Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sumanth"
Sita Ramam (2022)



చిత్రం : సీతా రామం (2022)
సంగీతం: విశాల్ చందసేఖర్ 
నటినటులు:దుల్కర్ సాల్మన్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ 
దర్శకత్వం: హను రాఘవపూడి
నిర్మాత: అశ్వని దత్ 
విడుదల తేది: 05.08.2022



Songs List:



ఓ సీతా వదలనిక పాట సాహిత్యం

 
చిత్రం : సీతా రామం (2022)
సంగీతం: విశాల్ చందసేఖర్ 
సాహిత్యం: అనంత శ్రీరాం
గానం: యస్.పి.బి.చరణ్ , రమ్యా బెహ్రా 

ఓ సీతా వదలనిక తోడౌతా
రోజంతా వెలుగులిడు నీడౌతా
దారై నడిపే చేతి గీత
చేయి విడువక సాగుతా

తీరం తెలిపెనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా

హే రామా ఒకరికొకరౌతామా
కాలంతో కలిసి అడుగేస్తామా
రేపేం జరుగునో రాయగలమా
రాసే కలములా మారుమా

జంట జన్మనే గీయగలమా
గీసే కుంచెనే చూపుమా
మెరుపులో ఉరుములో దాగుంది
నిజము చూడమ్మా

ఓ సీతా వదలనిక తోడౌతా
హే రామా ఒకరికొకరౌతామా

నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ
నీ చూపులే నేలపై వాలుతున్నవి
అడుగు అడుగున పువ్వులై

ఓ వైపేమో ఓపలేని మైకం లాగుతోంది
మరోవైపు లోకం ఏమి తోచని సమయంలో
ఏది తేల్చని హృదయమో
ఏమో బిడియమో నియమమో
నన్నాపే గొలుసు పేరేమో

నిదుర లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులే
నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే

ఎపుడు లేదే ఏదో వింత బాధే
వంత పాడే క్షణం ఎదురాయే
కలిసొస్తావా ఓ కాలమా
కలలు కునుకులా కలుపుమా
కొలిచే మనిషితో కొలువు ఉండేలా
నీ మాయ చూపమ్మా

హాయ్ రామా రామా ఒకరికొకరౌతామా
కాలంతో కలిసి అడుగేస్తామా
దారై నడిపే చేతి గీత
చేయి విడువక సాగుతా

తీరం తెలిపెనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుతా
కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా




ఇంతందం దారి మల్లిందా పాట సాహిత్యం

 
చిత్రం : సీతా రామం (2022)
సంగీతం: విశాల్ చందసేఖర్ 
సాహిత్యం: కృష్ణ కాంత్ 
గానం: యస్.పి.బి.చరణ్ 

ఇంతందం దారి మల్లిందా
భూమిపైకే చేరుకున్నదా
లేకుంటే చెక్కి ఉంటారా
అచ్చు నీలా శిల్ప సంపదా

జగత్తు చూడనీ
మహత్తు నీదేలే
నీ నవ్వు తాకి 
తరించె తపస్సీలా
నిశీదులన్నీ తలొంచే
తుషారాణివా

విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే

నీదే వేలు తాకి
నేలే ఇంచు పైకి
తేలే వింత వైఖరీ
వీడే వీలు లేని
ఏదో మాయలోకి
లాగే పిల్ల తెంపరీ

నదిలా దూకేటి
నీ పైట సహజగుణం
పులిలా దాగుంది
వేటాడే పడుచుతనం
దాసోహమంది నా ప్రపంచమే
అదంత నీ దయే

విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే

చిలకే కోక కట్టి
నిన్నే చుట్టుముట్టి
సీతాకోకలాయేనా..!
విల్లే ఎక్కుపెట్టి
మెల్లో తాళి కట్టి
మరలా రాముడవ్వనా

అందం నీ ఇంట
చేస్తోందా ఊడిగమే
యుద్ధం చాటింది
నీపైన ఈ జగమే
దాసోహమంది నా ప్రపంచమే
అదంత నీ దయే

విసుక్కునె వెళ్ళాడు చందమామయే
నువ్వుంటే నా పనేంటనే
ఈ నేలకే దిగేను కోటి తారలే
నీకంత వెన్నెలేంటనే



కానున్న కళ్యాణం ఏమన్నది పాట సాహిత్యం

 
చిత్రం : సీతా రామం (2022)
సంగీతం: విశాల్ చందసేఖర్ 
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: అనురాగ్ కులకర్ణి, సింధూరి. S

ఆఆ ఆఆఆ ఆఆ ఆ ఆ ఆఆ
కానున్న కళ్యాణం ఏమన్నది
స్వయంవరం మనోహరం
రానున్న వైభోగం ఎటువంటిది
ప్రతి క్షణం మరో వరం

విడువని ముడి ఇది కదా
ముగింపులేని గాధగా
తరముల పాటుగా...
తరగని పాటగా
ప్రతి జత సాక్షిగా...
ప్రణయమునేలగా సదా

కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా...
కళ్ళముందు పారాడగా... (2)

చుట్టు ఎవరూ ఉండరుగా
కిట్టని చూపులుగా
చుట్టాలంటూ కొందరుండాలిగా
దిక్కులు ఉన్నవిగా

గట్టిమేలమంటూ ఉండగా
గుండెలోని సందడి చాలదా
పెళ్లి పెద్దలెవరు మనకి
మనసులే కదా
అవా..! సరే..!!

కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా...
కళ్ళముందు పారాడగా.... (2)

తగు తరుణం ఇది కదా
మదికి తెలుసుగా
తదుపరి మరి ఏమిటటా
తమరి చొరవట..!
బిడియమిదేంటి కొత్తగా
తరుణికి తెగువ తగదుగా
పలకని పెదవి వెనక
పిలువు పోల్చుకో
సరే మరి.!

కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా...
కళ్ళముందు పారాడగా... (2)




ఓ ప్రేమా పాట సాహిత్యం

 
చిత్రం : సీతా రామం (2022)
సంగీతం: విశాల్ చందసేఖర్ 
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: కపిల్ కపిలన్, చిన్మయి శ్రీపాద 

వస్తా… నే వెంటనే
ఉంటా… నీ వెంటనే

ముద్దంటిన చెంపపై
తడి ఆరనే లేదులే
మాటొకటి చెప్పెంతలో
పయనాలు మొదలాయెనే

ఓ ప్రేమా.. - ఓ ప్రేమా
అవసరమా... - అవసరమా
మాయే నీ...- మాయే నీ
చిరునామా... - చిరునామా

మనసంతా నీవే ప్రియా
విరహాన్ని చంపేదెలా
అంతరిక్షం అంచుదాక
ప్రేమ తాకిందిగా

నీతో ఙ్ఞాపకాలే
ఈ మంచుల అవి కరగవే
ఈ నీ పరిమళాలే
గుండెలో నిండెలే

ఓ ప్రేమా.. - ఓ ప్రేమా
అవసరమా... - అవసరమా
మాయే నీ...- మాయే నీ
చిరునామా... - చిరునామా

ఇటు చూడవా ప్రియతమా
ఎడబాటు అనుకోకుమా
కాలికిందే చిక్కుకుందీ
చూడు నా ప్రాణమే

దూరం ఆవిరాయే
నీ వెచ్చనీ నిశ్వాసలో
నిదురే చెదిరేలోపే
తిరిగిరా స్వప్నమా

ఓ ప్రేమా.. - ఓ ప్రేమా
అవసరమా... - అవసరమా
మాయే నీ...- మాయే నీ
చిరునామా... - చిరునామా

Palli Balakrishna Tuesday, August 2, 2022
Malli Modalaindi (2021)



చిత్రం: మళ్ళీ మొదలైంది (2021)
సంగీతం:అనూప్ రూబెన్స్ 
నటినటులు: సుమంత్ , నయన గంగూలీ
దర్శకత్వం: టి.జి.కీర్తి కుమార్ 
నిర్మాత: కె.రాజశేఖర్ రెడ్డి 
విడుదల తేది: 17.11.2021



Songs List:



ఏంటో ఏమో జీవితం పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీ మొదలైంది (2021)
సంగీతం:అనూప్ రూబెన్స్ 
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: సాయి చరణ్ 

ఆ ఏంటో, ఆ ఏమో
ఆ ఏంటో ఏమో జీవితం
ఎందుకిలా చేస్తాదో జీవితం
అరె..! ఏంటో ఏమో జీవితం
ఎందుకిలా చేస్తాదో జీవితం

ఏ సూడబోతే తెల్లగున్న కాగితం
ఏ రాసుకున్న చెరిగిపోదు నీ గతం
ఏ నిన్ను చూసి నవ్వేస్తు… నీ సరద తీరుస్తూ
ఎవ్వడిని వదిలి పెట్టదూ
ఏ అటో ఇటో ఎటో ఎటో… సాగుతున్న జీవితం
సరాసరి సవాలుగా మారేనా
అరె..! చిన్న పెద్ద ఊరు వాడా… నవ్వనే నవ్వగా
పెళ్ళే పెటాకులై పోయే దేవుడా

ఏ చిక్కులో పడ్డావు… చిక్కు ముడివయ్యావు
వేగు చుక్కల నువ్వు… అట్ట ఎట్టా మిగిలావు
సీతలేని ఓ రామ… ఎందుకో ఈ డ్రామా
లంక తగలెట్టాక… ఏమైందో భామ
గ్లాసు బాసు దేవదాసు… సోలో లైఫే సూపర్ బాసు
చేతులు రెండూ కాలే దాకా… ఆకులు నువ్వే పట్టవయ్యో
సుడిగుండం దాటేదేట్టా, హా

ఏ అటో ఇటో ఎటో ఎటో… సాగుతున్న జీవితం
సరాసరి సవాలుగా మారేనా
అరె..! చిన్న పెద్ద ఊరు వాడా… నవ్వనే నవ్వగా
పెళ్ళే పెటాకులై పోయే దేవుడా

ఏ వంటలో నల భీమా… చెయ్యలేదా భీమా
పెళ్లి రుచి తెలిసిందా… చేదు కారం తగిలాయ
మంట ముందు పెట్టాకే… పెళ్లి చేస్తారయ్యా
మంట కింద పెట్టేదే… పెళ్లి పెళ్లాం ప్రేమ
మగువ తగువా కలిసొచ్చాక… సులువా విలువ పోయేదాకా
పిల్లే నిన్ను ఒగ్గేశాక… తట్టా బుట్టా సర్దేశాక
సొంతూరే ఎల్లకు బ్రదరూ
ఏ అటో ఇటో ఎటో ఎటో… సాగుతున్న జీవితం
సరాసరి సవాలుగా మారేనా
అరె..! చిన్న పెద్ద ఊరు వాడా… నవ్వనే నవ్వగా
పెళ్ళే పెటాకులై పోయే దేవుడా





అలోన్ అలోన్ పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీ మొదలైంది (2021)
సంగీతం:అనూప్ రూబెన్స్ 
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: సిద్ శ్రీరాం , అనూప్ రూబెన్స్ 

కనులకు తెలియని ఓ కలలా… వెళిపోయావే నువ్వు ఎలా
మిగిలానే నే ఓ శిలలా, అలోన్

అలోన్ అలోన్… అలోన్ అలోన్
ఐ యామ్ లోన్లీ… ఐ యామ్ సో లోన్లీ
అలోన్ అలోన్… అలోన్ అలోన్
ఐ యామ్ లోన్లీ… ఐ యామ్ సో లోన్లీ, యాయి యే

కనులకు తెలియని ఓ కలలా
వెళిపోయావే నువ్వు ఎలా
మిగిలానే నే ఓ శిలలా, అలోన్
విడివిడి అడుగులు పడెను ఎలా
కలవని జంటల ఓ కధలా
ఒంటరి మనసులో ఓ వ్యధలా, అలోన్ ఓ

ఆ ఆ, వదిలెళ్ళిపోకే నన్నూ… వదులుకోలేనే నిన్నూ
మన గతములోనే ఉన్నాను… ఓ చెలీ ఓ చెలీ
అలోన్ అలోన్ (అలోన్)… అలోన్ అలోన్ (అలోన్)
అలోన్ అలోన్, ఐ యామ్ లోన్లీ… ఐ యామ్ సో లోన్లీ
తలచావా చెలి నువ్వు అలా
పొలమారిందే ఎందుకిలా
వేరెవరూ నాకేమి ఇలా, అలోన్
చిరునవ్వులకే సంకెళ్ళా
వెళిపోయావే ప్రియురాలా
గతమే నువ్వని మరవాలా, అలోన్

వదిలెళ్ళిపోకే నన్నూ… వదులుకోలేనే నిన్నూ
మన గతములోనే ఉన్నాను
ఓ చెలీ (ఓ చెలీ)… ఓ చెలీ (ఓ చెలీ)

వదిలెళ్ళిపోకే నన్నూ… వదులుకోలేనే నిన్నూ
మన గతములోనే ఉన్నాను
ఓ ఓ చెలీ (ఓ చెలీ)… ఓ చెలీ (ఓ చెలీ)
అలోన్ అలోన్

Palli Balakrishna Monday, November 1, 2021
Kapatadhaari (2021)



చిత్రం: కపటదారి (2021)
సంగీతం: సిమోన్ కె. కింగ్
నటీనటులు: సుమంత్, నాజర్, శ్వేత నందిత
దర్శకత్వం: ప్రదీప్ కృష్ణ మూర్తి
నిర్మాతలు: జి. ధనుంజయన్, లలిత ధనుంజయన్
విడుదల తేది: 26.02.2021



Songs List:



కపటదారి పాట సాహిత్యం

 
చిత్రం: కపటదారి (2021)
సంగీతం: సిమోన్ కె. కింగ్
సాహిత్యం: భాషా శ్రీ 
గానం: నిరంజ్ సురేష్ 

కపటదారి



కలలో కనుపాపే పాట సాహిత్యం

 
చిత్రం: కపటదారి (2021)
సంగీతం: సిమోన్ కె. కింగ్
సాహిత్యం: వనమాలి
గానం: ప్రదీప్ కుమార్

కలలో కనుపాపే ఎదురుగ నీ రూపం నిలిపిందే
కదిలే ఆ గురుతే కనుమరుగై గతమేదో తోడిందే
అలలుగా నీ ఊహలే నను తాకుతూ
నా గుండెనే తొలిచాయిలే
మనసున నీ జ్ఞాపకం నను కాల్చుతూ
నాతో నీడై సాగేలే

కలలో కనుపాపే ఎదురుగా నీ రూపం నిలిపిందే
కదిలే ఆ గురుతే కనుమరుగై గతమేదో తోడిందే
అలలుగా నీ ఊహలే నను తాకుతూ
నా గుండెనే తొలిచాయిలే
మనసున నీ జ్ఞాపకం నను కాల్చుతూ నాతో నీడై సాగేలే

నిలపద నా ఆకాశం నీ నవ్వుల నక్షత్రం, ఎదుటే ఎపుడూ
వెనకటి నా ఆనందం మరలద ఇక నా కోసం, జతగా ఇపుడూ
నా నిజం కలగా ఈనాడిలా కథగా
మార్చేస్తుంటే మౌనంగానే నమ్మే తీరాలా ఈ వేళా

కలలో కనుపాపే ఎదురుగా నీ రూపం నిలిపిందే
కదిలే ఆ గురుతే కనుమరుగై గతమేదో తోడిందే

నడిచిన నా ప్రతి అడుగు వెతికెనులే నీ కొరకు, నిదురే మరిచి
నిను విడువక నీ ఒడిలో గడిపిన నా ప్రతి నిమిషం రాదా తిరిగి
ఆయువే అలసి నా ఆశలే ముగిసి

నీవేలేని నా లోకంలో నేనేమౌతానో ఈ వేళా

కలలో కనుపాపే ఎదురుగా నీ రూపం నిలిపిందే
కదిలే ఆ గురుతే కనుమరుగై గతమేదో తోడిందే
అలలుగా నీ ఊహలే నను తాకుతూ, నా గుండెనే తొలిచాయిలే
మనసున నీ జ్ఞాపకం నను కాల్చుతూ, నాతో నీడై సాగేలే




హే హయక్కి హయక్కి పాట సాహిత్యం

 
చిత్రం: కపటదారి (2021)
సంగీతం: సిమోన్ కె. కింగ్
సాహిత్యం: వనమాలి
గానం: సన మోయిదుట్టి

చెలరేగే చీకటిలో నను కాల్చే వ్యధ
తీర్చే జత నీవే కదా
మరల మరల తనువు కోరే సరదా

Hop up in this club with some models… models
Sit in VIP poppin bottles… bottles
We aint slow in down
We full throttle we just do it
Big homie we just so colossal
You just break it now
Baby girl you know to work it
Bounce it to the sides and i love the way you twerk it
Shake it now break it exoyic like teriyaki
Spin it disc jockey I’m dance in with this hayakki

హే హయక్కి హయక్కి
పట్టూ పట్టూ పట్టూ నా పైకి పాకి
నన్ను చుట్టు ముట్టు
హే హాయక్కి హాయక్కి
పట్టూ పట్టూ పట్టూ నా పైకి పాకి
నన్ను చుట్టు ముట్టు

నా పోగరెంతో నువ్ పసిగట్టు
నీ దెయ్యం వదిలలిస్తా
ఈ పరువాన్నే ఓ పని పట్టు
నా దేహం అరువిస్తా

I love it the way you shake it around
Girl you make me psycho
Keep what you do in dont ever stop it babe
Make my mind blow cant make my mind blow
Cant get you out cant cant cant
Get you out of my mind when the night is done
Let me take control
Inni inni hayakki
Inni inni hayakki

 
హే హయక్కి హయక్కి
పట్టూ పట్టూ పట్టూ నా పైకి పాకి
నన్ను చుట్టు ముట్టు
హే హాయక్కి హాయక్కి
పట్టూ పట్టూ పట్టూ నా పైకి పాకి
నన్ను చుట్టు ముట్టు

Hayaki on the floor
Yalla yalla
Inni inni hayakki
Valla haabee bee Valla haabee bee 
Valla haabee bee
Inni inni hayakki

ఓ నా ఒళ్లోకొచ్చి మన్మధుడే పొనంటున్నాడే
ఆ ఇంద్రుడేమో శ్వర్గమంటే చీ కొట్టేశాడే
నా అందాలన్నీ కొల్లగొట్టి వెళ్ళాలని
గుమిగూడి గుమిగూడి పోదా లోకమే
నా శిల్పం చెక్కి చూడు సరదాగా
ఆ బ్రహ్మే నీకు సలాం చేస్తాడే
నా బొమ్మే గీసి చూడు అలవోకగ
పికాసో పుట్టాడ నీ కళ్లే పట్టాడ

హయక్కి బేబీ  హయక్కి బేబీ 
నా సొగసుకు దాసోహం ఎందరెందరో
హయక్కి బేబీ  హయక్కి బేబీ 
నే ఓరకంట చూసాన చిత్తు చిత్తురో
ఎట్టా సోకిందే నీ గాలిట్టా
బెట్టే ఏందంట వొళ్ళో వాలిట్టా
కూసే ఓ పిట్టా ఇచ్చేయ్యిట్టా మా వాటా
పరిచే నీ పైట 

ఇన్ని ఇన్ని హైకి

ఓ యః

హే హయక్కి హయక్కి
పట్టూ పట్టూ పట్టూ నా పైకి పాకి
నన్ను చుట్టు ముట్టు
హే హయక్కి హయక్కి
పట్టూ పట్టూ పట్టూ నా పైకి పాకి
నన్ను చుట్టు ముట్టు



Theme of Kapatadhaari పాట సాహిత్యం

 
చిత్రం: కపటదారి (2021)
సంగీతం: సిమోన్ కె. కింగ్
సాహిత్యం: సైమన్ కె.కింగ్ 
గానం: సైమన్ కె.కింగ్ 

Theme of Kapatadhaari



# పాట సాహిత్యం

 
చిత్రం: కపటదారి (2021)
సంగీతం: సిమోన్ కె. కింగ్
సాహిత్యం: 
గానం: 

శబ్దమే 

Palli Balakrishna Monday, March 15, 2021
Anaganaga Oka Rowdy (2022)



చిత్రం: అనగనగా ఒక రౌడీ (2022)
సంగీతం: మార్క్ కె.రాబిన్ 
నటీనటులు: సుమంత్ 
దర్శకత్వం: మను యజ్ఞా 
నిర్మాత: గార్లపాటి రమేష్, డా.టి.ఎస్. వినీత్ భట్ 
విడుదల తేది: 2022

Palli Balakrishna Saturday, February 13, 2021
Idam Jagath (2018)


చిత్రం: ఇదం జగత్ (2018)
సంగీతం: శ్రీచరణ్ పాకల
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: రవిప్రకాష్ చోడిమాల, యామిని గంటసాల
నటినటులు: సుమంత్, అంజు కురియాన్
దర్శకత్వం: అనిల్ శ్రీకాంతం
నిర్మాత: శ్రీధర్ గంగపట్నం, జొన్నలగడ్డ పద్మావతి
విడుదల తేది: 28.12.2018

దూరాలే కొంచం కొంచం 
దూరాలే అవుతున్నట్టు
దారాలే అల్లేస్తున్నా స్నేహాలేవో
గారాలే కొంచం కొంచం 
నీ మీదే వాలేటట్టు
గాలేదో మల్లిస్తున్నా ఇష్టాలేవో
కనులే ఇలా కసిరేంతల
కలవాలనే కలలే ఇవా
అలవోకగ అలవాటులో
అనుకోనిదే అవుతోందిలా

మౌనంగా దాగే ప్రేమ
మెల్లంగా మాటల్లే మార్చేస్తుందా
ఆవైపు ఇంతే ఉన్నా
వద్దంటు మొహమాటం పెట్టిస్తుందా

కొంగొత్తగా మెదిలే ఓ వెలుగే
నీ వల్లనే కలిగే
నువ్వుండంగా దిగులే ఉండదులే
నవ్వుల్లోనే మునిగే
ఇంతలా తెలిసావనే
గమనించనైనా లేదులే

గడియారమే పరుగాపదే
గడచెనులే ఘడియే ఇలా
నిను చూడగా సరిపోదుగా
ఈ మరి మరి కోరే ప్రణయమా
కలవాలనే కదిలే ఇలా
కలిసిందిలే కల నేరుగా
కనుకే ఇలా కథ మారగా
కలిపిందిలే కాలం కదా

మౌనంగా దాగే ప్రేమ
మెల్లంగా మాటల్లే మార్చేస్తుందా
ఆవైపు ఇంతే ఉన్నా
వద్దంటు మొహమాటం పెట్టిస్తుందా



Palli Balakrishna Monday, January 21, 2019
Subramanyapuram (2018)


చిత్రం: సుబ్రహ్మణ్య పురం (2018)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: సురేష్ బనిశెట్టి
గానం: అనురాగ్ కులకర్ణి, నూతన మోహన్
నటీనటులు: సుమంత్, ఇషా రెబ్బ
దర్శకత్వం: సంతోష్ జగర్లపూడి
నిర్మాతలు: ధీరజ్ బొగ్గారం, బీరం సుధాకర్ రెడ్డి
విడుదల తేది: 07.12.2018

ఈరోజిలా  ఈరోజిలా
ఏరోజు లేనంత హాయే ఇలా
ఈ రోజులా ప్రతి రోజిలా
కావాలి అంటోంది నా మనసిలా
నీ చూపు బాణాలు ప్రాణాలు తీస్తుంటే
నీ నవ్వు ఊపిరిని పోస్తోందిలే

అలలే లే లే లే ఆకాశమే తాకెనులే
అలలా దూకేలే నీవల్లే కలలే
అలలే లే లే లే ఆనందమే పొంగెనులే
అల్లరి చేసేలే నీవల్లే కనులే

ఈరోజిలా ఈరోజిలా
ఏరోజు లేనంత హాయే ఇలా
ఈ రోజులా ప్రతి రోజిలా
కావాలి అంటోంది నా మనసిలా

నాలోని ప్రేమంతా నీ పైన దూకేలా
ఓ వర్షపాతంలా మారిందిలా
నా ముందు దారంతా నీతోటి నిండేలా
ఓ పూలతోటై మారి చూస్తూ ఉందిలా
ఇన్నాళ్లు నాకునేనా ఇపుడేమో నువ్వయ్యాన
నా  చిన్ని గుండెలోన నువ్వే వాలగా

అలలే లే లే లే ఆకాశమే తాకెనులే
అలలా దూకేలే నీవల్లే కలలే
అలలే లే లే లే ఆనందమే పొంగెనులే
అల్లరి చేసేలే నీ వల్లే కనులే

ఈరోజిలా  ఈరోజిలా
ఏరోజు లేనంత హాయే ఇలా
ఈ రోజులా ప్రతి రోజిలా
కావాలి అంటోంది నా మనసిలా

నా మనసు నాతోనే ఉండేది ఇన్నాళ్లు
ఉండుండి నీతోనే వచ్చిందిలే
నీ ప్రేమ మైకంలో కమ్మింది కాబోలు
కాబట్టి దూరాలన్ని చెరిపేసిందిలే హో
నేనేమో నేను కాదు ఈ చిత్రం కలేం కాదు
నువు నాలో సగం కాదు పూర్తిగ నిండిపో

అలలే లే లే లే ఆకాశమే తాకెనులే
అలలా దూకేలే నీవల్లే కలలే
అలలే లే లే లే ఆనందమే పొంగెనులే
అల్లరి చేసేలే నీ వల్లే కనులే

ఈరోజిలా  ఈరోజిలా
ఏరోజు లేనంత హాయే ఇలా
ఈ రోజులా ప్రతి రోజిలా
కావాలి అంటోంది నా మనసిలా

Palli Balakrishna Tuesday, January 15, 2019
Pelli Sambandham (2000)


చిత్రం: పెళ్లి సంబంధం (2000)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్, స్వర్ణలత
నటీనటులు: సుమంత్, సాక్షిశివానంద్, సంఘవి
దర్శకత్వం & నిర్మాత: కె.రాఘవేంద్రరావు
విడుదల తేది: 28.07.2000

అమ్మమ్మ మాయగాడే నా కొంప ముంచినాడే
సందుల్లో తుంచినాడే రంగంలో దించినాడే
హ ఉరుమై అది నిన్నే మరల ఆడిగాడే
వేళగాని వేళల్లోన వీలుచుసి నాడే
చోటుగాని చోటులోన ఆటలాడినాడే

అమ్మమ్మ మాయగాడే నా కొంప ముంచినాడే
సందుల్లో తుంచినాడే రంగంలో దించినాడే

ఎల్లుండిచ్చే కౌగిల్లో మెల్లంగా రేపే ఇచ్చే
రేపే ఇచ్చే వత్తిల్లో మొత్తంగా ఈరోజిచ్చే
ఈ రోజిచ్చే  అందాలు ఈ పూటే అందించాల
ఈ పోటెత్తేవిరహాలు ఈ నిమిషం ఆపేయాల
ఆలస్యం అయ్యిందంటే ఆగలేనమ్మా
అవకాశం పోయిందంటే మళ్ళీ రాదమ్మ
నీ మోహం పెరిగిపోతే చూడలేనయ్య
వ్యామోహం తీరేకొద్ది తోడుకోవయ్య
నిప్పులాంటి వంపులాడి వప్పుకుంది నేడే
నీళ్లు నువ్వు చల్లిపోతే తగ్గుతుంది వేడే

అమ్మమ్మ మాయగాడే నా కొంప ముంచినాడే
సందుల్లో తుంచినాడే రంగంలో దించినాడే

నీకే గాని కొట్టందే నాకన్ను ఎందుకంట
నిన్నే గాని చుట్టంది నా చీర ఎందుకంట
నువ్వే గాని లాగందే ఈ కొంగు ఎందుకంట
నీతోగానీ జారంది నా కాలు ఎందుకంట
ఏనాడో వచ్చెనమ్మా గోకులాష్టమి
ఈ నాడే వచ్చిందమ్మ సోకులాష్టమి
ఏడాదికొక్కసారి నాగ పంచమి
నా ఈడు కెన్నిసార్లు భోగ పంచమి
పోకిరోడు దుకినాడే పిల్ల పిట్ట గోడే
చిన్నవాడు చేరినాడు చీర చెట్టు నీడే

అమ్మమ్మ మాయగాడే నా కొంప ముంచినాడే
సందుల్లో తుంచినాడే రంగంలో దించినాడే
హ ఉరుమై అది నిన్నే మరల ఆడిగాడే
వేళగాని వేళల్లోన వీలుచుసి నాడే
చోటుగాని చోటులోన ఆటలాడినాడే

అమ్మమ్మ మాయగాడే నా కొంప ముంచినాడే
సందుల్లో తుంచినాడే రంగంలో దించినాడే

Palli Balakrishna Sunday, March 25, 2018
Emo Gurram Egaravachu (2014)


చిత్రం: ఏమో గుర్రం ఎగరావచ్చు (2013)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం:
గానం: రాహుల్ సిప్లిగంజ్
నటీనటులు: సుమంత్ , సావిక
దర్శకత్వం: చంద్ర సిద్దార్థ
నిర్మాత: పూదోట సుధీర్ కుమార్
బ్యానర్: చెర్రీ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేది: 2013

పల్లవి:
ఓ నీలవేణి నీలవేణి రావే అలక మాని
నీ హంసనడకలని ఫాలో అవుతున్నానని
కోపంలోను ఇంతందమా మనకి మనకి

తేడాలెన్నో ఉన్నా కూడా కూడా రానా
నీడై నీడై పోనా  ఇలా ఇలా (2)

చరణం: 1
ఎండపడి ఎర్ర ఎర్రగా కందినదే లేత బుగ్గ
గొంతుతడి ఆరి ఎంతగా వాడినది మల్లెమొగ్గ
నీకోసం నీలి మబ్బునై ఆకాశం చేరనా
నేనే ఓ వాన జల్లునై ఒళ్ళంతా తడమనా

కూడా కూడా రానా నీడై నీడై పోనా
తేడాలెన్నో ఉన్నా ఇలా ఇలా

చరణం: 2
సోయగము విరిసి గుండెకే చేయకిక తీపిగాయం
సోకులతో నన్ను చంపడం నీకు ఇది ఏమి న్యాయం
నీ పంతం మొయ్యలేనిదని ఏనాడో తెలిసినా
నువ్వేడు మల్లెలెత్తు అని ఇష్టంగా మోయనా

కూడా కూడా రానా నీడై నీడై పోనా
తేడాలెన్నో ఉన్నా ఇలా ఇలా

Palli Balakrishna
Daggaraga Dooranga (2011)


చిత్రం: దగ్గరగా దూరంగా (2011)
సంగీతం: రఘుకుంచె
సాహిత్యం: కేదారినాథ్ పరిమి
గానం: రఘుకుంచె
నటీనటులు:సుమంత్ , వేదిక , సింధూ తులాని
దర్శకత్వం: రవికుమార్ చావలి
నిర్మాత: జె. సాంబశివరావు
విడుదల తేది: 2011

రూరురూరు రూరురు  రూరురూరు రూరురు

మనసు మనసు మరి దగ్గరగా
నువ్వు నేను మహ దూరంగా
కనుల కలలు మన మధ్యే వారధిగా
నీ ఊహే నాలో ప్రాణంగా నా కంటిపాపే చూడంగా
కనిపించ రావ వేగంగా ఓ ఓ ఓ...

నీ ఊహే నాలో ప్రాణంగా నా కంటిపాపే చూడంగా
కనిపించ రావ వేగంగా

నువ్వు ఎక్కడంటు నేను వెతుకుటుంటే
అంతలోనే నువ్వు దగ్గరగా దూరంగా
నువ్వు ఎక్కడంటు నేను వెతుకుటుంటే
అంతలోనే నువ్వు దగ్గరగా దూరంగా
అడుగు అడుగు నీ దగ్గరగా అడగలేనంత దూరంగా
మనసు ఎదుట నిలిచింది మౌనంగా
నువ్వంటే ఎంతో ఇష్ఠంగా చెప్పాలనుంది అందంగా
ఎద పంచుకోవ ఏకంగా ఓఓఓ...

నువ్వుంటే ఎంతో ఇష్ఠంగా చెప్పాలనుంది అందంగా
ఎద పంచుకోవ ఏకంగా...

నిన్ను చూసి ఆశే నన్ను వీడిపోయే
నిన్ను నన్ను కలిపి దగ్గరగా దూరంగా
నిన్ను చూసి ఆశే నన్ను వీడిపోయే
నిన్ను నన్ను కలిపి దగ్గరగా దూరంగా

రూరురూరు రూరురు  రూరురూరు రూరురు (2)

Palli Balakrishna
Malli Raava (2017)




చిత్రం: మళ్ళీరావా (2017)
సంగీతం: శ్రావణ్ భరద్వాజ్
నటీనటులు: సుమంత్ , ఆకాంక్ష సింగ్
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
విడుదల తేది: 08.12.2017



Songs List:



మళ్ళీ రావా పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీరావా (2017)
సంగీతం: శ్రావణ్ భరద్వాజ్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: శ్రావణ్ భరద్వాజ్

ఏ కాలం ఏ దూరం దాచి ఉంచెయ్నా నిన్నే నిన్నే
ఏ గాయం ఏ మౌనం మార్చే ఆపేయన నన్నే నన్నే
మళ్ళీ రావా ఈ చోటుకి మరిచిపోలేక ముమ్మాటికీ
మళ్ళీ రావా నువు లేవన్నవి రావా చంతే వదిలి చింతే
తరిమేస్తున్నా వదిలేస్తున్నా
ఏ కోపాలలో కాల్చినా కూల్చినా
ఈ బంధాలలో ఏ మందున్నదో
ఈ ప్రేమే ఇలా ఓ ఎగసి ఎగసేనా

మళ్ళీ రావా ఈ చోటుకి మరిచిపోలేక ముమ్మాటికీ
మళ్ళీ రావా నువు లేవన్నవి రావా చంతే వదిలి చింతే



చినుకు చినుకు పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీరావా (2017)
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ 
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: కార్తీక్ 

చినుకు చినుకు రాలగా
తెగిన తార తీరుగా
నడిచి వచ్చె నేరుగా
తళుకు తళుకు దేవతా

కాలం కదిలే...
వేగం వదిలే...
నేలంత వణికే...
కాలి కిందగా !!!

రెప్పలే రెక్కలై 
కన్నులే తేలెనే....!
గుండెకే చక్కిలిగింతలా 
తోచేనే... హేహే

మీసమైన రాని పెదవి 
మోయనంత సంతోషం 
క్షణముకొక్క కొత్త జన్మ 
ఎత్తుతున్న సందేహం...

మాటలసలే బయటపడని 
మధురమైన ఓ భావం 
వేల వేల కవితలైన
చాలనంత ఉల్లాసం....!

కోటిరంగులే ఒక్కసారిగా
నిన్నలన్ని ముంచుతున్న వెల్లువా 
చల్లగాలులే ఉక్కపోతలా
ఉందిలే చూస్తే నువ్వలా 
ఎంత చెప్పినా తక్కువేనుగా 
చిన్ని గుండె తట్టుతున్న తూఫానిదే 
చుట్టుపక్కలా ఎవ్వరొద్దనే
కొత్త కొత్త ఆశ రేపే 
తొలిప్రేమిదే 



Welcome Back To Love పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీరావా (2017)
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ 
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: కార్తీక్ 

Welcome Back To Love




ఈనాడు పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీరావా (2017)
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ 
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: సాయి కృష్ణ, లలిత కావ్య


ఈనాడు



అడుగసలె పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీరావా (2017)
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ 
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: కార్తీక్ 

అడుగసలె నిలవదులె నా గుండె వదిలేసె
అలవాటె అయినదిలె కన్నీరె రాలదులే
నువు లేవని బరువె దిగదె
ఇక రావని మనసె వినదె
తప్పె నాదె ప్రేమె పోదే

వచ్చీ పోయె వానల్లె నీవైనావే
నేనేమొ నేలల్లె ఉన్నాలే
చూస్తూనె మారేటీ కాలమె నీవే
నేనేమొ ఆగున్నా నింగెలే
నీ ప్రేమనె మించినా బాదేమిటె
నా ప్రాణమె పంచనా నువ్ కోరితే
నా గుండెనె చీల్చేన నీలొ మౌనమె
మాటాదితె గాయమె మానేనే

ఊపిరిలా ఉన్నావే నిస్వాసై పొతావె
ఒంటరిగా నే లేనె
నాతోనె ఉంటావె
ఊహల్లొ కూడాను
నువు లేకా నే లేనె
ఒట్టెసీ అంటున్నా నువ్వె నేనే



చినుకు చినుకు (Reprise) పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీరావా (2017)
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ 
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: లలితా కావ్య

చినుకు చినుకు రాలగా
Chinuku (Reprise)



మళ్ళి రావా (Reprise) పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీరావా (2017)
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ 
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: సునీత

Malli Raava (Reprise)

ఈ కాలం ఈ దూరం
దాచె ఉంచేన నిన్నె నిన్నె
ఈ గాయం ఈ మౌనం
మార్చె ఆపేన నన్నే నన్నే

మళ్ళి రావా ఈ చోటుకి
మరిచిపోలేక ముమ్మాటికి
మళ్ళి రావ లేవన్నవి
రావ చెంతె వదిలి చింతె

తరిమేస్తున్న వదిలేస్తున్న
ఈ కోపాలలో కాల్చిన కూల్చిన
ఈ బంధాలలో ఏ మందున్నదొ
ఈ ప్రేమె ఇలా
ఒహ్ ఎగసెగసేను

మళ్ళి రావా ఈ చోటుకి
మరిచిపోలేక ముమ్మాటికి
మళ్ళి రావ లేవన్నవి
రావ చెంతె వదిలి చింతె



తెలిసి తెలిసి పాట సాహిత్యం

 
చిత్రం: మళ్ళీరావా (2017)
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ 
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: హరిణి ఇవటూరి

తెలిసి తెలిసి వేకువా
మనసు వెనక దాగెనా
కనుల తెరిచె లోపలా
రోజులెన్నొ గడిచెనా
నాలో కదలే నీలో మెదిలే
మేనెంత ఒనికే ఉన్నపాటుగా

నమ్మనే లేదులె నా మది నిన్నిలా
నన్నిల కమ్మెనె వెన్నెల ఇంతలా
వెతికి వెతికి ప్రేమని
తెలుపలేని వేదనే
కలిసి తెలిసి నేడిలా
ఉప్పెనంటి చేరువా

Palli Balakrishna Wednesday, December 6, 2017
Soggadu (2005)


చిత్రం: సోగ్గాడు (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: వేణు , కౌశల్య
నటీనటులు: తరుణ్ కుమార్ , ఆర్తి అగర్వాల్, శ్రేయా శరన్
దర్శకత్వం: రవిబాబు
నిర్మాత: డి.సురేష్ బాబు
విడుదల తేది: 31.03.2005

ప్రేమించా నిన్నే నిన్నే ప్రాణం కన్నా ప్రాణంగా
పూజించా నిన్నే నిన్నే దైవం కన్నా ఇష్టంగా
ఓ ఓ మనసా వినవా పెదవి చాటు ఈ మాట
ఓ ఓ ఒకటే గొడవ కుదురులేదు ఈ పూట
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నువ్వే నువ్వే
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నువ్వే నువ్వే

ప్రేమించా నిన్నే నిన్నే ప్రాణం కన్నా ప్రాణంగా
పూజించా నిన్నే నిన్నే దైవం కన్నా ఇష్టంగా

ప్రేమించా నిన్నే నిన్నే ప్రాణం కన్నా ప్రాణంగా
పూజించా నిన్నే నిన్నే దైవం కన్నా ఇష్టంగా
ఓ ఓ మనసా వినవా పెదవి చాటు ఈ మాట
ఓ ఓ ఒకటే గొడవ కుదురులేదు ఈ పూట
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నువ్వే నువ్వే
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా నువ్వే నువ్వే

ప్రేమించా నిన్నే నిన్నే ప్రాణం కన్నా ప్రాణంగా
పూజించా నిన్నే నిన్నే దైవం కన్నా ఇష్టంగా

Palli Balakrishna
Chinnodu (2000)


చిత్రం: చిన్నోడు (2000)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: కందికొండ
గానం: తాన్య , టిప్పు
నటీనటులు: సుమంత్, ఛార్మి
దర్శకత్వం: కణ్మణి
నిర్మాత: కాట్రగడ్డ లోకేష్ , సి.వి.శ్రీకాంత్
విడుదల తేది: 2000

పల్లవి:
కన్నుల్లో మెరిశావే చమకు చమకు మని పిల్లా నువ్వు
నామనసే దోచావే తళుకు తళుకు మంటూ
ఓ మసక మసక చీకటిలో వెన్నెల్లాగ వస్తావే
భేషుగ్గా రాకున్నా నే వెలుగే తెస్తాలే
హే ఊసులాడే చూపు చూపుతో వింతగా
ఉరకలేసే ఊహలే ఇలా
వలపు చేసే మెత్తమెత్తగా తొందర
మనసు వినదే మాటనే ఇలా

చరణం: 1
నీ బుగ్గల్లో ఆ ఎరుపే కవ్విస్తే
మదిని తొంగి చూసే ఏదో మాయ
నీ చూపుల్లో ఆ చురకే తాకేస్తే
వలపు నాలో చేరి నీ తోడయ్యా
So  Give it up,  Give it up, Give it up
నీ చిలిపి వన్నెలే ఇచ్చేసేయ్
Give it up,  Give it up, Give it up
నీ ప్రేమలోన ముంచెయ్
అబ్బాబ్బా నోరార నీకంత దూకుడే వద్దంటా
నా వైపే వచ్చావంటే చిక్కు తప్పదంటా

చరణం: 2
నీ పెదవుల్లో ఆ మధువే అందిస్తే
కలిసి నీడలాగా నీతో వస్తా
నా అడుగుల్లో నీ అడుగే వేసేస్తే
ఎదకు ఆరిపోని వెలుగే ఇస్తా
So  Give it up,  Give it up, Give it up
నీ తేనె నవ్వు చెల్లేస్తావా
Give it up,  Give it up, Give it up
నీ సోకులిచ్చి పోవా
ఐతే ఓకే ఓకే నీ తీపిముద్దు నాకిస్తావా
నా మనసే నిన్నే కోరి వెంట సాగుతాగా

కన్నుల్లో మెరిశావే చమకు చమకు మని పిల్లా నువ్వు
నామనసే దోచావే తళుకు తళుకు మంటూ
ఓ మసక మసక చీకటిలో వెన్నెల్లాగ వస్తావే
భేషుగ్గా రాకున్నా నే వెలుగే తెస్తాలే
హే ఊసులాడే చూపు చూపుతో వింతగా
ఉరకలేసే ఊహలే ఇలా
వలపు చేసే మెత్తమెత్తగా తొందర
మనసు వినదే మాటనే ఇలా

Palli Balakrishna Wednesday, November 22, 2017
Dhana 51 (2005)



చిత్రం: దన 51  (2005)
సంగీతం: చక్రి
నటీనటులు: సుమంత్, సలోని అశ్వని
దర్శకత్వం: ఆర్.సూర్యకిరణ్
నిర్మాతలు: యమ్. యల్. కుమార చౌదరి
విడుదల తేది: 14.01.2005



Songs List:



టైటిల్ సాంగ్ పాట సాహిత్యం

 
చిత్రం: దన 51  (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ 
గానం: వాసు, విశ్వా, ఆర్. సూర్య కిరణ్ 

టైటిల్ సాంగ్ 



ఐ యామ్ ఇన్ లవ్ పాట సాహిత్యం

 
చిత్రం: దన 51  (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: చక్రి, కౌశల్య

పల్లవి:
ఐ యామ్ ఇన్ లవ్  ఐ ఫీల్ మై లవ్
ఐ యామ్ ఇన్ లవ్  ఐ ఫీల్ మై లవ్
ఏమేమో అవుతుంది ఏమో మరి
నా కేమైందో తొలిసారి ఈ లాహిరి
ఏలో ఏలో ఏలో చలేస్తుంది నీలో
ఉయ్యాలెక్కి ఊగాలి ఈ వేళలో

ఐ యామ్ ఇన్ లవ్  ఐ ఫీల్ మై లవ్
ఐ యామ్ ఇన్ లవ్

చరణం: 1
ఏదోటిచేయి ఇలా కలుపు చేయి
మదే నిండిపోయి భళేగుంది హాయి
అలై నువ్వు వచ్చేమరీ
సూదంటు రాయి నీ చూపేనురోయి
లాగేసింది నీ వైపుకి హోయ్ హోయ్
సరికొత్త గిలిగింత ప్రేమేనని 
తనువంత పులకించి పోయిందని
హుషారాల హేల తుఫానైన వేళ
తమాషాలు చేరాలి ఈ ప్రేమలో

ఐ యామ్ ఇన్ లవ్  ఐ ఫీల్ మై లవ్
ఐ యామ్ ఇన్ లవ్

చరణం: 2
నువులేని దారి సహారా ఎడారి
నేనే నిన్ను కోరి నాలో నువ్వు చేరి
ఇలా ఉండిపోతే సరి
నీ గుండెలోని నన్నే ఉండిపోని
ఎలాగైన నీ దానిని హోయ్ హోయ్
శిల లాగ ఇన్నాళ్లు ఉన్నానని
అలలాగ మార్చింది నువ్వే చెలి
నువ్వే నేను కాదా నీలో నేను లేన
ఇలా ఏకమవ్వాలి ఈ ప్రేమలో

ఐ యామ్ ఇన్ లవ్  ఐ ఫీల్ మై లవ్
ఐ యామ్ ఇన్ లవ్  ఐ యామ్ ఇన్ లవ్



అరవిరిసిన మొగ్గ పాట సాహిత్యం

 
చిత్రం: దన 51  (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: కందికొండ
గానం: చక్రి

అరవిరిసిన మొగ్గ




చైనా గోడ పాట సాహిత్యం

 
చిత్రం: దన 51  (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: శంకర్ మహదేవన్ 

చైనా గోడ 



ఔననవే ఔనని అనవే పాట సాహిత్యం

 
చిత్రం: దన 51  (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: శంకర్ మహదేవన్ 

ఔననవే ఔనని అనవే



కోవా కోవా పాట సాహిత్యం

 
చిత్రం: దన 51  (2005)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రవివర్మ, పల్లవి, వాసు, బాలాజీ, మతిన్, గౌరీ, ఆర్. సూర్య కిరణ్, కామేశ్వరి 

కోవా కోవా 

Palli Balakrishna
Raaj (2011)



చిత్రం: రాజ్ (2011)
సంగీతం: కోటి
నటీనటులు: సుమంత్, ప్రియమణి, విమలారామన్
దర్శకత్వం: వి.యన్.ఆదిత్య
నిర్మాతలు: కుమార్ బ్రదర్స్
విడుదల తేది: 18.03.2011



Songs List:



సూటిగా చూశావా పాట సాహిత్యం

 
చిత్రం: రాజ్ (2011)
సంగీతం: కోటి
సాహిత్యం: అవినాష్ 
గానం: వేదాల హేమచంద్ర  , సునీత

సూటిగా చూశావా



అందంతో పందెమా పాట సాహిత్యం

 
చిత్రం: రాజ్ (2011)
సంగీతం: కోటి
సాహిత్యం: కేధారినాథ్ పరిమి 
గానం: సిద్దర్ద్, మాళవిక 

అందంతో పందెమా




కల కాదుగా పాట సాహిత్యం

 
చిత్రం: రాజ్ (2011)
సంగీతం: కోటి
సాహిత్యం: కందికొండ 
గానం: శశి కిరణ్, అంజనా సౌమ్యా

కల కాదుగా 





నన్నే నేను మరచిపోయా పాట సాహిత్యం

 
చిత్రం: రాజ్ (2011)
సంగీతం: కోటి
సాహిత్యం: పావని మణిచంద్ర
గానం: దీపు శ్రావణ భార్గవి 

నన్నే నేను మరచిపోయా 




ప్రతి కలా నాలో పాట సాహిత్యం

 
చిత్రం: రాజ్ (2011)
సంగీతం: కోటి
సాహిత్యం: అవినాష్ 
గానం: శ్రీకృష్ణ , ప్రణవి 

ప్రతి కలా నాలో 




భీమవరం బుల్లోడా పాట సాహిత్యం

 
చిత్రం: రాజ్ (2011)
సంగీతం: కోటి
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: శ్రీకృష్ణ , సునీత

(ఈ పాట నాగార్జున గారు నటించిన ఘరానా బుల్లోడు (1995)  సినిమాలో నుండి రీమేక్ చేశారు. దీనికి సంగీతం: యమ్. యమ్. కీరవాణి, సాహిత్యం: వెన్నెలకంటి, గానం: యస్. పి. బాలు, చిత్ర )

పల్లవి:
జింకు చకం  జింకు చకం
జింకు చకం  జింకు చకం (2)

భీమవరం బుల్లోడా పాలు కావాలా 
మురి పాలు కావాలా
జింకు చకం  జింకు చకం
నరసాపురం నరసమ్మ నైసు గుందమ్మా
నీ చెక్కెర చుమ్మా
జింకు చకం  జింకు చకం
పచ్చిపాలు మీగడా
జింకు చకం  జింకు చకం
అచ్చతెలుగు ఆవడా
పెదవుల్లోనే దాచావమ్మో ఓ ఓ ఓ ఓ

భీమవరం బుల్లోడా పాలు కావాలా 
మురి పాలు కావాలా
జింకు చకం  జింకు చకం
నరసాపురం నరసమ్మ నైసు గుందమ్మ 
నీ చెక్కెర చుమ్మా
జింకు చకం  జింకు చకం

చరణం: 1
మావుళ్ళమ్మ జాతరలో
జింకు చకం  జింకు చకం
కౌగిళ్ళమ్మ సెంటర్లో
జింకు చకం  జింకు చకం
ఒళ్ళో కొచ్చి పడతావని ఒళ్ళంతా కళ్ళు చేసి 
నీ కోసం ఎదురుచూస్తి మావో
జారే పైట జంక్షన్ లో 
జింకు చకం  జింకు చకం
జోరే ఎక్కు టెన్సన్ లో 
జింకు చకం  జింకు చకం
కారాకిళ్ళీ లాంటి కిస్సు ఆరార పెట్టమంటు 
నోరార అడిగినాను పిల్లో
కుర్రోడి కొరుకుళ్ళకి ఎదే ఎర్రెక్కి పోతుంది పాడు
కుర్రీడు చిరు తిల్లుకి ఏదో ఎర్రెక్కి పోతుంది చూడు
అరె అందుకో బాసు ఆటీను ఆసు ఓ ఓ ఓ ఓ
జింకు చకం  జింకు చకం

భీమవరం బుల్లోడా పాలు కావాలా 
మురి పాలు కావాలా
జింకు చకం  జింకు చకం
నరసాపురం నరసమ్మ నైసు గుందమ్మ 
నీ చెక్కెర చుమ్మా
జింకు చకం  జింకు చకం

జింకు చకం  జింకు చకం

చరణం: 2
తపాలమ్మ సావిట్లో 
జింకు చకం  జింకు చకం
దాహాలమ్మ సందిట్లో
జింకు చకం  జింకు చకం
రేపు మాపు నీతోని లంగరేసుకుందామని
చెంగు చాటుకొచ్చినాను పిల్లో
మొహాపురం స్టేషన్లో
జింకు చకం  జింకు చకం
ముద్దాపురం బస్సెక్కి
జింకు చకం  జింకు చకం
చెక్కిలి పల్లి చేరాలని అక్కరతో వచ్చినావు 
అందుకనే నచ్చినావు మావో
వరసైన దొరసానికి ఇక కరుసేలె ఇరుసంత రోజు
దరువేసే దొరబాబుకి 
ఈ పరువాల బరువెంతో మోజు
అ వయ్యారి జాణ ఒళ్లోకి రానా ఓ ఓ ఓ ఓ హ
జింకు చకం  జింకు చకం

భీమవరం బుల్లోడా పాలు కావాలా 
మురి పాలు కావాలా
జింకు చకం  జింకు చకం
నరసాపురం నరసమ్మ నైసు గుందమ్మ 
నీ చెక్కెర చుమ్మా
చుమ్మా చుమ్మా చుమ్మా చుమ్మా

Palli Balakrishna
Gowri (2004)



చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
నటీనటులు: సుమంత్, ఛార్మి , నరేష్ , కౌశల్య
దర్శకత్వం: బి.వి.రమణ
నిర్మాతలు: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 03.09.2004



Songs List:



ఏం మాత్రం వేశావో పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కోటి, సంతోషిని

ఏం మాత్రం వేశావో





గుండెలలో గుడి గంట పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మల్లికార్జున్, ఉష

గుండెలలో గుడి గంట




ఏనాడో జరిగిన పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: మనో

ఏనాడో జరిగిన





జిగి జిగి జింక పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: రవివర్మ, స్మిత

జిగి జిగి జింక




నెమ్మది నెమ్మది నెమ్మదిగా పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సునీత , సందీప్

పల్లవి:
నెమ్మది నెమ్మది నెమ్మదిగా 
నా మది నమ్మినది
నీ జతనల్లిన మాలతిగా వేరే జన్మ ఇది
రెప్పలే దాటని స్వప్నమా లెమ్మని
చెలిమిలో స్వాగతం పిలువగా

నెమ్మది నెమ్మది నెమ్మదిగా 
నా మది నమ్మినది
నీ జతనల్లిన మాలతిగా వేరే జన్మ ఇది

చరణం: 1
పూలగాలి స్వరముల వెంట చేరుకోమంది
నీ నేస్తమే కవి క్షేత్రమై
ఆకశాన్ని చినుకుల వెంట నేల దించింది
నీ స్నేహమే ఆషాడమై
మచ్చ మాటునున్న కన్నెకొమ్మ ఎన్నినాళ్ళకి
లేత పూతపడ్డ కులుకుతున్నది
మంచి మాటలన్ని వానజల్లు ముందునాళ్ళకి
నాకు పచ్చనాశ చూపుతున్నది
ప్రాయమే తోడుగా నడపగా

నెమ్మది నెమ్మది నెమ్మదిగా నా మది నమ్మినది
నీ జతనల్లిన మాలతిగా వేరే జన్మ ఇది

చరణం: 2
చూపులోన చుర చురలన్ని దీపమనుకోన
అనుమానమా అనురాగమా
చేతిలోని మధుకళశాన్ని భారమనుకున్నా
మన్నించుమా మమకారమా
తేనె ఉప్పెనల్లే పొంగుతున్న ప్రేమ దొంగని
అందుకుంది చూడు నిండు దోసిలి
నింగి ద్వారమంటి పోల్చుకున్న గుండెసవ్వడి
గొంతు దాటనంది ఎందుకో మరి
మౌనమే గానమై తెలుపదా




ముద్దొస్తోంది పాట సాహిత్యం

 
చిత్రం: గౌరి (2004)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: వేణు, నిత్యసంతోషిని

ముద్దొస్తోంది 

Palli Balakrishna
Madhumasam (2007)


చిత్రం: మధుమాసం (2007)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: రంజిత్ , రీటా
నటీనటులు: సుమంత్, స్నేహ , పార్వతి మెల్టన్
దర్శకత్వం: చంద్ర సిద్దార్ధ
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 09.02.2007

పల్లవి:
వసంతం వాయిదా పడైనా రాదుగా
కనీసం కమ్మగా కలైనా కావుగా
ఈ కాంత కోకిలా వలచినా పిలిచినా ప్రియతమా
వసంతం వాయిదా పడైనా రాదుగా

చరణం: 1
విరజాజి పూలే విరహాన రాలే
మలిసందే వేళే తెలవారి పోయే
పొడి ఇసుక దారులలో
మన అడుగు జాడలలో
గతము తలచి కలిసి నడిచి
వలపు కలయిక కలా
నిదుట నిలచి ఎదను తెరచి
క్షణము దొరకవు కదా

వసంతం వాయిదా పడైనా రాదుగా
కనీసం కమ్మగా కలైనా కావుగా

చరణం: 2
బస్తీల నిండా బృందావనాలే
ముస్తాబు మీద హస్తాక్షరాలే
ఎదురసలు చూడనిది
మనము అనుకోనిదిది
మనసు అలుపు మమత అలుకు
జతను కలిపెను కదా
ఎవరికెవరు ఒకరికొకరు
ఇపుడె తెలిసెను కదా

వసంతం వాయిదా పడైనా రాదుగా
కనీసం కమ్మగా కలైనా కావుగా
ఈ కాంత కోకిలా వలచినా పిలిచినా ప్రియతమా
వసంతం వాయిదా పడైనా రాదుగా

Palli Balakrishna
Boni (2009)

చిత్రం: బోణి (2009)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శ్రావణభార్గవి, హేమచంద్ర
నటీనటులు: సుమంత్ , కృతి కర్బంద
దర్శకత్వం: రాజ్ పిప్పళ్ల
నిర్మాత: రమణ గోగుల
విడుదల తేది: 12.06.2009

కాదంటానా సరసం చేదంటానా
లేదంటానా అడిగిన దేదైనా
దారం లాగుతుంది మమకారం ఆపినా
దూరం తెంచమంది చెలి దేహం ఎదేమైనా

మేనక వయ్యారి మేనక చిలిపి కోరిక తీరక ఏంటా తికమక
వేడుక వలపు వేదిక కబురు పంపిన విందుకు రావే చక చక

హే నింగి నేల నీరు గాలి నిప్పయ్యే తమాషా
ఆగే వీలే లేదంటుంది నాలో పదనిస

హే అందర్లోని తొందర్లన్నీ అంతో ఇంతో ఆరా తీసా
అడగని బదులుగా తీర్చనా నీ నిషా

నా పరువం నీ కొరకే
హాయి పండించుకో
పెదాల తోటలో ఫలాలు పంచుకో
మరింత మోజులో నన్నేలుకో

ధగ ధగ చమక్కేదో లాగిందే గుచ్చి గుచ్చి చూసిందే
ధిమెక్కేలా నన్నేదో చేసిందే
ఘుమ ఘుమ గమ్మత్తేదో లాగిందే రెచ్చి రెచ్చి ఊగిందే
నచ్చి మెచ్చి నన్నే గిచ్చి రచ్చ రచ్చ చేసేసిందే

ఏదో దాహం తహతహ లాడే దాహం
నీపై మోహం తరగని వ్యామోహం
నీలా గుచ్చుకుంది విరి బాణం నన్నిలా
చాలా నొచ్చుకుంది చెలి ప్రాణం జాలే లేదా

హే పిల్లా ఏ పిల్లా ఏ పిల్లా నీ కంటి చూపుల లోపల ఏంటా సలసల
అంతలా అందాల వింతలా నీ ఒంటి సొంపుల కెంపుల కేంటా విల విల

హే పిల్లా నాలా ఘల్లంటుంది సింగారాల విణ
ఒళ్ళో వాలే బంగారంలా నీలో ఒదగనా
ఉయ్యాలూగే ఉల్లాసాన్ని నావైపిలా పిలవనా
పగడపు పెదవికి మధువులు పొదగనా


********   ********  *********


చిత్రం: బోణీ (2009)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: యన్.సి.కారుణ్య , ప్రణవి

మొదటి చూపే నాలోన మల్లెలే చల్లెనా
చూపుతోనే రేగేనే ప్రేమనే భావన
చినుకులా కలిసేనా చిగురు తోడిగేనా
వరదలా ముంచేనా ఈ కలల ఆలాపన

మొదటి చూపే నాలోన మల్లెలే చల్లెనా
నీ చూపుతోనే రేగేనే ప్రేమనే భావన

వద్దు గురువా ప్రేమ గొడవా.. జిందగీ సిందరవందర
కళ్ళు మూసి బ్లైండ్ గా సుందరి మోజు లో దెబ్బైపోకుర
రోమియో లా జూలియట్ తో డ్యూయట్టు కి ఏందిర తొందర?
సిన్సియర్ గా నువ్విలా పోయిజన్ గ్లాస్ కు ఫ్లాట్ అయిపోకురో

వెన్నెల మెరుపంటి సన్నజాజి సోయగమంతా
నీ కందిస్తా నిధిగా
తియ్యని ఎరుపౌతా నీ పెదాలనంటే ఉంటా
పోలేనంటా విడిగా

ఎదలయ మురిసే పిలుపుల వలలో ముడిపడిపోతా చనువుగా
కుదురును చెరిపే కులుకుల జతలో వసంతాలు చూస్తా
అందీ ఆనందం చెరి కొంత

వద్దు గురువా ప్రేమ గొడవ జిందగీ కత్తెర కత్తెర
ఆచి తూచి బురదలో అడుగెయ్యొద్దురా అల్లరి గాకురో
మజ్ను లాగా ఫీల్ అయిపోయి లైలా తో లింకయిపోకురో
ప్రేమ ముదిరి పిచ్చిగా రోడ్డున పడితే పరువే పోద్దురో

లవ్ వద్దు బిడ్వ పిల్ల గోలా వద్దు
దణ్ణం పెడతా బిడ్వ పిల్లా గాలీ అస్లే వద్దు
లవ్ వద్దు బిడ్వ పిల్ల గోలా వద్దు
వద్దు వద్దు వద్దు వద్దు వద్దుర బాబు వద్దు

నాలో లోలోన నిన్ను బందీ చేసేస్తున్నా
మన్నిస్తావా మదనా
తెలుసా నా కన్నా ఎక్కువే నిను ప్రేమిస్తున్నా
తీరేదేనా తపన

ఒకరికి ఒకరై ఒదిగిన కధలో ఎవరెవరంటే తెలియదే
వెనుకటి రుణమే వదలని వరమై ఇలా చేరుకుందే
జన్మాలెన్నైనా చెలి నీదే

వద్దు గురువా ప్రేమ గొడవ జిందగీ గజిబిజి గత్తర
ఒళ్ళు మరిచే రేంజ్ లో సుడిలో పడవై మునిగే పోకురా
దేవదాసై మందు బాసై పార్వతికి పడిపోవద్దురా
జరగబొయే సంగతి హిస్టరీ మనకు ముందే తెలిపెరా


********   ********  *********


చిత్రం: బోణీ (2009)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: సునీత, దీపు

నమ్మలేని కలే నిజమాయెనా చెలియ వలన
అందువల్లే ఇలా చెలరేగెనా చిలిపి తపన
హే నువ్వే నువ్వే నా ఎద లయ పలికిన వలపు తననన
హే నువ్వే నువ్వే చొటడిగితే మనసున కాదనగలనా

నమ్మలేని కలే నిజమాయెనా చెలియ వలన
అందువల్లే ఇలా చెలరేగెనా చిలిపి తపన

అద్దం ముందు కన్ను చూడమంటే నన్ను
ఇద్దరున్నాం అంటుందెలా
పువ్వులాంటి నన్ను చాకులాంటి నిన్ను
ఒక్క చోట చేర్చిందిలా
తళతళ మెరుపులా చేరుకుందే ప్రేమ వెలుగిలా
అల్లుకుందే కొంటె వలా
నేనంతా నువ్వైపోయేలా

ఇన్నినాళ్ళు నీలోఎక్కడొ ఏ మూలో
ఇంత ప్రేమ దాచావెలా
పెంచుకున్నదంతా నాతో పంచుకుంటే
చిట్టి గుండె మోసేదెలా
ప్రేమంటేనే వింత కదా
భారమైనా తెలికైపోదా
సత్యభామా పద పద
నీ తోడై నేనున్నా కదా

నమ్మలేని కలే నిజమాయెనా చెలియ వలన
అందువల్లే ఇలా చెలరేగెనా చిలిపి తపన


********   ********  *********


చిత్రం: బోణీ (2009)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శ్రీరాంచంద్ర , సుధా జీవన్

ఇట్స్ ఓకే లే
ఇది మాములే అనుకోవాలే
ఎదిరించాలే
చిరునవ్వుతో చీకటినోడించాలే
భరువెంతైనా అణువంతేలే
ఎదురీదాలే పద లే లే లే

అరెరె చేజారిందా నీలో ఉందేదో
సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో

అరెరె చేజారిందా నీలో ఉందేదో
సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో
నీతో బంధం కలిపే సంతోషం ఎదో
సొంతం కాదా నేడే రేపో
ఆశ వెలుగు అదే ముందడుగు
నిశి నీడకు తలొంచకు

అరెరె చేజారిందా నీలో ఉందేదో
సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో

everything's gonna be alright
everything's gonna be alright

ఎండ వానలు జంట కానిదే..... ఏడు రంగులు రావులే
ఎద గాయం గేయమైతే ....వెదురైనా వేణువే
మదిలో తీపి కొలువుంటే
దరికే కలత రాదంతే
కన్నీరైనా పన్నీరైనా కనుపాపను నవ్విస్తే

ఆశ వెలుగు అదే ముందడుగు
నిశి నీడకు తలొంచకు

అరెరె చేజారిందా నీలో ఉందేదో
సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో

మోడువారిన కొమ్మ రెమ్మలు ....కొత్త చిగురే చేరదా
నిండు కడలే ఆవిరైనా .....నింగి చినుకై జారదా
కసిరే ఏకాంతమంటే ముసిరే స్నేహ పరిమళమే
నీలో ఎదిగే శూన్యంలో పిలుపేదో ఉందిలే

ఆశ వెలుగు అదే ముందడుగు
నిశి నీడకు తలొంచకు

అరెరె చేజారిందా నీలో ఉందేదో
సరెలే కానీ చూద్దామ్ ముందేమవుతుందో


Palli Balakrishna Thursday, September 14, 2017
Golconda High School (2011)


చిత్రం: గోల్కొండ హైస్కూలు (2011)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అనురాధ, హేమచంద్ర
నటీనటులు: సుమంత్ , స్వాతి రెడ్డి
దర్శకత్వం: మోహన్ కృష్ణ ఇంద్రగంటి
నిర్మాత: రామ్మోహన్. పి
విడుదల తేది: 14.01.2011

అడుగేస్తే అందే దూరంలో..హలో
అదిగో ఆ తారతీరంలో..చలో
అటు చూడు ఎంత తళుకో
అది వచ్చి వాలేననుకో
కనుల ఇంత ఎంత వెలుగో చూసుకో
ఇది నేటి ఆదమరుపో
మరునాటి మేలుకొలుపో
వెనువెంట వెళ్ళి ఇప్పుడే తేల్చుకో

కొండంత భారం కూడా తెలికగా అనిపిస్తుంది
గుండెల్లో సందేహలు ఎమి లేకుంటే
గండాలు సుడిగుండాలు ఉండే ఉంటాయి అనుకుంటే
సంద్రంలో సాగే నావ నాట్యం చేస్తునట్టు ఉంటుందే
ధీమగా పోతుంటే..ఏ మార్గం నిన్ను ఏనాడు ఆపదని
సరదగా దూసుకెళ్ళిపో..కడదాక ఆగననుకో
కలగన్న రేపుని ఇప్పుడే కలుసుకో

ఉత్సాహాం పరుగులు తీస్తూ విశ్రాంతే కొత్తనుకుంటే
ఆయాసం కూడా ఎంతో హాయేలే
పోరాటం కూడ ఎదో ఆటలే కనపడుతుంటే
గాయాలు గట్రా చాలా మాములే అనిపిస్తాయి అంతే
నీ గమ్యం ఎదైనా..వెళ్ళాలే గాని
రమ్మంటే రాదు కదా
ప్రతి పాటకొక్క మలుపే
ప్రతి పూట ఆశ మెరుపే
ప్రతి చోట గెలుపు పిలుపే
తెలుసుకో


********  ********   ********


చిత్రం: గోల్కొండ హైస్కూలు (2011)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: గీతామాధురి , శ్రీకృష్ణ

ఇది అదేనేమో అలాగే ఉంది
తెలుసునో లేదో తెలీడం లేదే
ఫలనా అని అనుకోమని
ఏ రోజు చెబుతుందో ఎమో

ఇది అదేనేమో అలాగే ఉంది
తెలుసునో లేదో తెలీడం లేదే
ఫలనా అని అనుకోమని
ఏ రోజు చెబుతుందో ఎమో

మొగవాళ్ళకు కూడ ఇంత మొహమాటముంటుందా
అనుకోనే లెదే ఏనాడు
బిడియానికి కూడ ఇంత దుడుకొచ్చే తుళ్ళింత
బహుశా నీ వల్లే ఈనాడు
అవకాశం ఇస్తునా..అడిగేసే వీలున్నా
అనుమానం ఆపింది అనేందుకు
కుడి కొంచం ఎడమైనా..మనలోని ఒకరైనా
అనుకుందాం అవునో కాదో
ఫలనా అని అనుకోమని
ఏ రోజు చెబుతుందో ఎమో

ఏకాంతం ఎరుపెక్కేలా..అంత ఇదిగా చూడాలా
నీతో మాకష్టం మాస్టారు
చలిగాలికి చెవటెట్టెలా..కవ్విస్తూ నవ్వాలా
ఉడికిస్తూ ఉందే నీ తీరు
ఇది ఇలా ఉండాలో..ఇంకోలా మారాలో
???? ఇబ్బంది ఎమిటో
దూరంగా ఆగాలో..దగ్గరగా చేరాలో
ఎమి చేస్తే బాగుంటుందో
ఫలనా అని అనుకోమని
ఏ రోజు చెబుతుందో ఎమో


********  ********   ********


చిత్రం: గోల్కొండ హైస్కూలు (2011)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హేమచంద్ర

ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం
నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పెందుకు అది తొలి పాఠం
మునివేలతొ మెఘాలనే మీటెంతగా ఎదిగాం మనం
పసివాళ్ళగా ఈ మట్టిలొ ఎన్నాళిలా పడిఉంటాం
కునికే మన కను రెపల్లొ వెలిగిద్దాం రంగుల స్వప్నం
ఇదిగొ నీ దారి ఇటు ఉందని సూరిడిని రా రమ్మందాం
జాగో జాగొరే జాగొ జాగొ
జాగో జాగొరే జాగొ జాగొ
జాగో జాగొరే జాగొ జాగొ

ఆకాశం నుండి సూటిగా..దూకేస్తే ఉన్నపాటుగా
ఎమౌతానంటూ చినుకు అలా ఆగిందా బెదురుగా
కనుకే ఆ చినుకు ఏరుగా..ఏరే వరద హోరుగా
ఇంతింతై ఎదిగి ఎదిగి అంతగా తరగని సంద్రమైందిగా
సందేహిస్తుంటే అతిగా..సంకల్పం నెరవేరదుగా
ఆలోచన కన్న త్వరగా..అడుగేద్దాం ఆరంభంగా
జాగో జాగొరే జాగొ జాగొ
జాగో జాగొరే జాగొ జాగొ

ఎ పని మరి ఆసాద్యమే కాదే
ఆ నిజం మహా రహస్యమా
వేసే పదం పదం పదే పదే పడదొసే
సవాలనే ఎదురుకొమా
మొదలెట్టక ముందే ముగిసే కధ కాదే మన ఈ పయనం
సమరానికి సై అనగలిగే సంసిద్దత పేరే విజయం
జాగో జాగొరే జాగొ జాగొ
జాగో జాగొరే జాగొ జాగొ
జాగో జాగొరే జాగొ జాగొ

Palli Balakrishna

Most Recent

Default