎటుల ఈ సంఘాని కెదురీదనే ?
పది మంది నను చూచి పకపకా నవ్వరా !
నా పేరు, నా పరువు గంగలో కలపరా?

చరణం: 5
నీ నరాల నిండా పీరికి మందు
అరె కలేజ వుంటే ఉరుకుముందు
రాజ్యాలైనా రాకెట్లయినా
రమణులు నడిపే ఈ రోజులో
ఇంకా యెందుకు - వాదనలు - వేదనలు - రోదనలు
రా - తెంచుకొని రా తెలుసుకొని రా
భంధనాలెందుకు ఎందుకు ఎందుకు




యెక్కడికమ్మా ఈ పయనం ? పాట సాహిత్యం

 
చిత్రం: మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం: టి.చలపతిరావు
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల

పల్లవి: 
యెక్కడికమ్మా ఈ పయనం ?
యేమిటి తల్లీ నీ గమ్యం?
చెదరిన హృదయముతో
చెమరిన కన్నులతో

చరణం: 1
కన్న ఇంటిలో చోటేలేదు
ఉన్న ఇంటిలో సుఖమే లేదు
చిరునవ్వులతో వెలిగే బ్రతుకే
చీకటి పాలై పోయెనులే

చరణం: 2
తెలియక చేసిన చిన్న నేరమే
కలకాలం నిను వెంటాడాలా ?
మమతలు చూపి మన్నించవలసిన
పతియే నీ పై పగబూనాలా ?

Palli Balakrishna Wednesday, April 13, 2022
Raja Nandini (1958)



చిత్రం: రాజనందిని (1958)
సంగీతం: టి.వి.రాజు 
నటీనటులు: యన్.టి.రామారావు, అంజలీదేవి
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య 
నిర్మాతలు: యం.రామకృష్ణారావు, మిద్దే జగన్నాధ రావు 
విడుదల తేది: 04.07.1958



Songs List:

Palli Balakrishna Tuesday, February 1, 2022
Lakshmi Nivasam (1968)



చిత్రం: లక్ష్మీ నివాసం (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
నటీనటులు: కృష్ణ, శోభన్ బాబు, అంజలీ దేవి, వాణిశ్రీ, భారతి , విజయ లలిత 
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: టి.గోవింద రాజన్ 
విడుదల తేది: 19.07.1968



Songs List:



నవ్వు నవ్వించు పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. సుశీల 

నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు
ఉహు..ఉహూహూ..నా ఊహలు లాలించు
నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు
ఉహు..ఉహూహూ..నా ఊహలు లాలించు
నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు

చరణం: 1
నాలో వయసుంది నవనవలాడింది
నీలో మనసుంది నిగనిగలాడింది
నాలో వయసుంది నవనవలాడింది
నీలో మనసుంది నిగనిగలాడింది
కువకువలాడే కోరికలన్నీ ఘుమఘుమలాడాలి
కువకువలాడే కోరికలన్నీ ఘుమఘుమలాడాలి

నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు
ఉహు..ఉహూహూ..నా ఊహలు లాలించు
నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు

చరణం: 2
ఎదుటను నీవుంటే ఏదో సిగ్గు సుమా
చిలిపిగ చూస్తూంటే..తలపులు రేగు సుమా
ఎదుటను నీవుంటే ఏదో సిగ్గు సుమా
చిలిపిగ చూస్తూంటే..తలపులు రేగు సుమా
రెక్కలు విప్పి టక్కరి వలపు రెపరెపలాడాలి 
రెక్కలు విప్పి టక్కరి వలపు రెపరెపలాడాలి

నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు
ఉహు..ఉహూహూ..నా ఊహలు లాలించు
నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు

చరణం: 3
ఆశలు పొంగాయి అల్లరి చేశాయి
నీలో ఉబలాటం..నాలో చెలగాటం
ఆశలు పొంగాయి అల్లరి చేశాయి
నీలో ఉబలాటం..నాలో చెలగాటం
తొందరచేసే అందం పూచి పందిరి వేయాలి
తొందరచేసే అందం పూచి పందిరి వేయాలి

నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు
ఉహు..ఉహూహూ..నా ఊహలు లాలించు
నవ్వు..నవ్వించు..ఆ నవ్వులు పండించు




గువ్వలాంటి చిన్నది పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. సుశీల 

గువ్వలాంటి చిన్నది తారా..జువ్వలాంటి చిన్నది
వెతుక్కొని వస్తే వెన్నలా కరిగిస్తే!
ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా
నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా 

గువ్వలాంటి చిన్నది తారా..జువ్వలాంటి చిన్నది
వెతుక్కొని వస్తే వెన్నలా కరిగిస్తే!
ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా
నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా
నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా

చరణం: 1
మనసైనవాడివని సొగసైనవాడివని
ఆ నోట ఆ నోట విన్నదట
మనసైనవాడివని సొగసైనవాడివని
ఆ నోట ఆ నోట విన్నదట
ఆ విన్నదంత కళ్లారా కన్నదట
నీ గడుసుతనం చూడాలని నీ భరతం పట్టాలని
నిన్న రాత్రి కలలో..కన్నుగీటి పిలిచావని 
నలుగురిలో నిలవేస్తే 
ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌ ఓ మొనగాడా
నువ్‌ ఏం చేస్తావ్‌ ఏం చేస్తావ్‌ ఓ మొనగాడా
నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా

చరణం: 2
ముచ్చటైన పొగరుబోతు కుర్రది..అది
పొంకమైన బింకమైన చిన్నది
ముచ్చటైన పొగరుబోతు కుర్రది..అది
పొంకమైన బింకమైన చిన్నది
ఆ పెంకిపిల్ల నిన్నే కోరుకున్నది 

నీ గుండె దొలుచుకుంది..నిన్ను వలచుకుంది
చల్లగాలి వీచువేళ..చందమామ కాచువేళ
చలిచలిగా వుందంటే..
ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌ ఓ మొనగాడా
నువ్వేం చేస్తావ్‌ ఏం చేస్తావ్‌ ఓ మొనగాడా
నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా

చరణం: 3
సిరిసిరి మువ్వసుమా..చకుముకి రవ్వసుమా
చలగాటం పండించే గవ్వసుమా
సిరిసిరి మువ్వసుమా..చకుముకి రవ్వసుమా
చలగాటం పండించే గవ్వసుమా
నీ కన్నుల్లో నిలిచి వెలుగు దివ్వే సుమా
నీ జంటబాయనంది..నీ వెంటతిరుగుతుందీ
అందర్నీ మరచిపోయి..అయినవాళ్ళ నిడిచిపెట్టి
తనవేంతే రమ్మంటే
ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా
నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా

ఆ..గువ్వలాంటి చిన్నది తారా..జువ్వలాంటి చిన్నది
వెతుక్కొని వస్తే వెన్నలా కరిగిస్తే!
ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా
నువ్‌ ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌..ఓ మొనగాడా 



బొట్టిరో మేనక పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: మాధవపెద్ది సత్యం 

బొట్టిరో మేనక 



కాలేజ్ జీతమ్ము పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: మాధవపెద్ది సత్యం 

కాలేజ్ జీతమ్ము 




చేయి చేయి కలుపు పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ 

పల్లవి:
చేయీ చేయీ కలుపు..చెంపా చెక్కిలి కలుపు
కేరింతలతో వూరింపులతో..కిలకిల కలకల నవ్వు

చేయీ చేయీ కలుపు..చెంపా చెక్కిలి కలుపు
కేరింతలతో వూరింపులతో..కిలకిల కలకల నవ్వు

చరణం: 1
నా కోర్కెలు గుర్రాలైతే..ఎగరేసుకుపోతా నిన్నే
నా కోర్కెలు గుర్రాలైతే..ఎగరేసుకుపోతా నిన్నే
నీవంతటి మగసిరివైతే..నా అందాలిచ్చెద నీకే
నీ కన్నుల కాపురముంటా..కనురెప్పల తలుపులు తియ్యి
నీ కన్నుల కాపురముంటా..కనురెప్పల తలుపులు తియ్యి
నీ నీడకు తోడుగ వుంటా..నీ బాసలు బాసట చెయ్యి 

చేయీ చేయీ కలుపు..చెంపా చెక్కిలి కలుపు
కేరింతలతో వూరింపులతో..కిలకిల కలకల నవ్వు

చరణం: 2
నీ వలపులు ఎంతో యింపు..నా దోసిలి నిండా నింపు
నీ వలపులు ఎంతో యింపు..నా దోసిలి నిండా నింపు
నిను వీడని మైకమునవుతా..నా మమతల మధువులచేత
నిను వీడని మైకమునవుతా..నా మమతల మధువులచేత
పది చేతులు నాకే వుంటే..బంధించెద బిగువుగ నిన్నే
పది చేతులు నాకే వుంటే..బంధించెద బిగువుగ నిన్నే
జవరాలిని పిడికిట నిలిపే..మొనగాడివి నువ్వే నువ్వే 

చేయీ చేయీ కలుపు..చెంపా చెక్కిలి కలుపు
కేరింతలతో వూరింపులతో..కిలకిల కలకల నవ్వు

చేయీ చేయీ కలుపు..చెంపా చెక్కిలి కలుపు
కేరింతలతో వూరింపులతో..కిలకిల కలకల నవ్వు
హా హా హా హా హా హా 




ఓహో ఊరించే అమ్మాయి పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ 

పల్లవి:
ఓహో..ఊరించే అమ్మాయీ..నేనేమి చేసేది
అందాల కన్నులు నన్ను..తొందర చేశాయి
నీ అందాల కన్నులు నన్ను..తొందర చేశాయి

ఓహో..వేధించే అబ్బాయి..నేనేమి చేసేది
చూపుల్లో కైపులు..నన్ను బిత్తర చేశాయి
నీ చూపుల్లో కైపులు..నన్ను బిత్తర చేశాయి
ఓహో..ఓఓఓఓఓఓఓఓ

చరణం: 1
నీ పైట చెంగు కొస ఎగిరింది
నా పడుచుగుండె ఉసి కొలిపింది
నీ పైట చెంగు కొస ఎగిరింది
నా పడుచుగుండె ఉసి కొలిపింది

నీ చిలిపి పెదవి నను పిలిచింది
నా చెక్కిలి ఓయని పలికింది
నీ చిలిపి పెదవి నను పిలిచింది
నా చెక్కిలి ఓయని పలికింది

ఓహో..ఊరించే అమ్మాయీ..నేనేమి చేసేది
అందాల కన్నులు నన్ను..తొందర చేశాయి
నీ చూపుల్లో కైపులు..నన్ను బిత్తర చేశాయి
ఓహో..ఓఓఓఓఓఓఓఓ

చరణం: 2
నీ ఓర చూపులో ఒగరుంది
నా దోర మనసులో పొగరుంది
నీ ఓర చూపులో ఒగరుంది
నా దోర మనసులో పొగరుంది 

నీ కోడె వయసులో వేడుంది
నా కొంటె తలపుతో రగిలింది
నీ కోడె వయసులో వేడుంది
నా కొంటె తలపుతో రగిలింది

ఓహో..వేధించే అబ్బాయి..నేనేమి చేసేది
చూపుల్లో కైపులు..నన్ను బిత్తర చేశాయి
నీ అందాల కన్నులు నన్ను..తొందర చేశాయి
ఓహో..ఓఓఓఓఓఓఓఓ

చరణం: 3
నీ లేత వలపు చిగురేసింది
విరజాజిలాగ పెనవేసింది
నీ లేత వలపు చిగురేసింది
విరజాజిలాగ పెనవేసింది

నా మేని సొగసు విరబూచింది
నీ కంటికి కానుక చేసింది
నా మేని సొగసు విరబూచింది
నీ కంటికి కానుక చేసింది

ఓహో..ఊరించే అమ్మాయీ..నేనేమి చేసేది
అందాల కన్నులు నన్ను..తొందర చేశాయి
నీ అందాల కన్నులు నన్ను..తొందర చేశాయి

ఓహో..వేధించే అబ్బాయి..నేనేమి చేసేది
చూపుల్లో కైపులు..నన్ను బిత్తర చేశాయి
నీ చూపుల్లో కైపులు..నన్ను బిత్తర చేశాయి
ఓహో..ఓఓఓఓఓఓఓఓ ఓహో..ఓఓఓఓఓఓఓఓ
ఓహో..ఓఓఓఓఓఓఓఓ....




ధనమేరా అన్నిటికీ మూలం పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: ఘంటసాల 

ధనమేరా అన్నిటికి మూలం 
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
ధనమేరా అన్నిటికి మూలం

మానవుడే ధనమన్నది స్రుజియించెనురా 
దానికి తానే తెలియని దాసుడాయెరా
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా

ధనమేరా అన్నిటికి మూలం

ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా 
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
హయ్యో కూలి పోవు కాపురాలు ఇది తెలియకుంటే..

ధనమేరా అన్నిటికీ మూలం
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లొ ధనమున్నదిరా
శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం
ఆ శ్రీదేవిని నిరశించుత తీరని ద్రొహం

ధనమేరా అన్నిటికి మూలం 
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మంం 




ఇల్లే కోవెల పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం   (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్. జానకి 

ఇల్లే కోవెల చల్లని వలపే దేవత
ఇల్లూ వలపూ వనితే వనిత
ఇల్లే కోవెల చల్లని వలపే దేవత
ఇల్లూ వలపూ నోచిన వనితే వనిత

నుదుట కుంకుమరేఖ కంటికి కాటుకరేఖ..
నుదుట కుంకుమరేఖ కంటికి కాటుకరేఖ
జడలో తెల్లని విరులు యువతికి తరగని సిరులు
జడలో తెల్లని విరులు యువతికి తరగని సిరులు
ఇల్లే కోవెల చల్లని వలపే దేవత
ఇల్లూ వలపూ నోచిన వనితే వనిత

తులసికోటలో దీపము
కలకాలము వెలిగే వరము
తులసికోటలో దీపము
కలకాలము వెలిగే వరము
చెలుని నవ్వుల స్నేహము
చెలుని నవ్వుల స్నేహము
నెలతకు జీవన భాగ్యము
ఇల్లే కోవెల చల్లని వలపే దేవత
ఇల్లూ వలపూ నోచిన వనితే వనిత

చదువులు ఎన్నో చదివిన
పదవులు ఎన్నో ఏలిన
చదువులు ఎన్నో చదివిన
పదవులు ఎన్నో ఏలిన
చివరకు గృహిణిగ మారే
పడతుల బ్రతుకే - ధన్యం
చివరకు గృహిణిగ మారే
పడతుల బ్రతుకే - ధన్యం
ఇల్లే కోవెల చల్లని వలపే దేవత
ఇల్లూ వలపూ నోచిన వనితే వనిత





సోడా సోడా ఆంధ్రా సోడా పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ నివాసం   (1968)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పిఠాపురం నాగేశ్వరరావు 

పల్లవి:
సోడా సోడా ఆంధ్రసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా
సోడా సోడా ఆంధ్రసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా
సోడా సోడా ఆంధ్రసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా
సోడాతాగు తెలుగోడా చల్లని సోడా
దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా
సోడాతాగు తెలుగోడా చల్లని సోడా
దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా
సోడా సోడా ఆంధ్రసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా

చరణం: 1
సోడా నెత్తి మీద గంగవున్న ఈశ్వరుడైనా అహ
నిత్య సుధలు తాగుతున్న దేవతలైనా
నేత్తి మీద గంగవున్న ఈశ్వరుడైనా అహ
నిత్య సుధలు తాగుతున్న దేవతలైనా
ఆంధ్రసోడా కోరికోరి తాగుతారోయ్
అది లేకుంటే వడదెబ్బకు వాడుతారోయ్
సోడా సోడా ఆంధ్రసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా

చరణం: 2
నాయకులు చెప్పేది ఉత్తగ్యాసు..ఊ..
వినాయకుల చప్పట్లు శుద్ధ గ్యాసు
నాయకులు చెప్పేది ఉత్తగ్యాసు
వినాయకుల చప్పట్లు శుద్ధ గ్యాసు
పోసుకోలు పాలిటిక్స్ పరమ గ్యాసు
వాటికన్నా ఉపయోగం సోడా గ్యాసు
సోడా సోడా ఆంధ్రసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా

చరణం: 3
ఒక్క గుక్క తాగి చూడు మండుటెండలో అహ
హిమాలయం చల్లదనం నీ గొంతుకలో
ఒక్క గుక్క తాగి చూడు మండుటెండలో అహ
హిమాలయం చల్లదనం నీ గొంతుకలో
రాళ్ళు తిని తాగితే జీర్ణమవ్వాలి
నీళ్ళు తాగితే సగం కడుపు నిండాలి
సోడా సోడా ఆంధ్రసోడా గోలిసోడా జిల్ జిల్ సోడా
సోడాతాగు తెలుగోడా చల్లని సోడా
దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా
సోడా సోడా ఆంధ్రసోడా

Palli Balakrishna Tuesday, November 30, 2021

Most Recent

Default