Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: మేడ మీద అబ్బాయి (2017)
సంగీతం: షాన్ రహ్మాన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: వైకోమ్ విజయలక్ష్మి
నటీనటులు: నరేష్ , నిఖిలా విమల్
దర్శకత్వం: జి. ప్రజీత్
నిర్మాత: బొప్పన చంద్రశేఖర్
విడుదల తేది: 08.09.2017

నోట్లోన వేలు పెడితే
అస్సల్ కోరకనట్టు
గూట్లోన బెల్లం ముక్క
మింగేసి ఎరగనట్టు
ఫేస్ ని చూస్తె రాముడు
పనులు చుస్తే కృష్ణుడు
వురికోకడుంటే చాలు
ఈడి లాంటోడు

ఒళ్ళంతా ఎటకారం
బబొయ్ ఎవడండి వీడు
కంట్లోన కారం కొట్టి
కర్చీఫ్ అందిస్తాడు
చేసేదేంటో చెప్పడు
చూసేదేంటో చెప్పడు
డాక్టర్ గారి చీటీ లాగా
అర్ధమవ్వడు

బిల్డ్ అప్ చూస్తె హై రేంజ్
వీడు తాబేలుకన్నా యమ లేజీ
వీడి వేషాలు అన్ని
వ్యాసాలు రాస్తే
అయ్యో సరిపోదోక్క పేజి
లైఫ్ అంటే వీడికి యమ ఈజీ
వీడికేం  నేర్పగలదు కాలేజీ
అరె పాస్ అయితే ఏంటి
ఫెయిల్ అయితే ఏంటి
ఏమి పట్టించుకోడు క్రేజీ

నోట్లోన వేలు పెడితే
అస్సల్ కోరకనట్టు
గూట్లోన బెల్లం ముక్క
మింగేసి ఎరగనట్టు
ఫేస్ ని చూస్తె రాముడు
పనులు చుస్తే కృష్ణుడు
వురికోకడుంటే చాలు
ఈడి లాంటోడు

చీమంత కష్టం కూడా
పడలేని బద్దకిష్టు
ఎట్టాగ ఎక్కగలడు
ఎత్తైన ఎవరెస్ట్
ఆలు లేదు చూలు లేదు
కొడుకు పేరు సోమలింగం
అన్నట్టుంది అయ్యా బబొయ్
వీడి వాలకం

Most Recent

Default