Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kalyana Ramudu (2003)చిత్రం: కళ్యాణ రాముడు (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఉదిత్ నారాయణ్ , కల్పన
నటీనటులు: తొట్టెంపూడి వేణు, ప్రభుదేవా, నిఖిత
దర్శకత్వం: జి.రాంప్రసాద్
నిర్మాత: వెంకట్ శ్యామ్ ప్రసాద్
విడుదల తేది: 18.07.2003

పల్లవి:
ప్రేమించుకున్నవాళ్ళు ఊహల్లో తేలుకుంఉటు ఊటీకి చేరవచ్హులే
ప్రేమల్లొపడ్డవాళ్ళు ఖర్చేమిపెట్టకుండ కాశ్మీరు చూడవచ్హులే
ఇంతలో గెటప్పులెన్నో మార్చవచ్చు
అంతలో సెటప్పు చేంజి చెయ్యవచ్చు
ఎందరో ఎక్స్ట్రాలు కూడ వుండవచ్చు
తెలుగు ఫిల్ము పాట మాదిరి

చరణం: 1
పాట పాడుకుంటు వెళ్తె వెనకనుంచి వస్తాయి బెలూన్లు
డాన్సు చేసుకుంటు వెళ్తె మీదనుంచి పడతాయి పూలు, పళ్ళు పూలు, పళ్ళు
అడవిలోన బోరు కొట్టి అవుడ్డోరు కొస్తాయి నెమళ్ళు
ఆకశాన్ని వదిలిపెట్టి లొకేషన్ కి వస్తాయి మబ్బులు, నీళ్ళు మబ్బులు, నీళ్ళు
పావురాలు, చిలుకలు, పలు రకాల పక్షులూ
లాంతర్లు, గొడుగులు, కొత్త స్టీలు బిందెలూ
అడగకుండ వస్తాయి, ఆశీస్సులు ఇస్తాయీ

చరణం: 2
ప్రేమ యుగళ గీతానికి సంగీతాన్నిస్తాడు నారదుడు
పెదవి మనము కదుపుతుంటె వెనకనుంచి పాడతాడు గాన గంధర్వుడు.గాన గంధర్వుడు
చిలిపి వలపు సినిమాకి స్క్రిప్ట్ తాను రాస్తాడు మన్మధుడు
సిగ్గుపడుతు నిలుచుంటే స్టెప్పులెన్నో నేర్పుతారు మేనకా రంభలూ మేనకా రంభలూ
ప్రేమ అనే చిత్రానికి ఎవరయ్యా దర్శకుడు
క్రేను మీద కూర్చున్న ఆ బ్రహ్మ దేవుడు
చివరి రీలు లోన కథను సుఖాంతమే చేస్తారూ


********  *********  *********


చిత్రం: కళ్యాణ రాముడు (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహాదేవన్, సుజాత

గుత్తొంకాయా గుత్తొంకాయా
గుంతలకిడి గుమ్మపేరు గుత్తొంకాయ
గుమ్మడికాయా గుమ్మడికాయా
కొంటెదాని ఒంటిపేరు గుమ్మడికాయ
కోపమే ఎంతున్నా కత్తికే లొంగాలి
పనులే ఎన్నున్నా నూనెలో వేగాలి
గీరగా చూస్తున్నా కూరలా మారాలి
నీటుగా ఆపైన నోటికే అందాలి
బుద్ధిగా మాటేవింటు వంటింట్లోనే నువ్వుండాలి

కమ్మంగా వండివార్చు కలియుగభీమా
కల్యాణం అంటె నీకు తెలియదులేమ్మా
వధువే వయ్యారాల తాజా టమోటా వరుడే ఘాటుమసాలా
మంత్రం వంటింత్లో తాళింపు చిటపట హోమం గాస్‌స్టౌ జ్వాల
మండపము ఏదంటా పండితుడు ఎవరంటా
బంధువులు చుట్టాల సంగతులు ఏంటంటా
బాండి మండపము గరిటే పండితుడు
అల్లం వెల్లుల్లి అందరు బంధువులు
పచ్చని పసుపురంగే వధువు మెళ్ళో మాంగల్యమేగా

అప్పడము దప్పళము అన్నిటికన్నా
కాపురమే చేయడము తెలుసా కన్నా
మనసే పుచ్చుల్లేని కాయే అవ్వాలి మమతే పొంగుతుండాలి
జతగా ఉప్పు కారం రెండు కలవాలి బ్రతుకున రుచి పెరగాలి
కలతలు కష్టాల చేదును తగ్గించి
కులుకుల సుఖాల తీపిని గ్రహించి
గొడవలు పంతాల వగరును త్యజించి
మధురసబంధాల ఎంగిలి భుజించి
ఇద్దరు విందులు చేస్తు వందేళ్ళుంటే సంసారమేగా*********   *********   ********


చిత్రం: కళ్యాణ రాముడు (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శంకర్ మహాదేవన్

పందిరి చేరెనమ్మా పచ్చని పూలకొమ్మా
దీవించమ్మ ప్రేమా.......
ప్రియతమా........ సుఖీభవ
డోలుబాజా సన్నాయి మోగుతామంటున్నాయి
గౌరిపూజ కానియ్యి పెళ్ళిచేస్తామన్నాయి
రాముడే నీ వరుడయ్యి ప్రేమతో నీ వరసయ్యి
వరమల్లె నిను చేరగా
జంటగా నవ వధువయ్యి వెళ్ళవే నువ్వెదురయ్యి
వరమాలగా వాలగా
కళ్ళవిందుగా చూడాలంట వేడుకైన ఈ కళ్యాణం
పూలవాగులా పొంగాలంట వెల్లువైన ఈ వైభోగం

ఏమినోము నోచావమ్మా కుందనాల కూనమ్మా
నీకు సొంతమయ్యిందమ్మా నమ్ముకున్న నీప్రేమ
రాసిపెట్టి ఉంచాడమ్మా ముందుగానే ఆ బ్రమ్హ
జంటగానె పుడుతుందమ్మా పొందుతున్న ప్రతిజన్మ
త్రేతాయుగం నాటి సీతమ్మ మనువంట ఈ తంతు మాకోసమే
ఏటేటా జరిగేటి శ్రీరామ నవమంట ఈ పెళ్ళి అపురూపమే
కళ్ళవిందుగా చూడాలంట వేడుకైన ఈ కళ్యాణం
పూలవాగులా పొంగాలంట వెల్లువైన ఈ వైభోగం

పాలకడలి కూతురువంట కాలుపెడితె చాలంట
కట్టుకున్న ప్రతి నట్టింటా అష్టసిరుల కొలువంట
శాశ్వతంగ ఇక నీఇంట ఛైత్రమాసమేనంట
సంబరంగ ఇక ప్రతిపూటా సంకురాత్రి పండగట
కనవమ్మ కళ్యాణి ఈనాటి కళలని శ్రీవారి కనుపాపలో
వినవమ్మ అలివేణి ఈవేదమంత్రాన్ని నూరేళ్ళ కౌగిళ్ళలో
కళ్ళవిందుగా చూడాలంట వేడుకైన ఈ కళ్యాణం
పూలవాగులా పొంగాలంట వెల్లువైన ఈ వైభోగం


*********   *********   ********


చిత్రం: కళ్యాణ రాముడు (2003)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సాయి శ్రీ హర్ష
గానం: కె.జె. యేసుదాసు

పల్లవి
కథలో రాజకుమారి ప్రేమగమారి పిలిచేరా
ఇలలో రాజకుమరుడు రాజసవీరుడు నిలిచేరా
హ్రుదయములోని మనసును రేపీ
బ్రతుకులలోని తీపిని చూపీ
కొవెలమ్మ మెట్టు, ప్రేమ ఒట్టు, గట్టు చూపెట్టితీరేట్టు

చరణం: 1
ఆలయమందున్నది ఆరిపోనట్టి ప్రేమేరా
ఆకాశము నేల ఒకటై వచ్హేసి ఆశీస్సులిచ్హేనురా
ప్రేమొక పిచ్హిదిరా  ప్రాణమిచ్హేంత మంచిదిరా
చెయ్యెత్తి మొక్కంగ జేగంట కొట్టంగ ఆ ప్రేమ అందేనురా
కొరుకున్న కోరికలూ సాగిపోవు దీపాలు
చేరువగును చేరికలూ తీరిపొయి శాపాలు
శుభకరములు, తన కరములు వరమాలై అల్లేరా

చరణం: 2
శ్రావణ మూర్తాలలో  ప్రేమ ప్రమిదలు వెలిగేరా
తాళాలు రేగంగ, మేళాలు మోగంగ మాంగల్యధారణరా
బంగరు మేఘలురా రంగు పందిళ్ళు వేసేరా
కళ్ళకు దిద్దందగ ఆ నీలి మేఘం కాటుక అయ్యేరా
తార బొట్టు పెట్టేను తాళిబొట్టు అల్లేను
నింగి వేదికేసేను  చూడ వేడుకయ్యేను
వెయ్యొత్తుల దీపాలతో ఇక పెళ్ళే జరిగేరా

Most Recent

Default