Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Yuvaraju (2000)





చిత్రం: యువరాజు (2000)
సంగీతం: రమణగోగుల
నటీనటులు: మహేష్ బాబు, సిమ్రాన్, సాక్షి శివానంద్
దర్శకత్వం: వై. వి.యస్.చౌదరి
నిర్మాత: బూరుగపల్లి శివరామకృష్ణ
విడుదల తేది: 14.04.2000



Songs List:



రామ చిలక హే రామ చిలక పాట సాహిత్యం

 
చిత్రం: యువరాజు (2000)
సంగీతం: రమణగోగుల
సాహిత్యం: వేటూరి
గానం: రమణ గోగుల & కోరస్

రామ చిలక హే రామ చిలక 
రామ చిలక నీ నడక చూసి
గుండె జారిపోయే లలన
వయ్యారి భామ నీ నడుము చూసి
వళ్ళంత వేడెక్కే మదన
తప్పు మాది కాదే పిల్లా టైట్ జీన్స్ వేస్తే
ఆ హక్కు మాకు ఉందే నువ్వే హద్దుదాటిపోతే

what’s up 
hey what’s he doing
check it out
I say check it out

call me prince

హే మిడ్డిలో నువ్వస్తే తొంగి తొంగి చూస్తా
స్టైల్ గా ఫ్రాక్ వేసి నువ్వస్తే పైన చెయ్యి వేస్తా
పిక్క నునుపు చూస్తే మాకు తిక్క రేగిపోయే
హుష్ కన్నె పిల్లా నీతో డాష్ డాష్ డాష్
సోకు దోపిడీలే ఇంక ఏక పీకుడేలే
తిమ్మిరెక్కిపోతే పిల్ల దుమ్ము దులుపుతాలే

come and get it right now
come and get it right now

whats up, whats up, whats up

call me prince

ఓ పాపా ఐరోపా మ్యాప్ లాంటి వీపు
అరె ఓ బాల క్యూబాలా ఉంది నాకు షేప్
హే గుమ్మ వగలు చూస్తే మాకు రిమ్మతెగులు పుట్టే
వెస్ట్ కోస్ట్ పిట్టా నీకే డాష్ డాష్ డాష్
చీర కట్టుకుంటే ఇంకా చిలక కొట్టుడేలే
సిగ్గు జారిపోతే పాప మొగ్గ తుంపుడేలే

రామ చిలక నీ నడక చూసి
గుండె జారిపోయే లలన
వయ్యారి భామ నీ నడుము చూసి
వళ్ళంత వేడెక్కే మదన
తప్పు మాది కాదే పిల్లా టైట్ జీన్స్ వేస్తే
ఆ హక్కు మాకు ఉందే నువ్వే హద్దుదాటిపోతే

don’t stop me don’t stop me




మనసేమో పాట సాహిత్యం

 
చిత్రం: యువరాజు (2000)
సంగీతం: రమణగోగుల
సాహిత్యం: వేటూరి
గానం: చిత్ర, సునీత , రమణ గోగుల

మనసేమో చెప్పిన మాటే వినదు
అది ఏమో ఇవాళ
పెదవుల్లో దాచినదసలే అనదు
అనరాని నిజాలా
ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో
ఆ కళ్ళే ఆశలతో వయస్సులో
ఓ నిమిషం నిట్టూర్పు ఓ నిమిషం మైమరపు
అదేమిటో ఈ కధేమిటో

అధరం మధురం నయనం మధురం
వచనం మధురం వదనం మధురం
చరణం మధురం మధురం మధురం
శ్రీ మధురాధిపతి రఖిలం మధురం

నా పరువం ప్రణయం పయనం
పరుగులే నీ కోసం
నా హృదయం వదనం నయనం
అడిగెను నీ స్నేహం
నీ రూపమే ఆలాపనై నీ చూపుకే నీ దాననై
మౌనాలలో దాచానులే రాగాలిలా మోగాలిలా

ఆ...సరసం విరసం విరహం సరిగమ సంగీతం
ఆ...చరణం చలనం గమనం ఇపుడిక నా సొంతం
అనుకున్నదే చెప్పాలని అనుకోనిదే అడగాలని
ఊరేగిన నా ఊహల మేఘాలలో తేలానులే

మనసేమో చెప్పిన మాటే వినదు
అది ఏమో ఇవాళ
పెదవుల్లో దాచినదసలే అనదు
అనరాని నిజాలా

ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో
ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో



ఓలమ్మొ ఓలక్కో పాట సాహిత్యం

 
చిత్రం: యువరాజు (2000)
సంగీతం: రమణగోగుల
సాహిత్యం: వేటూరి
గానం: రమణ గోగుల, నందిత

ఓలమ్మొ  ఓర్నానో ఓలక్కో ఓరయ్యో
నీ జిమ్మడపోను

ఓలమ్మొ ఒల్లంత రుద్ది వల్లో వయ్యరమద్ది
నా దుంప తెంచమాక
ఓర్నానో ఒద్దంటె వచ్చి ముల్లే మెత్తంగ గుచ్చి
నా కొంప ముంచమాకా
ఒలక్కో తిక్క ముదిరే -- ఒరయ్యో దిమ్మతిరిగే
అరె పిడికెడు నడుమున కలబడు చెడుగుడులో

చరణం: 1
ఎర్రబడ్డ హమాషా వెన్నెలలో
పెదాలిచ్చి పుచ్చుకుంటా
పచ్చబడ్డా తమాషా పొత్తులలో
పదారేల్లూ ఇచ్చుకుంటా

ఆకురాయి ఆకుదులిపి రాయివిసురూ
నేతిబీరా పేరు చెబితే నెయ్యి కరుగు

మన ఊగుడు పాటకు దాగిన తాళపు రేగిన అల్లరిలో

ఓలమ్మొ ఒల్లంత రుద్ది వొల్లో వయ్యరమద్ది
నా దుంప తెంచమాక
ఓర్నానో ఒద్దంటె వచ్చి ముల్లే మెత్తంగ గుచ్చి
నా కొంప ముంచమాకా

చరణం: 2
నిచ్చెనేస్తా నిషాల నిద్దరలో
హలో అంటా రంభ వస్తే

ఇచ్చి చూస్తా కులాసా మబ్బులనీ
పలో అంటా వాన వస్తే

పాలరాయీ పాలుతీసి తోడు పెట్టూ
జీలకర్ర కర్రతోటీ గూడు కట్టూ

అరె యెక్కడిదొంగలె అక్కడె నక్కిన తొక్కిసలాటలలో

ఓలమ్మొ ఒల్లంత రుద్ది వొల్లో వయ్యరమద్ది
నా దుంప తెంచమాక
ఓర్నానో ఒద్దంటె వచ్చి ముల్లే మెత్తంగ గుచ్చి
నా కొంప ముంచమాకా




అరే నూకలిస్తే మేకలు కస్తావా పాట సాహిత్యం

 
చిత్రం: యువరాజు (2000)
సంగీతం: రమణగోగుల
సాహిత్యం: వేటూరి
గానం: శంకర్ మహదేవన్,, నందిత & కోరస్

ఆ...ఆ...
అరె నూకలిస్తే మేకలు కాస్తావా
మరి మేకలొస్తే తోకలు కోస్తావా
సరె కోకలిస్తే సోకులు ఇస్తావా
సన రైకలిస్తే రాతిరికొస్తావా

అరె నూకలిస్తే మేకలు కాస్తావా
మరి మేకలొస్తే తోకలు కోస్తావా
సరె కోకలిస్తే సోకులు ఇస్తావా
సన రైకలిస్తే రాతిరికొస్తావా

నాకున్నవన్ని నీకే ఇచ్చేస్తే
ఎన్నెల్లు నేతప్పను 
మన ఊరోళ్ళకేం చెప్పను
మావిల్లు కొని తెచ్చుకో
తొలి వేవిళ్ళు అని చెప్పుకో

అరె నూకలిస్తే మేకలు కాస్తావా
మరి మేకలొస్తే తోకలు కోస్తావా
సరె కోకలిస్తే సోకులు ఇస్తావా
సన రైకలిస్తే రాతిరికొస్తావా

ఓల ఓలమ్మోలాల కోకే కాకెత్తుకు పోతే
లేపి నీ సాయం కోరే వానా కాలంలో
కూతలేమో కుయ్యకులే చేతల్లో చూపించే 
దమ్ముంటే చెంతకుచేరి అంతా దోచుకుపో

వాయిదాలు చెళ్ళవింక వానా కాలంలో ఇక
ఇక రేయి పగలు లేనే లేవు ప్రేమాకాలంలో
సిగ్గులన్ని భగ్గుమన్న శీతాకాలంలో దువ్వు
లగ్గమెట్టి దగ్గరవ్వు రామాకాలంలో

హే చూపుల్తో చిక్కొచ్చింది
చూడందే పిచ్చెక్కింది 
మోగ్గొచ్చి పువ్వును తట్టింది
వెన్నెల్లో నువ్వే గొడుగేసుకో
జడి వానల్లో తలదాచుకో
కన్నుల్లో నువ్వే కల దాచుకో
బిగి కౌగిట్లో చెలి కాసుకో

అరె నూకలిస్తే మేకలు కాస్తావా
మరి మేకలొస్తే తోకలు కోస్తావా
సరె కోకలిస్తే సోకులు ఇస్తావా
సన రైకలిస్తే రాతిరికొస్తావా

కొక్కరకోల కోడై ఈడు కూసే రోజుల్లో మనం
కుక్కిమంచం కూని రాగం తీసే వేళల్లో

జాజిమల్లే జాగారాలు చేసే ప్రాయంలో 
జామురాతి జాబిలమ్మఆడే బేరంలో

హే మాటల్తో అలుపొచ్చింది
చేతలకే పిలుపొచ్చింది
పిట్టొచ్చి పండును కొట్టింది
మరదళ్ళ తనము వచ్చేసింది
తిరగల్లో నడుమే గిచ్చేసింది
అరచేయిని నువ్వే గిల్లేసుకో
తొలి రేయంతా అల్లేసుకో

అరె నూకలిస్తే మేకలు కాస్తావా
మరి మేకలొస్తే తోకలు కోస్తావా
హేయ్ పిల్ల కోకలిస్తే సోకులు ఇస్తావా
సన రైకలిస్తే రాతిరికొస్తావా

నాకున్నవన్ని నీకే ఇచ్చేస్తే
ఎన్నెల్లు నేతప్పను 
మన ఊరోళ్ళకేం చెప్పను
అబ్బా...మావిల్లు కొని తెచ్చుకో
తొలి వేవిళ్ళు అని చెప్పుకో




హాయ్ రే హాయ్ రబ్బా హయ్ రబ్బా పాట సాహిత్యం

 
చిత్రం: యువరాజు (2000)
సంగీతం: రమణగోగుల
సాహిత్యం: వేటూరి
గానం: ఉదిత్ నారాయణ్, చిత్ర

హాయ్ రే హాయ్ రబ్బా  హయ్ రబ్బా 



తొలి వలపే తీయనిది పాట సాహిత్యం

 
చిత్రం: యువరాజు (2000)
సంగీతం: రమణగోగుల
సాహిత్యం: వేటూరి
గానం: హరిహరన్, చిత్ర

తొలి వలపే తీయనిది ఆ దాహం తీరనది
కాలంలా కరిగిపోనిది ప్రాణంలా తిరిగిపోదది
తొలి వలపే తీయనిది ఆ దాహం తీరనది

 
వేదంలాగ లిపి లేనిది ... వేధిస్తున్న సుఖమైనది
ఓడిస్తున్న గెలుపే అది ... ఓదార్చె ఓ పిలుపైనది
చుక్కలనె నిలుపునది ... దిక్కులనె కలుపునది
ఆకాశం తానై ఉన్నది

ఒక్కరిలో ఇద్దరది ఇద్దరిలో ఒక్కటది
నీకోసం నేనై ఉన్నది
తొలి వలపె ... ఆ బాధే ... 

గుండెల్లోన గూడె ఇది ... గుచ్చే రోజామాలే అది
మాటల్లోన మౌనం అది ... మనసుల్లోన ధ్యానం అది
యే రుణమో తెలియనిది ... యే వరము అడగనిది
యే మజిలి చేరేనో అది

ఎప్పటిదో యెరుగనిది ఎన్నటికి మరువనిది
ఓ కధల చేరే కంచికి
తొలి వలపె తీయనిది ... ఆ బాధే తీరనది
యెదకన్న లోతుగుంటది ... బ్రతుకల్లె తోడు ఉంటది




చందమామ కన్నా చల్లని వాడే పాట సాహిత్యం

 
చిత్రం: యువరాజు (2000)
సంగీతం: రమణగోగుల
సాహిత్యం: వేటూరి
గానం: రమణగోగుల, సునీత, అనురాధ శ్రీరాం

So tell me about him
నిజంగా వినాలనుందా
come on what’s he really like
మరి వినైతే

he’s so hot he’s so cool
he’s so strong he’s no fool
i like the way he talks
i like the way he walks

అహా ఇంకేంటో
అసలు కధ ముందుంది వినుమరి

లాలాల లాల హు హు హు

చందమామ కన్న చల్లని వాడే
చిన్ని కృష్ణయ్య లాగ అల్లరి వాడే
కొదమసింహ. మంటి నడకల వాడే
కొండమల్లి పువ్వులా నవ్వుల వాడే

రాజు లా నట్ యువ రాజులా
మోజులా విరహపు జాజులా
పగలే నడిపించాడే హే

చందమామ కన్న చల్లని వాడే

సందె కాడ సయ్యాటలు ఓ యమ్మ
సందు చుసి కన్ను కొట్టాడే
చెంత చేర వస్తాడులే ఓ యమ్మ
చింత తీర్చి పోతాడులే

ఓ హొ హోయ్ ఓ హొ హోయ్

ఆ కన్నే తేనె ముళ్లు
ఆ నవ్వే హయి జల్లు
వాడే నా వాన విల్లు
వర్ణాల బొమ్మరిల్లు
వాడి బగ్గలు బంతి పూలు
వాలు చూపులు వాడి ముల్లు
వాడి సైగలు చెంప గిల్లు
కన్నే గుండెలు చెమ్మగిల్లు
ఎంత మగధీరుడే

చందమామ కన్న చల్లని వాడే

don’t you worry she will be mine
got to hurry it’s a matter of time
don’t you worry she will be mine
got to hurry it’s a matter of time

ఆ రాక, రాక రాక ఎద కొచ్చే ఏరువాక
ముసి నవ్వు గడపదాక
ఎదురొచ్చే ముగ్గు రేఖ
వాడు వెన్నెల గోరువంక
వాడు మన్మధ లేత మొలక
వాడి ఎత్తులు నింగిదాక
వాడు వెన్నెల వెండి తునక
ఎంత సుకుమారుడే

చందమామ కన్న చల్లని వాడే
చిన్ని కృష్ణయ్య లాగ అల్లరి వాడే

haa he’s so cute…..he’s is a lot of fun
he’s my love…..he’s is number one
he’s is so smooth…..like a morning sun
yes my friend…..he is number one 



గుంతలకడి గుంతలకడి గుమ్మ ఓ గుమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: యువరాజు (2000)
సంగీతం: రమణగోగుల
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి.బాలు, చిత్ర,   రమణగోగుల

దీరారారే తరరరారేరార
దీరారారే తరరరారేరార

ధిన ధిన థా... ధిన ధిన థా... 
ధిన ధిన కృష్ణా కృష్ణా హే కృష్ణా కృష్ణా
కృష్ణా కృష్ణా హే కృష్ణా కృష్ణా

గుంతలకడి గుంతలకడి గుమ్మ ఓ గుమ్మ 
మనసే దోచుకు పోయిందిరో
గుంతలకడి గుంతలకడి గుమ్మ ఓ గుమ్మ 
మనసే దోచుకు పోయిందిరో

వయ్యారం వైజాగ్ జగదంబ సెంటర్ లా ఉంది
సింగారం ఒంగోలు బస్టాండల్లే బాగుంది
జై హనుమాను జంక్షన్ లాగ
ఈడు జోడు కలిపేసి పోయింది

గుంతలకడి గుంతలకడి గుమ్మ ఓ గుమ్మ 
మనసే దోచుకు పోయిందిరో

లా లా ల
ల లా లా  లల లాలాల
ల లా లా  లల లాలాల

కృష్ణా మురారే యమునా తీరే
మనసే తీరే చెలి వేణువును వాయించు
రాధా సమీపే ప్రేమా కలాపే
పెదవుల తీపే తొలి ముద్దులిక చెల్లించు

చూపులకు కన్నయ్య - కృష్ణయ్య
చేతలిక ఎన్నయ్య -;కృష్ణయ్య
వాడి ఎద వెన్నమ్మ - కృష్ణయ్య
వాడి కథ లెన్నమ్మ ఈలనుకో గోలనుకో 
లీలనుకో ప్రేమల ఉరవడి

గుంతలకడి గుంతలకడి గుమ్మ ఓ గుమ్మ 
మనసే దోచుకు పోయిందిరో

ఆలారే కృష్ణా అల్లరి కృష్ణా
అందాల కృష్ణయ్య అందరి కృష్ణయ్య

కృష్ణా కృష్ణా హే కృష్ణా కృష్ణా
కోలాటం ఆడే కొంగుల కృష్ణా
సయ్యాటలాడే సందడి కృష్ణా
కృష్ణా కృష్ణా హే కృష్ణా కృష్ణా

ఓ చారుశీల చంపక మాల 
చామంతి బాల భళా ఒకపరి రావేలా
మువ్వా గోపాలా యే మురిపాల
నిను తడపాల సరే నాకు సరి నీవేలే

గోకులపు లాహిరివో కృష్ణయ్య
కొరికల రాతిరివో కృష్ణయ్య
గోవులకు కాపరివో కృష్ణయ్య
గోపికల ఊపిరివో కృష్ణయ్య
రేపనుకో మాపనుకో ఆపనుకో
ఆపని త్వరపడి

గుంతలకడి గుంతలకడి గుమ్మ ఓ గుమ్మ 
మనసే దోచుకు పోయిందిరో
వయ్యారం వైజాగ్ జగదంబ సెంటర్ లా ఉంది
సింగారం ఒంగోలు బస్టాండల్లే బాగుంది
జై హనుమాను జంక్షన్ లాగ
ఈడు జోడు కలిపేసి పోయింది

గుంతలకడి గుంతలకడి గుమ్మ ఓ గుమ్మ 
మనసే దోచుకు పోయిందిరో

తక్ ధిన ధిన్ ధిన ధిన్
తక్ ధిన ధిన్ ధిన ధిన్
ధిన ధిన థ... ధిన ధిన థ...
ధిన ధిన కృష్ణా కృష్ణా హే కృష్ణా కృష్ణా 
కృష్ణా కృష్ణా హే కృష్ణా కృష్ణా కృష్ణా



ట్వింకిల్ ట్వింకిల్ పాట సాహిత్యం

 
చిత్రం: యువరాజు (2000)
సంగీతం: రమణగోగుల
సాహిత్యం: వేటూరి
గానం: రమణగోగుల

Twinkle, twinkle, little star
How I wonder what you are
Up above the world so high
Like a diamond in the sky…
Twinkle, twinkle twinkle
Twinkle, twinkle twinkle

Most Recent

Default