-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non-Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box


చిత్రం: Mr. ఎర్రబాబు (2005)
సంగీతం: కోటి
సాహిత్యం: వెన్నలకంటి
గానం:
నటీనటులు: శివాజీ, రోమా, నాగేంద్రబాబు
దర్శకత్వం: కె.కిషోర్
నిర్మాత: సునీల్ చలమల శెట్టి
విడుదల తేది: 28.04.2005

ఎందుకో ఏమో తొలిసారీ..కలిసింది స్నేహం
తెలిసింది దాహం ..
అందుకేనేమో ప్రతిసారీ..తొణికింది ప్రాణం
పలికింది గానం
నిద్దట్లో నీరూపమే నిలిచె నా కళ్ళలో
పొద్దంతా నీధ్యానమే ప్రియా..ప్రియా..ప్రియా
ఇన్నాళ్ళూ ఈ అల్లరీ లేదులే ముందరా
ఈనాడే సరికొత్తగా ఫలించె నీలయా..

ఎందుకో ఏమో తొలిసారీ..కలిసింది స్నేహం
తెలిసింది దాహం ..

నిదురైనా రానే రాదు..కుదురైనా లేనే లేదు
ఇది ఏమి ఆరాటమో
ఇది చెలిగీతమో..చెలి సంగీతమో
తొలి మురిపాల జలపాతమో

కలవక కలిసిన కవ్వింత
తెలపక తెలిపిన గిలిగింత
చిలిపిగ వయసున చిగురులు తొడిగెను ప్రేమా !

నిద్దట్లో నీరూపమే నిలిచె నా కళ్ళలో
పొద్దంతా నీధ్యానమే ప్రియా..ప్రియా..ప్రియా
ఇన్నాళ్ళూ ఈ అల్లరీ లేదులే ముందరా
ఈనాడే సరికొత్తగా ఫలించె నీలయా

నాపేరే అడుగుతు ఉంటే..నీ పేరే చెబుతూ ఉన్నా..మతిబోయె నాకెందుకో
ఇది ఆరాటమో..ఎద మోమాటమో
నను ఉడికించు ఉబలాటమో

తెలిసెను తెలిసెను ఇది ప్రేమా
కలసిన మనసుల కధ ప్రేమా
ఇదివరకెరుగని హౄదయపు సరిగమ ప్రేమా

నిద్దట్లో నీరూపమే నిలిచె నా కళ్ళలో
పొద్దంతా నీధ్యానమే ప్రియా..ప్రియా..ప్రియా
ఇన్నాళ్ళూ ఈ అల్లరీ లేదులే ముందరా
ఈనాడే సరికొత్తగా ఫలించె నీలయా

Most Recent

Default