-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Bhanumathi Ramakrishna"



చిత్రం: గడసరి అత్త సొగసరి కోడలు (1981)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
గానం: భానుమతీ రామకృష్ణ, పి.సుశీల, ఎస్.జానకి, యస్.పి.బాలు
నటీనటులు: కృష్ణ, శ్రీదేవి, భానుమతి 
మాటలు: యస్.ఆర్.పినిశెట్టి, కాశీ విశ్వనాథ్
దర్శకత్వం: కట్టా సుబ్బారావు
నిర్మాతలు: గోరంట్ల వీరయ్య చౌదరి, సోమిశెట్టి సుబ్బారావు
విడుదల తేది:04.08.1981

Palli Balakrishna Friday, February 9, 2024



చిత్రం: అంతా మనమంచికే (1972)
సంగీతం: భానుమతి రామకృష్ణ, చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి, ఆరుద్ర 
గానం: భానుమతి రామకృష్ణ, పి.సుశీల, యస్.పి.బాలు, వసంత 
నటీనటులు: భానుమతి రామకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు, టి.పద్మిని (నూతన నటి)
మాటలు: భానుమతి రామకృష్ణ, డి.వి.నరసరాజు 
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భానుమతి రామకృష్ణ
నిర్మాణ సంస్థ: భరణీ పిక్చర్స్ 
విడుదల తేది: 19.04.1972



Songs List:



నీవేరా నా మదిలో పాట సాహిత్యం

 
చిత్రం: అంతా మనమంచికే (1972)
సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాశరథి
గానం: భానుమతి రామకృష్ణ 

నీవేరా నా మదిలో - దేవా 
తిరుమలవాసా : ఓ శ్రీనివాసా 
నీ పదదాసిని నేనేరా ....

యెంతో మధురం నీ శుభనామం 
జగతికి దీపం నీ దివ్య రూపం 
ఆశలపూలే - దోసిట నింపే 
వేచే భాగ్యము - నాదేరా....

నీ మెడలోన కాంతులు చిందే 
కాంచన హారము కాలేను నేను 
నీ పదములపై వాలిన సుమమె 
నిలిచే భాగ్యము నాదేరా....

నా జీవితమే హారతి చేసి 
నీ గుడి వాకిట నిలిచేను స్వామీ 
నీ సన్నిథియే నా పెన్నిధిగా 
మురిసే భాగ్యము నాదేరా....




మానస సంచరరే... పాట సాహిత్యం

 
చిత్రం: అంతా మనమంచికే (1972)
సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: వీర బ్రహ్మేంద్ర స్వామి 
గానం: భానుమతి రామకృష్ణ 

మానస సంచరరే...
బ్రహ్మణి మానస సంచర రే...

మదశిఖి పింఛా అలంకృత చికురే 
మహానీయ కపోల
విజిత ముఖు రే...

శ్రీ రమణీ కుచ దుర్గవిహారే 
సేవక జన మందిర మందారే 
పరమహంస ముఖ చంద్రచకోరే 
పరిపూరిత మురళీరవ కారే




స రి గ మ ప పాట పాడాలి పాట సాహిత్యం

 
చిత్రం: అంతా మనమంచికే (1972)
సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: భానుమతి రామకృష్ణ & బృందం 

స రి గ మ ప పాట పాడాలి 
పాటలోనే పాఠాలన్నీ నేర్చుకోవాలి.

పాటలె పూవుల బాట వెయ్యాలి
ఆ బాటలో సూటిగా సాగిపోవాలి
శ్రుతిలో కలవాలి -జతగా మెలగాలి 
అంతా ఒకటై సంతోషంగా ఆడుకోవాలి...

ఆనందం మధురానందం
అనుభవ సారమె సంగీతం
పశువులనైనా-శిశువులనైనా
పాములనైనా జో కొట్టేది
చల్లని  గీతం. సనిదపమగరిస....

సాధనతో మంచి సాధనతో
సఫలము కావలె జీవితము
జీవితమంతా జిలిబిలి ఆట
ఒప్పులకుప్పా - ఒయ్యారి భామా 
చక్కనిచుక్కా, సనిదపమగరిస




పరాన్ముఖ మేలనమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: అంతా మనమంచికే (1972)
సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం 
గానం: భానుమతి రామకృష్ణ 

పరాన్ముఖ మేలనమ్మా 
పరాధీన పతిత నాపై 
నిరాదరము నీవే జేసితే
నే సహింస తరమా తల్లీ...

మరాళాజిక మందగమనీ .... 
మహాదేవి మదిరంజిత వదనీ 
నిరామయే... నీరదశ్యామలే 
నిత్యకల్యాణ గుణాలయే ...



మాటచాలదా, మనసుచాలదా పాట సాహిత్యం

 
చిత్రం: అంతా మనమంచికే (1972)
సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి. సుశీల, యస్.పి. బాలు

మాటచాలదా, మనసుచాలదా
మాటలోని మనసులోని మమత తెలియదా ?
దిక్కులు వినగా చుక్కలు కనగా 
నీ పక్కనె పలికే మక్కువ ఒలికే
తోటలో పూవు చెవిలో తుమ్మెద ఊదేది 
గూటిలో ప్రియునితో గోరింక అనేది 
కన్నులలోన, నవ్వులలోనా 
ఒదిగే దాగే మధుర రహస్యం 

ఒకరికి నా గుండెలో ఎప్పుడూ వసతి
ఒక్కరేనా ప్రేమకు ఏనాటికి అతిధి 
పదిలముగా నా హృదయములోనా
ఒదిగే దాగే మధుర రహస్యం ....




చల్లగా హాయిగా పాట సాహిత్యం

 
చిత్రం: అంతా మనమంచికే (1972)
సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: ఆరుద్ర 
గానం: భానుమతి రామకృష్ణ 

చల్లగా హాయిగా లాలించు లాలి నేనేరా 
మెల్లగా తీయగా నవ్వించు నవ్వు నీవేరా

ముందుగా రాగల శుభకాలము నీదే నీదే 
కొందరే సుఖపడే యీ లోకము మారెనోయి 
అందరూ ఒకటిగా జీవించు యుగము రావాలి ॥చల్లగా॥

ఎవరికీ తెలియని ఏ కొమ్మనుండి పూచావో 
ఎవ్వరూ లేరని ఎలుగెత్తి ఎంత ఏడ్చావో 
ఏడ్చితే ఏ కనుల నీలాలు ఎవరు తుడిచారో 
ఆడుతూ పాడుతూ నీ జీవనౌక సాగాలి  ॥చల్లగా॥





నేనె రాధనోయీ పాట సాహిత్యం

 
చిత్రం: అంతా మనమంచికే (1972)
సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాశరధి 
గానం: భానుమతి రామకృష్ణ 

నేనె రాధనోయీ గోపాలా ...
అందమైన యీ బృందావనిలో 

విరిసిన వున్నమి వెన్నెలలో 
చలని యమునా తీరములో
నీ పెదవుల పై వేణుగానమై  
పొంగి పోదురా నేనీ వేళా..... 

ఆదే పొన్నల నీడలలో 
నీ మృదు పదముల జాడలలో 
నేనే నీవె నీవే నేనై  
అనుసరింతురా నేనీ వేళా ....





నవ్వవే... నా చెలీ... పాట సాహిత్యం

 
చిత్రం: అంతా మనమంచికే (1972)
సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం 
సాహిత్యం: దాశరధి 
గానం: యస్.పి.బాలు, వసంత 

నవ్వవే... నా చెలీ...చల్లగాలి పిలిచేను
మల్లెపూలు నవ్వేను...వలపులు పొంగేవేళలో 
నవ్వవే .... నా చెలీ...

నవ్వనా, నా ప్రియా.... మూడుముళు పడగానే 
తోడు నీవు కాగానే - మమతలు పండేవేళలో ....
నవ్వనా, నా ప్రియా....

మనసులు యేనాడో కలిశాయిలే
మనువులు యేనాడో కుదిరాయిలే
నీవు నాదానవే
నీవు నా వాడ వే ....
నేను నీ వాడనే
నేను నీ దాననే
ఇక ననుజేరి మురిపింప బెదురేలనే.... ॥నవ్వవే ॥

జగమేమి తలిచేనో ?
మన కెందుకు ?
జనమేమి పలికేనో ?
మనకేమిటి....
నీవు నా దానవే
నీవు నా వాడివే
నేను నీ వాడినే
నేను నీ దాననే
నిజమైన ప్రేమ గెలిచేనులే...... ||నవ్వవే॥


Palli Balakrishna Tuesday, December 6, 2022





చిత్రం: ముద్దుల మనవరాలు  (1985)
సంగీతం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సాహిత్యం: వేటూరి (All)
నటీనటులు: సుహాసిని, భానుమతి, జయసుధ, చంద్ర మోహన్ , శరత్ బాబు, బేబీ మీనా
దర్శకత్వం: జంధ్యాల
నిర్మాత: జయకృష్ణ
విడుదల తేది: 1985

Palli Balakrishna Sunday, August 8, 2021





చిత్రం: భామ్మ మాట బంగారు బాట  (1989)
సంగీతం: చంద్రబోస్
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్ , గౌతమి, నూతన్ ప్రసాద్, భానుమతి రామకృష్ణ 
దర్శకత్వం: రాజశేఖర్ 
నిర్మాణ సంస్థ: AVM ప్రొడక్షన్స్ 
విడుదల తేది: 1989

Palli Balakrishna Friday, August 6, 2021





చిత్రం: పెళ్లి కానుక (1998)
సంగీతం: యం. యం  కీరవాణి
నటీనటులు: జగపతి బాబు, లక్ష్మీ, భానుమతి రామకృష్ణ
మాటలు: పోసాని కృష్ణమురళి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: నన్నపనేని అన్నారావు
విడుదల తేది: 1998



Songs List:



సువ్వి సువ్వి సువ్వాలా... పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి కానుక (1998)
సంగీతం: యం. యం  కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి. బాలు, చిత్ర, మాల్గాడి శుభ 

ఆహాఆఆ.. అఅఅఅఅఅ.. అఅఅఅఅఅ..హోఓ.
ఓ... ఓహో ఓహోఓఓ...

సువ్వి సువ్వి సువ్వాలా... మువ్వా గోపాలా...
నవ్వి నవ్వి ఈ వేళా... రవ్వలు రేపాలా...
సువ్వి సువ్వి సువ్వాలా... మువ్వా గోపాలా...
నవ్వి నవ్వి ఈ వేళా... రవ్వలు రేపాలా...

గువ్వా గువ్వా... వెన్నెల గువ్వా...
మా మాటలు వింటున్నావా అఅఆ...
పువ్వా పువ్వా... పున్నమి పువ్వా...
చిరు నవ్వుతో చూస్తున్నావా...
నువ్వు కోరిన గూటికి రమ్మంటా... గువ్వా...
నీ కోవెల దారిని చూపెడతా...గువ్వా... నువ్వు ఊఁ అంటావా...

సువ్వి సువ్వి సువ్వాలా... మువ్వా గోపాలా...

నవ్వి నవ్వి ఈ వేళా... రవ్వలు రేపాలా...
ఆఅహహహాఆఆఆ... అహహహఆ అ అ...

నీ ఇంటి ముంగిట సంక్రాంతి ముగ్గేరా...
ఈ పైడి బొమ్మా...
నీ కంటి వాకిట వెయ్యేళ్ళ వెలుగేరా...
సిరి మల్లె కొమ్మా...
ఈ కన్నె తారక జంటైతే నువ్వే రా
ఆ చందమామ...
ఈ ఎంకి చేరితే నీ సొంతమైపోదా ...
ఆనందసీమ...

ఆఅహహహాఆఆఆ... అహహహఆ అఅ...

రాశి పోసినా రాచ కళలను
పూస గుచ్చినా బ్రహ్మ
చూసిన వాళ్లకు ఈర్షు
పుట్టగా మాకందించెనమ్మా...
మా కోటకు రాణిగా రమ్మంటా... గువ్వా...
నీ కోవెల దారిని చూపెడతా..గువ్వా.. నువ్వు ఊఁ అంటావా...

సువ్వి సువ్వి సువ్వాలా.. మువ్వా గోపాలా...
నవ్వి నవ్వి ఈ వేళా.. రవ్వలు రేపాలా...

తన తనననన..తన తనననన
తననననననన తననననననన
యెన్నిఎల్లో... యెన్నిఎల్లో... యెన్నిఎల్లో ఓఓఓ...

వసంత కోకిల రాగాల రూపంలా...
చిరునవ్వు సిరులు...
వేసంగి వెన్నెల కురిపించె దీపంలా...
వెలిగేటి కనులూ....
వర్షించు వన్నెల ఆ.. ఇంద్ర తాపంలా...
చిన్నారి కళలు...
ఆమంచుకొండల మురిపించు తెలుపే రా...
సుగుణాల నిధులు...

ఆహహహాఆఆఆ... ఓహోహోఓఓ...

ఆరు ఋతువులు.. కూడి చేరిన అందమే నీవమ్మా...
ఏడు జన్మల తోడు వీడని బంధమై రావమ్మా...
దివి సీమల దీవెన తెమ్మంటా.. గువ్వా...
నీ కోవెల దారిని చూపెడతా..గువ్వా... నువ్ ఊఁ అంటావా...

సువ్వి సువ్వి సువ్వాలా... మువ్వా గోపాలా...
నవ్వి నవ్వి ఈ వేళా... రవ్వలు రేపాలా...
సువ్వి సువ్వి సువ్వాలా... మువ్వా గోపాలా...
నవ్వి నవ్వి ఈ వేళా... రవ్వలు రేపాలా...




రమ్మనే కంటి రెప్పల రెప రెపలోన పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి కానుక (1998)
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: ఎస్.పి.బాలు, కె. ఎస్. చిత్ర

పల్లవి:
రమ్మనే కంటి రెప్పల రెప రెపలోన
ఝుమ్మనే వింత ఊసుల గుస గుసలోన
గుండెలో తుంటరి సందడి అలలేనా...
కొంటెగా కమ్ముకు వచ్చిన కలలేనా...

ఏది నీ చిరునామా... మనసునే..
గిల్లి నవ్వుతున్న తొలిప్రేమ... 

చరణం: 1
వాడి చూపుల చొరవెంత?
వయ్యారం బెదిరేంతా...
వేడి ఊపిరి చురుకెంత?
రహస్యం కరిగేంతా...
సిగ్గే చెదిరిన సింగారానికి తలుకెంత?
ఝల్లై కురిసిన నల్లని మబ్బుల మెరుపంతా...
వామ్మో నీ మాటల్లోన బొండు మల్లెల వాన
మత్తు మత్తు ఝల్లుతుంటె అల్లరల్లరల్లరేనయ్యో...

ఏది నీ చిరునామా.. మనసు...
గిల్లి నవ్వుతున్న తొలిప్రేమ...
రమ్మనే కంటి రెప్పల రెప రెపలోన
ఝుమ్మనే వింత ఊసుల గుస గుసలోన

చరణం: 2
లేత సొంపుల వయసెంత?
జతిమ్మని అడిగేంతా...
జంట చేరితె ఫలమెంత?
అహా..అను పులకింతా...
ముద్దే అందిన పెదవింక ఏమందంట?
హద్దే దాటిన సరదాలే కావాలంటా...
పిల్లో ఎంత ఆశ నీకు అల్లా నీ పూల సోకు
అల్లేస్తు ఉంటె నాకు ఒళ్ళు ఝల్లు ఝల్లుమందమ్మా...

ఏది నీ చిరునామా.. మనసునే..
గిల్లి నవ్వుతున్న తొలిప్రేమ...
రమ్మనే కంటి రెప్పల రెప రెపలోన
ఝుమ్మనే వింత ఊసుల గుస గుసలోన
గుండెలో తుంటరి సందడి అలలేనా...
కొంటెగా కమ్ముకు వచ్చిన కలలేనా....

ఏది నీ చిరునామా... మనసునే...
గిల్లి నవ్వుతున్న తొలిప్రేమ...




బంగారు బొమ్మకు పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి కానుక (1998)
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: ఎస్.పి.బాలు, భానుమతి రామకృష్ణ

బంగారు బొమ్మకు పెళ్లి కలొచ్చిందోయ్
రంగేళి వేడుకముంగిట నిలిచిందోయ్
పచ్చని పందిరిలో కలిసొచ్చిన సందడిలో
మంగళ వాద్యంతో మంచి ముహుర్తంలో
అల్లీ బిల్లీ మేనాలో నిను ఢిల్లీకెత్తుకు పోతానంటు
కానున్న కళ్యాణం అంటున్నదోయ్

బంగారు బొమ్మకు పెళ్లి కలొచ్చిందోయ్
రంగేళి వేడుక ముంగిట నిలిచిందోయ్ (2)

ఆకు పచ్చని చిలక రెక్క
పంచవమ్మ శుభలేఖలూ..
చూడ చక్కని జంట కలిపిన
నను మెచ్చుకోవ నలు దిక్కులు
దగ్గరలోనే వినిపిస్తోందా లగ్గం సన్నాయి
ఆసంగతి తెలియంగానే
సిగ్గులు బుగ్గను నొక్కాయి
నీ చక్కని చెక్కిలి నొక్కులు
పడితే బాగుందమ్మాయీ...

భలె భలె భలె భలె భలే...

షాదీకి బాదా ఆయీ హి హి హీ...
ముబారక్ బాతె కర్దేంగి హల్ ఛల్..

పారాణి పాదాల మాగాణి మారాణి
నీ రాక ఎప్పుడందీ మా రాజధాని

బంగారు బొమ్మకు పెళ్లి కలొచ్చిందోయ్
రంగేళి వేడుక ముంగిట నిలిచిందోయ్ (2)

తేనె తేటల తెలుగు పాట
తరలి రావే మా ఇంటికీ
కోటి కాంతుల తులసి కోట
కళలు తేవే మా పెరటికీ
ఆ జనక రాజుకు ధీటైన తండ్రి
మన్నించుమా ఇంటి తాంబూలం
ఈ పసుపు కాంతికి మా గడపపండేల
అందించు సీతమ్మ కన్నెదానం
అత్తిల్లునే నీకు పొత్తిళ్లు చేసి
పసిపాపలా చూసుకుంటామని
పదిమందిలో బాసనే చేయనీ...

బంగారు బొమ్మకు పెళ్లి కలొచ్చిందోయ్
రంగేళి వేడుక ముంగిట నిలిచిందోయ్ (2)




ఈ గాలి ఈ నేల పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి కానుక (1998)
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: కె. ఎస్. చిత్ర, ఎం. ఎం. కీరవాణి


ఆహా...ఆహా...
కుహు కుహు కు కోయిలమ్మ కమ్మని కబురే చెప్పవమ్మ
ఆహాహా...ఆఆఆఆ...
కిలకిల చిలకమ్మ చక్కెర ఊసులు పలుకమ్మ

ఈ గాలి ఈ నేల
వీటిని మించిన స్వర్గం వేరే కావాలా?
పచ్చదనం పసుపుదనం మాకు సిరులమ్మా
మా పల్లెసీమ భూదేవి కుంకుమ
మా పల్లెసీమ భూదేవి కుంకుమ

ఈ గాలి ఈ నేల
ఆహాహా... ఆఆఆఆ...

గిత్తల జోడి పట్టవే ఎక్కి
పట్టర మేని దున్నర దుక్కి

హైలెస్సో.. హైలో హైలెస్సో...
హైలో హైలో హైలో హైలెస్సో...

ఆ..ఆ..ఆ...ఆ...

కమ్ముకునే... చీకటికీ...
కమ్మని జోలల ఊయల పాటలు పాడుతాం
చేరుకునే...వేకువకీ...
రమ్మని రంగుల ముగ్గుల బాటలు చూపుతాం
యేటి ఊయలలూగే పడవల సంగీతం
జానపదముల సాగే పని పాటుల గీతం
చల్లదనం తల్లిగుణం ఉన్న ఊరమ్మ
మా పల్లెసీమ పంచేది ప్రేమ
మా పల్లెసీమ పంచేది ప్రేమ

ఈ గాలి ఈ నేల
ఆహాహా...ఆఆఆఆ...

కోవెలలో... పావురమే...
దేవుడు పంపిన దీవెన తానని అన్నదీ
గుండెలలో...  నమ్మకమే...
చెట్టును పుట్టను భక్తిగ పూజిస్తున్నది
నేల తల్లికి చేలే చీరలు నేస్తాయి
మల్లె కొమ్మకి పూలై తారలు వస్తాయి
నల్లధనం కల్లగుణం లేని మనసమ్మ
మా పల్లెసీమ ముత్తైదువమ్మ
మా పల్లెసీమ ముత్తైదువమ్మ

ఈ గాలి ఈ నేల
వీటిని మించిన స్వర్గం వేరే కావాలా?
పచ్చదనం పసుపుదనం మాకు సిరులమ్మా
మా పల్లెసీమ భూదేవి కుంకుమ
మా పల్లెసీమ భూదేవి కుంకుమ

ఈ గాలి ఈ నేల
ఆహాహా...ఆఆఆఆ...





జీవించు ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి కానుక (1998)
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: ఎం.ఎం. కీరవాణి, వందేమాతరం  శ్రీనివాస్ , చిత్ర 

ఆ..ఆ..ఆ..అ అ ఆ..ఆ
హహహ..హహహ
హహహ..హహహ

జీవించు ప్రేమ
జీవించు ప్రేమ జంటైనూరేళ్లు
దీవించునమ్మా దిగివచ్చి దేవుళ్ళు
వర్ధిల్లు ప్రేమ వెలుగై వెయ్యేళ్ళు
శిరసొంచునమ్మా ఎదిరించే కాలాలు
సుడిగాలినాపె చెరసాల ఉందా?
కెరటాలనాపె శాసనముంటుందా?

జీవించు ప్రేమ జంటై నూరేళ్లు
దీవించునమ్మా దిగివచ్చి దేవుళ్ళు

హహహ..హహహ
హహహ.. హహహ

ఓపజాలై ప్రేమ కాలే హృదయ వేదం ఎన్నాళ్ళు?
చితులపాలై చెలిమి కోరే చిత్రవధ ఇంకెన్నాళ్లు?

చరితకు అంతటి సంబరమా? కలవని కథలంటే...
ఆశలు విరిసే నందనమా? అనార్కలీ సమాధి అంటే..
మరణిస్తేగాని మరలేదా ప్రేమ
చిగురాలయాల ప్రేమకు చిరునామా..
కథకానేగాని నిజమవ్వదా ఆ ప్రేమ..

కన్నీటిలో కథలు కరగాలా?
కార్చిచ్చులో వలపు రగలాలా?

జీవించు ప్రేమ.. ఆ... ఆ.. అఅ

జీవించు ప్రేమ
జీవించు ప్రేమ జంటైనూరేళ్లు
దీవించునమ్మా దిగివచ్చి దేవుళ్ళు

ఉప్పెనల్లె ముంచుకొచ్చే ముప్పుకే నువ్వు ఎదురీదు
ఏకగాను కదపలేని శిఖరమల్లే ఎదురించు...
కత్తుల వంతెన కట్టిన ఈ కక్ష్యను ఓడించు...
నెత్తుటి కాంతుల బాటలలో ప్రణయాన్ని గెలిపించు
కుత్తుకనే తెంచి కీర్తించే కాలం
నీ శక్తి ముందు నిలిచేనా నేస్తం
ప్రళయాన్ని గెలిచే ప్రణయం నీ శస్త్రం
కెరటాల పెనుగోష నీ గానం
గగనాన్ని చీల్చాలి ఆ నాదం

జీవించు ప్రేమ.. ఆ.. ఆ.. అఅ
కెరటాల పెనుగోష నీ గానం
గగనాన్ని చీల్చాలి ఆ నాదం
ఆ.. ఆ.. ఆ.. అఅ




మన్నించమ్మా.. ఓ ఓ ఓ... పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి కానుక (1998)
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: ఎస్.పి.బాలు

మన్నించమ్మా.. ఓ ఓ ఓ... ముద్దమందారమ ముగ్ధ సింగారమ
మన్నించమ్మా.. ఓ ఓ ఓ... ముద్దమందారమ ముగ్ధ సింగారమ
మోసగించి నిను మోసుకు వచ్చిన ఈ గాలిని
చల్లని జాబిలి ముసుగున వచ్చిన ఈ జ్వాలని
కాళరాత్రిలో నిన్ను వదిలి కనుమరుగై పోయెను కననీ..

మన్నించమ్మా.. ఓ ఓ ఓ.. ముద్దమందారమ ముగ్ధ సింగారమ
మన్నించమ్మా.. 
ఆ.. ఆ.. ఆ.. అఅ ఆ.. ఆ.. ఆ.. అఅఆ..

ఓఓఓ..
గంగను తాగిన సంద్రంలో చేదేమి పోదు అని
తేనె చినుకుతో తోడు కడితె ఏ తేడా రాదు అని
(అఅఆ..ఆ..ఆ..)

తెలియక చేశామో...తెలిసే తెలివిగ చేశామో....
అమృతాన్ని నింపుకున్న నీ హృదయాన్ని...
అమృతాన్ని నింపుకున్న నీ హృదయాన్ని
ఇంకని ఉప్పని కన్నీటితో నింపిన మా
నేరాన్ని..
(అఅ ఆ.. ఆ.. ఆ..) 

మన్నించమ్మా.. ఓ ఓ ఓ.. ముద్దమందారమ ముగ్ధ సింగారమ
మన్నించమ్మా.. 

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ... ఆ... అఅఆ..

ఓఓఓ..
మల్లెని నాటితె ఎడారిలో.. మధుమాసం రాదు అని
తులసిని నాటితె కీకారణ్యం పెరడై పోదు అని
అఅఆ..ఆ..ఆ..
తెలియక చేశామో...తెలిసే తెలివిగ చేశామో...
పారాణి పాదాల మాగాణి రాణీ..
పారాణి పాదాల మాగాణి రాణి
రాతియెదల ఈ కోటకు నిను బలిచేసిన మా పాపాన్ని

మన్నించమ్మా.. ఓ ఓ ఓ.. ముద్దమందారమ ముగ్ధ సింగారమ
మమించమ్మా....




సువ్వి సువ్వి సువ్వాలా... (Pathos) పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి కానుక (1998)
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: కె. ఎస్. చిత్ర

సువ్వి సువ్వి సువ్వాలా... మువ్వా గోపాలా...
నవ్వి నవ్వి ఈ వేళా.... రవ్వలు రేపాలా...

గువ్వా గువ్వా... వెన్నెల గువ్వా...
నా కన్నుల గూటికి రావా అఅఆ...
పువ్వా పువ్వా... పున్నమి పువ్వా...
నీ నవ్వుల కాంతిని తేవా...

ఏ మబ్బుల మాటున ఉన్నావో... గువ్వా...
ఏ కోవెల ఉందని అనగలనో...
గువ్వా... నను వదిలేశావా...

సువ్వి సువ్వి సువ్వాలా... మువ్వా గోపాలా...
నవ్వి నవ్వి ఈ వేళా.... రవ్వలు రేపాలా...





కోవెలలో... పావురమే... పాట సాహిత్యం

 
చిత్రం: పెళ్లి కానుక (1998)
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: కె. ఎస్. చిత్ర

కోవెలలో... పావురమే...
దేవుడు పంపిన దీవెన తానని అన్నదీ
గుండెలలో...  నమ్మకమే...
చెట్టును పుట్టను భక్తిగ పూజిస్తున్నది
నేల తల్లికి చేలే చీరలు నేస్తాయి
మల్లె కొమ్మకి పూలై తారలు వస్తాయి
నల్లధనం కల్లగుణం లేని మనసమ్మ
మా పల్లెసీమ ముత్తైదువమ్మ
మా పల్లెసీమ ముత్తైదువమ్మ

మా గాలి మా నేల
వాటిని మించిన స్వర్గం వేరే కావాలా?
పచ్చదనం పసుపుదనం మాకు సిరులమ్మా
మా పల్లెసీమ భూదేవి కుంకుమ
మా పల్లెసీమ భూదేవి కుంకుమ

మా గాలి మా నేల

Palli Balakrishna Thursday, July 29, 2021
చిత్రం: రత్నమాల (1948)
సంగీతం: సి. ఆర్. సుబ్బురామన్
సాహిత్యం:
గానం:
నటీనటులు: పి. భానుమతి, గోవింద రాజుల సుబ్బారావు, అక్కినేని నాగేశ్వరరావు, సి. ఎస్ ఆర్. ఆంజనేయులు
దర్శకత్వం: పి.ఎస్.రామకృష్ణారావు
నిర్మాణ సంస్థ: భరణీ పిక్చర్స్
నిర్మాత: పి. ఎస్. రామకృష్ణా రావు
విడుదల తేది: 02.01.1948

Palli Balakrishna Tuesday, May 11, 2021




చిత్రం: స్వర్గ సీమ (1945)
సంగీతం: చిత్తూరి వి నాగయ్య, ఓగిరాల  రామచంద్రరావు 
నటీనటులు: చిత్తూరి వి నాగయ్య, యన్.రంగ స్వామి, సి.హెచ్.నారాయణ రావు, భానుమతి, రామకృష్ణ
దర్శకత్వం: బి.యన్.రెడ్డి
నిర్మాణ సంస్థ: న్యూటోక్ స్టూడియోస్ 
విడుదల తేది: 01.01.1945



Songs List:



Palli Balakrishna Wednesday, March 20, 2019


చిత్రం:  విప్రనారాయణ (1954)
సంగీతం:  సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం:  సముద్రాల సీనియర్
గానం:  భానుమతి రామకృష్ణ
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి రామకృష్ణ
దర్శకత్వం: పి.ఎస్.రామకృష్ణారావు
నిర్మాత: పి.ఎస్.రామకృష్ణారావు
సమర్పణ: భానుమతి రామకృష్ణ
విడుదల తేది: 10.12.1954

(పి.ఎస్.రామకృష్ణారావు గారు భానుమతి గారి భర్త)

పల్లవి:
విరహే.. ఏ.. ఏ.. ఏ.. ఏ.. తవ దీనా... ఆ ఆ.. ఆ ఆ ఆ ఆ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా

చరణం: 1
నిందతి చందన మిందు కిరణమను విందతి ఖేద మదీరం
వ్యాల నిలయ మిలనేన గరళమివ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వ్యాల నిలయ మిలనేన గరళమివ కలయతి మలయ సమీరం
సావిరహే తవ దీనా

చరణం: 2
కుసుమ విషిఖసర తల్పం అనల్ప విలాస కళా కమనీయం
వ్రతమివ తవ పరిరంభ సుఖాయ
వ్రతమివ తవ పరిరంభ సుఖాయ కరోతి కుసుమ శయనీయం
సావిరహే తవ దీనా

చరణం: 3
ప్రతిపదం ఇదమపి నిగదతి మాధవ
నిగదతి మాధవ
నిగదతి మాధవ తవ చరణే పతితాహం
త్వయి విముఖే మయి సపది సుధానిధి రపి తనుతే తనుదాహం

సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా రాధ
సావిరహే తవ దీనా
కృష్ణ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ తావవిరహే తవ దీనా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ


******  ******  ******


చిత్రం:  విప్రనారాయణ (1954)
సంగీతం:  సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం:  ఏ. ఎం. రాజా

పల్లవి :
మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా

భాసిల్లెనుదయాద్రి బాల భాస్కరుడు
వెదజల్లె నెత్తావి విరబూచి విరులు
విరితేనెలాని మైమరచు తుమ్మెదలు
లేచెను విహగాళి లేచెను నిదురా

చల్లచల్లగ వీచె పిల్ల తెమ్మెరలు
రేయి వేగినది వేళాయె పూజలకు

మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా

చరణం: 1
పరిమళద్రవ్యాలు బహువిధములౌ నిధులు గైకొని దివ్యులు
కపిలధేనువును అద్దమ్ముపూని మహర్షి పుంగవులు
మురువుగా పాడ తుంబురు నారదులును
నీ సేవకై వచ్చె నిలచియున్నారు
సకుటుంబముగ సురేశ్వరులు
కానుకలు గైకొని మొగసాల కాచియున్నారు

మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా

చరణం: 2
దేవరవారికై పూవుల సరులు తెచ్చిన
తొండరడిప్పొడి మురియ
స్నేహదయాదృష్టి చిల్కగా జేసి
పెద్దను విడి కటాక్షింప రావయ్యా

మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా


******  ******  ******


చిత్రం:  విప్రనారాయణ (1954)
సంగీతం:  సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం:  ఏ. ఎం. రాజా

పల్లవి:
పాలించరా రంగా పరిపాలించరా రంగా
కరుణాంతరంగ శ్రీరంగా..ఆ..ఆ
కరుణాంతరంగ శ్రీరంగా...
పాలించర రంగా..

చరణం: 1
మరువని తల్లివి... తండ్రివి నీవని...
మరువని తల్లివి... తండ్రివి నీవని
నెరనమ్మితిరా రంగా...
మొరవిని పాలించే..ఏ.. దొరవని
మొరవిని పాలించే..ఏ..ఏ.. దొరవని
శరణంటినిరా... శ్రీరంగా
పాలించర రంగా...

చరణం: 2
మనసున నీ స్మృతి మాయకమునుపే ...
మనసున నీ స్మృతి మాయకమునుపే
కనులను పొరలూ మూయకమునుపే
కనరారా... ఆ... ఆ...
కనరారా నీ కమనీయాకృతి
కనియద మనసారా ..ఆ..ఆ...రంగా
కనియద మనసారా...
పాలించరా రంగా ...పరిపాలించరా రంగా

చరణం: 3
కరులును హరులును మణిమందిరములు
కరులును హరులును మణిమందిరములు
సురభోగాలను కోరనురా ...సురభోగాలను కోరనురా
దరి కనరానీ భవసాగరమును....
దాటించుమురా గరుడ తురంగా...

పాలించరా రంగా పరిపాలించరా రంగా
కరుణాంతరంగ శ్రీరంగా..ఆ..ఆ
పాలించర రంగా..


******  ******  ******


చిత్రం:  విప్రనారాయణ (1954)
సంగీతం:  సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం:  ఏ. ఎం. రాజా

పల్లవి:
చూడు మదే చెలియా కనులా...చూడు మదే చెలియా
చూడు మదే చెలియా కనులా...చూడు మదే చెలియా

బృందావనిలో నందకిషోరుడు...
బృందావనిలో నందకిషోరుడు... అందముగా దీపించే లీల
చూడు మదే చెలియా కనులా... చూడు మదే చెలియా

చరణం: 1
మురళీకృష్ణుని మోహనగీతికి...
మురళీ కృష్ణుని మోహనగీతికి...పరవశమైనవి లోకములే...ఏ..
పరవశమైనవి లోకములే... విరబూసినవి పొన్నలు.. పొగడలు
విరబూసినవి పొన్నలు పొగడలు...
పరిమళం ఎగసెను మలయానిలమున తూలెను .. యమునా

చూడు మదే చెలియా కనులా...చూడు మదే చెలియా

చరణం: 2
నారి నారి నడుమ మురారి...
నారి నారి నడుమ మురారి...
హరికి.. హరికి నడుమ వయ్యారి
హరికి.. హరికి నడుమ వయ్యారి...
తానొకడైనా ..ఆ..ఆ..ఆ..ఆ...ఆ
తానొకడైనా ... తలకొక రూపై
తానొకడైనా... తలకొక రూపై...
మనసులు దోచే రాధా మాధవ కేళి నటనా...

చూడు మదే చెలియ ...కనులా...చూడు మదే చెలియా


******  ******  ******


చిత్రం:  విప్రనారాయణ (1954)
సంగీతం:  సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల సీనియర్
గానం:  భానుమతి రామకృష్ణ

పల్లవి:
ఓ..ఓ..ఓ..ఓ..ఓ....ఓ
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా...
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా...

ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా....

చరణం: 1
వన్నెవన్నె చిన్నెలేను ఈ విలాసం...
వన్నెవన్నె చిన్నెలేను ఈ విలాసం
చందమామ చిన్నబోవు ఈ ప్రకాశం...
నిన్నేలువాని లీలలేరా..
నిన్నేలువాని లీలలేరా..
కన్నార కనరా ఏలుకోరా..
కన్నార కనరా ఏలుకోరా...

ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా...
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా...

చరణం: 2
అందరాని విందుపైన ఆశలేలా
అందరాని విందుపైన ఆశలేలా..
పొందుకోరు చిన్నదాని పోందవేలా...
అందాలరాయా అందరారా...
అందాలరాయా అందరారా...
అనందమిదియే అందుకోరా
అనందమిదియే అందుకోరా...ఓ..ఓ..ఓ..

ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా...
ఎందుకోయి తోటమాలి అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్ని తపోధనా...




Palli Balakrishna Friday, March 15, 2019



చిత్రం: గృహప్రవేశం (1946)
సంగీతం: నళినీ కాంతారావు (బాలాంత్రపు రజనీ కాంతారావు)
సాహిత్యం: నళినీ కాంతారావు (All)
నటీనటులు: ఎల్.వి.ప్రసాద్, కాంతారావు, భానుమతి రామకృష్ణ, నళిని, శ్రీరంజని, హేమలత
దర్శకత్వం: ఎల్.వి.ప్రసాద్
నిర్మాణం: సారధి స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేది: 04.10.1946

(ఎల్.వి.ప్రసాద్ గారికి దర్శకుడు గా తొలి సినిమా అలాగే బాలాంత్రపు రజనీ కాంతారావు గారు నళినీ కాంతారావు అనే మారు పేరుతో ఈ సినిమాలో సంగీతం అందించడం తో పాటు పాటలు కూడా రాశారు, రజనీ కాంతారావు గారి సోదరుడు నళినీ కాంతారావు కూడా గొప్ప రచయితయే. ఇందులో పెండ్యాల నాగేశ్వరరావు రజనీ గారికి సహాయ సంగీత దర్శకుడు గా పని చేయటం విశేషం. అలాగే ఘంటసాల మాస్టారును రేడియోకి పరిచయం చేసింది రజనీ గారే .అందుకే మాస్టారి మాస్టర్ పీస్ "భగవద్గీత" ను ఘంటసాలగారు రజని గారి సువర్ణ హస్తాలతోనే ఆవిష్కరింప జేశారు. రజనీ కాంతారావు గారు సంగీతాన్ని అందించిన స్వర్గ సీమ సినిమాలో పాడి ఘంటసాల  తెరంగేట్రం చేశారు)



Songs List:



అనగనగా ఒక రాణి పాట సాహిత్యం

 
చిత్రం: గృహప్రవేశం (1946)
సంగీతం: నళినీ కాంతారావు
సాహిత్యం: నళినీ కాంతారావు
గానం: పి. భానుమతి

అనగనగా ఒక రాణి నోరులేని పసిపాపలపై ఎంతో జాలి 




అమ్మా అమ్మా నీ నయనమ్ముల పాట సాహిత్యం

 
చిత్రం: గృహప్రవేశం (1946)
సంగీతం: నళినీ కాంతారావు
సాహిత్యం: నళినీ కాంతారావు
గానం: పి. భానుమతి

అమ్మా అమ్మా నీ నయనమ్ముల ఆశాజ్యోతులు నిండుగ 



ఏమగునో నా జీవితమిక పాట సాహిత్యం

 
చిత్రం: గృహప్రవేశం (1946)
సంగీతం: నళినీ కాంతారావు
సాహిత్యం: నళినీ కాంతారావు
గానం: పి. భానుమతి

ఏమగునో నా జీవితమిక ఎటు పోవునోయీ చుక్కాని లేని




గృహప్రవేశమిదే పాట సాహిత్యం

 
చిత్రం: గృహప్రవేశం (1946)
సంగీతం: నళినీ కాంతారావు
సాహిత్యం: నళినీ కాంతారావు
గానం: పి. భానుమతి & బృందం

గృహప్రవేశమిదే మహా గృహప్రవేశమిదే 



జానకి నాదేనోయి పాట సాహిత్యం

 
చిత్రం: గృహప్రవేశం (1946)
సంగీతం: నళినీ కాంతారావు
సాహిత్యం: నళినీ కాంతారావు
గానం: సి. యుస్. ఆర్. ఆంజనేయులు

జానకి నాదేనోయి మదిలో కోరిక తీరేనోయి 



ధన్యుడనైతినహా తులసమక్కా పాట సాహిత్యం

 
చిత్రం: గృహప్రవేశం (1946)
సంగీతం: నళినీ కాంతారావు
సాహిత్యం: నళినీ కాంతారావు
గానం: సి. యుస్. ఆర్. ఆంజనేయులు

ధన్యుడనైతినహా తులసమక్కా తులసమక్కా




బానిసలం బానిసలం పాట సాహిత్యం

 
చిత్రం: గృహప్రవేశం (1946)
సంగీతం: నళినీ కాంతారావు
సాహిత్యం: నళినీ కాంతారావు
గానం: పి. భానుమతి బృందం

బానిసలం బానిసలం భారతనారి మగువలం




మారుతుందోయి ధర్మము పాట సాహిత్యం

 
చిత్రం: గృహప్రవేశం (1946)
సంగీతం: నళినీ కాంతారావు
సాహిత్యం: నళినీ కాంతారావు
గానం: ఘంటసాల

మారుతుందోయి ధర్మము యుగయుగమ్ముల లోకవర్తన 




వెదుకాడదేల నోయి పాట సాహిత్యం

 
చిత్రం: గృహప్రవేశం (1946)
సంగీతం: నళినీ కాంతారావు
సాహిత్యం: నళినీ కాంతారావు
గానం: పి. భానుమతి

వెదుకాడదేల నోయి వెదుకాడదేల నోయి 





స్వర్గసీమను కులుకు పాట సాహిత్యం

 
చిత్రం: గృహప్రవేశం (1946)
సంగీతం: నళినీ కాంతారావు
సాహిత్యం: నళినీ కాంతారావు
గానం: సి. యస్. ఆర్. ఆంజనేయులు

స్వర్గసీమను కులుకు శ్రీదేవతవు నీవు ( పద్యాలు )





హాలహలమెగయునో పాట సాహిత్యం

 
చిత్రం: గృహప్రవేశం (1946)
సంగీతం: నళినీ కాంతారావు
సాహిత్యం: నళినీ కాంతారావు
గానం: యం. యస్. రామారావు, పి. భానుమతి

హాలహలమెగయునో మధురామృతమె కురియునో 

Palli Balakrishna Tuesday, March 5, 2019



చిత్రం: తోడు నీడ (1965)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ (All)
నటీనటులు:  యన్.టి.రామారావు, భానుమతి రామకృష్ణ, జమున
మాటలు: సముద్రాల జూనియర్
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
నిర్మాతలు: యన్.యన్.భట్, ఎ. రామిరెడ్డి
విడుదల తేది: 12.05.1965



Songs List:



వలపులోని పాట సాహిత్యం

 
చిత్రం: తోడు-నీడ (1965)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.బి.శ్రీనివాస్, యస్.జానకి

వలపులోని



ఎన్నో రాత్రులు పాట సాహిత్యం

 
చిత్రం: తోడు-నీడ (1965)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: భానుమతి 

ఎన్నో రాత్రులు 



మళ్లున్నా మాణ్యాలున్నా...పాట సాహిత్యం

 
చిత్రం: తోడు నీడ (1965)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: ఘంటసాల, పి.సుశీల 

పల్లవి:
మళ్లున్నా మాణ్యాలున్నా...మంచె మీద మగువ ఉండాలి
పాడి ఉన్నా పంటలు ఉన్నా...పంచుకొనే మనిషి ఉండాలి
మళ్లున్నా మాణ్యాలున్నా...మంచె మీద మగువ ఉండాలి
పాడి ఉన్నా పంటలు ఉన్నా...పంచుకొనే మనిషి ఉండాలి

చరణం: 1
పైరు మీది చల్లని గాలి
పైట చెరగును ఎగరేయాలి
పైరు మీది చల్లని గాలి
పైట చెరగును ఎగరేయాలి
పక్కన ఉన్న పడుచువానికి
పరువం ఉరకలు వేయాలి
పక్కన ఉన్న పడుచువానికి
పరువం ఉరకలు వేయాలి

మళ్లున్నా మాణ్యాలున్నా
మంచె మీద మగువు ఉండాలి
పాడి ఉన్నా పంటలు ఉన్నా
పంచుకోనే మనిషి ఉండాలి

చరణం: 2
ఏతమెక్కి గడవేస్తుంటే
ఎవరీ మొనగాడనుకోవాలి
ఎవరీ మొనగాడనుకోవాలి
ఏతమెక్కి గడవేస్తుంటే
ఎవరీ మొనగాడనుకోవాలి
ఎవరీ మొనగాడనుకోవాలి

వంగి బానలు చేదుతు ఉంటే
వంపుసొంపులు చూడాలి
వంగి బానలు చేదుతు ఉంటే
వంపుసొంపులు చూడాలి
మళ్లున్నా మాణ్యాలున్నా
మంచెమీద మగువ ఉండాలి
పాడి ఉన్నా పంటలు ఉన్నా
పంచుకొనే మనిషి ఉండాలి

చరణం: 3
కాలి దువ్వి కోవెల బసవడు
ఖంగుమని రంకేయాలి
కాలి దువ్వి కోవెల బసవడు
ఖంగుమని రంకేయాలి
దడవనులే మావారున్నారు
వారి ఎదలో నేనుంటాను...
దడవనులే మావారున్నారు
వారి ఎదలో నేనుంటాను...

మళ్లున్నా మాణ్యాలున్నా
మంచెమీద మగువ ఉండాలి
పాడి ఉన్నా పంటలు ఉన్నా
పంచుకొనే మనిషి ఉండాలి
పాడి ఉన్నా పంటలు ఉన్నా
పంచుకొనే మనిషి ఉండాలి





అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మా... పాట సాహిత్యం

 
చిత్రం: తోడు-నీడ (1965)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల 

పల్లవి:
ఓఒల్ల్ల ఆయీ ఆయీ హాయి హాయి హాయి హాయి
ఓఒల్ల్ల హాయి లాలీ లాలీ లాలీ లాలి ...

అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మా...ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా...
అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మా...ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా...

ఆడుకొని ఆడుకొని అలసిపోతివా...ఆడుకొని ఆడుకొని అలసిపోతివా...
అలుపు తీర బజ్జో మా అందాల బొమ్మ
అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మా...ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా..

చరణం: 1
అమ్మలు కన్నుళ్ళు తమ్మి పూవుళ్ళు...
అమ్మలు కన్నుళ్ళు తమ్మి పూవుళ్ళు...
తమ్మి పూవులు పూయు తలిరు వెన్నెల్లు
తమ్మి పూవులు పూయు తలిరు వెన్నెల్లు...

ఆ వెన్నెలను ముసేనే కన్నీటి జల్లు...
వెన్నెలను ముసేనే కన్నీటి జల్లు.
కన్నీరు రానీకు కరుగు నెడదల్లు ....
ఓఒల్ల్ల ఆయీ....
అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మా...ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా..

చరణం: 2
కనిపించే దేవుళ్ళు కమ్మని పాపళ్లు..
కనిపెంచే తల్లికి కన్నుల జ్యోతుళ్లు...
వేయాలి పాపాయి తప్పతడుగుళ్లు...
వేయాలి పాపాయి తప్పతడుగుళ్లు...
చేయాలి ఆపైన గొప్ప చేతలు ....

ఓఒల్ల్ల ఆయీ ఆయీ హాయి హాయి హాయి హాయి
ఓఒల్ల్ల హాయి లాలీ లాలీ లాలీ లాలి ...
అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మా...ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా..
అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మా...ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా..



జోలపాట పాట సాహిత్యం

 
చిత్రం: తోడు-నీడ (1965)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: భానుమతి 

జోలపాట 



మోహిని భస్మాసుర పాట సాహిత్యం

 
చిత్రం: తోడు-నీడ (1965)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, పి.సుశీల 

మోహిని భస్మాసుర

Palli Balakrishna Saturday, March 2, 2019




చిత్రం: అమ్మాయి పెళ్లి (1974)
సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: యన్.టి.రామారావు, చంద్రమోహన్, శ్రీకాంత్, భానుమతి రామకృష్ణ, లత సేతుపతి
నిర్మాత , దర్శకత్వం: భానుమతి రామకృష్ణ
విడుదల తేది: 07.03.1974



Songs List:



వందనము రఘునందనా పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మాయి పెళ్లి (1974)
సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: త్యాగరాజ - కృతి
గానం: భానుమతి

వందనము రఘునందనా
సేతు బంధనా భకచందనా 
రామా....

||వందనము||

శ్రీదమా నాతో వాదమా
నే భేదమా యిది మోదమా
రామా....

||వందనము||

న్యాయమా నీ కాదాయమా
యింత హేయమా మునిగేయమా 
రామా....

||వందనము||

వేగ రా కరుణాసాగరా
శ్రీ త్యాగరాజ హృదయాకరా 
రామా....

||వందనము||



నా కనుల ముందర పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మాయి పెళ్లి (1974)
సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: శ్రీ దాశరధి
గానం: భానుమతి

నా కనుల ముందర నువ్వుంటే
నీ మనసునిండా నేనుంటే
లేనిదేమిటీ లోకంలో ?
వున్నదేమిటి ఆ స్వర్గంలో

నా మదిలో కలలన్నీ
ఈ నదిలో అలలైతే
ఆ అలల నావపై నీవూ నేనూ
తేలిపోదాము జతగా సాగిపోదాము
నవ్వులతో జీవితమే
కళ కళ కళ కళ లాడగ... 

నా కనుల

నీ ప్రేమే పెన్నిధిగా
నీ సేవే నా విధిగా
నీవూ - నేనూ
ఆ మమతలన్ని పంచుకుందాము
జతగా పంచుకుందాము
మన యిల్లంతా పిల్లలతో
కిల కిల కిల కిల లాడగ

నా కనుల




పాలరాతి బొమ్మకు పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మాయి పెళ్లి (1974)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం:  దాశరథి
గానం: ఎస్.పి. బాలు, జానకి 

పల్లవి:
పాలరాతి బొమ్మకు నీ వగలెక్కడివి?
పొగడపూల కొమ్మకు నీ సొగసెక్కడిది?...
నెలరాజులోనా...వలరాజులోన నీ...వలపెక్కడిది?
నెలరాజులోన నీ చలువెక్కడిది?
వలరాజులోన నీ వలపెక్కడిది?...

పాలరాతి బొమ్మకు...పొగడపూల కొమ్మకు 
నీ సొగసెక్కడిది...

చరణం: 1
కలువపూలు తెల్లవారితే కమిలిపోవును
నీ కనులైతే కలకాలం వెలుగుచిందును
కలువపూలు తెల్లవారితే కమిలిపోవును
నీ కనులైతే కలకాలం వెలుగుచిందును

ఆ..ఆ..మధువు తీపి అంతలోనే మాసిపోవును
నీ పలుకు తీపి బ్రతుకంతా నిలిచియుండును

పాలరాతి బొమ్మకు నీ వగలెక్కడివి
పొగడపూల కొమ్మకు నీ సొగసెక్కడిది...
నెలరాజులోనా వలరాజులోన నీ వలపెక్కడిది 

చరణం: 2
నీలినీలి మేఘాలు గాలికి చెదిరేను
నీ కురుల నీడ ఎల్లప్పుడు నాకే దక్కేను
నీలినీలి మేఘాలు గాలికి చెదిరేను
కురుల నీడ ఎల్లప్పుడు నాకే దక్కేను


గలగలమని సెలయేరు కదలిపోవునూ
కానీ నీలోని అనురాగం నిలిచి ఉండును

పాలరాతి బొమ్మకు నీ వగలెక్కడివి
పొగడపూల కొమ్మకు నీ సొగసెక్కడిది...
నెలరాజులోనా వలరాజులోన నీ వలపెక్కడిది

నెలరాజులోన నీ చలువెక్కడిది
వలరాజులోన నీ వలపెక్కడిది...
పాలరాతి బొమ్మకు పొగడపూల కొమ్మకు 
నీ సొగసెక్కడిది...



బాబూ నిదుర పోరా! పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మాయి పెళ్లి (1974)
సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: శ్రీ ఆత్రేయ
గానం: శ్రీ ఘంటసాల

బాబూ నిదుర పోరా!
బాబ్బాబూ విదురపోరా
పాట పాడమని నన్నేడిపించీ పరువు
తీయకురా బాబూ పరువు తీయకురా!

బాబూ నిదుర పోరా,
నా బాబూ నిదురపోరా
ఏడ్చి ఏడ్చి నీ నీలాల కన్నులు ఎంత ఎర్రనైనా
తెల్లవార్లు నువ్వు ఇలా మేలుకున్నా
నేనమ్మను కాలేను మీ అమ్మను తేలేను

తూగుముఖంతో తూగుటుయ్యలను
ఊపుతుండగలను బాబూ
ఊపుతుండగలను

బాబూ

మీ అమ్మ మీద అనురాగం తప్ప
వేరే రాగం ఎరగనురా
మీ అమ్మ మాటకు తాళం తప్ప
వేరే తాళం తెలియదురా

పాట పాడినా తానే
మాటలాడినా తానే
మీతో పాటే జోలలు పాడి
నన్నూ నిద్దుర పుచ్చేదీ 

బాబూ!




అమ్మా! నాన్నా, జగడంలో పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మాయి పెళ్లి (1974)
సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: శ్రీ దాశరధి, గణపతి శాస్త్రి
గానం: జానకి, వసంత, సావిత్రి

అమ్మా! నాన్నా, జగడంలో అన్నం సున్నాయే
కళకళలాడే మన యిల్లు, కలతల పాలాయే
మనసులలోన నిలిచిన తెరలు, తొలగేదెన్నటికో

యింటికి నడుమ నిలిచిన గోడ పోయే దెప్పటికో?
నాన్న వండిన వంటకాలలో ఉప్పే లేదాయే
మా కడుపులలో ఎలకలు దూరి గడబిడ చేశాయే
స్కూలుకు ఫీజు నాన్నివ్వాలో
అమ్మే మనకు తల దువ్వాలి
జేబు ఖర్చుకు నాన్నివ్వాలి
మనకు యిద్దరూ కావాలీ
ఆకలీ, ఆకలీ....ఆకలీ,

" అమ్మా"

ఎద్దులు రెండూ గుద్దులాడితే ఏమిటి బండి గతీ
బ్యాటూ బంతి పోటీ పడితే ఏమిటి ఆట గతీ!
అమ్మా నాన్న దెబ్బలాడితే ఏమిటి యింటి గతీ!
ఈ పంతాలూ యీ కోపాలూ పోయే దెన్నటికీ

నాన్నే పాఠం నేర్పించాలి
అమ్మే అన్నం వడ్డించాలీ
ఇంట్లో శాంతి నిండాలీ
మనకు యిద్దరూ కావాలి, 
శాంతి, శాంతి, శాంతీ!

"అమ్మా నాన్నా"




గుడుగుడుగుడు చెడుగుడు ు పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మాయి పెళ్లి (1974)
సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: శ్రీ కొసరాజు
గానం: మాధవ పెద్ది, పిఠాపురం, ఛాయాదేవి

గుడుగుడుగుడు చెడుగుడు 
బలె బలె బలె చెడుగుడు

ఒక చక్కని చుక్కని చూశాను
ఉక్కిరి బిక్కిరి అయ్యాను

గుడు గుడు

సా... సా... సా... సా... సా...

ఎంతో బాగున్నదిరా
పిల్ల ఎంతో బాగున్నదిరా
నేనేమని పొగడేదిరా
నాజానీ, అలివేణీ, పూబోణి, బఠాణీ

అరె బ్యూటీ  రాణీ వున్నదిరా
బొమ్మలాగ నుంచున్నదిరా
మరబొమ్మలా నడుస్తున్నదిరా

ఆ పిల్లకోసమై తల కిందుగా
తపస్పేన చేస్తానూ
పసులెన పడివుంటాను
నే పస్తులైన పడివుంటాను

ఆ పిల్లను నేనూ చంక నేసుకొని
చంద్రమండలం పోతానోయ్
చంద్రమండలం పొయ్యావంటే
జర్రున జారి పడతావోయ్
నువ్వు జారి పడతావోయ్

నే జర్రున జారి అమ్మాయ్ ఒళ్లో
టపుక్కునొచ్చి పడతానోయ్ 
నే చల్లగ వొచ్చి పడతానోయ్

గుడుగుడు

హల్లో హల్లో ఓ లేడీ
మన యిద్దరికి సరియైన జోడి
హల్లో, హలో మె లేడీ
నోర్మూసుకోవోయ్ బోడీ

నాన్సెన్స్ , ఏమిటే నిరక్షరకుక్షీ !
ఏడిశావురా పక్షి 
ఏమన్నావే కామాక్షీ, మీనాక్షీ, లేపాక్షీ, చపలాక్షీ
ఎవరే పక్షి - ఎవరే నువ్వన్నా పక్షి
నును నును నును నును నువ్వే
నెనె నెనె నెనె నెనె నేనా .... ?
మిమి మిమి మిమి మిమి మీరే
మీ గుడు గుడు గుంజా లేమిట్రా
చెడుగుడులో సత్తా చూపండ్రా ! 

||గుడుగుడు!!




ఈ జీవితం ఇంతేనా ? పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మాయి పెళ్లి (1974)
సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: శ్రీ దాశరధి
గానం: శ్రీమతి భానుమతి

ఈ జీవితం ఇంతేనా ?
కన్నీటిధారయేనా
యేనాటికెనా యీ యింటిలోనా
చిరునవ్వు చిగురించునా 

ఈ జీవితం

నిండెన యిల్లు రెండాయె నేడు
ఏనాటి శాపమో 
చిన్నారి హృదయాల వేదనా
ఎపుడైనా తీరునా
యిన్నేళ్ళు ఎంతెంతో ఆశతో
కలగన్న స్వర్గం యిదా, యిదా, యిదా

రోషాలు పెరిగి
ద్వేషాలు రగిలి
చెలరేగే జ్వాలలూ
ఎదురాయె ఎడబాటు గోడలు
పంతాల క్రీనీడలూ
యిన్నాళ్లు ఎంతెంతో ఆశతో
కలగన్న స్వరం యిదా, యిదా, యిదా -

ఈ జీవితం





రాధికా కృష్ణా... పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మాయి పెళ్లి (1974)
సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: జయ దేన విరచితమైన గీతగోవిందంలోని అష్టపది
గానం: శ్రీమతి భానుమతి

రాధికా కృష్ణా... రాధికా 
తవ విరహే ! కేశవా 

సన వినిహిత మపి హారము దారం
సా మను తేకృశ తనురివ భారం 

దిశి దిశి కిరతి సజల కణ జాలం
నయన నళిన మివ విగళిత నాళం
నయన విషయ మపి కిసలయ తల్పం
కలయతి విహిత హ్రతాళన కల్పం

రాధికా కృష్ణా  కృష్ణా కృష్ణా 
కృష్ణా హరి తపవిరహే కేశవ

హరిరితి హరిరితి జపరి సకామం
విరహ విహిత మరణేవ నికామం
శ్రీ జయదేవ ఫణితమితి గీతం 
సుఖయతు కేశవ పదముప నీతమ్ 
రాధికా కృష్ణా కృష్ణా కృష్ణా 
రాధికా కృష్ణా రాధికా...

తవవిరహే కేశవా 
తవవిరహే కేశవా 
తవవిరహే కేశవా 





మధురమైన ఈ రోజూ పాట సాహిత్యం

 
చిత్రం: అమ్మాయి పెళ్లి (1974)
సంగీతం: భానుమతి రామకృష్ణ , చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల

మధురమైన ఈ రోజూ
మరపు రాదుతే 
మనసులలో యీ వేళ
మందారాలు వీచేలే
అనురాగ రాగమాల లందుకోనీ
అపస్వరాల నీడలింక తొలగిపోనీ
రాగం, తాళం, పల్లవి, పలవించనీ
శుభగీతి పలుకనీ

మధురమైన


అమ్మా నాన్నలు మనకు
రెండు కళగా
కనురెప్పల నీడల పెరగాలి చల్లగా
ఏకలతల చీకటులు
లేని కాపురం అదే కాంతి గోపురం

మధురమైన

Palli Balakrishna Friday, February 22, 2019



చిత్రం: పుణ్యావతి (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి (All)
నటీనటులు: యన్. టి.రామారావు, శోభన్ బాబు, కృష్ణ కుమారి, యస్.వి.రంగారావు, భానుమతి
కథ: నిహార్ రాజన్ గుప్తా
మాటలు (డైలాగ్స్): డి.వి.నరసరాజు
దర్శకత్వం: వి.దాదా మిరాసీ
నిర్మాత: వాసు మీనన్
సినిమాటోగ్రఫీ: జగిర్ధార్
ఎడిటర్స్: కె.నారాయణన్ , కె.శంకుణ్ణి
బ్యానర్: వాసు స్టూడియోస్
విడుదల తేది: 03.11.1967



Songs List:



భలే బాగుంది అదే జరిగింది పాట సాహిత్యం

 
చిత్రం: పుణ్యావతి (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి 
గానం: పి.లీల

పల్లవి:
భలే బాగుంది అదే జరిగింది
వలపు చిగురులు వేసింది 
నా మనసు పరుగులు తీసింది
భలే బాగుంది అదే జరిగింది
వలపు చిగురులు వేసింది 
నా మనసు పరుగులు తీసింది

భలే బాగుంది అదే జరిగింది

చరణం: 1
పొంగిన లేత పరువానే 
అందెను నేల గగనానే
పువ్వును పాడెను తీగెను ఆడెను
నాలో నాలో ఈనాడు

భలే బాగుంది అదే జరిగింది
వలపు చిగురులు వేసింది 
నా మనసు పరుగులు తీసింది

చరణం: 2
నీ కనునీడలొ ఉంటాను  
నా కలలే కనుగున్నాను
నీ కనునీడలొ ఉంటాను  
నా కలలే కనుగున్నాను
నీలో కలిసి నాలో విరిసి
నీలో కలిసి నాలో విరిసి
నీవే నేనై ఉన్నాను

భలే బాగుంది అదే జరిగింది
వలపు చిగురులు వేసింది 
నా మనసు పరుగులు తీసింది
హోయ్ భలే బాగుంది అదే జరిగింది




ఎంత సొగసుగా ఉన్నావూ పాట సాహిత్యం

 
చిత్రం: పుణ్యావతి (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
ఎంత సొగసుగా ఉన్నావూ ...ఎలా ఒదిగిపోతున్నావూ
కాదనకా..ఔననకా..కౌగిలిలో దాగున్నావూ

ఎంత సొగసుగా వున్నావూ..ఆహాహాహా..
ఎలా ఒదిగి పోతున్నావూ..ఆహహాహా...
కాదనకా..అహా
ఔననకా..ఆహా..
కౌగిలిలోదాగున్నావూ..
ఎంతసొగసుగా ఉన్నావూ...

చరణం: 1
అందీ అందని హంసల నడకలు.. ముందుకు రమ్మనెనూ..ఆ ఆ
చిందీ చిందని చిరుచిరు నవ్వులు ఎందుకు పొమ్మనెనూ..ఆ ఆ
అందీ అందని హంసల నడకలు.. ముందుకు రమ్మనెనూ
చిందీ చిందని చిరుచిరు నవ్వులు ఎందుకు పొమ్మనెనూ
నీ తనువే.. తాకగనే.. నామది ఝుమ్మనెనూ 

ఎంత సొగసుగా వున్నావూ..ఆహాహాహా..
ఎలా ఒదిగి పోతున్నావూ..ఆహహాహా...
కాదనకా..అహా
ఔననకా..ఆహా..
కౌగిలిలోదాగున్నావూ..

ఎంతసొగసుగా ఉన్నావూ...

చరణం: 2
తడిసీ తడియని నీలికురులలో..కురిసెనుముత్యాలూ..ఆ ఆ
విరిసీ విరియని వాలుకనులలో..మెరిసెను నీలాలూ..ఆ ఆ
తడిసీ తడియని నీలికురులలో..కురిసెనుముత్యాలూ
విరిసీ విరియని వాలుకనులలో..మెరిసెను నీలాలూ
పులకించే..పెదవులపై..పలికెను పగడాలూ

ఎంత సొగసుగా వున్నావూ..ఆహాహాహా..
ఎలా ఒదిగి పోతున్నావూ..ఆహహాహా...
కాదనకా..అహా
ఔననకా..ఆహా..
కౌగిలిలోదాగున్నావూ..
ఎంతసొగసుగా ఉన్నావూ... 



పెదవులపైన సంగీతం పాట సాహిత్యం

 
చిత్రం: పుణ్యావతి (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల

పెదవులపైన సంగీతం




మనసు పాడింది పాట సాహిత్యం

 
చిత్రం: పుణ్యావతి (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:
మనసు పాడింది సన్నాయి పాట
మనసు పాడింది సన్నాయి పాట
కనులు ముకుళించగ... తనువు పులకించగా
గగనమే పూల తలంబ్రాలు కురిపించగా.. ఆ ఆ ....

మనసు పాడింది సన్నాయి పాట

చరణం: 1
జగమే కల్యాణ వేదికగా..సొగసే మందార మాలికగా
జగమే కల్యాణ వేదికగా..సొగసే మందార మాలికగా
తొలిసిగ్గు చిగురించగా..ఆ ఆ ఆ ఆ
తొలిసిగ్గు చిగురించగా... నా అలివేణి  తలవాల్చిరాగ 

మనసు పాడింది సన్నాయి పాట...

చరణం: 2
చిలికే పన్నీటి వెన్నెలలోనా.. పిలిచే విరజాజి పానుపుపైనా
చిలికే పన్నీటి వెన్నెలలోనా.. పిలిచే విరజాజి పానుపుపైనా
వలపులు పెనవేసుకోగా..ఆ..
వలపులు పెనవేసుకోగా ... నా వనరాజు ననుచేర రాగా

మనసు పాడింది సన్నాయి పాట...

చరణం: 3
మదిలో దాచిన మమతలతేనెలు.. పెదవులపైనే కదలాడగా
మదిలో దాచిన మమతలతేనెలు.. పెదవులపైనే కదలాడగా
పెదవులకందనీ మధురిమలేవో..ఓ..ఓ... ఆ..
పెదవులకందనీ మధురిమలేవో .. హృదయాలు చవిచూడగా

మనసు పాడింది సన్నాయి పాట
కనులు ముకుళించగ... తనువు పులకించగా
గగనమే పూల తలంబ్రాలు కురిపించగా.. ఆ...ఆ ....



ఇంతేలే నిరుపేదలు పాట సాహిత్యం

 
చిత్రం: పుణ్యావతి (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల

ఇంతేలే నిరుపేదలు 



ఉన్నావా ఓ దేవా పాట సాహిత్యం

 
చిత్రం: పుణ్యావతి (1967)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల

ఉన్నావా ఓ దేవా 

Palli Balakrishna Saturday, February 10, 2018


చిత్రం: వివాహబంధం (1964)
సంగీతం: యమ్.బి.శ్రీనివాస్
సాహిత్యం: సినారె
గానం: భానుమతి, పి.బి.శ్రీనివాస్
నటీనటులు: యన్. టి.రామారావు , భానుమతి
మాటలు ( డైలాగ్స్ ): ఎ. పిచ్చేస్వరరావు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.యస్. రామకృష్ణ
నిర్మాత: పి.యస్. రామకృష్ణ
సినిమాటోగ్రఫీ: అన్నయ్య
ఎడిటర్: యమ్.వి.రాజన్
బ్యానర్: భరణి పిక్చర్స్
విడుదల తేది: 23.10.1964

తెలుగు సినీరంగంలో తనదైన ముద్రవేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి
'శ్రీమతి భానుమతి రామకృష్ణ' గారికి 'జయంతి   నివాళి '.. సెప్టెంబర్ 7 న

నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే
కనులలోన కలలలోన కలసి ఉన్నాములే
అహ..హ హహ.. ఆ హాహ


నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే
కనులలోన కలలలోన కలసి ఉన్నాములే
అహ..హ హహ.. ఆ హాహ
నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే
కనులలోన కలలలోన కలసి ఉన్నాములే
మ్.హ్.హ్.అహ హ హహ ఆ హాహ

దూరతీరాలలో కోరికలు సాగెనో మ్.హ్.మ్.
నాలోని రాగాలతో కాలమే ఆగెను
నీవు నాకోసమే
నీడఓలే నీవెంట సాగే నేను నీకోసమే
మ్.హ్.హ్..అహ హ హహ ఆ హాహ

నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే
కనులలోన కలలలోన కలసి ఉన్నాములే
అహ హ హహ ఆ హాహ

నావ ఊగాడెను భావనలు పాడెను మ్.హ్.మ్.
నావ ఊగాడెను భావనలు పాడెను మ్.హ్.మ్.
ఈనాడు నా మేనిలో వీణలే మ్రోగెనుఎంత ఆనందమే
నేటికైన ఏనాటికైనా నిలుచు ఈ బంధము
మ్.హుహు..అహ హ హహ ఆ హాహ

నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే
కనులలోన కలలలోన కలసి ఉన్నాములే
అహ హ హహ ఆ హాహ
అహ హ హహ ఆ హాహ
అహ హ హహ ఆ హాహ

Palli Balakrishna Saturday, January 20, 2018



చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి (All)
నటీనటులు: యన్.టి.రామారావు, భానుమతి రామకృష్ణ
దర్శకత్వం: బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి
నిర్మాత: బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి
విడుదల తేది: 20.12.1951



Songs List:



కోతి బావకు పెళ్ళంట పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి
గానం: భానుమతి రామకృష్ణ

కోతి బావకు పెళ్ళంట
కోవెల తోట విడిదంట
మల్లి మాలతి వస్తారా
మాలికలల్లి తెస్తారా
బంతీ జాజి చేమంతి
బంతులు కట్టి తెస్తారా 

పెళ్ళికి మీరు వస్తారా
పేరంటానికి వస్తారా
పందిరి వేస్తాము
ముందర ముగ్గులు పెడతాము
పందిరికింద పెళ్ళివారికి
వింఉదలు చేస్తాము
బాకా బాజా డోలు సన్నాయ్ 

మేళాలెడతారు
తప్పెట తాళాలెడతారు
అందాల మా బావగారికి
గంధాలు పూసి
గారాల మా బావ మెడలో హారాలు వేసి
కుళ్ళాయెడతాము
కుచ్చుల తురాయి పెడతాము
హారాలేసి గంధం పూసి
కుళ్ళాయెట్టి తురాయి
పెడతాము
కుచ్చుల తురాయి పెడతాము
ఓ....పల్లకి ఎక్కి
పల్లకి ఎక్కి కోతి బావ
పళ్ళికిలిస్తాడు... మా కోతి బావ
పళ్ళికిలిస్తాడు





పిలచిన బిగువటరా పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: భానుమతి రామకృష్ణ 

పిలచిన బిగువటరా
పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
పిలిచినా బిగువటరా ఔరౌరా
చెలువలు తామే వలచి వచ్చిన
భళిరా రాజా

ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
ఈ నయగారము ఈ వయ్యారము
ఈ నవ యవ్వన మారం వినునే
పిలిచినా బిగువటరా 

గాలుల తేనెల వాడని మమతల
గాలుల తేనెల వాడని మమతల
నీలపు మబ్బుల నీడను గననను
అందెల రవళుల సందడి మరిమరి
అందగాడా ఇటు తొందర చేయగా 
పిలచిన బిగువటరా 




మనసున మల్లెల మాలలూగెనే పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: భానుమతి రామకృష్ణ 

మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
కొమ్మల గువ్వలు గుస గుస మనినా
రెమ్మల గాలులు ఉసురుసుననినా
అలలు కొలనులో గల గల మనినా
అలలు కొలనులో గల గల మనినా
దవ్వున వేణువు సవ్వడి వినినా
దవ్వున వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయ చూచితిని
ఘడియ యేని ఇక విడిచిపోకుమా
ఘడియ యేని ఇక విడిచిపోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో





నెలరాజా వెన్నెలరాజా పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: భానుమతి రామకృష్ణ

నెలరాజా వెన్నెలరాజా




పరుగులు తియ్యాలి పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం:  ఘంటసాల, భానుమతి రామకృష్ణ 

పరుగులు తియ్యాలి గిత్తలు ఉరకలు వేయాలి 
బిరబిర చరచర పరుగున పరుగున ఊరు చేరాలి మన ఊరు చేరాలి
హోరు గాలి కారు మబ్బులు "హోరు"
ముసిరేలోగా మూగేలోగా ఊరు చేరాలి మన ఊరు చేరాలి
గలగల గలగల కొమ్ముల గజ్జెలు
ఘణఘణ ఘణఘణ మెళ్ళో గంటలు

ఆ ఆ ఆ ఆ "గలగల"
వాగులు దాటి వంకలు దాటి
ఊరు చేరాలి మన ఊరు చేరాలి

అవిగో అవిగో నల్లని మబ్బులు
గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు
అవిగో అవిగో అవిగో అవిగో 

పచ్చనితోటలు విచ్చినపూవులు
ఊగేతీగలు అవిగోఅవిగో
కొమ్మల మోగే కోయిల జంటలు
ఝమ్మని మూగే తుమ్మెద గుంపులు
అవిగో అవిగో





పిలచిన బిగువటరా పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం:  ఘంటసాల, భానుమతి రామకృష్ణ 

పిలచిన బిగువటరా



ఎందుకే నీ కింత తొందరా పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: భానుమతి రామకృష్ణ

ఎందుకే నీ కింత తొందరా 
ఇన్నాళ్ళ చెరసాల ఈ రేయి తీరునే  
ఓ చిలుక నా చిలుక ఓ రామచిలుకా
ఒయ్యారి చిలుక నా గారాల మొలక 

బాధలన్నీ పాతగాధలైపోవునే
వంతలన్ని వెలుగు పుంతలో మాయునే ఎలాగొ ఒలాగు
ఈ రేయి దాటెనా... ఈ రేయి దాటెనా
ఈ పంజరపు బ్రతుకు ఇక నీకు తీరునే

ఆ తోట ఆ తోపు ఆకు పచ్చని గూడు
ఆ వంక ఆ తోపు ఆకు పచ్చని గూడు
ఆ వంక గొరవంక అన్ని ఉన్నాయిలే

చిరుగాలి తగలా 
చిన్నారి పడవలా
పసరు రెక్కలు పరచి
పరువెత్తి పోదాము





అవునా నిజమేనా పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: ఘంటసాల, భానుమతి రామకృష్ణ 

అవునా నిజమేనా
అవునా నిజమేనా 
మరచునన్నా మరువలేని మమతలన్నీ కళలేనా
రాణివాసమేగేవ , బావ మాట మరచేవా
అవునా నిజమేనా
అవునా
మనసులోన మరులుగొలిపి కడకు మాయమాయేనా
ప్రాణమున్న మల్లి పోయి రాతి బొమ్మ మిగిలేనా 
అవునా నిజమేనా 

అవునా కళలేనా
అవునా కళలేనా
నాటి కధలు వ్యధలేనా, నీటిపై నీ అలలేనా
నాటి కధలు వ్యధలేనా, నీటిపై నీ అలలేనా
బావ నాకు కరువేనా , బ్రతుకు ఇంక బరువేనా 
బావ నాకు కరువేనా , బ్రతుకు ఇంక బరువేనా 

పగలు లేని ఱేయి వోలె పలుకలేని రాయి వోలె 
బరువు బ్రతుకు మిగిలేనా , వలపులన్ని కళలేనా 
అవునా కళలేనా





ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవూ పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: ఘంటసాల, భానుమతి రామకృష్ణ 

ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవూ
దేశదేశాలన్నీ తిరిగి చూసేవూ
ఏడ తానున్నాడొ.. బావా
ఏడ తానున్నాడొ.. బావా
జాడ తెలిసిన.. పోయిరావా
అందాల ఓ మేఘమాలా...
చందాల ఓ మేఘమాలా...

గగనసీమల తేలు.. ఓ మేఘమాలా
మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా
మల్లి మాటేదైనా నాతో
మనసు చల్లగా చెప్పి పోవా
నీలాల.. ఓ మేఘమాల 
రాగాల.. ఓ మేఘమాల

మమతలెరిగిన మేఘమాలా..
మమతలెరిగిన మేఘమాలా..
నా మనసు బావాకు.. చెప్పిరావా
ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతో రేపవలు
ఎన్నాళ్ళు నా కళ్ళు.. దిగులుతో రేపవలు
ఎదురు తెన్నులు చూచెనే
బావాకై చెదరి కాయలు కాచెనే...
అందాల ఓ మేఘమాలా...
రాగాల.. ఓ మేఘమాల

మనసు తెలిసిన మేఘమాలా...
మరువలేనని చెప్పలేవా
మల్లితో మరువలేనని చెప్పలేవా
కళ్ళు తెరిచినగాని కళ్ళు మూసినగాని..
కళ్ళు తెరిచినగాని కళ్ళు మూసినగాని..
మల్లి రూపే నిలిచెనే..
నా చెంత.. మల్లి మాటే పిలిచెనే

జాలి గుండెల మేఘమాలా
బావాలేనిది బ్రతుకజాలా
జాలి గుండెల మేఘమాలా
కురియు నా కన్నీరు.. గుండెలో దాచుకుని
వాన జల్లుగ కురిసిపోవా
కన్నీరు.. ఆనవాలుగ ..బావా మ్రోల





ఉయ్యాలా జంపాలా పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: జి. రామకృష్ణ , వి. శకుంతుల

ఉయ్యాలా జంపాలా




భలిరా పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: మాధవపెద్ది సత్యం 

భలిరా




ఓ బావా పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: జి. రామకృష్ణ , వి. శకుంతుల

ఓ బావా




తుమ్మెద పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: టి. జి. కమలాదేవి

తుమ్మెద




ఎవరు ఏమని విందురో పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: భానుమతి రామకృష్ణ 

ఎవరు ఏమని విందురో





ఉషా పరిణయం పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: భానుమతి రామకృష్ణ ,టి. జి. కమలాదేవి

ఉషా పరిణయం





కలవరమాయే మదిలో పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: ఘంటసాల, భానుమతి రామకృష్ణ 

కలవరమాయే మదిలో




నోమి నోమన్నలార పాట సాహిత్యం

 
చిత్రం: మల్లీశ్వరి (1951)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: భానుమతి రామకృష్ణ 

నోమి నోమన్నలార


Palli Balakrishna Sunday, December 10, 2017


చిత్రం: చామంతి (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి, రాజశ్రీ, వెలిదెండ్ల శ్రీరామమూర్తి
గానం: భానుమతీ రామకృష్ణ , యస్. పి.బాలు, చిత్ర, శ్రీనివాస్
నటీనటులు: ప్రశాంత్ (నూతన పరిచయం), రోజా, భానుమతి రామకృష్ణ
దర్శకత్వం: ఆర్.కె. సెల్వమణి
నిర్మాణం: సి.యల్. యన్. కంబైన్స్
విడుదల తేది: 1992



చిత్రం: చామంతి (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి.బాలు, చిత్ర, భానుమతీ రామకృష్ణ

పల్లవి:
చామంతి పువ్వే చిందులేసె చూడు
సంబరాల జాతరలో
చామంతి పువ్వే చిందులేసె చూడు
సంబరాల జాతరలో

సాగరాన పూసే స్వాతిముత్యమల్లే
మట్టిలోన కాచే మంచి వజ్రమల్లే
అందం చూస్తే అదురు తప్పదు
తళుకు బెళుకు అరెరరె

సీమ దొరవంటి మావ నీడలోన
చామంతి పాడింది
సీమ దొరవంటి మావ నీడలోన
చామంతి పాడింది

చరణం: 1
పక్కనున్న వాడు చక్కనైన తోడు
అంత అందగాడు చెంద లేవు నీవు
అందం చూస్తే అదురుతుందిలే
బిగువు బింకం అరెరరె

సీమ దొరవంటి మావ నీడలోన
చామంతి పాడింది

సన్నజాజి జాతిమొక్క నీ పైడి పంట
సందెవేళ చేరవచ్చి సింధులేసెనంట
చిన్నవాడి కళ్ళలోన వలలు వేసెనంట
తందనాలు మాటులోన తాను నీకు జంట

మత్యమహరాణి అలివేణి మనసేవణి
సన్నజాజి తీగ పలికించే రసరాగిణి
కుండ తేనెల పట్టు అది కోయిల కేదో గుట్టు
తొలి పరువం మృదువ వనం …………

హే సీమ దొరవంటి మావ నీడలోన
చామంతి పాడింది
చామంతి పువ్వే చిందులేసె చూడు
సంబరాల జాతరలో

చరణం: 2
కోటలాంటి పేటలెన్నో ఏలుతున్నవాడే
కోట్ల కొద్ది ఆస్తివున్నా కొంటెమనసు వాడే
మేడలోన బామ్మగారి ముద్దు బిడ్డ వీడే
ఊరికంత వాడకంత కోటికొకడు వీడే
మొక్కుబడులు చేస్తాం తలవంచి మొనగాడికే
పూలవింటి వాడే పులకించే మగవాడులే
ఇలలో ఎవరు సాటి మా ఇంటికి ఇతనే పోటీ
తన సరసం చెలి విరసం వలపుల భేటీ

చామంతి పువ్వు సందెపొద్దువేళ
చీరకట్టి ఆడెనులే
చీమదొర లాంటి మామ రాక చూసి
సిగ్గుమాలలేసెనులే

అందమైన జంట వంద ఏళ్లపంట
ఇల్లు దిద్దుకుంటు చల్లగుండ మంటా
రేపు మాపు రెండు బండ్లుగా
వర్ధిల్లండి మీరు చల్లగా

చామంతి పువ్వు సందెపొద్దువేళ
చీరకట్టి ఆడెనులే
చీమదొర లాంటి మామ రాక చూసి
సిగ్గుమాలలేసెనులే





చిత్రం: చామంతి (1992)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్. పి.బాలు, చిత్ర

పల్లవి:
ఇదే రాజయోగం యోగం
ఇదే మోహబంధం బంధం
ఇదే రాజయోగం యోగం
ఇదే మోహబంధం బంధం

మనసులే తొలకరి కవితలే పలికెనే
కలిపెనే జీవితాలే
నీవే నేనే నేనే నీవే
నీవే నేనే నేనే నీవే

ఇదే రాజయోగం యోగం
ఇదే మోహబంధం బంధం

చరణం: 1
సద్దుచేసే నంట ముద్దబంతి పాట
యవ్వనాల పొంగులో పసిడి కలల పంట
కనులు మూసినా కూడా సాగేనంట ధ్యానం
కలల రాజవీధుల్లో చిందేనంట సింధూరం
కథగా ఎదలో ఉన్నాను కాదా
తలపు వలపు నాకింకా నువ్వేగా
కలగా నిలిచిపో నా కళ్లల్లో

నీవే నేనే నేనే నీవే
నీవే నేనే నేనే నీవే

ఇదే రాజయోగం యోగం
ఇదే మోహబంధం బంధం

చరణం: 2
పాలమనసు నన్నే పలకరించే నేడే
మల్లెపూల గారాలే విందుచేయు వేళ
అంతులేని నా గానం ఆలపించె శ్రీ రాగం
ఆశలన్ని పండించి అందించాను నీకోసం
యుగమే క్షణమై సాగింది కాలం
సర్వం నాదే నా దేవి వయ్యారం
సరసం మధురం నాదే వైభోగం

నీవే నేనే నేనే నీవే
నీవే నేనే నేనే నీవే

ఇదే రాజయోగం యోగం
ఇదే మోహబంధం బంధం

మనసులే తొలకరి కవితలే పలికెనే
కలిపెనే జీవితాలే
నీవే నేనే నేనే నీవే
నీవే నేనే నేనే నీవే

ఇదే రాజయోగం యోగం
ఇదే మోహబంధం బంధం

Palli Balakrishna Friday, October 27, 2017



చిత్రం: మంగమ్మ గారి మనవుడు (1984)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: బాలక్రిష్ణ , భానుమతి రామకృష్ణ , సుహాసిని
దర్శకత్వం: కోడిరామకృష్ణ
నిర్మాత: యస్.గోపాల్ రెడ్డి
విడుదల తేది: 03.09.1984



Songs List:



దంచవే మేనత్త కూతురా పాట సాహిత్యం

 
చిత్రం: మంగమ్మ గారి మనవుడు (1984)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు , పి.సుశీల

దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా (2)
దంచు దంచు బాగా దంచు
అరె దంచు దంచు బాగా దంచు
దప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా
ఆగకుండ ఆపకుండ
అందకుండ కందకుండ

పోటు మీద పోటు వెయ్యి
పూత వయసు పొంగనియ్యి
ఎడమ చేత ఎత్తిపట్టు
కుడి చేత కుదిపి కొట్టు

ఏ చెయ్యి ఎత్తితేమి
మరి ఏ చెయ్యి దించితేమి (2)
అహహహహ 
కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే
పట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వే
హా దంచుతా మంగమ్మ మనవడా
ఓయ్ నేను దంచితే నీ గుండె దడదడ
హా హా హాహాహాహా
దంచుతా మంగమ్మ మనవడా హోయ్
నేను దంచితే నీ గుండె దడ దడ

కోరమీసం దువ్వబోకు
కోక చుట్టూ తిరగమాకు
ఎగిరెగిరి పైన పడకు
ఇరుగు చూస్తే టముకు టముకు

ఏ కంట పడితేమి
ఎవ్వరేమంటే మనకేమి (2)
నువ్వు పుట్టంగానే బట్ట కట్టంగానే
నిన్ను కట్టుకునే హక్కున్న
పట్టాదారుణ్ణి నేను
దంచవే మేనత్త కూతురోయ్
వడ్లు దంచవే నీ గుండెలదరదరదర
హా దంచుతా మంగమ్మ మనవడా
నేను దంచితే నీ గుండె దడ దడ





చందురూడు నిన్ను చూసి పాట సాహిత్యం

 
చిత్రం: మంగమ్మ గారి మనవుడు (1984)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు , పి.సుశీల

చందురూడు నిన్ను చూసి చేతులెత్తాడు 
తన అందం నీలో చూసి తడబడి పోయాడు తాబ్బిబ్బయ్యాడు 
అవునా ...ఏమో 
అవునా... ఏమో 

గోదారి నిన్ను చూసి గుస గుస లాడింది 
గోదారి నిన్ను చూసి గుస గుస లాడింది 
తన వేగం నీలో చూసి తడబడి పోయింది తాబ్బిబ్బయ్యింది 
అవునా ...ఏమో 
అవునా ...ఏమో 

చరణం: 1
ఎవరికి లొంగని మగసిరీలో 
ఎన్నడు కరగనీ సుగుణమ్ లో 
రాముడివే నీవు ఆ రామునివే నీవు 
ఏ రాముడు 
అగ్గి రాముడా 
బండ రాముడా
అడవి రాముడా
శృంగార రాముడా
అయోధ్య రామునివే 
ఆ సీతా రామునివే 

చరణం: 2
భామలు మెచ్చిన రశికథలో 
ప్రేమలు పంచిన చతురతలో 
కృష్నూడివే నీవు ఆ కృష్నూడివే నీవు 
ఏ కృష్ణుడు 
చిలిపి క్రిశ్ణుడా
కొంటె క్రిశ్ణుడా
భలే క్రిశ్ణుడా
గోపాల క్రిశ్ణుడా
బృందావనా కృష్నూడివే 
ఆ రాధా కృష్నూడివే




గుమ్మ చూపు నిమ్మ ముల్లు పాట సాహిత్యం

 
చిత్రం: మంగమ్మ గారి మనవుడు (1984)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ

గుమ్మ చూపు నిమ్మ ముల్లు గుచ్చూకుంటే గుండె ఝల్లు
ఝల్లంటే ఝల్లే కాదూ ఊ ఊ ఊ
చిత్తకార్తె చినుకు జల్లూ ఊ చిత్తకార్తే చినుకుజల్లు
జల్లూ జల్లూ జల్లూ జల్లూ జల్లు జల్లూ జల్లు జల్లూ 
గుమ్మ చూపు నిమ్మ ముల్లు గుచ్చూకుంటే గుండె జల్లు ఆ హా ఓయీ హోయీ

బావ చూపు రేగు ముల్లు నాటుకుంటే వల్లు జిల్లూ 
జిల్లంటే జిల్లే కాదు ఊ ఊ ఊ
మాఘ మాసం మంచు జిల్లూ మాఘమాసం మంచు జిల్లూ
జిల్లు జిల్లూ జిల్లు జిల్లూ జిల్లు జిల్లూ జిల్లు జిల్లూ
బావ చూపు రేగు ముల్లు నాటుకుంటే వల్లు జిల్లూ 
ఆ హా అహా హా

బుంగమూతి బుజ్జి మల్లీ ఈ ఈ ఈ
ముడుచుకొన్న మొగ్గమల్లీ ఈ ఈ ఈ ఈ (2)

ఇంతలోనే వింతగానే అరె ఇంతలోనే వింతగానే 
విచ్చుకున్నావే ఏ ఏ ఏ చెంగు విసురుతున్నావే ఏ ఏ
విచ్చుకున్నావే ఏ ఏ ఏ చెంగు విసురుతున్నావే ఏ ఏ

నీ చేతి మెరుపు ఓ రేపింది వలపు
నీ చేతి మెరుపు ఓ రేపింది వలపు
అంతే మరి సరాసరి వయసు విచ్చిందీ ఈ నీ వరస మెచ్చింది
వయసు విచ్చిందీ ఈ నీ వరస మెచ్చింది

అరె హోయీ హోయి ఆ ఆఅ హా 

మురిపెమంటే ఎరగనోడివే ఏ ఏ ఏ 
ఈ ముద్దుమాటలాడనొడివే ఏ ఏ ఏ ఏ
అయ్యో మురిపెమంటే ఎరగనోడివే ఏ ఏ ఏ 
ఈ ముద్దుమాటలాడనొడివే ఏ ఏ ఏ ఏ

కొమ్ములొచ్చినా అరె కోడెగిత్తలా 
కొమ్ములొచ్చినా అరె కోడెగిత్తలా 
కుమ్ముతున్నావే ఏ ఏ ఏ నన్నే కమ్ముకున్నావే ఏ ఏ
కుమ్ముతున్నావే ఏ ఏ ఏ నన్నే కమ్ముకున్నావే ఏ ఏ
నీ మాట విసురూ ఊ రేపింది పొగరూ
నీ మాట విసురూ ఊ రేపింది పొగరూ
రోషం పుట్టి మీసం తట్టి కాలుదువ్వానే సరసాలు రువ్వానే అరె 
రోషం పుట్టి మీసం తట్టి కాలుదువ్వానే సరసాలు రువ్వానే అరె
హోయీ హోయి హోయిహోయి హోయీ హోయీ 

బావ చూపు రేగు ముల్లు నాటుకుంటే వల్లు జిల్లూ 
గుమ్మ చూపు నిమ్మ ముల్లు గుచ్చూకుంటే గుండె ఝల్లు
జిల్లంటే జిల్లే కాదు ఊ ఊ ఊ
మాఘ మాసం మంచు జిల్లూ మాఘమాసం మంచు జిల్లూ
గుమ్మ చూపు నిమ్మ ముల్లు గుచ్చూకుంటే గుండె ఝల్లు
బావ చూపు రేగు ముల్లు నాటుకుంటే వల్లు జిల్లూ 
అరె హోయీ హోయి ఆ ఆఅ హా 





వంగతోట కాడ పాట సాహిత్యం

 
చిత్రం: మంగమ్మ గారి మనవుడు (1984)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: యస్.పి.బాలు , పి.సుశీల

కోరస్: 
నోమి నోమన్నల్లాల నోమన్నలాల సందామామ సందామామ
నోమి నోమన్నల్లాల నోమన్నలాల సందామామ సందామామ
పొద్దువాలకముందే పోదారిరాయే తూరుపోళ్ళ బుల్లెమ్మ
పొద్దువాలకముందే పోదారిరాయే తూరుపోళ్ళ బుల్లెమ్మ
బారెడంత పొద్దుంది నేరాను పోరా బూటకాల బుల్లోడా బూటకాల బుల్లోడా
నోమి నోమన్నల్లాల నోమన్నలాల సందామామ సందామామ,
సందామామ, సందామామ

వంగతోటకాడ ఒళ్ళు జాగర్త 
వంగతోటకాడ ఒళ్ళు జాగర్త 
నంగనాచి ముళ్ళు తొంగి తొంగుంటాయ్
నంగనాచి ముళ్ళు తొంగి తొంగుంటాయ్
నాటుకుంటే తీయాలంటే నాతరమా, నీతరమా

కందతోటకాడ కాళ్ళు జాగర్త 
కందతోటకాడ కాళ్ళు జాగర్త 
చీలిఉన్న దుంప కాలికంటుకుంటే
చీలిఉన్న దుంప కాలికంటుకుంటే
ఆ దురద ఆపాలంటే నీతరమా, నాతరమా
కందతోట కాడ కాళ్ళు జాగర్త

చరణం: 1
దోరమిరపకాయలాగా ధుమధుమలాడుతున్నావు
దోరమిరపకాయలాగా ధుమధుమలాడుతున్నావు
కారం తగ్గించుకో వెటకారం ఒగ్గేసుకో

కాడమల్లె పువ్వలాగా గమగమలాడుతున్నావు
కాడమల్లె పువ్వలాగా గమగమలాడుతున్నావు
మురిపెం ముడేసుకో నీ పరువం దాచేసుకో

చెరుకు లాంటి కరుకుదనం చాలు చాలు చాలు
కొరికి చూస్తే దాని రుచి మేలు మేలు మేలు

కందతోటకాడ కాళ్ళు జాగర్త
అరె.... వంగతోట కాడ ఒళ్ళు జాగర్త

చరణం: 2
ఏటి కాలవగట్టు మీద ఎగిరెగిరి పడుతున్నావు
ఏటి కాలవగట్టు మీద ఎగిరెగిరి పడుతున్నావు
చప్పున దాటేసుకో ననుగుట్టుగా వాటేసుకో
హాయ్ రెల్లు పొదల లంకలోన రేగిరేగి పోతున్నావు
హాయ్ రెల్లు పొదల లంకలోన రేగిరేగి పోతున్నావు
కళ్ళెం వేసేసుకో నీ అల్లరి ఆపేసుకో

పొగరున్న వంశంలే నాది నాది నాది
ఆ వంశం నీదేనా నాది నాది నాది

వంగతోటకాడ ఒళ్ళు జాగర్త
అరె కందతోట కాడ కాళ్ళు జాగర్త

నంగనాచి ముళ్ళు తొంగి తొంగుంటాయ్
నాటుకుంటే తీయాలంటే నాతరమా, నీతరమా
కందతోట కాడ కాళ్ళు జాగర్త

వంగతోటకాడ ఒళ్ళు జాగర్త




శ్రీ సూర్యనారాయణ మేలుకో పాట సాహిత్యం

 
చిత్రం: మంగమ్మ గారి మనవుడు (1984)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: సి.నారాయణ రెడ్డి
గానం: భానుమతి రామకృష్ణ , వాణీజయరాం

శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో 
మా చిలకమ్మ బులపాటము చూసిపో చుసిపో 
శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో 
మా చిలకమ్మ బులపాటము చూసిపో చుసిపో
తెల్లావారకముందే ఇల్లంతా పరుగుల్లు ఆ 
చీకట్లో ముగ్గుల్లు చెక్కిట్లో సిగ్గుల్లు
ఏమి వయ్యారమో ఓ ఓ ఓ 
ఏంత విడ్డూరమో హు ఏంత విడ్డూరమో

శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో 
మా అమ్మమ్మ ఆరాటము చూసిపో చూసిపో
చిట్టిమనవడి రాక చెవిలోన పడగానే 
ముసిముసి చీకట్లో ముసలమ్మ రాగాలు
ఏమి జాగారమో ఓ 
ఎంత సంబరమో ఎంత సంబరమో

సరి అంచు పైట సవరించుకున్నా 
మరి మరి జారుతుంది
ఓసోసి మనవరాల ఏం జరిగింది 
ఓసోసి మనవరాల ఏం జరిగింది

తాతయ్యను నువ్వు తలచిన తొలినాడు 
నీకేమి జరిగిందో అమ్మమ్మ 
తాతయ్యను నువ్వు తలచిన తొలినాడు 
నీకేమి జరిగిందో అమ్మమ్మ 
నాకంతే జరిగింది అమ్మమ్మ

అమ్మదొంగా రంగ రంగ
అమ్మదొంగా రంగ రంగ

శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో 
మా అమ్మమ్మ ఆరాటము చూసిపో చూసిపో

కోడిని కొడితే సూర్యుణ్ణి లేపితే తెల్లరిపోతుందా
ఓ పిల్ల పెళ్ళిగడియ వస్తుందా
ఓ పిల్ల పెళ్ళిగడియ వస్తుందా

దిగివచ్చి బావను క్షణమైన ఆపితే దేవున్ని నిలదీయనా
ఓయమ్మో కాలాన్ని తిప్పేయనా
నా పిచ్చితల్లి ఓ బుజ్జిమల్లి నీ మనసే బంగారం
నూరేళ్ళు నిలవాలి ఈ మురిపం
నూరేళ్ళు నిలవాలి ఈ మురిపం
అమ్మమ్మ మాట ముత్యాల మూట
ఆ విలువ నేనెరుగనా ఏనాడు అది నాకు తొలిదీవెన

శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో 
మా చిలకమ్మ బులపాటము చూసిపో చుసిపో
శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో 
మా అమ్మమ్మ ఆరాటము చూసిపో చూసిపో

Palli Balakrishna Wednesday, September 13, 2017

Most Recent

Default