చిత్రం: లంబాడోళ్ల రామదాసు (1978)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
నటీనటులు: చలం, రోజారమణి, ఫటాఫట్ జయలక్ష్మి, నరేషంహ రాజు
దర్శకత్వం: కె.బాబూరావు
నిర్మాత: కె.ఎ.ప్రభాకర్
విడుదల తేది: 1978
ఈ సినిమా షూటింగ్ 1978 లో పూర్తయింది, ఈ చిత్రం 1991 లో విడుదలైంది.
ఈ పాల వెన్నెల్లో.. నీ జాలి కళ్ళల్లో.. పాట సాహిత్యం
చిత్రం: లంబాడోళ్ల రామదాసు (1978)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
పల్లవి:
ఈ పాల వెన్నెల్లో.. నీ జాలి కళ్ళల్లో..
ఈ పాల వెన్నెల్లో.. నీ జాలి కళ్ళల్లో..
ఇద్దరూ ఉన్నారు... ఎవ్వరూ వారెవరు
ఇద్దరూ ఉన్నారు... ఎవ్వరూ వారెవరు
ఈ పాల వెన్నెల్లో... నా జాలి కళ్ళల్లో
ఈ పాల వెన్నెల్లో... నా జాలి కళ్ళల్లో
ఇద్దరూ ఒకరేలే... ఆ.. ఒక్కరూ నీవేలే..
ఇద్దరూ ఒకరేలే... ఆ.. ఒక్కరూ నీవేలే..
చరణం: 1
చుక్కలే నిను మెచ్చీ.. పక్కనే దిగి వచ్చీ
చుక్కలే నిను మెచ్చీ.. పక్కనే దిగి వచ్చీ
మక్కువే చూపితే.. నన్ను మరచేవో
నన్ను మరచేవో
చుక్కలు వేలువున్నా.. నా చుక్కి ఒక్కతే కాదా
చుక్కలు వేలువున్నా.. నా చుక్కి ఒక్కతే కాదా
లక్షల మగువలువన్నా... నా లక్ష్య మొక్కటే కాదా...
నా లక్ష్మి ఒక్కతే కాదా...
ఈ పాల వెన్నెల్లో.. నీ జాలి కళ్ళల్లో..
ఇద్దరూ ఉన్నారు... ఎవ్వరూ వారెవరు
ఇద్దరూ ఒకరేలే... ఆ.. ఒక్కరూ నీవేలే..
చరణం: 2
తుంటరీ చిరుగాలీ.. కొంటెగా నును చూసీ
తుంటరీ చిరుగాలీ.. కొంటెగా నును చూసీ
పైటనే కాజేస్తే... ఏమి చేస్తావో..
ఏమి చేస్తావో..
పైటే ఏమౌతుంది.. నీ చేతిలోన అదివుంటే
పైటే ఏమౌతుంది.. నీ చేతిలోన అదివుంటే
స్వర్గం దిగి వస్తుందీ.. నా సామితోడుగా వుంటే
నా రాముని... నీడ వుంటే...
ఈ పాల వెన్నెల్లో.. నీ జాలి కళ్ళల్లో..
ఇద్దరూ ఉన్నారు... ఎవ్వరూ వారెవరు
ఇద్దరూ ఒకరేలే... ఆ.. ఒక్కరూ నీవేలే..
ఆహా... హా.. ఊ.. ఊహ్.. ఊహ్మ్...
మాటంటే నీదేలే పాట సాహిత్యం
చిత్రం: లంబాడోళ్ల రామదాసు (1978)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు
మాటంటే నీదేలే, మనిషంటే నీవేలే, లంబాడొల రామదాసా
మంచిని మించిన మతం లేదురా, గుణమును మించిన కులం లేదురా
గుండెను మించిన గుడే లేదురా, దయను మించిన దైవం లేదురా
ఎంతగా దున్నితే నేల అంతగా పదునవుతుంది
ఎంత సానపెడితే వజ్రం అంతగా మెరుస్తుంది
ఎంత శాంతముంటే మనిషికి అంత సౌఖ్యం కలుగుతుంది
గోవుల వన్నెలు వేరైనా, పాలు తెలుపేరా
మనుషుల రంగులు వేరైనా, రక్తం ఎరుపేరా
పిల్లల గుణాలు వేరైనా, తల్లికి అందరు ఒకటేరా
శివ శివ అనరే పాట సాహిత్యం
చిత్రం: లంబాడోళ్ల రామదాసు (1978)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం:
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి
శివ శివ అనరే
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.జానకి & బృందం
కోరస్:
కొండల కోనల సూరీడు కురిసె బంగారు నీరు!
పిలిసె వురకేసే యేరు!
ఆ మావి గుబురు, హెయ్ హెయ్
ఆ సింత సిగురు, హెయ్ హెయ్
ఆ యెనక పిలిసేటి యేరూ - పదవే - పదవే
పిలిసే పచ్చన్నీ బీడు, కదలే గొర్రెల బారు ॥ కొండల॥
హెయ్! జోడెడ్ల యీ బండీ-జోడు చెక్రాల బండీ
గాజుల గలగల యింటే కదలనంటదీ బండి !
అందెల సందడి వుంటే ఆగి వింటది!
కోరస్:
ఎండల్లొ వానల్లో చీకట్లొ యెన్నెల్లో,
మా వెంట వుండి, - మాకు కాపుండి,
కరుణించీ మమ్మేలగా, తల్లీ, గిరినుంచి దిగివస్తివా?
కొమ్మల రెమ్మల కదిలేను
నెమ్మదిగా పిల్లగాలీ, నల్ల మలల పిల్లగాలి!
కోతకు సింతల సిగురుంది!
పూతకు మామిడి పువ్వుంది !
లేత సింత సిగురల్లె కోత కొచ్చిన వయసు !
పూత మావి పూవల్లె పూత కొచ్చిన పడుసు!
ఊగేది సెంగావి సెంగు! దాన్ని లాగేవు కొంటే కోణంగు !
మత్తెక్కి సూసేవు నువ్వు, నిన్ను మక్కలిరగ దన్నేరు సూడు
గట్టుకాడ ఎవరో సెట్టునీడ ఎవరో పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.జానకి
పల్లవి:
గట్టుకాడ ఎవరో సెట్టునీడ ఎవరో
నల్లకనుల నాగసొరము వూదేరు ఎవరో
గట్టుకాడ ఎవరో చెట్టునీడ ఎవరో
నల్లకనుల నాగసొరము ఊదేరు ఎవరో
చరణం: 1
ఓ...ఓ...
పోటుపాటు సూసుకొని ఏరు దాటి రావాలా
ముళ్ళు రాళ్ళు ఏరుకోని మందతోవ నడవాలా
ఆగలేక రాచకొడక సైగ చేసెవెందుకో సైగెందుకూ
ఏటిగట్టుకాడ మావిచెట్టునీడ ఎవరో ఎవరో
నల్లకనుల నాగసొరము ఊదేరు ఎవరో
చరణం: 2
ఓ...ఓ..
పైరుగాలి పడుచుపైటా పడగలేసి ఆడేను
గుండె పైనీ గుళ్ళ పేరు ఉండలేక ఊగేను
తోపు ఎనక రాచకొడక తొంగి చూసేవెందుకో
నీవెందుకూ సైగెందుకూ
ఏటిగట్టుకాడ మావిచెట్టునీడ ఎవరో ఎవరో
నల్లకనుల నాగసొరము ఊదేరు ఎవరో
పదములె చాలు-రామా ! పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: ఏ.పి.కోమలి
పదములె చాలు-రామా !
నీ పద ధూళులె పదివేలు!
నీ పదములె చాలు, రామా!
నీ పద మంటిన పాదుకలు
ముమ్మాదుకొని ఈ జగమేలు!
నీ పదములె చాలు రామా
నీ దయ గౌతమి గంగ-రామయ !
నీ దాసులు మునుగంగా !.... రామా....
నా బ్రతుకొక నావ
దానిని నడపే తండ్రివి నీవా !
నీ పదములె చాలు రామా.... ....
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.పి.బాలు
పైరుగాలీ పడుసు పైట పడగలేసి ఆడేను!
గుండెపైని గుళ్ల పేరు వుండలేక వూగేను-
ఆగలేక, రాస కొడకా - సైగ చేసేవెందుకు ?
సెగెందుకు ?
గట్టుకాడ ఎవరో ! - సెట్టునీడ ఎవరో !
నల్ల కనుల నాగస్వరము ఊదేరు ఎవరో....
శ్రీ గిరి శిఖర విమాన విహారీ పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.జానకి, యస్.పి.బాలు
శ్రీ గిరి శిఖర విమాన విహారీ
శ్రీ శివ మూర్తి దేవేరీ
ఔనని సెలవిమ్మా
తల్లీ -అవునని సెలవిమ్మా
ఒక నాటిదా పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: కోమలి & బృందం
ఒక నాటిదా,
ఒక చోటిదా,
కడచిన ఎన్నో జన్మల దారుల నడచి వచ్చినది మీ జంట!
రాగల ఎన్నో జన్మల దాకా సాగును పున్నెపు పంట!
మీ అనురాగపు పంట!
పగలైతే దొరవేరా పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.జానకి
పగలైతే దొరవేరా - రాతిరి నా రాజువురా!
పక్కనా నువ్వుంటే - ప్రతి రాత్రీ పున్నమిరా! ॥ పగలై తే ॥
పగలైతే నాలో నీ సొగసంతా దాగేరా !
రేయైతే వెన్నెలగ బయలంత నిండేరా !
రాతిరి నా రాజువురా !
నే కొలిచే దొరవై నా-నను వలచే నా రాజువే !
కలకాల మీలాగె నిలిచే నీ దాననే !
పక్కనా నువ్వుంటే - ప్రతి రాత్రి పున్నమిరా ॥ పగలైతే ॥
మనిషే మారేరా, రాజా పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.జానకి, యస్.పి.బాలు
మనిషే మారేరా, రాజా,
మనసే మారేరా !
మనసులో - నా మనసులో,
సరి కొత మమత లూరేరా! ॥ మనిషే ||
ఏచోట దాగేనో ఇన్నాళ్ళూ ఈ సొగసు
ఆ తోట పువులేనా - అలనాటి లతలేనా ॥ మనిషే ॥
ప్రతి పొదలో ప్రతి లతలో
పచ్చనాకులు గూడేరా !
గూట గూట దాగుండి కొత్త గువ్వపాడేరా ॥మనిషే ॥
అడుగడుగున జగమంతా అనురాగపు కనులకు
కులుకుతూ కొత్త పెళ్ళి కూతురిలా తోచెనే !
ఆనాటివె పువులై నా - అలనాటివె లతలైనా !
మనసే మారేనే - రాణీ - మనసే మారేనే
చల్లరమ్మా, తల్లులూ పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: శూలమంగళం రాజ్యలక్ష్మి & బృందం
చల్లరమ్మా, తల్లులూ, మీ చల్లనీ దీవనలవాన!
చల్లగా నూరేళ్లుగా వర్ధిల్లగా మా పాపపైన !
దేవదేవుడె వచ్చి పాపకు దీవనలు దయచేయును
పూవులన్నా పాపలన్నా దేవదేవుని పిల్లలే !
కోరస్:
చల్లరమ్మా తల్లులూ మీ చల్లని దీవనల వాన!
చల్లగా నూరేళ్లుగా వర్ధిల్లగా మా పాపపైన
జో కొడుతూ కథ చెబితే పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.జానకి
జో కొడుతూ కథ చెబితే
ఊ కొడుతూ వింటావా !
నా కన్న పాపా-నే కన్న పాపా .... జో .... జో ....
ఒక కొండ - ఒక కనుమ - ఆ రెంటికి నడుమ -
అనగనగా ఒక తోట, పచ్చన్నీ తోట!
ఆకాశమంతేసి గూడుండే చోట,
ఆ తోట ఒక చిలుక -ఆడేది పాడేది
అది రామ చిలుక - జో-జో-జో
ఒకనాడు వచ్చాడు ఒయ్యారి దొరకొడుకు
ఆ తోట కడకు !
వలచింది రాచిలుక, ఆ రాజు కొడుకు!
వాలింది వగకాని వలకేలి పైని !
బంగారు పంజరపు బ్రతుకై పోయింది ॥ జో-జో ॥
కోనైతే పిలిచేనూ - కొండా పిలిచేనూ
ఆకాశమంతేసి ఆ గూడు పిలిచేనూ
ఎగరని రెక్కలతో -పగిలిన గుండెలతో
పంజరపు బ్రతుకాయె ఓ రామచిలుకా !
బంగారు పంజరపు బ్రతుకాయె ఓ రామచిలుకా!
ఎల్లవేళ నిజం చెప్పరా పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: బసవేస్వర్, స్వర్ణలత
ముని : ఎల్లవేళ నిజం చెప్పరా
పద్మ : దూ-దూ-దూ
ముని : తల్లి తండ్రి మాట వినరా
పద్మ : దూ-దూ-దూ -
ముని : ఎదుటి వారి మేలు కోరరా
పద్మ : దూ-దూ-దూ -
ముని : అబ్బబ్బ
పద్మ : నిజం చెప్పరా
ముని: అన్నన్నా
పద్మ : బలాదూరుగా
ముని : అమ్మమ్మ
పద్మ : మేలు కోరరా
యిద్దరు : అయ్యయ్యొ-మరీ హోరుగా
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.జానకి
శ్రీగిరి శిఖర విమాన విహారీ
శ్రీ శివ మూర్తి దేవేరీ
నీ వరమిది కాదా - తల్లీ
నీ దయ యిక లేదా
తల్లీ! శరణము మరిలేదా !
నీ వెరిగిన కథ చెబుతా పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: జానకి
నీ వెరిగిన కథ చెబుతా
నిదరోతూ వినవా ?
నా కంటి వెలుగా- నా గూటి పులుగా
కథ వింటే కలలెన్నో కదలాడునేమో
ఆ కథలో వ్యధలెన్నో మెదలాడునేమో ! జో-జో
ఒక కొండ - ఒక కనుమ
ఆ రెంటికి నడుమ ఉండే దొక తోట
ఆ తోట ఆడేది పాడేదొక పిల - ఒక పేదపిల
ఆ తోట అందాల దొరనే చూసింది
చూసి చూసీ మనసిచ్చి వేసింది ఆ పేదపిల్ల !
గట్టు కాడ ఎవరో చెట్టు నీడ ఎవరో -II పాట సాహిత్యం
చిత్రం: బంగారు పంజరం (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.జానకి
గట్టు కాడ ఎవరో చెట్టు నీడ ఎవరో
నల్ల కనుల నాగస్వరమూ వూదేరు ఎవరో !
అయ్యకు బువ్వ పెట్టాలా ! పెయ్యకు మువ్వ కట్టాలా
ఒక్కటొక్కటే కొండ పైకి, సుక్కదీపం రాకమును పే
రాక మును పే
ఏటి గట్టుకాడ
మావి సెట్టునీడ – ఎవరో
కళ్ళనిండ నీళ్ళు నింపి
సూసేరు ఎవరో !
కళ్ళు విప్పి రాచ కొడకా నా కోసం చూడవా
మన పాప కోసం చూడవా! || గట్టు కాడ ||
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నటీనటులు: జగ్గయ్య, కృష్ణ , జమున, విజయ లలిత, అంజలీ దేవి
దర్శకత్వం: పి. సాంబశివ రావు
నిర్మాత: అమరారామ సుబ్బారావు
విడుదల తేది: 22.06.1973
Songs List:
పిల్లా పాపల చల్లని గూడు పాట సాహిత్యం
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరధి
గానం: ఘంటసాల
పిల్లా పాపల చల్లనిగూడు
చెల్లా చెదురై పోయెను నేడు
ఒకరిది నేరం - ఒకరికిభారం
జీవిత నావకు లేదా తీరం
ఏమైపోవునొ ఈ సంసారం
చరణం: 1
మంచిని మెచ్చే మనిషే లేడు
మచ్చను చూపును ప్రతివాడు
ఇన్ని తరాల యింటి గౌరవం
ఒక్క నిందతో మంటగలిసెరా
చరణం: 2
కన్నీళ్ళైనా కషాలెనా
అన్నిభరించే అమ్మవు నీవు
పిల్లలకోసం జీవించాలి
నిండుకుటుంబం నిలపాలి
చరణం: 3
పసిహృదయానికి తగిలెను గాయం
యెవ్వరులేరు నీకుసహాయం
వయసుకుమించిన పంతంతో
పయనించే ఓ పసివాడా
విజయం నీదే నీదేరా !
అవలీలగా శ్రీరాముడు శివధనువును (పద్యం) పాట సాహిత్యం
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరధి
గానం: పి. సుశీల
అవలీలగ శ్రీరాముడు
శివధనువును విరిచినంత
చిత్తము పొంగన్
నవ సుమ మాలను చేకొని
అవనీ సుత వచ్చి నిలిచె అతని ఎదుటన్
అందమునకె అందమైన సీతమ్మను
ప్రేమమీద చూచె రామమూర్తి
వీరవరుల కెల్ల వీరుడా రాముని
సంతసమున కాంచే జనక జాత
కొంత పులకరింత కొంత చక్కలిగింత
అతని చూచినంత అదొక వింత
పూలమాలతోడ - బాలనిండు మనమ్ము
స్వామి కంఠసీమ వ్రాలిపోయె
ఎవరు కారణము పాట సాహిత్యం
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి. సుశీల, కె.హరిరావు
ఎవరు కారణము
ఈ లోకమిలా - అల్లకల్లోల మగుటకు
ఎవరు కారణము
ప్రతి మనిషీ బాధలు పడుతున్నాడు
ప్రతి దానికి దేవుని తిడుతున్నాడు
దేవుడు పాపం అలోచించాడు
మనిషికి పాఠం నేర్పాలనుకున్నాడు
సృష్టించాడొక స్త్రీ మూ ర్తిని
చేశాడు రెండుగా దానిని
తెల్లనిదే మంచిన్నాడు- నల్లనిదే చెడుగన్నాడు
అల్లదిగో మానవలోకం-అక్కడికే పొమ్మన్నాడు
మంచిని నేను
మీ మంచికోరి వచ్చాను...మంచిని నేను
మీ హృదయాల్లో చోటిస్తే వుంటాను
ఉండి-మిమ్మల్ని మనుషులుగా చేస్తాను
రావమ్మా | రావమ్మా ! మా మంచి
ఏమి తెచ్చావు మాకు దీనినించి
చీకటి పోగొడతాను
మీలో చీలికలన్నీ మాన్పుతాను
అందరి నొకటిగ చేస్తాను.
ఆనందం-అందం-అందిస్తాను
సమతా-మమతా పండిస్తాను
శాంతి- సౌఖ్యం-పంచేస్తాను
ఆకలి శోకం లేనిరాజ్యం రామరాజ్యం
మీలోకంలో స్థాపిస్తాను.
నేను నేనే
నేను నేననే అహం నేనే
నాది నాదనే స్వార్ధం నేనే
బలే బలే నువ్వేకావాలి
పక్కవాడిని తొ క్కెయ్యాలి
గొంతు పిసికి పారెయ్యాలి!
గొయ్యి తవ్వి పూడ్చెయ్యాలి!
అన్నీ చేసాను-మీ ఆశలు తీరుస్తాను
ధర్మాన్ని ఉరి కెక్కిసాను
అధర్మాని కే పట్టం కడతాను
రాజకీయ రాక్షసి నా రూపం
రాపిడి దోపిడి నా రాజ్యం
ఫిరంగి నాకు మృదంగము
ప్రేతభూమి నా నాట్యరంగము
మీరే, మీరే |
ఎవరికివారే కారణము
ఈ మంచి వున్నది మీలో నే
ఈ చెడ వున్నదీ మీలోనే
మంచిని మీలో పెంచుకోవాలి
చెడునుదాంతో గెలుచుకోవాలి
ఈ జగతి స్వర్గం చేసుకోవాలి
ఈవేళ పాడేటి పాట సాహిత్యం
చిత్రం: నిండు కుటుంబం (1973)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: గోపి
గానం: పి.సుశీల
ఈవేళ పాడేటి పాటా
నేడూ రేపూ వినిపించు నీ వున్నచోటా
ఏ నాటికీ
ముమ్మూలకీ
చరణం: 1
మనసుంది. మన లేవు నీవూ
తనువుంది కనరాను నేనూ
చిరుగాలి నేనూ- తెరచాప నీవూ
యేనాడు చేరేము రేవూ
చరణం: 2
మన కేసిపోయేను హృదయం
చేజారిపోనీకు సమయం
మనవింత స్నేహం వెలిగించుదీపం
తొలగించు నీపైన శాపం
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, పి. సుశీల
పల్లవి:
ఆడవాళ్ళ కోపంలో అందమున్నది
అహ అందులోనే అంతులేని అర్ధమున్నది అర్ధమున్నదీ
మొదటి రోజు కోపం అదో రకం శాపం
పోను పోను కలుగుతుంది భలే విరహ తాపం
బ్రహ్మచారి లేత మనసు పైకి తేలదు
తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు పొత్తు కుదరదు
చరణం: 1
పడుచు వాడి మిడిసిపాటు పైన పటారం
ఒక గడుసు పిల్ల కసర గానే లోన లొటారం
పడుచువానీ .. ఒహో...
పడుచు వాడి మిడిసిపాటు పైన పటారం
ఒక గడుసు పిల్ల కసర గానే లోన లొటారం
వగలాడి తీపి తిట్టు తొలి వలపు తేనె పట్టు
ఆ తేనె కోరి చెంత చేర చెడామడా కుట్టు
చరణం: 2
పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు ఒహో
తమ కళ్ళతోనే మంతనాలు చేయుచుందురు
పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు ఒహో
తమ కళ్ళతోనే మంతనాలు చేయుచుందురు
వేడుకొన్న రోషం అది పైకి పగటి వేషం
వెంటపడిన వీపు విమానం
చరణం: 3
చిలిపి కన్నె హృదయమెంతో చిత్రమైనది
అది చిక్కు పెట్టు క్రాసు వర్డు పజిలు వంటిది
చిలిపికన్నె.. ఉహూ...
చిలిపి కన్నె హృదయమెంతో చిత్రమైనది
అది చిక్కు పెట్టు క్రాసు వర్డు పజిలు వంటిది
ఆ పజిలు పూర్తి చేయి తగు ఫలితముండునోయి ఆ
మరపు రాని మధురమైన ప్రైజు దొరుకునోయి
నీకో తోడు కావాలి పాట సాహిత్యం
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, పి. సుశీల
పల్లవి:
నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి,
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని
ఓ నన్నే నీదాన్ని చేసుకోవాలి
చరణం: 1
నవనాగరీక జీవితాన తేలుదాం,
నైటుక్లబ్బులందు నాట్యమాడి
సోలుదాం
హో హో హొ హో
నువ్వు అందమైన టిప్పుటాపు బాబువి,
నేను అంతకన్న అప్టుడేటు బేబిని
వగలాడి నీకు తాళి బరువు ఎందుకు,
ఎగతాళి చేసి దాని పరువు తీయకు
నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైనజవ్వని
ఓ తల్లీ దయచేయి కోటిదండాలు
చరణం: 2
నేను పేరుపడిన వారి ఇంట పుట్టి పెరిగాను,
ఏదో హారుమణి వాయిస్తూ పాడుకుంటాను
దనిస నిదనిప మగదిస దిగమప
నేను చదువులేనిదాననని అలుసు నీకేల,
నీకు కలసివచ్చు లక్షలాస్తి విడిచిపోనేల
నీతో వియ్యం దినదినగండం,
మీ ఆస్తి కోసం ఆత్మ నేను అమ్ముకోజాల
నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని
ఓ తల్లి దయచేయి కోటిదండాలు
చరణం: 3
సిరులూ నగలూ మాకు లేవోయి,
తళుకూ బెళుకుల మోజు లేదోయి
హహహా...
చదువూ సంస్కృతి సాంప్రదాయాలు
తెలుగుతనమే మా రత్నహారాలు
ధనరాశి కన్న నీ గుణమే మిన్న,
నీలో సంస్కారకాంతులున్నాయి
నీకో బ్రూటు దొరికిందీ
మెడలో జోలె కడుతుందీ
ఈమె కాలి గోటి ధూళి పాటి చేయరు
ఓ త్వరగా దయచేస్తె కోటి దండాలు
నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి
ఓహో పక్కనున్న చక్కనైన జవ్వనీ,
హాయ్ నిన్నే నాదాన్ని చేసుకుంటాను
ఓహొ చక్కని చిన్నది పాట సాహిత్యం
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి. బి. శ్రీనివాస్, ఆశలత కులకర్ణి
పల్లవి:
ఆఅ ఆఅ ఆఅ హా
ఓఓ ఓఓ ఓఓ హో
ఓహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది
చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నది
చరణం: 1
వెచ్చగ జవ్వని తాకితే పిచ్చిగ ఊహలు రేగునే
రెపరెపలాడే గుండెల్లోన ప్రేమ నిండేనే
అయ్యో పాపం .. తీరని తాపం
భావ కవిత్వం చాలునోయి పైత్యం లోన జారకోయి
పెళ్ళికి ముందు ప్రణయాలు ముళ్ళ బాణాలు
ఓహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది
చరణం: 2
పెద్దల అనుమతి తీసుకో
ప్రేమను సొంతం చేసుకో
హద్దుపద్దు మీరినా ఆటకట్టేను
యస్ అంటారు మావాళ్ళు
నో అంటేను జతరారు
తల్లి తండ్రి కూడంటే గుళ్ళో పెళ్ళి చేసుకుందాం
ధైర్యం చేసి నీవేగా దారి చూపావు
చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నది
చరణం: 3
మనసే దోచిన సుందరి
మమతే మల్లె పందిరి
పందిరిలోన మేనులు మరచి పరవశించాలి
అపుడే కాదు.. ఎపుడంటావు
తొందరలోనే మూడుముళ్ళు అందరిముందు వేయగానే
తోడునీడై కలకాలం సాగిపోదాము
ఓహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది
చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నదీ
ఓఓ ఓఓ ఓఓ హో
ఓఓ ఓఓ ఓఓ హో
ఏమిటి ఈ అవతారం? పాట సాహిత్యం
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు రాఘవయ్య
గానం: మాధవపెద్ది సత్యం , స్వర్ణలత
పల్లవి:
ఆ...ఏమిటే...
ఏమిటి ఈ అవతారం?
ఎందుకు ఈ సింగారం?
ఏమిటి ఈ అవతారం?
ఎందుకు ఈ సింగారం?
పాత రోజులు గుర్తొస్తున్నవి
ఉన్నది ఏదో వ్యవహారం
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం
చరణం: 1
పౌడర్ దెచ్చెను నీకందం
బాగా వెయ్ వేలెడు మందం
పౌడర్ దెచ్చెను నీకందం
బాగా వెయ్ వేలెడు మందం
తట్టెడు పూలు తలను పెట్టుకుని
తయారైతివా చిట్టి వర్ధనం
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం
చరణం: 2
ఆ...ఆ...ఓ...ఓ....
వయసులోన నే ముదురుదాననా
వయ్యారానికి తగనిదాననా
వయసులోన నే ముదురుదాననా
వయ్యారానికి తగనిదాననా
వరుసకాన్పులై వన్నె తగ్గినా
అందానికి నే తీసిపోదునా
ఏమిటి నా అపరాధం
ఎందుకు ఈ అవతారం
చరణం: 3
దేవకన్య ఇటు ఓహో...
దేవకన్య ఇటు దిగివచ్చిందని
భ్రమసి పోదునా కలనైనా
మహంకాళి నా పక్కనున్నదని
మరచిపోదునా ఎపుడైనా
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం
నీళ్ళు కలపని పాలవంటిది
పిండి కలపని వెన్న వంటిది
నీళ్ళు కలపని పాలవంటిది
పిండి కలపని వెన్న వంటిది
నిఖారుసైనది నా మనసు
ఊరూవాడకు ఇది తెలుసు
ఏమిటి ఈ అవతారం?
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం
వినిపించని రాగాలే పాట సాహిత్యం
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల, పి. సుశీల
పల్లవి:
ఓ...ఓ...ఆ ...ఆ....ఓ....ఆ....
వినిపించని రాగాలే కనిపించని అందాలే
అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే కనిపించని అందాలే ఏ ఏ...
చరణం: 1
తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే
తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే
చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే
వలచే మనసే మనసు
వినిపించని రాగాలే కనిపించని అందాలే ఏ ఏ...
చరణం: 2
వలపే వసంతముల పులకించి పూచినది
వలపే వసంతముల పులకించి పూచినది
చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి
విరిసే వయసే వయసు
వినిపించని రాగాలే కనిపించని అందాలే...
చరణం: 3
వికసించెను నా వయసే మురిపించు ఈ సొగసే
విరితేనెల వెన్నెలలో కొరతేదో కనిపించే
ఎదలో ఎవరో మెరిసే
వినిపించని రాగాలే కనిపించని అందాలే...
అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే కనిపించని అందాలే
చిత్రం: ఆత్మీయులు (1969)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నటీనటులు: నాగేశ్వరరావు, వాణిశ్రీ, విజయ నిర్మల, చంద్రకళ
దర్శకత్వం: వి. మధుసూదనరావు
నిర్మాత: దుక్కిపాటి మధుసూదనరావు
బ్యానర్: శ్రీ సారథి స్టూడియోస్
విడుదల తేది: 17.07.1969
Songs List:
అన్నయ్య కలలే పండెను పాట సాహిత్యం
చిత్రం: ఆత్మీయులు (1969)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, సుశీల
అన్నయ్య కలలే పండెను
చెల్లాయి మనసే నిండెను
బంగారుకాంతులేవొ నేడే తొంగి చూసేను
తోడు నీడా నీవై లాలించే అన్నయ్యా
తల్లిదండ్రీ నీవై పాలించే అన్నయ్యా
నీకన్న వేరే పెన్నిధి లేనే లేదు
నా పూర్వ పుణ్యాల రూపమే నీవు
అన్నయ్య
రతనాల సుగుణాల రాశివి నీవే
అన్నయ్య నయనాల ఆశవు నీవే
నీవు మెట్టినయిల్లు నిత్యము విలసిల్లు
నీ నవ్వు సిరులొల్కు ముత్యాల జల్లు
అన్నయ్య
మా అన్నయ్య మనసే సిరిమల్లె పువ్వేను
చెల్లి కంటతడివుంటే తల్లడిల్లేను
నీ పూజలేనన్ను నడిపించు తల్లీ
శతకోటి విజయాలు సాధింతు చెల్లి
అన్నయ్య
ఈ రోజుల్లో పడుచువారు పాట సాహిత్యం
చిత్రం: ఆత్మీయులు (1969)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, సుశీల
ఈరోజులో పడుచువారు గడుసువారు
వీలైతే హుషారు కాకుంటే కంగారు
ఈ రోజుల్లో
తాజా తాజా మోజులకోసం తహతహలాడుతువుంటారు
పొట్టి షర్టతో టైటు పాంట్లతో లొట్టిపిట్టలవుతుంటారు
మెప్పులకోసం అప్పులు చేసి తిప్పలపాలవుతుంటారు
ఈ రోజుల్లో
రోడ్డు సైడున రోమియోలలా రోజంతా బీచేస్తారు
సొగసరి చిన్నది కంటపడిందా చూపులతో మింగేస్తారు
ఆ చిన్నదికాస్తా చేయివిసిరితే చెప్పకుండా చెక్కేస్తారు
పాఠాలకు ఎగనామంబెట్టి మ్యాటినీ షో లకు తయ్యారు
పార్టీ లంటూ పిక్నిక్ లంటూ పుణ్యకాలమూ గడిపేరు
పరీక్ష రోజులు ముంచుకురాగా తిరుపతి ముడుపులు కడతారు
ఈ రోజుల్లో ....
పడుచువారు గడుసు వారు
సహనంలో కిసానులు సమరంలో జవానులు
ఆడపిల్లలను గౌరవించితే ఆత్మ గౌరవం పెరిగేను
సమరస భావం కలిగిననాడే చదువుల విలువలు పెరిగేను
దేశానికి వెన్నెముకలు మీరు దివాళకోరులు కావద్దు
భవితవ్యానికి బాటలు వేసే భారం మనదని
మరవొద్దు
ఆ భారం మనదని మరవొద్దు
చిత్రం: భార్యా భర్తలు (1961)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ కుమారి
దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ
నిర్మాత: ఏ.వి. సుబ్బారావు
బ్యానర్: ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేది: 31.03.1961
Songs List:
జోరుగా హుషారుగా షికారు పోదామా! పాట సాహిత్యం
చిత్రం: భార్యాభర్తలు (1961)
సంగీతం: సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం: శ్రీశ్రీ
గానం: ఘంటసాల
జోరుగా హుషారుగా షికారు పోదామా!
హాయి హాయిగా తీయ తీయగా
జోరుగా హుషారుగా షికారు పోదామా!
హాయి హాయిగా తీయ తీయగా
ఓ ...బాల నీ వయ్యార మెంచి మరులుకొంటి నే
చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే
మరువనంటినే
||జోరుగా॥
నీ ... వన్నె చిన్నె లన్ని చూచి వలచినాడనే
వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే
కలసి రాగదే
||జోరుగా॥
నా ...కలలలోన చెలియ నిన్నె పిలచినాడనే
కనులు తెరచి ఎదుట నిన్నె కాంచినాడనే
వరించువాడనే
ఓ..సుకుమారా పాట సాహిత్యం
చిత్రం: భార్యాభర్తలు (1961)
సంగీతం: సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం: శ్రీశ్రీ
గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
ఓ..సుకుమారా నను చేరా రావోయి ఇటు రావోయి
నిలువగ లేని వలపులరాణి నీ కొరకే తపించునులే
నిలువగ లేని వలపులరాణి నీ కొరకే తపించునులే
ఓ..జవరాలా ప్రియురాలా ఈనాడే మనదే హాయి
తనువుగ నేడు ఈ చెలికాడు
నీ దరినే సుఖించునులే
చరణం: 1
కోటి కిరణముల కోరిన గాని
భానుని చూడదు కలువ చెలి
కోటి కిరణముల కోరిన గాని
భానుని చూడదు కలువ చెలి
వెన్నెల కాంతి వెలిగిన వేళా
వెన్నెల కాంతి వెలిగిన వేళా
విరుయునుగా విలాసముగా
నిలువగ లేని వలపులరాణి
నీ కొరకే తపించునులే
చరణం: 2
వేయి కనులతో వెదికిన గాని
తారకు జాబిలి దూరమేగా
వేయి కనులతో వెదికిన గాని
తారకు జాబిలి దూరమేగా
కలువల రాణీ వలపులలోనే
కలువల రాణీ వలపులలోనే
కళకళలాడి చేరునుగా
తనువుగ నేడు ఈ చెలికాడు
నీ దరినే సుఖించునులే
మధురం మధురం పాట సాహిత్యం
చిత్రం: భార్యాభర్తలు (1961)
సంగీతం: సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం: శ్రీశ్రీ
గానం: ఘంటసాల, సుశీల
మధురం మధురం ఈ సమయం
ఇక జీవితమే ఆనందమయం
మధురం మధురం ఈ సమయం
చల్లని పున్నమి వెన్నెలలో
ఎన్నడు వీడని కౌగిలిలో
చల్లని పున్నమి వెన్నెలలో
ఎన్నడు వీడని కౌగిలిలో
కన్నుల వలపు కాంతులు మెరయగ
||మధురం||
కరగిపోయె పెను చీకటి పొరలు
కరగిపోయె పెను చీకటి పొరలు
తొలగిపోయె అనుమానపు తెరలు
తొలగిపోయె అనుమానపు తెరలు
పరిమళించె అనురాగపు విరులు
పరిమళించె అనురాగపు విరులు
అలరెనే మనసు నందనవసము
|| మధురం...||
సఫల మాయెనే మన తియ్యని కలలు
సఫల మాయెనే మన తియ్యని కలలు
జగము నిండె నవజీవన కళలు
జగము నిండె నవజీవన కళలు
పొంగిపొరలె మన కోర్కెల అలలు
పొంగిపొరలె మన కోర్కెల అలలు
భావియే వెలిగె పూవుల బాటగ
||మధురం... !!
ఏమని పాదేదనో ఈ వేళ పాట సాహిత్యం
చిత్రం: భార్యాభర్తలు (1961)
సంగీతం: సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం: శ్రీశ్రీ
గానం: సుశీల
ఏమని పాదేదనో ఈ వేళ
మానస వీణ మౌనముగా
నిదురించిన వేళ
ఏమని పాడెదనో
జగమే మరచి హృదయ విపంచి
గారడిగా వినువీధి చరించి
కలత నిదురలో కాంచిన కలలే
గాలి మేడలై కూలిన వేళ
ఏమని పాడెదనో
వనసీమలలో హాయిగ ఆడే
రాచిలుకా నిను రాణిని చేసే
పసిడితీగల పంజరమిదిగో
పలుక వేమని పిలిచే వేళ
రంగ రంగేళీ పాట సాహిత్యం
చిత్రం: భార్యాభర్తలు (1961)
సంగీతం: సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: సుశీల
రంగ రంగేళీ సుఖాలను తేలి
రావోయి మధుర మీరేయి
రంగ రంగేళీ
నిన్ను కోరే గులాబులు
ఈయ వేల జవాబులు
నిన్ను కోరే గులాబులు
ఈయ వేల జవాబులు
మనసులోని మమత లేవో
మనసులోని మమత లేవో
తెలుపునే మెరిసే కనులు
పరాకేలనోయి ప్రియా
భరింపజాల ఈ విరహ జ్వాల
వహవ్వా
వలపుల బాలననీ బేలననీ రమ్మనవు
వలపుల బాలననీ బేలననీ రమ్మనవు
వలచి చేరితి నే కోరితినే చిరునగవు
తొలగిపోయెదవు చాలునులే యీ బిగువు
సరసాలు మురిపాలు మరి రానేరావు
చూచి చూచి కళ్లు కాయలే కాచాయి పాట సాహిత్యం
చిత్రం: భార్యాభర్తలు (1961)
సంగీతం: సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు
గానం: ఘంటసాల, జిక్కీ
జో జో జో జోజో
చూచి చూచి కళ్లు కాయలే కాచాయి
గా నీ తండ్రి ఊడి పడ్డాడూ
చక్కనీ నా బాబు జోజో
చల్లనీ నా తండ్రి జోజో
రెక్కలూ గట్టుకొని రివ్వునా వాలాను
రేయింబగళ్ళు నిను తలచుకొని మురిశాను
మురిపాల మొలకవూ జోజో
ముద్దులూరించేవు జోజో
|| చూచి చూచి||
కాకితో ఒక సారి కబురంపినావని
కాకితో ఒక సారి కబురంపినావని
కలలోన నిను చాల కలవరించాను
కాశీకి పోయినా గంగలో మునిగినా
నిను మరువ కున్నాను జో జో
నిలువలేకున్నాను జో జో
|| చూచి చూచి||
ఏ వూళ్ళు తిరిగావు ఏమేమి చేశావు
ఏ వూళ్ళు తిరిగావు ఏమేమి చేశావు
ఎవరితో సరదాలు తీర్చుకొచ్చావు
ఇంత చక్కని రంభ ఇంటిలో ఉండగా
ఇతరులతో పని ఏమి జోజో
ఇది మంచి సమయము జోజో
ఇది మంచి సమయము జోజో
కనకమా ! చిట్టి కనకమా! పాట సాహిత్యం
చిత్రం: భార్యాభర్తలు (1961)
సంగీతం: సాలూరి. రాజేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు
గానం: మాధవపెద్ది సత్యం, స్వర్ణలత
కనకమా ! చిట్టి కనకమా!
ముద్దు కనకమా ! నామాట వినుమా !
మనము కలసి మెలిసుంటే అప్పీలు లేదుసుమా !
కనకమా ! చిట్టి కనక మా ! నామాట వినుమా !
కలసి మెలిసున్నందు కేగా
నీవు కరుణ జూపించావు బాగా
కలసి మెలిసున్నందు కేగా
నీవు కరుణ జూపించావు బాగా
కల్లకపటం లేని నా కన్న తండ్రిని
వేటాడి వేధించి వెళ్ళగొట్టావుగా !
ఆలు మగలకు మధ్య చూడు
మామ అడ్డముంటే ఎంతో గోడు
ఆలు మగలకు మధ్య చూడు
మామ అడ్డముంటే ఎంతో గోడు
ఆనందముగ మనము అనుభవించాలంటే
ఆనందముగ మనము అనుభవించాలంటే
అడుగడుగునా మనకు గుదిబండ అయినాడు
కనకమా ! చిట్టి కనక మా ! నామాట వినుమా !
అల్లారు ముద్దుగా నా కోరికలు తీర్చి
అన్యాయమగు మాట లేల
అవ్వ అపహాస్యములు చేయ నేల
అన్యాయమగు మాట లేల
అవ్వ అపహాస్యములు చేయ నేల
ఉల్లాసముగ నన్ను ఓదార్చ వేల
మెడనిండ సొమ్ములు పెడతాను
కంచి పట్టు చీరలు కట్టబెడతాను
మెడనిండ సొమ్ములు పెడతాను
కంచి పట్టు చీరలు కట్టబెడతాను
ఇల్లంత స్వర్గంగ మార్చి వేస్తాను
ఇల్లంత స్వర్గంగ మార్చి వేస్తాను
ఇంతకన్నా మంచి ఏమి చేస్తాను
చిత్రం: అమెరికా అబ్బాయి (1987)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి. బాలు, పి. సుశీల
నీవు బొమ్మవా - ఉహూ...
ముద్దు గుమ్మవా - ఊహూ హు హు....
మనసు దోచే మరుమల్లె కొమ్మవా
అహా...అహా...ఆ... అహహాహా...
పల్లవి:
పలుకవా ప్రియా ప్రియా తెలుపవా ప్రియా ప్రియా
వలపు వీణలు మీటిన క్షణం
మలుపు తిరుగును జీవిన పధం
నీవో సగం నేనో సగం ఒకటే జీవితం
పలుకవా ప్రియా ప్రియా తెలుపవా ప్రియా ప్రియా
వలపు వీణలు మీటిన క్షణం
మలుపు తిరుగును జీవిన పధం
నీవో సగం నేనో సగం ఒకటే జీవితం
పలుకవా ప్రియా ప్రియా తెలుపవా ప్రియా ప్రియా
చరణం: 1
నీవెవరో ఊర్వశివి మురిపించే ప్రేయసివి
తలపులలో మెరిశావు నా మదిలో వెలిశావు
సన్నిధిలో సరాగాలు పెన్నిధిగా ప్రసాదించు
సన్నిధిలో సరాగాలు పెన్నిధిగా ప్రసాదించు
ఆశా రధం సాగే రిథం నీవే తెలుపవా
పలుకవా ప్రియా ప్రియా తెలుపవా ప్రియా ప్రియా
చరణం: 2
కదలని నీ కన్నులలో కళలెన్నో కన్నాను
ముసిముసి నీ నవ్వులలో గుసగుసలే విన్నాను
పచ్చని కల ఫలించాలి వెచ్చని జత సుఖించాలి
పచ్చని కల ఫలించాలి వెచ్చని జత సుఖించాలి
మన ఈ కథ.. మమతల సుధా చెలిమే సంపదా
పలుకవా ప్రియా ప్రియా తెలుపవా ప్రియా ప్రియా
వలపు వీణలు మీటిన క్షణం
మలుపు తిరుగును జీవిన పధం
నీవో సగం... నీవో సగం.. ఒకటే జీవితం..
పలుకవా ప్రియా ప్రియా తెలుపవా ప్రియా ప్రియా
పలుకవా ప్రియా ప్రియా తెలుపవా ప్రియా ప్రియా
లలలాలల లలాలలాలాల్లా
పలుకవే రాగ వీణ పాట సాహిత్యం
చిత్రం: అమెరికా అబ్బాయి (1987)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి. సుశీల
పల్లవి:
పలుకవే రాగ వీణ తెలుగు హృదయాల లోన
తీనే కెరటాల పైన
పలుకవే రాగ వీణ తెలుగు హృదయాల లోన
తీనే కెరటాల పైన
పలుకు పలుకులో లలిత భావనలు
పల్లవించి పులకించగా
పలుకు పలుకులో లలిత భావనలు
పల్లవించి పులకించగా
పదము పదములో మధుర రాగిణులు
పరవశించి తలలూపగ
ఆఆ ఆఆ ఆఆ అఆ ఆఆ ఆఆఆఆ
పలుకవే రాగ వీణ తెలుగు హృదయాల లోన
చరణం: 1
సిరి సంపదలు పెరిగిన గాని
పరువే మనిషికి ప్రాణమని అ... ఆ...
సిరి సంపదలు పెరిగిన గాని
పరువే మనిషికి ప్రాణమని అ... ఆ...
ఎవరికి వారే పయనిస్తువున్నా
చివరికి మిగిలేది స్నేహమని అ... ఆ...
పలుకవే రాగ వీణ తెలుగు హృదయాల లోన
చరణం: 2
మనసుకు మనసూ శ్రుతిలేకుంటే
కలిసే వున్నా దూరాలే
మనసుకు మనసూ శ్రుతిలేకుంటే
కలిసే వున్నా దూరాలే
మమతలు తామే ముడివడి వుంటే
దూరా లై న చేరువలె అ... ఆ...
పలుకవే రాగ వీణ తెలుగు హృదయాల లోన
తీనే కెరటాల పైన
ఏ దేశమేగినా పాట సాహిత్యం
చిత్రం: అమెరికా అబ్బాయి (1987)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి.సుశీల
పల్లవి:
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ
రాయప్రోలన్నాడు ఆనాడూ
అది మరిచిపోవద్దు ఏనాడూ
చరణం: 1
పుట్టింది నీ మట్టిలో సీత
రూపు కట్టింది దివ్య భగవద్గీత
వేదాల వెలసినా ధరణిరా
వేదాల వెలసినా ధరణిరా
ఓంకార నాదాలు పలికినా అవనిరా
ఎన్నెన్నొ దేశాలు కన్ను తెరవని నాడు
వికసించె మననేల విజ్ఞాన కిరణాలు
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ
చరణం: 2
వెన్నెలదీ ఏ మతమురా
కోకిలదీ ఏ కులమురా
గాలికి ఏ భాష ఉందిరా
నీటికి ఏ ప్రాంతముందిరా
గాలికీ నీటికీ లేవు భేధాలూ
మనుషుల్లో ఎందుకీ తగాదాలు కులమత విభేదాలూ
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ
చరణం: 3
గౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూ
గాంధీ చూపిన మార్గం విడవద్దూ
గౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూ
గాంధీ చూపిన మార్గం విడవద్దూ
ద్వేషాల చీకట్లూ తొలగించూ
స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించూ
ఐకమత్యమే జాతికి శ్రీరామ రక్షా
అందుకే నిరంతరం సాగాలి దీక్షా
అందుకే నిరంతరం సాగాలి దీక్షా