Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box



చిత్రం: జాదుగాడు (2015)
సంగీతం: సాగర్ మహతి
సాహిత్యం: వరికుప్పల యాదగిరి
గానం: ఉమా నేహా
నటీనటులు: నాగశౌర్య, సోనారిక భడొరియ
దర్శకత్వం: యోగి
నిర్మాత: వి.వి.యన్.ప్రసాద్
విడుదల తేది: 26.06.2015

తొడగొట్టే వాడికి ఎదురే రాడు ఎవ్వడు
భయపెట్టేవాడె ఈలోకానికి బాసుడు
దేవుడ్ని నమ్మి నమ్మని వాడు
చంపేసే వాడికి ఐపోతాడు దాసుడు
వాడొస్తుంటే కళ్ళల్లో కారం
వాడంటేనే భయపడతా నేరం
వాడి మాటల్లో చూపాలి టాం టాం
అడుగేసే చోటల్లా భూకంపం

మాసుగాడే వీడు  మ మసాలా గాడు (2)

తొడగొట్టే వాడికి ఎదురే రాడు ఎవ్వడు
భయపెట్టేవాడె ఈలోకానికి బాసుడు

చరిత్రనే సృష్టించే సేవ కలిగిన్నోడు
బిగించిన చక్రంలా ఏడ ఉంటాడు
ధరిత్రినే ఉపేసే ధాటి దమ్మున్నోడు
వలేసిన గాయ ఏడవుంటాడు
సవాలుకే సవాలుగాడు తలొంచనోడు కులాసగాడు

మాసుగాడే వీడు  మ మసాలా గాడు (2)

సరాసరి కళ్ళల్లో కళ్ళుపెట్టేవాడు
సైలెంటుగా గుండెల్లో గోలపెట్టేవాడు
నరాలలో దూరేసే మాయమంతర గాడు
సరాసరి ఒళ్ళంతా మంటపెడతాడు
చటాక్ వాడు  వెనక్కిపొడు కలల్లో దూకి కలబడతాడు

మాసుగాడే వీడు  మ మసాలా గాడు (2)

తొడగొట్టే వాడికి ఎదురే రాడు ఎవ్వడు
భయపెట్టేవాడె ఈలోకానికి బాసుడు
దేవుడ్ని నమ్మి నమ్మని వాడు
చంపేసే వాడికి ఐపోతాడు దాసుడు
వాడొస్తుంటే కళ్ళల్లో కారం
వాడంటేనే భయపడతా నేరం
వాడి మాటల్లో చూపాలి టాం టాం
అడుగేసే చోటల్లా భూకంపం

మాసుగాడే వీడు  మ మసాలా గాడు (2)

Most Recent

Default