చిత్రం: అన్నదమ్ముల అనుబంధం (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: దాశరథి
గానం: యస్.పి.బాలు, జానకి
నటీనటులు: యన్.టి.రామారావు, బాలకృష్ణ, మురళీమోహన్, లత సేతుపతి, జయమాలిని
దర్శకత్వం: యస్.డి.లాల్
నిర్మాత: యమ్.సీతాంబరం
విడుదల తేది: 04.071975
పల్లవి:
కౌగిలిలో ఉయ్యాలా... కన్నులలో జంపాలా
కౌగిలిలో ఉయ్యాలా... కన్నులలో జంపాలా
కలసి వూగాలిలే... కరిగిపోవాలిలే.. తనివి తీరాలిలే
చరణం: 1
నీ బుగ్గలఫై ఆ ఎరుపు..
నీ పెదవులఫై ఆ మెరుపు
వెలుతురులో.. చీకటిలో..
వెలిగిపోయేనులే.. హే హే.. నన్ను కోరేనులే
నా పెదవుల ఫై యీ పిలుపు.. హో హో..
నా హృదయములో నీ తలపు.. హ హ
వెలుతురులో.. చీకటిలో.. వెలుతురులో
చీకటిలో నిలిచి వుండేనులే... నిన్ను కోరేనులే
కౌగిలిలో ఉయ్యాలా... కన్నులలో జంపాలా
కలసి వూగాలిలే... కరిగిపోవాలిలే.. తనివి తీరాలిలే
చరణం: 2
గులాబీలా విరబూసే నీ సొగసు... సెలయేరై చెలరేగేనీ వయసు
అందరిలో ఎందుకనో ఆశ రేపేనులే అల్లరి చేసేనులే
కసిగా కవ్వించే నీ చూపు... జతగా కదిలించే నీ వూపు
రేయైనా.. పగలైనా.. రేయైనా.. పగలైనా...
నన్ను మురిపించులే... మేను మరిపించులే
కౌగిలిలో ఉయ్యాలా... కన్నులలో జంపాలా
కలసి వూగాలిలే... కరిగిపోవాలిలే... తనివి తీరాలిలే
********* ******** ********
చిత్రం: అన్నదమ్ముల అనుబంధం (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: దాశరథి
గానం: యస్.పి.బాలు, సుశీల
పల్లవి:
ఆనాడు తొలిసారి నిను చూసి మురిశాను నేను
నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను...
ఆనాడు తొలిసారి నిను చూసి మురిశాను నేను
నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను..
ఐ లవ్ యు సోనీ... సోనీ...... ఐ లవ్ యు సోనీ... సోనీ
చరణం: 1
అందాల నీమోము నా కోసమే... నిండైన నా ప్రేమ నీ కోసమే
అందాల నీమోము నా కోసమే... నిండైన నా ప్రేమ నీ కోసమే
నా మీద ఈనాడు అలకేలనే... నేరాలు మన్నించి రావేలనే.. ల.. ల.. లల.. ల.. ల
ఐ లవ్ యు సోనీ... సోనీ...... ఐ లవ్ యు సోనీ... సోనీ
వలచింది గెలిచింది నీవేనులే.. నీ ముందు ఓడింది నేనేనులే
వలచింది గెలిచింది నీవేనులే.. నీ ముందు ఓడింది నేనేనులే
కోపాలు తాపాలు మనకేలలే ఇక నైన జత జేరి గడపాలిలే... ల.. ల.. ల
ఐ లవ్ యు రాజా... రాజా... ఐ లవ్ యు రాజా... రాజా
చరణం: 2
చిన్నారి సిరిమల్లె విరిసిందిలే... అనురాగ మధువెంతో కురిసిందిలే
చిన్నారి సిరిమల్లె విరిసిందిలే... అనురాగ మధువెంతో కురిసిందిలే
అధరాలు ఏమేమొ వెతికేనులే... హృదయాలు పెనవేసి ఊగేనులే ల ల లా
ఐ లవ్ యు రాజా... రాజా... ఐ లవ్ యు సోనీ... సోనీ
ఆనాడు తొలిసారి నిను చూసిమురిశాను నేను
నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను...
ఐ లవ్ యు రాజా... రాజా... ఐ లవ్ యు సోనీ... సోనీ
********* ******** ********
చిత్రం: అన్నదమ్ముల అనుబంధం (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: దాశరథి
గానం: యస్.పి.బాలు, సుశీల
పల్లవి:
గులాబిపువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే
ఇలాంటి వేళ ఆడాలి జతగా
ఇలాగె మనము ఉండాలిలే
మనసు దోచి మాయజేసీ
చెలినే మరచిపోవొద్దోయి రాజా... రాజా
గులాబిపువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే
చరణం: 1
వసంతరాణి నీకోసమే ఖుషిగ వచ్చింది
చలాకినవ్వు చిందించుచు హుషారు తెచ్చింది
మయూరిలాగా నీ ముందర నాట్యం చేసేను
వయ్యారిలాగా నీ గుండెలో కాపురముంటాను
వలపుపెంచి మమతపంచి
విడిచిపోనని మాటివ్వాలి రాజా... రాజా
గులాబిపువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే
చరణం: 2
మరీ మరీ నీ అందానికీ సలాము చేసేను
పదే పదే నీ గీతానికి పల్లవి పాడేను
యుగాలకైనా నాదానివై నీవే వుంటావు
అనంతకాలం నీ రూపమే వరించుకుంటాను
మనసు నీదే మమత నీదే..
రేయి పగలు నాలో వున్నది నీవే.. సోనీ
గులాబిపువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే
ఇలాంటి వేళ ఆడాలి జతగా
ఇలాగె మనము ఉండాలిలే
లాలలా లాలలా లాలలా లాలలా
********* ******** ********
చిత్రం: అన్నదమ్ముల అనుబంధం (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సినారె
గానం: యస్.పి.బాలు
పల్లవి:
ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే
ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే
ఆ పాట అధరాలపైన పలికేను ఏనాటికైనా...
ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే... ఇదేలే
చరణం: 1
ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి
ఈ నిలయం కలకాలం శ్రీ నిలయమై నిలవాలి
ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి
ఈ నిలయం కలకాలం శ్రీ నిలయమై నిలవాలి
వెలుతురైనా చీకటైనా విడిపోదు... ఈ అనుబంధం
చరణం: 2
తారకలే దిగివచ్చి తారంగం ఆడాలి
వెన్నెలలే ముంగిటిలో వేణువులై పాడాలి
తారకలే దిగివచ్చి తారంగం ఆడాలి
వెన్నెలలే ముంగిటిలో వేణువులై పాడాలి
ఆటలాగా.. పాటలాగా... సాగాలి మన జీవితం
********* ******** ********
చిత్రం: అన్నదమ్ముల అనుబంధం (1975)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సినారె
గానం: యస్.పి.బాలు, రామకృష్ణ, సుశీల
పల్లవి:
లా...లా...లా...లా...లా.. లాలాలలా
అందమైన పిల్ల ఒకటి రమ్మన్నదీ
సందెవేళ మల్లెపూలు తెమ్మన్నదీ
ఓ...వెళ్ళేసరికి గదిలో ఏదో
అలికిడి అవుతున్నదీ
అలికిడి వింటే మదిలో ఏదో
అలజడి అవుతున్నదీ
యా...హా...హా..బ..బ...బా..
అందమైన పిల్ల ఒకటి రమ్మన్నదీ
సందెవేళ మల్లెపూలు తెమ్మన్నదీ
చరణం: 1
Hey you miss
will you sing with me?
who..me?... నాకు భయముగా ఉంది
ha ha.. don't you worry.. I am give you a start
లా...లా...లా...లా...లలలలా...
లా...లా...లా...లా...లలలలా...
అందమైన పిల్లవాడు రమ్మన్నాడు..జూ..జూ..జుజూ..
సందెవేళ అందమంత తెమ్మన్నాడు ఆ .హా.. హా..హా...
వెళ్ళేసరికి...ఆ.. ఆ... గాజులు గలగల.. ఆ ఆ ఆ
వెళ్ళేసరికి గాజులు గలగల.. గదిలో వినిపించింది..
గల గల వింటే మదిలో ఏదో..
అలజడి చెలరేగింది...యా...
అందమైన పిల్ల ఒకటి రమ్మన్నదీ
సందెవేళ మల్లెపూలు తెమ్మన్నదీ
వెళ్ళేసరికి గదిలో ఏదో
అలికిడి అవుతున్నదీ
అలికిడి వింటే మదిలో ఏదో
అలజడి అవుతున్నదీ... యా..
చరణం: 2
Hey you young man.. య హూ
will you sing with me?.. sure
give me start beat.. ha ha.. 1 2 3 4
కన్నెపిల్ల కారులోన కనిపించింది... లాలలలా...
కన్ను గీటి నన్ను నేడు బులిపించింది... లాల లాలా
లా...లా..లా.ల..
కన్నెపిల్ల కారులోన కనిపించింది
కన్ను గీటి నన్ను నేడు బులుపించింది
చూపులలోని...ఊఁ.. కైపులలోనా.. చీ
చూపులలోని కైపులలోనా... ఊయల ఊగించింది
ఎన్నడు లేని ఎన్నో ఆశలు.. నాలో ఊరించింది...
యా...హా...హా..బ..బ...బా..