Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Varasudochhadu (1988)



చిత్రం: వారసుడొచ్చాడు (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర
నటీనటులు: వెంకటేష్ , సుహాసిని , మాలశ్రీ , మోహన్ బాబు
దర్శకత్వం: ఎ. మోహన్ గాంధి
నిర్మాత: స్రవంతి రవికిశోర్
విడుదల తేది: 03.10.1988

పల్లవి:
నీ అందం నా ప్రేమ గీత గోవిందం
నీ వర్ణం నా కీరవాణి సంకేతం
నీ రాగం ఏ ప్రేమ వీణ సంగీతం
ఈ యోగం ఏ జీవధార సంయోగం
వయ్యారి రూపం.. గాంధార శిల్పం.. శృంగార దీపం వెలిగిస్తే
నీ చూపు కోణం సంధించు బాణం నా లేత ప్రాణం వేధిస్తే

నీ అందం నా ప్రేమ గీత గోవిందం
ఈ యోగం ఏ జీవధార సంయోగం

చరణం: 1
జీరాడు కుచ్చిళ్ళ పారాడు పాదాల పారాణి వేదాలు గమకించగా
కోరాడు మీసాల తారాడు మోసాల నా మందహాసాలు చమకించగా
ఆరారు ఋతువుల్లో అల్లారు ముద్దుల్లో ఎదజంట తాళాలు వినిపించగా
ఆషాడ మేఘాల ఆవేశ గీతాలు సరికొత్త బావాలు సవరించగా

నీ కోసమే ఈడు నేను వేచాములే
నీ కోసమే నాలో నన్నే దాచానులే
నిను పిలిచాను మలిసంధ్య పేరంటం
ఇక మొదలాయే పొదరింటి పోరాటం ఆరాటం

నీ అందం నా ప్రేమ గీత గోవిందం
ఈ యోగం ఏ జీవధార సంయోగం

చరణం: 2
హంసల్లె వచ్చింది హింసల్లె గిచ్చింది నీ నవ్వు నా పువ్వు వికసించగా
మాటల్లే వచ్చింది మనసేదో విప్పింది వద్దన్నా నీ మాట వలపించగా
రెప్పల్లొ కొచ్చింది రేపల్లె కాళింది నా నువ్వు నీ నేను క్రీడించగా
గాదల్లొ నిదరోయీ రాధమ్మ లేచింది నా వేణువె నాకు వినిపించగా

నీ పించమే కిలకించితాలు చేసిందిలే
నా కోసమే ఈ పారిజాతం పూసిందిలే
మన హృదయాలలో ప్రేమ తారంగం
స్వరబృందా విహారాల కుందేటి ఆనందం

నీ రాగం ఏ ప్రేమ వీణ సంగీతం
ఈ యోగం ఏ జీవధార సంయోగం
వయ్యారి రూపం గాంధార శిల్పం శృంగార దీపం వెలిగిస్తే
నీ చూపు కోణం సంధించు బాణం నా లేత ప్రాణం వేధిస్తే
నీ అందం నా ప్రేమ గీత గోవిందం
ఈ యోగం ఏ జీవధార సంయోగం

Most Recent

Default