Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Jai Lava Kusha (2017)
చిత్రం: జై లవ కుశ (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: జూ. యన్.టి.ఆర్, రాశిఖన్నా, నివేద థామస్, తమన్నా
దర్శకత్వం: కె.యస్.రవీంద్ర (బాబీ )
నిర్మాత: నందమూరి కళ్యాణ్ రామ్
విడుదల తేది: 21.09.2017Songs List:రావాణా..జై జై జై పాట సాహిత్యం

 
చిత్రం: జై లవ కుశ (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: దివ్య కుమార్

అసుర  రావణాసురా
అసుర అసుర  రావణాసురా

విశ్వ విశ్వ నాయక రాజ్య రాజ్య పాలక
వేళా వేళా కోట్ల అగ్ని పర్వతాల కలయిక

శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక
సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైనా కదలికా

ఓ..ఓ…ఏక వీర..సూరా.. క్రూరా..కుమారా…
నిరంకుశంగ దూకుతున్న దానవేశ్వరా

ఓ...ఓ..రక్త ధారా.. చోర..ఘోరా..అఘోరా
కర్కశంగ రేగుతున్న కాలకింకరా

రావాణా..జై జై జై… శత్రు శాసన..జై జై జై…
రావాణా..జై జై జై… సింహాసనా..జై జై జై…

అసుర..అసుర....అసురా..అసుర..రావణాసురా
అసుర..అసుర.అసురా..అసుర..రావణాసురా

చిత్ర చిత్ర హింసక మృత్యు మృత్యు ఘంటిక
ముజ్జగాల ఏకకాల పలు రకాల ధ్వంసకా 

ఖడ్గ భూమి ధార్మిక కదనరంగ కర్షకా
రామనగర పట్టణాల సకల జన ఘర్షక

ఓఓఓఓ…అంధకరా.. తార..ధీర..సుధీరా..
అందమైన రూపమున్న అతి బయంకరా

ఓ..ఓ..దుర్వితారా.. భైరా..స్వైరా..విహార
పాప లాగ నవ్వుతున్న ప్రళయ భీకరా

రావాణా..జై జై జై… శత్రు శాసన..జై జై జై
రావాణా..జై జై జై … సింహాసనా..జై జై జై

నవరసాల పోషక నామరూప నాశకా
వికృతాల విద్యలెన్నో చదివినా వినాశక

చరమగీత నాయకా నరక లోక నర్తక
అక్రమాల లెక్కలోన నిక్కిన అరాచకా

ఓఓఓ…అహంకారా.. హారా..బారా..కిషోరా..
నరాలు నాగు పాములైన నిర్భయేశ్వరా…

ఓ..ఓ..తిరస్కార… తీరా..ఎరా..కుబేరా…
కణము కణము రణములైనా కపాలేశ్వర…

రావాణా..జై జై జై … శత్రు శాసన..జై జై జై …
రావాణా..జై జై జై … సింహాసనా..జై జై జై …

ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: జై లవ కుశ (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: జస్ప్రీత్ జస్జ్ , రనైనా రెడ్డి

ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ 
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ 

ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ 
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ 

హే స్వప్న సుందరి స్వర్ణం మంజరి 
చూపుగుచ్చి చేసినావే ఇన్జ్యూరీ
స్వప్న సుందరి స్వర్ణం మంజరి 
ముద్దులిచ్చి చేసుకోవె చెంచురీ
నరాల్లో మోగుతోంది క్లారినైట్
ఫిరంగి గుచ్చినట్టు
రొమాన్స్ గుప్పు మంది పార్టు పార్టు
ఫిరంగి జ్
హాట్ హాట్ వయసుపై సాల్ట్ పెప్పరెయ్యకే

ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోన
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ 
లెట్ సింగ్ సింగ్ సింగ్ సింగ్ డాన్స్ తోనా
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ 

హే స్వప్న సుందరి స్వర్ణం మంజరి 
చూపుగుచ్చి చేసినావే ఇన్జ్యూరీ
స్వప్న సుందరి స్వర్ణం మంజరి 
ముద్దులిచ్చి చేసుకోవె చెంచురీ ఓ..

ఇష్క్ శాండిలైట్ లా చుట్టుముట్టి తిరగనా
ఇష్క్ మూన్ లైట్ లాంటి నిన్ను చూసి
గాగ్ర చోళీ కట్టులా అందనంత ఎగరనా
ఆవురావురన్న నిన్ను మాయచేసి
జపాన్ ఎర్త్క్వెక్ మొదలైయిందే 
జవాని పొంగులోన 
పెదాల్లో ఫ్రెంచ్ వైన్ పొంగుతుందే
ఒకింత పంచుకోన
థెర్మోమీటరే దాటుతోంది మేటరే

ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోన
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ 
లెట్ సింగ్ సింగ్ సింగ్ సింగ్ డాన్స్ తోనా
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ 

కవర్ పేజ్ చిరిగిన బ్యూటీ మ్యాగజీన్ లా
డళ్లయ్యేదే భూమి నువ్వు పుట్టకుంటే
హే గ్లాసు లోకి ఒరిగిన ముచ్చి ఐస్ క్యూబ్ లా
చుమ్మాయిందె ఫోజు నువ్వు ముట్టుకుంటే
రెబాన శాకాహారి హద్దు మీరి
గుద్దావే పూల లారీ
లిరిక్స్ లేని ధన్ దనా నా ఫెడారీ
కమాన్ బ్రహ్మచారి
బ్రేక్ లేని దూకుడే ఆపుతుంది ఊపుడే

ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ మంది గుండెలోన
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ 
లెట్ సింగ్ సింగ్ సింగ్ సింగ్ డాన్స్ తోనా
ట్రింగ్ ట్రింగ్ టడాంగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ 
కళ్ళలోన కాటుక పాట సాహిత్యం

 
చిత్రం: జై లవ కుశ (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: హేమచంద్ర

పల్లవి: 
కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా 
నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా 
నీ మోము నింగినుండి ఓ ప్రేమ వాన రాగా 
ఆ వానజల్లులోన నేను జల్లుమంటు తడిసిపోగా...
తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలి పోయా 
ఓ ప్రేమవానలోన మునిగి పైకి పైకి తేలిపోయా 

చరణం: 1
నా గుండెలోని కోరిక ఓ గాలిపటం కాగా 
నా జంట నువ్వు చేరిక ఓ దారమల్లె రాగా 
నీ నీలికురులనుండి ఓ పూలగాలి రాగా 
నా ప్రేమ అన్న గాలిపటం చంద్రమండలాన్ని చేరగా...
తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలి పోయా 
అసలు చందమామ నువ్వె అంటు నేలమీద వాలిపోయా 

అసుర అసుర అసుర అసుర రావణాసురా 
అసుర అసుర అసుర అసుర రావణాసురా 

చరణం: 2
హే దగ దగ దగ దగా నీ సొగసులోని దగా 
భగ భగ భగ భగా పెంచింది పడుచు పగా 
హే దగ దగ దగ దగా నీ సొగసులోని దగా 
భగ భగ భగ భగా పెంచింది పడుచు పగా 

నీ పెదవిలోని ఎరుపు నా పెదవికి గాయం చేస్తే 
అసుర అసుర అసుర అసుర రావణాసురా 
మెడవంపులోని నునుపు గాయానికి కారం పూస్తే 
అసుర అసుర అసుర అసుర రావణాసురా 
దారులంత ఒక్కటై ఒత్తుతంగ ఒక్కరై 
అందమైన ఔషదాన్ని తాగనా 

హే దగ దగ దగ దగా నీ సొగసులోని దగా 
భగ భగ భగ భగా పెంచింది పడుచు పగా 
హే దగ దగ దగ దగా నీ సొగసులోని దగా 
భగ భగ భగ భగా పెంచింది పడుచు పగా
దోచేస్తా పాట సాహిత్యం

 
చిత్రం: జై లవ కుశ (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: నకాష్ అజీజ్ 

దిన దినా దా
దిన దినా దా
దిన దినా దా
దిన దినా దా

కృష్ణ ముకుంద మురారి
జై జయ కృష్ణ ముకుంద మురారి

మీ కష్టాలన్నీ దోచేస్తా
కన్నిలన్నీ దోచేస్తా
చీకు చింత దోచేస్తా
చీకటినంత దోచేస్తా
బయాలన్నీ దోచేస్తా
బారాలన్నీ దోచేస్తా
అప్పు సొప్పు దోచేస్తా
ఆపదనంత దోచేస్తా

ఏయ్య్ మూర్తి బాబాయ్
ఏయ్ జ్యోతి అక్కాయి
నీ చేతులోన దాగిన వంకర గీతాలు
నుదిటి రాసిన వంకర రాతను
వెంట వెంటపడి ఎత్తుకెళ్లిపోతా

జంతర మంతర జాదూ చేసి
అందరి బాధలు దోచేస్తా
చిందర వందర చిందులు వేసి
గందర గోళం చేసేస్తా

కళ్ళ కపటం లేని పిల్లాడినయి
వస్తా నే వస్తా
మీరు వెళ్లే ధారులలోన ముళ్లంటిని
ఏరేస్తా పారేస్తా

సంద్రం లోని ఉప్పుని మొత్తం
చదువులో తప్పులు మొత్తం
ఉద్యోగంలో తిప్పలు మొత్తం
మాయం చేసేస్తా
జాబిలి లోని మచ్చలు మొత్తం
కూరలలోన పుచ్చులు మొత్తం
దేశంలోని చిచ్చులు మొత్తం
దూరం చేసేస్తా

జంతర మంతర జాదూ చేసి
అందరి బాధలు దోచేస్తా
చిందర వందర చిందులు వేసి
గందర గోళం చేసేస్తా

రాముని గుణమే కలిగిన క్రిష్ణయ్యా ల
వస్తా నే వస్తా
అరె చీరలు బదులు నీలో చేదు లక్షణాలే
లాగేస్తా దాచేస్తా

నవ్వుల మాటుల ఏడుపులన్న్ని
ప్రేమల మాటున ద్వేషాలన్నీ
వేషం మాటున మోసాలన్నీ
స్వాహా చేసేస్తా
రంగుల మాటున రంగాలని
మాటల మాటున మరణాలని
సాయం మాటున స్వార్ధాలని
సఫా చేసేస్తా

జంతర మంతర జాదూ చేసి
అందరి బాధలు దోచేస్తా
చిందర వందర చిందులు వేసి
గందర గోళం చేసేస్తా

అరెయ్ వెన్న కృష్ణ
దోచేయ్ దోచేయ్
చిన్ని కృష్ణా
దోచేయ్ దోచేయ్
ముద్దు కృష్ణా
దోచేయ్ దోచేయ్
బొద్దు కృష్ణ
దోచేయ్ దోచేయ్
క్యూట్ కృష్ణ
దోచేయ్ దోచేయ్
ఫ్లూట్-యూ కృష్ణ
దోచేయ్ దోచేయ్
నాటి కృష్ణ
దోచేయ్ దోచేయ్
బ్యూటీ కృష్ణ
దోచేయ్ దోచేయ్
గోకుల కృష్ణ
దోచేయ్ దోచేయ్
గోపాల కృష్ణ
దోచేయ్ దోచేయ్స్వింగ్ జర పాట సాహిత్యం

 
చిత్రం: జై లవ కుశ (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: నేహా బాసిన్, దేవి శ్రీ ప్రసాద్

స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ (4)

నేనో గ్లామర్ బండి
వచ్చేసా స్వర్గం నుండి
స్వింగ్ జర స్విన్గు జర స్వింగ్ జర
స్విన్గు జర స్వింగ్ జార స్విన్గు జార
స్వింగ్ జర స్వింగ్

అందం తిన్నానండి
అందుకే ఇట్టా ఉన్నానండి
స్వింగ్ జర స్విన్గు జర స్వింగ్ జర
స్విన్గు జర స్వింగ్ జర స్విన్గు జర
స్వింగ్ జర స్వింగ్
నా మత్తుకళ్ల నుంచి
ఓ కొత్త కళ్ళు తీసి
ఫుల్ పూనకాలు తెప్పిస్తా రండి
నా భెల్లీ డాన్స్ చూసి
నోరారా గుటకాలేసి
ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి

స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ (4)

హుక్కా బార్ ఏ నేను
పక్కాగా కిక్ ఇస్తాను
మబ్బులోకెక్కిస్తాను
చలో చుక్కల్లో చక్కర్లు కొట్టిస్తాను
కంట్రీ బీర్ ఏ నేను
లోకాలు చూపిస్తాను
లెక్కలు మరిపిస్తాను
భూమ్మీద బాలన్స్ ఏ తప్పిస్తాను
ఏ మస్తు మజా పెంచే
ఓ మత్తు మందు నేను
నీ ఎనర్జీ కి 4G స్పీడ్ ఇస్తాను
అందుకేగా నేను మీకోసమోచ్ఛను
ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి

స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్

స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్

బ్యూటీ బాటిల్ నేను
నిండా నషా నింపాను
ఇష్టాంగా వచ్చేసాను
నీ పెదవుల్ని వెచ్చంగా టచ్ చేస్తాను

నే కోరే నషా వేరు
దూసుకెళ్ళాలి నాలో జోరు
మోత మోగేట్టుగా నా పే ..రూ
అన్ని దిక్కుల్లో అచ్చేస్తాను

హే సిగ్గు సింగారాల
ఓ అగ్గిపుల్ల నేను
నీ పడకింటి కాగడాలు వెలిగిస్తాను
హే పుట్టుకతో నేను
ఓ నిప్పుతో పుట్టాను
అడిగాడో సూర్యుడికి ఆహ్ ..అప్పిస్తాను
అదే వేడి నిన్ను నాకివ్వమన్నాను
ఫుల్ స్వింగ్ లో రెచ్చిపోయి ఊగిపోదాం

స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ (4)అందమైన లోకం పాట సాహిత్యం

 
చిత్రం: జై లవ కుశ (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: చంద్రబోస్
గానం: విశ్వప్రసాద్ ఎం.గంగి 

అందమైన లోకం
అక్కడో ఆకాశం
ఎగురుతుతున్న పక్షులే మూడు

చిన్న వాటి కంట
నీరు రానీకుండా
తన నవ్వు అడ్డు పెడతాడు పెద్దొడు
కావలుండే గుండె వాడు
సేవ చేసే చేయి వాడు

అన్న అంటేనే వాడు
తననే మరిచాం ఆనాడు

అందమైన లోకం
అక్కడో ఆకాశం
ఎగురుతుతున్న పక్షులే మూడు
ఒక్క చోటనే ఉన్న
పక్క పక్కనే ఉన్న
మన మధ్య ఎంతో దూరం ఆనాడు
దూరమంతా
పారిపోగా
ప్రేమ పంచె
రోజు రాగ

జాలే లేని సంతోషం
నిన్నే చేసే సుదూరం
ఎంతో దూరం
చాల దూరం


Most Recent

Default