Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Raja (1976)



చిత్రం: రాజా (1976)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం:  యస్. పి.బాలు,  సుశీల
నటీనటులు: శోభన్ బాబు, జయసుధ, రోజారమణి
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: ఎ. లక్ష్మీ కుమార్
విడుదల తేది: 06.12.1976

పల్లవి:
మాట చూస్తే మామిడల్లం
మనసు చూస్తే  పటికబెల్లం
ఆ మాట చూస్తే మామిడల్లం
మనసు చూస్తే పటికబెల్లం
ఓ సొగసులాడి వెయ్యబోకే వలపు గొళ్ళేం

ఆదిలోనే అట్టహాసం చిట్టచివరకు కాళ్ళబేరం
ఆదిలోనే అట్టహాసం  చిట్టచివరకు కాళ్ళబేరం
ఓ గడుసువాడా ఆపవయ్యా ఆర్భాటం

చరణం: 1
కస్సుమన్న పడుచుపిల్ల కన్నులవిందు
ఆ కస్సుమన్న పడుచుపిల్ల కన్నులవిందు
హేయ్ అలిగినప్పుడే ఆడపిల్ల భలే పసందు

కయయ్మాడితేనే తమరు వియ్యమంటారు
కయయ్మాడితేనే తమరు వియ్యమంటారు
లేదా ముందుగానే ఏదేదో ఇవ్వమంటారు
ముందుగానే ఏదేదో ఇవ్వమంటారు

మాట చూస్తే మామిడల్లం
ఆ... మనసు చూస్తే పటికబెల్లం
ఓ గడుసువాడా ఆపవయ్యా ఆర్భాటం
తానే తందాన తానే తందాన
తానే తందాన  తానే తందాన

చరణం: 2
ఆకువక్క లేకపోతే  నోరు పండదు
హా ఆకువక్క లేకపోతే నోరు పండదు
గోరువంక లేకపోతే చిలక ఉండదు

ఎండపడిన దేనికైన నీడ ఉండదా
ఎండపడిన దేనికైన నీడ ఉండదా
అహా  ఈ గుండెలోన నీకింత చోటు ఉండదా
ఈ గుండెలోన నీకింత చోటు ఉండదా

మాట చూస్తే  మామిడల్లం
ఆ మనసు చూస్తే  పటికబెల్లం
ఓ గడుసువాడా ఆపవయ్యా ఆర్భాటం
తానే తందాన  తానే తందాన
తానే తందాన తానే తందాన


*******  ********  ********


చిత్రం:  రాజా (1976)
సంగీతం:  కె.చక్రవర్తి
సాహిత్యం:  ఆచార్య ఆత్రేయ
గానం:  యస్.పి.బాలు,  పి.సుశీల

పల్లవి:
గుండెలోన ఒక మాటుంది .. గొంతు దాటి రానంటుంది
గుండెలోన ఒక మాటుంది .. గొంతు దాటి రానంటుంది
ఉండలేకా .. వెలికి రాకా .. ఉబ్బితబ్బిబ్బవుతోంది

గుండెలోన ఒక మాటుంది .. గొంతు దాటి రానంటుంది
గుండెలోన ఒక మాటుంది .. గొంతు దాటి రానంటుంది
ఉండలేకా .. వెలికి రాకా .. ఉబ్బితబ్బిబ్బవుతోంది

చరణం: 1
నిదురలో ఒక కల వచ్చింది .. తెల్లవారే నిజమయ్యింది
నిదురలో ఒక కల ఒచ్చింది అది తెల్లవారే నిజమయ్యింది
ఆ .. ఆ .. ఆ..ఆ.. ఆ .. ఆ ..
నిజం నీతో చెప్పవస్తే నిండు మనసు మూగబోయింది

మూగబోయిన మనసులోనా రాగమేదో ఉంటుంది
ఆ నిజం మనకు తెలిసేలోగా నిదుర మళ్ళీ వస్తుంది

గుండెలోన ఒక మాటుంది .. గొంతు దాటి రానంటుంది
ఉండలేకా .. వెలికి రాకా .. ఉబ్బితబ్బిబ్బవుతోంది

చరణం: 2
ఆడ పిల్లకు పూలు బొట్టూ .. ఆది నుంచీ అందాలు
మనసు ఇచ్చే .. మనిషి వస్తే .. మారుతాయి అర్ధాలు
మనసు ఇచ్చిన మనిషితోటి మనుగడే ఆనందం
నొసట రాత రాసేవాడికే తెలుసు దాని అర్ధం

గుండెలోన ఒక మాటుంది .. గొంతు దాటి రానంటుంది
గుండెలోన ఒక మాటుంది .. గొంతు దాటి రానంటుంది
ఉండలేకా .. వెలికి రాకా .. ఉబ్బితబ్బిబ్బవుతోంది

గుండెలోన ఒక మాటుంది .. గొంతు దాటి రానంటుంది
ఉండలేకా .. వెలికి రాకా .. ఉబ్బితబ్బిబ్బవుతోంది


*******  ********  ********


చిత్రం:  రాజా (1976)
సంగీతం:  కె.చక్రవర్తి
సాహిత్యం:  ఆచార్య ఆత్రేయ
గానం:  యస్.పి.బాలు,  పి.సుశీల

పల్లవి :
కోటి జన్మల ఆనందం... శతకోటి జన్మల అనుబంధం...
కోటి జన్మల ఆనందం శతకోటి జన్మల అనుబంధం
నీవు నేనై వెలిశాము నేడు మళ్ళీ కలిశాము
రాజా... ఓ నా రాజా ...రాజా.. ఓ నా రాజా
రాణీ... ఓ నా రాణీ ..రాణీ... ఓ నా రాణీ...

చరణం: 1
నీ సుతిమెత్తని ఒడిలో పవలిస్తాను
నీ నులివెచ్చని ఊపిరిలో పులకిస్తాను
నీ సుతిమెత్తని ఒడిలో పవలిస్తాను
నీ నులివెచ్చని ఊపిరిలో పులకిస్తాను

నీ నునుపారని నొసట నే ముద్దవుతాను
నీ కనుపాపల క్రీనీడా జీవిస్తాను

జీవితాన చీకటంతా చెదిరిపోవాలి
చెదిరి పోనీ మమతలు మనకు చెరలు కావాలి..
చెరలు కావాలి
రాజా... ఓ నా రాజా..రాజా ...ఓ నా రాజా

చరణం: 2
నీ ఎద లోపలి దీపాన్నై నే ఉంటాను
నా కథ నడిపే నాయకుడై నీవుంటావు
నీ ఎద లోపలి దీపాన్నై నే ఉంటాను
నా కథ నడిపే నాయకుడై నీవుంటావు

నా చిరకాలపు కోరికవై నీవుంటావు
నీ పరువానికి పండుగనై నే ఉంటాను

మల్లెపూల మనసులనే అల్లుకుందాము
ఎల్లలన్ని తుడిపివేసి ఏలుకుందాము...ఏలుకుందాము...

రాణీ... ఓ నా రాణీ ..రాణీ... ఓ నా రాణీ..
కోటి జన్మల ఆనందం శతకోటి జన్మల అనుబంధం
నీవు నేనై వెలిశాము నేడు మళ్ళీ కలిశాము

Most Recent

Default