Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Andari Bandhuvaya (2010)


చిత్రం: అందరి బందువయా (2010)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: దీప్తి మాధురి, అనూప్ రూబెన్స్
నటీనటులు: శర్వానంద్, పద్మప్రియ
దర్శకత్వం: చంద్రసిద్దార్ధ
నిర్మాతలు: చంద్రసిద్దార్ధ, వి.రామకృష్ణ
విడుదల తేది: 14.05.2010

మళ్ళీ మళ్ళీ రమ్మని మనసులో ఆమని
వలపు కోయిల రాగాన్నీ పాడుతోందే నాలో
అంతవరకు లేనిదేదో ఇంతలోనే ఐనదేమో
నీ కోసమే నేనంటూ నాకోసమే నీవంటూ
గాలిలోనే తేలిపోతు నేను వస్తుంటే
కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్
కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్

ఊహలో నీవే నా ఊపిరీ నీవే
ఆశలోన నీవే ణా ధ్యాశలోన నీవే
ప్రాణ వీణ మీటుతున్న ప్రేమ పాట నీవే
నా లోపల నీవే కళ నివే కధ నీవే
కలవరిస్తూ పలకరిస్తూ చేరువవుతుంటే

కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్
కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్

మళ్ళీ మళ్ళీ రమ్మనీ....

కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్
కళ్ళముందు నువ్ కళ్ళముందు


*********   **********   **********


చిత్రం: అందరి బందువయా (2010)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: అనూప్ రూబెన్స్

మళ్ళీ మళ్ళీ రమ్మని మనసులో ఆమని
వలపు కోయిల రాగాన్నీ పాడుతోందే నాలో
అంతవరకు లేనిదేదో ఇంతలోనే ఐనదేమో
నీ కోసమే నేనంటూ నాకోసమే నీవంటూ
నన్ను నీలో నిన్ను నాలో వెతుకుతూ ఉంటే
కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్
కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్

స్నేహమూ నువ్వే సంతోషమూ నువ్వే
ఆత్మలోన నువ్వే అనుభూతిలోన నువ్వే
నేను ఏరి కోరుకున్న కొత్త జన్మ నువ్వే
నాలో ప్రియ భాషా అభిలాష ఎద శ్వాసా
నీవే నీవే నీవే నీవే
నీవే అంటుంటే
కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్
కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్

మళ్ళీ మళ్ళీ రమ్మని మనసులో ఆమని
వలపు కోయిల రాగాన్నీ పాడుతోందే నాలో
అంతవరకు లేనిదేదో ఇంతలోనే ఐనదేమో
నీ కోసమే నేనంటూ నాకోసమే నీవంటూ
గాలిలోనే తేలిపోతు నేను వస్తుంటే
కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్
కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్


*********   **********   **********


చిత్రం: అందరి బందువయా (2010)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: అమృత వర్షిణి, అనూప్ రూబెన్స్, శ్రావణి, జై శ్రీనివాస్, ఐశ్వర్య

సూర్యుడు ఎవరయ్యా... మన అందరి బంధువయా...
చంద్రుడు ఎవరయ్యా... మన అందరి బంధువయా...
సూర్యుడు ఎవరయ్యా... మన అందరి బంధువయా...
చంద్రుడు ఎవరయ్యా... మన అందరి బంధువయా...

నేల నింగి నీరూ నిప్పు ఊపిరినిచ్చే గాలి
తమ తమ స్వార్ధం చూసుకుంటె మన గతి ఏం కావాలీ
కొంచెం పంచవయా.. నువు అందరి బంధువయా..
మంచిని పెంచవయా.. నువు అందరి బంధువయా..

జగతికి ప్రేమను పంచుటకోసం శిలువను ఎక్కిన జీసస్.. జీసస్..
సత్యం కోసం విషం తాగి సందేశమిచ్చిన సోక్రటీస్..
అహింస ఏ తన గొప్ప ఆయుధం అని నిరూపించిన గాంథీ..
తమకు ఎప్పుడూ ఏమి కాని జనం కోసమే తపించి..
సుఖాలు సర్వం త్యజించి మహాత్ములై నిలిచారు..
వీరంతా ఎవరయా.. మనలాగే మనుషులయా..
జాతికి వరములయా.. మన అందరి బంధులయా..


*********   **********   **********


చిత్రం: అందరి బందువయా (2010)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చైతన్య ప్రసాద్
గానం: శర్వానంద్, పద్మప్రియ

జామ చెట్టుకి జామ కాయలు
ఈత చెట్టుకి ఈత కాయలు
చింత చెట్టుకీ చింత కాయలు
మల్లె చెట్టుకీ..
"మల్లెకాయలా ?? రేయ్ రాంబాబు"
కాయలుండవు కాయలుండవు
పువ్వులుండునూ.. పువ్వులుండునూ..
"వా వా వా...క్యాబాత్ హై క్యాబాత్ హై .. "
"థ్యాంక్యూ.. థ్యాంక్యూ.. ఇంకోటొదల్నా.. "
"ఒకె ఒకె.. ఫర్మాయియే.. కొట్రా..."

రైలు ఎక్కితే రైలు టిక్కెట్టు
బస్సు ఎక్కితే బస్సు టిక్కెట్టు
ఫ్లైటు ఎక్కితే ఫ్లైటు టిక్కెట్టు
ఆటో ఎక్కితే.. ఆటో ఎక్కితే..
"ఆటో ఎక్కితే.. ఏందిరా భయ్..ఆటో టిక్కెట్టా.."
టికెట్టు లేదుగా టికెట్టు లేదుగా
మీటరుండును.. మీటరుండునూ..

"ఆటోకి మీటర్ ఉంది నీ పొయెట్రీకి మీటర్ లేదు మ్యాటర్ లేదు...
పొయెట్రీ అంటే మాటలు కాదు.. యతి ప్రాసా ఉండాలి.."
"ప్రాస అంటే.. "
"నేన్చెప్తా నేన్చెప్తా సింపులూ.. "
నువ్విజిలేస్తే అంధ్రా సోడాబుడ్డీ...
నీ అథరామృతం పుల్లా రెడ్డీ..
అదీ ప్రాసంటే..
ఓస్ అంతేనా ఐతే కాస్కో.. నువ్వేస్కో..
టాట్టా..టట్టాటటాట్టా.. టట టట టాట్టా..టట్టాట టాట్టా..
మా ఊళ్ళో మాకుందో మేడా..
మేడ చుట్టు ఉన్నాదో గోడా.. అబ్బా
గోడ పక్క నుంచుంది దూడా.. అరెరెరెరె..
దూడ చూడు వేసింది ’చీ..’...
పేడ పేడ పేడ...

"హె శభాష్ మీరంతా జీనియస్ లెహె..
ఈడియట్స్ మీరు మీ పెంట పొయెట్రీలు..
దీన్నే నేచురల్ ప్యూర్ ఆర్గానిక్ పొయెట్రీ అంటారు..
తెల్సా.. అరె ఏం జెప్పినవన్నా.. కరెక్ట్.. కంటిన్యూ.. "

టాట్టా..టట్టాటటాట్టా.. టట టట టాట్టా..టట్టాట టాట్టా..
వంటింట్లో ఉంటుంది చాకూ.. హమ్మో..
కరెంటు తీగా కొడుతుంది షాకూ.. ఆహా..
గోడ లోకి కొట్టేదీ మేకూ.. (గొంతు సవరణ)
వీపు మీద దురదొస్తే..ఉమ్మ్...
గోకు గోకు గోకు.. గోకు గోకు గోకు..
టాట్టా..టట్టాటటాట్టా.. టట టట టాట్టా..టట్టాట టాట్టా..

Most Recent

Default