Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Anji (2004)





చిత్రం: అంజి (2004)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: చిరంజీవి, నమ్రతా శిరోడ్కర్
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: శ్యామ్ ప్రసాద్ రెడ్డి
విడుదల తేది: 15.01.2004



Songs List:



చిక్కుబుక్కు పోరి పాట సాహిత్యం

 
చిత్రం: అంజి (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శంకర్ మహదేవన్, కల్పన

చిక్కుబుక్కు పోరి చిక్కుబుక్కు పోరి
చిక్కుబుక్కు పోరి చిక్కుబుక్కు పోరి
చిక్కుబుక్కు పోరి యెవరే అతను
చూపులు చూసి చిరుతపులేమో అనుకొన్నాను
చిటికెలు వేస్తె చుక్కలు రాలే సూపర్ మాన్ ఇతను
సూపర్ మాన్ కి ట్యూషన్ చెప్పిన మాస్టర్ వీరేను

అరేరే లేదంత సీను నే సూపర్ మాన్ ని కాను
అతిగ బడాయి పోను సింపుల్ గా బతికేస్తాను
జిందగి అన్నది బొత్తిగ చిన్నది
ఒక్కటె ఛాన్స్ ఇది వదిలితే రాదిది
హాయిగ ఉండక దేనికి టెన్షన్ నొ నొ నొ నొ

లైట్ గా లాగించై బేట లైఫ్ లో ప్రతి పూట
సీరియస్ గా ఫీలయ్యేంత సీను ఎముందంట

కష్టాలొస్తె ఏడుపు వల్ల జరిగేదేముంది
మొహంలో గ్లామర్ పోతుంది
తలంత భారం అవుతుంది
ఆకసం తెగి పడిపోతె ఎన్ చేయలనట్టు
అలా తెగ ఆలోచించొద్దు
నువ్వేదో ఆపేసేటట్టు
హ్యాపీ గా... తాపి గా... హ్యాపీ గా... తాపి గా...
నువ్వాడిందె ఆటనుకొంటు
నువు పాడిందె పాటనుకొంటూ

లైట్ గా లాగించై బేట లైఫ్ లో ప్రతి పూట
సీరియస్ గా ఫీలయ్యేంత సీను ఎముందంట

సీతకోక చిలుక వామ్మో ఎంటి సర్కస్
అదంత డాన్సే కాబొసు వారేవ్వా అందామ బాసు
LKG లో కుట్టించావ పాప ఈ డ్రెస్
మతోయిందంటే ప్రామిస్సు ఇరుగ్గా లేద ఓ మిస్సు
కాదయ్యో తగదయ్యో కాదయ్యో తగదయ్యో
తేరగ చూస్తె సరిపొదయ్యో
బీపీ పెరిగి పడతవయ్యో

లైట్ గా లాగించై బేట లైఫ్ లో ప్రతి పూట
సీరియస్ గా ఫీలయ్యేంత సీను ఎముందంట



గుమ్మ గులాబి కొమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: అంజి (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కార్తీక్, షాలిని సింగ్

గుమ్మ గులాబి కొమ్మా
బంగారు బుట్ట బొమ్మా
నాజుకు నడుమ నీసోకు తడిమా
చూసవ నా మహిమ 
ఇక ఈ పైన సుఖపడుమా

లేలేత పూల కొమ్మా నీ చేత వాలెనమ్మా
నిన్నాపతరమ సుడిగాలి గుర్రమా
మనసైన మగతనమా
ఇంక మొహమాట పడకమ్మా

కొంటె ఆపద నిన్ను ఆపెద
గండు తుమ్మెద అంత నెమ్మద
చూడ చక్కనమ్మ వేడి చెకిలమ్మ 
వచ్చి నా ముద్దులందుకోమా

నిన్ను చూడగానే భలె భీమ
నా వెన్ను మీద పాకే చలి చీమ
జున్ను ముక్క లాంటి కన్నే భామ
నీ సున్నితలు కన్ను కొట్టెనమ్మ

శూర్యుడైన చూడనట్టి సోకా
చూపు దాటలేదే నిన్న దాక
ఇంతలోనే ఎందుకె ఇలాగ
పెరిగిందె ఇంత తుంటరి కాక

రాసిపెట్టి ఉన్న వాడి రాక
రస తీవి తోటి చేరుకోక
ఆశ పుట్టి ఆగలేక దూక
బరువ ఈ కాస్త కోక
బిగువ ఈ చిట్టి రైక
పరువ నీ పరుగులింక ఒడిదుడుకా

నడిపే ఓ తోడు లేక
నడుమె అల్లాడిపోగ
నడిపె నా వయసు నన్ను నీ వెనక
అల్లరెందుకు నన్ను అల్లుకో
వేలు పట్టుకో వన్నెలేలుకో
ఉన్నదిచ్చుకోగా విన్న వించుకోగ
ఇంత హంగమ అవసరమా

లేలేత పూల కొమ్మా నీ చేత వాలెనమ్మా

జాన జంట లేని బ్రహ్మచారి
వాన జాడ లేని గడదారి
నన్ను చుట్టుకొంటె ఒకసారి
చూపిస్తా నీకు పువ్వుల దారి
ఒంటి తొడు ఓపలేని నారి
అగ్గి మీద గుగ్గిలంగ చేరి
కమ్ముకుంటె కందిపోవ పోరి

ఇంద్ర శ్రీ రంగనాధ అంటూ నీ గుండె మీద
వాలే పూదండ కాద ఇక మీద
పొంగె ఓ గంగ వరద యేదే నీ సిగ్గు పరద
చిందె నీ చెంగు సరద తీర్చేదా
ఈడు పంచుకో వాడి దించుకో
ప్రాయమిచ్చుకో హాయి పుచ్చుకో
బాధ మర్చిపోగ ఆదరించుబాగ
ఆడుకోరాద చందమమ

జున్ను ముక్క లాంటి కన్నే భామ
నీ సున్నితలు కన్ను కొట్టెనమ్మ



అబ్బో నీయమ్మ గొప్పదే పాట సాహిత్యం

 
చిత్రం: అంజి (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువన చంద్ర
గానం: యస్.పి. బాలు, కల్పన

అబ్బో నీయమ్మ గొప్పదే
అందం పోగేసి కన్నదే
అబ్బో నీయమ్మ గొప్పదే
అందం పోగేసి కన్నదే

పరువాలు పొదిగిన చిలక
చలి జోరుగున్నది గనక
జతగా శృతిగా ఇక నువ్వు నేను
ఒకటైపోయి పాడేద్దామ సరిగామపా

ఆమ్మో ఏ రాణి కన్నదో
ఎదలో ఏం మొక్కుకున్నదో
ఆమ్మో ఏ రాణి కన్నదో
ఎదలో ఏం మొక్కుకున్నదో

జగదేక వీర కుమార 
వలచాను నిను మనసారా
కనరా కనరా
నా వన్నెచిన్నెలన్ని నీవే 
కన్నె చేయి విడువకురా
 
పూల ఋతువిదె కోమలి
తీర్చమన్నదే ఆకలి
ఆశ ముదిరిన వేళలో
శ్వాస పరుగులు తీయ్యద
తనువింతై అంతై తెర దించెయ్
దించైమంటే విడువగ నా తరమా
సొగసింతై అంతై దారికొచ్చెయ్
వచ్చేయ్మంటే నిలువగ నా తరమా

తమకాలు విడువవు గనుక
తడి చీర బిగిసెను గనుక
చెలియా చెలియా
ఇక ఉల్లాసంగా ఆడెద్దామా
ఉయ్యాలాట కసి మొలకా

ఆమ్మో ఏం కొంటె పిల్లడో
ఏమా సన్నాయి నొక్కుడో
ఆమ్మో ఏం కొంటె పిల్లడో
ఏమా సన్నాయి నొక్కుడో

కసి మీద ఉన్నడు గనుక
పస చూడమన్నడు గనుక
వడిలో ఒదిగి, ఇక చుపిస్తాలే
వయ్యారాల ఆటుపోటు తడబడకా

భారమైనది నా ఎద
జారుతున్నది పైయెద
చేరుకున్నదె తుమ్మెద
దోచిపెట్టవే సంపద

ఒళ్ళు తుళ్ళి తుళ్ళి అరె మళ్ళీ మళ్ళీ
సరసానికి త్వరపెడితే
ఓసి బుల్లి బుచ్చి నిను గిల్లి గిచ్చి
వడి దాడికి ఎగబడితే

హృదయాలు కలిసెను గనుక
సుఖమేదో కలిగెను గనుక
ప్రియుడా ప్రియుడా
అరె మళ్ళీ మళ్ళీ సాగించేద్దాం
సందిట్లోన సరిగమపా

అబ్బో నీయమ్మ గొప్పదే
అందం పోగేసి కన్నదే, అబ్బో అబ్బో
అబ్బో నీయమ్మ గొప్పదే
అందం పోగేసి కన్నదే
పరువాలు పొదిగిన చిలక
చలి జోరుగున్నది గనక
జతగా శృతిగా ఇక నువ్వు నేను
ఒకటైపోయి పాడేద్దామా సరిగామపా




ఓం శాంతి ఓం పాట సాహిత్యం

 
చిత్రం: అంజి (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్, గంగ

ఓం శాంతి ఓం, ఓం శాంతి ఓం (3)

ఏడు కోట్ల ఈ ఆంధ్రుల్లో
మూడు కోట్ల ముద్దాటల్లో 
నేడు కోరినది నిన్నే అల్ ఇన్ వన్
ఏడు గంటలకి చీకట్లోవేడి కోరికల బ్రాకెట్లో
తోడు కట్టినది నువ్వే బంపర్ క్వీన్

ఓ ఓ - వెనక తిప్పిస్తాన్
ఓ ఓ - వణుకు తెప్పిస్తాన్
ఓ ఓ - వయసు నీపై గుప్పిస్తాన్

ఓ ఓ - మొదలు ఒప్పిస్తాన్
ఓ ఓ - ముడులు విప్పిస్తాన్
ఓ ఓ - పిదప నిన్నే మెప్పిస్తాన్

సోకిస్తాన్ బ్రేకిస్తాన్ నువు లేకపోతే చస్తాన్

ఏడు కోట్ల ఈ ఆంధ్రుల్లో
మూడు కోట్ల ముద్దాటల్లో 
నేడు కోరినది నిన్నే అల్ ఇన్ వన్
ఏడు గంటలకి చీకట్లో వేడి కోరికల బ్రాకెట్లో
తోడు కట్టినది నువ్వే బంపర్ క్వీన్

కళ్ళు చూస్తె యమ పవర్ ఫుల్
కండ చూస్తె యమ వండర్ ఫుల్
కులుకులన్ని చేస్తాడే కాకెంగిల్ గిల్ గిల్ గిల్
పిల్ల చూస్తే యమ కలర్ ఫుల్
వళ్ళు చూస్తె యమ వంపుల్ ఫుల్
చూపుతోనే పెడుతుందే చెక్కిల్ గిల్ గిల్ గిల్
మాటతోనె చేసేస్తాడమ్మ మాయ మంత్రజాలాల్
కన్నుతోటి కొట్టేస్తాడమ్మ కాముడి కాలింగ్ బెల్

చిందులేసి లేపి రేపేసిందమ్మ
మంత్రం తంత్ర గోళాల్
కునుకు మాని కుసేసిందమ్మ
కసి కసి కొక్కర కోల్

ఓం శాంతి ఓం,  ఓం శాంతి ఓం (2)

వయసు చూస్తే ఇక ట్వంటీ వన్
బరువు చూస్తే ఇక ఫిఫ్టీ వన్
పనులు మాని నీతో చేస్తా ఫన్ ఫన్ హే ఫన్
స్పీడు చూస్తే ఇక ఫ్లైటింజన్
వేడి చూస్తే ఇక ఫైరింజన్
అందువల్ల అయ్యాలే నీకే ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాన్
చెంత కొస్తే ఇక వేసేస్తాలే చాకులాంటి ఫోకాల్
సోకులన్ని తీసేస్తాలే చక చక సిటి స్కాన్
రాతిరైతే ఇక తప్పక నీకే రాణివాసమిస్తాన్
రాజులేక ఇక చూపిస్తాలే ఇక గజిబిజి రాజస్థాన్

ఏడు కోట్ల ఈ ఆంధ్రుల్లో
మూడు కోట్ల ముద్దాటల్లో 
నేడు కోరినది నిన్నే అల్ ఇన్ వన్
ఏడు గంటలకి చీకట్లో వేడి కోరికల బ్రాకెట్లో
తోడు కట్టినది నువ్వే బంపర్ క్వీన్

ఓ ఓ - వెనక తిప్పిస్తాన్
ఓ ఓ - వణుకు తెప్పిస్తాన్
ఓ ఓ - వయసు నీపై గుప్పిస్తాన్

ఓ ఓ - మొదలు ఒప్పిస్తాన్
ఓ ఓ - ముడులు విప్పిస్తాన్
ఓ ఓ - పిదప నిన్నే మెప్పిస్తాన్

సోకిస్తాన్ బ్రేకిస్తాన్ నువు లేకపోతే చస్తాన్

ఓం శాంతి ఓం,  ఓం శాంతి ఓం (2)



మానవా మానవా ఏమి కోరిక పాట సాహిత్యం

 
చిత్రం: అంజి (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: టిప్పు, సునీత


మానవా మానవా ఏమి కోరిక
చెప్పవా చెప్పవా జాగుచెయ్యకా
మానవా మానవా ఏమి కోరిక
చెప్పవా చెప్పవా జాగుచెయ్యకా

విన్నపాలనే ఆలకించిన అప్సర నేనేరా
స్వర్గభోగమే నేల దించిన కిన్నెర నేనేరా
ఇంద్రలోకమొచ్చి కళ్ళముందు వాలినా 
ఎందుకంట ఇంత యోచనా
ఇంతదూరమొచ్చినాక ఇంకా 
అందుకోవ సోకు సూచనా

అమ్మకచెల్లా ఏముందిరో
సొంపుల ఖిల్లా అదిరిందిరో
అమ్మకచెల్లా ఏముందిరో
సొంపుల ఖిల్లా అదిరిందిరో

పక్కకొచ్చెనే తిక్కపెంచెనే
పక్కకొచ్చెనే తిక్కపెంచెనే
వయ్యారి నీ వాలకం
దిగ్గజాలనే ధిక్కరించెనే
దిగ్గజాలనే ధిక్కరించెనే
నరుడా నీలో సాహసం

మైకంలో ముంచుతున్నది
పాపా నీ పనితనం
మోహంలో ముంచుతున్నది
నరుడా నీ మగతనం

కొంటె కోరిక రెచ్చగొట్టకా చుక్కా చాలింక
వేడి వేడిగా జోడుకూడగా వచ్చా నీవంక
చెయ్యేస్తే కందేలా ఉన్నావే బొమ్మా
సందేహిస్తే ఎల్లా ముందుకురావమ్మా

మానవా మానవా ఏమి కోరిక
చెప్పవా చెప్పవా జాగుచెయ్యకా
అమ్మకచెల్లా ఏముందిరో
సొంపుల ఖిల్లా అదిరిందిరో

తియ్య తియ్యగా అందజేయనా
తియ్య తియ్యగా అందజేయనా 
పెదవుల్లోని అమృతం
మత్తు మత్తుగా ఊపుతున్నదే
మత్తు మత్తుగా ఊపుతున్నదే
పిల్లో నన్నే నీనడుం
కౌగిల్లో వాలమన్నది ఊరించే ఉత్సవం
తందానా తాళమైనది చిందాడే యవ్వనం

సుందరాంగితో సంబరాలలో
రాజ్యం నీదె దొరా
ముద్దరాలితో ముద్దులాటలో
మొక్షం పొందేలా
ఆనందం ఈపైనా నీదే అంటున్నా
ఏదేమైనా మైనా నీతోనే రానా



మిరపకాయ బజ్జిలిస్తావా పాట సాహిత్యం

 
చిత్రం: అంజి (2004)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువన చంద్ర
గానం: యస్. పి. బాలు, రాధిక


చిరుగాలి వీచింది చివురాకు వొణికింది
నీమీద మనసైంది నిదర రానందీ
తిరణాల కెల్దాము తెల్లార్లు ఉందాము
వస్తవా హొయ్ హొయ్ హొయ్ హోయ్
నాతో వస్తవా...

మిరపకాయ బజ్జిలిస్తావా
నా సోళ రాణి సత్తుపల్లి సంతకొస్తవా
హోయ్ మిరపకాయ బజ్జిలిస్తావా
నా సోళ రాణి సత్తుపల్లి సంతకొస్తవా
కొర్రమీనులొండి పెడతవా నా సోకు రాణి 
తాటికల్లు ముందు పెడతవా
యేదడిగితే అది ఇవ్వనా
నడువొంపునే ముడుపివ్వనా
యేదడిగితే అది ఇవ్వనా
నడువొంపునే ముడుపివ్వనా

హేయ్ పంచమంటే పంచుకుంటా
దంచమంటే దంచుకుంటాలే
మజాలే - సుఖాలే - పెదాలే

పచ్చి మిర్చి బజ్జిలిస్తావా
నా సోళ రాణి పంచదార చిలకనిస్తావ
కోరుకుంది ముందుపెడతలే
ఓరయ్య నువ్వ్యాడికెల్తే ఆడికొస్తలే

ఏ కోట్లో కొంటివే బియ్యం నువ్వు
మా బాగ పెంచావే  బాడీ నువ్వు
దానిమ్మ తోటలో పెరిగానయ్యో
సుష్టుగా సూపరేసి పెంచానయ్యో
నవ్వా ధగా ధగ నడుమా నిగా నిగ
నడిచే నెమలివి నువ్వా హోయ్ హోయ్
చూపా  చుర చురా ఊపా హరోం హర
రతికే పతివే నువ్వా హాయ్ హాయ్
ఆశతో వస్తిరో మస్తుగా హత్తుకు పోరా
ఇలారా హ హ హ మ్మ్ మ్మ్ మ్మ్

పచ్చి మిర్చి బజ్జిలిస్తావా నా సోళ రాణి
పైటలాగ కప్పుకుంటవా
కైపు రెచ్చి రేగుతున్నదోయ్ ఓరయ్య
సన్న రైక బిగిసి రొప్పుతున్నదోయ్

సైటుగా దోచుకో ఓరబ్బయ్యో
సైజ్ లో రంభకి చెల్లిని బాయ్యో
ఓసినా ఒంటరి దాచించెక్కా
వెయ్యనా మెత్తని ముఖమల్ పక్కా

ఓర్ని బండబడ అంతటి హాడావిడా
నలిగదు నైసు పావడా హోయ్ హోయ్
ఓసినా ఎంకాయమ్మా ముందే చెప్పాలమ్మా 
ఆపినా ఆగను లేమ్మా హాయ్ హాయ్ హాయ్
ఆమ్మని పొంగునె దొంగలా దోచుకుంటాలే
సవాలే ఇవాళే ఇవాళే

పచ్చి మిర్చి బజ్జిలిస్తలే ఓరందగాడ
గుడుసుకొస్తే గుట్టుకుంటలే
హా పంచుకోను మంచముందిలే
ఆరేసుకోను అచ్చమైన అందముందిలే
కసి మూడహో రెచ్చిందిలే
కదనానికే సై అందిలే
కధ కంచికే వచ్చిందిలే
వడి దాడికే పదమందిలే

కొంచెమంటే పంచమంటా 
కంచమంటే మంచమంటాలే హ హ హ హ హ హా

Most Recent

Default