చిత్రం: గురు (1980)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పి.బాలు, జానకి
నటీనటులు: కమల్ హాసన్, శ్రీదేవి
దర్శకత్వం: ఐ. వి.సాయి
నిర్మాత: ప్రకాష్ .ఆర్.సి.
విడుదల తేది: 18.07.1980
పేరు చెప్పనా నీ రూపు చెప్పనా
నీ పేరే అనురాగం
నీ రూపము శృంగారము
నీ చిత్తమూ నా భాగ్యము
పేరు తెలుసునూ నీ రూపు తెలుసును
నీ పేరే ఆనందం
నీ రూపము అపురూపము నీ నేస్తాము నా స్వర్గము
చరణం: 1
పువ్వుల చెలి నవ్వొక సిరి
దివ్వెలెలనె నీ నవ్వు లుండగా
మమతల గని మరునికి సరి
మల్లె లేలారా నీ మమతలుండగా
నీ కళ్ళలో నా కలలనె పండనీ
నీ కలలలో నన్నే నిండనీ
మనసై భువి పై దివి నే దిగనీ
చరణం: 2
నీవొక చలం నేనొక అలా
నన్ను వూగనీ నీ గుండె లోపల
విరి సగముల కురులొక వల నన్ను చిక్కనీ ఆ చిక్కు లోపలా
నీ మెప్పులు నా సొగసులు
ఆ మెరుగులూ వెలగనీ వెలుగులా
మనమే వెలుగు చీకటి జథలూ
చరణం: 3
పెదవికి సుధ ప్రేమకు వ్యధా
అసలు అందమూ అవి కోసారు కుందామూ
చెదరని జత చెరగని కథ
రాసుకుందాము పెన వేసుకుందాము
నీ హృదయమూ నా వెచ్చనీ ఉదయము
నీ ఉదయమూ దిన దినం మాధురమూ
ఎన్నో యుగముల యోగము మనమూ
***** ****** ******
చిత్రం: గురు (1980)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఎస్.జానకి
పల్లవి:
నా వందనము... సరసుల రసికుల సదసుకు
నా వందనము... సరసుల రసికుల సదసుకు
నా పాట మీరు మెచ్చేందుకు
మీ దీవెనలను ఇచ్చేందుకు
శుభము అందరకు...
నా వందనము... సరసుల రసికుల సదసుకు
చరణం: 1
తేట తేనియ తెలుగుంది.. తీయ తీయని తలపుంది..
తేట తేనియ తెలుగుంది.. తీయ తీయని తలపుంది..
రాగం ఉందీ.. నాలో వేదం ఉంది..
మాటే పాటై... పాటే ఆటై..
నీకు తానులోకం ఎదుటనాట్యమాడనా.... ప్రియా
నా వందనము... సరసుల రసికుల సదసుకు
చరణం: 2
పాడమన్నది అనురాగం... ఆడమన్నది ఆనందం
పాడమన్నది అనురాగం... ఆడమన్నది ఆనందం
అందాలన్నీ నీకే ఇవ్వాలనీ... దాచే దాచే వేచే నన్ను
వేల చూసి వచ్చి వేగ స్వీకరించరా.... ప్రియా
నా వందనము... సరసుల రసికుల సదసుకు
నా పాట మీరు మెచ్చేందుకు
మీ దీవెనలను ఇచ్చేందుకు
శుభము అందరకు...
నా వందనము... సరసుల రసికుల సదసుకు
నా వందనము... సరసుల రసికుల సదసుకు