Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Latha Sethupathy"
Simha Garjana (1978)



చిత్రం: సింహగర్జన (1978)
సంగీతం: కె. చక్రవర్తి 
నటీనటులు: కృష్ణ, లత, గిరిబాబు, మోహన్ బాబు, శరత్ బాబు
దర్శకత్వం: కొమ్మినేని శేషగిరిరావు 
నిర్మాతలు: మాగంటి వెంకటేశ్వర రావు, యర్రా శేషగిరిరావు
సమర్పణ: గిరిబాబు
విడుదల తేది: 26.08.1978



Songs List:



అమ్మా రావే తల్లీ రావే పాట సాహిత్యం

 
చిత్రం: సింహగర్జన (1978)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు

అమ్మా రావే తల్లీ రావే కొండపల్లి బొమ్మా రావే 



తొలకరి సొగసులు పాట సాహిత్యం

 
చిత్రం: సింహగర్జన (1978)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

తొలకరి సొగసులు తొంగి తొంగి చూస్తుంటే 



కత్తులు కలిసిన సుభాసమయంలో పాట సాహిత్యం

 
చిత్రం: సింహగర్జన (1978)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: చంద్రశేఖర్, జి. ఆనంద్, కౌసల్య, యస్.పి.బాలు, విజయలక్ష్మీ శర్మ 

కత్తులు కలిసిన సుభాసమయంలో 




సాహసమే మా జీవమురా పాట సాహిత్యం

 
చిత్రం: సింహగర్జన (1978)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: జి. ఆనంద్,  యస్.పి.బాలు

సాహసమే మా జీవమురా సాహసమే మా వేధమురా



అమ్మా దుర్గా మాత పాట సాహిత్యం

 
చిత్రం: సింహగర్జన (1978)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: 
గానం: పి.సుశీల 

అమ్మా దుర్గా మాత



ఓహో గులాబీలు నాకై పూచెరా పాట సాహిత్యం

 
చిత్రం: సింహగర్జన (1978)
సంగీతం: కె. చక్రవర్తి 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

ఓహో గులాబీలు నాకై పూచెరా

Palli Balakrishna Saturday, February 3, 2024
Ramabanam (1979)



చిత్రం: రామబాణం (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మల్లెమాల
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్.జానకి, మాధవపెద్ది, జేసుదాస్, రామకృష్ణ 
నటీనటులు: శోభన్ బాబు, జయప్రద,  కృష్ణం రాజు, లత, జగ్గయ్య, జమున, మోహన్ బాబు 
దర్శకత్వం: వై.ఈశ్వర రెడ్డి 
నిర్మాత: యం.యస్.రెడ్డి  (మల్లెమాల సుందర రామిరెడ్డి)
విడుదల తేది: 02.03.1979



Songs List:



పచ్చిమిరపకాయ బజ్జీలూ పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం  (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మల్లెమాల
గానం: యస్.జానకి

పచ్చిమిరపకాయ బజ్జీలూ,.. బల్
పసందైన బుల్లి బజ్జీలూ...
కారంలో... ఆకారంలో... నా
బజ్జీలకు లేనేలేవు సమ ఉజ్జీలు

మతిమరుపును పోగొడతాయి
అతి తెలివిని పుట్టిస్తాయి...
ఆజీర్తిరోగం వున్నవాళ్ళకి...
ఆకలి ఘాటు చూపిస్తాయి. . .

ఈతకల్లు ఈరయ్యైనా...
ఇప్పసారా అప్పన్నైనా...
బ్రాందీ... విస్కీ... దొరలైనా... నా
బజ్జీలంటే పడిచస్తారు




సూరీడు యెదమిటినాడు... పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం  (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మల్లెమాల
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

సూరీడు యెదమిటినాడు... నా
సొగసంత రవళించె నేడు...
వెలుగుల వల విసిరేసి....
తొలి వలపులు కాజేశాడు...

సుమబాల కనుగీటగానే... ఈ
సూరీడు యెద మీటినాడు...
కను... సైగలు చెలి విసిరాకే...
తను.. వెలుగుల వల విసిరాడు

ఎండా వెన్నెల రెండూ కాని
ఏదో తీయని గిలిగింత
ఉండీ లేని బిడియంలోనే
ఊహలకందని పులకింత
ఆ... గిలిగింత... ఈ... పులకింత
కలిపికూడితే.. జగమంత

అందీ అందని అందాలెన్నో
ముందుపోసినది ఈ ఉదయం
అంతేలేని ఆనందంలో
హరివిల్లైనది నా హృదయం ..
ఆ... హరివిల్లు... కురిసే జల్లు...
అనురాగానికి పుట్టిల్లు 



తాకకుండా తనువు దోచిన పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం  (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మల్లెమాల
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

తాకకుండా తనువు దోచిన
తాను వరసకు ఏమౌతాడు...?
తాళి కడితే మొగుడౌతాడు
తరిమికొడితే సగమౌతాడు...

మాటువేసి మనసుదోచిన
మగువ వరుసకు ఏమౌతుంది?
తాళి కడితే ఆలౌతుంది
తరిమికొడితే తేలౌతుంది...

కళ్ళతోనే గాలం వేసి ఒళ్ళుమొత్తం గాయంచేసి
ప్రేమగందం పెదవికి రాశాడు... తన
పిచ్చినాలో రెచ్చగొట్టాడు...
చిలిపి తలపుల తలుపులు తీసి సిగ్గులన్నీ ఆవలతోసి
పంటినొక్కులు నాపై రువ్వింది. అహ
పడకటింటికి కాలు దువ్వింది...





అమ్మ... ప్రేమకు మారుపేరు...పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం  (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మల్లెమాల
గానం: యస్.పి.బాలు, జేసుదాస్

అమ్మ... ప్రేమకు మారుపేరు...
ఆమ్మ మనసు పూలతేరు... ఆ
తేరునీడా సోకగానే
నూరు జన్మల సేదదీరు...

మండు వేసవిలో ముంగిట వెలసిన
మంచుకొండ మా అమ్మ
పవలూ రేయీ ఆరక వెలిగే
పరంజ్యోతి మా అమ్మ...
ఆలనకైనా... పాలనకైనా
ఆదిదేవత మా అమ్మ...
జన్మ జన్మలా పున్నెమువలన... నీ
కమ్మని కడుపున పుట్టాను...
మళ్ళీ జన్మలు ఎన్నున్నా... నా
తల్లివి నీవే అంటాను...
కలలోనైనా... మెలకువనైనా
నీ దీవెనలే కోరుకుంటాను...




నా మాటా రామబాణం పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం  (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మల్లెమాల
గానం: యస్.పి.బాలు, రామకృష్ణ 

నా మాటా రామబాణం
న్యాయం నా ఆరవ ప్రాణం
అతి చౌకగ లోకజ్ఞానం అందించడమే నా ధ్యేయం
నా మాటా మన్మధ బాణం నా పత్రిక ప్రేమ పురాణం
ఉచితంగా సెక్స్ జ్ఞానం రుచి చూపడమే నా ధ్యేయం

చక్కెర బొమ్మకు మీసాలొస్తే చక్కని కాలక్షేపం...
రాతిరి పూటా రాణీ పేటా రసికుల పాలిటి స్వర్గం ...
కాలే కడుపుకు మండే గంజి కమ్మని అమృతపానం..
మంచిని పెంచి మనోవికాసం కలిగించేవి బుక్స్...
మంచం పట్టిన మనిషిని సైతం కదిలించేది సెక్స్...
నీతి రీతీ లేని పత్రికలు జాతిని పతనం చేస్తాయి
తాతలనాటి పుస్తకాలు తలగడకే పనికొస్తాయి...

నా మాట మన్మధ బాణం నా పత్రిక ప్రేమపురాణం
నా మాట రామబాణం న్యాయం నా ఆరవ ప్రాణం




వయసు మళ్ళిన అందగాడా పాట సాహిత్యం

 
చిత్రం: రామబాణం  (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: మల్లెమాల
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

వయసు మళ్ళిన అందగాడా
వచ్చాను సందకాడా...
అర్ధరాతిరౌతుంది. ఆరాటం పెరుగుతూంది
ఆగలేను అందుకోరా...

సిగపూలూ వాడలేదు
అప్పుడే...
చెక్కిలైనా కందలేదు
ఇంతలోనే...
ఎంత సేపని ఎదురుచూసేది ?
నా కోసమేనా ?
ఎప్పుడింకా మోజుతీరేది?
ఆరినీ

ఏయ్ పిల్లా 
ఊ‌‍...
ఇదుగో రా దగ్గరికి రా
ఊ… హూ……
హ పట్టుకోలే ననుకున్నావా ?
ఏయ్...
ఏమిటి? చక్కిలి గిలా ?
మరుమల్లెల పక్కేశాను
బలే పనిచేశావ్
మంచి గందం తీసుంచాను
ఆహా
ఇంతకన్నా ఏమి చేసేది ?
బోలెడున్నాయ్
అంత సూటిగ ఎలా చెప్పేది?
నే చెప్తాగా....
వగలమారీ కుర్రది
వయసుమళ్ళి నేనున్నాని
చూడు చూడు నావంక
సోకు తగ్గలేదింక
రంగేళి రామ చిలకా నిన్ను
వదల్లేను చచ్చేదాకా
నిన్ను వదల్లేను చచ్చేదాకా...


Palli Balakrishna Sunday, November 5, 2023
Srungara Ramudu (1979)



చిత్రం: శృంగార రాముడు (1979)
సంగీతం: కె.వి.మహాదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ (All)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, వాణిజయరాం
నటీనటులు: యన్.టి.రామారావు, శరత్ బాబు, లత, జయమాలిని 
దర్శకత్వం: కె.శంకర్ 
నిర్మాత: రామమూర్తి 
విడుదల తేది: 22.11.1979



Songs List:



ఈ రోజు ఈ రోజే పాట సాహిత్యం

 
చిత్రం: శృంగార రాముడు (1979)
సంగీతం: కె.వి.మహాదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

ఈ రోజు ఈ రోజే - ఇది నిన్నా కాదు - రేపూ కాదు... అదే దీని మోజు
ప్రతి మనిషి తనకే తెలియక పుడతాడొకరోజు
తానొకడే పుట్టినట్టు - చేస్తాడు పుట్టినరోజు
రోజులు తెలియని పుట్టుకలున్నాయ్ పుట్టుకలేని రోజే లేదోయ్
పుట్టటమే ఒక గొప్పకాదు - పుట్టి గొప్పకావాలి-

ఈరోజే నా రోజని అనుకుంటే - ప్రతిరోజు ఒక పండగే
రేపూ రేపని వూరుకుంటే - ఈ రోజూ ఒక దండగే
ఇరవైనాలుగు గంటలు కాదోయి - ఈ క్షణమొకటే నీకొక రోజోయి
అనుభవించు వున్న క్షణాన్ని అందినంత ఆనందాన్ని




హౌ ఆర్ యు పాట సాహిత్యం

 
చిత్రం: శృంగార రాముడు (1979)
సంగీతం: కె.వి.మహాదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు

హౌ ఆర్ యు ... హవ్ డూయూడు అని అడగాలి
ఫ్లవరంటే అమ్మాయి షవరల్లే నవ్వాలి - రివరల్లే వురకాలి

హాపీ టు మీట్.. యు సర్ - వెరీ వెరీ హాపీ - టు సర్వ్ యు సర్
ఎప్పుడేమి కావాలో ఎలా ఎలా చెయ్యాలో
మీ రుచులు ఏమిటో అభిరుచులు ఏమిటో చెబితే చేసేందుకున్నాను
ఒకసారి చేశాక చెప్పకనే చేసేస్తానని చెప్పాలి.
కష్టపడి వచ్చారు కాసేపు పడుకోండి
నీరసంగ వున్నారు ఈ పళ్ళరసం తాగండి
వేడి తగ్గిపోతుంది స్నానం చెయ్యండి
పడుకోబోయే ముందు పాలు తాగండి
వూరుగాని వూరొచ్చిన మీకు వుపచారాలు చెయ్యాలి
అ తారింటో అలుడిలా అడిగిందంతా యివ్వాలి - మీరడిగిందంతా యివ్వాలి
ఐ లైక్ యు, డూ యు లైక్ మి - ఇఫ్ ఐ లవ్ యు విల్ యు లవ్ మి 
అందాక వచ్చాక అడగకనే నేనడిగేలా చెయ్యాలి.




నందమూరి అందగాడా పాట సాహిత్యం

 
చిత్రం: శృంగార రాముడు (1979)
సంగీతం: కె.వి.మహాదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, వాణిజయరాం

నందమూరి అందగాడా నేనందుకున్న చందురూడా
కాశ్మీరు కన్నెపిల్లా నే కట్టుకున్న ప్రేమఖుల్లా
ఇద్దరం కలిశాము యీ వేళా.…ఎండలో కాస్తుంది పండువెన్నెలా....
మంచితనం చక్కదనం ఒక్కటైన చోటా
పూస్తుంది దానిమ్మ తోట పూతోట
పడుచుతనం గడుసుదనం పాడేది పాట
పలుకుతుంది ప్రతి పిట్ట నోట
మంచుమీది ఆట మనకు ముచ్చట
మనమంటే మంచుకే ఎంతో ముద్దు
మంచుకొండమీద శివుడు నాట్యమాడినాడు
పార్వతికి తనలోని సగమిచ్చినాడు.
అదే మంచుమీద కలిసి ఆడాము నేడు
ఆది దంపతులం మనం ఏనాడూ
పుటినిలు మెట్టినిలు యీ పడవలోనే
మొదటి రాత్రి పడకటిల్లు కొలనులోనే
ఆకాశం కడుతుంది తారల జలతారు
గులాబీలు చల్లుతాయి పన్నీరు
నీకు నాకు సాటిలేరు ఎవ్వరు
నువ్వూ నేనే ప్రేమకు మారు పేరు ....





చీటికి ప్రాణం చేవ్రాలు పాట సాహిత్యం

 
చిత్రం: శృంగార రాముడు (1979)
సంగీతం: కె.వి.మహాదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ
గానం: వాణిజయరాం

చీటికి ప్రాణం చేవ్రాలు -ఆ చీటీలన్నవి రెండు రకాలు
చిరిగి ముక్కలై పోయేవి చెరగక మక్కువ దోచేవి
నా వయసొక చీటీ నా సొగసోక చీటీ
వాటికి ప్రాణం పోయి నీ చేవ్రాలతోటి
నీ భాషొకటి నా భాషొకటి- ఇద్దరి కళ్ళకు లిపి వొకటి
అది చేసే భాసలు శతకోటి
ఈ పెదవులు చూడు - ఆ మధువులు చూడు
రెంటికి యిచ్చేయ్ ఓ ముదులు చీటీ
నీ కలశొకటి ఇద్దరమాడే ఆటొకటి
ఇది నీకూ నాకూ తొలి పోటీ....



ఆడేదే ఆడది పాట సాహిత్యం

 
చిత్రం: శృంగార రాముడు (1979)
సంగీతం: కె.వి.మహాదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల

ఆడేదే ఆడది ఆడించే చెయ్యెవరిది .....?
నీది నాదీ కానిది ఏమిటది....?
ఎవ్వరి పాటో పాడుతున్నాను ఏ తాళానికో ఆడుతున్నాను
పెదవికి మధువును అందిస్తూ- వయసుకు సొగసును చూపిస్తూ
నాలో నేను ఏమవుతున్నది - మీలో ఎవరికి చెప్పను.

కన్నెసొగసులో కైపులున్నాయి కన్నుల గిన్నెల నింపుతున్నాయి.
గబ గబ గడ గడ తాగండి అడుగులు తడబడి తూలండి
తెల్లారాక తెలివొచ్చాక - ఏమవుతుందో చెప్పను




వస్తానన్నావు పాట సాహిత్యం

 
చిత్రం: శృంగార రాముడు (1979)
సంగీతం: కె.వి.మహాదేవన్ 
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, వాణిజయరాం

వస్తానన్నావు - వస్తే చూస్తానన్నాను
పిచ్చిదాన్ని వచ్చుంటావని నేనే ముందుగ వచ్చాను
వస్తానన్నాను - వ స్తే చూస్తానన్నావు
పిచ్చిదాని కంగారంతా - ముందే వచ్చి చూశాను
మగాడు ముందే రావాలి - ఆడది వచ్చి చేరాలి.
అప్పుడే ఈడూ జోడూ కలవాలి

జన్మలుంటాయి - మన జంట కలిసేందుకు
కాలముంటుంది - మన వెంట నడిచేందుకు
దేవుడుంటాడు రాసిందే రాసేందుకు
ఎవరిచేతవును మన రాత మార్చేందుకు
పవిత్ర ప్రేమకు యిన్నేళ్ళు చరిత్ర రాసిన కన్నీళ్ళు
నిజాలు కావు మనకు - ఆ విషాద గీతాలు
గంగా పొల్లాతో కలవాలి - మన ప్రేమతో
తూర్పు పడమరలు చేరాలి ఒక రంగులో

ముంతాజ్ పుట్టింది - షాజహాను వలచేందుకు
షాజహాను బ్రతికాడు – తాజ్ మహల్ కట్టేందుకు
నీ మనసే నాకు మహలై వుంటే - మరణ మెక్కడిది...
మరణం లేని మమతలకెందుకు మహల్లు కట్టేది
యుగాలు ముందు వున్నాము ముందు యుగాలు వుంటాము
ప్రేమకు వేరే వేరే పేర్లు పెడతామా....

ప్రేమ ఏలాలి దేశాల రాజ్యాంగము
పేద మహారాజు ఎక్కాలి ఒక పీఠము
ప్రపంచమంతా ప్రతిరోజూ వసంత రుతువై పూస్తుంది
అనంతమైన ఆనందం నిరంతరంగా వుంటుంది.

Palli Balakrishna Sunday, October 29, 2023
Andadu Aagadu (1979)



చిత్రం: అందడు ఆగాడు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర, వేటూరి, డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల, యస్. జానకి 
నటీనటులు: కృష్ణం రాజు, లతా సేతుపతి, మోహన్ బాబు, కవిత, విజయ లలిత, రంగనాథ్ 
దర్శకత్వం: యస్.డి.లాల్ 
నిర్మాత: శ్రీకాంత్ నాహతా 
విడుదల తేది: 30.03.1979



Songs List:



ఈ కోడె వయసు నా ఆడ మనసు పాట సాహిత్యం

 
చిత్రం: అందడు ఆగాడు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్. జానకి 

ఈ కోడె వయసు నా ఆడ మనసు 



ఏమని చెప్పేది ఎవరికి చెప్పేది పాట సాహిత్యం

 
చిత్రం: అందడు ఆగాడు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్. జానకి 

ఏమని చెప్పేది ఎవరికి చెప్పేది 



చిక్కడ పల్లి చినదాన చిత్రమైన దాన పాట సాహిత్యం

 
చిత్రం: అందడు ఆగాడు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: పి. సుశీల 

చిక్కడ పల్లి చినదాన చిత్రమైన దాన



ఓ చిట్టికి ఎంత ముద్దుగున్నావే పాట సాహిత్యం

 
చిత్రం: అందడు ఆగాడు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

ఓ చిట్టికి ఎంత ముద్దుగున్నావే
ఓ పట్టికి ఏమి తియ్యగున్నావే




ఈ సంతలో ఒక చిన్నది పాట సాహిత్యం

 
చిత్రం: అందడు ఆగాడు (1979)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి. సుశీల 

ఈ సంతలో ఒక చిన్నది నిలుచున్నది కొనువారెవ్వరో...

Palli Balakrishna Friday, August 12, 2022
Nippulanti Manishi (1974)



చిత్రం: నిప్పు లాంటి మనిషి (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర , డా॥ సి. నారాయణరెడ్డి, కొసరాజు
గానం: పి. సుశీల, యస్.జానకి,  ఎల్. ఆర్. ఈశ్వరి, యస్ పి బాలు
నటీనటులు: యన్. టి. రామారావు, లత , దేవిక
మాటలు: గొల్లపూడి
దర్శకత్వం:  యస్.డి.లాల్ 
నిర్మాత: వై. వి. రావు 
విడుదల తేది: 25.10.1974



Songs List:



కత్తికి సాన పాట సాహిత్యం

 
చిత్రం: నిప్పు లాంటి మనిషి (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:  డా॥ సి. నారాయణరెడ్డి
గానం:  యస్ పి బాలు

కత్తికి సాన




వెల్కమ్ స్వాగతం పాట సాహిత్యం

 
చిత్రం: నిప్పు లాంటి మనిషి (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:  ఆరుద్ర 
గానం:  ఎల్. ఆర్. ఈశ్వరి 

వెల్కమ్ స్వాగతం 




ఓరబ్బి ఓరబ్బి పాట సాహిత్యం

 
చిత్రం: నిప్పు లాంటి మనిషి (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:  ఆరుద్ర 
గానం:  యస్ పి బాలు, పి. సుశీల 

ఓరబ్బి ఓరబ్బి 




ఏదో అనుకున్నాను పాట సాహిత్యం

 
చిత్రం: నిప్పు లాంటి మనిషి (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:  డా॥ సి. నారాయణరెడ్డి 
గానం:  పి. సుశీల 

ఏదో అనుకున్నాను 




స్నేహమే నాజీవితం పాట సాహిత్యం

 
చిత్రం: నిప్పు లాంటి మనిషి (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:  డా॥ సి. నారాయణరెడ్డి
గానం:  యస్ పి బాలు

పల్లవి :
అల్లాయేదిగి వచ్చి (2)
ఆయ్ మియా ఏమి కావాలంటే
మిద్దెలొద్దు మేడలొద్దూ..
పెద్దలిక్కేగద్దెలొద్దంటాను
ఉన్ననాడు లేనినాడు ఒకే ప్రాణమై నిలిచే
ఒక్క దోస్తే చాలంటాను
ఒక్క నేస్తం కావాలంటాను
స్నేహమే నాజీవితం స్నేహమేరా శాశ్వతం
స్నేహమే నాకున్నది స్నేహమేరా పెన్నిధి
స్నేహమే హోయ్...
స్నేహమే నాజీవితం స్నేహమేరా శాశ్వతం (2)
 
చరణం: 1
గుండెనే పలికించితే (2)
కోటి పాటలు పలుకుతాయ్
మమతనే పండించితే
మణుల పంటలు దొరుకుతాయ్
బాధలను ప్రేమించు భాయీ..
లేదు అంతకు మించి హాయి
స్నేహమే నాజీవితం స్నేహమేరా శాశ్వతం (2)

చరణం: 2
కత్తిలా పదునైన చురుకైన మావాడు
మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు (2)
ఏమిటో ఈ బాధ (2)
నాకైనా చెప్పు భాయి
ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పవోయి (2)
నిండుగా నువ్వు నేడు నవ్వాలి
అందుకు నేనేమి ఇవ్వాలి  (2)
చుక్కలను కోసుకుని తెమ్మంటావా
దిక్కులను కలిపేయమంటావా
దింపమంటావా (2)
ఆ చంద్రుణ్ణి
తుంచమంటావా ఆ సూర్యుణ్ణి
ఏమి చేయాలన్నా చేస్తాను
కోరితే ప్రాణమైన ఇస్తాను (2)
దోస్తీకి నజరానా
దోస్తీకి నజరానా  చిరునవ్వురా నాన్న (2)
ఒక్క నవ్వేచాలు వద్దులే వరహాలు
నవ్వరా..
నవ్వరా మావాడు నవ్వరా నిండుగా (2)
నవ్వరా నాముందు రంజాను పండుగా
స్నేహమే హోయ్...
స్నేహమే నాజీవితం స్నేహమేరా శాశ్వతం (2)

Palli Balakrishna Tuesday, June 21, 2022
Rakta Sambandhalu (1975)



చిత్రం: రక్త సంబంధాలు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: కృష్ణ , మంజుల విజయకుమార్, లత సేతుపతి, అంజలీ దేవి, పండరీ బాయి
దర్శకత్వం: ఎమ్. మల్లికార్జున్ రావు
బ్యానర్: నవచిత్ర ఎంటర్ప్రైజెస్
నిర్మాతలు: రాఘవమ్మ, మీనాక్షి
విడుదల తేది: 29.08.1975



Songs List:



అనురాగ శిఖరాన ఆలయం.. పాట సాహిత్యం

 
చిత్రం: రక్త సంబంధాలు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల

పల్లవి:
అనురాగ శిఖరాన ఆలయం.. ఆ గుడిలోన ఆనంద జీవనం
సంసార దీపం.. సంతోష రూపం.. మురిపాల ఆరాధనం

అనురాగ శిఖరాన ఆలయం.. ఆ గుడిలోన ఆనంద జీవనం
సంసార దీపం.. సంతోష రూపం.. మురిపాల ఆరాధనం

ఏనాడు ఏ చోట ఉన్నా.. అనుబంధమే పావనం   
అనురాగ శిఖరాన ఆలయం.. ఆ గుడిలోన ఆనంద జీవనం
సంసార దీపం.. సంతోష రూపం.. మురిపాల ఆరాధనం

చరణం: 1
గుండేలలో గుడి ఒకటు౦దీ.. గుడి వెనుక తోటోకటు౦దీ
గుండేలలో గుడి ఒకటు౦దీ.. గుడి వెనుక తోటోకటు౦దీ

గున్నమావి కొమ్మమీద చిలకలూ.. పలికినవే పంచదార పలుకులూ
గున్నమావి కొమ్మమీద చిలకలూ.. పలికినవే పంచదార పలుకులూ
ఏనాడు ఏ చోట ఉన్నా.. అనుబంధమే పావనం    

అనురాగ శిఖరాన ఆలయం.. ఆ గుడిలోన ఆనంద జీవనం
సంసార దీపం.. సంతోష రూపం.. మురిపాల ఆరాధనం

చరణం: 2
మమకారమే ఆరని జ్యోతీ.. అది మదిలోన చల్లని శాంతీ
మమకారమే ఆరని జ్యోతీ.. అది మదిలోన చల్లని శాంతీ

దూరదూర తీరముల నావలూ.. చేరువగా చేర్చేవే మమతలూ
దూరదూర తీరముల నావలూ.. చేరువగా చేర్చేవే మమతలూ

ఏనాడు ఏ చోట ఉన్నా.. అనుబంధమే పావనం   
అనురాగ శిఖరాన ఆలయం.. ఆ గుడిలోన ఆనంద జీవనం
సంసార దీపం.. సంతోష రూపం.. మురిపాల ఆరాధనం




జస్ట్ ఎ మినిట్ ఈ వయసే పాట సాహిత్యం

 
చిత్రం: రక్త సంబంధాలు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్. జానకి 

జస్ట్ ఎ మినిట్ ఈ వయసే 




ఎవరో నీవు ఎవరో నేను.. పాట సాహిత్యం

 
చిత్రం: రక్త సంబంధాలు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:  డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

పల్లవి:
హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. హరి ఓం..

ఎవరో నీవు ఎవరో నేను.. అంతా మాయరా
హరి ఓం.. హరి ఓం.. పాడరా     

ఎవరో నీవు ఎవరో నేను.. అంతా మాయరా
హరి ఓం.. హరి ఓం..  హరి ఓం.. ఓం పాడరా 

చరణం: 1
నీలో ఉన్నదీ నాలో ఉన్నదీ . . నేను నీవేరా
నీళ్ళల్లో ఉన్నదీ పాలల్లో ఉన్నదీ . . పాలు నీళ్ళేరా

నీలో ఉన్నదీ నాలో ఉన్నదీ . . నేను నీవేరా
నీళ్ళల్లో ఉన్నదీ పాలల్లో ఉన్నదీ . . పాలు నీళ్ళేరా
ఎగాదిగా నిగా వేస్తే ఏముందిరా        

హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. ఓం.. పాడరా    
ఎవరో నీవు.. ఎవరో నేను.. అంతా మాయరా
హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. ఓం.. పాడరా

చరణం: 2
అంతంత కొండ అద్దంలో చుడరా ఇంతింత అయిపోవురా
ఇంతింత విత్తనం అంతంత వృక్షమై ఎంతో ఎదిగేనురా

అంతంత కొండ అద్దంలో చుడరా ఇంతింత అయిపోవురా
ఇంతింత విత్తనం అంతంత వృక్షమై ఎంతో ఎదిగేనురా
వేమన్న తావన్న. .  వింత ఇదేరా 

హరి ఓం . . హరి ఓం . . హరి ఓం . . ఓం.. పాడరా    
ఎవరో నీవు.. ఎవరో నేను . . అంతా మాయరా
హరి ఓం . . హరి ఓం . .  హరి ఓం . . ఓం.. పాడరా  

చరణం: 3
గుళ్ళోని దేవుడు గుళ్ళోన లేడు.. కళ్ళల్లో ఉన్నాడురా
ఓ మూఢా.. కళ్ళు ముసేసి చూడు.. ముందే ఉన్నాడురా 

గుళ్ళోని దేవుడు గుళ్ళోన లేడు.. కళ్ళల్లో ఉన్నాడురా
ఓ మూడా.. కళ్ళు ముసేసి చూడు.. ముందే ఉన్నాడురా
ఒరే ఒరే ఇదే ఇదే.. పరమ నిజంరా    

హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. ఓం.. పాడరా    
ఎవరో నీవు.. ఎవరో నేను.. అంతా మాయరా
హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. ఓం.. పాడరా     





ఇలారా మిటారి భలే మార్ కటారి పాట సాహిత్యం

 
చిత్రం: రక్త సంబంధాలు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర 
గానం: యస్.పి.బాలు 

ఇలారా మిటారి భలే మార్ కటారి 



చినదాని చెవులను చూడు.. పాట సాహిత్యం

 
చిత్రం: రక్త సంబంధాలు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల

పల్లవి:
చినదాని చెవులను చూడు.. తెలరాళ్ళ కమ్మల జోడు
పిలిచింది దాని ధగధగ...  ఎందుకో..   ఎందుకో      

చినదాని చెవులను చూడు.. తెలరాళ్ళ కమ్మల జోడు
మేరిసింది దాని ధగధగ..  ఎందుకో...    ఎందుకో  

చరణం: 1
కట్టింది చెంగావి చీరా.. తోడిగింది సరిగంచు రైకా
కట్టింది చెంగావి చీరా.. తోడిగింది సరిగంచు రైకా

దాని బిగువుల పిటపిటలన్నీ.. దాని నగవుల చిటపటలన్నీ
దాని బిగువుల పిటపిటలన్నీ.. దాని నగవుల చిటపటలన్నీ
అలరించే మొనగాడు.. ఎవడో    

చినదాని చెవులను చూడు.. తెలరాళ్ళ కమ్మల జోడు
పిలిచింది దాని ధగధగ.. ఎందుకో.. ఎందుకో 

చరణం: 2
మెరిసింది వగలాడి రూపూ.. ఇంకా పడలేదు మగవాడి చూపూ
మెరిసింది వగలాడి రూపూ.. ఇంకా పడలేదు మగవాడి చూపూ

దాని కులుకుల ఘుమ ఘుమలన్నీ.. దాని తలపుల తహతహలన్నీ
దాని కులుకుల ఘుమ ఘుమలన్నీ.. దాని తలపుల తహతహలన్నీ
విరబూసి పండేది.. ఎప్పుడో

చినదాని చెవులను చూడు.. తెలరాళ్ళ కమ్మల జోడు
పిలిచింది దాని ధగధగ.. ఎందుకో.. ఎందుకో.. ఎందుకో  




అనురాగ శిఖరాల ఆలయం పాట సాహిత్యం

 
చిత్రం: రక్త సంబంధాలు (1975)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు, యస్. జానకి 

అనురాగ శిఖరాల ఆలయం 

Palli Balakrishna Thursday, February 7, 2019
Andala Ramudu (1973)



చిత్రం: అందాల రాముడు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, లత సేతుపతి 
దర్శకత్వం: బాపు
నిర్మాత: యన్.యస్. మూర్తి
విడుదల తేది: 12.09.1973



Songs List:



పలుకే బంగారమాయెరా పాట సాహిత్యం

 
చిత్రం:  అందాల రాముడు (1973)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:  ఆరుద్ర
గానం: యం. బాలమురళీకృష్ణ

పల్లవి:
పలుకే బంగారమాయెరా
అందాల రామ పలుకే బంగారమాయెరా
అందాల రామ పలుకే బంగారమాయెరా 

ఖగరాజ గమన నీవే జగముల సృష్టించావు
జగమంతా ఒక ఇల్లని జనులంతా సోదరులనే పలుకే బంగారమాయెరా
అందాల రామ పలుకే బంగారమాయెరా

చరణం: 1
లక్షాధికారులైనా లవణమన్నమే గాని
బంగారు కణికలు మింగలేరను మంచి పలుకే బంగారమాయెరా
అందాల రామ  పలుకే బంగారమాయెరా 

చిన్ని నా బొజ్జకు  శ్రీరామ రక్షనుకొన్నా
అన్నపానాదులన్ని  అందరికుండాలనే.. పలుకే బంగారమాయెరా
అందాల రామ  పలుకే బంగారమాయెరా 

చరణం: 2
బిరుదులు పదవుల మీద  పరనారి పెదవుల మీద
బుద్దంతా నిలిపేవాడు బూడిదై పొతాడన్న ఎరుకే బంగారమాయెరా
అందాల రామ పలుకే బంగారమాయెరా 

పంచదారను మించే  పాలూ మీగడల మించె
పరమ మధుర నామస్మరణే మంచిదనే పలుకే బంగారమాయెరా

అందాలరామ పలుకే బంగారమాయెరా 
అందాలరామ పలుకే బంగారమాయెరా
అందాలరామ పలుకే బంగారమాయెరా 




ఏడవకు ఏడవకు వెర్రినాగన్నా పాట సాహిత్యం

 
చిత్రం: అందాల రాముడు (1973) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: వి.రామకృష్ణ 

పల్లవి: 
ఏడవకు ఏడవకు వెర్రినాగన్నా
ఏడుస్తే నీ కళ్లు నీలాలు కారూ
జోజో జోజో... జోజో జోజో...

ఎదగడానికెందుకురా తొందరా 
ఎదర బతుకంతా చిందర వందర 
జోజో జోజో... జోజో జోజో... 

చరణం: 1
ఎదిగేవో బడిలోను ఎన్నెన్నో చదవాలి 
పనికిరాని పాఠాలు బట్టీయం పెట్టాలి 
చదవకుంటే పరీక్షలో కాపీలు కొట్టాలి 
పట్టుబడితె ఫెయిలైతే బిక్కమొహం వెయ్యాలి 
కాలేజీ సీట్లు అగచాట్లురా 
అవి కొనడానికి ఉండాలి నోట్లురా 
చదువు పూర్తయితే మొదలవ్వును పాట్లురా ..అందుకే... 

చరణం: 2
ఉద్యోగం వేటలోన ఊరంతా తిరగాలి 
అడ్డమైనవాళ్లకీ గుడ్మార్నింగ్ కొట్టాలి 
ఆమ్యామ్యా అర్పించి హస్తాలు తడపాలి 
ఇంటర్వ్యూ అంటూ క్యూ అంటూ 
పొద్దంతా నిలవాలి 
పిలుపు రాకుంటే నీ ఆశ వేస్టురా 
మళ్లా పెట్టాలి ఇంకో దరఖాస్తురా 
ఎండమావి నీకెపుడూ దోస్తురా ..అందుకే...  

చరణం: 3
బిఏను చదివి చిన్న బంట్రోతు పనికెళితే 
ఎంఏలు అచట ముందు సిద్ధము 
నీవు చేయలేవు వాళ్లతో యుద్ధము 
బతకలేక బడిపంతులు పని నువ్వు చేసేవో 
పదినెల్లదాకా జీతమివ్వరు 
నువ్వు బతికావో చచ్చేవో చూడరు 
ఈ సంఘంలో ఎదగడమే దండగా 
మంచి కాలమొకటి వస్తుంది నిండుగా 
అపుడు ఎదగడమే బాలలకు పండగా 
అందాకా... 
ఎదగడానికెందుకురా తొందరా 
ఎదర బతుకంతా చిందర వందర 

జోజో జోజో... జోజో జోజో... 
టాటా టాటా... టాటా టాటా...




అబ్బోసి చిన్నమ్మా... పాట సాహిత్యం

 
చిత్రం: అందాల రాముడు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: వి.రామకృష్ణ, సుశీల 

పల్లవి :
అబ్బోసి చిన్నమ్మా... ఆనాటి ముచ్చటలూ
ఎన్నెన్ని గురుతున్నాయే తలచుకొంటె గుండెలోన గుబులౌతుందే 
అబ్బోసి చిన్నమ్మా  ఆనాటి ముచ్చటలూ
ఎన్నెన్ని గురుతున్నాయే తలచుకొంటె గుండెలోన  గుబులౌతుందే  

అబ్బోసి చిన్నయ్యా... ఆనాటి ముచ్చటలూ
ఎన్నైనా గురుతుంటాయీ నీ గుండెలోన గుర్రాలే పరుగెడుతాయీ             
అబ్బోసి చిన్నయ్యా  ఆనాటి ముచ్చటలూ
ఎన్నైనా గురుతుంటాయీ  నీ గుండెలోన గుర్రాలే పరుగెడుతాయీ 

చరణం: 1
ఎలక తోక రెండుజడలు వెనకనుండి నేలాగితె
ఎలక తోక రెండుజడలు వెనకనుండి నేలాగితె
ఉలికులికి పడేదానివే  నువ్వు ఉడుక్కొని ఏడ్చేదానివే 

అలాగా ఉడికిస్తే అదను చూచి నేనేమో  -  ఊ
అలాగా ఉడికిస్తే అదను చూచి నేనేమో
నెత్తి మీద మొట్టేదానినోయ్... 
నువ్వు మొట్టగానే సాచిపెట్టి కొట్టేవడినే

అబ్బోసి చిన్నమ్మా... ఆనాటి ముచ్చటలూ
ఎన్నైనా గురుతుంటాయీ నీ గుండెలోన గుర్రాలే పరుగెడుతాయీ  

చరణం: 2
మలిసంజవేళలో  మర్రిచెట్టు నీడలో
మలిసంజవేళలో  మర్రిచెట్టు నీడలో
వానలో చిక్కడితే వళ్ళంతా తడిసింది
వానలో చిక్కడితే వళ్ళంతా తడిసింది
పిడుగుపడితె హడలిపోయావే నన్నతుక్కుని అదుకుమున్నావే
పిడుగుపడితె హడలిపోయావే నన్నతుక్కుని అదుకుమున్నావే 

అంతకన్న ఎక్కువగా నువ్వే హడలేవులే
అంతకన్న ఎక్కువగా నువ్వే హడలేవులే
అదుముకుంటే విదిలించుకు పరుగుపుచ్చుకున్నావు
నాటినుండి నేటి దాక ఫికరులేకపోయావు 

వేటగాడ్నే లేడి వేటాడ వచ్చిందా
వేటగాడ్నే లేడి వేటాడ వచ్చిందా 

అబ్బోసి చిన్నయ్య అబ్బోసి చిన్నమ్మ
అబ్బోసి చిన్నయ్య అబ్బోసి చిన్నమ్మ

అబ్బో  అబ్బో అబ్బో అబ్బో





మా తల్లి గోదారి | బద్రాచల క్షేత్ర మహిమ | బద్రాచలం - హరికథ పాట సాహిత్యం

 
(బద్రాచల క్షేత్ర మహిమ)
(బద్రాచలం - హరికథ)

చిత్రం: అందాల రాముడు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: వి. రామకృష్ణ, జె. వి. రాఘవులు

పల్లవి:
మా తల్లి గోదారి చూపంగ దారి....
పడవెక్కి భద్రాద్రి పోదామా భద్రాద్రి రాముణ్ణి చూదామా.. 
భద్రగిరి మహిమలే విందామా భద్రగిరి మహిమలే విందామా
ఏవిటోయ్ ఆ మహిమలు ?
శ్రీమద్రమారమణ గోవిందో హరి
భక్తులారా.. సుజనులారా... 
సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామచంద్రుడు
అరణ్యవాస సమయంబున పావన గోదావరీ తీరంబున... 
ఒకానొక గిరిని పరికించి, దానిపై సుంత విశ్రమించినంత... 
ఆ కంధరమ్మొక సుందరపురుషాకృతి దాల్చి . . .ఏమనినాడనదా

ధన్యుడనైతిని  ఓ రామా  నా పుణ్యము పండెను శ్రీరామా
ధన్యుడనైతిని  ఓ రామా  నా పుణ్యము పండెను శ్రీరామా
మేరుగిరీంద్రుని పుత్రుడను  నీ రాకకు చూచే భద్రుడనూ
నారీ శిరోమణి సీతమ్మతో మీరు నా శిరసున నెలకొన వేడెదనూ
కారుణ్యాలయ కామిత మీడేర్చ కలకాలము నిను కొలిచెదనూ
ధన్యుడ  ధన్యుడ  ధన్యుడనైతిని  ఓ రామా నా పుణ్యము పండెను శ్రీరామా
అని భద్రుడు ప్రార్థించిన  స్వామివారేమన్నరనగా 

వత్సా! నీ ముద్దు చెల్లించుటకు ముందు మా తండ్రి మాట చెల్లించవలయును
తదా ఉత్తరోత్తర కాలంబున పునర్దర్శనంబు ఇచ్చువాడను  . . 
అని వెడలిపోయిరి  అంతట

వెడలిన రాముడు వెలదిని బాసి ఇడుములలో బడెనూ
కడలికి వారధి గట్టి కఠినాత్ముడు దనుజుని గొట్టి
కలికి చెరను పోగొట్టి  కనువిందుగ పట్టము గట్టి
బంధుమిత్రుల తలచుట బట్టి

భక్తుని మాట మరిచాడు రాముడు పరమావతారమ్ము విడిచాడు
వైకుంఠవాసమ్ము చేరాడు 
శ్రీమద్రమారమణ గోవిందో హరి

చరణం: 1
కాని భూలొకమున భద్రుడు ఎన్నియుగము లైనా ఎదురు చూస్తూ
ఏ విధిముగా శోకించినాడనగా
వచ్చెదనంటివి రామయ్యా వరమిచ్చెదనంటివి రామయ్యా
వచ్చెదనని శెలవిచిన పిమ్మట మోసపుచ్చుట ఇచ్చట తగదయ్యా
వచ్చెనుకద నీ మాటకు మచ్చా అది రానిచ్చెదనా నిను పోనిచ్చెదనా
హెచ్చరింతు నువు మెచ్చెడి తపమున  నిచ్చలు జపించి ఖచ్చితముగా
ఓ సచ్చరిత్రనిన్నిచ్చటకీడ్చెద 
వచ్చెదనంటివి రామయ్యా వరమిచ్చెదనంటివి రామయ్యా

అని శపథంబు చేసి మహోగ్ర తపస్సు నాచరించగా
సకల సురాసుర యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులు
సంక్షోభమ్మునొందిరి  అపుడు

కదలెను  శ్రీ మహావిష్ణువు కదలెను భక్తసహిషువు
సుదతి శ్రీదేవికి సుంతయినా తెలుపక శుభ శంఖచక్రాల కరముల దాల్చక
సుదూరమౌ భూలోకమునకు  సుపర్ణుని భుజమైన ఏక్కకా
వడివడి కదలెను శ్రీమహావిష్ణువు కదలెను భక్తసహిషువు 
శ్రీమద్రమారమణ గోవిందో  హారి

చరణం: 2
గజేంద్రమోక్ష సన్నివేశంబుకై వడి  స్వామి వారు ఆ విధమ్ముగాకదలగా
తన వెంటన్ సిరి  లచ్చి వెంట నవరోధ వ్రాతమున్  దానివె
న్కను బక్షీంద్రుడు  వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చక్రనికాయంబునూ

హుటాహుటిని రాగా.. తొందరయందు అపసవ్యంబుగా ఆయుధములు ధరించి 
స్వామివారు భద్రునకు దర్శనంబీయ ఆ భక్త శిఖామణి ఏమన్నాడు

ఏవరివయ్య స్వామి నేను నిన్నెరుగను హరిని నేనటంచు అనగనేల
నాడు నన్నుబ్రోచు నారాముడవునావు నాటి రూపుచూప నమ్మగలను
అని భద్రుడుకోరగా 
శ్రీమహావిష్ణువు  తొలినాటి రామావతారమ్ము ప్రదర్శించెను
అపసవ్యమ్ములైన ఆయుధమ్ములు ఆ తీరుగనే చేతుల నెల్చెను 
భద్రుడు మహదానందబరితుడై

ఈ తీరుగనె ఇచ్చట వెలయుము ఇనకులసోమా రామా
భూతలమున ఇది సీతారాముల పుణ్యక్షేత్ర లలామా  శభాష్
అని విన్నవించగా స్వామివారు ఆ తీరు గనే వెలసిరి

ఆ భద్రుడే భద్రాద్రి అయ్యెను... భద్రగిరి వాసుడైన శ్రీరామచంద్రుడు
ఎండకు ఎండి వానకు తడిసి నీడకు తపించినవాడై . . .

చరణం: 3
ఒకనాడు శబరి అంశమున జన్మించినదైన
పోకల దమ్మక్క అను భక్తురాలి స్వప్నమున సాక్షాత్కరించి ఆ వైనమ్ము తెలుపగా . . .
ఆయన భద్రగిరినంతయు గాలించగా
స్వామివారి దివ్యసుందరమూర్తి కనిపించెను

కోరి కనిపించావా కోదండరామయ్యా గుడి కట్టలేని ఈ బడుగుపేదకు నీవు
కోరి కనిపించావా కోదండరామయ్యా గుడి కట్టలేని ఈ బడుగుపేదకు నీవు
చక్రవర్తి కుమారుడా ఇంకో చక్రవర్తికి అల్లుడా
భూచక్రమేలిన సార్వభౌమా విధివక్రించి నీకే వాసమ్ముకరువా
తాటాకు పందిరే తాటకాంతక  నీకు భవనమయ్యా
తాటిపండ్లే ఓ మేటి రాజకుమార  విందులయ్యా నీకు విందులయ్యా

అని పోకల దమ్మక్క నిత్యము సేవించుకొనెను
తదుత్తర కాలంబున రామదాసుగా ప్రఖ్యాతుడైన కంచెర్ల గోపన్న
ఏ విధముగా ఆలయ నిర్మాణము గావించెననగా  
ఏవిధముగానా  అప్పుజేసి
తప్పు నాయనా గోపన్న చరితము లోకవిఖ్యాతము
తదీయ సంస్మరణము మంగళదాయకము

రామచంద్రాయ జనక రాజజామనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం
సీతా రామచంద్రాయ జనక రాజజామనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం
మహిత మంగళం  మహిత మంగళం  మహిత మంగళం  మహిత మంగళం
జై శ్రీమద్రమారమణ గోవిందో  హరి:




చాకిరేవు బాణ ఏమంది పాట సాహిత్యం

 
చిత్రం: అందాల రాముడు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: వి.రామకృష్ణ ,జె.వి.రాఘవులు 

చాకిరేవు బాణ ఏమంది



రాముడేమన్నాడోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: అందాల రాముడు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: వి.రామకృష్ణ 

రాముడేమన్నాడోయ్





భజనచేసి విందాము పాట సాహిత్యం

 
చిత్రం: అందాల రాముడు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: కొసరాజు
గానం: వి.రామకృష్ణ , విజయలక్ష్మి 

భజనచేసి విందాము 




కురిసే వెన్నెల్లో పాట సాహిత్యం

 
చిత్రం: అందాల రాముడు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: వి.రామకృష్ణ ,పి.సుశీల 

పల్లవి:
కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా
మెరిసే గోదారిలో విరబూసిన నురగలా
నవ్వులారబోసే పడుచున్నదీ
కలువ పువ్వు వేయి రేకులతో విచ్చుకున్నదీ
పున్నమి ఎపుడెపుడా అని వేచి ఉన్నదీ

ఆ..
కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా
మెరిసే గోదారిలో ఎగసిపడే తరగలా..
నాజూకు నెలబాలుడున్నాడూ
నవమి నాడే పున్నమి అని దిగుతున్నాడూ
పున్నమి ఇప్పుడిపుడే అనిపిస్తున్నాడూ

ఆ..
కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా

చరణం: 1
ఈ వెండి వెన్నెల్లో ఏమిటి ఈ ఎరుపూ
ఎరుపా అది కాదు ఈ అరికాళ్ళ మెరుపూ
ఆ కాలి ఎరుపు కెంపులుగా
ఆ చిరునవ్వులె మువ్వలుగా
ఆ మేని పసిమి పసిడిగా
అందాలా వడ్డాణం అమరించాలి
అని తలచానే గాని ఆనదు నీది
ఇంతకూ..

అది ఉన్నట్టా... మరి లేనట్టా...
నడుమూ ఉన్నట్టా మరి లేనట్టా  - ఊహు
పైట చెంగు అలలు దాటీ
అలలపై ఉడికే పొంగులు దాటీ
ఏటికి ఎదురీది ఈది ఎటు తోచక నేనుంటే
మెరుపులాంటి ఎరుపేదో కళ్ళకు మిరుమిట్లు గొలిపింది
ఏమిటది?

ఎవరమ్మా ఇతగాడూ ఎంతకు అంతుపట్టని వాడు
చెంతకు చేరుకున్నాడూ
హ హా... ఎవరమ్మా ఇతగాడూ
పాలవెన్నెలలోన బాలగోదారిలా
చెంగుచెంగున వచ్చి చెయ్యి పట్టబోయాడూ

అంతేనా...

తిరగట్లే ఒరుసుకునే వరద గోదారిలా
పరుగుపరుగున వచ్చి పైట చెంగు లాగాడూ

ఆపైన

అతడు చెయ్యపట్టబోతుంటే పైట చెంగులాగబోతుంటే
ఉరిమి చూసీ ఉరిమి చూసీ తరిమి కొట్టబోయాను
కానీ..
చల్లచల్లగా సాగే గోదారిలా శాంత గోదారిలా
నిలువెల్లా నిండుగా తోచాడూ పులకించే గుండెనే దోచాడూ

ఎవరమ్మా ఇతగాడెవరమ్మా




మము బ్రోవమని చెప్పవే పాట సాహిత్యం

 
చిత్రం:  అందాల రాముడు (1973)
సంగీతం:  కె.వి. మహదేవన్
సాహిత్యం:  ఆరుద్ర
గానం:  వి.రామకృష్ణ

పల్లవి:
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ  మము బ్రోవమని చెప్పవే
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ మము బ్రోవమని చెప్పవే

ఏకాంత రామయ్య నీ చెంతగా చేరి చల్లంగ నీ ముద్దు చెల్లించు వేళ 
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ మము బ్రోవమని చెప్పవే

చరణం: 1
మీరూ ఈ గోదారీ తీరాన నడిచారు కన్నీళ్ళు నవ్వూలు కలబోసుకు న్నారూ
ఆ కథను కాస్త గురుతు చేసుకొమ్మనీ మా కష్టాలు కాస్త చూసిపొమ్మని
నువ్వయినా చెప్పవమ్మా రామయ్యకూ ఆ అయ్యకూ      
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ మము బ్రోవమని చెప్పవే

చరణం: 2
మా రాజులు మంత్రులు మిమ్మడగ వచ్చేవారలే
మా బోటి దీనులు మీ కడకు వచ్చేవారలే
ఇంతొ అంతొ ముడుపు కట్టి అంతటయ్యను మాయచేసి
లక్షలో మోక్షమ్ముకోరే గడుసు బిచ్చగాళ్ళము వట్టి పిచ్చివాళ్ళము

ఆదుకొమ్మని పైకి చేదు కొమ్మని చెప్పవమ్మా రామయ్యకు మా అయ్యకు
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ మము బ్రోవమని చెప్పవే

చరణం: 3
పులిని చూస్తే పులీ యెన్నడు బెదరదూ మేక వస్తే మేక యెన్నడు అదరదూ
మాయరోగమదేమో గాని మనిషి మనిషికి కుదరదు
ఎందుకో తెలుసా తల్లీ ఉన్నది పోతుందన్న బెదురుతో
అనుకున్నది రాదేమోనన్న అదురుతో
కొట్టుకొంటూ తిట్టుకుంటూ కొండకెక్కేవాళ్ళము మీ అండ కోరే వాళ్ళము

కరుణించమని చెప్పవే మా కన్నతల్లి కరుణించమని చెప్పవే 
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ మము బ్రోవమని చెప్పవే 




సుద్ధ బ్రహ్మ పరాత్పర రామ పాట సాహిత్యం

 
చిత్రం: అందాల రాముడు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: కంచెర్ల గోపన్న 
గానం: వి.రామకృష్ణ

సుద్ధ బ్రహ్మ పరాత్పర రామ 




సమూహ భోజనంబు సంతోషమైన విందు.. పాట సాహిత్యం

 
చిత్రం: అందాల రాముడు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: కొసరాజు
గానం: వి.రామకృష్ణ

పల్లవి:
సమూహ భోజనంబు సంతోషమైన విందు..
అంతస్తులన్ని బందు అహహ్హ ఏమనందు        
సమూహ భోజనంబు సంతోషమైన విందు..
అంతస్తులన్ని బందు అహహ్హ ఏమనందు         

చరణం: 1
గోదారి గంగ నీరు తాగేరు కలిసి మీరు
అంగట్లో అమ్ము బియ్యం కోంటారు కలిసి మీరు
గోదారి గంగ నీరు తాగేరు కలిసి మీరు
అంగట్లో అమ్ము బియ్యం కోంటారు కలిసి మీరు
ఆ నీటితోనె బియ్యం వండగనె వచ్చు కయ్యం
ఆ నీటితోనె బియ్యం వండగనె వచ్చు కయ్యం
అబ్బా ఇదేమి న్యాయం బహు చెడ్డ సాంప్రదాయం
అబ్బా ఇదేమి న్యాయం బహు చెడ్డ సాంప్రదాయం
ఈ గొణుగుచున్న ఘనులు కడు మూర్ఖ శిఖామణులు        

సమూహ భోజనంబు  సంతోషమైన విందు
అంతస్తులన్ని బందు అహహ్హ ఏమనందు         

చరణం: 2
అరె..హ ! ఆస్పత్రి మందులందు అంటేమి కానబడదు
ఇస్కూల్లొ చదువునపుడు పుస్తకము మైలబడదు
ఆస్పత్రి మందులందు అంటేమి కానబడదు
ఇస్కూల్లొ చదువునపుడు పుస్తకము మైలబడదు
కాదప్ప అల్లాటప్ప ఇహ చెల్లదు మీ గొప్ప
కాదప్ప అల్లాటప్ప ఇహ చెల్లదు మీ గొప్ప
కాలమ్ము మారెనప్పా ఓ వెర్రివెంగళప్పా..
ఆలోచనలను పెంచు ఆవేశములను దించు 

సమూహ భోజనంబు  సంతోషమైన విందు
అంతస్తులన్ని బందు అహహ్హ ఏమనందు   

చరణం: 3 
దేవుడికి మొక్కునపుడు హోటల్లో మెక్కినపుడు
రైళ్ళల్లో ఎక్కునపుడు బస్సుల్లో చిక్కినపుడు
దేవుడికి మొక్కునపుడు హోటల్లో మెక్కినపుడు
రైళ్ళల్లో ఎక్కునపుడు బస్సుల్లో చిక్కినపుడు
హెచ్చన్న మాటరాదు తగ్గన్న మాట లేదు
హెచ్చన్న మాటరాదు తగ్గన్న మాటలేదు
సహపంక్తి భోజనాన కొంపేమి మునిగిపోదు
సహపంక్తి భోజనాన కొంపేమి మునిగిపోదు
కోపాలు సర్దుకోండి సాపాటు పంచుకోండి

సమూహ భోజనంబు సంతోషమైన విందు
అంతస్తులన్ని బందు అహహ్హ ఏమనందు        
సమూహ భోజనంబు సంతోషమైన విందు
అంతస్తులన్ని బందు అహహ్హ ఏమనందు 





అదిగో బద్రాద్రి పాట సాహిత్యం

 
చిత్రం: అందాల రాముడు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: కంచెర్ల గోపన్న 
గానం: వి.రామకృష్ణ

అదిగో బద్రాద్రి 




శ్రీ శంకర (శ్లోకం ) పాట సాహిత్యం

 
చిత్రం: అందాల రాముడు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: శ్లోకం 
గానం: యం. బాలమురళీకృష్ణ

శ్రీ శంకర 

Palli Balakrishna Sunday, February 3, 2019
Magaadu (1976)



చిత్రం: మగాడు (1976)
సంగీతం: కె.వి. మహదేవన్
నటీనటులు: యన్. టి.రామారావు, మంజుల, రామకృష్ణ, లత, అంజలీ దేవి
దర్శకత్వం: ఎస్.డి.లాల్
నిర్మాతలు: లక్ష్మీ రాజ్యం, శ్రీధర్ రావు, శ్రీకాంత్ నహత
విడుదల తేది: 19.05.1990



Songs List:



కొట్టేసిండు.. జింజర.. పాట సాహిత్యం

 
చిత్రం: మగాడు (1976)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల

పల్లవి:
కొట్టేసిండు.. జింజర.. జింజర.. జింజర.. జింజర
కొట్టేసిండు బంగారం లాంటి మనసు కొట్టేసిండు
కళ్ళు తెరచి చూసేసరికి కనపడకుండా చెక్కేసిండు
కొట్టేసిండు జింజర జింజర జింజర  జింజర కొట్టేసిండు

చరణం: 1
ఆహహా.. ఆహహా... హహా.. ఆహహా
గాలి రెక్కలపై ఏ వేళవస్తాడో.. పూల రెమ్మలపై ఏ పూట నిలుస్తాడో
గాలి రెక్కలపై ఏ వేళ వస్తాడో..  పూల రెమ్మలపై ఏ పూట నిలుస్తాడో

వాడు తుమ్మెదలంటాడు..  ఆ తుంటరిదంటాడు
తుమ్మెదలంటాడు ఆ తుంటరిదంటాడు
ఒక రేకైన నలగకుండా దోచుకుపోయిండు.. తేనెలు దోచుకుపోయిండు

కొట్టేసిండు జింజర జింజర జింజర జింజర
కొట్టేసిండు బంగారం లాంటి మనసు.. కొట్టేసిండు....  కొట్టేసిండు

చరణం: 2
ఆహహా.. ఆహహా... హహా.. ఆహహా... ఆ... 
వాని చూపుల్లో కైపారు మెరిసింది..   వాని అడుగుల్లో సెలయేరు నిలిచింది
వాని చూపుల్లో కైపారు మెరిసింది..   వాని అడుగుల్లో సెలయేరు నిలిచింది 
వాడు పగటి సందురూడు...  నిశి రాతిరి సూర్యుడు 
పగటి సందురూడు...  నిశి రాతిరి సూర్యుడు
కదిలేటి వెన్నెల్లో సెగలు రేపుతాడు . . భల్ సెగలు రేపుతాడు

కొట్టేసిండు జింజర జింజర జింజర జింజర
కొట్టేసిండు బంగారం లాంటి మనసు కొట్టేసిండు
కళ్ళు తెరచి చూసేసరికి కనపడకుండా చెక్కేసిండు
కొట్టేసిండు జింజర జింజర జింజర జింజర కొట్టేసిండు

జింజర జింజర జింజర జింజర




కోరుకున్నాను..నిన్నే చేరుకున్నాను పాట సాహిత్యం

 
చిత్రం: మగాడు (1976)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
కోరుకున్నాను..నిన్నే చేరుకున్నాను
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను

కోరుకున్నాను..నిన్నే చేరుకున్నాను
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను

ఏనాడో నేను నీదాన్నీ ...నీ హృదయానికి అనువాదాన్ని
హూ....హూ..హూ..
కోరుకున్నాను.. నిన్నే చేరుకున్నాను
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను


చరణం: 1
ఇంత మంచి తరుణం ఇంకెందుకూ... కవ్వింత సొగసు కాజేసేటందుకు
ఇంత మంచి తరుణం ఇంకెందుకూ... కవ్వింత సొగసు కాజేసేటందుకు
ఇంత పొంగు పరువం నీకెందుకు.. ఇంత పొంగు పరువం నీకెందుకు
కౌగిలింతలో కమ్మేసేటందుకు.. ఊ.. ఊ...

ఆరడుగుల వాడివే...ఆరిపోని వేడివే...
మంచులా.. మౌనిలా ..మాటాడకున్నావేం?
మంచులా.. మౌనిలా.. మాటాడకున్నావేం?

కోరుకున్నాను..నిన్నే చేరుకున్నాను
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను


చరణం: 2
తొలి పొద్దుపొడిచింది ఇప్పుడే.. నీకు తుది ఝాము కావాలా అప్పుడే
తొలి పొద్దుపొడిచింది ఇప్పుడే.. నీకు తుది ఝాము కావాలా అప్పుడే
తలపు రేకు విప్పింది ఇప్పుడే... తలపు రేకు విప్పింది ఇప్పుడే
మరి వలపు పంట పండాలా అప్పుడే.. ఊ... ఊ...

ఆకు మాటు పిందెవే ... అరుగు దిగని పాపవే...
చింతలు.. వంతలు.. నీకేమి తెలుసునులే?
చింతలు.. వంతలు.. నీకేమి తెలుసునులే?

కోరుకున్నాను... నిన్నే చేరుకున్నాను...
ఆ రోజు రానీ అని ఊరుకున్నాను...
కోరుకున్నాను... నిన్నే చేరుకున్నాను...
ఆ రోజు రానీ అని ఊరుకున్నాను...
ఏనాడో నేను నీవాణ్ణి ... నీ హృదయానికి అనువాదాన్ని..హూ..హూ....

కోరుకున్నాను... హ..హ..హ..
నిన్నే చేరుకున్నాను...హ..హ..హ..
నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను... ఆ రోజు రానీ అని ఊరుకున్నాను

హూ..హూ.. హూ..హూ..




సల సల సల పాట సాహిత్యం

 
చిత్రం: మగాడు (1976)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

సల సల సల సల సల సలా 
కాగిన కొద్దీ, నీరు ఆవిరి అవుతుంది 
సాగిన కొద్దీ వలపే ఊపిరి అవుతుంది 
ಲಲಲ್ಲ ಲಲಲ್ಲ ಲಲಲ್ಲలా
ఎందుకలా, ఏమిటలా

విత్తనం మొలకవుతుంది 
మొలకేమో, మొక్కవుతుంది
మొక్క ముదిరితే చెట్టవుతుంది
ముద్దు పెరిగితే మోజవుతుంది 
ಲಲಲ್ಲ ಲಲಲ್ಲ ಲಲಲ್ಲలా
ఎందుకలా ఏమిటలా

కోరికేదో పులకిస్తుంది
గుండెలోని కలకేస్తుంది 
కొత్త కొత్తగా విసురొస్తుంది 
మెత్త మెత్తగా మెరుపొస్తుంది 
ಲಲಲ್ಲ ಲಲಲ್ಲ ಲಲಲ್ಲలా
ఎందుకలా ఏమిటలా

సలసల - సలసల
కాగిన కొద్దీ
మెరుపుంటే మబ్బుంంది 
మబ్బుంటేనే మెరుపుంటుంది 
మెరుపూ మబ్బూ ఒకటైతేనే
జల్లు కురుస్తుంది హరివిల్లు పొడుస్తుంది
ಲಲ್ಲ ಲಲಲ್ಲ ಲಲಲ್ಲలా
ఎందుకలా ఏమిటలా

సలసల సలసల సలసలా 
కాగిన కోద్దీ  నీరు ఆవిరి అవుతుంది
సాగిన కొద్దీ, వలపే ఊపిరి అవుతుంది


Palli Balakrishna
Love in Singapore (1980)

చిత్రం: లవ్ ఇన్ సింగపూర్ (1980)
సంగీతం:  శంకర్ - గణేష్
సాహిత్యం:  సినారె
గానం: యస్.పి.బాలు,  సుశీల
నటీనటులు: రంగనాథ్ , చిరంజీవి , లత సేతుపతి
దర్శకత్వం: ఓ.యస్.ఆర్
నిర్మాత: యమ్.వెంకటరమణకుమార్
విడుదల తేది: 29.09.1980

పల్లవి:
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..      
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..
చ..చ..చచ...చ..చచ...

ఈ ముద్దు తొలి ముద్దు ఇంకెప్పుడు ఆపద్దు
ఇవ్వాలి ఏ పొద్దు ఇలాగే...
నా పెదవి ముద్దంటే... నీ పెదవి వద్దంటే
ఆ పైనా రామాహరే....

ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..      
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..

చరణం: 1
చినికి చినికి గాలి వాన ఐనట్టు
నీ చిలిపి మనసు చేరింది పై మెట్టు
ఇప్పుడేమైనది... ఇంక ముందున్నది
ఇప్పుడేమైనది... ఇంక ముందున్నది
చెప్పమంటావా భామా హరే...

ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..      
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..
చ..చ..చ....

ఈ ముద్దు తొలి ముద్దు ఇంకెప్పుడు ఆపద్దు
ఇవ్వాలి ఏ పొద్దు ఇలాగే...
నా పెదవి ముద్దంటే... నీ పెదవి వద్దంటే
ఆ పైనా రామాహరే....

చరణం: 2
గోడెగిత్త చేని వెంట పడినట్టు...
నా వేడి వయసు ఉరుకుతుంది నీ చుట్టు
కోడె పొగరుంటేమీ... వేడి వయసైతేమీ
కోడె పొగరుంటేమీ... వేడి వయసైతేమీ
కట్టి వేస్తాను భామా హరే...

ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..      
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..
చ..చ..చచ...చ..చచ...

ఈ ముద్దు తొలి ముద్దు ఇంకెప్పుడు ఆపద్దు
ఇవ్వాలి ఏ పొద్దు ఇలాగే...
నా పెదవి ముద్దంటే... నీ పెదవి వద్దంటే
ఆ పైనా రామాహరే....

ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..      
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..
చ..చ..చచ...చ..చచ...

ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..      
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛా ..


********   ********  *******


చిత్రం: లవ్ ఇన్ సింగపూర్ (1980)
సంగీతం:  శంకర్ - గణేష్
సాహిత్యం:  సి.నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
పరువాల పందిట్లో... సరసాల సందిట్లో
నీ పడుచు కౌగిట్లో... నా ముద్దుముచ్చట్లు
ఆ ముద్దుముచట్లో.. గడవాలి నా పొద్దు
ఆ ముద్దుముచట్లో.. గడవాలి నా పొద్దు

చలిగాలి కుంపట్లో... చెలిగాడి గుప్పెట్లో
ఏడెక్కే ఎన్నెట్లో... డీడిక్కి అన్నట్టు
డీడిక్కి అన్నట్లే... గడవాలి నా పొద్దు
డీడిక్కి అన్నట్లే... గడవాలి నా పొద్దు

పరువాల పందిట్లో... సరసాల సందిట్లో

చరణం: 1
జాజులు రువ్విన జాబిలి ఎండల్లో... లాలలల
విరజాజులు విరిసిన నా చెలి గుండెల్లో... లాలలలాల
దాచిన దాగని నీ చలి మోజుల్లో... లాలలలల
తొలి వెచ్చని కౌగిట వేసవి రోజుల్లో... లాలలలల
కౌవ్వింతే ఒక రవ్వంత... లలలల
కలిగింది ఒక రాత్రంతా... లలలల
పులకింతే మణిపూసంతా... లలలల
మిగలాలి మన జన్మంతా... లలలల
చల్లరిపోదంట... తెల్లారనీదంట... ఈ మంట ఇప్పట్లో
చల్లరిపోదంట... తెల్లారనీదంట... ఈ మంట ఇప్పట్లో

పరువాల పందిట్లో... సరసాల సందిట్లో
నీ పడుచు కౌగిట్లో... నా ముద్దుముచ్చట్లు
డీడిక్కి అన్నట్లే... గడవాలి నా పొద్దు
డీడిక్కి అన్నట్లే... గడవాలి నా పొద్దు

చరణం: 2
కోయిల పాడిన తీయని పాటల్లో... లలలల
మది లోయల ఊయల ఊగిన వయసుల్లో... లలలల
అల్లరి కోరికలల్లిన తోటల్లో... లలలల
మరు నిద్దర మరచిన ఇద్దరి మనసుల్లో... లలలల
ఒళ్లంత ఒక తుళ్ళింతా... లలలల
పలికింత తొలి గిలిగింతా... లలలల
వయసెంతో.. ఇక మనసంతా... లలలల
విరిసంతే మన వయసంతా... లలలల
అల్లారు ముద్దంట.. ఆగేది కాదంట.. ఈ గంట ఇప్పట్లో
అల్లారు ముద్దంట.. ఆగేది కాదంట.. ఈ గంట ఇప్పట్లో

చలిగాలి కుంపట్లో... చెలిగాడి గుప్పెట్లో
ఏడెక్కే ఎన్నెట్లో... డీడిక్కి అన్నట్టు
ఆ ముద్దుముచట్లో.. గడవాలి నా పొద్దు
ఆ ముద్దుముచట్లో.. గడవాలి నా పొద్దు




Palli Balakrishna Saturday, August 26, 2017
Annadammula Anubandham (1975)



చిత్రం: అన్నదమ్ముల అనుబంధం (1975)
సంగీతం:  కె.చక్రవర్తి
నటీనటులు: యన్.టి.రామారావు, బాలకృష్ణ, మురళీమోహన్,  లత సేతుపతి, జయమాలిని
దర్శకత్వం: యస్.డి.లాల్
నిర్మాత: యమ్.సీతాంబరం
విడుదల తేది: 04.071975



Songs List:



ఆనాటి హృదయాల పాట సాహిత్యం

 
చిత్రం:  అన్నదమ్ముల అనుబంధం (1975)
సంగీతం:  కె.చక్రవర్తి
సాహిత్యం:  సినారె
గానం: పి. సుశీల & కోరస్ 

పల్లవి:
ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే
ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే
ఆ పాట అధరాలపైన పలికేను ఏనాటికైనా...

ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే... ఇదేలే

చరణం: 1
ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి
ఈ నిలయం కలకాలం శ్రీ నిలయమై నిలవాలి

ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి
ఈ నిలయం కలకాలం శ్రీ నిలయమై నిలవాలి
వెలుతురైనా చీకటైనా విడిపోదు... ఈ అనుబంధం

చరణం: 2
తారకలే దిగివచ్చి తారంగం ఆడాలి
వెన్నెలలే ముంగిటలో వేణువులై పాడాలి

తారకలే దిగివచ్చి తారంగం ఆడాలి
వెన్నెలలే ముంగిటిలో వేణువులై పాడాలి
ఆటలాగా.. పాటలాగా... సాగాలి మన జీవితం




అందమైన పిల్ల ఒకటి పాట సాహిత్యం

 
చిత్రం:  అన్నదమ్ముల అనుబంధం (1975)
సంగీతం:  కె.చక్రవర్తి
సాహిత్యం:  సినారె
గానం:  యస్.పి.బాలు, రామకృష్ణ, సుశీల

పల్లవి:
లా...లా...లా...లా...లా.. లాలాలలా
అందమైన పిల్ల ఒకటి రమ్మన్నదీ
సందెవేళ మల్లెపూలు తెమ్మన్నదీ
ఓ...వెళ్ళేసరికి గదిలో ఏదో
అలికిడి అవుతున్నదీ
అలికిడి వింటే మదిలో ఏదో
అలజడి అవుతున్నదీ
యా...హా...హా..బ..బ...బా..

అందమైన పిల్ల ఒకటి రమ్మన్నదీ
సందెవేళ మల్లెపూలు తెమ్మన్నదీ

చరణం: 1
Hey you miss
will you sing with me?
who..me?... నాకు భయముగా ఉంది
ha ha.. don't you worry.. I am give you a start

లా...లా...లా...లా...లలలలా...
లా...లా...లా...లా...లలలలా...

అందమైన పిల్లవాడు రమ్మన్నాడు..జూ..జూ..జుజూ..
సందెవేళ అందమంత తెమ్మన్నాడు ఆ .హా.. హా..హా...
వెళ్ళేసరికి...ఆ.. ఆ... గాజులు గలగల.. ఆ ఆ ఆ
వెళ్ళేసరికి గాజులు గలగల.. గదిలో వినిపించింది..
గల గల వింటే మదిలో ఏదో..
అలజడి చెలరేగింది...యా...

అందమైన పిల్ల ఒకటి రమ్మన్నదీ
సందెవేళ మల్లెపూలు తెమ్మన్నదీ
వెళ్ళేసరికి గదిలో ఏదో
అలికిడి అవుతున్నదీ
అలికిడి వింటే మదిలో ఏదో
అలజడి అవుతున్నదీ... యా..

చరణం: 2
Hey you young man.. య హూ
will you sing with me?.. sure
give me start beat.. ha ha.. 1 2 3 4

కన్నెపిల్ల కారులోన కనిపించింది... లాలలలా...
కన్ను గీటి నన్ను నేడు బులిపించింది... లాల లాలా
లా...లా..లా.ల..
కన్నెపిల్ల కారులోన కనిపించింది
కన్ను గీటి నన్ను నేడు బులుపించింది

చూపులలోని...ఊఁ.. కైపులలోనా.. చీ
చూపులలోని కైపులలోనా... ఊయల ఊగించింది
ఎన్నడు లేని ఎన్నో ఆశలు.. నాలో ఊరించింది...
యా...హా...హా..బ..బ...బా..




గులాబిపువ్వై నవ్వాలి పాట సాహిత్యం

 
చిత్రం:  అన్నదమ్ముల అనుబంధం (1975)
సంగీతం:  కె.చక్రవర్తి
సాహిత్యం:  దాశరథి
గానం:  యస్.పి.బాలు, సుశీల

పల్లవి:
గులాబిపువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే
ఇలాంటి వేళ ఆడాలి జతగా
ఇలాగె మనము ఉండాలిలే
మనసు దోచి మాయజేసీ
చెలినే మరచిపోవొద్దోయి రాజా... రాజా

గులాబిపువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే

చరణం: 1
వసంతరాణి నీకోసమే ఖుషిగ వచ్చింది
చలాకినవ్వు చిందించుచు హుషారు తెచ్చింది
మయూరిలాగా నీ ముందర నాట్యం చేసేను
వయ్యారిలాగా నీ గుండెలో కాపురముంటాను
వలపుపెంచి మమతపంచి
విడిచిపోనని మాటివ్వాలి రాజా... రాజా
గులాబిపువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే

చరణం: 2
మరీ మరీ నీ అందానికీ సలాము చేసేను
పదే పదే నీ గీతానికి పల్లవి పాడేను
యుగాలకైనా నాదానివై నీవే వుంటావు
అనంతకాలం నీ రూపమే వరించుకుంటాను
మనసు నీదే మమత నీదే..
రేయి పగలు నాలో వున్నది నీవే.. సోనీ

గులాబిపువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే
ఇలాంటి వేళ ఆడాలి జతగా
ఇలాగె మనము ఉండాలిలే
లాలలా లాలలా లాలలా లాలలా




ఆనాడు తొలిసారి పాట సాహిత్యం

 
చిత్రం:  అన్నదమ్ముల అనుబంధం (1975)
సంగీతం:  కె.చక్రవర్తి
సాహిత్యం:  దాశరథి
గానం:  యస్.పి.బాలు, సుశీల

పల్లవి:
ఆనాడు తొలిసారి నిను చూసి మురిశాను నేను
నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను...
ఆనాడు తొలిసారి నిను చూసి మురిశాను నేను
నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను..
ఐ లవ్ యు సోనీ... సోనీ...... ఐ లవ్ యు సోనీ... సోనీ

చరణం: 1
అందాల నీమోము నా కోసమే...  నిండైన నా ప్రేమ నీ కోసమే
అందాల నీమోము నా కోసమే... నిండైన నా ప్రేమ నీ కోసమే
నా మీద ఈనాడు అలకేలనే...  నేరాలు మన్నించి రావేలనే.. ల.. ల.. లల.. ల.. ల

ఐ లవ్ యు సోనీ... సోనీ...... ఐ లవ్ యు సోనీ... సోనీ

వలచింది గెలిచింది నీవేనులే..  నీ ముందు ఓడింది నేనేనులే
వలచింది గెలిచింది నీవేనులే..  నీ ముందు ఓడింది నేనేనులే
కోపాలు తాపాలు మనకేలలే ఇక నైన జత జేరి గడపాలిలే... ల.. ల.. ల

ఐ లవ్ యు రాజా...  రాజా...  ఐ లవ్ యు రాజా...  రాజా

చరణం: 2
చిన్నారి సిరిమల్లె విరిసిందిలే... అనురాగ మధువెంతో కురిసిందిలే
చిన్నారి సిరిమల్లె విరిసిందిలే... అనురాగ మధువెంతో కురిసిందిలే
అధరాలు ఏమేమొ వెతికేనులే... హృదయాలు పెనవేసి ఊగేనులే    ల   ల  లా      

ఐ లవ్ యు రాజా...  రాజా...  ఐ లవ్ యు  సోనీ... సోనీ
ఆనాడు తొలిసారి నిను చూసిమురిశాను నేను
నిను వీడి గడియైన ఏనాడు నేనుండలేను...
ఐ లవ్ యు రాజా...  రాజా...  ఐ లవ్ యు  సోనీ... సోనీ




కౌగిలిలో ఉయ్యాలా పాట సాహిత్యం

 
చిత్రం: అన్నదమ్ముల అనుబంధం (1975)
సంగీతం:  కె.చక్రవర్తి
సాహిత్యం:  దాశరథి
గానం:  యస్.పి.బాలు, జానకి

పల్లవి:
కౌగిలిలో ఉయ్యాలా... కన్నులలో జంపాలా
కౌగిలిలో ఉయ్యాలా... కన్నులలో జంపాలా
కలసి వూగాలిలే... కరిగిపోవాలిలే..  తనివి తీరాలిలే

చరణం: 1
నీ బుగ్గలఫై ఆ ఎరుపు..
నీ పెదవులఫై ఆ మెరుపు
వెలుతురులో.. చీకటిలో..
వెలిగిపోయేనులే.. హే హే.. నన్ను కోరేనులే
నా పెదవుల ఫై యీ పిలుపు.. హో హో..
నా హృదయములో నీ తలపు.. హ హ
వెలుతురులో.. చీకటిలో.. వెలుతురులో
చీకటిలో  నిలిచి వుండేనులే... నిన్ను కోరేనులే      

కౌగిలిలో ఉయ్యాలా... కన్నులలో జంపాలా
కలసి వూగాలిలే... కరిగిపోవాలిలే.. తనివి తీరాలిలే

చరణం: 2
గులాబీలా విరబూసే నీ సొగసు... సెలయేరై చెలరేగేనీ వయసు
అందరిలో ఎందుకనో ఆశ రేపేనులే అల్లరి చేసేనులే
కసిగా కవ్వించే నీ చూపు...  జతగా కదిలించే నీ వూపు
రేయైనా..  పగలైనా.. రేయైనా..  పగలైనా...
నన్ను మురిపించులే...  మేను మరిపించులే      

కౌగిలిలో ఉయ్యాలా...  కన్నులలో జంపాలా
కలసి వూగాలిలే...  కరిగిపోవాలిలే...  తనివి తీరాలిలే




ఆనాటి హృదయాల పాట సాహిత్యం

 
చిత్రం:  అన్నదమ్ముల అనుబంధం (1975)
సంగీతం:  కె.చక్రవర్తి
సాహిత్యం:  సినారె
గానం:  యస్.పి.బాలు

పల్లవి:
ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే
ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే
ఆ పాట అధరాలపైన పలికేను ఏనాటికైనా...

ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే... ఇదేలే

చరణం: 1
ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి
ఈ నిలయం కలకాలం శ్రీ నిలయమై నిలవాలి

ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి
ఈ నిలయం కలకాలం శ్రీ నిలయమై నిలవాలి
వెలుతురైనా చీకటైనా విడిపోదు... ఈ అనుబంధం

చరణం: 2
తారకలే దిగివచ్చి తారంగం ఆడాలి
వెన్నెలలే ముంగిటలో వేణువులై పాడాలి

తారకలే దిగివచ్చి తారంగం ఆడాలి
వెన్నెలలే ముంగిటిలో వేణువులై పాడాలి
ఆటలాగా.. పాటలాగా... సాగాలి మన జీవితం

Palli Balakrishna Friday, August 25, 2017
Ravanude Ramudayithe (1979)



చిత్రం:  రావణుడే రాముడైతే (1979)
సంగీతం: జి.కె. వెంకటేష్
నటీనటులు: నాగేశ్వరరావు, లత సేతుపతి, జయచిత్ర
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: ఎన్. ఆర్.అనురాధాదేవి
విడుదల తేది: 14.02.1979



Songs List:



రవివర్మకే అందని పాట సాహిత్యం

 
చిత్రం:  రావణుడే రాముడైతే (1979)
సంగీతం: జి.కె. వెంకటేష్
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
రవి చూడనీ పాడని నవ్య నాధానివో
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో

ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే
ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే
ఏ మూగభావాలో అనురాగ యోగాలై
ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ...
నీ పాటలే పాడనీ...
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో

ఏ గగనమో కురుల జారి నీలిమై పోయే
ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే
ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై
ఆ ఆ ఆ ఆ ఆ అ ఆ...
ఆ... కదలాడని పాడనీ...

రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
రవి చూడని పాడని నవ్య నాధానివో
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో



కనులలో నీ రూపం... పాట సాహిత్యం

 
చిత్రం: రావణుడే రాముడైతే ( 1979)
సంగీతం:  జి.కె. వెంకటేశ్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం:  యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
కనులలో నీ రూపం... మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం... మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే

కనులలో నీ రూపం... మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం... మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే...

చరణం: 1
నీ గీతి నేనై... నా అనుభూతి నీవైతే చాలు...
పదివేలు... కోరుకోనింక ఏ నందనాలు ...
ఏ జన్మకైనా నీవే నాకు తోడుంటే చాలు...
అంతే చాలు... ఎదలో కోటి రస మందిరాలు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ.. ఆ ఆ ఆ హా హో హో హో హో

కనులలో నీ రూపం... మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం... మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే

చరణం: 2
ఆ కొండపైనే ఆగే మబ్బు తానే ఏమంది... ఏమంటుంది?
కొండ ఒడిలోనే ఉండాలంటుంది
నీ కళ్ళలోనే ఒదిగే బొమ్మ తానే ఏమంది... ఏమంటుంది?
పదికాలాలు ఉంటానంటుంది
ఆ ఆ ఆ ఆ ఆ ఆ... ఆ ఆ ఆ హా హో హో హో హో

కనులలో నీ రూపం... మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం... మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే




ఆకలెంతో దాహమెంతో పాట సాహిత్యం

 
చిత్రం: రావణుడే రాముడైతే ( 1979)
సంగీతం:  జి.కె. వెంకటేశ్
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం:  పి.సుశీల

ఆకలెంతో దాహమెంతో 




ప్రేమంటే తెలుసా నీకు పాట సాహిత్యం

 
చిత్రం: రావణుడే రాముడైతే ( 1979)
సంగీతం:  జి.కె. వెంకటేశ్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి. బాలు 

ప్రేమంటే తెలుసా నీకు 



ఉస్కో ఉస్కో పిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: రావణుడే రాముడైతే ( 1979)
సంగీతం:  జి.కె. వెంకటేశ్
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

ఉస్కో ఉస్కో పిల్లా 



ఉప్పు చేప పప్పు చారు పాట సాహిత్యం

 
చిత్రం: రావణుడే రాముడైతే ( 1979)
సంగీతం:  జి.కె. వెంకటేశ్
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ 
గానం: యస్.పి. బాలు

ఉప్పు చేప పప్పు చారు

Palli Balakrishna Monday, July 24, 2017

Most Recent

Default